Lecture is a great art.
LECTURE ఒక విధంగా చూస్తే, LECTURE చేయడం కూడా ఒక కళేనని చెప్పాలి. కొందరు దాన్ని “భగవద్దత్తం” అంటారు. ఏమైనా ఉపన్యసించడం ఒక “పెక్నిక్ ”.అన్ని టెక్నిక్లలను ఎలా అభివృద్ధి చేయగలుగుతామో దాన్నికూడా అలాగే అభివృద్ధి చేసుకోవచ్చు.కొందరు పుట్టుకతోనే ఉపన్యాసకులని అంటారు. కాని, “అభ్యాసం కూసువిద్య” అన్న సామెతను గుర్తు పెట్టుకుంటే, ఎంత కష్టమైన విషయాన్ని అయినా, “సాధనమున సాధించ వచ్చు సకల విద్యలు”.అందువల్ల LECTURE టెక్నిక్ ఎవరో కొందరి సొత్తు కాదు. సాధనవుంటే, ఉపన్యాసకుడు కావలెనన్న కోర్కె, పట్టుదల పుంటే ఉపన్యాసకుడు కావడం కష్టమేమీ కాదు; ఉపన్యాసకుడుగా రాణించడం కూడా కష్టంకాదు.

పాపం-గాంధీజీ ! :-మహాత్మా గాంధీనే తీసుకోండి. ఆయన మొదట గొప్ప ఉపన్యాసకుడేమీ కాదు. ఆయన భారతదేశంలో చదివి, లం డన్ లో బారిష్టర్ చదవడానికి వెడుతున్నప్పుడు తోటి విద్యా ర్థులు వీడ్కోలు సభజరిపారు. ఆ సభలో తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు చెప్పాలని గాంధీని సభాధ్యక్షులు కోరారు.కాని, గాంధీ ఎంత సేపటికి సమాధానం చెప్పడానికి తన కుర్చీ నుంచి లేవడం లేదు. అప్పుడు సభాధ్యక్షుడు గట్టిగా హెచ్చరించే సరికి ఆయన లేచి నిలబడ్డాడు. కాళ్ళు పగ సాయి; గుండె గుబగుబ లాడింది; ముచ్చెమటలు పోశాయి మాట తడబడింది. గాంధీజీ అప్పటిలో విపరీతమైన ససిరికి తనం, మాట్లాడ లేకపోతున్నాడు. అతి కష్టంమీద “థాంక్స్! అని కూర్చున్నాడు గాంధీ.
తీరా బారిష్టరు పట్టా తీసుకున్న తరువాత ఆయనకు దక్షిణాఫ్రికాలోని ఒక కోర్టులో వాదించడానికి అబ్దుల్లా వర్తకుడు వకాల్తా ఇచ్చాడు..
వకాల్తా తీసుకుని కోర్టులోకి వెళ్ళిన గాంధీజీకి అక్కడి లాయర్లను చూచేసరికి తిరిగి పిరికితనం ఆవహించింది. నోటి వెంట మాట పెగలలేదు. “నేను ఆ లాయర్లముందు మాట్లాడ లేన”ని నిశ్చయించుకున్నాడు.“నాకు వకాల్తావద్దు, కేసూ వద్దు” అని పుస్తకాలను అక్కడే విసిరికొట్టి, ఆయన వెళ్ళిపోయాడు!అలాంటి “సభాపిరికి” ఒకనాటికి లక్షల మంది ప్రజలి సమక్షంలో అనర్గళంగా ఉపన్యసించగల వక కాగలడని ఆనాడు రాజ్ కోట హైస్కూలు విడ్కోలు సభలో ఆయన పరి ఆయన వాదించ లేక, వకాల్తా వదిలి పెట్టినప్పుడు చూచినవారు స్థితిని చూచినవారుకాని, ఆ తర్వాత దక్షిణాఫ్రికా కోర్టులోకాని ఊహించి వుంటారా?
కాని నవ్విన నాపచేనే పండింది. గాంధీజీ తననచో విభవంతో ఆ తరువాత వక్త మాత్రమేకాదు లక్షలాది ప్రజలను ఆకట్టుకోగల మహోపన్యాసకుడుగా రూపొందారు.1947 మార్చిలో ఢిల్లీలో జరిగిన సభలో ఆయన మహోసన్యాసం విని, నిధులు ముగ్ధులైనారుఅఖిలాసియా మహావివిధ దేశాల ప్రతిఇంతగా వ్రాయడంగాంధీజీ LECTURE న్ని గురించి ఒకప్పుడు సభాపిరికిగా పేరు పొందిన గాంధీజీ తరువాత సాధనతో, ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ఎంతటి LECTURE కుడైనదీ వివరించడానికే!నిజం చెప్పవలెనంటే, ఎంతటి ఉద్దండుడైన LECTURE కుడికైనా తన ఉపన్యాసం ప్రారంభించే ముందు కొంచెం గుండె పీచుపీచు మంటూనే వుంటుంది! తన LECTURE న్ని శ్రోతలు హర్షిస్తారో, లేదోనని అతడి మనస్సు పీకుతూనే వుంటుంది.
తనకు ముందు ప్రసంగించిన వ్యక్తి కంటె తన LECTURE నికి “రెస్పాన్స్” వస్తుందో ‘లేదోనని’, కనీసం అత నికి దీటుగానైనా తన LECTURE వుంటుందో, లేదోనని అతడు ఆందోళన పడుతూనే వుంటాడు!
ఈ విషయాన్ని గొప్ప ఉపన్యాసకులుగా పేరుపొందిన వారు అనేకమంది ఒప్పుకున్నారు. అయితే, LECTURE ప్రార భించి, కొంచెం సేపు కాగానే ప్రేక్షకులకు, ఉపన్యాసకుడికి మధ్య కొంత అనుబంధం ఏర్పడుతుంది. LECTURE ప్రారంభించిన తరువాత ప్రేక్షకులు హర్షధ్వానాలు చేసినా. ఉపన్యాసకుడు విసిరిన “జోక్ “కు నవ్వినా, ఉపన్యాసకుడికి కొండంత ధైర్యం, ఉత్సాహం కలుగుతాయి అక్కడితో అతడు విజృంభిస్తాడు. బెరుకుతనం తొలగి పోతుంది.
రాజకీయాలలో కానివ్వండి, ఏ ప్రజాహిత జీవిత రంగంలో కానివ్వండి, రాణించాలన్నా, నలుగురిలో పేరు తెచ్చుకోవాలన్నా. ప్రముఖులు కావాలన్నా ప్రధానంగా దోహదం చేసేది LECTURE . మంచి ఉపన్యాసకుడు, లేదా ఉపన్యాసకురాలు కానిదే వారు రాజకీయరంగంలో అంతగా రాణించలేరు. అందరూ మహోపన్యాసకులు కాలేకపోవచ్చు: మహావక్తలు కాలేక పోవచ్చు. కాని, సగటు ఉపన్యాసకులైనా కాలేకపోతే, లాభం లేదురాజకీయ రంగంలో రాణించడానికి LECTURE తోడ్పడుతుంది కాబట్టే, మన స్వాతంత్ర్యోద్యమం తొలిదశలో పాల్గొన్న మహా నాయకులలో చాలామంది గొప్ప ఉపన్యాస కులు. ఆ రోజులలో మైకులు లేని చోట్ల కూడా వారు తమ కంచు కంఠాలతో ఉపన్యసించేవారు.
ఉపన్యాసకుడైనవాడు నలుగురిని ఆకట్టుకుంటాడు సమాజంలో తనకొక గ్లామరుకు సృష్టించుకుంటాడు. అందు చేతనే, అమెరికా మొదలైన పాశ్చాత్య దేశాలలో ఉపన్యానకులను తయారుచేసే కేంద్రాలు వున్నాయి: ఉపన్యాసకులకు మార్గదర్శక సూత్రాలను తెలిపే కేంద్రాలున్నాయి; వారికిమార్గదర్శక సూత్రాలను చెప్పే గ్రంథాలున్నాయి.పది ఉపన్యాసకులు అవుతారా అని అనవచ్చు. కాని, అసలు వంపే చేతకాని వారికి ఫలానా పంట ఠంలో ఏయే పదార్ధాలు వేయాలో తెలుసుకొనడానికైనా పుస్తకాలు ఉపకరిస్తాయి కాదా?అందువల్ల, ఉపన్యాసకులు కాదలచుకున్న వారు కొన్ని. మెలకువలు, కొన్ని మార్గదర్శక సూత్రాలు తెలుసుకుంటే, ఉపన్యాసకుడు కావాలన్న తమ తపనకు మెరుగులు దిద్దు కొని రాణించడానికి పూరి అవకాశం వుంది.
దశసూత్రాలు :
LECTURE కి, లేదా ఉపన్యాసకునికి కావలసిన హంగులనండి, లక్షణాలనండి, అవసరాలనండి. వాటిని ఈ క్రింది విధంగా విభజించవచ్చు :
1) సభా పిరికితనాన్ని అధిగమించడం
2) ధారాళంగా మాట్లాడటం
3) గొంతు
4) ఉచ్ఛారణ
5) LECTURE సమయంలో హస్త విన్యాసాలు, ముఖ కవళి
కలు మొదలైనవి
6) LECTURE సబ్జెక్టుపై ముందుగా అధ్యయనం
7) LECTURE న్ని ప్రారంభించే తీరు
8) శ్రోతలను ఆకట్టుకొనడం
9) LECTURE లో హాస్యం, ఉపమానాలు 10) LECTURE శైలి
స్టేజిఫియర్
సాధారణంగా ఎవరినయినా సభలో మాట్లాడమంటే, వారిలో కొందరు “నాకు స్టేజీ ఫియర్” వుంది అనడం కద్దు. దీన్నే సభా పిరికితనం అంటాం.ఇందుకుఉద్దండ ఉనన్యాసకులుగా పేరు పొందిన వారికయినా ప్రారంభంలో “స్టేజిఫియర్” వుండి వుంటుంది ఉదాహరణగా మహాత్మా గాంధి ఉదంతాన్నే చూచాము బ్రిటిష్ మాజీ ప్రధాని, గొప్ప వక్త అయిన డిజ్రాలీ కూడా ప్రారంభంలో ఉపన్యాసమంటే గజగజలాడేవాడు !
తెలుగులో మహోపన్యాసకుడు చెరుకువాడ నరసింహం గారు. ఆయన గంటల తరబడి చలోక్తులతో, ఉపమానాలతో, అంకెలతో. అనర్గళంగా, మధ్య మధ్య పిడుగులు వర్షించినట్లు ఉపన్యసించేవారు. ఆయనకు “ఆంధ్ర డెమో సనీస్” అనే బిరుదు వుండేది. డెమో సనీస్ గ్రీస్ లో మహావక్త. డెమో సనీస్కు సయితం తన ఉపన్యాస జీవిత ప్రారంభంలో సభాపిరికితనం వుండేదట!
సైకిలు నేర్చుకునేట్పుడు మనం ఎన్నోసార్లు పడతాం. డ్రయివింగ్ నేర్చుకునే దశలో ఎక్కడ యాక్సీ డెంట్ చేస్తామోనని భయపడతాం. నృత్యమో, సంగీతమో నేర్చుకుని కొత్తగా పది మందిలో వాటిని ప్రదర్శించవలసి వచ్చేసరికి సభాపిరికితనం వస్తుంది. కొత్తలో ఏ దైనా అంతే!ఉపన్యాసకునికైనా అంతే, కాబట్టి కొత్తలో ఉపన్యసించడ ముంటే భయం కలిగితే అది శాశ్వతంగా వుండదు. అది అధిగ మించలేని బలహీనత కాదు.

