Mahatma Gandhi is a great Indian

Mahatma Gandhi is the great freedom fighter

Mahatma Gandhiహైస్కూలులో చదువుతున్న రోజులు. అప్పటికి ఆయనకు పన్నెండు సంవత్సరాల వయస్సు. రాజ్ కోటలోని ఆల్ఫ్రెడ్ హైస్కూలులో చదువుతూ వుండేవాడు.ఒకనాడు గైడ్స్ అనే ఇనస్పెక్టరు పరిక్షించుటకు వచ్చెను. ఆ ఇన స్పెక్టరు Mahatma Gandhi క్లాసుకు వచ్చి ఐదు ఇంగ్లీషు పదములను చెప్పి అక్షర క్రమమును (Spelling) వ్రాయ మనెను. ఈ ఐదింటిలో (Kettle) అనే పదం ఒకటి.Mahatma Gandhi కెటిల్ పదమును తప్పుగా వ్రాసెను. అది గ్రహించిన ఉపా ధ్యాయుడు తన కాలిబూటుతో ప్రక్క వాని పుస్తకములో చూచి వ్రాయమని సైగ చేసెను. కాని ఆవిధంగా చేయుటకు గాంధీకి మనసొప్పలేదు.క్లాసులోని విద్యార్థులందరు ఆయన మాటలకు వర్ణ క్రమము సరిగానే వ్రాసిరి.

 Mahatma Gandhi,

Mahatma Gandhiమాత్రం కెటిల్ పదము సరిగా వ్రాయలేక పోయెను. ఇనస్పెక్టరు వెళ్ళి పోయిన తరువాత ఉపాధ్యాయుడు “ప్రక్కవాని పుస్తకంలో నయినాచూసి వ్రాయలేని దద్దమ్మ”పని Mahatma Gandhi ని తిట్టిపోసెను. క్లాసు గౌరవం భంగం చేశావని దూషించెను.అంతమాత్రం చేత Mahatma Gandhi కి ఆ ఉపాధ్యాయుని పట్ల గౌరవం ఏమాత్రం తగ్గలేదు కాని ఇతరుల దాంట్లో దొంగ చాటుగా చూచివ్రాయుట ఆయనకు సుతరాము యిష్టం లేదు.

ఆత్మహత్యా ప్రయత్నం

Mahatma Gandhi హైస్కూలులో చదివే రోజులలో మరొకప్పుడు – జరిగిన సంగతిMahatma Gandhi , ఆయన బంధువుల తాలూకు శుద్ర వాడు ఒకతను సిగరెట్టు కాల్చుటకు వేడుక పడిరి.మంది సిగరెట్లు కాలుస్తూ ఆ పొగతో చిన్న చిన్న మబ్బు లను సృష్టించటం చూచి వీరిద్దరు కూడా ఆ విధముగా చేస్తే ఎంతో బాగుంటుందని తలపోసేవారు. కాని సిగరెట్టు కొనా లంటే వారిదగ్గర డబ్బులేవి. కొన్నాళ్ళు తాగి పారవైచిన సిగరెట్ పీకలు ఏరుకొని వాటిని ఎంతో భద్రంగా దాచు కొని కాల్చేరు. కొంత కాలం దొంగతనంగా చిల్లర డబ్బులు సంపాదించి సిగ రెట్లు కాల్చెడివారు.

కాల్చివేసిన సిగరెట్లు, డబ్బులు కూడా దొరకనప్పుడు బెజ్జములుగల కొన్ని మొక్కల వేళ్ళను తెచ్చుకొని కాలుస్తూ వుండేవారు అయినా వారికి తృప్తికలుగలేదు. చిల్లరడబ్బులు కావాలంటే ఇంటివద్ద యివ్వరు. సిగరెట్లు కాల్చాలనే ఉం లాటం రోజురోజుకు వారిలో పెచ్చు పెరిగిపోతూ వుండేది ఈ సమస్య ఈ విధంగా వుండగా పొరపాటున ఎవరయినా చూసి ఇంటివద్దచెబితే ఏమవుతుందోనన్న భయంను రొకవైపు పీకుతూ వుండేది. ఇదంతా ఎందువలన? పెద్దలమీద ఆధార పడి వుండుటవలననేకదా! తమకు ఇష్టంవచ్చినట్లు ప్రవర్తించే స్వేచ్ఛ లేదు కదా ! సరదాగా సిగరెట్లు బహిరంగంగా ! కాల్చుకునే స్వేచ్ఛలేదు కదా, యీ విధంగాMahatma Gandhi , తనకు స్నేహితుడయిన బంధువుల కుర్రవాడు ఆలోచించుకొని, ఈ పరాధీనపు బ్రతుకుకంటే ఆత్మహత్య చేసుకోవటం మేలని నిశ్చయించుకున్నారు.

అయితే ఎలా చావటం, ఏ విధంగా? సరే, ఎలాగైతే నేమీ ఉమ్మెత్తగింజలు మహాచెడ్డ విషమని తెలుసుకున్నారు. దగ్గరలోవున్న అడవికిపోయి వాటిని ఏరుకువచ్చారు. ఆరోజు సాయంకాలమే మంచిదని నిశ్చయించుకొని తేడా రేశ్వర దేవాలయమునకుపోయి దైవదర్శనము చేసుకొని ఉమ్మెత్త గింజలు మ్రింగ మొదలిడిరి కాని ఒకటి రెండు గింజలు మ్రింగునప్పటికీ వారికి భయము కలిగెను. దాంతో ఆ ప్రయ త్నము విరమించి ఆత్మహత్య అన్న అంత తేలికైన విషయం కాదని తెలుసుకొనిరి.
నాటినుంచి Mahatma Gandhi మాత్రం సిగరెట్లు జోలికి పోలేదు. అందుమూలముగా డబ్బు దొంగిలించవలసిన పనికూడా లేకపోయెను.

మాంస భక్షణ : వేశ్యాగృహము

ఈ సంఘటన Mahatma Gandhi కి హైస్కూలులో చదివే రోజులలో జరిగెను.ఆయనకు చిన్ననాటి మిత్రుడు వుండెడివాడు.అతని సహవాసమునకు Mahatma Gandhi గారి తల్లి, అన్న, భార్య (Mahatma Gandhi కి 13వ ఏటనే వివాహం అయ్యెను) ఒప్పుకొనక పోయినను వీరినెవ్వరిని లెక్కచేయక ఆ ఆ మిత్రునితోనే దోస్తీగా వుండెడివాడు.

ఒకనాడు ఆ మిత్రుడు మాంసాహారము భుజించుట వలన కలిగెడు సుగుణాల గురించి Mahatma Gandhi కి బోధింప మొదలిడెను. మాంసాహారము తీసుకొనుటవలన శరీరము బలిష్టంగా వుండునని, మనస్సుకు ధైర్యము కలుగునని నూరిపోసెను. సహజంగా పీలగావుండే Mahatma Gandhi కి ఈమాటలు నచ్చెను. తను కూడా ఒక చిన్న వస్తాదులా తయారు కావచ్చును. అప్పుడు తనంటే దొంగలకు హడలుగా వుంటుంది. వెయ్యాలు, భూతాలు తన దరిచేరవు. ఈవిధంగా ఊహించుకోని గాంధి మాంస భక్షణకు సంసిద్ధుడయ్యెను.

 Mahatma Gandhi,

అనుకున్నట్లుగానే గాందీ మిత్రునితో కలిసి మాంపా హారము తీసుకొనుటకు ఎవరికి కానరాని నది ఒడ్డున వొక ఏకాంత ప్రదేశమునకు వెళ్ళెను. వండిన మాంసం Mahatma Gandhi కి నచ్చలేదు. అయినను తప్పనిసరిగా అలవాటు చేసుకొన వలెననే ఉద్దేశ్యంతో తిన మొదలిడెను. కొద్దిసేపటికి బంతి అయ్యేటట్లు ఉండుటచే దానిని అంతటితో వదిలెను. ఆ రాత్రి Mahatma Gandhi కి నిద్రలేదు. కడుపులోనుండి “మేమే” అని అరచినట్లు త్రుళ్ళిపడి లేచేవాడు.

ఈ విధంగా జరిగినను మాంసాహారం తిను ప్రయత్నం విరమించలేదు. ఏ విధంగానైనా మాంసం తిని తను కూడా ఒక “వీరుడు” కావాలనే పట్టుదల ఏమీతగ్గలేదు. ఇక Mahatma Gandhi స్నేహితుడు కూడా అంత తేలికగా వదిలేవాడు కాదు. ఏ విధంగానై తేనేమి Mahatma Gandhi ఆ స్నేహితుని మూలంగ 5, 6 సార్లు మాంసముతో చేసిన వంటకాలు తినెను. ఈ విధంగా మాంసం తిన్ననాడు Mahatma Gandhi తన తల్లితో ఆకలిగా లేదని బొంకి తప్పించుకొనెడివాడు. కాని ఆ విధంగా అబద్ధాలాడు Mahatma Gandhi కి ఇష్టంలేకుండెను. కాని మరి ఎలా? మాంకం తినుటఅయినను మానవలెను లేక తల్లితో ఏదో ఒక విధంగా బొంకి తను చేసిన తప్పిదాన్ని మాపుకొనవలెను. చివరకు ఆలో ఉంచి అబద్ధాలు చెప్పటంకన్నా మాంసాహార విసర్జనే మంచి దనే నిర్ణయానికి వచ్చి అప్పటినుంచి దానిని మానివేసెను.

దీని తర్వాత ఇదే మిత్రుడుMahatma Gandhi కి అనేక కల్లబొల్లి మాటలు చెప్పి భోగముదాని ఇంటికి తీసుకువెళ్ళెను. చేయవల సిన ఏర్పాట్లు లోగడనేచేసి డబ్బుకూడా ఆమెకు ఆ మిత్రుడే ఇచ్చెను.Mahatma Gandhi లోపలికి వెళ్ళి పరుపు మీద ఆమె ప్రక్కన కూర్చుండెను.Mahatma Gandhi నోటివెంట మాటరాలేదు. ఏమీ చేయు టకు తోచక వెర్రి మొహం వేసుకు చూస్తూ వుండిపోయెను. ఎంత సేపటికి ఉలకడు, పలకడు దాంతో ఆ వేళ్మకు చిరాకు వేసి తిట్టుచూతిమ్ముచూ బయటకుపొమ్మని ద్వారం చూపెనుఆ విధముగాMahatma Gandhi వ్యభిచారమనే పాప పంకిలంలో పడకుండా బయటపడెను. బహుశా భగవంతుడే పరోక్షముగా తనని ఈ విధంగా రక్షించి ఉండునని Mahatma Gandhi గారు తన ఆత్మ కథలో వ్రాసుకున్నారు.

జీవితంలో మాయనిమచ్చ

Mahatma Gandhi కి అప్పటికి. 16 సంవత్సరాలు. తండ్రి దీర్ఘ వ్యాధిచే మంచము పట్టెను.Mahatma Gandhi తండ్రి చెంతనే వుండి పన ర్యలు చేస్తూండేవాడు. కట్టువిప్పి కట్టుట, మందు ఇచ్చుట అతని పని. రాత్రిపూట కాళ్ళుపిసికి తండ్రి అనుమతి ఇచ్చిన తర్వాతనే వెళ్ళి నిదురించెడివాడు ఈ విధంగ తండ్రి సేక చేయడం మిక్కిలి సంతోషం కలిగించెడిదిMahatma Gandhi కి, పగలంతాబడిలో చదువు, సాయంత్రమునుండి రాత్రి పొద్దుపోయేవరకు తండ్రి సేవతో సరిపోయేది.ఇదే సమయంలో కస్తూరికా గర్భవతి. రాత్రి జాజా ప్రొద్దుపోయేవరకు తండ్రి సేవలు చేస్తూవుండే సమయములో మనసు అంతా భార్యమీద, పడకగదిమీద ఉండేదట. ఈ విష యముగురించి తన ఆత్మ కధలో మనస్సు విప్పి వ్రాస్తూ ఆ నాటి కుర్ర చేష్టలు, కామప్రవృత్తి గురించి మిక్కిలి విచా రించుతారు. మీదు మిక్కిలి కార్య నిండుచూలాలు ప్రసవించే రోజులు దగ్గరపడ్డా కూడా వైద్యరావు విరుద్ధం, లోక విరుద్ధ మైన తన కామతురతపట్ల వాపోతారు.

