Lal Bahadur Shastri is a great

Lal Bahadur Shastri great second  Prime Minister of India

Lal Bahadur Shastri పవిత్రమైన పుణ్యక్షేత్రము కాశీకి సమీపములో గల మొగల్ సరాయ్ 1904 అక్టోబరు రెండవ తేదీన ఒక మధ్యతరగతి కుటుంబంలో, శారదాప్రసాద్, రామదులారి దేవీలకు మన గత ప్రధాన మంత్రి జన్మించాడు. శ్రీ వాస్తవ వంశమునకు చెందినవాడు Lal Bahadur Shastri . ఈ శాస్త్రి అన్నపదం బ్రాహ్మణ కులానికి గుర్తు. కానీ వీరికి మాత్రం కాశీ విద్యాపీఠము శా స్త్రి అన్న డిగ్రీనివ్వడం జరిగింది.
తండ్రి శారదాప్రసాద్ ఎలిమెంటరీ పాఠశాలలో ఉపా ధ్యాయునిగా పనిచేసేవాడు. తర్వాత అలహాబాదు రెవిన్యూ శాఖలో కొంతకాలం గుమాస్తాగా పనిచేసి కుమారుడు పుట్టిన సంవత్సరం ఆరు మాసాలకే మరణించాడు. అప్పుడు తల్లికి ఇరవై ఏండ్లు. ఇద్దరు కుమార్తెలనూ, శాస్త్రినీ వెంట పెట్టుకుని భర్త మరణంతో తిరిగి మొగల్ సరాయ్ చేరుకుంది

 Lal Bahadur Shastri,

రాష్రులారీదేవి తండ్రి హజరీలాల్ పెద్దగా స్థితిమం తుడు కాడు. పైగా ఆయనది పెద్ద కుటుంబము. అన్నదమ్ముల పిల్లలు కూడా ఆయన వద్దనే వుంటూండేవారు. ఆయన చాలా గొప్ప మనిషి. నిస్వార్ధపరుడు, అవసరాలూ, ఆదా యం మాటెలావున్నా తన సంపాదనతోనే తృప్తిపడుతూ, ఒకరిని బాధించక, తన బాధ్యతను తను సక్రమంగా నిర్వ ర్తించే మనిషి.అయినా, గంపెడు సంసారాన్ని మోస్తూ కూడా ప్రేమ, ఆప్యాయతలకు లోటు చేసేవాడు కాడాయన. కూతురు బిడ్డ యైన శాస్త్రిని ఆయన ఎంతో ప్రేమగా చూసేవాడు. Lal Bahadur Shastri ఆయనకు ముద్దుల మనుమడు. Lal Bahadur Shastri ఆయన ప్రేమ వాత్స ల్యాలలో తనకు తండ్రి లేడన్న లోటు కనిపించకుండా పెరిగాడు.

మొగల్ సరాయిలోని పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తిచేసిన Lal Bahadur Shastri పై చదువులకు మళ్ళీ తన పినతల్లి ఇంట్లో వుండి విద్యాభ్యాసం సాగించాడు. పినతండ్రి కాశీ పురపాలక సంఘములో హెడ్ గుమాస్తా. ఆయన పేరు రఘునాధ్ ప్రసాద్. ఆయన ఆదాయం అంతంత మాత్రం గానే వుండేది. అయినా వీరి కుటుంబాలు ఆదర్శవంతమైన కుటుంబాలు ప్రేమ, దయ సహకారం వీరికి ఉగ్గుపాలతోఅబ్బిన సద్గుణాలు. రిటైరై కొద్దిపాటి ఫింఛనుతో జీవితము గడపలేక ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడాయన.

ఆయన నీతి నిజాయితీలకు మారు పేరు. మించిన నిస్వార్థపరుడు. మూర్తీభవించిన ఆయనలోని మాన సతా సద్గుణాలన్నీ, వారింట వుండి విద్యాభ్యాసం చేసేLal Bahadur Shastri కి అలవాటయ్యాయని చెప్పాలి.మహానాయకులు కూడా ఒకనాటి విద్యార్దులే. వారికి విద్యార్ధి దశలో పెంపక విధానం, పెంచేవారి గౌరవాదర్శాల మీదా, వారి భవిష్యత్ ఆధారపడి యుంటుంది. మహాత్ముల సాంగత్య, సహచర్యాలలో పెరిగినవారు మహాత్ములై, చరిత్ర పురుషులయ్యారు.

Lal Bahadur Shastri చిన్నతనం నుంచి చాలా పొట్టిగా పుండేవారు. అయినా బుద్ధికుశలతతో మాత్రం సీమ మిరప కాయను మించి వ్యవహరించేవాడు. ఉపాధ్యాయులు ఏ విష యమైనా ఒకసారి చెప్పినంతమాత్రాన అర్థంచేసుకోగల కుశా గ్రబుద్ధి_పినతండ్రి రఘునాధప్రసాద్ గారి పిల్లలతోపాటు జెనా రస్ హరిశ్చంద్ర స్కూలులో విద్యాభ్యాసం చేసేవాడు. పాఠ శాలలో విద్యార్థులూ, అధ్యాపకులకూ అందరికీ Lal Bahadur Shastri తెలివి తేటలన్నా, అతని ప్రవర్తనన్నా ఎంతో గౌరవ

 Lal Bahadur Shastri family,

Lal Bahadur Shastriసహజంగా తాను పొట్టివాడని తెలిసినా, యెవ రయినా ఆ మాట అన్నప్పుడు నవ్వుతూ తన పొట్టితనాన్ని గురించి చాలా చమత్కారంగా మాట్లాడేవాడేకాని, పొట్టిఅన్నందుకు అనవసరంగా బాధపడేవాడు మాత్రం కాదు. తన ఆకారానికి తనలో తనే నవ్వుకునేవాడు. Lal Bahadur Shastri కి చిన్న తనం నుంచీ ఆంగ్లభాషంటే ప్రత్యేకాభిమానం. ఆయనకు చరిత్ర పట్ల యింకా అభిమాన మెక్కువ. ఇంగ్లీషు మాట్లాడే విధానంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన సరళి వుండేది.

ఆయన నాల్గవ తరగతి చదువుచున్నప్పుడే Lal Bahadur Shastri కి ఇంగ్లీషు భాషపైయున్న వ్యామోహాన్ని అందులో అతనికి గల ప్రావీణ్యాన్ని చూసి పరీక్షాధికారి యెంతో సంతోషించా డట. చిన్నతనంలో పిల్ల లందరితో కలిసి, ఆట పాటలలో పాల్గొనేవాడాయన. క్రికెట్, ఫుట్బాల్ వంటి ఆటలంటే ఆయనకెంతో యిష్టం. ఖర్జూర పువ్వులకు పైన గుడ్డ చుట్టి బంతులుగా ఉపయోగించి నిత్యం విశ్రాంతి సమయాలలో ఆట లాడుకునేవారు పిల్లలు ఆయన యే క్రొత్త విషయమైనా క్షణాలలో అందులో ఒడుపు కనిపెట్టి, మహాప్రవేశం వున్న వ్యక్తేమో ననిపించేవాడు.

యే విషయంలోనయినా, ఆయనకు ఒక ప్రత్యేకత వుండేది. అందుకే అంటారు పెద్దలు పువ్వు పుట్టగానే వాసన తెలుస్తుందని, ఒకప్పటికి కాబోయే భారత ప్రధాన కనుకనే చిన్నతనంనుంచీ ఆయనలోని మహాశక్తులన్నీ విజృం ఖించి, ఆయనను మహామేధావిగా చేసి యుండవచ్చు.Lal Bahadur Shastri కి వ్యాయామం, ఆటలవలెనే ఆటలవలెనే ఈత ఈత అంటే మహా సరదా. అంతేకాక అందులో ఆయనకు చాలా చక్కనిప్రవేశముండేది. ఒకసారి గంగానదికి అవతలివైపున జరుగు తున్న మేలా ఉత్సవం చూసేందుకు వెళ్ళి, పడవ దాపేటందుకు ఆయన వద్ద డబ్బు లేకపోవడంతో, యెవరినీ ఆడిగేందుకు మనస్కరించక, నదిలో అరమైలు ఈది ఒడ్డును చేరుకున్నాడట.

Lal Bahadur Shastri పాఠశాలలో చదివిన నాలుగు పుస్తకాలతో విసిగిపోయి మిగతా విద్యార్థులతో కలసి కాలం వృధా చేసేవాడుకాడు. మంచి మంచి గ్రంధాలు చదువుతూండేవాడు. ఆయనకు కొన్ని విషయాలు అర్ధంకాకపోయినా, చదవటం మానేవాడు మాత్రం కాదు. ఈ విధంగా చరిత్రలు, వివిధ దేశాల సంస్కృతి మొద లైన విషయాలు ఎప్పుడూ అధ్యయనము చేస్తూ మహాత్ముల సూక్తులను నిరంతరం దృష్టిలో వుంచుకొని ఆదర్శవంతమైన జీవితం అలవరచుకున్నాడాయన.