పేక్షకులను చూచి భయపడనక్కరలేదు మీరు ఉపన్యాసకులు కావడానికి వారు అవకాశం కల్పిస్తున్నారని భావిం చాలి. కేవలం ఎడతెగని ప్రాక్టీసువల్లనే సథాపిరికితనం పోతుంది “స్టేజిఫియర్” ఒక మానసికస్థితి సైనికుడుమొదటి సారిగా యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు భయపడతాడు. అదే పదవసారి అయితే అతనికి భయంపోతుంది. కనీసం చాలావరకు తగ్గిపోతుంది.
నలుగురిలో వార్తాపత్రికనో, పుస్తకాన్నో బిగ్గరగాచద వడం అలవాటు చేసుకుంటే అందువల్ల “స్టేజిఫియర్”కొంత తగ్గడానికి అవకాశం కలుగుతుంది మామూలుగా మిత్రులతో మాట్లాడేడప్పటి గొంతుస్థాయికంటె స్థాయిలో ఆ చదవడం వుండాలి. జాగ్రత్తగా, స్పుటంగా చదవాలి. అందువల్ల, మనగొంతు మనమే వినడానికి అవకా శం కలుగుతుంది దానివల్ల సభలో మాట్లాడేటప్పుడు మన గొంతు మనమే వినడంవల్లకలిగే భయం తగ్గిపోతుంది
కొత్తగా ఉపన్యాసం ప్రారంభించేవారు ప్రేక్షకులు కేవ లం తమ తప్పునే పట్టుకుంటారని, వారుతమకు వ్యతిరేకులన్న మానసిక స్థితిలో వుంటారు. అది వాస్తవంకాదు మనం ఒక్క మంచి విషయం చెప్పినా ఒక మంచి జోక్ విసిరినా హర్షిస్తారు.ఉపన్యాస ప్రారంభంలో “నాకు ఉపన్యసించడంవాటు లేదు. కాబట్టి తప్పులను పప్పులుగా స్వీకరించం”డవిఎప్పుడూ చెప్పకూడదు ఉపన్యాసకుడు తనను తాను
తక్కువ చేసుకుఁటూ ఎప్పుడూ మాట్లాడకూడదు. అందువల్ల లకుముందే మీరంటే చులకనభావం ఏర్పడుతుంది.ఆదే విధంగా “నేను ఈ రోజు మాట్లాడవలసిన విష యాన్ని గురించి ఏమి చెప్పడంకూడా | ఫ్రీ పేర్” కాలేదని మంచిదికాదు. ఒక వేళ అది నిజమైనాసరే నేను “ఫ్రిపేర్కాలేదని అనకూడదు.
నెహ్రూ చిట్కా :-
గొప్పవకగా దేశంలోను విదేశాలలోను పేరుపొందిన శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ (జవహర్లాల్ నెహ్రూ సోదరి) ఆమె ఉపన్యాస జీవిత ప్రారంభదశలో ఆమె తండ్రి మోతీ లాల్ నెహ్రూ ఒక “చిట్కా” చెప్పారు.
“నువ్వు LECTURE ప్రారంభించడానికి లేచే ముందు నీ ముందున్న ప్రేక్షకులకు ఏమీ తెలియదని వారు నీకంటే పెద్దగా గొప్పవారు కాదని అనుకో వాళ్ళను నీ దృష్టిలోకి తీసుకోరక్షకులలో నీకు కొంత భయం, బిడియం వారికి నీకు వున్న పరిచయాన్నిబట్టి ఇతర అపసరమయిన ఆలోచనలు | వస్తాయి. కాబట్టి ప్రేక్షకులవంక చూడకుండా ముందువరసలలో కూర్చున్న వారివైపు దృష్టిపోనివ్వకుండా సభ చినవైపు చూస్తూ LECTURE న్ని ప్రారంభించు. అప్పుడు నీకు భయం, బిడియం మొదలయినవి రావు.
“కొంత సేపు మాట్లాడిన తర్వాత నీకు ధైర్యం వస్తుంది. అయితే, నీ LECTURE ఆసాంతం వినేవారికి ఏమీ తెలియ దని అనుకుంటూ మాట్లాడబోకు. అది చాలా ప్రమాదం” అని మోతీలాల్ నెహ్రూ తని కుమార్తెకు LECTURE రహస్యాన్ని బోధించారు.అలాగే ఒకప్పటి ప్రఖ్యాత నటుడు, చలన చిత్ర దర్శ కుడు, ప్రముఖ రాజకీయ వేత్తలలో ఒకరు, తన నటజీవిత ప్రారంభదశ అనుభవాన్ని వివరిస్తూ. తన ప్రక్కన నటించే నటుల కంటే తానే గొప్ప నటుడనన్న భావంతో నటించడం ప్రారంభించేవారట! దానితో ఆయనకు ఎంతటి గొప్ప నటీ నటుల ప్రక్కనైనా నటించడానికి తగిన ధైర్యం వచ్చేదట!
“దేనిలోనైనా ప్రారంభంలోనే ధైర్యం వుండాలి. కారు నడపడమైనా సైకిలు తొక్కడమైనా ప్రారంభదశలోనే భయం భయంగా వుంటుంది. అలవాటు అయితే ఏముందీ? ఉపన్యాసం అయినా అంతే!” అని ఆయన అన్నారు !ఆయన ఎవరో కాదు – సుహారాష్ట్ర మాజీ గవర్నర్ కోన ప్రభాకరరావుగారే !ప్రారంభ ఉపన్యాసకులలో అనేక లోపాలుండవచ్చు. కొందరు మాటకు మాటకు మధ్య తడుముకొనవచ్చు; కొం దరు నట్లు కొట్టవచ్చు: కొందరి గొంతు బొంగురుపోవచ్చు! కొందరు చాలా వేగంగా మాట్లాడవచ్చు; మరికొందరు బిగ్గ రగా కాకుండా, తమలో తాము గొణుక్కుంటూ మాట్లాడి నట్లు అనిపించవచ్చు.
ఇవన్నీ ప్రారంభదశలోవుండే లోపాలు.
ఇవి LECTURE అలవాటు లేకపోవడంవల్ల సరయిన శిక్షణ లేకపోవడం వల్ల కలిగే లోపాలు. ఇవి అధిగమించరాని లోపాలుకావు.ఉపన్యాసానికి కావలసింది ప్రాక్టీసు. ఆ టెక్నికు సంబంధించిన మెలకువలను తెలుసుకొనడం అది ఒక “ఆర్ట్”. సాధనవల్ల వచ్చేది, కాబట్టి దాన్ని సాధించితీరాలన్న దృఢ నిశ్చయం వుంటే, అది మనకు కరతలామలకం అవుతుంది.ధారాళంగా మాట్లాడడం
అనర్గళంగా, ధారాళంగా మాట్లాడగలగడం ఉత్తమ ఉపన్యాసకునికి కావలసిన ముఖ్య లక్షణం.
ఉపన్యాసకునికి హాస్యచతురత, అనుభవం, భావనా పటిమ, మంచి గొంతు, చక్కని భాష- ఇలాంటివి ఎన్ని వున్న ప్పటికీ, ధారాళంగా, అనర్గళంగా మాట్లాడలేకపోతే అతడురాణించ లేదు.
అనర్గళంగా ఉపన్యసించగలవారిని ప్రేక్షతులు ఇష్టపడతారు. వారిపట్ల “గ్లామర్ ” ఏర్పడుతుంది. మాటల వర్షం కురి పించగలవారు శ్రోతలను బాగా ఆకట్టుకోగలరు. ఉపన్యాసకులలో ఇతరలోపాలు ఎన్నివున్నా ధారాళత వుంటే అతడు రాణిస్తాడు. అందువల్ల ఉపన్యాసకునికి వాత్ప్రవాహం అవసరం.
మనం అశువుగా మాట్లాడలేకపోతే అసలు మాట్లాడడమే అనవసరం అంటే కాగితాలు చూచి చదివినా వ్రాసుకు వచ్చిన LECTURE న్ని చదివినాశ్రోతలు హర్షించరు. గోలచేయవచ్చు.
భాషాపాటనం
కాగా, ఉపన్యాసకుడు భాషపై కొంత అధికారాన్ని సంపాదించాలి అంటే తన పదసముచ్చయాన్ని పెంపొందించు కోవాలి ఉదాహరణకు ఒకేమాటకు పర్యాయపదాలు తెలుసు కొని వుండాలి నీచమైన నికృష్టమైన, నింద్యమైన హేయమైన “ఇవి ఒకదానికొకటి పర్యాయ పదాలు కాకపోయినా దగ్గర అర్ధాలు కలిగిన మాటలు. ఇందుకు వార్తాపత్రిక పఠనం. ఉత్తమ రచయితల గ్రంథ పఠనం ఎంతో తోడ్పడతాయి.
చాలామందికి చాలా భావాలుంటాయి. కాని వాటిని వారు సరిగా వ్యక్తం చేయలేరు. వారికీ భావ దారిద్య్ర్యం లేక పోయినా భాషా దారిద్ర్యం వున్నదన్నమాట.
బ్రిటిష్ మాజీ ప్రధాని గ్లాడ్సన్ అంతటి గొప్ప వక్త కాగలిగాడం పే నాలుగుసార్లు ప్రధాని కాగలిగాడంటే అందుకు ఎంతగానో దోహదం చేసింది ఆయన అనర్గళ వాత్ప్రవాహం!ఉపన్యాసంలో ఉద్వేగం రావడానికిఒక ఉపాయంవుంది. రోజూ ఒక పుస్తకం తీసుకుని అందులోని ఒక పేజీని ఏకాంతంగా ఎంత వేగంగా వీలయితే అంత వేగంగా బిగ్గ రగా చదవాలి. ఇందువల్ల అయిదారు మాసాలలో వేగంగా మాట్లాడే ఉపన్యాసకుడు కావడానికి అవకాశం వుంటుంది.
కొందరు ఉపన్యాసానికి లేవగానే బిగుసుకుపోతారు. వారిలో ఎక్కడలేని ఉద్రిక్తత కనిపిస్తుంది. నిటారుగా బిర్ర బిగుసుకుపోయి నిలబడడానికి ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు నాలుక, నోరుకూడా ఉద్రిక్తతకులోనై, దారాళంగా మాట్లా డ్డానికి సహకరించవు.వారికిప్రేక్షకులకు ఏదో ఒకబోధ చేయాలని కాక, వినోదం కలిగించాలని వారితో కలిసి తన జోక్స్, విషయ పరి జ్ఞానం పంచుకోవాలన్న దృష్టిలో మైక్ ముందుకు వెడితే, అప్పుడు ఉపన్యాసకునికి ధారాశత్వం వస్తుంది.ఉపన్యసించేముందు గొంతు ఎండిపోయినట్టువుంటే ఒక గ్లాసు మంచినీరు త్రాగవచ్చు. అంతేకాని LECTURE మధ్యలో మంచినీరు త్రాగితే, భావస్రవంతికి అవరోధం కలుగుతుంది.మనం మామూలుగా మాట్లాడేటప్పటి ధోరణిలో, కాక పోతే బిగ్గరగా, జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నిస్తే, అందువల్ల ధారాళత వస్తుంది.
పోజులు వద్దు
మైకు ముందుకు వెళ్ళగానే ఏదో పోజు పెట్టడానికి ప్రయత్నిస్తే నగుబాట్లకు గురికావలసి వస్తుంది. అదేవిధంగా ఎవరో ప్రఖ్యాత వ్యక్తిని అనుకరిస్తూ పోజు పెట్టడానికి ప్రయత్నించడం మంచిది కాదు.
