Thomas Alva Edison is the greatest inventor in history.
THOMAS ALVA EDISON కొత్త విషయాలను కనుగొనడంలో విచిత్రమయిన మనిషి. తనకు తానే అన్నీ నేర్చాడు. అందరూ అవునన్న ఆలోచనలను తరచూ కాదనేవాడు. కొత్త ఆవిష్కరణలు చేయడంలో అతనికి అంతులేని శక్తి ఉండేది. జీవితకాలంలో మూడువేలకు పైబడి పేటెంట్లు తీసుకున్నాడు. అందుకే ప్రపంచంలోని ఆవిష్కర్తలలో అతనే గొప్పవాడు అంటారు.

ఈ ‘ఆవిష్కర్తల యువరాజు’ 11 ఫిబ్రవరి 1847న అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో మిలాన్లో పుట్టాడు. అతని తండ్రి శాముయెల్ ఎడిసన్ కలప, ధాన్యం వ్యాపారాలు చేసేవాడు. తల్లి నాన్సీ ఒకప్పుడు టీచర్గా పని చేసింది. THOMAS ALVA EDISON పిచ్చి వ్యవహారం చిన్నప్పుడే బయటపడింది. దుడుకుగా పెట్టుకుంటూ ఉండే అతడిని పట్టడం వీలయ్యేది కాదు. అందుకే టీచర్లందరూ అతడిని చెడ్డ అబ్బాయి అన్నారు. కానీ తన కొడుకులోని ప్రత్యేకతను అతని తల్లి గుర్తించింది.
అతనికి ప్రత్యేకమయిన పద్ధతి అవసరమని ఆమె వాదాలు అర్థం చేసుకున్నది. ఆమె తన కొడుకును బడి మాన్పించింది. ఇంట్లోనే పాఠాలు చెప్పింది. అతను ఆసక్తికొద్దీ తన పనులను చేసుకోవడానికి స్వతంత్రం ఇచ్చింది. ఆమె చేసినది చాలా తెలివిగల నిర్ణయం. మామూలు బడి చదువు, క్రమశిక్షణ అతనిమీద రుద్దితే ఆ పిల్లవానిలో ఉన్న సృజనాత్మక శక్తి బహుశా చల్లారి ఉండేది. ప్రపంచం నష్ట పోయేది.
తల్లి ఇచ్చిన స్వతంత్రాన్ని కుర్రTHOMAS ALVA EDISON పూర్తిగా వాడుకున్నాడు. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలాంటి పుస్తకాలను ఆశగా చదివాడు. కానీ ఏ విషయాన్ని తాను పరీక్ష చేయకుండా అంగీకరించేవాడు కాదు. తనంత తానుగా నమూనాలు వేసి కొత్త పరికరాలను తయారు చేయడం అతనికి అన్నిటికన్నా ఇష్టమయిన పని.
12 ఏళ్ల వయసులో THOMAS ALVA EDISON , ఇక ప్రపంచాన్ని తనంత తానే ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. వార్తా పత్రికలు, తిండి పదార్థాలు ట్రెయిన్లో అమ్మి సంపాదించడం మొదలు పెట్టాడు. ఒక స్వంత వార్తా పత్రికను ప్రారంభించాడు. దాన్ని ఒక రైలుపెట్టెలో అచ్చువేసేవాడు. కాలక్షేపం కబుర్ల పేరున అతను రాసే విషయాలతో చిర్రెత్తిన ఒక పాఠకుడు పూర్తి దుస్తులతో ఉన్న ఎడిసన్ను ఎత్తి ఒక నీటి మడుగులో పడవేయడంతో పత్రిక ఆలోచన అంతమయింది.
THOMAS ALVA EDISON రైలుపెట్టెను పరిశోధనశాలగామార్చి చిన్నచిన్న భౌతిక, రసాయనశాస్త్ర ప్రయోగాలు చేయడం మాత్రం కొనసాగుతూనే ఉండేది. పెట్టెలో ఒక పేలుడు జరిగిన తరువాత అది కూడా ఆపవలసి వచ్చింది. రైల్వే వాళ్లు అతడిని సరంజామాతో సహా ఎత్తి దగ్గరలోని ఒక లెవెల్ క్రాసింగ్ వద్ద పడేసి వచ్చారు.