Lal Bahadur Shastri చిన్నతనంనుంచీ రామాయణ, భారతాలవంటి పవిత్ర గ్రంధాలు ఉపాధ్యాయుల వలన వినడం, పాఠశాల నాటకా లలో పవిత్రమైన పాత్రలు పోషించడం, వ్యాసరచనలవంటి కార్యక్రమాలలో పాల్గొనడం, దేశభక్తి పూరితమైన చర్చ లలో ప్రవేశించడం మూలంగా శాస్త్రికి చిన్నతనం నుంచి ఉత్తమ భావాలు విషయ పరిశీలనలు అలవాటయ్యాయ్. స్వరాజ్య సమరోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజు లలో కాశీలో బాలగంగాధర తిలక్ ఉపన్యాసము యేర్పాటు చేయబడింది. ఒకసారి ఆ సమయానికి Lal Bahadur Shastri కాశీ పట్నానికి దూరముగా ఉన్నా, ఎన్నో అవస్థలు పడి చార్జీకి కావలసిన ఉబ్బు సంపాదించి, ఆ సమావేశానికి హాజరైఉద్వేగంతో కూడిన గంగాధర తిలక్ ఉపన్యాసము విన్నాడు.

స్వరాజ్యం మన జన్మహక్కు అన్న నినాదం ఆయన గుండెలలో హత్తుకుంది. హోష్రూల్ ఉద్యమము సాగుతున్న రోజులవి. 1921లో సహాయ నిరాకరణోద్యమము ప్రారం ఢమై భారతీయులంతా గాంధీజీ నాయకత్వములో ఉద్యమ ప్రచారంలో విరివిగా పాల్గొంటున్నారు. బెనారస్ విశ్వవిద్యా లయం యొక్క అధ్యాపకులు కళాశాల వదిలి బయటకు వచ్చారు. అదేవిధంగా హరిశ్చంద్ర పాఠశాల నుండి గూడా ఉపాధ్యాయ విద్యార్థులు పాఠశాలను బహిష్కరించినపుడు Lal Bahadur Shastri అందులో ప్రధముడు.

 Lal Bahadur Shastri indira gandhi,

1915లో మొదటిసారిగా Lal Bahadur Shastri పదకొండేళ్ళ వయ సులో వున్నప్పుడు గాంధీజీని చూశాడు. దక్షిణాఫ్రికాలో బాపూజీ నడిపిన సత్యాగ్రహం కథలు, పాటలు పద్యాల రూపములో ఆనాడు అనేక భాషలలో భారత దేశమంతా ప్రచార మైనది. ఆ సాహసకృత్యాలు చూసి యెందరో ప్రభా ప్రచారమైనది. వితులై సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1917 లో చాం రాన్ లో జరిపిన సత్యాగ్రహం, ఖేడాలో 1918లో

రాజకీయాలలోకి Lal Bahadur Shastri ప్రవేశించడానికి కారణం జవహర్లాలే, అంతులేని ధైర్యం, సాహసాలు అసూయా, ద్వేషములకు అతీతుడూ, అహింసావాది శాస్త్రి నిజమయిన సత్యాగ్రాహికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయని గ్రహిం చిన నెహ్రూ లాల్ బహదూర్ను తన ఆంతరంగికుడిగా చేసు కున్నాడు.1930లో జరిగిన కాంగ్రెస్కు సెక్రటరీ అయ్యాడు. తరువాత ఆయనకు అధ్యక్ష పదవికూడా లభించింది. అలహా బాదులో పన్నుల నిరాకరణోద్యమం ప్రారంభించాడు లాల్ బహదూర్, ఆ సమయంలో Lal Bahadur Shastri అరెస్టు చేయ బడి, రెండున్నర సంవత్సరాలు కఠిన కారాగారవాసము అనుభవించాడు కూడా.

అప్పటినుంచీ, ఏడు పర్యాయములు ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది. అయినా, ఆయన కార్యక్రమాలలో యే మాత్రం నిరుత్సాహం చూపించలేదు. ఈ ఏడుసార్లు జైలుకు వెళ్ళిన మొత్తం కాలం తొమ్మిది సంవత్సరాలు. అలహాబాద్ నగరం మధ్యనున్న గంటస్థంభం మీద చుట్టూ సిపాయిలుగట్టి బందోబస్తులో వుండగా, శ్రీ వేషంలో ఆ స్తంభపు మెట్లెక్కి జెండా ఎగుర వేసిన సాహసిLal Bahadur Shastri . ఈయన అలహా బాద్ మునిసిపల్ బోర్డు మెంబరుగా ఏడేండ్లు పని చేయడము జరిగింది. విజయలక్ష్మి, రంజిత్ పండిట్లు ఈయనకు తోటి సభ్యులుగా పనిచేసే వారప్పటిలో ఈ కారణాల వలన కూడాLal Bahadur Shastri గారు నెహ్రూ కుటుంబానికి మరింత దగ్గరయ్యాడు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడయినప్పుడు నెహ్రూ ఈయ నను సెక్రటరీగా నియమించుకున్నాడు. 1936లో కేంద్ర, రాష్ట్ర శాసన సభలకు జరిగిన ఎన్నికలలో, విజయలక్ష్మి పండిట్, Lal Bahadur Shastri గారు రాష్ట్ర శాసనసభకు ఎన్నుకోబడ్డారు.

ఆనాడు దేశంలో ఎక్కువ మెజారిటీ జాతీయకాంగ్రెసుకే దక్కింది. అయినా, వీరి నిష్కళంక దేశభక్తిని రుజువు చేసు కునే అవకాశము వీరికి గవర్నర్లు కల్పించలేదు. నామమాత్రపు స్వాతంత్ర్యము వీరికిచ్చి అధికారము వారిచేతుల్లో బిగించారు.ఉత్తరప్రదేశ్ లో జమీందారీ తత్వాన్ని నిర్మూలించేం దుకు ఏర్పాటు చేయబడిన కమిటికి శాస్త్రిగారు కన్వీనర్గా పని చేశాడు. ఈయన అక్కడి ప్రాంతాలెన్నో పర్యటించి భూసంస్కరణల విషయంలో ఒక చక్కని నివేదిక తయారుచేశారు.

1939 రెండవ ప్రపంచ యుద్ధ విషయంలో, ఇండియాను ఇరికించినందుకుగాను నిరసనగా కాంగ్రెస్ కార్య కర్తలంతా రాజీనామా చేశాక, ప్రభుత్వానికి వ్యతిరేకముగా గాంధీజీ వ్యక్తి సత్యాగ్రహం ఆరంభించాడు. దానిలో రా గారు కూడా ప్రముఖపాత్ర వహించి, అరెస్టు చేయబడ్డాడు.1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా తీర్మానం వలనప్రముఖ నాయకులంతా అరెస్టయ్యారు. Lal Bahadur Shastri గారు అలహా బాదు ప్రయాణిస్తూ నైనీస్టేషను వెనుకవైపు దిగి అలహాబాదు చేరుకుని ఆనందభవన్ రెండవ అంతస్థులో రహస్య జీవితము గడుపుతూ ఉద్యమానికి కావలసిన ప్రచారం అనేక రకాలుగా శక్తివంచన లేకుండా చేశాడు. అప్పటికి విజయలక్ష్మి పండిట్ ను ప్రభుత్వం అరెస్టు చేయలేదు.

ఆనంద్ భవనం కూడా పోలీసులచేత ముట్టడించటం జరిగింది. అయినా, ఆ భవనంలో శాస్త్రిగారిని వారు గుర్తించ లేకపోయారు. ఆయన తరువాత అక్కడినించి మకాం మార్చి కె.డి.మాలవ్యయింటిలో తలదాచుకుంటూ తన కార్యక్రమాలు . యదావిధిగా సాగించాడు. మాలవ్య అప్పటికే మరోచోట తల దాచుకుంటున్నాడు. అలహాబాదు పరిసరాలన్నీ తిరుగుతూ Lal Bahadur Shastri గారు తన ప్రచారం ముమ్మరం సాగించాడు. ఒకరోజు ఉదయము ప్రభుత్వాధికారులు ఆయనను అరెస్టు చేయగలిగారు. చివరకుజైలు లు జీవితం గడుపుతూ శాస్త్రిగారు అనేక ప్రముఖులు రచించిన గ్రంధాలు చదివి ప్రభావితు డయ్యాడు. అందులో హెగెల్, కౌంట్, రస్సెల్, లాస్కీ, మొదలయిన రచయితలు రచించిన గ్రంధాలు ముఖ్యమైనవి. లెనినిజమ్, మార్క్సిజం కూడా ఆయన జైలులోనే అధ్యయనం చేశాడు. మేడం క్యూరీ జీవిత చరిత్రను హిందీలోకి జైలులోనే అనువదించాడు.

జైలులో ఉన్నప్పుడుకూడా ఆయన నియమబద్ధమైన జీవితాన్నే గడిపారు. ఆయన పనులు ఒకరికి ఆదర్శంగా ఉండేవి. క్రమశిక్షణకు Lal Bahadur Shastri గారికి పెట్టింది పేరు. జైలులో ఒక చిన్న ఆముదపు దీపపు కాంతిలో ఆయన గ్రంధాలన్నీ చదివేవారు. Lal Bahadur Shastri గారు నైనీజైలులో వుండగా ఆయన కుమార్తెకు సుస్తీచేసింది. ఆ విషయం తెలిసినా, అనుమతి కోసము అధికారులను యాచించడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన క్రమశిక్షణమూలంగా అధికారులు ఏ షరతులేకుండా ఆయనకు పది హేనురోజులు శలవు నిచ్చారు. అయితే ఆయన ఇంటికొచ్చేసరికి కుమార్తె మరణించడం ఆయన ఓర్పుకు, సహనానికి పరీక్ష.