ఉపన్యసించే సమయంలో ఉపన్యాసకునికి సహజత్వంఅవసరం. LECTURE లో ప్రేక్షకులకు అర్థంకాని మాటలను, సుదీర్ఘమైన సమాసాలను ఉపయోగించడంవల్ల సామాన్య పేక్షకునికి LECTURE అర్థంకాదు, ఎంత స్పీడుగా మాట్లా ‘డినా, శ్రోతలకు అర్ధం కావడం ముఖ్యం.కేవణం వేగంగా, ధారాళంగా మాట్లాడితే ప్రయోజనం లేదు. మాట్లాడేదానిలో చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పాలి.
ఊకదంపుడు LECTURE లు
LECTURE సుదీర్ఘంగా వుంటే లాభం లేదు. “ఇంకా కొంచెం మాట్లాడి వుంటే బాగుండేదే?” అన్న దశలో ఉప న్యాసాన్ని విరమించడం మంచిది. శ్రోతలు “ఇక చాలు.ఆపండి!” అనే పరిస్థితి తెచ్చుకోకూడదు! రెండు, మూడు సార్లు శ్రోతలకు “బోర్ అనిపించే వరకు మాట్లాడితే, ఇక వారు మనజోలికిరారు! మళ్ళీ పిలవాలంటే భయపడిపోతారు!కేవలం ఏదో ఉపన్యసించాలి కాబట్టి ఉపన్యసిద్దామనే ధోరణి మంచిది కాదు మనం చెప్పదలచుకున్నది మనకు స్పష్టంగా తెలిసినప్పుడే మైకు దగ్గరకు వెళ్ళాలి.
మన LECTURE కి కాలపరిమితి వుంటే.. ఏ పరిస్థితి లోనూ దాన్ని అతిక్రమించరాదు. నిర్ణీత పరిమితికి ముందే LECTUREన్ని ముగిస్తే, శ్రోతలు హర్షిస్తారు.ఉపోద్ఘాతం ఎక్కువ చెప్పకుండా. చెప్పదలచుకున్న విషయాన్ని త్వరగా చెప్పడం మంచిది. LECTUREలో కొన్ని వాస్తవ విషయాలు, హాస్యోక్తులు, స్థానిక విషయాలు, అంకెలువుంటే మంచిది. అందువల్ల మనం శ్రోతలను ఎక్కువగా ఆకట్టుకొనడానికి వీలవుతుంది.
మంచి గొంతు
మంచి ఉపన్యాసకుడు కావడానికి స్పుటమైన, తియ్యని గొంతు బాగా ఉపయోగిస్తుందనడంలో సందేహంలేదు చాలా మంది ఉపన్యాసకులకు, నటులకు మంచి గొంతు “ఎస్సెట్”,బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, జవహర్లాల్ నెహ్రూ, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుకర్నో మొదలైన వారి గొంతులు అలాంటివి. తెన్నేటి విశ్వనాథం, పి. వి. నరసింహారావు, సి నారాయణరెడ్డి వంటి వారి గొంతులలో ఉపన్యాస స్వరాలు పలుకుతాయి అలాగే తెలుగు నటులలో శ్రీ జగ్గయ్య గొంతు అదొక తరహా, అది మేఘ గంభీర స్వరం అయితే, ఉపన్యాసకునికి మంచి గొంతు వుండి తీరాలని లేదు. మంచి గొంతు వుంటేనే ఉపన్యాసకుడు రాణిస్తాడని లేదు. చాలా మంది మంచి ఉపన్యాసకుల గొంతులు అంత వుండవు అయినా వారు రాణించడానికి“గొంతులు” అడ్డురా లేదు.
అందునల్ల, మీ గొంతు బాగా లేకపోతే, మీరు మంచి ఉపన్యాసకులు కాలేమని బాధపడనక్కర లేదు.
అయితే, మీ గొంతు పిలగా వుంటే, దానిలో కొన్నిమార్పులు తీసుకురావడానికి అవకాశం వుంది,
చాలానుందిఉపన్యాసకులకు తమ గొంతును ఎలా వుపయోగించుకోవాలో తెలియదు. మన గొంతును మనం ప్రాక్టీసు ద్వారా ఎన్ని ఒదుగులైనా పోయేటట్టు చేయవచ్చు.

రసానుగు – మైన గొంతు
LECTURE చెప్పడంలో కూడా ఎప్పుడూ ఒకే స్థాయి, ఒకే గొంతు రాణించవు. ఆ సన్నివేశం, ఆ భావానికి తగి ఆ నట్టుగా గొంతు స్థాయిని, స్వరాన్ని మార్చుకోవాలి. విషాద భావాన్ని చెప్పేటప్పుడు కంఠాన్ని తదనుగుణంగా స్వరానికిమార్చాలి. ఆ విషాద భావంనుంచి ప్రేక్షకులతో ఆవేశాన్ని రగల్చదలచు కున్నప్పుడు, గొంతు స్థాయిని పెంచి, దానిలోఆవేశాన్ని సృష్టించాలి.మాట్లా డేటప్పుడుప్రయత్నించాలి.
మనం ముగ్గురు, నలుగురితో స్ఫుటంగా, స్వచ్ఛంగా మాట్లాడటానికి అదీ ఫక్కీ తరువాత LECTURE కి కూడా పనికి వస్తుంది. ఇతరులు మాట్లా డేటప్పుడు, ఉపన్యసించేటప్పుడు శ్రద్ధా సక్తులతో వింటే వారి గొంతులోని లోపాలు తెలుసుకొనడం, అలాంటి లోపాలు మనం మాట్లాడేటప్పుడు జరగకుండా చూచుకోవడం సాధ్యమౌతుంది.
ఉపన్యాసకుడు గాయతుని వలెనే తన గొంతు ఎప్పుడూ దెబ్బతినకుండా చూచుకోవాలి వీలైనంత వరకు శీతల పానీ యాలు, గొంతు తరహాలో మార్పులు తీసుకువచ్చే ఏ పదార్థా లను తీసుకోకూడదు.
మంచి ఉపన్యాసకుడు కావడానికి మంచి గొంతు అవ సరం కాకపోయినా, గొంతు బొంగురుగా, జీరగా లేదా కీచుగా వుంటే, అది ప్రేక్షకులలో అవహేళనకు గురికావచ్చు. పుట్టుకతోనే కీచు, అడగొంతులు కలవారు వాటిని మార్పు చేసుకోవాలంటే కష్టమే, అలాగే మగగొంతుగల స్త్రీలు కూడా కనిపిస్తారు వారి గొంతులు మారడం కష్టమే. అందుకు చేయ గలిగింది ఏమీ లేదు.
ఉచ్చారణ
ఉపన్యాసకునికి ఉచ్చారణ చాలా ముఖ్యం. ఆయా పదాలను సరిగా, స్పుటంగా, కరెక్టుగా ఉచ్చరించ గలగడం ఉపన్యాసకుని సామర్ధ్యానికి, అతడి పరిపక్వతకు గీటురాయి.ఆయా పదాలలోని వత్తులు పలకకపోవడం ఉపన్యాస కుని భాషాదోషాలను తెలియజేస్తుంది. మధుసూదనరావులో రెండవ అక్షరానికే నత్తు వుందికాని, నాల్గవ అక్షరానికి – ‘ద’ కు.వత్తు లేదు. అయితే, కొందరు ఎంత వత్తి పలికితే అంత – మంచిదనో, అంతస్పుటంగా మాట్లాడినట్టు అవుతుందనో, రెండింటికి వత్తులిస్తారు. కొంచెం చదువుకున్న వారికి ఇది ఎబ్బె ట్టుగా కనిపిస్తుంది. అలాగే నత్తులు లేని మాటలకు వత్తులు కలిపినా ఎబ్బెట్టుగా వుంటుంది.

కాగా, ఉచ్చారణ సరిగా వుండడమంటే పెదవులు, పళ్ళు, నాలుకలపై మనం మాట్లాడే సమయంలో, లేదా ఉప న్యాస సమయంలో దృష్టిని కేంద్రీకరించడమన్న మాట.మన తెలుగు ఉపన్యాసకులలో కవి కరుణశ్రీ గారి గొంతు ఎంత మధురమో, ఆయన ఉచ్చారణ కూడా అంత నిర్దుష్టం, అంత స్ఫుటం.వేగంగా మాట్లాడడం ఒకప్పుడు ఉచ్చారణ స్పుటంగా వుండడానికి ఇబ్బంది కలిగించవచ్చు. స్పష్టమైన ఉచ్చారణకు ఇబ్బంది పడేవారు వేగాన్ని తగ్గించి, తమకు ఉచ్చారణ సౌం భ్యం బాగా అలపడే వరకు నెమ్మదిగా మాట్లాడడం వాంచ నీయం.
పరధ్యానం ప్రమాదం
ఉపన్యసించేటప్పుడు పరధ్యానంగా వుండడం వల్ల ఇతర పొరపాట్లే కాక, ఉచ్చారణ పొరపాట్లకు కూడా అవకాశం వుంది. ఇంటివద్ద బిగ్గరగా చదవడం కూడా మంచి ఉచ్చారణకు తోడ్పడుతుంది. ఉచ్చారణ సరిగా, స్పుటంగా లేకపోతే, శ్రోతలకు ఒక పదం మరొక పదంగా అర్థమవుతుంది.ఉచ్చారణ శ్రోతకు ఉపన్యాసకునికి మధ్య వంతెన వంటిది. ఒక్కమాటలో ఉచ్చారణ సరిగా లేకపోతే, ఉపన్యాపకుడు నగుబాటుకు గురి అవుతాడు.కొందరికి “ళ” పలకదు ‘ళ’ కు బదులు ‘ల’ ఉపయోగి స్తారు. అలాగే ఒక ప్రముఖునికి “అజ్ఞానం”లో “జ్ఞ” పలకదు. ఆయన దాన్ని “అగ్నానం”గా ఉచ్చరిస్తాడు. అది ఎంత అవహేళన పాత్రమైందో అందరికీ తెలిసిందే.
హస్త విన్యాసాలు
ఉపన్యాసకునికి హావభావాలకు తగినట్టు హస్త విన్యా సాలు, ముఖకవళికలు వుండాలి.కొందరు హస విన్యాసాలు లేకుండానే మాట్లాడగలరు. మరికొందరు ఉపన్యాసకులు కొంతసేపటి వరకు ఉపన్యాసం ప్రారంభించిన కొంత సేపటి వరకు హస్తవిన్యాసం లేకుండానే మాట్లాడతారు. ఆ తర్వాత హస్తవిన్యాసం ప్రారం ఖిస్తారు.జవహర్లాల్ నెహ్రూ కొన్ని సందర్భాలలో చేతులు రెండూ వెనక్కి కట్టుకుని మాట్లాడేవారు. మరికొన్ని సంద ర్భాలలో కుడిచేతిని ఎత్తి కదుపుతూ మాట్లాడేవారు. ఆయన ఖావోద్రేకి. అందువల్ల, ఉద్రేక పూరితమైన భావాలను వ్యక్తం చేయవలసి వచ్చినప్పుడు ఆయన భావోద్రేకానికి అనుగుణ ముగా హస్తవిన్యాసం వుండేది. అలాగే తమిళనాడులోని ద్రవిడ ఉద్యమ నాయకులేమి, కమ్యూనిస్టు నాయకులేమి తీవ్రమైన హ స్తవిన్యాసాలతోనే LECTURE లు చేస్తారు.

శ్రీ రాజీవ్ గాంధి ఉపన్యసించేటప్పుడు హస్తవిన్యా సాలు సాధారణంగా చేయరు. చేసినా, చాలా తక్కువ.