అప్పటికి 16 ఏళ్లు వయసున్నTHOMAS ALVA EDISON ఏ మాత్రమూ వెనుకకు తగ్గలేదు. తన కుర్రవాడిని THOMAS ALVA EDISON ప్రమాదం నుంచి కాపాడినందుకు కృతజ్ఞతగల ఒక తండ్రి నుంచి అతను వైర్లెస్ టెలిగ్రఫీ గురించి మొత్తంగా నేర్చుకున్నాడు.
“అతను స్వయంగా మంచి నైపుణ్యంగల టెలిగ్రాఫ్ ఆపరేటర్ అయ్యాడు. అప్పటి అతనికి బాగా చెవుడు వచ్చింది. అందుకు కారణం చిన్నతనంలో వచ్చిన స్కార్లెట్ ఫీవర్ అన్నారు. అయినా టెలిగ్రాఫ్ పనిలో ప్రావీణ్యం చూపించడం | ఆశ్చర్యకరమయిన విషయం. నిజానికి THOMAS ALVA EDISON తనకున్న లోపాన్ని లాభసాటిగా మార్చుకున్నాడు. అతనికి పనిలో మంచి ధ్యాస కుదిరింది. (తరువాతి కాలంలో THOMAS ALVA EDISON ఒక మిత్రుడు ఎడిసన్కు చెవి యంత్రం పెట్టుకొమ్మని సలహా ఇచ్చాడు. అప్పుడతను ‘ఇవాళ విన్న విషయాలో గుర్తుంచుకోవసినవి ఎన్ని ఉన్నాయో చెప్పు చూద్దాం?’ అని ఎదురు ప్రశ్న వేశాడట.https://pincodesguide.in/modern-electronics/
ఈ సమయంలోనే అతను మైకేల్ ఫారడే రాసిన ఎక్స్పర్మెంటల్ రీసెర్చస్ ఇన్ ఎలెక్ట్రిసిటీ అనే పుస్తకాన్ని చదివాడు. ప్రయోగాలు చేసే నైపుణ్యంలో ఫారడేకుTHOMAS ALVA EDISON కు పోలికున్నాయి. బడి చదువు లేకపోవడం, గణితంలో గొప్ప శిక్షణ లేకుండానే కొత్త విషయాలను ఊహించగలగడం కూడా ఇద్దరి లోను ఉన్న గుణం. ఎడిసన్కు జీవితమంతా లెక్కలంటే ఏవగింపు ఉండేది. (“నేను చాలామంది గణితకారులను ఉద్యోగంలో పెడతాను.
వాళ్లు నాకు ఉద్యోగం ఇవ్వలేరు’ అన్నాడతను ఒకసారి.) ఫారడే పుస్తకం చదివి ఉత్తేజం పొందిన THOMAS ALVA EDISON కంటిమీద కునుకు లేకుండా ఒక్కరాత్రిలోనే పుస్తకాన్ని పూర్తి చేశాడు. పుస్తకం అతనికి ప్రేరకంగా పనిచేసింది. ఇక కొత్త అంశాలను కనుగొనడానికి అతను తన సమయాన్ని, శక్తిని పూర్తిగా వెచ్చించసాగాడు.
THOMAS ALVA EDISON దుస్తులు బాగా ఉండేవి కాదు. గజిబిజిగా ఉండడంలోనే అతనికి గొప్పతనం కనిపించేది. నిద్ర లేకుండా అతను చాలాసేపు పని చేయగలిగేవాడు. ప్రకృతి సిద్ధమయిన పద్ధతులను అర్థం చేసుకోవడానికి అతనెప్పుడూ ప్రయత్నించలేదు. అయినా వాటి ఉపయోగాలను అర్థం చేసుకోవడంలో మాత్రం తెలివి ప్రదర్శించేవాడు. తన పనివాళ్లకు మంచి జీతాలు ఇచ్చేవాడు. కానీ వాళ్లు కూడా తనలాగే అంకితభావంతో పనిచేయాలి అనేవాడు.
అతను పుట్టుకతోనే ఆశాజీవి. అందుకే అన్ని విషయాలలోను మంచిని మాత్రమే చూచేవాడు. జీవితంలో తరువాతి స్థాయిలో ఒకసారి అతని కర్మాగారం మంటల్లో నాశనమయింది. ఆ సంఘటనను చూస్తున్నప్పుడు అతనికి తన నష్టం గురించి ఆలోచన కలగలేదు. కొడుకును పిలిచి వెంటనే వాళ్ల అమ్మను పిలుచుకు రమ్మని చెప్పాడట. ‘ఇంత పెద్ద మంట చూచే అవకాశం మీ అమ్మకు మరొకసారి అందకపోవచ్చు’ ఆమె రావడానికి కారణంగా అతను చెప్పినమాట అది. పనిలో కూడా అన్నీ ఉపయోగకరమయిన విషయాల గురించే ఆలోచించేవాడు. అయినాసరే అతనికి షేక్స్పియర్ నాటకాలు చదవడం అంటే మాత్రం ఇష్టమని చెపితే చిత్రం పూర్తవుతుంది.