 Lal Bahadur Shastri,

పాపను తన చేతులమీదుగా మట్టిచేసి, మిగిలిన శలవు వాడుకోకుండానే తిరిగి జైలుకు వెళ్ళిపోయాడంటే, ఆయన క్రమశిక్షణా, తిరుగులేని ధైర్యం, చెక్కు చెదరని ఆయన సహనము మనము అర్థం చేసుకోవచ్చు.
ఒక సంవత్సరం గడిచాక తిరిగి నాలుగేళ్ళు Lal Bahadur Shastri గారి పిల్ల వానికి జబ్బుచేసి మంచం పట్టాడు. ఎన్నో షరతులమీద ప్రభుత్వాధికారులు ఆయనకు నాలుగురోజులు శలవిచ్చారు. ఆ నాలుగురోజులలో బాబుకు తగ్గుముఖం పట్టలేదు. ఆయనకాగ్రహం, 1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా శాసన ధిక్కారం మొదలయిన ఉద్యమాలతో బాపూజీ భారతజాతి నేతగా ఆరాధించబడినాడు.

దీనికి తగినట్లు జలియన్ వాలాబాగ్ లో జనరల్ డయ్యర్ చేసిన ఘోరహత్యల మూలకంగా దేశమంతా, ఉరకలు వేసె నెత్తురుతో ఉత్సాహపూరితంగా స్వాతంత్రోద్యమ శంఖం ఈ పరిస్థితులన్నీ Lal Bahadur Shastriపూరించడము జరిగింది.శాస్త్రిలో దేశభక్తిని రెచ్చగొట్టాయి.1920వ సంవత్సరమున తిలక్ మహాశయుడు మర ణించాక సహాయ నిరాకరణోద్యమము తిరిగి ఉధృతమైంది. అహింసా సత్యాగ్రహం గాంధీజీ నాయకత్వంలో ప్రారంభమై ముమ్మరమవుతున్న దశలో లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఈ ఉద్యమములో చేరి నడుము బిగించాడు.

పదహారేండ్ల వయసులో కనీసం స్కూలు ఫైనలన్నా పూర్తికాని కుమారుడు పెండ్లి కావలసిన చెల్లెల్ని కానీ, తాను కుమారుని మీద పెట్టుకున్న ఆశలు కాని ఏ మాత్రము ఆలోచించకుండా, కుటుంబ పరిస్థితులను కూడా లెక్కపెట్టక సత్యాగ్రహ సమరములో చేరడము తల్లి రాష్రులారీదేవికీ, బంధువులకూ ఏ మాత్రము ఇష్టంలేదు. అయినా, Lal Bahadur Shastri నిర్ణయం తీసుకుంటే, ఇక దానికి తిరుగుండేది కాదు1921 నాటికే శాస్త్రి స్వాతంత్రోద్యమంలో ప్రవేశించి స్త్రీ నిషేధింపబడిన సభలలో పాల్గొనడము, ఉపన్యాసాలివ్వడము వంటివి చేశాడు. అరెస్టు అయి కొద్దిపాటి శిక్షలతో బయటపడే వాడు. తిరిగి కాశీ విద్యాపీఠములో చేరి విద్యాభ్యాసము ప్రారంభించాడు.

సహాయ నిరాకరణోద్యమ ప్రభావముతో దేశములో కళాశాలలు ఎన్నో స్థాపించబడినాయ్. కాశీ విశ్వవిద్యాలయం కూడా అటువంటిదే జాతీయ నాయకుల సారధ్యంలో అడుగు ముందుకు వేసిందా విద్యాపీఠం. ఆచార్య కృపలానీ, డాక్టర్ భగవాన్దాస్ నరేంద్రదేవ్, డాక్టర్ సంపూర్ణానంద్ వంటి నాయకులంతా అక్కడ ఉపాధ్యాయులు స్వేచ్ఛ, స్వాతంత్ర్య ములు, మానవత మొదలై నవి అక్కడ ముఖ్యపాఠ్యాంశాలు.ప్రతిరోజూ ఆరుమైళ్ళు నడిచేవాడు . విశ్వవిద్యా లయానికి వెళ్ళేందుకు సైకిలు కొనుక్కునే ఆర్థిక స్తోమత ఆనాడాయనకు లేదు. ఇంతకుమించిన ఎన్నో ఆర్ధిక ఇబ్బందు లను ఎదుర్కొంటూ, నాలుగు సంవత్సరాలు శ్రమించి, ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడై శాస్త్రీ పట్టా సంపాదించాడాయన.

విపరీతముగా గ్రంధాలు చదివేవాడు. విజ్ఞాన సంపాదన మనిషికి చాలా అవసరమని ఆయన అభిప్రాయం. Lal Bahadur Shastri తత్వశాస్త్రము అభిమానశాస్త్రము. విద్యాభ్యాసం పూర్తయింది. కుటుంబ పరిస్థితులు ఆర్థికపరముగా యేంబాగోలేదు. తల్లికి తనమీద అనేకమైన ఆలోచనలూ, ఆశలూ వున్నాయని ఆయనకు తెలుసు. పొట్టకూటి కోసం యేదో చాకిరీ అస్వతంత్ర జీవితం గడపటము ఆయనకు యిష్టము లేదు. ఆయన ఆలోచనలన్నీ స్వాతంత్రోద్యమము వైపుకు లాగుతున్నాయి. ప్రజా సేవకై సంఘములో చేరి ఒక సంవత్స రంలోనే జీవిత సభ్యుడు కాగలిగాడు.

ఈ ప్రజాసేవక సంఘమును 1921లో లాలాలజపతి రాయ్ స్థాపించారు ఆ సంస్థకు మొట్టమొదటి అధ్యక్షుడాయనే. ఆయన తరువాత పురుషోత్తమదాన్, తరువాత దానికి అధ్యక్షుడు Lal Bahadur Shastri . ఈ సంస్థ సాంఘిక, ఆర్థిక, రాజ కీయ రంగాలలో అవసరమయితే ఆత్మార్పణ చేయగల సభ్యు లను తయారు చేయడము దాని లక్ష్యము. ఈ సంస్థ సభ్యులు ఇరవై సంవత్సరాలు దేశానికి ప్రజలకు సేవచేయవలసి ఉంటుంది. నిరాడంబర జీవితము అలవాటు చేసుకోవాలి. ప్రచార కులకు నెలకు కేవలము అరవై రూపాయలు మాత్రం సంస్థ. ఇస్తుంది.

 Lal Bahadur Shastri,

హరిజనోద్ధరణకు 1926 ముజఫర్ నచర్ Lal Bahadur Shastri ఎంతో సేవచేశాడు. అప్పుడే పురుషోత్తమదాన్ టండన్ దృష్టిని ఆకర్షించి అలహాబాదు వెళ్ళాడు. Lal Bahadur Shastri ప్రజాసేవ అన్న పదానికి నిజమైన అర్థం ఆయనకు టండన్ సహచర్యములోనే తెలిసింది. దానిలో ఉన్న తృప్తి, గొప్ప తనాలు Lal Bahadur Shastri ని విపరీతముగా ఆకర్షించాయ్.1927లో లలితాదేవితో Lal Bahadur Shastri కి వివాహం జరిగింది. లలితాదేవి మీర్జాపూర్కు చెందిన ఒక ధనిక కుటుంబీకుల పిల్ల . అల్లుడు కోరిన కట్నకానుకలిచ్చేందుకు అత్తవారు సిద్ధపడినా, నిరాడంబర జీవితం అలవాటైన Lal Bahadur Shastri అందుకు అంగీకరించలేదు. ఒక కొయ్యచరఖా, ఒక ఖద్దరు జామారులుమాత్రంవారి వద్దనుంచి తీసుకున్నాడాయన.

స్వాతంత్ర్యము సంపాదించి, నిజమైన స్వేచ్ఛనూ, నాగరికతను అనుభవిస్తున్నామని భ్రమించే ఈనాటి నాగరిక విద్యావంతులు కూడా 1982లో కట్నాల కోసం యెందరో అభాగినులను – హత్యలకు ప్రోత్సహిస్తున్నారు. అటువంటి వారికి మహనీయుడయిన శాస్త్రి ఆదర్శవంతు డనటములో ఏమాత్రం సందేహము లేదు.సంపన్న కుటుంబీకుల పిల్లను చేసుకుని వారు యివ్వ గలమన్నా ఆయన కట్నం తీసుకోలేదు. బీదవారికి తెలిసినా, • ఏదో ఒక రూపములో కట్నకానుచాలామంది వారివద్దనుంచి
కలు గుంజాలని ఈనాడు విద్యాధికులేప్రయత్నిస్తున్నారు. నాగరికతకూ, మానవతకూ ఇక అర్థమెక్కడుంటుంది.

జాతీయ మహాసభ 1929లో లాహోర్ లో సమావేశ మైంది. దానికి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ! కాంగ్రెస్వైద్యంచేయించే స్తోమతలేదు. తండ్రికోసం బాబు వలవల ఏడుస్తున్నా గుండె రాయి చేసుకుని Lal Bahadur Shastri గారు జై లుకు తిరిగి 1) వెళ్ళిపోయాడు.రాజకీయ జీవితం ప్రారంభించాక Lal Bahadur Shastri గారు దుర్భల దారిద్ర్యం అనుభవించాడు. కడుపుకు తిండీ, కట్టుకునేందుకు చక్కని దుస్తులు, కనీసం కుటుంబ సభ్యులకు ఆరోగ్యము పాడయితే మందులకు గూడా యిబ్బంది పడిన రోజులలో కూడా ఆయన అచంచలమైన దేశభక్తి భావం ఆరాధించవల ఆ విధముగా ప్రజాసేవ అన్న పదానికి నిస్వార్థంగా సేవచేసి ఆదర్శవంతుడయ్యాడు శాస్త్రిగారు.