LECTURE లో సరైన సమయంలో, హస్తవిన్యాసం చేసి నప్పుడు అది LECTURE రక్తికట్టడానికి ఎంతో తోడ్పడు తుంది. చేతులు బొత్తిగా కదల్చకుండా చేసే LECTURE కి వచ్చే “ఎఫెక్ట్” కంపెహ సవిన్యాసాలతో చేసే LECTURE ల “ఎఫెక్ట్” రెట్టింపు వుంటుందని చెప్పవచ్చు. మన ముఖ కవళి కలు, ముఖ విన్యాసాలు మన మౌనభాషకు సంకేతాలని చెప్ప వచ్చు. కొన్ని సందర్భాలలోని భావాల కంటె హస్త విన్యా సాల ద్వారానే ఎక్కువ భావాన్ని వ్య క్తీకరించవచ్చు.
ఉదాహరణకు, 1950లో కాబోలు అప్పటి పాక్ ప్రధాని వియాకత్ ఆలీఖాన్ ఇండియాను తాము ఎదుర్కొన గలమని చెప్పడానికి తన ప్రతి బహిరంగ సభ చివర పిడికిలి చూపించేవాడు! ఆ పిడికిలి చూడగానే సభికులు మిన్నుము టట్టు హర్షధ్వానాలు చేసేవారు .అలాగే ఒక ప్రముఖ రాజకీయ వేత్త LECTURE లలో సందర్భ శుద్ధి లేకుండా తన ఎడను చేతిని ఎప్పుడూ ఒకానొక నిర్ణీతమైన ఫక్కీలో త్రిప్పుతాడు. అది చూడగానే జనం హర్షధ్వానాలు చేసేవారు.
అదేవిధంగా కీర్తిశేషుడు ఎమ్. జి. ఆర్. తన ఉపన్యా సంలో పెద్దవ్రేళ్ళు రెండింటిని “వి” ఆకారంలో చూపించే వాడు. అంటే అది ఏ.డి. ఎమ్. కె. గుర్తు అయిన రెండు ఆకులకు చిహ్నం రెండవది-వి అంటె విక్టరీ; “జయం మనదే” అని అర్ధం కూడా. ఆ సంకేతం చూడగానే సఖికులు విపరీ తంగా హర్షధ్వానాలు చేసేవారుమనం ఉపన్యాసకుని వినడానికేకాదు, అతడిని చూడ్డా నికి కూడా ఇష్టపడతాము. అందువల్ల, మంచి ఉపన్యాసకుడు ఒక పోతపోసిన విగ్రహం వలె నిలబడి ఉపన్యసించకుండా, నటునివలె కొన్ని విన్యాసాలు కూడా చేయాలి. ఉపన్యాసాన్ని నాటకీయంగా, విన్యాసాలతో “సింక్రోనైజ్ చేయాలి. అప్పుడు LECTURE మరింత రాణిస్తుంది.
కొంతమంది హస్త విన్యాసాలను విమర్శిస్తారు. అవహేళన కూడా చేస్తారు అలాంటి వారిని లెక్క చేయనక్కర లేదు. అయితే, ఆ విన్యాసాలు శ్రుతి మించకూడదు: విమర్శ కుల మాట విని, విన్యాసాలను విరమిస్తే, ఉపన్యాసకులుగా రాణించలేము, హస్తవిన్యాసాలను చేయగలగడమే మనం ఉపన్యాసకులుగా కొంత అనుభవాన్ని పొందామని, ఉపన్యసించ దానికి బిడియం తగ్గిందని అర్దం!ప్రజాజీవిత మంటేనే ఎన్నో విమర్శల పుట్ట.వల్ల నే ఒక మహాకవి.
“వ్యక్తుల ప్రయివేటు బ్రతుకు వారి వారి సొంతం: పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాము” అన్నాడు.
మనం ప్రముఖులమయినకొద్దీ, మన శక్తిసామర్థ్యాలు అధికమైన కొద్దీ, మనకు ప్రచారం లభించిన కొద్దీ మనం నలు గురి దృష్టిలో వుంటాం. అప్పుడు విమర్శకుల కళ్ళు మనపైనే వుంటాయి. అందువల్ల ప్రశంసలకేకాక, విమర్శకులకు పయితం గురిఅవుతాం;జాన్ బ్రైట్, లాయడ్ జార్జి (బ్రిటిష్ మాజీ ప్రధాని) గొప్ప వక్తలు. వారి హస్తవిన్యాసాలను బ్రిటన్లో ఎందరో విమర్శించేవారు; హేళన చేసేవారు. అయినా, బ్రిటిష్ చరిత్రలో వారు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ గొప్ప వక్తలే.
వికృత చేష్టలు :
అయితే, ఈ విన్యాసాలు అతిగా, వికృతంగా, అసహ జంగా వుంటే అవి నవ్వులపాలవుతాయి. LECTURE లో కొందరు భుజాలు ఎగుర వేస్తారు! మరికొందరు ఉపన్యాసకులు రెండు వాక్యాలు చెప్పి వేదికపై వున్న తక్కిన వారి వంచూస్తారు. అదే విధంగా మరికొందరు ఉపన్యాసకులు రెండు మాటలు చెప్పి, నవ్వుతూ తక్కినవారు నవ్వుతున్నారా, లేదా అనివారివంక చూస్తారు! తను మాటలు నవ్వు తెప్పించ వలసింది వేదికపై వున్నవారికి కాదు, వేదిక ముందున్న వారికి ఉపన్యానకుడికి హస్త విన్యాసం, లేదా ఇతర విన్యాసం గాయకునికి ప్రక్క వాద్యం వంటిది, హసనిన్యాసం అంటే ఒక విషయాన్ని సచిత్రంగా వివరించడం వంటిది. కొందరు తమ చొక్కా లేదా షర్టు గుండీలను నలుపుతూ ఉపన్యసి స్తారు. మరి కొందరు తమకు వేసిన పూల దండను చేతితో పట్టుకుని దాన్ని జపమాలికవలె తిప్పుతూ మాట్లాడుతారు! ఇవన్నీ వికృతమైన విన్యాసాలే.
అలాగే మాట్లాడేటప్పుడు ముందున్న బల్ల పై కొట్టడం, చూపుడు వ్రేలితో విన్యాసాలు చేయడం మంచిది కాదు. – ఒక విషయంపై ఆవేశంతో మాట్లాడుతుంటే, గుప్పిడిని మూసి, చేతిని పైకెత్తి మాట్లాడవచ్చు.
ఎవరికైనా స్వాగతం చెబుతూ మాట్లాడుతుంటే,రెండు చేతులను తెరిచి మాట్లాడవచ్చు.ఎవరి పట్లనయినా గౌరవంగా మాట్లాడుతుంటే,కుడిచేతిని పైకెత్తి మాట్లాడవచ్చు.కాగా, చిన్న LECTUREతే, దానిలో పెద్దగా విన్యాసాలు అనవసరం.
అలాకాక మీ ఉపన్యాసంలో ప్రేక్షకులనుఆకట్టుకో దలచుకుంటే వారిని మీ వాదం వైపు తిప్పుకోదలచు కుంటే, వారిని ఒక విషయంపై ఒప్పించదలచుకుంటే మాటలు కంపె విన్యాసాలే బాగా పనిచేయవచ్చు!ప్రేక్షకుల సంఖ్య హెచ్చుగా వున్నప్పుడు విన్యాసాలుకూడా హెచ్చుగావుంటే బాగా రాణిస్తుంది ఉపన్యాసం.తాను చెప్పదలచుకున్న ఉపన్యాసంలోని భావాలు ఉపన్యాసకునిలోనే కదలిక తీసుకురాకపోతే అవి శ్రోతలను ఏమి కదిలిస్తాయి?
కాగా ఉపన్యాసకుడు విన్యాసాల విషయంలో మూడు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.
1) తన స్వరూప స్వభావాలు
2) ప్రేక్షకులు ఎటువంటివారు వారి సంఖ్య 3) మాట్లాడే సబ్జక్టు
సబ్జక్టు- అధ్యయనం
తాను చెప్పదలచుకున్నది లేదనుకున్నప్పుడు కేవలం LECTURE కోసం ఉపన్యాసం చేయడం ఉపన్యాసకునికిమంచిది కాదు. అందువల్ల అతడి LECTURE పేలవంగా వుంటుంది ఇతరులు చెప్పని కొత్తపాయింటు తాను చెప్పాలని ఉపన్యా సకుడు కాపత్రయపడాలి అలా కనీసం రెండుమూడు కొత్త పాయింట్లు చెప్పగలిగితే అతడి LECTURE రాణిస్తుంది.

అర్జంటు LECTURE
కోరమనల్ని ఒక సభకు తీసుకు వెళ్ళినప్పుడు ఆకస్మాత్తుగా నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా సభాధ్యక్షులు వచ్చు. అప్పుడు సబ్జెక్టుతో పూర్తిగా పరిచయంలేని మనకు ఇబ్బంది ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఎలాంటి ఉపన్యాసకు డికైనా తన LECTURE తనకే నచ్చదు. ఎందువల్ల ?
ఆ విషయాన్ని గురించి మనం ముందుగా అధ్యయనం చేయకపోవడంవల్ల కనీసం కొంచెం వ్యవధిగా ఆ సబక్తును గురించి ఆలోచించి కొన్ని పాయింట్లను జ్ఞాపకం చేసుకొనడా నికయినా అవకాశం లేనందువల్ల, అందువల్ల ఎంతటి ఉపనా సకుడయినా తాను మాట్లాడవలసిన విషయాన్ని గురించి ఆలో చించుకోడానికయినా వ్యవధి లేనప్పుడు మాట్లాడకుండావుండడం మంచిది.
ఉపన్యాసకుడు వివిధ పదాలను సామెతలను ఉపమా నాలను హాస్యోక్తులను మననం చేసుకోవాలి ఉపన్యాసకుడికి ఆయా విషయాలకు సంబంధించిన వివరాలు అంకెలు ప్రతినాదాలు బాగా తెలిసివుండడం అవసరం. LECTURE కి వెళ్ళేముందు ఆ విషయానికి సంబంధిం చిన పుస్తకాలలో వ్యాసాలో చదివి పుండడం చాలా వుపయో డం. అంతేకాక తాను చెప్పదలచుకున్న పాయింట్లను మనసు లోనే ఒక వరుసలో అమర్చుకోవాలి ఏ పాయింటుతో ముగిం చాలి? అన్న విషయాన్ని ముందుగా నిర్ణయించుకుంటే ఉప న్యాసం రాణిస్తుంది.
ఉపన్యాసకుడికి సులభంగా ముందే తెలుస్తుంది, తన పాయింట్లలో ఏది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందో! ఎలా ఆకట్టుకుంటుందో కొందరు LECTURE లో పెద్దవారు. ప్రముఖుల సూక్తులు, కొటేషన్స్ పేర్కొనాలని ప్రయత్నిస్తారు. అవి LECTURE లో సరిగా జ్ఞాపకం రాకపోవచ్చు. రెండు పంక్తులు చెప్పి తక్కినది జ్ఞాపకం రాక LECTURE మధ్యలో ఆగిపోతే, లేదా తప్పు చెబితే రసాభాస అవుతుంది.
పోతే, మనకు ఆసక్తిలేని, మనకు సంబంధం లేని సబ్జెక్టుపై మాట్లాడానికి ఉద్యమించరాదు. అందువల్ల అఖాసు పాలు కావలసి వస్తుంది. మనకు మాట్లాడం వచ్చుకదా అని ప్రతి విషయంపై మాట్లాడానికి తయారు కాకూడదు.
ఒకసారి అప్పటి కాంగ్రెసు అధ్యక్షుడు కామరాజ్కు కలకత్తా వాణిజ్య మండలి వారు సన్మానం చేసి, తమకు సంబంధించిన సమస్యలను సన్మానపత్రంలో ఏకరువు పెట్టారు. నిజానికి, ఆ సమస్యల విషయం, వాటి మంచిచెడ్డలు కాము రాజ్కు తెలియదు. వాటిపై ఏమి మాట్లాడితే ఎలా వస్తుందో? అందువల్ల, ఆయన ఏమీ చెప్పకుండా కేవలం “థాంక్స్” అని కూర్చున్నారు! – “పార్కలాం” ఆయన ఊతపదం. అంటే చూద్దాం అని అర్థం.
