The computer age is a great revolutionary change in human life.
COMPUTER ….ఒక వాషింగ్ మెషీన్ను ఆన్ చేయగానే అది చేయవలసిన పనిని బుద్ధిగా చేస్తుంది. భారతదేశం నుంచి చేసిన టెలిఫోన్ కాల్ తక్షణమే యుఎస్ఏ లోని ఫోను చేరుతుంది. సినిమాలో ఏనాడో అంతరించిన రాక్షసి బల్లులు హీరో వెంటపడి తరుముతాయి. ఆటోమేటిక్ ఉత్పత్తి పద్ధతిలో మనుషుల ప్రమేయం లేకుండానే పని సక్రమంగా సాగుతుంది. భూమి మీద ఫ్లయిట్ సిములేటర్లో పైలట్ శిక్షణ వాస్తవ పరిస్థితులలో లాగే సాగుతుంది. ఇవి, ఇలాంటి మరిన్ని అద్భుతాలను వీలు చేసినది ఏమిటి? ఒక్కమాటలో జవాబు చెప్పవచ్చు.

COMPUTER గృహోపకరణాలలోని చిన్న కంప్యూటర్లు అవసరమయిన ఆ పనిని మాత్రమే చేయగలుగుతాయి. వాటినుంచి వాతావరణ సూచనలను ఇవ్వగల, అంతరిక్ష నౌకలను నడిపించగల బృహత్తరమయిన మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ల వరకు ఈ కంప్యూటర్లు రకరకా ఆకారాలు, పరిమాణాలలో ఆధునిక ప్రపంచంలో అంతటా విస్తరించాయి. ఏదో అదృశ్య హస్తం వచ్చి ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లను అన్నింటినీ ఒక్కసారిగా తొలగించ గలిగితే పెద్దకలకలం పుడుతుంది.
అయితే COMPUTERS పెద్ద ఎత్తున రంగం మీదకు వచ్చి రెండు దశాబ్దాలపైన మాత్రమే అయ్యింది.
అన్ని కీలకమయిన సాంకేతిక విషయాలలాగే కంప్యూటర్లు కూడా ఒకసారి వచ్చిన తరువాత ఇక అనివార్యంగా మారి అవి లేకుండా గడవని స్థితి వచ్చింది. ఈ రకం సాంకేతిక వనరులు చాలా కాలంపాటు తయారీ స్థాయిలో ఉంటాయి. ఆ కాలంలో మామూలు ప్రజకు వాటి గురించి ఎక్కువగా తెలియదు. కానీ ఒక్కసారి అవి పూర్తి సాంకేతికశాస్త్రంగా వెలువడే సరికి ప్రపంచాన్ని ఒక తుఫాన్కు గురి చేస్తాయి. ఒకప్పుడు ఆవిరిశక్తి, విద్యుచ్ఛక్తి ఈ రకంగానే వచ్చాయి. ఆ వరుసలో ఇటీవల వచ్చింది కంప్యూటర్.
తొలి కాల్కులేటర్

COMPUTER అన్నది మౌలికంగా లెక్కలు, సార్టింగ్, వెతకడం వంటి పనులు చేసే యంత్రం. ఆపరేటర్లుగా మనుషులు వాటికి ఆ పనిని అప్పచెపుతారు. నేటి COMPUTER మొట్టమొదటి రూపం 2000 సంవత్సరలనాడు బాబిలోన్ తయారు చేసిన అబాకస్. ప్రస్తుతం దూరప్రాచ్య దేశాలయిన చైనా, కొరియాలో వాటిని ఇంకా విరివిగా వాడుతున్నారు. చైనా సమాజాలలో వాస్తవానికి ఇవాళ కూడా వాటిని కొంతవరకు వాడుతున్నారు. మౌలికంగా అది ఒక కర్ర ఫ్రేము. అందులో అడ్డంగా ఉన్న తీగమీద పూసలు గుచ్చి ఉంటాయి. నియమాల ప్రకారం ఈ పూసలను కదిలిస్తూ లెక్కలు చేయవచ్చు.
ఆధునిక సమాజం అభివృద్ధి చెందిన కొద్దీ కొన్ని లెక్కలను ఎక్కువసార్లు అదేపనిగా చేయవలసిన అవసరం వచ్చింది. మనుషులకు అందులో వేగం కుదరలేదు. జనాభా లెక్క విశ్లేషణ, సముద్రయానాల పట్టికలు మొదలయినవి అందుకు ఉదాహరణలు. వాటిని యాంత్రికపరంగా చేయడంఅవసరమయింది. గేర్లు అనే పళ్ల చక్రాలు తయారు చేయడం వీలుకావడంతో యాంత్రిక లెక్కింపు యంత్రాలు కూడా 17వ శతాబ్దిలోనే వీలయ్యాయి.
తొట్టతొలి కాల్కులేటర్లు వాటి ఆధారంగానే పనిచేశాయి. ఫ్రాన్స్లో బ్లెయిజ్ పాస్కల్, జర్మనీలో విల్వెల్మ్ ఫన్ లైబ్నిజ్లు 1642లో, 1671లో వీటిని తయారు చేశారు. కానీ వ్యాపార పరంగా విజయం సాధించిన యాంత్రిక కాల్కులేటర్ను మాత్రం 1820లో టొమాస్ ఆఫ్ కోల్మార్ రూపొందించాడు. అతడు రూపొందించిన యంత్రంతో కూడికలు, తీసివేతలు, భాగహారం, గుణకారాలు కూడా వీలయ్యేవి.