రెండవ ప్రపంచయుద్ధం ముగియుటం, బ్రిటన్ లో కార్మిక నాయకుడు అట్లీ ప్రధాని కావడంతో పరిస్థితులలో మార్పు వచ్చింది. ఇండియా రాక్షస పరిపాలన అంతమవడం అట్లీ నాయకత్వంతో ఆరంభమయింది. శాసనసభలకు ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమయింది. ఉత్తరప్రదేశ్ పార్ల మెంటరీ బోర్డుకు Lal Bahadur Shastri కార్యదర్శి అయ్యాడు. రోజంతా ఆఫీసులో వుంటూ ప్రతి కార్యక్రమంలో సవ్యసాచి లాగా పనిచేశాడా తరుణంలో ఆయన.ఎన్నికలలో కాంగ్రెసు ఘనవిజయం సాధించింది. అక్కడ ముఖ్యమంత్రిగా గోవింద వల్లభాంత్ యెన్ని కయ్యాడు. కేశవదేవ మాలవీయ, చంద్రభానుగు రావత్, Lal Bahadur Shastri గారు వంటి మేధావులను ఆయన పార్ల మెంటు సెక్రటీరులుగా నియమించాడు.

గోవింద వల్లభ్పేంత్ వంటి వారిచే తన క్రమశిక్షణ నిరూపించుకుని, చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీ అయ్యాడు Lal Bahadur Shastri . రాత్రింబవళ్ళు తేడా లేకుండా గోవిందవల్లభ్ పంత్లో సమానంగా పనిచేసే వాడాయన. మిగతా మంత్రులలో ఆ బాధ్యత కనిపించేదికాదు. అందుకే శాస్త్రాని అమితంగా అభిమానించాడు గోవిందవల్ల బ్ పంత్.1947 ఆగస్టు 15న ఇండియాకు స్వాతంత్ర్యము సిద్ధించింది. జవహర్లాల్ భారతదేశానికి ప్రధాని అయ్యాడు పోలీస్, రావాణా శాఖలకు Lal Bahadur Shastri మంత్రిగా నియమించ బడ్డాడు. హిందూ, ముస్లిం మతకలహాలు అధికముగా వున్న ఆ రోజులలో పోలీస్ (హోం) మంత్రిగా వుండి, యెంతో శాంతియుక్తులను ప్రదర్శించి శాస్త్రి తన మేధాశక్తిని రుజువు చేసుకున్నాడు.

1962లో చైనాకు, ఇండియాకు జరిగిన ఘర్షణములో ఆయన ఉత్తరప్రదేశ్లో తయారుచేసిన ప్రాంతీయ రక్షక దశము ఎంతగానో ఉపయోగపడింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు జీవితాలు గడిపిన వారికి చాలా మందికి తన పోలీస్ శాఖలో మంచి ఉద్యోగావకాశాలు కల్పించాడాయన.1919 లో లక్నో విద్యార్థులు సమ్మెచేసినప్పుడు తను పోలీస్ మంత్రిని అన్నఅధికారము,అహంభావమప్రదర్శించం, ప్రజలకు ఏ మాత్రం హానిలేని జలయంత్రాల ద్వారా విద్యార్థులను చెదరగొట్టించాడు. లాఠీచార్జీలు కాల్పులు చేయించలేక కాదు. అధికారము చేతిలో వున్నా ప్రజాక్షేమాన్ని దృష్టిలో వుంచుకున్న మహానాయకుడాయన. ఏ అధికారి అయినా ప్రజల ప్రతినిధి అనీ, ప్రజలతో సంబంధంలేని అధి కారం ప్రజాస్వామ్యంలో ఓడిపోక తప్పదన్న సత్యం తెలిసిన నాయకుడాయన.

 Lal Bahadur Shastri,

ఆయన ఒకసారి ఆగ్రా వెళ్ళినపుడు అక్కడి ఆహ్వాని తులు, ప్రజలూ ఆయనను సత్కరించేందుకు పూలమాలలతో వెళ్ళారు. అది చూసి ఆయన చడీచప్పుడు లేకుండా సాథా రణ ప్రయాణీకుల గేటు నుంచి వెళుతుంటే అక్కడి పోలీస్ ఆయనను ఆపి రక్షణమంత్రి వెళ్ళేదాకా ఎవర్నీ వెళ్ళనీయ మన్నాడట. ఆయన మామూలుగా సాధారణ ప్రయాణీకుని మాదిరిగా ఆగిపొయ్యాడు. ప్రజలాయనను గుర్తించి దండలతో ముంచెత్తినప్పుడు ఈ పొట్టి బక్కచిక్కిన మనిషా రక్షణమంత్రి అని ఆ పోలీసు నిర్ఘాంతపొయ్యాడట.

శాస్త్రి మాత్రం ఏమాత్రం కోపగించుకోక నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అంతటి సాధారణ వ్యక్తి ఆయన. ఆయన పదవి చూసి ఏనాడూ పొంగిపోలేదు. అధికారదర్పం ఆయనకు అంతకన్నా తెలియదు. తనూ ప్రజలలోని మనిషే. ప్రజలూ తనంతటివాడే అన్న నిరాడంబర జీవి.రోడ్డు రవాణా సర్వీసులను మొట్టమొదటిసారిగా జాతీయము చేసిన ఘనత శాస్త్రిగారిదే. స్త్రీ, పురుషులందరూ కలసి బాధ్యతలు సమముగా నిర్వర్తిస్తేగాని దేశము ప్రగతిపధం పయనించదని నమ్మేవాడాయన. 1950లో నాసిక్ కాంగ్రెసు సమావేశానికి టాండన్ అధ్యక్షుడు కావడము నెహ్రూకు ఇష్టంలేదు. వారిద్దరూ తనకు రాజకీయ గురువులు కావడముతో శాస్త్రి వారిద్దరి యెడలా ఒకే అభిప్రాయముతో మధ్యవర్తిత్వం చేసి వారిద్దరి మధ్యా ఉన్న భేదాభిప్రాయాలు తొలగించాడు. చివరకు జవహర్లాలే నాటి సభకు అధ్యక్షత సహించడము జరిగింది.

నెహ్రూ, టాండన్ లిద్దరూములో పోటీపడి ప్రేమించేవారట. నెహ్రూ కాంగ్రెసు అధ్యక్షుడుగా అవటము, లాల్ బహదూర్ ఢిల్లీ కి కుటుంబము మార్చాడు.లాల్ బహదూర్ జనరల్ సెక్రటరీ అయి1952లో సాధారణ ఎన్నికల సమయములో శాస్త్రి అనేక ప్రాంతాలలో పర్యటించి తన భావాలు ప్రచారము చేశాడు. భోజనము, విశ్రాంతి కూడా మరచి ఎన్నికల సమ యములో “తీన్ మూర్తీభవన్” తన కార్యాలయము చేసుకుని శ్రమించాడాయన. లాల్ బహదూర్ శ్రమకు తగ్గట్టు ఎన్నిక లలో ఘనవిజయం సాధించింది కాంగ్రెసు.

 Lal Bahadur Shastri,

క్యాబినెట్ మంత్రివర్గములో శాస్త్రాని రైల్వేమంత్రిగా నియమించాడు నెహ్రూ. ఆయన నాయకత్వంలో రైల్వేశాఖయెంతో పురోభివృద్ధి చెందింది. 1955 ఆగష్టు 1వ తేదీన ఆయన ఈస్టరన్ రైల్వేశాఖ విభజించి, సౌత్ ఈస్టరన్ రైల్వే అనే విభాగం యేర్పాటు చేశాడు. రైల్వే సెక్యూరిటీ అడ్వయి జర్ను నియమించి, “వాచ్ అండ్ వార్డ్” వ్యవస్థను అభివృద్ధి చేశాడు. “రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్” ను ఏర్పాటుచేసి రైలు దొంగతనాలను ఆపుచేయించగలిగాడు.

రైల్వే రేట్స్ ట్రిబ్యునల్ లో అధికార పరిధి విషయ ములో మంచి సంస్కరణలు చేయగలిగాడు. టిక్కెట్ రిజర్వే షన్ పద్ధతి ఆయన పరిపాలనలోనే జరిగింది. డీలక్స్ రైళ్ళు ఆయన సలహాతోఆరంభింపబడినవే. “ప్రత్యేక డైరెక్టరేట్” ఆయనే ఏర్పరిచాడు.పది హేనుకోట్ల రూపాయల ఖర్చుతో బీహార్ లో గంగా నది పైన రోడ్డు వంతెన నిర్మించే పథకం చేపట్టాడాయన. నదిపైన ప్రాంతంలో ఉత్తరదక్షిణ రహదారి తేలికయింది. 1956 నవంబరులో జరిగిన అరియలూర్ ప్రమాదమూ, మహబూబ్ నగర్ లో జరిగిన రైలు ప్రమాదములకు రైల్వేమంత్రి అయిన తన అజాగ్రత్తవల్ల జరిగిన వేనని తన తప్పు తనే ఆరోపించు కుని రైల్వేమంత్రి పదవికి రాజీనామా చేసాడాయన.