 Mahatma Gandhi,

ఇదిలా వుండగా మరొక దురదృష్టకర సంఘటిన జరుగుతుంది. తండ్రికి వ్యాధి రోజురోజుకు అధికంగా వొచ్చెను ఒకనాడు రాత్రి 10, 11 గంటల సమయం Mahatma Gandhi తండ్రి కాళ్ళు ఒత్తుచుండెను. పినతండ్రి వచ్చి “నేను కాళ్ళువత్తునుకు నీవుపోయి పరుండమని” చెప్పెను. అన్నదే తడుపుగ పడక గది మీదనే ధ్యాన వున్నMahatma Gandhi సంబరపడుతూ వెళ్ళెను. అప్పటికే భార్య నిద్రపోవుచుండెను. గాంధీ నిద్రలేపెను. 5, 6 నిమిషాలలో నౌకరు తలుపుతట్టి “తండ్రి గారికి విష మంగ ఉంది. రండు రండు” అని పిలిచెను. ఆకరా బాడకా Mahatma Gandhi తండ్రి చెంతకుపోయెను. కాని ఏమిలాభం? అప్పటికే ఆ ముదుసలి ప్రాణములను పడలేను.

అప్పటి Mahatma Gandhi వ్యాకులత ఏమని వర్ణింతుము. తండ్రి ఆఖరి క్షణములలో… సేవచేస్తూ ఉండకపోతినే అని ఒకవైపు తండ్రి విషమ పరిస్థితులలో నుండగ తాను భార్యతో వకపాలాడుతూ ఉండటనూ అని మరొకవైపు Mahatma Gandhi ని ‘మిక్కిలి క్రుంగదీ సెను.ఈ సంఘటనకు “తన జీవితములో మాయనిమచ్చ”గా తన ఆత్మ కధలో పేర్కొన్నారు. తనను కామాంధుడిగ వర్ణించుకొనెను.

అసత్యం తెచ్చిన అపాయము

Mahatma Gandhi లండన్లో బారిస్టర్ చదివేరోజులు. అప్పట్లో భారతీయ విద్యార్ధులందరు తమకం ఇంటివద్ద వివాహం జరిగి ఒకరిద్దరు పిల్లలువున్నా వివాహం కాలేదని బ్రహ్మచారినని చెప్పుకుంటూ ఉండేవారు. ఇందుకుకొన్ని కారణములు వుండె డివి. ఇంగ్లాండులో విద్యార్ధులు చదువుపూర్తి అయితేనేకాని వెళ్ళిని చేసుకోరు. వివాహమువలన విద్యనాశనమవుతుందని వారి భావన. అందువలన భారతీయ విద్యార్థులు తమకు ఆ చిన్న వయసులోనే పెండ్లి అయ్యిందని చెప్పుటకు సిగ్గుపడి కాలేదని చెబుతూండేవారు. ఇంకొక కారణం కూడా వుంది. ఆ దేశంలో పెండ్లి అయినవారిని పెండ్లికాని ఆడపిల్లలతో కలిసి తిరుగుటకు ఒప్పుకొనరు. అందువలన ఈ అవకాశము పోతుందనే ఉద్దేశ్యంతో కూడా భారతీయ విద్యార్థులు అం ద్ధాలు చెప్పేవారు.

అందరు విద్యార్థులు వివాహంకాలేదని చెపుతున్నారని గాంధీకికూడా తనకు వివాహిం కాలేదని చెప్పెను. ఒకనాడు హోటల్ లో ఒక వృద్ధ వితంతువుతో పరిచయమేర్పడెను. ఆ పరిచయం మైత్రిగరూపొంది ప్రతిఆదివారం ఆమెకనింటికి Mahatma Gandhi ని ఆహ్వానించటం జరిగేది ఆవిడ వయస్సులోనున్న ఒక కన్యతో Mahatma Gandhi కి పరిచయమేర్పరచెను. ప్రతి ఆదివారం Mahatma Gandhi వృద్ధవితంతువు ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆ కన్య Mahatma Gandhi పై అతి చనువు తీసుకొని ప్రవర్తించుచూ వుండెడిది. వితంతువుకూడా అందుకు ప్రోత్సహించుతూ వుండేది.

 Mahatma Gandhi,

కొన్నాళ్ళకు Mahatma Gandhi కి దీనిలో ఏదోకుంభకోణంవున్నట్లు ఊహించెను. బహుశా ఆకన్నెపిల్లలకు, తనకు వివాహం జరి పించే ఎత్తులో ఆ వృద్ధురాలు ఉన్నట్లుగ తోచెను. దాంతో Mahatma Gandhi సంకట పరిస్థితిలోపడిపోయెను. ఇంటివద్ద భార్యపిల్లలు ఉండగ మరొక వివాహమా? అయినా దీనికంతటకూ కారణం ఒక విధముగ తనేనేమో ననిపించింది. వివాహం అయిందని ఆ వృద్ధురాలితో చెబితే ఈ విధముగ చేసెడిదికాదు గదా. తనకు, ఆ యువతి పరిచయం ఏర్పడి యుండెడిదికాదు గదా.
ఈవిధముగ ఊహించి ఇక నిజం చెప్పక తప్పదనుకొని ఈ విధముగ ఆ వితంతువుకు ఉత్తరం వ్రాసెను.

“మీరు నన్ను కన్న కుమారునివలె భావించిరి. నాకును ఆ యువతికి వివా హం చేయవలెనన్న ఊహతో వున్నారని తలంచుచున్నాను. పరిస్థితులు చేయిదాటిపోకుండా యదార్ధ విషయాలు విన్నవిం చుకోదలుస్తున్నాను. నాకు చిన్నప్పుడే పెండ్లి అయింది. ఒక కుమారుడుకూడా వున్నాడు. ఇంతకాలం ఈ విషయం మీకు చెప్పనందుకు క్షమించగోరుతాను. ఆ యువతియు నేనుకు హద్దుమీరి ప్రవర్తించలేదని వాస్తవంగా చెప్పుచున్నాను. ఈ ఈ ఉత్తరం చదివిన పిదప మీ స్నేహమునకు అనర్హుడనని తోచి నను నాకు తప్పలేదు. లేదా యధా ప్రకారము మీరు నన్ను ఆహ్వానించినను సంతసింతునుఅనేకమార్లు కూడబల్కు ని అనేకసార్లు చిత్తువ్రాసి చించివేసి ఎలాగో ఒకపట్టాన పై ఉత్తరం వ్రాసెను.

తిరుగు పై టపాలోనే ఆ వితంతువు వద్దనుంచి సమాధానంవచ్చెను. “నీ ఉత్తరంచూసి నవ్వుకొంటిమి. వాస్తవ విషయములు ముందు గానే చెప్పి రక్షించితివి, నీ హృదయనైర్మల్యము మెచ్చదగి నది.” ఎప్పటివలెనే మాతో స్నేహముగ వుండుము రేపటి ఆదివారమువచ్చి, నీ బాల్యవివాహపు చరిత్ర చెప్పి మమ్మల్ని వినోద పెట్టుదవుగార! ఈ సంఘటన వలన మనమైత్రికి ఎట్టిఆటంకము లేదు.
అప్పటికిగాని గాంధీజీ మనసు తేలికపడలేదు. అప్పటి నుంచి మరెప్పుడు వివాహ విషయంలో అసత్యము పలకలేదు. నలుగురిలో మాట్లాడటానికే భయం.

Mahatma Gandhi ఇంగ్లండులో బారిష్టరు చదివేరోజులు అక్కడి శాఖాహార సంఘములో కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకోబడెను.Mahatma Gandhi గారు శాఖాహార సంఘములన్నిటికి తప్పనిసరిగా హాజ రగుచుండెడివాడు. కాని ఆ సభలో మాట్లాడాలంటే అమిత సిగ్గుపడుచుండెడివారు. మాట్లాడాలని కుతూహలం వుండేది. కానీ తీరా మాట్లాడబోయేసరికి నోరు పెగిలేదికాదు.ఇలాకాదని ఒకనాడు ఒక అరఠావు కాగితముపై తాను మాట్లాడదల్చుకున్నది. ఇంటివద్దనే వ్రాసుకెళ్ళెను. తీరా లేచి చదవబోయేటప్పటికి నోరు బిగుసుకుపోవటం, కాళ్ళు గడగడ వణకటం. తనకు తెలియకుండానే తిరిగి కుర్చీలో చతికిల పడటం జరిగిపోయింది Mahatma Gandhi తన ఆనాటి అసమర్థతకు సిగ్గుపడి పోయెను.

 Mahatma Gandhi,

ఇంగ్లండులో వున్నంత కాలంలోనూ Mahatma Gandhi అనేకమార్లు పదిమందిలో ఉపన్యసించటమునేర్చుకొనుటకు అనేకతంటాలు పడెను. కాని అన్నిసార్లలోనూ ఒక్కసారికూడ మాటాడలేక పోయెను. ఆఖరుకు తను ఇంగ్లండు విడిచి భారతదేశానికి వచ్చే సందర్భంలో తన శాఖాహార మిత్రులందరకూ విందు ఏర్పాటుచేసెను. ఆ సందర్భంలో ఎలాగైనా మాట్లాడాలని ఒక నిశ్చయానికివచ్చెను. తీరాతనవంతు వచ్చేటప్పటికీ ఒక్క వాక్యము మాట్లాడటం మినహాయించి నోరాడలేదు. ఇకలాభం లేదనుకొని “తామంతా దయతో నేచేసిన విందుకు వచ్చి నందుకు వందనముల”ని చెప్పి కూర్చుండిపోయెను.ఆ విధంగా అప్పట్లో Mahatma Gandhi పదిమందిలో మాట్లాడ టానికిబిడియపడేవారు దక్షిణాఫ్రికా వెళ్ళినతర్వాత ఈబిడియం కొంతవరకు తగ్గి ప్రసంగములు చేయుటకు అలవాటుపడెను.

మొదటి కేసుకోర్టు అనుభవాలు

లండన్ నుంచి తిరిగివచ్చిన తర్వాత Mahatma Gandhi బొంబాయి లో బారిష్టరు బల్లకను ఆయన మొదటికేసు మమీబాయి అనే ఒకామెకు సంబంధించిన అతిచిన్న కేసు. ఫీజు ముప్పై రూపాయలు.
కేసు చిన్నదికావున స్మాల్కాజ్ కోర్టులో విచారణకు వచ్చెను.Mahatma Gandhi లేచినిలబడి ప్రశ్నలు అడగబోయేను. కాని నోట్లోనుంచి మాట బయటకురాలేదు. తల తిరుగుచుండెను. కోరంతయు గిరగిర తిరుగుతున్నట్లనిపించెను కాళ్ళు గడగడ వణక నారంభించెను. ఇదంతా గ్రహించిన జడ్జి నవ్వనారంభించెను. ఇకసాటివకీళ్ళు ఈ తనూషాచూచి ఆనందించుచుండిరి ఇక లాభంలేదని గాంధీజీ కుర్చీలో కూలబడిపోయెను.వెంటనే తన క్లయింటును పిలిచి నీ కేసు వాదింపలేను. మరొక రెవరినయినా చూసుకొమ్మని ఫీజు వాపసు ఇచ్చివేసెను.

బొంబాయి లో ఇదే మొదటికేసు ఆఖరి కేసు కూడా. తన అసమర్థతకు Mahatma Gandhi సిగ్గుపడిపోయెను. ఇక కోర్టుకు వెళ్ళు టకు లాభంలేదని మానుకొని పార్టీలకు అర్జీలు వ్రాసిపెట్టుట ప్రారంభించెను. దీనివలన కొద్దికొద్ది ఫీజులు ముట్టుచెండెడివి కాని సంసారం జరుగుటకు సరిపోవుట లేదు.ఇలాకాదని బడిపంతులు ఉద్యోగానికి ప్రయత్నించెను కాని బి ఏ, డిగ్రీ లేకపోవుటచే అదికూడా దొరకలేదు.ఈ విధముగా ఆరు మాసములు బొంబాయిలో వుండి సంసారం గడుపుట కష్టసాధ్యమగుటచే ఇక లాభములేదని బిచాణా ఎత్తివేసి తిరిగి రాజ్కోటకు పయనం కట్టెను.