ఇక, మన వ్యక్తిగత అనుభవాల నుంచి కొన్ని విష యాలు, ఆసక్తికరమైనవి చెబితే, అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే, అవి స్కోత్కర్ష కారాదు. సొంత డబ్బా అనిపించుకోకూడదు; అది స్వీయానుభవంలోనే మరొకరికి సంబంధించిన అంశం అయి వుండాలి. అప్పుడది శ్రోతలను బాగా ఆకర్షిస్తుంది.మనకు పూర్తిగా తెలియని విషయాన్ని సభలో చెప్పడం మంచిది కాదు. సభలో మనకంటె తెలివిగలవారు, మనకం విషయాలు తెలిసినవారు వుంటారని తెలుసుకోవాలి. మన ఉపన్యాస ప్రవాహంలో కొట్టుకుపోయే శ్రోతలు మనం తప్పులు చెప్పినా, పట్టించుకోరనుకోవడం పొరపాటు.
ఉదాహరణకు, ఒక ప్రముఖ రాజకీయవేత్త ఒక సభలో మాట్లాడుతూ “నవభారత రాజ్యాంగ నిర్మాత గురజాడ అప్పారావు” అనగానే జనం గొల్లుమన్నారు.
అదేవిధంగా సభలో మాట్లాడేటప్పుడు వేదికపై వున్న వారందరి పేర్లు తెలియకపోతే, తెలిసీ తెలియకుండా వారిని సంబోధించరాదు. ఒకరి పేరుకు మరొకరి పేరు అంటే ప్రేక్ష కులు నవ్వుతారు. ఒకసారి ఒక ప్రఖ్యాత వ్యక్తిని సభాధ్యక్షు డైన రాజకీయవేత్త మరొక పేరుతో సంబోధించేసరికి ఆ | ప్రఖ్యాత వ్యక్తి తాను మాట్లాడేటప్పుడు “నా పేరైనా తెలి యని ప్రెసిడెంట్ గారూ” అని సంబోధించారు.
వేదికపై వున్నవారి పేర్లు సరిగా జ్ఞాపకం రావను కుంటే, “సభకు నమస్కారం” అంటే సరిపోతుంది.
ఎలా ప్రారంభించాలి
ఉపన్యాసాన్ని ప్రారంభించేముందు ఎవరికైనా కొంచెం బెరుగ్గానే వుంటుంది. అయితే, ఆ బెరుకును లోపలే అణచు కోవాలి కాని, పైకి వ్యక్తం కానివ్వకూడదు. పైకి గంభీరంగానే కనిపించడం మంచిది.
కొత్తగా ఉపన్యాసం ప్రారంభించేవారు నెమ్మదిగా, ప్రశాంతంగా ప్రారంభించాలి; తొందరపడితే, పొరపాటు దొర్లవచ్చు; ఒకదానికి బదులు మరొకటి చెప్పవచ్చు. ఆచి, తూచి, మాటలు కూడబలుక్కుని ఉపన్యాసం ప్రారంభిస్తే, అది శుభారంభమవుతుంది. కొంతనేపు అలా సాగిన తర్వాత ఉపన్యాసాన్ని కొంచెం స్పీడుగా ఎత్తుకోవచ్చు.

అంతేకాని ఎత్తుకోవడంలోనే స్పీడుగా ఎత్తుకుంటే, ప్రేక్షకులు దాన్ని సరిగా స్వీకరించలేరు.
ఒకవేళ మనం చెప్పదలచుకున్న పాయింట్లు శ్రోతలకు కొంచెం వ్యతిరేకంగా వుంటాయనుకుంటే. అప్పుడు నెమ్మ దిగా, వారిని ఆకర్షించేటట్టు, ప్రశాంతముగా ఉపన్యసించడం ప్రారంభించాలి.
ఉపన్యాసం ప్రారంభించడముకూడా ఒక కళే. First Impression is the best Impression ముందు ప్రేక్షకులను మన ఉపన్యాసాన్ని వినడానికి ఉద్యుక్తులను చేయాలి. మొదటి వాక్యాలలో ప్రేక్షకులకు మనపట్ల సదభిప్రాయం కలిగించు కోవడానికి ప్రయత్నించాలి.
ఆ సభకు వున్న ప్రత్యేకతనుఏదైనా వుంటే.. ముందుగా పేర్కొనాలి. అది అలాంటి సభలో మొదటిది కావచ్చు; అదే విధంగా ఆ సభ జరిగే తేదీకి ఒక ప్రత్యేకత, ప్రాధాన్యం వుండవచ్చు. మరేదైనా విశేషం వుండవచ్చు.ఉదాహరణకు, అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి, అందుకు సంబంధించి సభ జరుగుతున్నదనుకోండి.
“ఈ రోజు జాతిపిత. భారత స్వాతంత్ర్య ప్రదాత, మహాత్మాగాంధీ జన్మదినోత్సవం. అంతేకాదు మహా త్యాగ ధనుడు, ఆదర్శ రాజకీయవేత్త లాల్ బహదూర్ శాస్త్రిగారి జన్మదినోత్సవం కూడా ఈనాడే” అని చెబితే, ప్రేక్షకులకు ఆనందం, ఉపన్యాసకుని సమయస్పూర్తి, జ్ఞాపకశక్తి పట్ల ఆకర్షణ ఏర్పడుతాయి. గాంధీజీ వంటి మహాత్ముని జయంతి సంగతి జ్ఞాపకం ఘుంటుంది కాని, ఆ సంరంభంలో లాల్ బహదూర్ జన్మదినోత్సవం కూడా అక్టోబర్ 2వ తేదీ అన్న సంగతి చాలామందికి జ్ఞాపకం వుండదు.
అందువల్ల, ఆ సభకుగల ప్రాధాన్యం ఇనుమడించిం ఆ దని, తాము ఆ సభకు రావడం మరింత సముచితంగా వుందని ప్రేక్షకులు భావిస్తారు.
ఒక గంభీరమైన సబ్జెక్టుపై మాట్లాడుతున్నప్పుడు ఉపు న్యాస ప్రారంభం పేలవంగా వుండకూడదు. అలాగే సరదాగా సాగే సభలో ఉపన్యాసం “సీరియస్”గా ప్రారంభించకూడదు. నైనా కొందరు ఒకేరకమైన ఉపన్యాసాన్ని ఎన్ని చోట్లనై నా అదేరకంగా చేస్తారు! అదే విధంగా ఒకేరకమైన పడికట్టుమాటలను అన్నిచోట్ల ఉపయోగిస్తారు. అందువల్ల ఒకసారి ఆయన ఉపన్యాసం విన్నవారు రెండవచోట ఆయన ఉప న్యాసం వింటే ఇది ఈయన మొన్న చెప్పిందే అని తేలికగా భావిస్తారు.
ఉదాహరణకు, ఒక ఉపన్యాసకుడు వేదిక పైవున్న ఒక ప్రముఖుని పరిచయంచేస్తూ “మన సారధి మన సచివుడు, నెయ్యము మన నాయకుడు మన గురుడు….” అంటూ వరు సగా ఆయనను గురించి స్తోత్రపాఠం వల్లించాడనుకోండిఆ ప్రముఖుడు వీటిలో ఏ పదానికి తగదు, అందువల్ల వినేవారికి నవ్వువస్తుంది ఆ వర్ణణను చేసేవారిని గురించి చేయ ఐతే వారిని గురించి తేలిక భావం ఏర్పడుతోంది.
పైగా ఆ ఉపన్యాసకుడు ప్రతి సభలోనూ ప్రతి ప్రముఖుని గురించి అవే మాటలు ఉపయోగించాడనుకోండి
సామాన్య వ్యక్తిని పట్టుకుని అంత పెద్ద పెద్ద మాటలను ఉప యోగించడం తన భాషాప్రౌడిమకు నిదర్శనమని ఆ ఉపన్యా సకుడు పొంగిపోవచ్చు కాని వినేవారికి ఆ ఉపన్యాస చాలా కృత్రిమంగా శబ్దాడంబరమే ప్రధానమైనదిగా కనిపిస్తుంది.https://photos.app.goo.gl/JzHatYitZZjJm5Vd7
అలాగే చాలామంది ఉపన్యాసకులు వేదికపైవున్న వారిని పెద్దలు పూజ్యులు గౌరవనీయులు ఆంటూ స్తారు. ప్రతివారిని పెద్దలనవచ్చుకాని పూజ్యులనడం కొంచెం పెద్దమాట.ఊతపదాలు !
అదే విధంగా ఒక్కొక్క ఉపన్యాసకునికి ఒక్కొక్క పూర్ణ పదం వుంటుంది. కొందకు ప్రతివాక్యం చివర “మనవిచేస్తున్నా” అంటారు. ప్రేక్షకులు ఎంత గౌరవనీయులయినా మాటి మాటికి వారికి “మనవి చేయనక్కరలేదు. “ఈ మనవి మరీ చేస్తున్నా” అన్నది ఇటీవల రాజకీయ ప్రసంగాలలో అధికమైపోయింది. ఉపన్యాసకులు ఏ మాటను పదే పదే వుప యోగించడం బాగుండదు.
అదే విధంగా ఒక ఉపన్యాసకుడు “ఇక పోతే”, “ఇక పోతే” అనే మాటను తరచుగా ఉపయోగిస్తాడు. మరొక ఉప న్యాసకుడు తన ప్రతి వాక్యాని కిముందు “మరి” “మరి” అని ఉపయోగిస్తాడు ఇంకొక ఉపన్యాసకుడు ” యొక్క ” “యొక్క అనేమాటను ఎక్కువగా ఉపయోగిస్తాడు, మాట్లాడు తున్నంత సేపు ప్రేక్షకులు ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు ఇలాంటి వూత పదాలకు తెలుసుకుని అవి ఉపన్యాసకుడు తన ఉపన్యాసంలో చోటు చేసుకోకుండా చూచుకోవాలి.
ఉపన్యాసాన్ని మొదలు పెట్టేటప్పుడు ఒక చమత్కార వాక్యం లేదా నవ్వుల జల్లు కురిపించే మాట వదిలితే ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది. అలాగే ఉపన్యాసంముగిస్తూ కూడా ఒక హాస్యోక్తి, ఛలో క్తివదిలితే అది ప్రేక్షకుని మన స్సులో నాటుకుంటుంది వాటిని ముందే ఆలోచించుకుని మనస్సులో పెట్టుకోవాలి
అలాగే వీలై నంతవరకు ప్రేక్షకులలో అన్ని వర్గాలను ఆమోదయోగ్యమైనథావాలనే చెప్పాలి అలాకాక
ప్రేక్షకు,లలో వివిధ వర్గాలవారు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు చీలిపోయే భావాలను వ్యక్తం చేయడం మంచిది కాదు.