తెల్ల వారిన దగ్గరనుంచీ, జీవితము తప్పుల నడకగా సాగిస్తూ, ప్రజలు దిగిపొమ్మంటున్నా వారికి వినిపించనట్లు నటించి తమ స్వార్ధము తాము చూసుకునే నేటి సమాజంలోశాస్త్రి వంటి మహనీయుల ఆదర్శంకూడా యెందుకూ పనికి రాకుండా పోతోంది.నిజమైన ఆత్మ పరిశీలన, నిశ్చితమైన అభిప్రాయము, నిఖారసైన కార్యసాధన, నిజమయిన సహకారాలు ఆయన కున్న నాయకత్వ లక్షణాలు. భారతదేశము ఆ మహానాయ కుని నాయకత్వములోవుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాధించి, ఈనాటికి అంతర్జాతీయముగా భారతదేశము తారా పధంలో వుండవలసింది.

శాస్త్రి రాజీనామాకు జవహర్లాల్ కూడా చాలా బాధ పడుతూ, ఆయన నిజాయితీని యెంతగానో ప్రశంసించాడు. ఆయన మంత్రిపదవికి రాజీనామా ఇచ్చి పార్ల మెంటు భవనం బయటకువచ్చి తనకోసము చేతులు కట్టుకు నిలబడిన కారు డ్రైవరును పిలిచి “నేనిప్పుడు మంత్రిని కాను, రాజీనామా ఇచ్చాను. నేను మామూలు మనిషిని ప్రభుత్వ వాహనము వాడుకునే అధికారం లేదు” అంటూ మామూలుగా నడిచి వెళ్ళిపొయ్యాడు.

 Lal Bahadur Shastri,

దీనినిబట్టి ఆయన నిరాడంబర జీవితము, నిస్వార్థము, సాధారణ మన స్తత్వాలు మనకు అర్థమౌతాయి. ఎప్పుడో చేసిన సదవులను అడ్డం పెట్టుకుని, ప్రజాధనాన్ని, ప్రభుత్వ వాహనాలనూ, స్వంతముగా వాడుకునే స్వప్రయోజకులకు శాస్త్రిగారిలాంటి ఆదర్శమూర్తి చక్కని కనువిప్పు.1957లో జరిగిన సాధారణ ఎన్నికలలో శాస్త్రిగారుచీఫ్ ఆర్గనైజరుగా ఎన్నికల సమయంలో నియమింపబడినాడునెహ్రూ వలన. ఆ ఎన్నికలలో అలహాబాద్ పశ్చిమ నియోజక వర్గంనుంచి తిరిగి లోక్సభకు ఎన్నికయ్యాడు. రవాణా
తంతి తపాలా శాఖలకు ఈసారి ఆయన మంత్రి పదవి స్వీకరించాడు.

విశాఖపట్టణంలోని నౌకా నిర్మాణ కేంద్రం శాస్త్రిగారిచలవే. తంతితపాలా కార్మికులు సమ్మె చేసినప్పుడు ఆయనవారిని శాంతపరచి, వారి ప్రయోజనాలకు శ క్తివంచనలేకుండాచేశాడు. సంవత్సరము గడిచాక మొరార్జీదేశాయ్ స్థానంలోశాస్త్రిగారు వాణిజ్యముల శాఖమంత్రి అయ్యాడు.

రష్యా, జెకోస్ల వేకియాల సహాయముతో శ్రీ శాస్త్రిగారుహెవీ ఇంజనీరింగ్స్ స్థాపించాడు. బెంగుళూరులోని హిందూస్థాన్ మెషిన్ టూల్స్ బాగా అభివృద్ధి చేయబడి అధిక ఉత్పత్తులు సాధించగలిగింది.భోపాలులోని హెవీ ఎలక్ట్రికల్స్ బాగా అభివృద్ధిపరచబడింది. ఉదక మండలంలో ఒక ముడిఫిల్ముల తయారీ కర్మాగారం, సంగలులో ఎరువుల కర్మాగారాలు ప్రారంభించబడినాయి.

వ్యవసాయములకూ, పరిశ్రమలకూ అవినాభావసంబంధముండాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు.పల్లెపల్లెలలో కుటీర పరిశ్రమలు స్థాపించవలెనన్న అభిప్రాయముతో ఆ రకమైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఎంత గానో ప్రయత్నించాడు. 1959లో అలహాబాద్ పరిసరాలు పర్యటించే సమయములో ఆయనకు గుండెపోటు వచ్చి ‘కొద్దిలో గండంతప్పింది. అయినా ఆయన విశ్రాంతిలేకుండా, దేశ అభి వృద్ధి కార్యక్రమాలు అమలుపరచి నిరంతరము శ్రమిస్తూనే వున్నాడు. ఆయన నిజమైన శ్రమైకజీవి.https://photos.app.goo.gl/PuhiqMhER8Lp7psJ6

1961వ సంవత్సరం గోవింద వల్లభ్పంత్ అనారోగ్య ముతో మరణించడంతో హోంమంత్రి అయ్యారు శాస్త్రిగారు. అప్పటినించీ ఆయన కేంద్రహోంమంత్రిగా స్థిరపడిపోయ్యాడు.1961 మేలో అస్సాం ప్రాంతంలో అస్సాం మాతృ భాష కావాలని ఆందోళన మొదలుపెట్టారు. అరాచకం అల్లర్లు అధికమయ్యాయి. శాస్త్రిగారు అస్సాం వెళ్ళి అక్కడి వారిని శాంతపరచి తన సామర్ద్యము నిరూపించుకున్నాడు. 1961 ఆగష్టులో పంజాబ్ లో అకాలీలు రెచ్చినప్పుడు ఆయన వారి ఆందోళన విషయంలో ఒక కమీషన్ ను నియమించి ఆ ఆందో శన న్యాయసమ్మతమైనది కాదని విని, ఆ అల్లర్లను యెంతో చాకచక్యముతో అదుపు చేయించాడు.

1962లో ఎన్నికలలో క్రొత్తవారికి అవకాశాలు కల్పించి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య చక్కని సదవగాహన కలిగించాడు. హిందీ భారతదేశంలో అధికార భాష చేయాలని అభిప్రాయ పడినప్పుడు, హిందీ దేశమంతా విస్తృ తమై, అందరూ మాట్లాడే స్థితికి వచ్చేవరకూ, ఇంగ్లీషును పూర్తిగా నిషేధించడం మంచిది కాదన్న అభిప్రాయంతోనే చాలామందిని సంతృప్తి పరచగలిగాడు.1963 మేలో తమిళనాడు డి.ఎం.కె. యేర్పాటు ధోర ణిని తలెత్తకుండా అణచి వేయగలిగాడాయన కేరళలో అస్థ వ్యస్థంగా ఉన్న మిశ్రమ ప్రభుత్వ ధోరణిని చూసి, పట్టంథాను పిళ్ళెను గవర్నర్ గా మార్చి, కేరళ ప్రభుత్వ విధానాలను చక్కబరచిన మేధావి.

పరిస్థితులను పరిశీలనా దృష్టితో చూడటం, అవసరాన్ని బట్టి చతుర్విధోపాయాలను ఉపయోగించి ప్రజాసామరస్యం ద్వారా, దేశంలో ఐకమత్యం సాధించడం ఆయన ప్రత్యేక ఆయన మేధాశక్తికి ఆనాడు ఎన్నో సమస్యలులక్షణాలు.పరీక్షా సమయాలయ్యాయ్పరిపాలన వ్యవస్థలో ఆయన అనేక మార్పులు చేశాడు. అవినీతి నిర్మూలనకు సంతానం కమిటీ నియమించాడు. నేర ములు పరిశోధించేందుకు కేంద్రశాఖను సృష్టించాడు. “ఆలిం డియా బోర్డు”ను స్థాపించడం ద్వారా వెనుకబడినవర్గాలవారికి ఆర్ధిక సహాయం అందే ఏర్పాటు చేయగలిగాడు.

ఆయన ఎవరికి ఏ మేలు చేయాలన్నా జాతీయభావంతో చూశాడే కానీ, వ్యక్తిగతంగా గానీ, ప్రాంతీయపరంగా గానీ ఆలోచించేవాడు కాడాయన, హిమాలయ సరిహద్దులలో 1962 అక్టోబరులో చైనా దాడి చేసినప్పుడు, రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించగా, రక్షణ కార్యక్రమములు ఎంతో చురుకుగా అవలం ఖించాడు. లాల్ బహదూర్, ఖైదీలకు గూడా నివాసయోగ్యం కాని అండమాను దీవులు ఉద్దరింపబడటానికి కారణం ఆయనే.