ఆ యుగంలో అందరికన్నా గుర్తింపు పొందిన వ్యక్తి ఇంగ్లండ్కు చెందిన చార్ల్స్ బాబేజ్ (చూ. అధ్యాయం 5) ఎంతో ముందుచూపుతో అతను ఆనాడే ప్రస్తుతపు కంప్యూటర్లలో అవసరమయిన, సమాచారం అందించే పరికరాలు, లెక్కింపు, జ్ఞాపకశక్తి, నియంత్రణ విభాగం, వివరాలు అందించే విభాగం మొదయిన కీలకాంశాలన్నింటినీ ఊహించాడు. అతని కంప్యూటర్ పూర్తిగా ఒక యాంత్రిక పరికరం. అందులో పెద్ద సంఖ్యలో గేర్లు, షాఫ్ట్లు మొదలయినవి ఉండేవి. అవన్నీ ఆవిరి శక్తితో పనిచేశాయి. (అతను దాన్ని విశ్లేషణ యంత్రం, లేదా అనలిటికల్ ఇంజన్ అన్నాడు) అయితే ఆ వ్యవస్థ చాలా పెద్దది.
నమ్మకంగాపనిచేయడంలో చిక్కులుండేవి. వివిధ భాగాలోని పళ్ల చక్రాలు, వాటి మధ్య ఒరిపిడి చిక్కులకు దారి తీసేవి. కనుక యంత్రం విశ్వసనీయంగా పనిచేయలేదు. బాబేజ్క గొప్ప అవగాహన ఉండేది కానీ, దాన్ని వాస్తవం చేయడానికి మాత్రం వెసుబాట్లు లేవు. అందరి వెక్కిరింపులకు గురయ్యి అతను నిరాశతో మరణించాడు. కానీ కొనసాగిన అభివృద్ధి కారణంగా అతని ముందుచూపు ప్రపంచానికి అర్థమయ్యింది.
కానీ బాబేజ్ తరువాత వచ్చిన అంతగా ఆశయాలు లేని మరోరకం అన్వేషకులు ప్రయోగాత్మకంగా ఆలోచించి చిన్న యంత్రాలను తయారు చేశారు.

అవి అంత గజిబిజిగా ఉండకపోవడంతో బాగా ఉపయోగకరంగా వచ్చాయి. ఇటువంటి వారిలో హెర్మన్ హొలెరిత్, యుఎస్ఏకు చెందిన జేమ్స్ పవర్స్ ముఖ్యులు. వారు 1890లో పంచ్ కార్డుతో పనిచేసే యంత్రాలను యుఎస్ జనాభా వ్యవస్థ కొరకు తయారుచేశారు. ఆ యంత్రాల కారణంగా జనాభా లెక్కల విశ్లేషణ చాలా సులభంగా చేయడం వీలయ్యింది. క్రమంగా ఇటువంటి యంత్రాలను మరింత మెరుగుపరిచారు. 20వ శతాబ్ది వచ్చేనాటికి ఎలక్రో- మెకానికల్ కాల్కులేటర్లు చాలా సంస్థల్లో వ్యాపారపరంగా ఉత్పత్తి కాసాగాయి. ప్రస్తుతకాలపు ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (ఐబిఎమ్), రెమింగ్టన్-రాండ్, బరోస్ లాంటి కంప్యూటర్, ఆఫీస్ ఉపకరణాలు తయారుచేసే ప్రసిద్ధ సంస్థలు అప్పుడు పుట్టినవే.
ఎలెక్ట్రానిక్ కంప్యూటర్లు
పూర్తిగా ఎలెక్ట్రానిక్ పద్ధతిలో పనిచేసే COMPUTERS 1906లో వాక్యూమ్ ట్యూబ్ను కనుగొన్న తరువాతే వీలయ్యాయి. ఇందులో ఎలెక్ట్రాన్ ప్రవాహంతో పని జరుగుతుంది కనుక యాంత్రిక వ్యవస్థలోని సమస్యలన్నింటినీ పూర్తిగా అధిగమించే వీలు కలిగింది. ఇంచుమించు తక్షణం పద్ధతిలో ఎలెక్ట్రానిక్ సర్క్యూట్ను ‘ఆన్’ లేదా ‘ఆఫ్’ చేయవచ్చు. కనుక అవి లెక్కింపులోని బైనరీ వ్యవస్థకు చాలా చక్కగా అనుకూలించాయి. ఈ వ్యవస్థలో మామూలుగా 1 నుంచి 10 వరకు ఉండే అంకెలకు బదులు, 1 ఇంకా 0 అనే రెండు అంకెలను మాత్రమే వాడుకుంటారు. 0 లేక 1 అనే ఈ అంకెను ‘బిట్’ అంటారు. 8 ‘బిట్’లు కలిస్తే ఒక ‘బైట్’. అంకెలు, అక్షరాలను కూడా ఈ పద్ధతితో రాయవచ్చు.

ఉదాహరణకు 254 అన్న అంకెను 11111110 అని చూపిస్తారు. (వాటి స్థానాలను బట్టి ‘1’ విలువ 2′ లేదా 2 లేదా 2′ ఈ వరుసలో ఉంటుంది. ఈ 11111110 అంకెకు 0+2+4+8+16+32+64+128-254 అని అర్థం.) ‘1’ అంటే ఒక సర్క్యూట్ ఆన్ అయినట్లు ‘0’ అంటే ఆఫ్ చేసినట్లు అని అర్థం.