ఒక పొరపాటు
ప్రేక్షకులు వ్యతిరేకించే పాయింటుతో ఉపన్యాసం ఎప్పుడూ ప్రారంభించరాదు. అంతే కాదు మనకు ముందు మాట్లాడిన ఉపన్యాసకుని భావాలను ఖండిస్తూ మాట్లాడడం, విమర్శిస్తూ, లేదా అవహేళన చేస్తూ మాట్లాడడం Very bad taste. మీకు పూర్వం మాట్లాడిన ఉపన్యాసకుడు చెప్పిన భావాలతో ఏకీభవిస్తూనే అందుకు దోహదం చేసే మరికొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ప్రేక్షకులు సంతోషిస్తారు. ఒకవేళ మీకు పూర్వం మాట్లాడిన ఉపన్యాసకుని అభిప్రా యాలకు విరుద్ధమైన అభిప్రాయాలు మీకు వుంటే, అతడి అభి ప్రాయాలను ఖండిస్తూ కాకుండా మీ అభిప్రాయాలను మీరు చెప్పవచ్చు. అంతేకాని, మీకు ముందు మాట్లాడిన ఉపన్యాస కుని అభిప్రాయాలను మీరు ఖండించడం సభ మర్యాద కాదు. ఎందువల్లనంటే, మీ అభిప్రాయాలకు జవాబు చెప్పడానికి ఆయనకు అవకాశం లభించదు ఒక వేళ సభాధ్యక్షుడు అనుమతి ఇచ్చినా, అది రసాభాస అవుతుంది.
మీరు ఆఖరు ఉపన్యాసకులయితే, మీకు ముందు మాట్లా డిన ఉపన్యాపకులు వదిలి పెట్టిన పాయింట్లను అంటే వారు చెప్పనివి, కొత్తవి— మీరు చెబితే ప్రేక్షకులు సంతోషి స్తారు. లేదా వారు చెప్పిన పాయింట్లను మరింత ముందుకు తీసుకు వెళ్ళి వాటిపై కొత్త ఊహలను ప్రేక్షకులకు అందిం చినా, వారుసంతోషిస్తారు.
శ్రోతలను ఆకట్టు కొనడం
ఉపన్యాసకులను మూడు రకాలుగా విభజించవచ్చు.1) Talkers 2) Speakers 3) Oraters
వీరిని తెలుగులో చెప్పాలంటే 1) మాట్లాడేవారు 2) ఉపన్యసించేవారు 3) వక్తలు అని చెప్పవచ్చు. మాట్లాడేవారంటే, ఎవరైనా మాట్లాడవచ్చు. ఇలాంటి మొక్కువారు మనకు ఎక్కువగా తగులుతారు. వీరుబడిగా నాలుగు మాటలు మాట్లాడుతారు. మాట్లాడినా,అందులో రుచీ పచీ వుండదు.స్వాగతోపన్యాసం చెప్పడం వరకోచేయడం వరకో పనికి వస్తారు.వీరు సాధారణ వందనసభలలో సమర్పణఇక తరువాతి వారు ఉపన్యాసకులు, లేదా స్పీకర్స్, వీరు బాగా మాట్లాడే వారి కింద లెక్క. ఇక మూడవ వర్గం గొప్ప వక్తలు, లేదా ఆరేటర్స్. వీరి సంఖ్య చాలా తక్కువ గానే వుంటుందని చెప్పాలి. వీరు మహోపన్యాసకులు.
ఇంతకు పూర్వమే చెప్పినట్టు, శ్రోతలను ఆకర్షించే ఒక ముఖ్యమయిన పద్దతి.. మీరింకా మాట్లాడాలని శ్రోతలు అనుకుంటున్నప్పుడే అంటే మీరు ఆపివేస్తే బాగుండునని శ్రోతలు అనుకొనక ముందే మీరు ఉపన్యాసం ఆపి వేయ డం మంచిది. ఇది ఉపన్యాసకుడి లక్షణం. ఎంత మంచి ఉప న్యాసకుడయినా శ్రుతిమించి మాట్లాడితే, అతడి ఉపన్యాసం “నోరు” కొడుతుంది. ఎంత తీసి లడ్డూలయినా ఒక పరిమితివరకే బాగుంటాయి. హద్దు దాటితే అవి కూడా ముఖం మొత్తుతాయి; వెగటు పుట్టిస్తాయి.
ఉపన్యాసం కూడా అంతే. అందులోనూ ఈ రోజు లలో ఉపన్యాసం వెనుకటివలె కాక, క్లుప్తంగా వుండాలి లోగడ అయితే, గంటల తరబడి మాట్లాడినా విసుగు.. విరామం లేకుండా వినేవారు. ఇప్పుడలా కాదు — అరగంట మాట్లాడితేనే భరించలేని పరిస్థితి ఏర్పడింది.
ఇందులో కూడా. ఒక తేడా వుంది — ఉపన్యాసకుల సంఖ్య ఎక్కువగా వుంటే, మనం మరీ తక్కువగా మాట్లా డితే, ఆ మాట్లాడిన కొంచెంసేపటిలోనే మంచి పాయింట్లు కొన్ని హాస్యోక్తులు, ఛలోక్తులు చెబితే ఉపన్యాసం బాగారాణిస్తుంది.అంతేకాదు. మన ఉపన్యాసం మధ్యలో అకస్మాత్తుగా ఏదో జోక్ ఏదో అభిప్రాయం పేలితే, వెంటనే ప్రేక్షకు లకు నమస్కరించి కూర్చుంటే, అది చాలా నాటకీయంగా వుంటుంది. మనం ముందుగానే అలా ప్లాను వేసుకుని వచ్చామని ప్రేక్షకులు భావిస్తారు.
చప్పట్ల ఉపన్యాసాలు
అయితే, కొందరు కొందరు ఉపన్యాసకులు ఒక పొరపాటు చేస్తారు. వారి ఉపన్యాసం ముగుస్తున్న పే వుంటుంది; తిరిగి మొదటికి వస్తారు. మళ్ళీ చివరకు, తిరిగి మొదటికి…. ఇది అలాంటి ఉపన్యాసకుణ్ని ఉపన్యాసకుడి చెడ్డ లక్షణం, ప్రేక్షకులు ఏవగించుకుంటారు. ఈ మహానుభావుడు ఎప్పుడు ముగిస్తాడా? అని ఎదురుచూస్తూ వుంటారు. అంతేకాదు, ఇంకా కొంచెం ఆలస్యం చేస్తే, చప్పట్లు కొట్టి కూర్చోపెడ
తారు.
చప్పట్లు అంటే జ్ఞాపకం వచ్చింది. కొందరు మాట్లాడు తుంటే, బోరుకొట్టి ప్రేక్షకులు చప్పట్లు కొడతారు, ఇక చాలుసిని. కాని కొందరు అవి హేళన ధ్వనులవి తెలుసు కొనక, హర్షధ్వానాలుగా అపోహపడి, ఉపన్యాసాన్ని ఇంకా కొనసాగిస్తారు. తిరిగి ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. ఉపన్యాపకుడు తన ఉపన్యాసం ప్రేక్షకులకు ఎప్పుడు మొహం మొత్తుతుందో తెలుసుకోగలగాలి. ఉపన్యాసకుడికి చాదస్తం ప్రథమ శతృవు.
ఏ పరిస్థితిలోనూ ప్రేక్షకులను నిందించడం, హేళన చేయడం పనికిరాదు. అది ఉపన్యాసకుడికి ప్రమాదం తెచ్చి పెడుతుంది. ప్రేక్షకులను ఎంతవరకూ అనునయంగా, గౌర వంగా, వినయంగా లోబరచుకోవడానికి ప్రయత్నించాలిగాని వారికంటె తాను తాను అధికుడనని, వారికేమీ తెలియదని, మూర్ఖులని, తెలివితక్కువవారని, తాను చెప్పేది అర్థంచేసు కోలేక పోతున్నారన్న భావంతో మాట్లాడితే, వారు సహించరు.
ముఖ్యంగా విద్యార్ధుల సభలో మాట్లాడేటప్పుడు మరీ జాగ్రత్తగా వుండాలి. కేవలం జోక్, హాస్య ఉపమానాలు,ఇతరులపై చురకలు, కొంచెం శృంగార మిళితమైన మాట లను మాత్రమే వారు హర్షిస్తారు. అడుగడుగునా వారిని కవ్వించని ఉపన్యాసం, కొంచెం దీర్ఘమైన ఉపన్యాసం వారికి “ను త్తి”. అదే విధంగా వారికి హితోక్తులు పనికిరావు – చలోక్తులు తప్ప. వారికి ఆస క్తి గొలిపితే, ఎంతసేపయినా వింటారు.
ఒక్కొక్క పాట నెమ్మదిగా ఎత్తుకుని, మధ్యలో శ్రుతి పెంచి, చివరికి ఉచ్చై స్వరంతో ముగిస్తే ఎలా హర్షధ్వానాలు వస్తాయో, ఉపన్యాసం కూడా అలాగే వుండాలి.
హాస్యం, ఉపమానాలు
ఒకప్పుడు మన దేశంలో అనర్గళంగా, నాన్ స్టాప్మాట్లాడమే వక్తృత్వలక్షణం.అలామాట్లాడుతుం పేశ్రోతలు నోరు తెరచుకొని వినేవారు.ఇప్పుడు అలాకాదు. ఉపన్యాసంలో మధ్య మధ్య హాస్యం, వ్యంగ్యం, విరుపులు, చురకలు, ఛలోక్తులు వుండి తీరాలి. లేకపోతే ఎంత అనర్గళంగా మాట్లాడినా ఉపయోగం లేదు. ప్రేక్షకులను ఆకట్టుకోదు.ఇప్పుడు సినిమాలు,వ్యాప్తిలోకి నచ్చినందున సుదీర్ఘంగా, చప్పగా వుంటే
టీ.వీ.లు పత్రికలు బాగా ఇదివరకటి వలె ఉపన్యాసాలు ప్రేక్షకులు సహించరు.
ఉపన్యాసం ఇప్పుడు ఏదో వ్యాసాన్ని చదివినట్టు వుంటే లాభం లేదు. ఈ రోజులలో ఏమి చెప్పారనే దానికంటె ఎలా చెప్పారన్న దానికే ప్రాధాన్యం!ఉపన్యాసంలో హాస్యం లేకపోతే, అది హాస్యాస్పదమే అవుతుంది. సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడినప్పుడు మీ ఉపన్యాసాన్ని కొంచెం హాస్యోక్తులతో ప్రారంభిస్తే, అది బ్రహ్మాండంగా పేలుతుంది.అయితే, హాస్యరసం ఎంతవరకు వుండాలో అంతవరకే వుండాలి. అది ఎక్కడ అతుకుతుందో అక్కడే వుండాలి. గంభీర సన్ని వేశంలో హాస్యరసాన్ని వుపయోగిస్తే, రసాభాసఅవుతుంది.https://pincodesguide.in/llal-bahadur-shastri-is-gret-polotician/
వాజ్ పేయ్ చురక
సభలో ఉపమానాలు చెప్పవచ్చు, చిన్న పిట్టకథల వం టివి చెప్పవచ్చు. అని అతిదీర్ఘంగా, విసుగుపుట్టించేవిగా వుండ రాదు. హాస్యంకోసం హాస్యం, కథ కోసం కథ కాకుండా అది చెప్పే విషయంలో సన్నిహితంగా వుండాలి. దాని మొదలు, చివర కూడా ఉపన్యాసంలో అతికిపోవాలి.
ఒకసారి ప్రముఖ పార్ల మెంటేరియన్ శ్రీ అటల్ బిహారి వాజ్ పేయ్ అప్పటి రైల్వేమంత్రి శ్రీ జగజీవన్ రాము ఆయన హయాంలో రైలు ప్రమాదాలు తున్నవని చెప్పడానికి “జగజీవనామ్” రామ్ రిరైళ్ళు ఎక్కితే “జగమే జీవన్ఎక్కువగా జరుగు పేరుతోనే జగజీవన్ రామ్ రామ్” అనేసరికి పార్లమెంటులోని ప్రతిపక్ష సభ్యులు హర్షధ్వానాలు చేశారు. అంటే జగజీవన్ రామ్ గారి ప్రపంచం నుంచి జీవితానికే రామామ్” అని అర్థం!ఉపన్యాసకునికి అలాంటి “గిమ్మిక్స్” తెలిసి వుండాలి. అని అతడి ఉపన్యాసం రాణించడానికి ఎంతో వుపయోగపడతాయి.