1963 ఫిబ్రవరిలో అండమాన్ దీవులు దర్శించి, నేపాల్ కూ, భారత్కు వచ్చిన అపోహలను పోగొట్టి ఈ రెంటిమధ్యా సద వగాహనకు కారకుడైనవాడు శ్రీశాస్త్రిగారు. రెండుస్వతంత్ర దేశముల మధ్య సదభిప్రాయా లుండటం అవసరమనీ, ఎవరికి వారు స్వతంత్రులుగా వుంటూ, చిన్న చిన్న విషయాలలో అపోహలు పెంచుకోవడంకంటే, ఆలోచించి మంచి అభిప్రాయ ముతో స్నేహం చేయడం శాంతి మార్గమని శాస్త్రిగారు చెప్ప డంతో భారతక్కూ నేపాల్కూ మధ్య సమస్యలు లేకుండా
పోయాయ్.https://pincodesguide.in/mahatma-gandhi-is-great-freedom-fighter/

1963లో ఆర్గురు కేంద్రమంత్రులు రాజీనామా చేశారు. అందులో శాస్త్రిగారుకూడా ఒకరు స్వాతంత్ర్యం రాకమునుపు ఉన్న స్వార్ధ త్యాగాలు, ఏర్పడ్డాక నాయకులలో కనిపించడం లేదు. స్వార్థం ఎక్కువైంది. ఎవరికి వారు తమ గొప్పలకోసం పాకులాటలు ప్రారంభించారు. ప్రజలకూ, ప్రభుత్వానికీ పరస్పరావగాహన అవసరం అన్న విషయం మరచి ప్రభుత్వం, ప్రజలకు అతీతమైందన్న భావన ప్రారంభమైంది. ప్రభుత్వంలో గల లోటుపాట్లను సరిచేసి ప్రభుత్వాన్ని తీర్చిదిద్దాలన్నా అభి ప్రాయంతోనే ఆరుగురు కేంద్రమంత్రులు రాజీనామాచేయడం జరిగింది.

భువనేశ్వర్ కాంగ్రెసు మహాసభలు నడిచేముందు అను కోకుండా నెహ్రూగారి ఆరోగ్యం దెబ్బతిన్నది. బాధ్యతలన్నీ శాస్త్రిగారికి వప్పగించాడు నెహ్రూ. తన ప్రధానమంత్రి పదవీ బాధ్యతలన్నీ ఆయన నెత్తిపైన పెట్టడంతో శాస్త్రిగారు శ్రీనగరులో జరిగే అల్లర్లు, సమ్మెలూ విని కాశ్మీరు బయలు దేరాడు. అక్కడ శ్రీనగరు హజరత్ బాల్ మసీదులో మహ మ్మద్ ప్రవక్త యొక్క పవిత్ర కేశము దొంగిలించబడిందని గొడవలు ఉధృతమయ్యాయ్.

నేర పరిశోధక మండలి వారి దాటికి తట్టుకోలేక అప హరిఁచినవారు ఆ కేశాన్ని మామూలు స్థానంలో చేర్చారు. అయినా అక్కడి కార్యచరణ సంఘంవారు చేరిన ప్రవక్తకేశం నకిలీదన్న అభిప్రాయం తెలియపరచడంతో తిరిగి ఆందోళన అల్లర్లు ప్రారంభమయ్యాయ్ 17మంది వృద్ద మౌల్నీలు మతా ధికారులందరితోపాటు శ్రీ శాస్త్రిగారుగూడా ఆ పవిత్రకేశాన్ని గంటసేపు పరీక్షించి అది అసలైనదేనని తేల్చారు.

“కాశ్మీరు నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ యర్పాటుచేసి షముద్దీన్ న్ను రాజీనామా చేయించి, అమోఘమైన తన మేధాశక్తితో జి.ఎమ్. సాదిక్ ప్రధాని అయ్యే వాతావరణం కలిపించాడాయన. షేక్ అబ్దుల్లాను ఆయన ఖైదీనించి విడి పించగా, అతడు “స్వతంత్ర కాశ్మీరు” అన్న నినాదం లేవ దీశాడు. పాకిస్తాన్కూ, భారతూ, కాశ్మీరు సమస్యలో మధ్య వర్తిగా ఉంటాననటం మొదలు పెట్టాడు. చివరకు అరబ్ దేశా లన్నీ పర్యటించేందుకు పాస్పోర్ట్ సంపాదించగలిగాడు.అదే పరిస్థితులలో శ్రీ జవహర్లాల్ మరణించడం జరి గింది.

ఒక వంక కాశ్మీరు, మరోప్రక్క పాకిస్తాన్, చైనాల సమస్య ఏ రకంగా, ఎన్ని రకాల వత్తిడి వస్తున్నా. ఆయన ఆలోచనలూ, ఆయన నిర్ణయాలూ ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. హిందూ దేశాన్ని కించపరచాలని కానీ, ప్రపంచ దేశాలలో చులకనచేయాలని కానీ ఆయన అభిప్రాయంకాదు.ఏ సమస్యనైనా నాలుగు రకాలుగా ఆలోచించి దాన్ని శాంతియుతంగా పరిష్కరించే మార్గం ఆలోచించేవారాయన దూరదృష్టితో అయితే చాలామంది మొదటిలో ఆయన నిర్ణయా లను విమర్శిస్తుండేవారు. చివరకు సాధింపబడిన మంచిని చూసి ఆయనను మెచ్చుకోకుండా ఉండలేకపొయ్యేవారు.

నెహ్రూ మరణించగానే, శ్రీ శాస్త్రిగారు భారతదేశా నికి ప్రధాని అయ్యాడు. నెహ్రూ దేశానికి చేసిన సేవనూ భారత జాతిపైన ఆయనకున్న మహోన్నతమయిన ప్రేమ భావాన్నీ తెలియపరుస్తూ, అటువంటి నాయకుడ్ని పోగొట్టు కున్నందుకు విచారపడుతూ మొట్టమొదటగా భారత ప్రజల నుద్దేశించి రేడియోలో ప్రసంగించారు.ప్రజల సంకల్పం వల్ల నే తాను ప్రధాని పదవికి ఎన్ను కొనబడినాననీ, అట్టి ప్రజలకు జీవితాంతము కృతజ్ఞునిగా ఉంటూ సేవ చెయ్యగలనని చెప్పి, మాటలు చెప్పటమేకాకుండా ఆచరించి చూపిన పుణ్యశాలి మన శాస్త్రిగారు.

కపేందుకు గుడ్డ, కనీసం తాగేందుకు అంబలి అన్ని వర్గాల వారికి అందించగలిగితే తన పదవి సద్వినియోగమయి నట్లేనని భావించి, అదే ప్రయత్నంలో చివరవరకూ తన కర్త వ్యం నిర్వహించారాయన. ప్రజలకూ, ప్రభుత్వానికి చక్కని అవగాహనఅవసర మనీ, ప్రజలచే ఏర్పరచబడిన దేప్రజాస్వామ్య ప్రభుత్వమనీ, అధికారులు ప్రజలను మరచిననాడు అది నియంతృత్వ ప్రభుత్వ విధాన మవుతుందని, అసలది ప్రజా స్వామ్య లక్షణము కాదనీ నమ్మి ఆచరించారాయన.ప్రధానమంత్రి అయ్యాక గూడా తానేదో గొప్ప వ్యక్తి నన్న అభిప్రాయం ఆయనకు కలుగలేదు, ప్రజలే తను తనేప్రజలుగా భావించి పరిపాలన సాగించాడు. అందుకే శాస్త్రిగారు అంతర్జాతీయంగా రాణించగలిగాడు.

ప్రపంచ దేశాలన్నిటితోనూ స్నేహసంబంధాలు కలిగి వుండాలనీ, వారి ఆచార వ్యవహారాలతో సంబంధము వుండ కూడదనీ, వారి ప్రభుత్వ విధానాలేవైనా, అన్ని దేశాల మధ్య మైత్రీభావం ఉంటే ప్రపంచశాంతి స్థాపించడము ఏమాత్రం కష్టం కాదని విశ్వసించిన వ్యక్తి ఆయన.ఏమాత్రం ఆడంబరాలు, అహంకారం, జాతి కుల మత విభేదాలు లేని శాస్త్రిగారివంటి నాయకుడు ఇండియాకు ప్రధాని అయినందుకు అన్ని వర్గాలవారూ ఎంతో ఆనందించారు. ఆయన నిరాడంబరతకు ప్రపంచ దేశాలన్నీ కూడా తలలు పంచక తప్పలేదు. తన తప్పులు, తన బాధ్యతలూ నిరంతరం ఆలోచిస్తుండటం వలననే శాస్త్రిగారు చరిత్రకే ఆదర్శపురుషు డయ్యాడు.

జవహర్లాల్, శాస్త్రిగారు వంటి నాయకులు దూరం కాపడము మన భారతీయుల దురదృష్టకరము. సర్వ మతా లనూ, సర్వకులాలనూ ఒకేకులంగా, భారతదేశం యావత్తూ ఒకే కుటుంబముగా గౌరవించి ప్రేమించిన త్యాగమూర్తులువారు. కాస్త్రిగారి తల్లి రాష్రులారీదేవి కుమారుణ్ణి ప్రధాని కాగానే, “నాయనా దేశంకోసం ప్రజలకోసం అవసరమైతే నవ్వుతూ ప్రాణాలర్పించగల శక్తినికా భగవంతుడు ప్రసాదించుగాక?” అని ఆశీర్వదించిందంటే అటువంటి తల్లులు ని పుట్టిన భారతదేశంలో నేనా, పదవులకోసం ప్రాణాలుతీసే నాయకులు పుట్టిందనిపిస్తుంది.