 Mahatma Gandhi,

Mahatma Gandhi తన బొంబాయి హైకోర్టు అనుభవాలను తన స్వీయచరిత్రలో ఈవిధంగా వర్ణించెను. “బొంబాయిలో నేను ప్రతిరోజు కోర్టుకు వెళ్ళుచుంటిని అచ్చట నాకేమీ అంద నూ లేదు. అర్ధంకానూ లేదు. వాలాసార్లు కేసు అర్థంకాక కోర్టులో నిద్రపోవుచుండువాడను. నాకు తోడు యింకా కొంతమంది నాబోటివారే వుండుటచే నాకు సిగ్గనిపించలేదు. అనలు కొన్నాళ్ళకు హైకోర్టులో కూర్చుని నిద్రపోవుట, ఒకప్యాషన్ అనుకొని ‘సిగ్గుపడుట మర్చిపోతిని.”

తెల్లదొరల అహంకారం

Mahatma Gandhi బొంబాయి నుంచి వచ్చిరి. రాజ్కోటలో ఆఫీసు పెట్టుకొనెను. ఇచ్చట కూడా కోర్టుకు వెళ్ళే ధైర్యం లేకపోయెను. కాని అర్జీలు, మహాజర్లు వ్రాసినందువల్ల కొంత రాబడి వచ్చెను. Mahatma Gandhi అన్నగారయిన లక్ష్మీదాస్పోర్్బందర్ సంస్థా నంలో కార్యదర్శిగాను, సలహాదారుగాను, పనిచేసివుండెను. అప్పట్లో ఆయన ఏదో కుట్ర పన్నెనని ఒక అభియోగంవచ్చి అది బ్రిటిష్ పొలిటికల్ ఏజెంటుదాకా వెళ్ళెను! దానిపై ఏజెంటు లక్ష్మీదాసుపై ఆగ్రహంతో వుండెను. ఈ పొలిటికల్ ఏజంటుకి Mahatma Gandhi గారికి లండన్లో పరిచయం వున్నది.

ఈ సంగతి గ్రహించిన లక్ష్మీదాస్ గాంధీజీని పొలిటి కల్ ఏజంటు వద్దకు వెళ్ళి తన వ్యవహారం మాట్లాడిసరిచేయ వలసిందని గాంధీజీని వత్తిడి పెట్టసాగెను. గాంధీజీ ఏజెంటు వద్దకు పోవుట ఏ మాత్రం ఇష్టంలేదు. కాని తన చదువు సంధ్యలకు అన్ని విధాల ఆర్థిక సహాయంచేసి సహాయంచేసి తనను పైకి తీసుకువచ్చిన అన్న మాటలకు ఎదురాడలేక ఏజెంటువద్దకు వెళ్ళుటకు నిశ్చయించెను.ఆ విధంగా ఏజెంటువద్దకు వెళ్ళి తన పూర్వ పరిచయం గుర్తుచేసి తన అన్న వ్యవహారము ప్రస్తావించెను. కాని ఆ ఏజంటు వినక “నీ అన్న కుట్రగాడు నీవేమి చెప్పిననూ నేను వినను, మీరిక వెళ్ళవచ్చునని కరకుగా మాట్లాడెను గాంధీ వెళ్ళక ఇంక ఏదో చెప్పబోవుచూ వుండగా ఆ ఏజంటుజవానుని పిలిచి “బయటకుపంపుడని” ఆజ్ఞాపించెను. గాంధీ ఇంకా ఏదో గొణుగుచునేవుండగా జవాను చేతులు పట్టుకొని
బయటకు లాగుకొని పోయెను.

బాపూజీ బయటకువచ్చి “మీరు నన్ను అవమానపరచి తిరి. జవానుచే బయటకు నెట్టించితిరి. అందుకు సంజాయిషీ చెప్పుకొననిచో పరువునష్టందావా తేగలనని” ఒక చీటీ వ్రాసిఏజెంటుకు పంపెను.
అందుకు జవాబుగా ఆ ఏజంటు “మీరునావద్ద అసభ్య ముగ ప్రవర్తించితిరి. బయటకు పొమ్మన్నను పోకపోతిరి. అందువలన జవానుచే బయటకు పంపవలసివచ్చెను. ఆపైన మీరేమి చేసుకొన్నాసరే” అని చీటీ వ్రాసి పంపెను.ఉత్తరం జేబులో పెట్టుకొని తలవంచుకొని ఇంటికిచేరి జరిగినదంతయు ఆన్నకు చెప్పెను. లక్ష్మీదాసు ఎంతగానోవిచారపడెను.

బాపూజీఏజెంటు వ్రాసిన ఉత్తరం అనేకమంది ప్రముఖ పకీళ్ళకు చూపించి ఆ ఏజంటుమీద పరువునష్టం దావా వేయ ఆ వలెనని ప్రయత్నించెను. “ఈ రోజులలో వకీళ్ళు, బారిష్టరుల పని ఈ విధముగనే వుంది. నీవు క్రొత్తగా లండన్ నుంచి దిగినావు. ఇంకను ఉడుకుపాలు, తెల్ల అధికారులను నీ వెరుగవు కాబట్టి చీటీని చింపివేసి అవమానము దిగమింగమని” కొంత మంది సలహా ఇచ్చిరి.అంతకన్నా చేయగలిగిందేమీ కనిపించలేదు బాపూజీ డి కాని ఈ సంఘటన బాపూజీ జీవితములో పెద్ద మలుపుగాచెప్పుకోవచ్చును. ఈ అవమానం తన జీవితాన్నే మార్చి వేసిందని “స్వీయ చరిత్ర” వ్రాసుకొన్నారు.

తలపాగా తగాదా

బాపూజీ దాదా అబ్దుల్లా అండ్ కంపెనీ దావావిషయమై పనిచేయుటకు దక్షిణాఫ్రికా పయనమయి వెళ్ళెను. ఆ రోజు లలో అక్కడ హిందువులంటే చాలాహీనంగా చూచెడివారు. నల్లవారితోపాటు వారికి ఎటువంటి హక్కులు వుండేవికావు.గాంధీజీ దర్బాన్ (దక్షిణాఫ్రికాలో ఒక పట్టణం)లో దిగిన ఒకటి రెండు రోజులకు దాదా అబ్దుల్లాకంపెనీ దావా పనిమీద కోర్టుకు వెళ్ళెను. గాంధీజీతలపాగా ధరించివుండెను. ఇది చూచిన మేజిస్ట్రేట్ గాంధీజీవంక మిర్రిమిర్రిగా చూసి తలపాగతీసివేసి రావలసిందని ఆజ్ఞాపించెను. (ఆరోజుల్లో హిందువులు ఆచ్చట తలపాగ ధరించుట నిషిద్ధం) గాంధీజీ అందులకు అంగీకరించక కోర్టునుండి బయటకువచ్చి వేసెను.

 Mahatma Gandhi,

అందుమీదట గాంధీజీ తనుతలపాగ ధరించుట గురించి సమర్ధించుతూ పత్రికలలో వ్యాసాలు వ్రాయ మొదలిడెను. తలపాగ విషయమై వాద ప్రతివాదనలు పత్రికలలో జోరుగా సాగెను. గాంధీజీ దక్షిణాఫ్రికా పత్రికలు పిలవని పేరంట కాడు(Unwelcome Visitor) అని వ్యాఖ్యానించ మొదలిడెను ఈ విధంగా దక్షిణాఫ్రికా చేరిన 5, 6 రోజులలోనే బాపూజీ మాత్రం తలపాగ ధరించుటమాత్రం మానలేదు.

దక్షిణాఫ్రికాలో గాంధీజీ అగచాట్లు

దర్బాన్లో కొన్ని రోజుల తర్వాత కంపెనీ వ్యవహా రమై ప్రెటోరియా అను పట్టణమునకుబయలు దేరెను. రైలులో మొదటి తరగతిలో ప్రయాణం. రైలురాత్రి తొమ్మిదిగంటలకు “మాంటుబర్లు అను పట్టణమునకు చేరెను.ఆ సమయంలోఒక తెల్లదొర వచ్చి బాపూజీని ఎగాదిగా చూసి రైల్వే అధికారు లను తీసుకువచ్చెను. నీవు ఇచ్చట నుంచి లేచి మూడవతరగతి పెట్టెలో కూర్చుండవలెను” అందుకు గాంధీజీ “నావద్ద ఫస్టు క్లాసు టిక్కెట్టు వున్నది. నేనెందుకు మూడవ తరగతిలో కూర్చుండవలెనని ప్రశ్నించెను. అందుకు ఆ రైల్వేఅధికా రులు, తెల్లదొర “అదేమి కుదరదు. మర్యాదగ వెళ్ళుతావా లేక పొలీసులచేత గెంటించమంటావా?” అని కేకలు వేయ మొదలెట్టిరి. బాపూజీ “ఏమిచేసినా సరే నేను మాత్రం ఇచ్చట నుంచి కదలను” అనెను.

అందుమీదట వారు పోలీసులను తీసుకువచ్చిరి. పోలీ నులు బాపూజీని రైలు పెట్టెనుంచి చేయిపుచ్చుకొని బయటకి నందరగా బయటపడ వేసిరి. వెట్టిరి. సామానంతా చిందర వందరగా
ఏమైనా గాంధీజీ మాత్రం మూడో తరగతి పెట్టెలోకి వెళ్ళుటకు నిరాకరించి సామాను మాత్రం అచ్చటనే వదిలి వెయిటింగ్ రూమ్ లోవచ్చి కూర్చుండెను.బయట విపరీతమయిన చలిగ వుండెను. ఓవర్ కోటు బయటపడ వేసినసామానులో వుండిపోయెను. సామాను రైల్వే అధికారులు కాపాడుచుండిరి. ఓవర్ కోటు ఇవ్వమనిన ఇంకేమి అవమానపరచుదురోనని అలాగే చలిలో గడగడవణకుచూ దక్షిణాఫ్రికాలోని జాత్యహంకారం హిందువులదుస్థితి గురించిఆలోచించనారంభించెను.

ఇప్పుడేమి చేయవలెను? వచ్చిన దారిన ఇండియాకు తిరిగిపోవుటా? అవమానమును దిగమ్రింగుటా? కొద్దిరోజుల లోనే తను ఇన్నిసార్లు అవమానించణడెనుగదా. మరిఇచ్చట అనేక సంవత్సరాలనుంచి వుంటున్న హిందువుల పరిస్థితి ఎంత హీనంగాను, దారుణంగానూ వుంటుందో? ఈ విధంగా తెల్లవార్లు ఆలోచించి మరునాడు మరొక రైలులో ప్రయాణంకొనసాగించెను.

అవమాన పరంపర

ప్రిటోరియాకు వెళ్ళేమార్గంలోనే గాంధీజీకి మరొకఅవమానకర సంఘటన జరిగెను.
మార్గంతో కొంతదూరం గుర్రపు బగ్గీలోనే ప్రయా ణము చేయవలసి వచ్చెను. గుర్రపుబండి ఆసామి తెల్లవాడు బండిలో తెల్లదొరల ప్రక్కన బాపూజీని కూర్చొబెట్టుటకు ఇష్టములేదు. బండితో లేవాని ప్రక్కన సీటువున్నదికానితాను అచ్చట కూర్చుంటే బాపూజీని లోపల తెల్లవారి ప్రక్కన కూర్చోబెట్టవలసి వస్తుందని ఆబండి ఆసామి లోపలకూర్చుని గాంధీకి బండితోలేవాని ప్రక్కన కూర్చుండమనెను.
గాంధీకి అలా కూర్చోవటం చాలా అవమానం అనిపించెను. అయినా చేసేదేమీలేక ప్రయాణానికి మరొకమార్గం లేక అవమానం దిగమ్రింగుకొని అలాగే కూర్చుండెను.

 Mahatma Gandhi,

బండి కొంతదూరం వెళ్ళినాక బండి ఆసామి నేను బండి తోలేవాని ప్రక్కన కూర్చోవాలి నీవక్కడ లేచి ఇక్కడ కూర్చోమని తన కాళ్ళవద్ద ఒక మురికి గుడ్డ పరిచెను. గాంధీజీ నేనక్కడ కూర్చోనని మొరాయించటంతో ఆ బండి ఆసామి బండిలో నుంచి క్రిందకులాగి బండబూతులు తిడుతూ ఆదవడ ఈ దవడ వాయించ నారంభించెను. ఈ దృశ్యం చూస్తున్న మిగతా ప్రయాణీకులు జాలిపడి అతన్ని ఏమీ చెయ్యకండి. అతడి తప్పు ఏమీలేదు అని వారించుటతో ఆ బండి ఆసామి గాంధీని విడిచిపెట్టెను. గాంధీజీ మిగతా ప్రయాణీకులతో బండిలో కూర్చొని ప్రయాణం కొనసాగించెను.