ఉపన్యాస శైలి
ఉపన్యాసకుడికి సొంత శైలి ఏర్పడ్డం అవసరం. ఉప న్యాసకుడు మరొకరిని అనుకరించడానికి ప్రయత్నించడం మంచిదికాదు. ఉదాహరణకు పెద్దగా చదువుకొనకపోయినా మన నటులలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు మంచి ఉపన్యా సకుడు ఆయనది ఒక ప్రత్యేకశైలి. అలాగే మన సంజీవరెడ్డి మన గోపాలరెడ్డి, ఆచార్యరంగా, పప్పూరి రామాచార్యులు, కల్లూరి సుబ్బారావు చెరుకువాడ నరసింహంగారు ఎవరి శైశైలి వారిదే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. అందువల్ల మీ శైలిని మీరు అలవర్చుకోండి.
బ్రిటిషు మాజీ ప్రధాని చర్చిల్ మాట్లాడుతుంటే “ఓహో అటుపిమ్మట” అన్నట్టు నాటకీయ పక్కీలో ఉండేదట ! ఇక వి. కె కృష్ణమీనన్ మాట్లాడుతుంటే “నీ సంగతి కనుక్కుం టాను” అన్నట్టుగా వుండేది. ఇందిరాగాంధీది “ఫైటింగ్ స్పీచ్” ఇక రాజీవ్ గాంధీది అవతలి వారిని తన వాదం వైపు లాక్కొనడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వుంటుంది. ఎవరి శైలి వారిదే దేని ప్రత్యేకత దానిదేఉపన్యాసాలలో ఎన్నిరకాలు ఎన్ని రైలులు వున్నా, మామూలుగా ముఖాముఖి సూట్లాడుకునే ఫక్కిలో ఉపన్య సిస్తే అది బాగా రాణిస్తుంది. వెనుకటిపలె చెరుకువాడ వారి సుబ్బారావుగారి శైలిలోనే మాట్లాడతేవలెనో కల్లూరి ఇప్పుడు లాభంలేదు చిన్న చిన్న వాక్యాలు ఇప్పుడు ఉపన్యాసంలో బాగా ఆకర్షిస్తాయి.
చిన్న మాటలు
బ్రిటస్ లో బర్క్, షెరిడన్, గ్లాడ్సన్లు మహావక్తలు. వారివలె ఇప్పుడు ఉపన్యసించడం సాధ్యంకాదు. వాంఛనీయం కూడా కాదు. చెరుకువాడవారి ఉపన్యాసంలో వాక్యాలు సుదీర్ఘంగా వుండేవి. భారతదేశంలో ఇంగ్లీషు ప్రవేశ పెట్ట దానికి కారణభూతులయిన లార్డు మెకాలే ఉపన్యాసంలో ఒక్కొక్క వాక్యంతో సగటున 23 పదాలుండేవని అంచనా ఆ ఫక్కీ ఇప్పుడు చాలా పాతది.మీ ఉపన్యాసం అనగానే అది ఫలానా విదంగా వుం మీ టుంది ఆకర్షణీయంగా వుంటుంది అని ప్రేక్షకులు ముందు గానే అనుకోవాలి.
సభ స్వరూప స్వభావాలు
పోతే ఉపన్యాసకుడు ఎంత గట్టివాడైనా సభ స్వరూప స్వభావాలపైనకూడా అతని సాఫల్య వైఫల్యాలు ఆధారపడి వుంటాయి.సభలో ముందువరసలలో కుర్చీలు ఖాళీగావుండి వెనుక వరుసలలో నిండుగావుంటే ఉపన్యాసకుడికి నిరుత్సాహంకలుగుతుంది. మంచి ఉపన్యాసకుడు – సభ నిండుదనాన్ని బట్టి విజృభిస్తాడు. ముందు వరుసలు ఖాళీగా వుంటే, అందు వల్ల ప్రేక్షకులకు, ఉపన్యాసకులకు మధ్య అఖాతం ఏర్పడుతుంది.
అందువల్ల, చిన్నహాలు, ఎక్కువమంది ప్రేక్షకులవల్ల. ఉపన్యాసం రక్తి కడుతుంది. కొందరికి సీట్లు చాలక, వారు నిలబడి వుంటే, సభ రక్తికడుతుంది. జనం ఎంత ఎక్కునగా వుంటే, చిన్న జోకుకూడా వారు అంతగా ప్రతిస్పందిస్తారు. సభ జయప్రదం కావలెనంటే, పిల్లలు, పసిపిల్లలు ముందు వరుసలలో కూర్చొనకుండా చూడాలి. అందువల్ల ఉపన్యాసకునికి ఉత్సాహం సన్నగిల్లుతుంది. అదే విధంగా వేదిక పై అనవసరమైనవారు వుండకూడదు.
ఒకరు ఉపన్యసిస్తూ వుంటే, కొందరు ఆయన వద్దకు వచ్చి అనవసరంగా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు. అందు వల్ల ఉపన్యాసకుని భావస్రవంతికి అవరోధం కలిగి తిరిగి తెగిన ఉపన్యాస దారాన్ని కలుపుకొనడానికి ఇబ్బంది పడ తాడు. ఉపన్యాస సమయంలో ఏ పరిస్థితిలోను కరపత్రాలో, కూల్ డ్రింకులో, సన్మాన పత్రాల కాపీలో సభలో పంచిపెట్ట నివ్వరాదు. ఉపన్యాసకుని ఉపన్యాసం నుంచి ప్రేక్షకుల దృష్టి మరల్చడానికి ఇంతకు మించిన విజయవంతమయిన మార్గం లేదు!మైకును బట్టికూడా ఉపన్యాసం సాఫల్య వైఫల్యాలు ఆధారపడి వుంటాయి. ఎంత మధురంగా పాడినా, సరిగారికార్డు కాకపోతే, వుపయోగం లేదు కదా!
మరొక విషయం ముందుగా మాట్లాడే ఉపన్యాసకుడు. మాట్లాడినా ఆఖ రుస మాట్లాడే ఉపన్యాసకుడు మాట్లాడితే, అది ప్రేక్షకుల మనసులలో నాటుకుం టుంది. నిలిచిపోతుంది. అందువల్ల ఆఖరున మాట్లాడడం ఒకవిధంగా వాంఛనీయంవీలయినంతవరకు ప్రేక్షకులను వేరు చేసి మాట్లాడ కూడదు. వీలయినంతవరకు “మనం” అనాలి. కానీ, “మీరు అనకూడదు. ఉదాహరణకు :- మన దురలవాటునో, మరొక దాన్నో విమర్శించవలసినస్తే, ఉపన్యాసకుడు తనను కూడా కలుపుకుని, “మనం” అంటే బాగుంటుంది. అంతేకాని, తానేదో ఆకాశం నుంచి దిగివచ్చినట్టు — సభాసదులు ఈ భూమిపై వుండే అల్ప జీవులైనట్టు మాట్లాడడం ప్రమాదకరం.
సభను బట్టి ఉపన్యాసం
ఇక చిన్న చిన్న హాల్సులో జరిగే సభలకు, ఓవెన్ ఎయిర్లో జరిగే సభలకు చాలా తేడా వుంటుంది. ఓవెన్ ఎయిర్ సభలలో ఉపన్యాసకుడు తన ప్రజ్ఞా విశేషాలను, వక్తృత్వ విభవాన్ని ప్రదర్శించడానికి పూర్తిగా అవకాశం వుంటుంది. చిన్న హాలు మీటింగ్ లో మాట్లాడే ఫక్కినే ఉప న్యాసకుడు ఓపెన్ ఎయిర్ సభలో ఉపయోగిస్తే రాణించదు. ఉపన్యాసకుడు తన విశ్వరూపం చూపించడానికి బహిరంగ సభ చక్కని వేదిక.
కొన్ని మెలకువలు
ఆధునిక ప్రపంచంలో ఉపన్యాసకునికి మంచి విలువ “నేడు నోరున్న వాడిదే రాజ్య” మన్నాడు ఒక ప్రఖ్యాత రాజకీయనేత.నేడు లాయర్లు, మతాచార్యులు, లెక్చరర్లు, మంచి ఉపన్యాసకులు సమాజాన్ని పాలిస్తున్నారు. కేపలం వాగ్దాటి వారి ఆస్థి, సాధారణంగా ఇంజనీర్లు, వ్యాపారస్తులు, కార్మి కులకు ఈ శక్తి వుండదు.1) హెచ్చుగా సభలలో మాట్లాడడం వల్ల ఉపన్యాస శక్తి పెరుగుతుంది. ఇందుకు డిబేటింగ్ సొసైటీలలో లేదా- సాహితీ సంస్థలలో చేరి తరుచుగా మాట్లాడడం అలవరుచుకోవాలి.
2) ఇంతకుముందే చెప్పినట్టు – ఓపెన్ ఎయిర్ సభలలో ఉపన్యసించడం వల్ల, ఉపన్యాసకుని శక్తి పెరుగు తుంది. ముఖ్యంగా మిమ్మల్ని ఎక్కడైతే అవహేళన చేస్తారో, అక్కడే నిలబడి మాట్లాడాలి. ఎవరో ఏదో అన్నంత మాత్రాన ఉపన్యాసం ఆపివేయకూడదు. మిమ్మల్ని సభలో నుంచి ఎవరో ఏదో అంటే, ప్రేక్ష కులు ఎలా నవ్వుతారో ఆ హేళన చేసిన వ్యక్తిపై మీరు ఒక చిన్న జోక్ విసిరినా, ప్రేక్షకులు మీ జోక్నే హెచ్చుగా హర్షిస్తారు!
3) ఉపన్యాసగునిలో ఆవేశం, ఉద్వేగం ఆవసరం. అవి లేకపోతే, అతడు అవసరమైనప్పుడు సభను ఎదు ర్కొనలేడు.ఉత్తమ నటుని లక్షణం రంగస్థలంపై అతని ప్రవేశ, నిష్క్రమణలలోనే కనిపిస్తుందని లాక్షణికుల అభిప్రాయం 4) అదే విధంగా ఉత్తమ ఉపన్యాసకుని లక్షణం కూడా అతడు ఉపన్యాసం ప్రారంభించి, ముగించే పద్దతిలోనే తెలిసిపోతుంది. జాన్ బ్రైట్, గ్లాడ్లైన్, వెబ్ స్టర్, అబ్రహాం లింకన్ మొదలయినవారు తమ ఉపన్యా సాన్ని ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో ముందే నిర్ణయించుకునేవారట!
5) ఉపన్యాసంలో మనపై మనం “జోక్” వేసుకోవడం ప్రేక్షకులకు ఆకర్షణ. అయితే, అది మనల్ని మనం న్యూనత పరచుకునేదిగా వుండకూడదు. అదేవిధంగా సొంత అనుభవాలను ఉపన్యాసకుడు చెబితే, అవి ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తాయి. అయితే, వాటిలో స్వోత్కర్ష ధ్వనించకూడదు.6) ఇంతకు ముందు చెప్పినట్టు, మీ ఉపన్యాసంలోని ఆఖరు వాక్యం ప్రేక్షకులను సవ్వించాలి. అది వారి మనసులో నాటుకుపోవాలి; అది ఎలా వుండాలో ముందే నిర్ణయించుకోవాలి. ఉపన్యాసం ముగియగానే కులు ఎలాగూ సంప్రదాయం ప్రకారం చప్పట్లు కొడ ప్రే తారు. కొన్ని సందర్భాలలో అయితే, “అమ్మయ్య అయిపోయింది. బ్రతుకు జీవుడా” అనికూడా చప్పట్లుకొడతారు. మీకు కావలసింది పట్టి చప్పట్లుకాదు, హర్ష ధ్వానాలు! మీ ఆఖరి వాక్యం వారిలో కలిగించే హర్షాతి రేకంతో వచ్చే చప్పట్లు!