అందరికీ అంగీకారం అవుతాయన్న సంగతులను గురించి మాత్రమే THOMAS ALVA EDISON కృషి చేసేవాడు. అతను తన పని మొదటి రోజులోనే పాఠాలు నేర్చుకున్నాడు. అతను కనుగొన్న మొదటి అంశాలలో త్వరగా ఓట్లను లెక్కించే యంత్రం ఒకటి. దాన్ని యుఎస్ఎ కాంగ్రెస్, సెనేట్ల కొరకు అతను తయారు చేశాడు. కానీ పెద్దతరం రాజకీయ నాయకులు ఆ యంత్రాన్ని తిప్పికొట్టారు. ఓట్ల లెక్కింపు నెమ్మదిగా జరుగుతూ ఉంటే చివరి క్షణాలలో కూడా మనసు మార్చుకునే అవకాశం ఉంటుందని వారన్నారు. ఈ విషయాన్ని ఎన్నడూ మరవలేదు ఎడిసన్.
అందరూ ఆవిష్కర్తలలాగ కాకుండా అతనికి చక్కని వ్యాపార దృష్టి ఉండేది. పనులను పథకాల ప్రకారం చేసేవాడు. ఎంత చేసినా అతనూ మనిషే, కనుక అతను కూడా ఏవో లోపాలుగలవాడే. అతను ఏ కరెంట్ సరఫరాను ప్రవేశపెడతామంటే మాత్రం మొండిగా వద్దని వాదించాడు. ఆ పద్ధతిని ప్రస్తుతం ప్రపంచమంతటా వాడుతున్నారు.
THOMAS ALVA EDISON ఉద్యోగం వెతుకుతూ న్యూయార్క్క మారాడు. గోల్డ్ ఎక్ఛేంజ్ భవనంలో తాత్కాలికంగా బసచేశాడు. అక్కడ అతను గడిపిన మూడవనాడు బంగారు ధరను ప్రదర్శించే యంత్రం ఆగిపోయింది. మొత్తం వ్యాపారంలో గజిబిజి మొదయింది. THOMAS ALVA EDISON మాత్రం ప్రశాంతంగా దాన్ని మళ్లీ పనిచేయిస్తా నన్నాడు.
రెండు గంటలలోనే పనిచేయించాడు కూడా. వెంటనే అతనికి యంత్రాలమీద పర్యవేక్షకుడిగా అక్కడ ఉద్యోగం ఇచ్చారు. కొత్తదనం లేకుండా పనిచేయాలంటే సంతృప్తి చెందని ఎడిసన్ స్టాక్ మార్కెట్కు అవసరమయిన టేప్ మెషీన్కు కొత్త నమూనాను తయారు చేశాడు. అందుకుగాను 40వేల డాలర్లు ఇచ్చి వాళ్లు హక్కు తీసుకున్నారు. 22 ఏళ్ల ఆ ఆవిష్కర్త అంతకుముందు అంత డబ్బు ఎన్నడూ చూచి ఉండలేదు.
1870 తొలిభాగంలోనే THOMAS ALVA EDISON తన చేతికందిన పెట్టుబడితో స్వ ఫ్యాక్టరీని న్యూవార్క్ స్థాపించాడు. సంపాదించాలన్న పేరుతో టేప్ మెషీన్లు తయారుచేశాడు. వచ్చిన డబ్బు సాయంతో అతను దాదాపు 45 పరిశోధనలను కొనసాగించాడు. టెలిగ్రాఫ్ మీద ఒకే దిశలో ఒకేసారి రెండు సందేశాలను పంపించడం లేదా రెండు సందేశాలను అటుఇటూగా పంపించడం అన్న పద్ధతిని అతను చాలా బాగా తయారుచేశాడు. దాన్ని మరింత మార్చి ఒకేసారి

ఆరు సందేశాలను పంపేతీరు వీలయింది. 1871, క్రిస్మన్నాడు THOMAS ALVA EDISON తన ఒకానొక కర్మాగారంలో పని చేస్తున్న 18 ఏళ్ల అందమయిన అమ్మాయి మేరీ స్టిల్వెల్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లినాటి రాత్రి అతను పనిలో మునిగి పెళ్లి సంగతే మర్చిపోయాడు. ఎవరో అతనికి ఆ విషయం గుర్తుచేయవలసి వచ్చింది. అదీ అతని తీరు. అతని వైవాహిక జీవితం 13 ఏళ్ల పాటు సంతోషంగా గడిచింది. వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు. కానీ ఆ తరువాత మేరీ మరణించింది.