ప్రధాని కార్యాలయములో ఎక్కడ చూద్దామన్నా ఆడంబరత్వము కనిపించేదికాదు. రాజకీయ గ్రంథాలున్న ఒక షెల్పు, కూర్చునేందుకు ఒక కుర్చీ ఒక టేబులు, ఆ పేబులు పైన ఒక బుద్ద విగ్రహము. గోడలకు అందమైన ప్రకృతి దృశ్యాలు కానీ, నాయకుల ఫోటోలుకాని ఉండేవికావు.శాస్త్రిగారి భార్య లలితాదేవి అన్ని విషయాలలో భర్తను అనుసరించే మహా పతివ్రత. తనభర్త భారతదేశానికి ప్రధాని అన్న గర్వం ఏ మాత్రం వుండేదికాదు. ఆమెకు ఆయన దైవ స్వరూపుడైన భర్తగానే కనిపించేవాడు.. ఇంటిపని వంటపని అన్నీ స్వయముగా చేసుకునేది. నలుగురు మనుషులున్న ఇంటిలో చాకిరీ చెయ్యలేకపోతున్నామంటూ ఆరుగురు నౌక ర్ల నూ, గ్యాస్ వంట పొయ్యిలను ఉపయోగించే వారికి లలితా దేవి చక్కని ఆదర్శ మహిళ.

భారతదేశానికే ప్రధాని అయిన తన భర్త గొప్ప అన్న భావన అణుమాత్రము లేకుండా భర్త, అత్తగారు, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరుకాక మనుషులు ఇంత మందికి ఆమె స్వయంగా సేవచేసి సంతోషించేది. స్వయంగా వండి భర్తకు ఆమె చేతితో అన్నం వడ్డించేది, అదేకదా. నిజ మయిన దాంపత్యం.ప్రభుత్వ విధానాలలో ప్రజలను కించపరచి, హక్కులు భంగపరిచేవిగా వుండకూడదని శాస్త్రిగారు కొత్త మంత్రివర్గంలోని తన సహచరులను మాటిమాటికి హెచ్చ దిస్తూ వుండేవారు. ప్రజలను పీడించే అధిక ధరలను అరికట్టేం మకు మిత్రదేశాలనుంచి బియ్యం, గోధుమ మొదలైనవి దిగు మతి చేయించారాయన. “ట్రేడింగ్ కార్పొరేషన్” రూపొం దించారు. ఆహారధాన్యాలు కొనుగోలు చేసి, అనేక ప్రాంతా లలో సరఫరా చేసేందుకు ఈ ట్రేడింగ్ కార్పొరేషన్లు ఉపయోగించేవి.

రైతులకు ధాన్యపు ధరలు గిట్టుబాటు కలిగించే విధంగా ఏర్పాటు చేయబడ్డాయి. నిత్యావసర వస్తువులు తక్కువ ధర లకు అమ్మే కోపరేటివ్ స్టోర్స్ వెలిశాయి, బ్లాక్ మార్కెటీర్ల మీద నిఘా అధికమైంది అటువంటివారే ప్రగతికి అభివృద్ధి నిరోధకులని వారిపైగట్టి చర్యలు తీసుకోవడం జరిగింది.
కామన్వెల్తు ప్రధానుల సమావేశానికి ఆయన అతి నిరాడంబరంగా ప్రయాణమయ్యాడు. కానీ ఆఖరి క్షణంలో రెండవసారి గుండెపోటు రావడం వలన ఆ ప్రయత్నం విర మించుకోవడం జరిగింది. శాస్త్రికి బదులుగా, ఇందిరాగాంధీ, కృష్ణమాచారి లండన్ వెళ్ళారు. రోజుకు 18 గంటలు ప్రభు త్వానికి సంబంధించిన పనులలో మునిగిపొయ్యే వాడాయన.

నెహ్రూ అనుకోకుండా మరణించడము, తాను ప్రధాని కావడము, దేశ భవిష్యత్తుకోసం నిర్వహించవలసిన పనులు కోకొల్లలుగా ఉండడముతో ఆయనకు విశ్రాంతి చాలా తక్కువై ఆరోగ్యం దెబ్బతిన్నది. వైద్యులు ఆయనకు విశ్రాంతి చాలా అవసరమనీ, యెక్కువగా మాట్లాడడముకూడదని ఆంక్షలు విధించినా తెల వారుజామున లేచి తననుచూచేందుకు వచ్చే వారితో స్నేహితునిలా థుజాలపైన చేతులు వేసి ప్రతిరోజు దాదాపు రెండు గంటలు సంభాషణలు జరిపేవాడట.

1946లో ఆయన కైరో వెళ్ళారు. అలీన రాజ్యాల శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడేందుకు, అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు నాసర్ విమానాశ్రయానికి స్వయముగా వచ్చి శాస్త్రికి స్వాగతం చెప్పాడు. అక్కడ ఆయన ప్రవేశపెట్టిన పంచసూత్ర ప్రణాళిక అందరి ఆదరణకు గురయింది.తిరుగు ప్రయాణంలో రావల్పిండిలోదిగి ఆయూబ్ భానుతో చర్చలు జరిపాడు. బ్రిటిషు ప్రధాని విల్సన్ ఆహ్వా సమును మన్నించి ఈయన ఇంగ్లండు వెళ్ళి వచ్చారు. తరు వాత కెనడా దర్శించి అక్కడి నించి కామన్వెల్తు సభలకు వెళ్ళివొచ్చారు.

రష్యాప్రధాని కోసిగిన్ వచ్చాక, శాస్త్రి రష్యా పర్యటించి భారత్, రష్యాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించాడు, యుగోస్లేవియాలో టిటో ఆయనకు ఘన స్వాగతం చెప్పాడు. పాకిస్తాన్ ఈలోగా తనదురాక్రమణ మొదలు పెట్టింది. కచ్ ప్రాంతములో, అమెరికా ఆయుధ సహాయంతో పాటన్ టాంకులు ఉపయోగించడం – భారతీయ సైనికులు ఫోటోలు తీసి సాక్ష్యం చూపించగలిగారు. పాకిస్తా సుకూ. భారతకూ యుద్ధం తప్పనిసరయింది.

బ్రిటీషు ప్రధాని విల్సన్ మధ్యవర్తిత్వము చేశాడు. ఆయూబ్ ఖాన్ శాస్త్రి ఇద్దరూ కామన్వెల్తు సభకు హాజరైన ప్పుడు ఇద్దరిమధ్యా ఒక ఒప్పందం కుదిరింది. భారతీయుల గౌరవానికి యే విధముగానూ భంగము కలుగని విధముగా వున్నదది. పంజాబు, ఒరిస్సా మంత్రివర్గాలపై వచ్చిన ఆరోప ణలను విచారించి వారిని రాజీనామాచేయించి, మంత్రివర్గాన్ని మార్పించి, ప్రజాశ్రేయస్సుకు సహకరించాడాయన. కేరళలో జరిగిన అపోహలు, అంతఃకలహాల మూలముగా అల్లర్లు ప్రారంభమై అక్కడ కాంగ్రెసుకేకాక యే పార్టీకి తగినంత బలం చేకూరక పోవడంతో ప్రెసిడెంటు పాలన విధించవలసి వచ్చింది.

భారతదేశములో అనైక్యత అధికమవుతోందని భ్రమించి తాము చేసుకున్న ఒప్పందము విషయము మరచి పాకిస్తాన్ తిరిగి కయ్యానికి కాలుదువ్వడం ప్రారంభించింది. పూంచ్ సరిహద్దుదాటి యుద్ధభేరి మ్రోగించింది. మంచిని అర్ధం చేసుకోలేని పాకిస్తానుకు బలప్రయోగములో బుద్ధిచెప్పా లని నిర్నయించాడు శాస్త్రి.

భారతీయ సైనికుల ధాటికి తట్టుకోలేని పాకిస్తాన్ తన ప్రగల్భాలు కట్టిపెట్టి కాలికి బుద్ధి చెప్పింది.
పాకిస్తాన్ వారు అనవసరంగా కయ్యానికి కాలు దువ్విన విషయం ఐక్యరాజ్యసమితికి నివేదించారు. అయితే బ్రిటన్, అమెరికాలు స్వయంగా పాకిస్తాన్ను సమర్థించకపోయినా సానుభూతి చూపుతున్నాయి. రష్యామాత్రం కాశ్మీర్ భారత్ లోనిదేనని గట్టిగా నొక్కి చెపుతూండడంవల్ల వారి ఆటలు సాగలేదు. మొత్తంమీద యుద్ధ విరమణ ఆదేశాన్ని తీర్మా నించింది ఐక్యరాజ్యసమితి.

అయినా పాకిస్తాన్, చైనా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల అండ చూసుకుని మాటిమాటికి గిల్లికజ్జాలు పెట్టుకుం టూనే వుంది. భారత సైనికులు మాత్రం ఎవరు ఏం ప్రోత్స హించినా శత్రుదేశాన్ని చావుదెబ్బకొట్టేందుకు అన్నివిధాలా సిద్ధంగా వుండి ఆయుధాలు, సైన్యాలు చాలా జాగ్రత్తగా వాడుతూ శత్రువు అడుగు ముందుకు వేయకుండా సిర చిత్తంతో అడ్డుకుని నిలిచాయి.జవహర్లాలు నెహ్రూ ముందుచూపు వలస, విమానాలు టాంకులు, మందుగుండు సామాగ్రీ, ఆయుధములు మొదలగు కర్మాగారాలు బాగా అభివృద్ధిని సాధించగలిగాయ్ పారిశ్రామిక వేత్తలంతా దేశరక్షణ కోసం తమ సహకారం

అందించారు. ఈ యుద్ధ ప్రయత్నాల వలన దేశములో తిండి గింజల కొరత మొదలైనవి యేర్పడటం వల్లనే శాస్త్రి “జై జ వాన్ జై కిసాన్” అనే నినాదం లేవదీశాడు. దేశంలో పౌరుడూ తిండి గింజలకు బాధపడకుండా రైతులు అధి సాదించడము – ఎన్ని అవాంతరాలొచ్చినా సైనికులు ప్రాణాలొడ్డి దేశాన్ని రక్షించడము – శాస్త్రి “జై జవాన్ జై కిసాన్” నినాదపు ఆదర్శాలు.