7) ఉపన్యాసకుడు తడుముకోకుండా మాట్లాడడం చాలా ముఖ్యం. తడుముకుంటూ, తడబడుతూ మాట్లాడేవాడు ఉపన్యాసకుడే కాదు. అతడికి మాట వెంట మాట చక చకా ధారాప్రవాహంగా వచ్చి వేయాలి. ఇందుకు వార్తా పత్రికా పఠనం ఎంతో తోడ్పడుతుంది.అయితే, కేవలం పత్రికా పఠనం చాలదు పత్రికలలోని రాజకీయ పదజాలాన్ని హృద్గతం చేసుకోవాలి; కంఠస్థం చేస్తే మరీ మంచిది. అలా కొన్ని వేల పదాలను సొంతం చేసు కోవాలి. ఇది చదవడానికి కొంత భయంగా కనిపించవచ్చు.
కాని, వార్తాపత్రికలను బాగా చదువుతూ, వాటిలోని కొన్ని ముఖ్యమైన మాటలను నోటికి, మనస్సుకు పట్టించు కోవాలి.
8) మనం సినిమాలు చూస్తూవుంటాం, శ్రీవాటిలో ఆరితేరిన – చెయ్యి తిరిగిన-రచయితలు వ్రాసిన సంభాషణలు జాగ్రత్తగా వింటే, అవికూడా ఉపన్యాసకుని భాషను పరిపుష్టం చేయవచ్చు. ఆ మాటలను మనం జ్ఞాపకం – పెట్టుకుని, తర్వాత రెండు, మూడుసార్లు మననం చేసు కుంటే, అవి మన సొంతం అవుతాయి. అందువల్ల. ఉపన్యాసకునికి మైక్ ముందు మాట్లాడే ధైర్యం: తరు వాత, అతనిలోని పదసముదాయం చాలా ముఖ్యం. దీని నే ఇంగ్లీషులో “ఒకాబులరీ” అంటాం. నే9) ఉపన్యాసంలో ఒకే పడికట్టు రాళ్ళవంటి మాటలను పదేపదే వాడరాదు; అందులోను ఒకచోట వాడిన మాటలను తిరిగి త్వరలోనే అక్కడే వాడకూడదు.
ఒక ఉపన్యాసకుడు పేదప్రజల దుస్థితిని వివరించడానికి “జీర్ణించి, శీర్ణించి, కృలంగి కృశించి, నశించిపోతున్న ఆ దళిత, దరిద్ర, తాడిత, పీడిత ప్రజానీకం” అన్న మాటలను ఏ ఉపన్యాసంలోనైనా వాడుతూ వుంటాడు. అలాంటి ఉప న్యాసమును రెండుసార్లు వినేసరికి, అతడు ఏమి మాట్లాడు తున్నాడో శ్రోతకు ముందే తెలిసిపోతుంది. ఒక చిట్కా
10) ఇక ఉపన్యాసధోరణి అలవడ్డానికి మరొక చిట్కా వుంది. మరేమీలేదు ఒంటరిగా, ఒక ప్రశాంతమైన స్థల ములో ఎవ్వరూ లేనిచోట నిలబడి, వార్తాపత్రికను బిగ్గ రగా పైకి చదవాలి. అలా కొంతకాలం చేస్తే, అందు వల్ల ఉచ్చారణ స్ఫుటంగా వుండడానికి, నట్లు పడ కుండా మాటలు ఉచ్చరించడానికి వీలవుతుంది. ఉప న్యాసాలు ప్రారంభించే దశలో వున్నవారికి ఈ “ఎక్సర్ సైజు” ఎంతయినా తోడ్పడుతుంది. 11) ఉపన్యాసం రాణించడానికి కొన్ని పద్దతులు వున్నాయి ఉపన్యాసకుడు తన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ వేదిక పై వున్న వారిని “సభాధ్యక్షా!” వారు, వీరు అంటూ సం బోధిస్తాడు కదా!అప్పుడే వేదిక వైవున్న వారిని గురించి కొన్ని వర్ణనలు విశేషాలు ఉపయోగిస్తే అవి ప్రేక్షకులను ఆకర్షిస్తాయి; యి; ఉప న్యాసకులపట్ల ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ తర్వాత అతడు ఏమి చెబుతాడా? విందామన్న ఆకర్షణ ఏర్పడుతుంది; పలి కులు ఆయనపై దృష్టిని నిగుడిస్తారు.
సమయ స్ఫూర్తి :
12) ఉపన్యాసకునికి సమయస్పూర్తి అత్యవసరమని ఇది వరకే చెప్పుకున్నాం. సఖికులలో ఎవరైనా ప్రశ్నిస్తే. దానికి ఠపీమని జవాబు చెప్పగలిగే శక్తి అవసరంఉదాహరణకు, ఈ రచయిత ఒక సభలో మాట్లా డుతూ అప్పుడు వివాదస్పదమైన ఒక సమస్యపై ఒకానొక రాజకీయవేత్తను సమర్దించేసరికి సభికులలో ఒకరు ఆ రాజ కీయవే తను వ్యతిరేకించేవారు లేచి, “ఇలా వెనుక వేసుకు వచ్చినందుకు ఆ రాజకీయవే త మీ కెంత డబ్బు ఇచ్చా”రని ప్రశ్నించాడు!”ఈ ప్రశ్న వేసినందుకు ఆ రాజకీయవేత్త ప్రత్యర్థులు మీకిచ్చిన సొమ్ములో సగం!” అనేసరికి సఖికులు చేసిన హర్ష ధ్వానాల మధ్య ఆ ప్రశ్న వేసిన వ్యక్తి తల వంచుకుని, కొంత సేపటికి తానుకూడా ఆ హర్షధ్వానాలలో, నవ్వులలో శ్రుతికలిపారు.
13) ఉపన్యాసకుడు సభాధ్యక్షుని విమర్శించడం మర్యాద కాదు. సభాధ్యక్షుడు సభాపతి. మొత్తం సభకు ప్రతి నిధి. సభాధ్యక్షుని విమర్శించడం మొత్తం విమర్శించడం!14) అలాగే సభాధ్యక్షుడుగా వున్న వ్యక్తి తాను వివాదా స్పదమైన విషయాలలోకి వెళ్ళి, తరువాత ఉపన్యాస కులు తనను విమర్శించే పరిస్థితి తెచ్చుకోకూడదఉపన్యాసకుడు సభికుల విజ్ఞతను, యుక్తాయుక్త విచ క్షణా శక్తిని ఎప్పుడూ విమర్శించకూడదు.
15) ఇప్పుడు వందన సమర్పణ కూడా ఒక ఉపన్యాసంవలె చేస్తున్నారు. అప్పటికే చాలినన్ని ఉపన్యాసాలను విన్న శ్రోతలు వందన సమర్పణ చేసేవారు కూడా తిరిగి ఉపన్యాసాన్ని ప్రారంభిస్తే, లేచిపోవచ్చు. వందన సమర్పణ కూడా ఆసక్తిగా వుంటే కాని శ్రోతలు కూర్చోరు.16) సభాధ్యక్షుడు తన తొలి పలుగులలోను, మలి పలుకుల లోను సుదీర్ఘ మైన ఉపన్యాసాలు చేయడం మంచిది కాదు. అధ్యక్షుని తొలి పలుకులే ఒక సుదీర్ఘపన్యాస మైతే, అది తక్కిన ఉపన్యాసకులకు ఇబ్బంది కలిగి స్తుంది. సథ చకచకా నడిచిపోవాలని ప్రేక్షకులు కోరు తారు. తర్వాతి ఉపన్యాసకుల ఉపన్యాసాలను వినాలని వారు ఆరాటపడతారు. అందుకు అధ్యక్షుడు ఎక్కువ సేవు అవరోధంగా వుండకూడదు. అలాగే అధ్యక్షుని మలి పలుకులు కూడా- మరొక మహోపన్యాసం కాకూ డదు. అందువల్లనే వాటిని “తొలి పలుకులు”, “మలి పలుకులు” అన్నారు.
17) ఒక ప్రముఖుని సభలో పరిచయం చేసే ఉపన్యాస కుని ఉపన్యాసం సుదీర్ఘంగా వుండకూడదు. అందువల్ల, ఆ అసలు వ్యక్తికి ఇబ్బంది కలుగుతుంది.ప్రాచీన భారతంలో ఉపన్యాస ప్రక్రియ లేదని చెబుకారు అది తరువాత, తర్వాత ముఖం్యగా మన స్వాతం త్ర్యోద్యమ సమయంలో బాగా అభివృద్ధి చెందింది.
ఉపన్యాసాల రికార్డులు :
గంటల తరబడి ఉపన్యాసాలు చేసేవారు మనదేశంలో చాలామంది వున్నారు. 1920 దశకం చివరలో కేంద్ర శాసన సభలో పండిట్ మదనమోహన్ మాలవ్యా కార్మిక వివాదాల బిల్లుపై మూడు రోజులు (రాత్రిళ్ళు మినహా) ఉపన్యసించారు.అలాగే 1946లో బొంబాయి అసెంబ్లీలో కమ్యూ నిస్టు నాయకుడు శ్రీ ఎస్ ఎ. డాంగే ప్రజాశాంతి రక్షణ బిల్లుపై అయిదు గంటలసేపు ఏకధాటిగా ప్రసంగించారు! 1948లో బ్రిటిష్ కామన్సు సభలో ఇండియా స్వాతం త్యం బిల్లుపై అప్పటి బ్రిటిష్ వాణిజ్య మంత్రి సర్ స్టాఫర్డ్ -క్రిప్స్ ఆరు గంటలసేపు అనర్గళంగా ఉపన్యసించాడు!
ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ సమస్యపై అప్పటి పాక్ విదేశాంగ మంత్రి సర్ మహమ్మద్ జఫుల్లాఖాన్ అయిదారు గంటలసేపు గంటల సేపు ప్రదర్శించిన అనర్గళ వాగ్దాటికి మన ప్రతినిధి శ్రీ ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ తట్టుకోలేకపోయారు. అప్పుడు ఇండియా అటార్ని జనరల్ శ్రీ సెతల్వాడ్ను ఐక్య రాజ్యసమితికి పంపారు, ఆయన కూడా అయిదారు గంటలు అనర్గలోపన్యాసం చేశాడు!
అయితే, వీరందరికంటె హెచ్చు కాలు – ఏడు గంటల సేపు – సమితిలో ఉపన్యాసం చేసిన ఘనత ఇండియా ప్రతినిధి శ్రీ వి. కె. కృష్ణమీపని. ఆయన తన ఉపన్యాసం చివర అలసి, కొంచెంసేపు స్పృహతప్పి పడిపోయారు కూడా.మొత్తం మీద తేలిందేమిటంటే, ఉపన్యాసకుడు 1) సఖా పిరికితనాన్ని పారద్రోలాలి. 2) భాషా పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం వుండాలి 3) తాను చెప్పదలచుకున్నది శ్రోతలకు ఆకర్షణీయంగా చెప్పాలి.
ప్రఖ్యాత గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ అన్నట్టు”The test of excellence is pleasure”.ఎలా చెప్పినా సభ్యతకు, సభా మర్యాదకు విరుద్ధం కాకుండా, ప్రేక్షక జన రంజకంగా చెప్పగలిగినవాడే ఉప న్యాసకుడు!
అందుకు ఈ చిన్న పుస్తకంలోని సూచనలు, సలహాలు ఏ కొంత వరకయినా వుపయోగపడితే, ఈ పుస్తకానికి సార్థకతే!
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> THE END <<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<