ప్రిటోరియాకు వెళ్ళే వెళ్ళే మార్గంలోనే మరొకచోట బాపూజీ రైలులో ఫస్టుక్లాసులో కూర్చుండి ఉండెను. రైల్వే గార్డువచ్చి “నీవిచ్చట కూర్చుండుటకు వీలు లేదు మూడో క్లాసుకు వెళ్ళవలసింద”ని ఆదేశించెను. ఆ పెట్టెలో వున్న ఒకేఒక శ్వేతజాతీయుడు “ఆదేమిటయ్యా! ఆ పెద్దమనిషి దగ్గర ఫస్టుక్లాసు టిక్కెట్టు వుంటే థర్డుక్లాసులోనికి వెళ్ళి మంటావ్?” అని మందలించటంతో ఆ గార్డు “కూలీతో ప్రయాణం చేయటం నీకిష్టమైతే మధ్య నాకేంటి” అని గొణు గుచు వెళ్ళిపోయెను. (ఆ రోజులలో అచ్చట హిందువులని కూలీలని పిల్చేవారు)

ప్రజాసేవకు మూల్యమా?

బోయరు యుద్ధం ముగిసినతరువాత గాంధీజీ దక్షిణా ఫ్రికానుంచి స్వదేశమునకు బయలుదేరుటకు సిద్ధపడెను. దక్షి ణాఫ్రికా భారతీయులకు చేసిన సేవకు గుర్తింపుగ అచ్చటభారతీయులు అనేకమంది గాంధీజీకి, కస్తూరిబాకు, పిల్లలకు రకరకాల కానుకలు సమర్పించిది వాటిలో విలువగల అనేక బంగారు నగలు, హారాలుకూడా వుండెను.ఈ బహుమతులను తాను స్వీకరించవచ్చునా” స్వీక రించినయెడల తను చేసిన ప్రజాసేవకు మూల్యము తీసు కున్న పేకదా, ఈ బహుమతులలో కొన్ని తన భార్యకు పిల్లలకు ఉద్దేశింపబడినవి. తిరిగి ఎవరుఇచ్చినవి వారికి ఇచ్చి వేయుటకు వారు ఒప్పుకుంటారా ? భార్య ఉద్దేశ్యం ఏమయి వుంటుంది? ఈ విధంగ ఒక రోజంతా ఆలోచించి వారి అను మతితో ఈ బహుమతులను బ్యాంకులో వేసి ప్రజా కార్యము లకు వినియోగింప నిశ్చయించెను.

అందులకు పిల్లలను రావించి వారి అనుమతితీసుకొని భార్యతో ఈ విషయమై ప్రస్తావించెను. కస్తూరిబా అందుకు అంగీకరించక “ఈ నగలునాణాలు మనకుప్రస్తుతం అవసరం లేకపోవచ్చును కాని రేపువచ్చిన కోడళ్ళు అయినా రేపటిపరిస్థితులు ఎవరికి తెలియును. చేతుల్లోకివచ్చిన సిరిని కాలతన్నుట ఏమంతభావ్యం” అని గాంధీజీతో వాదింప మొదలిడెను. గాంధీజీ ఈ మాటలు లెక్కచేయక పోవటంతో కన్నీరు కారుస్తూ “నా నగలన్నిటినీ ఒలిచి తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలను సన్యాసులను చేయజూస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు కానీయండి” అంటూ నిష్టూరంగా మాటలాడ సాగెను .
ఈ విధంగా భార్యాభర్తల మధ్య కొంత వాద ప్రవాదనలు సాగిన తర్వాత చివరికెలాగో గాంధీజీ కస్తూరిబాను అతికష్టంమీద పప్పింపగలిగెను.

 Mahatma Gandhi,

బహుమతుల ద్వారా వచ్చిన ధనమంతా బ్యాంకులో వేసి ఒకదానం పత్రంరాసి ఈ సొమ్ము ప్రజా కార్యాలకు ఉపయోగించుటకు ధర్మకర్తలను నియమించెను.గాంధీజీ తాను ఆనాడు చేసిన ఈ పనికి యెన్నడూ పశ్చాత్తాపపడ లేదు. కస్తూరిబా కూడా కొన్నాళ్ళకి దీని ఔచి త్యాన్ని గుర్తించగలిగెను.
ఏ ప్రజా సేవకుడు కూడా ప్రజలవద్దనుంచి ఎటువంటి బహుమతులు పుచ్చుకోకూడదని గాందీజీ అభిప్రాయము ఆయన ఈ సూత్రాన్ని అక్షరాలా పాటించెను.

అబలకాదు సబల

బాపూజి దక్షిణాఫ్రికాలో వున్న సమయంలో కస్తూరి బాకు తీవ్రమైన సున్తీచేసింది. ఆపరేషన్ చేయవలసి వచ్చింది. కాని మత్తుమందు ఇవ్వాలంటే చాలాబలహీనంతోను, నీరసం తోను ఉండటం వలన వీలుగాకపోయింది. అందువలన మత్తు మందు లేకుండానే ఆపరేషన్ చేయవలసి వచ్చింది. కస్తూరిబా కూడా అందుకు అంగీకరించింది. ఆపరేషన్ చేస్తున్నంత సేపు బాపూజీ దగ్గరలోనేవుండి చూస్తూనే వున్నారు.. కస్తూరిబా బాధపడిఎంతగొడవచేస్తుందోనని గడగడలాడి పోతున్నారు.కానీ కస్తూరిబా అంత శస్త్రచికిత్సచేస్తున్నా “అబ్బ” అనలేదు. “అమ్మ” అనలేదు. ఎంత బాధపడినా లోలోపలే కాని బయటకు ఏ మాత్రం కనబడనియ్యకుండా ఓర్చుకోగలి గారు. ఇంక యెవరన్నా అయితే యెంత గోల చేసేవారో,నిజంగా కస్తూరి సామాన్య శ్రీకాదు? అసాధారణ గా చెప్పవచ్చును. కస్తూరి అబలకాదు సఐల. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రాక్టీస్ చేస్తుండగా జరిగినసంఘటన ఇది.

శాంతమూర్తి అసహనం

గాంధీజీవద్ద కొంతమంది గుమాస్తాలుగా పనిచేస్తూ ఉండేవారు. వారిలో హిందువులు, మహమ్మదీయులు, క్రైస్త వులుకూడా ఉండేవారు వీరందరూ గాంధీజీ ఇంటివద్దనే వివ సిస్తూఅవసరం అయినప్పుడల్లా అక్కడనే భోజనం చేస్తూ వుండేవారు. కస్తూరిబాయి వీరిపట్ల ఎప్పుడైనా అనుచితంగా ప్రవర్తించితే భార్యతో తగాదా పెట్టుకునేవారు బాపూజీ.

బాపూజి ఇల్లు పాశ్చాత్య పద్ధతిలో కట్టబడి ఉండెను. అందులో మురికినీరు బయటకు పోవుటకు సౌకర్యములేదు. ఆందువలన ప్రతిగదిలోనూ మూత్రం విసర్జించుటకు ప్రత్యేక పాత్రలు ఉండేవి అలాగే గుమాస్తాలు పనిచేసే గదులలో కూడా ఇటువంటి పాత్రలు ఉండేవి. యెవరు ఉపయోగించే పాత్రను వారు శుభ్రపరచుకొనుట రివాజు.యీ గుమాస్తాలలో ఒకరు హరిజన క్రైస్తవుడు, కొత్తగా ఉద్యోగం రావటం వలన తానుపయోగించిన పాత్రను శుభ్రపరచుట మరచిపోయెను. గాంధిజీ ఆపాత్రను కస్తూరిబాయిని శుభ్రపరచమని పురమాయించెను. ఒకతడజాతి వాడు ఉపయోగించిన పాత్రను శుభ్రపరచుటకు తనను విని యోగించుట కస్తూరిడాకు సహించరానిపనిలా తోచెను.

 Mahatma Gandhi,

ఐనా చేసేదేమీలేక భర్తకు ఎదురాడలేక సణుక్కొంటూ ఆపాత్రనుకాని తను పురమాయించిన పని ఉత్సాహముతో చేయక తనని నిర్లక్ష్యం చేస్తోందని గాంధీజీ కోపించి “ఈ పిచ్చి వేషాలు నా ఇంటిదగ్గర సాగవు” అనెను.”మీ ఇల్లు మీరే దాంతో కస్తూరిబాయి చిటపటలాడి ఉంచుకోండి. నా దారిన నేను పోతున్నాను” అని అరచెనుదాంతో గాంధీజీ ఉగ్రుడై తన్ను తాను మరచిపోయి భార్య చేయిపట్టుకొని బరాబరా ద్వారము వద్దకు ఈడ్చుకు పొయెను. తలుపు తెరిచి ఆ అబలను బయటకు తోసి వెయ్య
వలెనని ఆయన తలంపుఅందుకు కస్తూరిబాయి దీనంగా విలపించుతూ “మీకు సిగ్గులేదు? ఇప్పుడు నేనెక్కడికిపోను? పుట్టింటికిపోవుదమన్న అచ్చట నా తల్లిదండ్రులు లేరే? చుట్టాలెవ్వరూ లేరే? మీ భార్యను అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్లు కొట్టి చంపవచ్చుననుకుంటున్నారా? ఎవరయినా చూసి నవ్విపోరా!” అని కన్నీరు మున్నీరుగా శోకించసాగెను.

అప్పటికికాని గాంధీజీ మైకందిగిపోలేదు. తాను చేసిన పని ఎంతలజ్జాకరమయినదో తెలియవచ్చెను. సిగ్గుతో తలవంచు కొని ఎవరయినా చూస్తారేమోనని గబగబాపోయి తలుపులుబిడాయించెను.
బాపూజీ తన స్వీయచరిత్రలో ఈ విషయం గురించి వ్రాస్తూ ఆనాడు తానుచేసిన యీపనికి మిక్కిలి వివారించు తారు. ఆనాటి ఇటువంటి లజ్జాకరమైనపనికికారణం భార్యను ఒక ఆటవస్తువుగా భావించి, కామవాంఛ తీర్చుకొను టకుభార్య ఒక సాధనం మాత్రమేనని దురభిప్రాయ పడటమేనని చెబుతారు. ఆనాడు భార్య కష్టసుఖాలలో భాగం పంచుకునే సహ ధర్మచారిణి అని గ్రహించకపోతినని కూడా చెబుతారు. భర ఏమిచెప్పినా కిమ్మనకుండా చేయటమే కార్యకర్తవ్యం అని ఆనాటి గాంధీజీ అభిప్రాయం, తను చెప్పినపని సంతోషంగా చేయలేదని ఆగ్రహంతో దానవుడిగా ప్రవర్తించిన గాంధీజీ ఆత్మకథ వ్రాసేనాటి గాంధీజీకి ఎంతభేదం.

అబద్ధాలాడని వకీలు

గాంధీజీ కొంతకాలం దక్షిణాఫ్రికాలో వకీలుగా పని చేసారు. వకీలుగా ఎన్నడూ తప్పుడు కేసులుపట్టలేదు. కేసులో న్యాయం వుందనుకుంటేనే చేప్పడేవారు. కేసులో న్యాయం వున్నా లేకపోయినా, పాయింటు లేకపోయినా, వున్నదని క్లయింటులకు డాబుసరి కబుర్లుచెప్పి డబ్బును గుంజడం బాపూజీ పనికాదు.
ఒకానొక సందర్భంలో ఒకకేసు తరుపున కోర్టులో బాపూజీ వాదించుతున్నారు కాని ఆ కేసుకు సంబంధించిన క్లయింటు తనను మోసపుచ్చాడని కేసును వివరించటములో తనకు కొన్ని అబద్ధాలు చెప్పాడని తేలటంతో వాదించే కేసు మధ్యలో ఆపివేసి “ఈ కేసు వాదించటంనాకిష్టంలేద”ని మేజిస్ట్రేటుకు చెప్పి కోర్టునుంచి వచ్చి వేసారు గాంధీజీ యీ చర్యకు ఎదుటి న్యాయవాది తెల్లబోయెను.
తర్వాత ఆ క్లయింటు ఇంటికివచ్చి బాపూజీలో తను చేసిన నేరం అంగీకరించాడు.