ఆయన పిలుపు విని దేశములో అందరూ రకరకాలుగా దేశరక్షణ నిధులనిచ్చారు. భారతదేశంలో నీటి వసతి లేక పంటలు ఆగిపోయ్యాయన్న మాట వినపడేందుకు వీలు లేకుండా నీటివసతి కుదిరి భూములు సాగుచేయబడినాయ్. మంచి విత్తులు, మేలయిన ఎరువులు సరఫరా జరిగింది. కాశ్వీర్ యెట్టి పరిస్థితులలోనూ భారతదేశానిదే. ఈ విషయములో మరొకరు జోక్యం కల్పించుకుంటే మేము సహించమని శాస్త్రీ భారత ప్రధానిగా గట్టి హెచ్చరిక చేయటమేకాకుండా స్వయంపోషక విధానం అభివృద్ధి చేసేసరికి భారత్ ఒకరిపై అధారపడవలసిన పనిలేదన్న విషయము అగ్రరాజ్యాలకు అర్థమయిపోయింది.

1966 జనవరి 3వ తేదీ. అయూబుతో చర్చలు జరిపేందుకు శాస్త్రి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో ష్కెంట్లో దిగాడు. స్వరణ్ సింగ్ – చవన్ – విదేంగ రక్షణ మంత్రులు ఆయనతోపాటు తాష్కెంటుకు వెళ్ళారు.రష్యా కోసిగిన్ తన అనుచరులందరితో ప్రధానికి తాష్కెం ట్ లో ఘనస్వాగతంచెప్పాడు. పాకిస్తాన్ ప్రెసిడెంటుఅయూబ్ ఖాన్ కూడా, తాష్కెంట్ చేరాడు. ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వ కార్యాలయంలో నాయకులు కలుసుకున్నారు. “మిత్రు లైన మీరు అరమరికలు లేకుండా, విషయాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలనీ, ప్రతి విషయానికి యుద్ధం పరిష్కార మార్గం కాదని, పాకిస్తాన్, ఇండియాల స్నేహ సంబంధాలు తాను కోరుకోవడం వల్ల నే తాష్కెంట్ లో సమావేశం ఏర్పర చడం జరిగిందనీ” కోసిగిన్ మిత్రులిద్దరికీ చెప్పాడు.

వారిద్దరినీ చర్చలకు వదలి తాను తప్పుకున్నాడు “లోగడ విషయాలు తవ్వుకోవడం మంచిదికాదనీ, ఏ దేశానికయినా, ఎవరి అభి మానం వారికి వుంటుందనీ, వారి మాదిరిగానే ఇతర దేశాల వారూ వారి అభిమానం గురించి ఆలోచిస్తారు గనుక, మనల్ని ఇతరులు గౌరవించాలను కున్నప్పుడు ఇతరుల్ని మనం గౌర విస్తే అసలు ఆశాంతికి స్థానమే వుండదనీ, సమస్యలనేవి సమా జంలో సహజమైనవనీ, అయితే వాటిని శాంతియుతంగా ఆలో చించి, పరిష్కరించుకుంటే, దేశాల మధ్యనేకాక ప్రపంచ శాంతికి భంగం రాదనీ,

Lal Bahadur Shastri press meet,

ఎన్నో సంవత్సరాలు పరాయిపాలనలో అనేక రంగాలలో దెబ్బతిన్న, ఈ దేశాలు స్వాతంత్ర్యం సంపా దించి, దేశోన్నతికీ, ప్రజాశ్రేయస్సుకూ, కాకుండా యుద్ధా లకూ మారణాయుధాలకూ సమయం నిరుపయోగం చేయడంమంచిది కాదనీ, రెండు దేశాలూ అనారోగ్యం, ఆర్థికం, అవిద్య, అనైక్యతలతో అల్లాడేటప్పుడు ప్రజలను ఈయుద్ధ జ్వాలల్లోకి లాగి మరింత అశాంతి పాలుచేయడం మంచిది కాదనీ, పాకి స్తాన్ను స్నేహపూర్వకంగా ఆదరించి సహాయ సహకారాలు అందించటంలో భారత్ ఎప్పుడూ సిద్దమేననీ, అదేరకంగా పాకిస్తాన్, భారత్ న్ను గౌరవించక పోవటం మంచి లక్షణం కాదనీ, పత్రికలు రేడియోలు గోరింతలు కొండంతలు చేయడం మామూలేననీ, ఈ చిన్న విషయాలను జాగ్రత్తగా ఆలోచించు కుంటూ, “ఆవేశానికి తావివ్వనినాడు.

దేశాలమధ్య తగాదా ఆకు అసలు ఆస్కారం ఉండదనీ, పాకిస్తాన్, ఇండియానాయ కులు కలసి చర్చించిన ఈ తాష్కెంట్ సమావేశం వృధా అయిందని ప్రపంచ దేశాలు చెప్పుకునే ఆస్కారం మనం కలి గించక, శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకుని భవి ష్యత్తులో ఇండియా, పాక్ మిత్రత్వానికి నాందిగీతం పాడదా మనీ” ఎంతో ఓర్పుతో శత్రువును భుజంతట్టి నచ్చచెప్పడంలో శాస్త్రి తనకు తానే సాటి అనిపించుకున్నాడు.

శాస్త్రి వంటి మహనీయుని ముందు అయూబ్ ఖాన్ ఆలోచనలు ఓడిపోక తప్పలేదు. 1966 జనవరి 19వ తేదీ సాయంకాలం నాలుగు గంటలకు కోసిగిన్ ఎదుట శాస్త్రి అయూ బ్ లు ఒడంబడిక మీద సంతకాలు చేశారు. వీరి నిర్ణయాలకురష్యా ప్రధాని కోసిగిన్ తోపాటు ప్రపంచ నాయకులంతా మెచ్చుకున్నారు. సామ, దాన, భేద, దండోపాయాలలో ఆయనకు ఆయనే సాటి. సాటిమనిషిని దైవంగా ఆరాధించనూ గలడు, సమయం మించి తన మంచి అర్థం చేసుకోకపోతే కఠినంగా దండించనూ గలడు.


ఆ రాత్రి 9 గంటలకు రష్యా ప్రధాని కోసిగిన్ రెండు దేశాల వారికి విందు ఏర్పాటు చేశాడు. విందులో అయూబ్ శాస్త్రాలు ఒకరి నొకరు అభినందించుకున్నారు. విందు ముగిసిన తర్వాత శాస్త్రి రేడియో, టెలిఫోనులో ఢిల్లీ లోని తన కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పాడు. గుల్జారీలాల్ నందాతో తమ ఒడంబడిక శాంతియుత వాతావరణంలో సాగిందనీ తనకుచాలా సంతోషంగా వున్నదనీ చెప్పాడు.
ఆ రాత్రి 11 గంటలకు ఆయన నిదురించాడు. ఆర్థ రాత్రి 1 గంట 30 నిముషాలకు తిరిగి మూడవసారి గుండె పోటు వచ్చి మెలుకువ వచ్చింది. శాస్త్రి సొంత వైద్యుడేకాక, రష్యాలోని ప్రముఖ వైద్యులెందరో ప్రయత్నించారు. కాని లాభం లేకపోయింది.

రామనామ స్మరణ చేస్తూ 1-32 నిముషాలకు మన ప్రియతమ నాయకుడు తాష్కెంట్ లో కన్ను మూశాడు. వార్త విన్న లలితాదేవి మూర్చపోయింది. ఎనభై ఏళ్ళ తల్లి ఏ రాము లాఠీదేవి తన కుమారుడు మరణించాడంటే నమ్మలేక శోకమూ ర్తి అయింది.11వ తేదీ ఉదయం సైనిక మర్యాదలతో తాష్కెంట్
విమానాశ్రయం చేర్చబడింది. శాస్త్రి మరణం విని ప్రపంచ దేశాలన్నీ శోకించాయంటే, ఆ మహనీయుని మంచితనం మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ వార్త వినగానే అంతులేని శోకంతో గుల్జారీలాల్ నందా ప్రధాని పదవీస్వీకారం చేశాడు.

Lal Bahadur Shastri death,

12వ తేదీ ఉదయం 9-30 నిముషాలకు సైనిక మర్యాదలతో భారతీయులతో పాటు ప్రపంచ ప్రముఖులంతా శోక వచనాలతో శాస్త్రిగారి అంతిమయాత్రలో పాల్గొన్నారు. యమునానదితీరాన శాంతివనంలో అంత్యక్రియలు ముగిశాయి.శాంతిదూత, నిస్వార్ధపరుడు, నిష్కళంక దేశభక్తుడు, నిరంతర శ్రామికుడు, మానవతావాది, మహామేధావి అయిన ప్రియతమ ప్రధాని శాస్త్రిగారి ఛాయాచిత్రం వాడ వాడలా ఊరేగిస్తుంటే, శోకించని భారతీయుడు లేడు. భారత ప్రజా నీకపు గుండె లోతుల్లో లాల్ బహదూర్ శాస్త్రి చిరస్థాయిగా కాపురం ఉంటాడు అనటంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు. శాస్త్రి నిజంగా మానవరూపంలో వెలసిన దేవుడు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,THE END,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


Leave a Comment