1876లో ‘ఇన్వెన్షన్ ఫ్యాకట్టరీ’ అని తాను పిలిచే పరిశోధనశాలను THOMAS ALVA EDISON న్యూయార్క్ నగరానికి 25 మైళ్లు (38 కిలోమీటర్లు) దూరంలో ఉండే మెన్లో పార్క్కి మార్చాడు. అది ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది. గొప్పవాళ్లందరూ దాన్ని చూడవచ్చారు. ఎడిసన్ను అందరూ ‘మెన్లో పార్క్ మాంత్రికుడు’ అనసాగారు. అయితే అతనికి ఆ పేరు నచ్చలేదు. మాంత్రికుడంటే పెద్దకృషి లేకుండా విషయాలను సాధిస్తాడు కదా అన్నాడు. ‘మాంత్రికుడు కావడానికి ఈయనకన్నా ఎక్కువగా కష్టపడిన వాళ్లు మరెవరూ లేరు’ అన్నాడు అతని కొడుకు ఒకసారి. ఎడిసన్ తన విజయాలన్నీ కేవలం తన పట్టుదల వల్లనే వీలయ్యాయని గట్టిగా నమ్మాడు.
అలెగ్జాండర్ గ్రాహం బెల్ కనుగొన్న టెలిఫోన్ను మెరుగుపరచే పనిని ఎడిసన్ ఎత్తుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఎడిసన్ తయారు చేసిన కార్బన్ ట్రాన్స్మీటర్ కారణంగానే టెలిఫోన్ పెద్దఎత్తున సమాచార ప్రసార మాధ్యమంగా రూపుదాల్చింది. అతను వరదలాగ మరెన్నో కొత్త సంగతులను కనుగొన్నాడు. ఇనుము ముడి ఖనిజాన్ని అయస్కాంత పద్ధతితో వేరుచేయడం, నిలువబ్యాటరీ లాంటివి వాటిలో ఉన్నాయి.

ఎడిసన్ను అతను కనుగొన్న మూడు అంశాలకు గాను ముఖ్యంగా గుర్తుంచుకుంటారు. అవే గ్రామోఫోను, ఎలెక్ట్రిక్ బల్బు, మోషన్ పిక్చర్ కెమెరా అనేవి. వీటిలో కూడా అందరికీ ఎక్కువ ప్రీతిపాత్ర మయింది గ్రామోఫోన్. మరేదో విషయం గురించి పరిశోధిస్తూ ఉండగా, తిరుగుతూ ఉన్న లోహపు సిలెండర్ను ఒక సూది తాకినప్పుడు సిలెండర్ మీది గుర్తును బట్టి వింత చప్పుడు రావడాన్ని ఎడిసన్ గమనించాడు. మనిషి గొంతును కూడా ఈ విధంగా రికార్డు చేసే వీలుంటుందా అని అతను ఆలోచించసాగాడు.

దగ్గర ఉన్న అందరికన్నా మంచి క్రాప్ట్మన్కు దాని తయారీ పనిని అప్పగించాడు. కానీ ఆ మనిషి అంతకుముందు అటువంటి యంత్రాన్ని చూడలేదు. దానితో ఏం ప్రయోజనం ఉంటుందని అడిగాడు. అయితే డాబుగా ఎడిసన్ పని ముగిసిన తరువాత విషయం చెపుతానన్నాడు. చివరికి ఆ కార్మికుడు పరికరాన్ని తయారుచేసి తెచ్చాడు. అతనితోబాటే మరింతమంది వింత చూడడానికన్నట్టు 1 గుంపుగా వచ్చారు. పరికరంలో ఒక సిలెండర్ చుట్టూ సన్నని రేకు చుట్టబడి ఉంది.