శూన్య నాళికలో మరింత మెరుగుదల చేసిన తరువాత 1946లో జె. ప్రెస్పర్ ఎక్కర్ట్, జాన్ డబ్ల్యూ మాష్, యూనివర్సిటీ ఆఫ్ ప్రెన్సిల్వేనియాలో వారి బృందంతో కలిసి పూర్తిస్థాయి ఎలెక్ట్రానిక్ కంప్యూటర్ ను 1946లో తయారుచేశారు. ఏనియాక్ (ఎలెక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్) అనే ఈ పెద్ద యంత్రం ఒక పెద్ద గది నిండా ఉండేది. అందులో 18,000 వాక్యూమ్ ట్యూబ్లు ఉండేవి. దాన్ని పని చేయించడం కష్టంగా ఉండేది. అయితే ఎలెక్ట్రో మెకానికల్ కాల్కులేటర్ కన్నా అది ఎంతో వేగంగా పనిచేసింది.
ఏనియాక్ రావడంతో ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు జాన్ ఫన్ నయిమన్ సిద్ధం చేసిన మౌలిక సూత్రాలమీద ఆధునిక COMPUTERS ఆధారపడి ఉన్నాయి. అందులో సబ్ రొటీన్స్, కండిషనల్ ట్రాన్స్ఫర్, సమాచార నిలువ, అవసరమయినప్పుడు వాడడం మొదలయినవన్నీ ఉన్నాయి.
COMPUTER లోని ఇన్పుట్ విభాగంలో కీబోర్డ్ సాయంతో సమాచారాన్ని కంప్యూటర్కు అందజేస్తారు. ఆయిల్ రిఫైనరీ వంటి చోట్ల కంట్రోల్ కంప్యూటర్లో సమాచారం ఒత్తిడి, ఉష్ణోగ్రత, ప్రవాహ వేగం మొదలయిన వివరాలకు సంబంధించిన సెన్సర్ నుంచి వస్తుంది. వచ్చిన సమాచారం కంప్యూటర్ గుర్తించడానికి వీలుండే సంకేతాలుగా మారుతుంది. లెక్కలు చేయడానికి అవసరమయ్యే శాశ్వత సమాచారం జ్ఞాపకశక్తి విభాగంలో ఉంటుంది. అక్కడే ఇన్పుట్ విభాగం నుంచి వచ్చిన సమాచారం కూడా ఉంటుంది.

ఇక అరిథ్మెటిక్-లాజిక్ విభాగంలో అసలైన గణిత లెక్కింపులు జరుగుతాయి. మొత్తం కార్యక్రమాన్ని నియంత్రణ విభాగం అదుపు చేస్తుంది. అన్ని విభాగాల మధ్య సమన్వయం కూడా చేస్తుంది. చివరకు అది అవుట్పుట్ విభాగాన్ని ప్రేరేపించి ఫలితాలు ప్రింట్ అవుట్లుగాను లేదా తెరమీద కనిపించే రకంగాను లేదా మరికొన్ని రకాలుగా పంపుతుంది.
కంట్రోల్ విభాగం నుంచి వచ్చే సంకేతాలు సొలెనాయిడు, సర్వోమోటార్ను పనిచేయిస్తాయి. వాటిద్వారా ద్రవ ప్రవాహం వేగాలు, ఉష్ణోగ్రత మొదలయినవి అదుపు చేయబడతాయి.ఏనియాక్గానీ తరువాత వచ్చిన వాల్వ్ తరహా COMPUTERS మరీ పెద్దవి. ఎక్కువ విద్యుత్తును వాడేవి. సువభంగా వేడెక్కేవి కూడా. అవి ప్రభుత్వ శాఖలు, పెద్ద వ్యాపార సంస్థల వంటి వారికి మాత్రమే ఉపయోగకరంగా ఉండేవి. కంప్యూటర్లో చెప్పుకోదగ్గ అతిపెద్ద మలుపు ట్రాన్సిస్టర్ ఆవిష్కరణ, అలాగే ఐసి, విఎల్ఎస్ఎస్ఐ వంటి మార్పుల తరువాత వచ్చింది.COMPUTER సైజు చాలా తగ్గింది. అవి వాడుకునే విద్యుత్తు కూడా వాల్తో పోలిస్తే మరీ తగ్గింది. ఇక చల్లబరిచే సమస్య లేదు. ఉత్పత్తి పద్ధతులలో మార్పు కారణంగా వాటి ధరలు కూడా తగ్గిపోయాయి.
ట్రాన్సిస్టర్ ఆవిష్కరణ తరువాత ఒక సిలికాన్ చిప్మీద ఏర్పాటుచేయగల ట్రాన్సిస్టర్ల గరిష్ట సంఖ్య కొన్ని సంవత్సరాల పాటు ఏటా రెండింతలు చొప్పున పెరిగింది. (ఈ పద్ధతికి ఇంటెల్ సంస్థ స్థాపకులలో ఒకరైన గార్డన్ మూర్ పేరున మూర్ నియమం అని పేరు పెట్టారు. ) ప్రస్తుతం వేగం ఆ పద్ధతిలోలేదు. అయినా కొనసాగుతూనే ఉన్నది. ఒక డెస్క్టాప్ కంప్యూటర్లోని ప్రామాణిక మదర్ బోర్డు మీద మిలియన్ సంఖ్యలో ట్రాన్సిస్టర్లు, వాటికి తగినట్టు రెసిస్టర్లు, కెపాసిటర్లు మొదలయినవి ఉంటాయి.