ఈ విధంగా ప్లీడరువృత్తిలో నిజాయితీగా, నిర్మలంగా ప్రవర్తించుట వలన న్యాయమూర్తుల దృష్టిలో గాంధీజీ ప్రతిష్టపెరిగెను. గాంధీజీ వాదనలను న్యాయమూర్తులు అత్యంత శ్రద్ధాసక్తులతో ఆలకించేవారు ఇక క్లయింటులు మాత్రం తమ పక్షాన న్యాయంఉందనుకుంటే బాపూజి వద్దకు వచ్చేవారు.
బాపూజీలో ఇంకొక విశేషంకూడా వుండేది. న్యాయ శాస్త్రంలో తనకు అంతుబట్టని విషయాల్ని తెలుసనుకొని ఎన్నడూ డంబాలు చెప్పేవాడు కాడు, ఏదైనా విషయము తెలియనపుడు తనకన్నా పెద్దవకీళ్ళవద్దకు వెళ్ళి తెలుసుకునే వాడు అందువలన వకీళ్ళలోకూడా గాంధీజీకి వినయవిధేయ తలు మంచి పేరు తెచ్చి పెట్టినాయి.

దొంగవ్యాపారి.గాంధీజీ

బాపూజీ దక్షిణాఫ్రికా వకీలు జీవితంలో జరిగిన సంఘటన ఇది.రుస్తుంజిఅనే భారతీయవ్యాపారస్తుడు గాంధీజీ స్నేహి తుడు. గాంధీజీచేసే ప్రజాసేవలో ఇతడు కూడా పాల్గొంటూ ఉండేవాడు. తనకు ఏకష్టం వచ్చినా బాపూజీకి చెప్పుకొని సల హాలు పొందుతూ ఉండేవాడు. తనకు సంబంధించిన విషయా లన్ని చాటుమాటలు లేకుండా బాపూజీకి చెప్పుకునేవాడు.కాని ఒక్క విషయంమాత్రం గాంధీజీకి చెప్పకుండా దాచి పెట్టాడు. రుస్తుంజి, అదేమంటే. రుస్తుంజీ సక్రమముగా వస్తువులు దొంగరవాణాచేసే వ్యాపారంచేసేవాడు ఆవిధంగా కొంతధనంకూడా సంపాదించాడు. ఈ విషయం బాపూజీకి ఏనాడూ చెప్పలేదు.

ఒకసారి ఇతడు కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు దాంతో రుస్తుంజి లబోదిబోమని ఏడుస్తూ బాపూజీపద్దకువచ్చి తన వృత్తాంతాన్నంతా ఒప్పుకొని తనని రక్షించవలసిందిగా బ్రతిమాలసాగెను. అందుకు గాంధీజి “నిన్ను రక్షించటం రక్షించకపోవటం అనేది నా చేతులలో లేదు. అయినా నీవు చేసింది ఘోరం, తప్పిదం. అందుకు నీవుచేసిన పాపాన్ని బహిరంగంగా ఒప్పుకొని నేచెప్పినట్లు నడుచుకుంటే నీకేద యినా సహాయంచేయగలను” అనెను.. రుస్తుంజి అందులకు అంగీకరించెను.
అప్పుడు గాంధి కస్టమ్స్ అధికారులవద్దకెళ్ళి రుస్తుంజి లోగడనుంచి దొంగరవాణా ద్వారా సంపాదించిన ధనము యొక్క వివరములన్నియు చెప్పివేసెను.

తరవాత ఈవివరా లన్నియు ప్రభుత్వవకీలునకుకూడా చెప్పెను. అందుమీదట ప్రభుత్వాధికారి బాపూజీ ఏమీ దాయుటలేదని వాస్తవముగా జరిగిన విషయాలన్నింటిని చెబుతున్నాడని నమ్మి రుస్తుంజిపై కేసు పెట్టకుండా దొంగతనంగా ఆర్జించిన సొమ్ముకు రెట్టింపు జరిమానా మాత్రం వేసిరి.ఇక గాంధీజి రుస్తుంజీచే తాను చేసిన దొంగతనపు కధనంతను వొక పెద్ద కాగితంపై స్వదస్తూరితో వ్రాయించి ఫ్రేము కట్టించి రుస్తుంజి ఆఫీసులో వ్రేలాడగట్టించెను. ఈ విధముగా అది రుస్తుంజి వారసులకు హెచ్చరికగా వుంటుం దని ఇటువంటి దొంగపనులు చేసేవారికి గుణపాఠం నేర్పుతూ
వుంటుందని బాపూజీ భావన.

నారుపోసినవాడు నీరుపోయడా ?

గాంధి బొంబాయిలో వకీలుగా ప్రాక్టీసుచేస్తున్నప్పటి సంగతి, ఒకానొక అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటు వచ్చి జీవితభీమావలన లాభాలు గురించి చెప్పటం ప్రారంభిం చాడు. “అమెరికాలో “అమెరికాలో మీబోటి వారందరూ జీవిత భీమాతప్పనిసరిగా చేస్తారు. భవిష్యత్తులో ఏమి జరగనున్నదో ఎవరికెరుక జీవితము అనిశ్చితమైనది. దీపం వుండగనే ఇల్లు చక్క బెట్టుకోవడం మంచిది, మీభార్యకున్న ఆభరణాలన్నీ ప్రజాకార్యాలకు ఇచ్చివేశారు. రేపేదయినా మీకు సంభవిం చితే మీ కార్య, పిల్లలగతి ఏమికాను? ఈ భారం అంతా మీ అన్నగారిపై పడదా! అప్పుడు ఆయన ఏమనుకుంటారో ఆలోచించండి. ఒక పదివేలకు మీ జీవితాన్ని భీమాచేయటం శ్రేయస్కరంకాదా?” ఈ విధంగా ఆ ఏజంటుసాగించాడు.

 Mahatma Gandhi,

నిజంగానే కనిపించినవివాదించటంబాపూజీ ఆలోచించాడు, భీమా ఏజంటు చెప్పినవన్నీ ఆయన అన్నట్లు తన జీవితాని కేదైనా ప్రమాదంసంభవించితే తనభార్యాపిల్లలు ఏమికాను? ఆయన అన్నట్లుగా కాస్త నాలుగురాళ్ళు చేతితో ఉన్నప్పుడే జాగత్తపడటం మంచిదనిపించింది. ఆవిధముగ 10 వేలకు తన జీవితాన్ని భీమా చేశారు.కాని కొన్నాళ్ళకుతిరిగి రక్షిణాఫ్రికా వెళ్ళినతరువాత “ఆయన భావాలు మారజొచ్చెను. భార్యపిల్లలపట్ల తన బాధ్య తల విషయంలో స్పష్టమైన మార్పులు వచ్చెను. భార్యా పిల్ల లను పోషించుటకుత నెవరు. అందర్ని పాలించెడి భగవంతుడేఉండగా! నారు పోసినవాడు నీరుపోయడా? ప్రపంచములో అసంఖ్యాకములగు నిరుపేదలు లేరా? వారందరూ తనలాగే జీవితభీమా చేయుట లేదుకదా? వారిపిల్లల, భార్యల పరిస్థితి ఏమిటి? వారందరిలోను తనొకడుకదా? తన ఆధిక్యత ఏమిటి?

ఈ విధంగా ఆలోచించి ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమి యంలు కట్టుట మానివేసెను. అందుకు అన్నగారు కోపించి బాపూజి కుటుంబబాధ్యతలు విస్మరించుటగురించి గుర్తుచేస్తూ ఘాటుగా ఉత్తరం వ్రాసెను. గాంధీజీ తనవాదనను సమ ర్థించుకొంటూ తిరుగుఉత్తరం వ్రాసెను. అందుమీద ఆయన కోపించి బాపూజీకి ఉత్తరములు వ్రాయుట మానివేసెను. చివరకు ఆయన మరణశయ్యపై ఉన్నప్పుడు గాంధీజీ చేసిన పని సరియైనదేనని గుర్తించి ఒక ఉత్తరం వ్రాసెను.

నమ్మినవారిని భగవంతుడు అన్యాయం చేస్తాడా ?

గాంధీజీ బొంబాయిలో ఉండగారెండవ కుమారుడు మనిలాల్ కు టైఫాయిడ్ జ్వరము వచ్చెను. జ్వరతీవ్రతతో పాటు సన్నిపాత లక్షణములు కానవచ్చెను. డాక్టరు కోడి గుడ్లరసం వాడినకాని ఈవ్యాధి తగ్గదని చెప్పెను. గాంధీజీ యీ మాటతో సంకట పరిస్థితిలో పడిపోయెను. కోడిగ్రుడ్లు రసమువాడుటకు తనకెంతమాత్రము ఇష్టములేదు. డాక్టరు మాత్రము కోడిగుడ్లు తప్ప యీ వ్యాధికి మరోమార్గం లేదని చెప్పుచుండెను. ఏమిచేయుట? రోగి ఇష్టాయిష్టాలు కను గొనుటకు అతడు పదేండ్ల పసివాడు.కాని ఈ
ఇంతలో బాపూజీకి ఒక ఉపాయం తోచెను. ప్రకృతి వైద్యము ప్రయత్నిస్తే బాగుంటుందనిపించింది. వైద్యము వలన వ్యాధి తగ్గుతుందో లేదో అని ఒక సంకోచితం కూడా కలిగెను. ఏమయినా భగవంతుడిమీద భారం వేసి, ప్రకృతి వైద్యం తానే స్వయంగా చేయుటకు ఉపక్రమించెను అందుకు మనిలాల్ కూడా అంగీకరించెను.

బాపూజీ ప్రకృతి చికిత్స ప్రారంభించెను. రాత్రికి వ్యాధి విషమించెను. జ్వరం 104 డిగ్రీలకు వెళ్ళెను. సన్ని పాత లక్షణాలు తీవ్రతరం కాజొచ్చెను. బాపూజీ అధికంగా ఆందోళన పడిపోయెను. లోకులు యేమనుకుంటారోనని భయపడజొచ్చెను. తన చాదస్తపు పద్ధతులను అభిప్రాయా ఆ పసివానిపై రుద్దుతున్నాడని ప్రజలు తనను నిందించరా? ఆయుర్వేద వైద్యం ప్రయత్నిస్తే ఎలా ఉండేదో? లేక డాక్టర్లు చెప్పినట్లు కోడిగ్రుడ్లు, రసము ఇస్తే వ్యాధి ఈపాటికి తగ్గి వుండేదేమో? భగవంతుడు నమ్మిన వారిని అన్యాయం చేస్తాడా? ఈ విధముగా ఆలోచిస్తూ మని లాల్ ప్రక్కనే పరుండెను.

కొద్దిసేపటికి మనిలాలును చూస్తుండమని కస్తూరికాకు ఒప్పజెప్పి బయట రోడ్డు వెంట నడవసాగెను. ఎచ్చటకు వెళ్ళినా ఒకటే ఆలోచనలు “భగవాన్ నా కుమారుని ఏమి చేస్తావో భారం అంతా నీదే” అని మనస్సులోనే అనుకొని రామనామం స్మరించసాగెను.కాసేపటికి ఇంటికి తిరిగివచ్చెను. అప్పటికి మనిలాల్ జ్వరం కొద్దిగా తగ్గే సూచనలు కానవచ్చెను. గాంధీజీ ఆరాత్రి కుమారుని ప్రక్కలోనే పరుండెను.తెల్లవారేసరికిజ్వరం చాలావరకు తగ్గిపోయెను. గాంధీజీ సంతోషానికి మేరలేదు. భగవంతుడే తనగౌరవాన్ని నిలబెట్టాడని గాంధీజీ తన స్వీయచరిత్రలో వ్రాసుకున్నాడు.