దానిమీద ఒక సూది, ఒక మైక్రోఫోన్ కూడా ఉన్నాయి. THOMAS ALVA EDISON మైక్రోఫోన్ అందుకుని ‘మేరీ హాడ్ ఏ లిటిల్ ల్యాంబ్…’ అంటూ పాడసాగాడు. పనివాళ్లంతా అతనివేపు జాలిగా చూచారు. పని ఒత్తిడితో తమ యజమాని పిచ్చివాడయ్యాడు అనుకున్నారు. ఎడిసన్ మాటలు ఆపాడు. సూదిని సిలెండర్ మీద మొదట్లోకి పెట్టాడు. ‘మేరీ హాడ్ ఏ లిటిల్ ల్యాంబ్…’ అంటూ అందులో నుంచి ఎడిసన్ గొంతు యధాతధంగా వినిపించసాగింది.

గదిలో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. మనిషి గొంతును రికార్డు చేసి మళ్లీ వినిపించడం అదే మొదటిసారి. ఆశ్చర్యపోయిన కొందరు పెద్దవాళ్లు క్రాస్ గుర్తును ఒంటిపై చేసుకున్నారట కూడా! ప్రజలను గ్రామోఫోన్ ఒక తుఫానుకు గురి చేసింది. ఎడిసన్ ప్రపంచంలోని అందరికన్నా ప్రసిద్ధుడయిన మనిషి అయ్యాడు. అయితే అతను కనుగొన్న అంశాలలో అన్నిటికన్నా ఉపయోగకరమయినది. ‘ఎలెక్ట్రిక్ బల్బు. దానితోబాటే విద్యుత్ సరఫరా పద్ధతి.
అతను విద్యుద్దీపం గురించి 1878లోనే పని మొదలు పెట్టాడు. అది చాలా కష్టమయిన పనిగా తోచింది. దీపంలోని ఫిలమెంటు కొరకు అతను 2,500 రకాల పదార్థాలను పరీక్షించి చూచాడు. చివరికి కార్బన్ పూసిన వెదురు పుల్లను ఎంచుకున్నాడు. (ప్రస్తుతం దీపాలో టంగ్స్టన్ తీగను వాడుతున్నారు. )
ఆ తరువాత అతను విద్యుత్ ఉత్పత్తి, రవాణా, వాడకం దారులకు వైరింగ్ పద్ధతి మొదలయినవాటిని డైరెక్ట్ కరెంటు లేకుండా అభివృద్ధి పరిచాడు. ఎడిసన్ ఈ పనిని తన జీవితంలోనే అన్నిటికన్నా గొప్ప సాహసంగా వర్ణించాడు. అందుకుగాను చాలా ప్రకారం పరిశోధన అవసరమయింది. ‘ఎడిసన్ కనుగొన్న అంశాన్నింటిలోకి ‘ క్రమబద్దంగా పరిశోధన చేయడం అన్నది చాలా గొప్పది’ అన్నాడు అతని
THOMAS ALVA EDISON అభిమాన మిత్రుడు ఒకప్పుడు. అది ఎంతటి వాస్తవమో! న్యూయార్క్ నగరంలో ఒక చదరపు కిలోమీటరు మేర వైరింగ్ చేయించి ఎడిసన్ తన మహత్తర ప్రదర్శనకు సిద్ధమయ్యాడు. 4 సెప్టెంబర్ 1882న అతని పర్యవేక్షణలో పెద్ద స్టీమ్ బాయిలర్లు ఆవిరిని చిమ్మడం మొదలు పెట్టాయి. దాని సాయంతో స్టీమ్ ఇంజన్లు, డైనమోలు పనిచేయసాగాయి. అవి రానురాను మరింత వేగంగా పని చేశాయి.
సరి అయిన వేగం రాగానే ఎడిసన్ మాస్టర్ స్విచ్ను నొక్కాడు. ఒక్కసారిగా 1,20,000 మీటర్ల పొడవు, భూగర్భ కేబుల్స్లో కరెంటు పరుగులెత్తింది. చదరపు కిలోమీటరు ప్రాంతంలో ఉన్న భవనాలన్నీ ఒక్కసారిగా దీపకాంతిలో వెలిగిపోసాగాయి. ఆ సంఘటనను చూచిన వారందరూ కూడా విద్యుత్తులాగే ఉత్తేజం పొందారన్నది సత్యం.
మార్చి 1883లో THOMAS ALVA EDISON విజ్ఞానశాస్త్రంలో తన ఏకైక పరిశోధనను కూడా సాధించాడు. బల్బు లోపల నల్లబడడాన్ని గమనించి అతను అందులో రెండవ ఎలెక్ట్రోడు ఏర్పాటు చేశాడు. దాన్ని సర్క్యూట్ లోని పాజిటివ్ ధృవానికి కలిపితే ఎలెక్ట్రోడ్ ఫిలమెంట్ మధ్యన విద్యుత్తు ప్రవహించడం గమనించాడు.