అవన్నీ చిన్న సిలికాన్ వేఫర్ మీద ఏర్పాటయి ఉంటాయి. ఇవాళ్ళటి చిన్న COMPUTERS కూడా ఒకప్పుడు అంటే 60 సంవత్సరాల క్రితం గది నిండా ఉండే ఎనియాక్ అనే పెద్ద కంప్యూటర్కు సమానంగా పనిచేయ గలుగుతాయి. ఆ పాత కంప్యూటర్ల ను పనిచేయించడానికి చాలామంది మనుషులు, పెద్ద ఎత్తున విద్యుత్తు అవసరం. చరిత్రలో ఈ సాంకేతికశాస్త్రం విషయంలో జరిగినంత వేగంగా ప్రగతి ఎప్పుడూ జరిగి ఉండలేదు.
అగ్రగాములు
COMPUTER రంగంలో ప్రగతి, గణితం, భౌతికశాస్త్రం, ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్ వంటి వివిధ రంగాలో శాస్త్రజ్ఞు, ఇంజనియర్ల కృషి కారణంగా వీయ్యింది. ఫన్ నయిమన్, అలెన్ ట్యూరింగ్, గ్రేస్ హాపర్ వంటి గణితశాస్త్రజ్ఞులు COMPUTERS కు ఆధారమయిన సిద్ధాంతాలు రూపొందించారు. రాబర్ట్ నాయ్స్, జాక్ కిల్బీ వంటివారు కంప్యూటర్లకు అవసరమయిన ఐసిలను అందజేశారు. నైమూర్ క్రే, మార్సియన్ హోఫ్ లాంటి COMPUTER డిజైనర్లు పరికరాలన్నింటినీ ఒకచోట చేర్చి ఎన్నో రకాల కంప్యూటర్లను నిర్మించారు. మరింత వేగంతో పనిచేసే కంప్యూటర్లు, మరిన్ని కావాలని అదే పనిగా డిమాండ్ రావడం ప్రేరణగా వెనుక నిలిచి ఈ రంగంలో చెప్పలేనంత అభివృద్ధిని కలిగించాయి
అనడంలో అనుమానం లేదు. ప్రభుత్వాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, వ్యక్తులు అందరూ కంప్యూటర్ వల్ల కలిగే సదుపాయాలను, లాభాలను రుచి చూచారు. ఆ రంగంలో క్రమంగా అభివృద్ధిని ఆశించారు. ఇప్పటి వరకు డిజైనర్లు, ఉత్పత్తిదారులు అందుకు అనువుగానే పని చేస్తున్నారు.https://photos.app.goo.gl/SBHrG5HCn4EMgYE2A
రకాలు
తొలిCOMPUTERS అన్నీ చాలా పెద్ద ‘మెయిన్ ఫ్రేమ్’ యంత్రాలే. వాటిని ప్రభుత్వాలు, పెద్ద వ్యాపార సంస్థలు మాత్రమే వాడగలిగాయి. ప్రస్తుతం కూడా ఈ రకం కంప్యూటర్లకు మార్కెట్ ఉంది. శాస్త్ర పరిశోధనలు, వాతావరణ సూచనలు మొదలయిన రంగాలలో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అవసరం ఉంది. వీటిలో అన్నిటికన్నా పెద్దవాటిని ‘సూపర్ కంప్యూటర్స్’ అంటారు.
ఉదాహరణకు యుఎస్ఏలోని క్రే సూపర్ కంప్యూటర్స్ వారు ఈ రకం కంప్యూటర్లను తయారు చేస్తున్నారు. యుఎస్ ప్రభుత్వపు అనుమతి లేనిదే వాటిని ఇతర దేశాలకు ఎగుమతిచేయకూడదన్నంత వరకు వాటి విలువ పెరిగింది. ఈ కంప్యూటర్లను మిలిటరీ ప్రయోజనాలకు కూడా వాడవచ్చు. ఈ కంప్యూటర్కు లక్షల కోట్ల డాలర్ల విలువ ఉంటుంది. ఇక మధ్యతరగతి కంప్యూటర్లు, చిన్న పర్సనల్ కంప్యూటర్ (పిసి)లు కూడా ఉన్నాయి.
COMPUTERS ప్రధానంగా రెండు రకాలు. ఒకటి డిజిటల్, రెండవది అనలాగ్. డిజిటల్ కంప్యూటర్లు ఇప్పటి వరకే వర్ణించినట్టు బైనరీ డిజిట్స్ అనే రెండంకెల పద్ధతిని వాడుకుంటాయి. అనలాగ్ కంప్యూటర్ లో నిరంతరంగా మారుతూ ఉండే సమాచారం వాడుకవుతుంది. ఈ రకం కంప్యూటర్లను ఒక క్రమంలో ఒత్తిడి, వేడిమి, రసాయన వివరాలు వంటి సమాచారం క్రమంగా అందే రసాయన పరిశ్రమలో వాడతారు. అయితే డిజిటల్ కంప్యూటర్ల వాడకం చాలా ఎక్కువగా ఉంది. అవి వేగంగా పనిచేస్తాయి. వాటిలో సమాచారాన్ని సులభంగా దాచి పంపించవచ్చు.
భాషలు
COMPUTER కు అందించే ఆదేశాలు కంప్యూటర్ ప్రోగ్రామ్ రూపంలో ఉంటాయి. కోబాల్, లిస్ప్, జావా, ఊప్ లాంటి ఎన్నో రకాల ‘కంప్యూటర్ భాషలు’ అభివృద్ధి చేయబడ్డాయి. కంప్యూటర్ ప్రోగ్రామర్స్ శిక్షణ పొందినవారు ఈ భాషలను వాడి కంప్యూటర్ చేయవలసిన పనులను దానికి తెలియజేస్తారు. కంప్యూటర్ ప్రోగ్రామ్స్ తయారు చేయడంలో ప్రస్తుతం భారతదేశం అగ్రగామి కేంద్రంగా ఉంది. బాగా చదువుకున్న ప్రోగ్రామర్లు, వారికిగల ఇంగ్లీష్ నైపుణ్యం, తక్కువ జీతాలలో వారు అందుబాటులో ఉండడం కలగలిసి మన దేశానికి ఈ రంగం ద్వారా ఎంతో లాభం చేకూరింది. బహుశా మన దేశంలో అన్నిటికన్నా వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ఇదే.