కస్తూరిబా సహనం

దక్షిణాఫ్రికాలో ఉండే రోజులలో వొకసారి కస్తూరిడాకి తీవ్రసుయిన జబ్బు చేసెను. ఆపరేషన్ చేయవలసివచ్చెను. ఆపరేషన్ చేయగా వ్యాధి నిమ్మళించెను. కాని తిరిగి కొద్ది రోజులకే తిరగ బెట్టెను. అప్పటికి కస్తూరిబా గాంధీజీకి పరిచితుడైన ఒక డాక్టరు ఇంటి వద్దనే ఉండెను. గాంధీజీ వేరే పనిమీద మరొకచోట ఉండెను.కస్తూరిబాయికి వ్యాధి తిరగబెట్టిన వెంటనే ఆ డాక్టరు బాపూజీకి ఫోన్ చేసి “కస్తూరిబా పరిస్థితి ఆందోళనకరంగా వుంది. మద్యముకాని మాంసరసముకాని తప్పనిసరిగా ఇవ్వ వలెను. ఇందుకు మీ అనుమతి కోరుచున్నాను” అని చెప్పెను.https://photos.app.goo.gl/RJCjZqB7n9QdWVQ36

ఇందుకు గాంధీజీ అంగీకరించిన వెంటనే కస్తూరిబా వద్దకు ప్రయాణమయ్యెను. డాక్టరు మద్యముకాని మాంస రసముకాని ఇస్తే తప్ప కస్తూరిబా జీవించెడిస్థితి లేదని బాపూ జితో చెప్పెను. అందుకు బాపూజి అంగీకరించక మొండిపట్టు పట్టుటతో డాక్టర్ కోపించి “ఈ పరిస్థితిలో మీ భార్యను నా ఇంటివద్ద ఉంచి వైద్యం చేయుట సాధ్యం కాదు” అనెను.గాంధీజీ కస్తూరిబాతో డాక్టరు అభిప్రాయం వెల్లడించ టంతో నేను మాంసరసం పుచ్చుకొనను మానవజన్మ దుర్ల భము, మీ చేతులలో ప్రాణం విడుచుటకై నఅంగీకరింతును.

గాని ఈ నికృష్టమైన మాంసరసము తీసుకొని శరీరాన్ని అప విత్రం చేసుకోను” అని గట్టిగా సమాధానమిచ్చెను.గాంధీజీ అంతటితో వూరుకొనక “మాంసము తీసు కుంటే నేనేదో అనుకుంటానని నీవు బాధపడవద్దు. నీ ఆరో గ్యము ముఖ్యము. ఈ వ్యాధికీ మాంసరసము వాడుటతప్పు వేరే మార్గాంతరము ఏమీలేదని డాక్టర్ చెబుతున్నాడు కాబట్టి డాక్టర్ చెప్పినట్లు చెయ్యటం మంచిదేమోననిపిస్తుంది.” అని ఎన్నో విధాల కస్తూరిబాను బ్రతిమాలెను.కాని ఏమైనాసరే కస్తూరివా తనపట్టును విడి చెట్లు లేదు పైగా అచ్చటినుండితీసుకు వెళ్ళి బాపూజీకి తెలిసిన జలవైద్యం చేయమని వత్తిడి పెట్టసాగెను. తన అభిప్రాయం కస్తూరిబా అభిప్రాయంఒక పే అయినందుకు గాంధీజీ ఎంతగానో సంతో షించెను- కస్తూరిబాను తను ఉండేచోటకి తీసుకువెళ్ళ నిశ్చయించెను.

ఈ విషయం డాక్టర్ తో చెప్పటంతో ఆయన ఆగ్రహా వేళాలతో మండిపడుతూ “ఏమి మనిషివయ్య, నీకు బుద్ధి లేదూ. ఈ పరిస్థితిలో ఆవిడను ఎలా తీసుకు వెళతావ్. ఏ మాత్రం ఆవిడకు వత్తిడితగిలినా ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడవచ్చు. మార్గంమధ్యంలో ప్రాణాలు విడిచినా విడవ పచ్చు” అని కేకలు వేసెను.అయినాకానీ ఇవేమీ లెక్కచెయ్యకుండా భగవంతుని మీద భారం వేసి ప్రయాణ సన్నాహం చేసెను.

డాక్టర్మాట లనుబట్టి బాపూజీకి మనస్సులో కొండపీకుతూనే ఉంది. కాని కస్తూరిబా మాత్రం మిక్కిలి ధైర్యంతో ఉండెను. అదే సమమంలో వర్షం చినుకులు పడసాగెను. ఆ చినుకులలోనే
గాంధీజీ కస్తూరిబాను రిక్షాలో ఎక్కించుకొని రైల్వేస్టేషనుకువెళ్ళెను.సమయానికి రైలు అందుబాటులో వుండెను. ఆరైలెక్కి తను వుండే చోటుకి ఎలాగయితేనేం సురక్షితంగాచేరగలిగెను.కొద్దిరోజులలో జీలవై ద్యం వలన కస్తూరిబాకు పూర్తిఆరోగ్యము కలిగెను.

బ్రహ్మచర్యం

సంతానముకొరకే భార్యాభర్తల సంయోగముకాని కేవలము కామతృప్తికొరకు దాంపత్యం చేయకూడదని బాపూజీఅభిప్రాయము. ఆహారము, నిద్రవలె సంయోగము కూడాముఖ్యావసరాలలో ఒకటి అనుకొనుట అజ్ఞానమనీ ఆయనఅభిప్రాయము.దీనికనుగుణంగ 1906ప్రాంతములో తనవ్యక్తిగతజీవితంలో కొన్నికట్టుబాట్లు విధించుకొనెను. అప్పటికి బాపూజీకి నలుగురు పిల్లలు. ఇక అంతటితో పిల్లలు చాలనుకొని బ్రహ్మచర్యం అవలంభించ నిశ్చయించెను. కస్తూరిబా కూడావెంటనే అందుకు అంగీకరించెను. కాని గాంధీజీయే బ్రహ్మచర్యం అవలంభిద్దామనుకొన్నా తర్వాత రెండుసార్లు తన
మాట నిలబెట్టుకోలేకపోయెను. అందువలన 1906 సంవత్సరం చివరాంతం నుంచి మాత్రమే గాంధీజీ బ్రహ్మచర్యం అవలంబించినట్లు చెప్పవచ్చునుబ్రహ్మచర్యంతోపాటు గాంధీజీ సరళమైన జీవితం
గడప నిశ్చయించెను. పండ్లు ఫలాలతో ఆహారం సరిపెట్టుకొనెను. తనబట్టలుతానే ఉతుక్కోసాగెను. క్షారంకూడాతనం తటతానే చేసుకోసాగెను. వస్త్రధారణలో సాధ్యమైనంత పొదుపు అలవర్చుకోసాగెను.

బాపూజీ సతి సేవ

దక్షిణాఫ్రికాలో ఒకసారి కస్తూరిబాకు జబ్బుచేసింది అజీర్తివ్యాధి జీర్ణించిపోయి కస్తూరిబా పూర్తిగా క్షీణించి పోయింది. ఏది తిన్నా జీర్ణంకాదు. చిట్కావైద్యాలు కొన్ని చేసారుకాని తగ్గలేదు. డాక్టర్పై ద్యంకూడా ఉపయోగపడలేదు.ఇక లాభం లేదనుకొని ఒకనాడు బాపూజీ “ఈమందు లేవీ రాభంలేకపోయినాయి. నా మాటనమ్మి ప్రకృతివైద్యం ప్రారంభించు” అన్నారు కస్తూరిబాతో. కస్తూరిబా అందుకు అంగీకరించింది. బాపూజీయే స్వయంగా ప్రకృతి వైద్యం చేయనారంభిచారు.14 రోజులు ఏ విధమైన ఆహారం ఏ లేకుండా పస్తు పెట్టారు. పండ్లరసంకూడా తీసుకోవడానికి వీలులేదు. వేప కషాయం ముందుగా వాడాలి. ఈ 14 రోజుల్లోనే కస్తూరిబాకు బాపూజిచేసిన సేవలు వర్ణనాతీతము. ఆవిడపట్ల చూపిన శ్రద్ధసానుభూతి నిరుపమానం.

కస్తూరిబాకు ముఖం కడిగించటము, దొడ్డికి తీసుకు వెళ్ళటము, కాఫీ కాచిఇవ్వడం, మంచముపై పరుండ బెట్టటం, చల్లగాలికి చెట్టుక్రిందకు తీసుకువెళ్ళటం ఆవిడ కాళ్ళు వొత్తడం ఒక టేమిటి బాపూజీ ఆవిడకు చేసిన సేవలు అనేకంకస్తూరిబా తలదువ్వటం బాపూజీ చేతకాకపోయింది. అందువలన తలదువ్వేపని “కాశీబ” అనే ఆవిడకు వొప్పగిం చటం ఆలస్యమయింది, గాంధీజీయే కస్తూరిబా తలకు నూనె రాసి, తల దువ్వడం ప్రారంభించారు. ఈలోగా కాశీణ వచ్చింది. “జడ వేయటం నాకు కుదరటంలేదు. ఆపని నువ్వు చెయ్యి” అని నవ్వుతూ అక్కడనుంచి లేచి వెళ్ళారు గాంధీజీ. గాంధీజీ ప్రకృతి వైద్యంవలన కస్తూరిబా కొద్దిరోజుల లోనే కోలుకుంది.

తెల్లవారి అఘాయిత్యాలు గాంధీజీ సహనం

దక్షిణాఫ్రికాలో భారతీయుల దుస్థితిని గురించి గాంధీజీ భారతదేశం నలుమూలలా తిరిగి విశదపరచెను. పత్రికలకు వ్యాసాలు వ్రాసెను. బహిరంగసభలు పెట్టి ఉపన్యాసాలు చేసెను. ఇటువంటి సమయంలో రక్షిణాఫ్రికా భారతీయుల “నుండి పిలుపువచ్చుటతో భార్యాపిల్లల సమేతముగా దక్షిణా ఫ్రికా ప్రయాణమై వెళ్ళెను.ఇదిలావుండగా బాపూజీభారతదేశంలో చేసిన ప్రసం గాలు, వ్రాసిన వ్యాసాలు అనేక అతిశయోక్తులతో చల్లగా దక్షిణాఫ్రికా తెల్లవారి చెవులకు సోకెను. దాంతో వారు బాపూ జీపై క్రోధము పూని ఉండిరి. దక్షిణాఫ్రికా వచ్చిన వెంటనే బాపూజీపై అత్యాచారం చేయుటకు సిద్ధపడుచుండిరి.

ఈ పరిస్థితులలో బాపూజీ దర్బాన్ రేవులో ఓడదిగెను. ఓడదిగి కొద్దిదూరం నడవగానే కొంతమంది తెల్ల వారి పిల్లలు “గాంధీ, గాంధి!”అని అరవటం మొదలెట్టిరి. ఇదివినిచుట్టుపట్లనుంచి అనేకమంది తెల్లవారు బాపూజీని చుట్టివేసి గడ్డలను కుళ్ళిన కోడిగ్రుడ్లను వేయసాగిరి ఒకడు బాపూజీ తలపాగా లాగి వేసెను. మరొక తుంటరి బాపూజీని ముందుకు పడ ద్రోసెను. ఇంకా కొంతమంది ఎడాపెడా కొట్టసాగిరి.
ఇంతలో పోలీస్ సూపరింటెండెంట్ గారి భార్య అచ్చ టకు వచ్చుట తటస్థించెను. ఆమెగాంధీజీని ఎరుగును. గాంధీజీ పట్ల ఆమె జాలి తలచి వెంటనే తన చేతిలోని గొడుగు విప్పి బాపూజీపై పట్టెను. దీనివలన గుంపు కొంత వెనకాడెను.

ఈ మధ్యలో ఒక భారతీయుడు పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఈ వార్తను సూపరింటెండెంటుగారితో చెప్పిరి. పోలీసులు వెంటనేవచ్చి గాంధీజీని రుస్తుంజీ అనే భారతీయ ప్రముఖునిఇంట దిగవిడచిరి.కాని కొద్ది సేపటికి తెల్లవారు ప్రవాహంలా వచ్చి మాకు స్వాధీనం రుస్తుంజీ ఇల్లు చుట్టివేసిరి. “గాంధిని చేయండ”ని గోలచేయ మొదలు పెట్టిరి. ఆ సమయమునకే డి.యస్.పి. అలెగ్జాండర్ అచ్చటకు వచ్చెను. అతడు చాలా మంచివాడు, బాపూజీకి రానున్న ఆపద ముందుగానే గ్రహిం చెను. బహుశా కాసేపటికి ఈ గుంపుఇంట్లోకి బలవంతముగ జొరబడటమో లేక ఇంటికి నిప్పు పెట్టడమో చేయగలరనిఊహించెను.
అందుచేత బయట ప్రదర్శకులతో పిచ్చాపాటీమాట్లా డుతూ చాటుగా ఇద్దరు సిఐ.డి.లను ఇంటిలోనికి పంపి గాంధీజీని చాటుగా పోలీస్ స్టేషన్ కు తీసుకు పొమ్మని ఆజ్ఞాపించెను.