‘ఎడిసన్ ఎఫెక్ట్’ అనే ఈ పరిశోధన తరువాతి కాలంలో వాక్యూమ్ ట్యూబ్- ఆవిష్కరణకు ఆధారంగా నిలిచింది. 1947లో ట్రాన్సిస్టర్ను కనుగొనేదాకా ఈ ట్యూబ్ వాడకం పెద్ద ఎత్తున కొనసాగింది.
అతని విజయపరంపరలు ఉన్నతస్థాయిలో ఉండగానే, 1884లో ఎడిసన్ భార్య మేరీ టైఫాయిడ్ కారణంగా చనిపోయింది. వాళ్ల వైవాహిక జీవితం ఆనందంగా గడిచింది. దుఃఖాన్ని మరిచిపోవడానికిగాను ఎడిసన్ మరింతగా పనిలో మునిగిపోయాడు.https://photos.app.goo.gl/Az6yA14REHJ3Y3fb9
దుఃఖంనుంచి తేరుకున్నాక తరువాత ఎడిసన్ మళ్లీ బయట తిరగసాగాడు. 1886లో మీనా మిల్లర్ అనే ఆమెను కలిశాడు. ఆమె తనకన్నా 19 సంవత్సరాలు చిన్నది. అయినా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదృష్టంకొద్దీ రెండవసారి కూడా అతని కుటుంబ జీవితం ఆనందంగా కొనసాగింది. మరణించే వరకు కూడా ఇంట్లో అతనికి మంచి ప్రశాంతత, ఆనందమూ అందాయి. (అతనికి చెవుడు భార్య మోర్స్ కోడ్ ద్వారా అతనితో మాట్లాడేది.)
1887లో ఒక మిత్రుడు ఎడిసన్ కోసం ‘ద వీల్ ఆఫ్ లైఫ్’ అనే ఒక ఆటబొమ్మను తెచ్చాడు. అందులోని చక్రాన్ని తిప్పితే ఒక సందులోనుంచి చూచినప్పుడు వరుసగా బొమ్మలు కదిలి ఒక ఎలుగబంటి ఆడుతున్న దృశ్యం కనిపించింది. ఆ ఆటబొమ్మ లక్షలాదిమందికి అప్పటికే బాగా తెలుసు. కానీ ఎడిసన్ మాత్రం దానిగురించి అసలు సిసలయిన ఆవిష్కర్త పద్ధతిలో మరో రకంగా ఆలోచించాడు. ‘బొమ్మలను వేగంగా కదిలిస్తూ ఒకే దృశ్యంగా కనిపించే కదిలే బొమ్మల సినిమా పద్ధతిని ఎందుకు తయారు చేయకూడదు!’ అన్న ఆలోచన అతనిలో పుట్టింది.
ఆ పనికి అతనికి రెండు సంవత్సరాలు పట్టింది. ఫొటోగ్రాఫిక్ పరిశ్రమలో వారి సహకారం కూడా అవసరమయింది. 1889 నాటికి మొట్టమొదటి మూవీ కెమెరాను అతను సిద్ధం చేశాడు. అది సెకండ్కు 20 నుంచి 40 బొమ్మలు తీసేది. ఇవాళ్ళటి విస్తృతమైన సినిమా పరిశ్రమ (హాలీవుడ్, బాలీవుడ్) మొత్తంగా ఎడిసన్ నిశిత దృష్టికి, ఆలోచనా సరళికి రుణపడి ఉన్నాయి.
ఎడిసన్ ఎంతటి వ్యాపారదృష్టి కలవాడయినా అంతగాను, ఆదర్శాలు కలవాడు కూడా. వైద్యుల కోసం అతను ఫ్లోరోస్కోప్ అనే యంత్రాన్ని తయారు చేశాడు. అయితే దాన్ని విస్తృతంగా తక్కువ ధరలో తయారుచేసి వాడడానికి వీలు ఉండాంటూ దానికి పేటెంట్ మాత్రం తీసుకోలేదు. తరువాతి రెండు దశకాలలో కూడా ఎడిసన్ పరిశోధన కొత్త పరికరాల ఆవిష్కరణ ఏ మాత్రం వేగం తగ్గకుండా కొనసాగాయి. స్టోరేజి బ్యాటరీలు, టార్పెడోలను కనుగొనడానికి పరికరాలు, నీటి లోపల పనిచేసే సెర్చ్ట్లు… ఇలా అతను ప్రవాహంగా కనుగొని ప్రపంచానికి అందించిన ఆవిష్కరణలకు అంతం కనిపించలేదు.