పర్సనల్ కంప్యూటర్లు
COMPUTERS లో తరువాతి పెద్దమార్పు పర్సనల్ కంప్యూటర్స్లో వచ్చింది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కారణంగా ఎలెక్ట్రానిక్ సర్క్యూట్స్ బాగా చిన్నవిగా మారాయి. కనుక మైక్రో కంప్యూటర్ గురించిన ఆలోచన సహజంగానే మొదలైంది. (ఒక మైక్రోప్రాసెసర్లో కూడా ఒక కంప్యూటర్లో ఉండవలసిన అన్ని క్షణాలు ఉంటాయి. ఇన్పుట్, అవుట్పుట్ పరికరాలు మాత్రం ఉండవు. అన్ని విధాల సంపూర్తిగా ఉన్న చిన్న కంప్యూటర్ను మైక్రో కంప్యూటర్ అంటారు.) అయితే ఇది అందుబాటులోకి రావడానికి కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. అందరూ కొనుగోలుదారులకు అది అందుబాటులో ఉండాలని ప్రయత్నం జరిగింది.
పర్సనల్ COMPUTERS మొట్టమొదట తయారు చేసిన వారిలో బహుశా యుఎస్ఏకు చెందిన ఎడ్వర్డ్ రాబర్ట్స్ గురించి చెప్పుకోవాలి. వికలాంగుడైన ఇతడు విద్యా సంస్థలలో, సూపర్ మార్కెట్ వంటి చోట్ల వికలాంగులకు పెద్ద స్థాయిలో సౌకర్యాలు కలుగజేయాలంటూ నిరంతరం ఉద్యమం సాగించాడు. అయితే అతని కృషికి అంగవైకల్యం అడ్డురాలేదు. చాలా సందర్భాలలో లాగే బహుశా అది అతనికి మరింత సాధించాలన్న పట్టుదలను కలిగించింది.
కొన్ని విషయాలలో విధి వల్ల తనకు వీలులేని సౌకర్యాలను సాధించాలని అతను కృషి చేశాడు. చిన్న కంప్యూటర్లను జత చేయడానికి అతనొక ప్రణాళికను ఊహించాడు. ఎవరికి వారే చేయడం అన్న పద్ధతిలో దాన్ని నవంబర్ 1971 పాపులర్ ఎలెక్ట్రానిక్స్ పత్రికలో ప్రచురించాడు. ఆసక్తిగల పాఠకులు కొన్ని విడిభాగాలను కొని రాబర్ట్ వర్ణించిన ప్రకారం ఒక మౌలిక యూనిట్గా జత చేయవచ్చు. పత్రిక అట్టమీద రాబర్ట్ తయారు చేసిన యూనిట్ బొమ్మ వేశారు.
అటువంటి యూనిట్ తయారీ కొరకు ఎన్నో ఆర్డర్లు రావడంతో బహుశా అతనే ఆశ్చర్యానికి గురయ్యాడు. మైక్రో ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ టెలిమెట్రీ సిస్టమ్ (ఎంఐటిఎస్) అనే అతని చిన్న సంస్థ ఇటువంటి యూనిట్లను తయారు చేయడంలో తలమునకలైంది. వాటికి ఎంఐటిఎస్ 816 అని పేరు పెట్టారు. కొద్దికాలంలోనే పోటీదారులు వెంటపడి అదే రకం కిట్లను తయారు చేయసాగారు. ఇక అతను ఆక్టేయిర్ 8800, అనే మొట్టమొదటి పర్సనల్ కంప్యూటర్ను తయారు చేశాడు. అతని యంత్రాలకుగాను (బేసిక్ లాంగ్వేజ్) సాఫ్ట్వేర్ రాసిన యువ విద్యార్థి తరువాతి కాలంలో ప్రపంచ ప్రసిద్ధుడయ్యాడు. అతనే బిల్ గేట్స్.
ఇక మరొక అగ్రగామి 1976లో యాపిల్ పర్సనల్ COMPUTERS (పిసి)ని ప్రవేశ పెట్టిన స్టీవ్ వోజ్నియాక్, అతను అందించిన కీబోర్డ్, మానిటర్ అనే రెండు విశేషాలు ప్రస్తుత కాలంలో ప్రామాణికంగా మారాయి. తరువాతి సంవత్సరంలో మరింత అభివృద్ధి చేసిన తరహా యాపిల్-? వచ్చింది. చిన్న తయారీదారులు దారి చూపిన తరువాత రంగంలోని పెద్ద కంపెనీలు చూస్తూ ఊరుకోవడం కుదరలేదు.