ఆ విధంగానే ఆ సి.ఐ.డి. లు లోపలికి వెళ్ళి గాంధీ జీకి ఇదంతా ఇష్టంలేకున్నా ఒప్పించారు. బాపూజీకి పోలీసు కానిస్టేబుల్ వేషం వేసారు. తామిద్దరు భారతీయ వ్యాపార స్ధులలాగా వేషాలు వేసుకొని దొడ్డి గుమ్మంగుండా ప్రక్క సందు లోకివచ్చి ఆ వీధి చివర తమకోసం వేచివున్న బండిలో పోలీసు స్టేషను సురక్షితంగా చేరుకున్నారు.

గాంధీజీపై తెల్లవారి ఈ దుశ్చర్యలు విన్న అప్పటి వలస మంత్రి చాంబర్లను నేపిల్సు ప్రభుత్వానికి ఒక తంతి పంపుతూ బాపూజీపై చేయిచేసుకున్న నేరస్తులను తక్షణం శిక్షించవలెననెను. కాని అందుకు గాంధీజి ఎంత మాత్రము ఒప్పుకొనలేదు. ముందుచూపులేక తనను అపార్థం చేసు కొన్న తెల్లవారిని శిక్షించుట తన అభిమతం కాదనెను. కొని రోజులలోనే యదార్ధం తెలుసుకొని వారుచేసిన పనికి వారే పశ్చాత్తాప పడగలరని ప్రకటించెను.https://pincodesguide.in/jawaharlal-nehru-is-great-freedom-fighter/

గాంధీజీ ఈప్రవర్తన తెల్లవారిలో స్పష్టమైనపరివర్తన తెచ్చెను. తాము చేసినవనికి సిగ్గుపడిపోయిరి. పత్రికలు కూడా వారిని నిందించి బాపూజీని స్తుతించెను. దాంతో గాంధీజీ విలువ అపారముగా పెరిగిపోయెను. భారతీయులప్రతిష్ట కూడా పెరగజొచ్చెను. బాపూజి కృషికి ఎంతగానో తోడ్పడెను. ఆఖరి క్షణంలో భగవంతుడై నా సహాయము చేయడా ?1915 మే 25న అహ్మదాబాదులో బాపూజీ ఆశ్ర మము స్థాపించెను. దానికి సత్యాగ్రహ ఆశ్రమం అని నామ కరణం చేసెను. అప్పట్లో అందులో బాపూజీతో కూడా 25మంది వుండేవారు. ఇందులో కొంతమంది స్త్రీలు కూడా వున్నారు.

ఆశ్రమము స్థాపించిన కొద్దిరోజులకు గాంధీజీ స్నేహితు డొకడు” యోగ్యుడైన హరిజనుడొకడు తన కుటుంబముతో సత్యాగ్రహ ఆశ్రమంలో వుండగోరుచున్నాడు. అందుకు మీరు సమ్మతించుదురా?” అని వొక ఉత్తరం వ్రాసెను. బాపూజి ఈ ఉత్తరము మిగతా ఆశ్రమవాసులకు ఆశ్రమవాసులకు చూపించగా వారందరును సంతోషముతో హరిజన కుటుంబము ఆశ్రములో ప్రవేశించెను.సత్యాగ్రహ ఆశ్రమములో హరిజన కుటుంబము ప్రవేశించుటతో ఆశ్రమమునకు ఆర్థికసహాయముచే పేవారిలో ఆందోళన కలిగెను. వారందరును నొక్కమాట మీద ఇక ఆశ్రమమునకు ఎట్టి సహాయం చేయకూడదని నిశ్చయించు కొనిరి. ఆశ్రమవాసుల్ని సంఘం నుండి, బహిష్కరించే ప్రయత్నాలుకూడా జరుగుచుండెను.

ఆశ్రమవాసులందరూ కంగారుపడజొచ్చిరి. గాంధీజీకి మాత్రము ఇటువంటి అవాం తరాలు కొత్తకాదుగదా! ఎవరేమనుకొన్నా సరే హరిజన కుటుంబం తమవద్దనేవుంచదల్చెను. కాకపోతే ఆశ్రమవాసుల పోపణకు డబ్బు లేకపోతే అందరూ కలసి కాయకష్టం చేద్దా మని, సంఘంనుంచి వెలివేస్తే అందరమూ వెళ్ళి మాల గూడెంలో కాపురం పెడదామని, గాంధీజీ మిగతావారికి బోధించసాగెను. బాపూజీ మాత్రం మిగతా సందర్భాలలోవలెనే ఇప్పుడుకూడా తప్పక ఆఖరిక్షణంలోనైనా పరమే శ్వరుడు తనకు సహాయం చేయగలడని వంతునిపై మోపి నిశ్చింతగా వుండెను.

ఈ పరిస్థితులలో వొక సుప్రభాతా నొక సేట్ కారులో ఆశ్రమము వద్దకు వచ్చి మీ ఆశ్రమమునకు కొద్ది సహాయము చేయదల్చితినని 13 వేల రూపాయలు గాంధీజీ చేతుల్లో పెట్టి మరేమి మాట్లాడకుండా వెళ్ళిపోయెను. సేట్ ఆశ్రమములోనికికూడా రాలేదు, బయటవుండియే గాంధీజీకి కబురుపెట్టి ఈ డబ్బు అందజేసెను. గాంధీజీతో ఇతడికి యెన్నడూ పరిచయంలేదు. యెప్పుడో ఒకసారి మాత్రం బాపూజి ఇతడ్ని చూసినట్లు గుర్తట.ఈ విధంగా సత్యాగ్రహం ఆశ్రమవాసులకు మాల గూడెం వెళ్ళాల్సిన పని తప్పిపోయెను. ఒక సంవత్సరము పాటు గ్రాసంకూడా దొరికెను.

ప్రతిజ్ఞా భంగముఅవి మొదటి ప్రపంచ యుద్దము జరుగుతున్న రోజులు గాంధీజీ యుద్ధానికి జనాన్ని పోగుచేయుటకు దేశం నలు మూలలా తిరిగెను. ఇందుమూలముగా బాపూజీ ఇందుమూలముగా బాపూజీ ఆరోగ్యందెబ్బతినెను. అప్పటికి ఆయన ఆహారం వేరుశనగపప్పులు నిమ్మరసం, చక్కెరకేళి, వేరుశనగపప్పులు అతిగా తినుట వలన గాంధీజీకి అతిసారము పుట్టుకువచ్చెను.దీనికితోడు ఆరోజు ఏదో పండుగ అగుట చేత కస్తూరిబా బాపూజీ కొరకు ప్రత్యేకముగ గోధుమరొట్టి, మినపకట్లు తయారుచేసెను. బాపూజీ ఆరోగ్యం బాగోలేదు. విరోచనములు అవుతున్నాయి.

కాబట్టి ఈపిండివంటలేవీ తీసుకోవద్దు అనుకొనెను. కాని జీహ్వచాపల్యముచేత నోరూరుకోక రొట్టెలు, మినపకట్టు తీసుకొనెను. బాంతో మరువాటికి గాంధీజీ పరిస్థితి డీలా అయిపోయెను. డాక్టర్లు వచ్చిరి. ఇంజ క్షన్లు ఇచ్చినగాని రోగం తగ్గదని చెప్పారు. కాని అందుకు గాంధిజీ అంగీకరించక తనకు తెలిసిన ప్రకృతిపై ద్యమే అను సరించ నారంభించెను. అసలు అప్పటికి బాపూజీకి ఇంజక్షన్ అంటే ఏమిటో తెలియదట. అదొక నిరసి” అనుకునేవారట సూదిమందు అని తెలియనే తెలియదట.

ప్రకృతి వైద్యము వలన గాంధీజీకి వ్యాధి కొంతనిమ్మ దించెను. కాని పూర్తి ఆరోగ్యము చేకూరలేదు. పూర్తి ఆరో గ్యము చేకూరవలెనన్న పాలు తీసుకుంటేతప్ప వీలులేదని డాక్టర్లు చెప్పిరి. పాలు తీసుకొనుట అప్పట్లో బాపూజీకి నిషిద్ధం. ఎందువలనంటే ఆవులు, గేదెలవద్దనుంచి దూడలకు ఏమీవదల కుండా పాలు తీసివేస్తారని ఆ విధంగా చేయటం పాపమని ఆయన అభిప్రాయం. అటువంటిపాలు త్రాగటం కూడా పరోక్షంగా పాపం చేసినవానిక్రింద లెక్కేనని గాంధీజీ వాదం. అందువలన ఆయన అప్పట్లో పాలు తీసుకునేవారుకాదుకాని పాలు తీసుకుంటేకాని బాపూజీకి తిరిగి ఆరోగ్యం కలిగేటట్టులేదు.

గాంధీజీ ధర్మసందేహంలో పడిపోయారు. పాలుతీసుకోనన్న పూర్వపు శవధానికి కట్టుబడి వుండుటా? ఈ పరిస్థితిలో లేక పాలుతీసుకొని ఆరోగ్యము పొందుటా? కస్తూరిబా పోనీ, గేదెపాలు, ఆవుపాలు తీసుకోకపోయినామేకపాలయినా తీసుకోండని ప్రోత్సాహపరచెను. అందుకు డాక్టర్లుకూడా సమ్మతించిరి.
ఏమైతేనేం కస్తూరిణా వత్తిడికి గాంధీలొంగిపోయెను. గాంధీ శపధం చేసుకునేటప్పుడు గేదెపాలు ఆవుపాలు మాత్రమే ముట్టనని అనుకున్నారుగాని మేకపాలు నిషిద్ధ వస్తువులో లేదు. అయినా మేకపాలు పుచ్చుకోవటమయినా తీసుకున్న ప్రతిజ్ఞకు విరుద్ధమేనని ఆయన భావం.

తనకు ఇంకా జీవించాలనే వాంఛ ఈవిధంలో తనను తప్పుద్రోవలో పెట్టినట్లు “ఆత్మకధ”లో వ్రాసుకున్నారు.తానుచేసిన శపధానికి ఈ విధముగా తానేవిరుద్ధంగా ప్రవర్తించటంపట్ల మిక్కిలి పశ్చాత్తాపపడతారు. అనేకసార్లు మేకపాలు విసర్జించాలనే తలంపు వచ్చినా “ఇంకా జీవించా లని, దేశ సేవచేయాలనే కోర్కెలు” తనను ఆ విధంగా చేయ నీయటం లేదనికూడా వ్రాసుకున్నారు.

కస్తూరిబా ప్రతిభక్తి

గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉంటున్నరోజుల్లో కాళిదాసు బాయ్ అనే బాపూజీ దగ్గర బంధువు ఒకరు బాపూజీ ఇంటికి వచ్చారు. అప్పుడు పగలు. సుమారు 11 గంటలు అయి ఉంటుంది. బాపూజీ భోజనం చేస్తున్నారు. కస్తూరిబా వంట పాత్రను శుభ్రపరుస్తోంది. కాళిదాసు ఇది చూసి విస్తు పోయాడు. ఎందువల్లనంటే ఏచిన్న ఉద్యోగి ఇంట్లో చూచినా వంటపాత్రలు అవి తోమటానికి పనిమనుషులు ఉంటారు మరి బాపూజీఇంటిలో పనిమనిషి ఎవరూ ఉన్నట్లులేరు. కస్తూరిబా స్వయంగానే ఈ చాకిరి అంతా ఎలా చేస్తుందా అనుకొనిబాపూజీతో ఈ విషయం ప్రస్తావించి “ఇంటిలో నౌకర్లు ఎవరూ లేనట్లుంది. ఇక కస్తూరిబా ఎప్పుడూ ఈచాకిరితోనే సతమత మయ్యేటట్లున్నది. ఎప్పుడు ఆవిడజీవితంకాస్త సుముఖముగా గడిపేది?” అని ప్రశ్నించాడు.

బాపూజీ భోజనం చేస్తున్నవాడల్లా ఆపి “నేనెప్పుడూ ఆవిడ సుఖజీవితానికి అడ్డుపడలేదే!” అన్నారు.
•కస్తూరిబా వెంటనే అందుకొని ‘మీఇంటిలో ఎన్నడైనా సుఖసౌఖ్యాలతో గడిపానా?’ అన్నారు బాపూజీ వైపుచూస్తూఅందుకు బాపూజీ “నేనెప్పుడయినా నిన్ను పట్టుచీరెలు కట్టుకోవద్దన్నానా? నగలు పెట్టుకోవద్దన్నానా? నీకుగాజులు కావాలని అన్నప్పుడు వెంటనే తెచ్చిపెట్టలేదూ!” అన్నారు. “అవన్నీ మీరు తేలేదని అన్నానా? అయితే మీరు ఆడంబరాలన్నీ వదిలేసి సాదాజీవితం గడుపుతుంటేనేనొక్క దాన్నే యీ నగలు నాణాలు పెట్టుకు ఎలా తిరిగేది? మార్గంలో నడవడం తప్ప నాకుగత్యంతరంలేదుగా!” అని కస్తూరిబా సమాధానం.