ఎడిసన్ ఆవిష్కరణన్నింటిలోనూ కనిపించిన ముఖ్య లక్షణం మౌలికంగా అవి సులభంగా ఉండడం. విద్యుత్తు, రసాయనశాస్త్రం మొదయిన విషయాలను గురించి ఎంతో తెలిసిన వైజ్ఞానికులు లెక్కలేనంత మంది ఉండేవారు. అయినా వాళ్లందరూ సాధించలేని పనిని ఒక్కనాడు కూడా బడి ముఖం చూడని ఈ మహాజ్ఞాని సాధించాడు. అయితే అతనిలో ప్రత్యేకంగా ఉన్న లక్షణాలు ఏమిటి? మొట్టమొదట వైజ్ఞానిక సత్యాల యొక్క ఉపయోగం గురించి నిర్ణయించగలిగే అసాధారణమయిన శక్తిని చెప్పుకోవాలి.
తరువాత అతనికి గల ఓపిక, పట్టుదలలను చెప్పుకోవాలి. సరైన సమాధానం దొరికే వరకు అతను అంతులేని ఆలోచనలను గురించి ప్రయోగాలు చేస్తూనే ఉండేవాడు. ఇక అతని మూడవ లక్షణం చక్కని వ్యాపారదృష్టి. పరిశోధనలకు అవసరమయిన పెద్దమొత్తాలను అతను చాలా తెలివిగా తానే సంపాదించుకోగలిగాడు.
పనిపట్లగల ఉత్సాహం, ఆశాభావం అన్న లక్షణాలు ఎడిసన్ ను చాలాకాం పాటు చక్కగా ముందుకు నడిపించాయి. 75 సంవత్సరాల వయస్సు దాటిన తరువాత మాత్రమే అతను కొంచెం నెమ్మదించాడు. అతనికి అనారోగ్యం కలిగినప్పుడు కూడా తన పరిస్థితి, మందులు, చికిత్స పట్ల అతను చూపే కుతూహలాన్ని గమనించిన డాక్టర్లు ఎడిసన్ అనారోగ్యాన్ని కూడా ఒక వైజ్ఞానిక పరిశోధనగానే భావిస్తున్నాడని ఆశ్చర్యంగా అనుకున్నారు. ఆయన 18 అక్టోబర్ 1931న 84 ఏళ్ల పండు వయసులో ప్రాణాలు వదిలాడు.
తను జీవించి ఉండగానే ఎడిసన్ ప్రపంచంలోకెల్లా చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తులో ఒకరు అనిపించుకున్నాడు. అతనికి ఎన్నో సన్మానాలు జరిగాయి. మానవాళి సంక్షేమం కొరకు అతను చేసిన కృషికిగాను 1928లో ఇచ్చిన కాంగ్రెషనల్ బంగారు పతకం ముఖ్యమైంది. 1960లో అంటే మరణానంతరం న్యూయార్క్ యూనివర్సిటీవారు ఎడిసన్ను హాల్ ఆఫ్ ఫేమ్ ఫర్ గ్రేట్ అమెరికన్స్లో చేర్చడానికి ఎంపిక చేశారు. కానీ నివాళిగా చేయదలచుకున్న ఒక పని మాత్రం విచిత్రమయినది.
అతను మరణించినప్పుడు, 1882లో అతను విజయం సాధించిన న్యూయార్క్ నగరంలో రెండు నిమిషాల పాటు మొత్తం దీపాలను ఆర్పివేయాలని అనుకున్నారు. కానీ అది 1931. పాతకాలం కాదు. ఆ పని చేస్తే ప్రజాజీవితమంతా అస్తవ్యవస్తమవుతుందని ఆ ఆలోచనను మానుకున్నారు. ఈ రకమైన నివాళికన్నా అతనికి మరింత గౌరవకరమైంది మరొకటి లేదు.
భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న పరిస్థితులలో స్థానిక సమస్యలను అర్థం చేసుకుని ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా సమాధానాలను కనుగొనడానికి సిద్ధంగా ఉండే ఆవిష్కర్తల అవసరం ఎంతో ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో వాడిన పద్ధతులు చాలామటుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనువుగా ఉండవు. ఉదాహరణకు పారిశ్రామికీకరణ జరిగిన దేశాలలో విద్యుత్తు ఉత్పత్తి ఒకేచోట పెద్ద ఎత్తున జరుగుతుంది.