1981లో ప్రఖ్యాతి గాంచిన ఐబిఎమ్ రంగంలోకి దూకింది. పిసి 286 ఎటి తో వెల్లువ మొదయింది. ఒక దశాబ్దం కాలంలోనే లక్షలాది పిసిలు ఇళ్లలో, వ్యాపార సంస్థలో, స్కూళ్లు, కాలేజీలు మొదలయిన అన్నిచోట్లలో చేరుకున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో ధ్వని, దృశ్యం ఆధారంగా కూడా పనిచేసే (మల్టీమీడియా) కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో మెమొరీ, వేగం మొదలయినవి చాలా ఎక్కువగా వీలయ్యాయి. ఈ రంగంలో గుర్తించవలసిన మరొక అంశం ఎదురయ్యింది. తెలిసిన ఆర్థిక సిద్ధాంతాలు అన్నింటినీ కాదంటూ పిసిల ధరల ద్రవ్యోల్బణం కాలంలో కూడా తగ్గుతూనే ఉన్నాయి.https://pincodesguide.in/modern-electronics/
ఇంటర్నెట్
COMPUTERS విస్తృతంగా వాడుతున్న కారణంగా వచ్చిన గుర్తించదగిన మరొక ఫలితం ఇంటర్నెట్. ప్రపంచంలోని కంప్యూటర్లలో ఎంపిక చేసుకున్న వారికి ఇది పరస్పర సంబంధాలను కలుగజేస్తుంది. ఈ-మెయిల్ ద్వారా ఈ కంప్యూటర్ల మధ్యన నేరుగా సందేశాలు పంపడం వీలవుతుంది. సంబంధిత

వెబ్సైట్లను అనుసంధానం చేసి కావలసిన సమాచారాన్ని పొందవచ్చు. రైళ్లు లేదా విమానాల సమయాలు, విద్యా వ్యవస్థలు లేదా ఆస్పత్రుల వివరాలు లాంటివన్నీ ఉదాహరణకు తక్షణమే అందుబాటులో ఉంటాయి. ఇంటర్నెట్ ద్వారా కొనుగోలు కొరకు ఆర్డర్లు వేయవచ్చు. బిల్లులు చెల్లించవచ్చు.
గూగుల్ వంటి ‘సెర్చ్’ ఇంజన్ల ద్వారా అన్ని రకాల అంశాల గురించిన సమాచారాన్ని వెతికి కనుగొనవచ్చు. ఇవన్నీ ఎవరి ఇంట్లో వారే ఉండి చేసే వీలు ఉంటుంది. కంప్యూటర్ కారణంగా సమాచారం, విద్య అనే బంగారు గనులు లక్షలాది ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇక పెద్ద సంస్థల వారికి ప్రపంచంలోని తమవారితో ధ్వని, దృశ్య రూపాల ద్వారా చర్చలు జరిపి వ్యవహారం సాగించే వీలు అందుబాటులోకి వచ్చింది. దానితో ఎంతో సమయం, డబ్బు ఆదా అవుతున్నది.
కంప్యూటర్ ఉపయోగాలు
COMPUTERS వాడకం విస్తృతంగా పెరిగింది. అది తాకని రంగం లేనేలేదు. శాస్త్రజ్ఞులు వాటిని విరివిగా వాడుకుంటారు. ఒక ప్రోబ్ వెళ్లి అంగారక గ్రహపు చిత్రాలను పంపినప్పుడు భూమిమీద ఉండే కంప్యూటర్లు వాటిని డిజిటల్ సంకేతాలుగాను, తద్వారా కనిపించే బొమ్మలుగాను మారుస్తాయి. ఆ ఆ ప్రోబ్లను అంగారక గ్రహం మీదకు పంపించే రాకెట్కు కంప్యూటర్లో దారి చూపుతాయి. అట్లాంటిక్ సముద్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది. సైంటిస్ట్ తన పరిశోధనశాలలో కూచుని ‘రియల్టైమ్’ అంటే అదే క్షణాలలో ఫలితాలను విశ్లేషించి చూడగలుగుతాడు.
‘సిములేషన్’ అన్నది కంప్యూటర్ రంగంవల్ల ఏర్పడిన మరొక సదుపాయం. వాతావరణానికి ఒక పద్ధతిలో కార్బన్ డై ఆక్సైడ్ వచ్చి చేరుతుంటే ప్రపంచ వాతావరణం మీద, సముద్రంలో నీటిమట్టాల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఈ రకం సమాచారాన్ని కంప్యూటర్కు అందజేస్తే విస్తృతమయిన ప్రోగ్రామ్ల ద్వారా అది లెక్కలు కట్టి ఫలితాలను చూపిస్తుంది. రెండు దేశాల సైన్యాలు యుద్ధానికి పూనుకుంటే కలిగే ఫలితం (వార్ గేమ్స్) ఎలాగుంటుంది? కంప్యూటర్ జవాబు ఇవ్వగలదు. ఉదాహరణకు అందరికీ తెలిసిన గ్లోబల్ వార్మింగ్న కొన్ని సంవత్సరాల క్రితమే కంప్యూటర్ సిములేషన్ ద్వారా గుర్తించగలిగారు. ఒక ప్రాంతంలోని శీతోష్ణస్థితి, అడవుల వివరాలు మొదలయినవన్నీ ఉపగ్రహ చిత్రాల ద్వారా కంప్యూటర్ తెలుసు కోవడం వీలయ్యింది.
వ్యాపార సంస్థలు కంప్యూటర్ల మీద పెద్ద ఎత్తున ఆధారపడుతున్నాయి. బ్యాంకులు కంప్యూటలర్ తో తమ అకౌంట్లను నిర్వహిస్తున్నాయి. రైల్వే రిజర్వేషన్లు కంప్యూటర్లతో జరుగుతున్నాయి. చిన్న అంగళ్లు మొదలు, పెద్ద సూపర్ మార్కెట్ల వరకు అన్నింటిలోను బిల్లింగ్, రోజువారీ లెక్కలు, నిలువ వివరాలు మొదలయినవన్నీ సర్వవ్యాపి కంప్యూటర్ లోనే జరుగుతున్నవి.