మొదట్లో గాంధీజీ పద్దతులు కస్తూరిబాకు నచ్చేవికావు కస్తూరిబా సనాతన పద్దతిగా ఉండేది. పైగా కస్తూరిబాకు చదువుసంధ్యలు పెద్దగా లేవు. అందువలన గాంధీజీనే అర్థం చేసుకోవటం కస్తూరిబాకు కొంచెం కష్టం అనిపించేది అయితే బాపూజీ విషయాన్నంతా విడమర్చి చెప్పేటప్పటికి కస్తూరిబా మారిపోయి తన పద్ధతులను మార్చుకొని బాపూజీని అనుసరించేది. కొంతమంది కస్తూరిబా పై ఖరిచూసి బహుశా ఈవిడకి బాపూజీ పద్దతులపట్ల అయిష్టంఉండెడిదని ఆపోహకూడాపడే వారు. యీవిధంగా అపోహపడిన వ్యక్తే ఒకరు కస్తూరిబాకు సానుభూతి తెలియబరుస్తు ఉత్తరం కూడా వ్రాసాడు. ఉత్తరం చదివి చాలా బాధపడి తిరిగి యీవిధంగా ఆవ్యక్తి ఉత్తరం వ్రాసింది. “మీ ఉత్తరంచూసి చాలా బాధపడ్డాను.

బాపూజీ నా జీవితాన్ని శోకమయంచేరాడనిమీరెలా ఊహిం చారో నాకు అర్థంకావటంలేదు. లోకంలో ఏ స్త్రీకి లభించని భర్త నాకు లభించాడని నేనే తలుస్తూవుంటాను. వారిని లోక మంతా పూజిస్తువుంది. వారు నన్నెంతో ఆదరంతోను, గౌర వముతోను చూస్తారు. ఎప్పుడయినా నేను అనాలోచితముగా ఏదైనా పనిచేసినా, ముందుచూపు లేకుండా వ్యవహరించినా తప్పునాకు చూపెట్టి సరైన త్రోవకు మళ్ళిస్తారు. ప్రజలలో నాకింత గౌరవం లభిస్తోందంటే అదంతా వారి చలవే, నేను యీకాలపుభార్యల వంటిదానిని కాదు. యీనాటిభార్యలలాగా భర్తలమీద చైతనం చెలాయించాలని భర్త తన మాట వినక పోతే మరోమార్గం చూసుకోవాలనే పద్దతి నాకు రుచించదు. శంకరుడే జన్మజన్మాలకు తన భర్తగా ఉండాలని పార్వతి కోరినట్లు నేనుకూడా జన్మజన్మాలకు గాంధీజీనిభర్తగా కోరు తున్నాను.

కస్తూరిబా అతిధి మర్యాద

ఆశ్రమానికివచ్చిన అతిధులను మిక్కిలి ఆదరాభిమానాలతో చూసేవారు కస్తూరిబా ..వారి వారి కుటుంబ
అతిధుల కోసంసమాచారాలను అడిగి తెలుసుకొనేవారు ఒక్కొక్కప్పుడు ఆశ్రమ నియమాలనుకూడా ఉల్లంఘించిన సందర్భాలు కూడా వుండేవి.ఉదాహరణకు పండిట్ నెహ్రూకు, సి.యస్. ఆండ్రూ న్కు టీ అలవాటు. అలాగే రాజాజీకి కాఫీ అలవాటువుండేది కాని ఈ రెండు పానీయాలు ఆశ్రమంలో నిషిద్ధం. అయినా వీరు వచ్చినప్పుడు కస్తూరిబా వీరికోసం ప్రత్యేకంగా కాఫీ టీలు తయరుచేసి ఇచ్చేవారు.
దక్షిణ ఈ విధంగా చేయటంతో ఒక్కొక్కప్పుడు గాంధిజీ జోక్యం కలుగచేసుకుని “ఈ కాఫీ టీలతో వారిని పొడు చేస్తున్నావ్” అనేవారు కస్తూరిబాతో.

“మీ పద్ధతులన్నీ ఇతరులమీద రుద్దటానికి మీకేమీ అధికారం ఉన్నది?” అని ఎదురు ప్రశ్నించేవారు కస్తూరిబా. రాజేంద్ర ప్రసాద్, జవహల్ లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం అజాద్, సర్దార్ పటేల్ మొదలయిన వారంతా వచ్చిన ప్పుడు గాంధీజీతో చర్చలు ముగించుకొని తిరిగి వెళ్ళేప్పుడు కస్తూరిబాను కలుసుకొని కాసేపు పిచ్చాపాటి మాట్లాడి వెళ్ళుతూ ఉండేవారు. అబ్దుల్ కలాం అజాద్ కస్తూరిబా ఆరోగ్యం గురించి ముచ్చటించుతూఉండేవారు. నెహ్రూకా స్త ఉద్రేక స్వభావం కలవాడు కావటంచేత విప్లవ ధోరణులు గురించే చెబుతూ ఉండేవారు ఇక సర్దార్ పటేల్ చిన్నపిల్ల వాడిలా కస్తూరిబా మనుమడితో ఆటలాడుతూ ఉండేవారు.జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడయినా వెళ్ళినప్పుడు కస్తూరిబాతో ముచ్చటించకుండా కేవలం నమస్కరించి వెళ్ళి పోతే కస్తూరిబా దిగులుపడిపోయేవారు.

వెంటనే గాంధీజీవద్దకు వెళ్ళి “జవహర్ ఇవ్వాళ నాతో ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. మనిషి అదోలా ఉన్నాడు. మీకు జవహర్ కు ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చినాయా ? మీరేమయినా అతడికి కష్టం కలిగించే మాటలు అన్నారా?” అని ఆదుర్దాగా ప్రశ్నించేవారు. గాంధీజీ తేలిగ్గా నవ్వేసి “నెహ్రూలాగ నీకూ చిరుకోపం జా స్తిసుమా!అయినా నెహ్రూను నేనేమీ అన లేదే?”అనేవారు.ఈ విధంగా కస్తూరిబా ఆశ్రమానికి వచ్చిన అతిధుల నందరినీ అప్యాయంతో చూసేవారు.

లండన్లో బాపూజీ అనుభవాలు

గాంధీజీ రౌండ్ టేబుల్సమావేశానికి లండన్ వెళ్ళారు. రోజు ఉదయంపూట కులాసాగా జనసమర్ధమైన బజార్ల వెంట నడుస్తూంటే అనేకమంది లండన్ పౌరులు వారిని చూసి అభినందించేవారు. కొంతమంది తమ తమ ఇండ్లకు రమ్మని ఆహ్వానించేవారు. పిల్లలు బాపూజీని చుట్టుముట్టి “గాంధీ మామయ్యా” అని పిల్చేవారు. ఒక కొంటెకిష్టయ్య పంచె పైకికట్టిన గాంధీని ఉద్దేశించి “హే గాంధీ లాగూ ఏది” అన్నాడట, బాపూజీ అతడి హాస్యానికి పగలబడిన వ్వేశారటలండన్లోవున్న బావూజీకి బ్రిటిష్, అమెరికన్ పత్రి • కలు విశేషప్రచారం నిచ్చినవి అనేక పత్రికలు బాపూజీ జీవిత చరిత్రను ఫోటోలతో ప్రచురించినవి.

ఒక పత్రికలోఒకానొక విలేఖరి బాపూజీ గురించి వ్రాస్తు వేల్సుయువరాజు భారతదేశం వచ్చినప్పుడు బాపూజీ సాష్టాంగ నమస్కారం చేరాడని వ్రాశాడు. ఆ విలేఖరే రెండుమూడురోజుల తర్వాత బాపూజీ వద్దకు వచ్చాడు. బాపూజీ అతడ్ని చూసి చిరునవ్వు నవ్వుతూ “మీ పత్రికలో వేల్సు యువరాజుకు సాష్ఠాంగ నమస్కారం చేసినట్లు వ్రాశారు. మీ ఊహాగానం మీ కెంత మాత్రం ప్రతిష్ట తెచ్చి పెట్టదు. వేల్పు యువరాజు కాదుగదా మీ రారాజు ఎదుటకూడా సాష్టాంగనమస్కారంచేయవలసిన ఖర్మ నాకులేదు. మా దేశంలో అతినిరుపేద అయిన హరిం జనుని ఎదుట మాత్రమే సాష్టాంగనమస్కారం చేయవలసిన అవసరం నాకున్నది. ఎందువల్లనంటే తరతరాలు అతడ్ని అణగద్రొక్కి పీడించే పాపపు పనిలో నాకు భాగస్వామ్యం వుంది. ఆ హరిజనుని కాలిదుమ్ము తీసి నా కళ్ళకు అద్దుకొన వలసిన అవసరం నాకున్నది” అని అన్నారట.

శ్రీశ్రీశ్రీ 5వ జార్జి చక్రవర్తి బాపూజీని టీపార్టీకి బకింగ్ హోమ్ ప్యాలెస్ కు ఆహ్వానించాడు. రాజువద్దకు వెళ్ళేటప్పుడు. బాపూజీ ఏ దుస్తులు ధరించారోనని ఇంగ్లాండు ప్రజలంతా కుతూహలంతో. యెదురుచూశారు. గాంధీజి మాత్రం యధా ప్రకారంగానే పంచె మోకాలు పైకి కట్టి రాలువా కప్పుకొని జేబుగడియారం మొలత్రాడుకు వేలాడగట్టి, సాదా చెప్పులు ధరించి వెళ్ళారట. విలేఖర్లు గాంధీజిని దుస్తులు గురించి ప్రశ్నించగా “మీరు ప్లస్ నాలుగు ధరించితే నేను మైనస్ నాలుగు ధరించాను” అన్నారట.

గాంధీజీ లండన్లో వున్నప్పుడు ప్రఖ్యాత సినిమాహాస్యనటుడు చార్లీ చాప్లీన్ గాంధీజీని దర్శించాలని కోరాడుట . పేరు గాంధీజీ అంతకు పూర్వం వినలేదట అసలుసినిమా కూడా యేదీ చూడలేదట
కాని ప్రక్కనున్నవారుఅనిచాప్లిన్ అతిబీద కుటుంబము నుంచి వచ్చిన వ్యక్తి చెప్పిన తర్వాత చాప్లిన్ కోసం కబురు పెట్టి అతడితో కొంతసేపు సంభాషించాడట.సబ్బు కోటాఆశ్రమ వాసులందరూ ఎవరిబట్టలు వారే గుంజుకోవా లనే నియమం ఒకటి సబర్మతీ ఆశ్రమములోవుండేది. అలా ఉతుక్కోవటానికి మనిషికి నెలకు కోటా ప్రకారం కొంతసబ్బు ఇవ్వబడేది. కాని ఈ విధంగా ఇచ్చే సబ్బు ఆశ్రమవాసుల యిన స్త్రీలకు సరిపోయేదికాదు. సరిపోవటంలేదని ఫిర్యాదు చేస్తే ఆశ్రమ నియమాన్ని ఉల్లంఘించినట్లుగా ఉంటుందనిభావించి ఒకపని చేశారు.

ఆశ్రమంలో స్త్రీలందరూ సమావేశమై గాంధీజీకి ఒక మహాజరు వ్రాసుకొన్నారు. అందరూ సంతకాలు పెట్టారు. కస్తూరిబాయి కూడా సంతకము చేశారు. ఈ మహాజరును స్త్రీలలో ఒకామె తీసుకువెళ్ళి గాంధీజీకి ఇచ్చింది.గాంధిజీ మహాజరు చదివి అందులో కస్తూరిబా సంత కము కూడా వుండటము చూచి మహాజరు తెచ్చినావిడతో “కస్తూరిబాకు నాకు యేదో లడాయి పెట్టినట్లు వున్నారే”అన్నారు నవ్వుతూ.ఏమైతేనేమీ అప్పటి నుంచి సబ్బు కోటా మహాజరుకోరినట్లు పెంచబడినది.

………………………………………………………………………………THE END………………………………………………………………………………..

Leave a Comment