కానీ భారతదేశంలో వందలలో మాత్రమే జనాభా కలిగి చెల్లాచెదురుగా ఉన్న గ్రామాలకు విద్యుత్తును సరఫరా చేయాంటే ఈ పద్ధతి అనుకూలమయినది కాదు. ఇక్కడ సూర్యుడు, గాలి, జీవ పదార్థాలు మరి ఇతర వనరులనుంచి వికేంద్రీకరణ పద్ధతిలో విద్యుత్తును తక్కువస్థాయిలో ఉత్పత్తి చేయడం అవసరం. ఇక మన దేశపు పంటల ఉత్పత్తిలో పావుభాగం ఎలుకల వలన నాశనమవుతున్నది. ఈ సమస్యకు సమాధానంగా గట్టి ధాన్యం నిలువ సదుపాయాలు చవకగా, చిన్నవిగా అవసరం.
అంతేగానీ కెనడాలో వలె భారీ ఎత్తున ఉండే ఎలివేటర్స్ ఇక్కడ పనికిరావు. మన సాంప్రదాయిక వ్యవసాయ పనిముట్లు గొప్పపనితనం గలవి కావు. కానీ అయోవా వంటిచోట వాడే భారీ పంటకోతల యంత్రాలను మన దగ్గర వాడడం కుదరదు. వంట చెరుకు పేరున అడవులు నాశనమవుతున్నాయి. అయితే అది జరగ కూడదని మనం కోట్లాది మందికి కరెంట్ పొయ్యిలను ఏర్పాటు చేయలేము గదా!
ఇక్కడ మనకు కావసినది దివంగత ఈ.ఎఫ్. షూమాకర్ (స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ రచయిత) ‘మధ్యస్థాయి సాంకేతికశాస్త్రం’ అని పిలిచిన పద్ధతులు. వ్యవసాయంలోను, గ్రామీణ పరిశ్రమలలోను ఉత్పాదకతను పెంపొందించాలి. అయితే ఈ పేరుమీద ఉద్యోగావకాశాలను అరుదయిన వనరులను పక్కన పెట్టకూడదు. సాంకేతిక విధానాలను మన ప్రజల మౌలిక అవసరాలకు అనువుగా మార్చుకోవాలి. ఆ రకంగా పేదరికాన్ని నిర్మూలించాలి. భారతదేశపు పరిస్థితులకు తగిన సాంకేతిక విధానాల అభివృద్ధి మన ప్రస్తుత ప్రధాన ఆవశ్యకత.
భారతదేశంలో ఆవిష్కర్తలు వ్యవసాయ పనిముట్ల మెరుగుదల, వ్యవసాయ ఉత్పత్తుల రక్షిత నిలువ సౌకర్యాలు, చవకగా ఇళ్ళ నిర్మాణం, రక్షిత మంచినీటి సరఫరా మొదయిన విషయాలను గురించి ధ్యాస పెట్టవలసి ఉంది. ఆసక్తిగల భారతీయ ఆవిష్కర్తలకు పని చేయడానికి సమస్యల కొదువే లేదు. చవకగా ఇళ్ళు కట్టడం గురించి పనిచేసిన ఒక్క ఆవిష్కర్త వల్ల మన దేశానికి డజను నొబేల్ బహుమతి పొందిన వారి వల్ల జరిగే దానికన్నాకన్నా ఎక్కువ లాభం జరుగుతుంది.
గతంలో భారతదేశం నుండి గొప్ప ఆవిష్కర్తలెవరూ రాలేదు. ఇందుకు కారణం మన చేతకానితనం కాదు. మన సమాజం ఇటువంటి విషయాల మీద కాక ఆధ్యాత్మికతకు ప్రాముఖ్యం ఇచ్చినందుకు ప్రాధమికంగా ఇలా జరిగింది. విదేశీ రాజకీయ, ఆర్థిక అధికారాలనుండి మనలను మనం కాపాడు కోవాలంటే మన దగ్గర గట్టి మౌలిక సదుపాయాలు అవసరమన్న చేదు పాఠాన్ని చరిత్ర మనకు నేర్పించింది. పెచ్చుమీరిన పేదరికం పరిస్థితులో ఆధ్యాత్మికత, సంస్కృతి కూడా అభివృద్ధి చెందజాలవు. కనుక మన దేశంలో బలంగా ఉన్న సమస్యవ పట్ల దృష్టి పెట్టి కృషి చేయవవసిన అంకితభావంగల భారతీయ ఆవిష్కర్తల అవసరం ఎంతయినా ఉంది.