COMPUTER లేనిదే ఈనాడు పరిశ్రమలు, వ్యాపారం, ప్రాసెస్ కంట్రోల్ లేదా లెక్కలు మొదలయినవి ఏవీ నడవడం లేదు. మానవులు పూనుకొని లెడ్జర్లు, జాబ్ కార్డ్ ద్వారా మామూలుగా చేసిన పనులన్నింటినీ ఇప్పుడు కంప్యూటర్లు వేగంగా, సులభంగా చేస్తున్నాయి. కనుక మనుషులకు మరింత సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టే వీలు కలిగింది.
టైప్ రైటర్తో కుస్తీ పట్టే పాతకాపు టైపిస్ట్లు, డ్రాయింగ్ బోర్డ్ మీద తంటాలు పడే డ్రాఫ్ట్మెన్లు కంప్యూటర్ కారణంగా మరుగున పడ్డారు. ప్రస్తుతం డెస్క్టాప్ కంప్యూటలర్లో టైప్చేసి, తప్పు సవరించుకుని, ఫార్మేట్ చేసి నేరుగా ప్రింటింగ్కు పంపవచ్చు.COMPUTERS మీద డ్రాయింగ్లు కూడా వేయవచ్చు. విమానాల ఆకారాలు మొదలు, ఇంజన్భాగాల వరకు (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, సిఎడి) కంప్యూటర్ సాయంతోనే చేయవచ్చు. మరిన్ని కంప్యూటర్ల ను డిజైన్ చేయడానికి కంప్యూటర్ను వాడవచ్చు. కంప్యూటర్ రంగంలో మరొక ఆసక్తికరమయిన అంశం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ జ్ఞానం). ఎంత చిక్కువయినా లెక్కలు చేసే కంప్యూటర్ తన అనుభవం ఆధారంగా నేర్చుకుని మనుషులాగ నిర్ణయాలు చేయగలుగుతుందా? ఇక్కడ పెద్ద సమస్య ఎదురవుతుంది.
మానవ మేథస్సు అసంపూర్తి సమాచారంతో కూడా పనిచేసే శక్తిగలది. మనిషికి చేతనయిన పనులో ఊహించడం ఒక భాగం. లెక్కల పరీక్ష రాస్తున్న ఒక విద్యార్థి ఉదాహరణకు ప్రశ్నాపత్రంలో ఒకటి, రెండు అచ్చుతప్పులున్నా సరియైన మాటలను ఊహించి ఆ సమస్యను అర్థం చేసుకోగలుగుతాడు. అదే కంప్యూటర్ అయితే ప్రశ్న ‘తప్పు’ అంటూ తిప్పికొడుతుంది. శాస్త్రజ్ఞుడు కొత్త విషయాలు కనుగొనడంలో ఈ ఊహ అన్నది బాగా పని చేస్తుంది.
ఇక COMPUTER గ్రాఫిక్స్ రంగం వల్ల వచ్చినది చాలా పెద్ద ప్రభావం. ఏనాడో అంతరించిన రాక్షసి బల్లులను కంప్యూటర్ సాయంతో తిరిగి తెరమీదకు తెస్తున్నారు. అవి ఇప్పటి నటులతోబాటే కలగలిసి కనిపిస్తున్నాయి. (జురాసిక్ పార్క్ చిత్రంలో వలె) ఇక ప్రేక్షకుల మీద ప్రభావం అద్భుతంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఏనాడో గతించిన మనుషులను తిరిగి చూపిస్తూ ప్రస్తుతకాలపు వారితో మాట్లాడిస్తున్నారు, కలిసి తిరిగినట్టు చూపిస్తున్నారు.
కొన్ని సినిమాలు, సీరియల్స్లో వలె మొత్తం చిత్రం కంప్యూటర్లో సృష్టించిన పాత్రలతోనే నడుస్తున్నది. త్రీడైమన్షనల్ ఎఫెక్ట్స్ సాయంతో చాలా వాస్తవంగా కనిపించే దృశ్యాలను సృష్టిస్తున్నారు. వీటి విచిత్రాలకు అంతంలేనట్టు కనిపిస్తున్నది. కానీ కంప్యూటర్ గ్రాఫిక్స్ తయారీలో చాలా సమాచారాన్ని ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. నిలువ చేయవలసి ఉంటుంది. కనుక కంప్యూటర్ లో ప్రగతి చాలా అవసరమయి పోయింది. ఈ రకంగా చూస్తే వినోదం అనే రంగం కూడా వాతావరణ పరిశీలన, అంతరిక్ష పరిశోధన మొదలయిన వాటితో చేరి రానురాను మరింత మెరుగయిన కంప్యూటర్ల అభివృద్ధికి కారణమవుతున్నది.
కంప్యూటర్ దుర్వినియోగం
శక్తివంతమయిన పరికరాలన్నింటిలాగే కంప్యూటర్ ను కూడా చెడు ఉపయోగాలకు వాడవచ్చు. అలా జరుగుతున్నది కూడా గడచిన సంవత్సరాలలో శబ్దకోశాలకు ఒక కొత్తమాట వచ్చి చేరింది. ‘కంప్యూటర్ నేరాలు’ అన్నది ఆ కొత్తమాట. ఇది ‘వైట్ కాలర్’ నేరాల కిందికి వస్తుంది. అంటే ఈ నేరాలలో అహింస ఉండదు, పైగా చాలా చాకచక్యంతో చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక పెద్ద సంస్థలో పనిచేసే ఒక COMPUTERS ప్రోగ్రామ్ అక్కడి డబ్బు లెక్కలో ఏదో ఒక చిన్న మెలికను ప్రవేశపెడతాడు.
దానితో అందరిదృష్టికి రాకుండా కొంతడబ్బు అతనికి అందుతూ ఉంటుంది. కనిపించకుండా జరిగే రకంగా ఏర్పాటు చేస్తే ఈ మోసం బయటపడడానికి చాలాకాలం పడుతుంది. నైపుణ్యంగల నేరస్తులు ఇతరుల కంప్యూటర్లలోకి దారిచేసుకుని వారి బ్యాంకు లెక్కలు, క్రెడిట్ కార్డులు, ఇతర ప్రధాన సమాచారాలు దొంగిలించి దుర్వినియోగం చేయగలుగుతారు. వీటివల్ల పోలీసులు, ఇతర పరిశోధన శాఖలలో కొత్త విభాగాల అవసరం వస్తున్నది. కంప్యూటర్ నేరాల పరిశోధన కోసం వారివద్దకంప్యూటర్ నిపుణులు పనిచేయడం అవసరం అవుతున్నది.
పైరకం నేరస్తులతోబాటు ‘హ్యాకర్స్’ అనే మరొకరకం నేరస్తులు కేవలం సరదా కొరకు ఇతరులను చికాకుపెడుతున్నారు. ప్రోగ్రామింగ్లో వారికిగల నైపుణ్యాన్ని ఆధారం చేసుకుని తయారు చేసిన కొత్త సాఫ్ట్వేర్లు ఇతరుల కంప్యూటర్ లోని ప్రోగ్రామ్లను, సమాచారాన్ని పాడుచేస్తున్నాయి. అది చాలదన్నట్టు ‘వైరస్ల’ను కూడా కొందరు తయారు చేస్తున్నారు. అవి కొన్ని ప్రోగ్రామ్లతో కలిసివచ్చి చాలా త్వరగా వ్యాపిస్తున్నాయి. నిజమయిన వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధులలాగే కంప్యూటర్ వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. యువతరంలోని కొంతమంది తెలివిగల హ్యాకర్లు పెద్ద పెద్ద సంస్థల వారి కంప్యూటర్ వ్యవస్థను కూడా కొంతకాలంపాటు చికాకు పెడుతున్నారు.
ఇక COMPUTERS ఉత్పత్తిదారులు, సాఫ్ట్వేర్ సంస్థలు కలిసి ఈ సమస్యకు సమాధానంగా ‘వైరస్నుండి రక్షణ’ విధానాలను సిద్ధంచేసి వాడవలసి వస్తున్నది.ఇవన్నీ కాక కొంతమంది అనవసరమయిన సమాచారంతో వెబ్సైట్లను తయారుచేసే వీలు ఏర్పడింది. ఈ రకం సైట్లతో యువకులను, ఆలోచనలేని వారిని తప్పుడు దారులు పట్టించే పరిస్థితి ఏర్పడింది. పుస్తకాలలో, టెలివిజన్ కార్యక్రమాల్లోనూ అభ్యంతరకరమయినవి ఉండనే ఉంటాయి. సమాజం వాటిని కొంతకాలం భరిస్తుంది. వీలయినంత వరకు అదుపు చేస్తుంది కూడా. స్వతంత్ర సమాజం పద్దతిలో మనం చెల్లించవలసిన మూల్యాలకు ఇవి ఉదాహరణలు.
భవిష్యత్తులో అభివృద్ధి
ట్రాన్సిస్టర్ను కనుగొన్న తరువాత ఒక చిప్ లోని చిన్న ప్రాంతంలో వాటిని వీలయినంత ఎక్కువగా పేర్చగలుగుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక విధానాలతో మరింత ఎక్కువ సంఖ్యలో ట్రాన్సిస్టర్లు చేర్చే వీలులేని భౌతిక పరిమితిని చేరుతున్నట్టు కనిపిస్తుంది. ఈ పరిస్థితిని నివారించాలంటే చిప్ లో సిలికాన్కు బదులు గాలియమ్ ఆర్సెనైడ్ను వాడవలసి ఉంటుంది. ఈ కొత్త చిప్స్ ఎక్కువ ఖరీదయినవి అయినా చాలా వేగంగా పనిచేస్తాయి. నానో టెక్నాలజీని వాడడం మరొక పద్ధతి. ఇందులో పదార్థాన్ని అణుస్థాయిలో మార్పులకు గురి చేయవచ్చు. ఈ రకంగా మరింత చిన్న చిప్లను సిద్ధం చేయవచ్చు.
ఇక దారిని పూర్తిగా మార్చి ఆప్టికల్ కంప్యూటింగ్ పద్ధతిని మరొక మార్గంగా చెప్పుకోవచ్చు. ఈ పద్దతిలో ఎలెక్ట్రాన్కు బదులు సర్క్యూట్లో ఆప్టికల్ ఫైబర్లో ఫోటాన్లు కదులుతుంటాయి. ఈ రకంగా పనితనం చాలా రెట్లు పెరుగుతుంది.
ముగింపు
COMPUTERS సాంకేతిక శాస్త్రం మానవాళికి అంతులేని శక్తి, వైవిధ్యంగల ఒక పరికరాన్ని అందజేసింది. అంతకుముందు వేలమంది మనుషులు కలిసి కష్టపడి చేసే పనులను కంప్యూటర్లు సులభంగా చేస్తున్నాయి. ఈ రకంగా మనుషులకు పనిలో విసుగు అన్న సమస్య తగ్గింది. వారికి సృజనాత్మక శక్తి పెంచుకునే వీలు కలిగింది. సరిగ్గా వాడుకుంటే ఈ పరిస్థితి కారణంగా మరెన్నో పరిశోధనలు, ఆవిష్కరణలు వీలవుతాయి. మానవాళికి మరెంతో
మంచి జరుగుతుంది.