Sarojini Naidu is Nightingale of India
SAROJINI NAIDU విద్వత్కుటుంబము భారత ఖండము అంతటికి బెంగాలు (వంగదేశము)
కడు ప్రసిద్ధమైనది, ఎందరో పుణ్యపురుషులు, మహానుభావులు ఆ రాష్ట్రముననే జన్మించి ఖండాంతరములందు కూడా వన్నె కెక్కి భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేసారు. చైతన్య స్వామి భగవన్నామము సర్వజనులకు ఉపదేశించెను.రామమోహనరాయలు రాజాసహగమన దురాచారము నంత మొండించెను.

ప్రఖ్యాత సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యా సాగర్, రామకృష్ణ పరమహంస వివేకానందుడు వంగ దేశ మున ఉద్భవించినవారే. “వందేమాతరం” జాతీయ గీతమును రచించిన బంకించంద్రుడు, విశ్వకవి రవీంద్రుడు, కధాచక్ర వర్తి శరశ్చంద్రుడు అక్కడ పుట్టినవారే, దేశబంధు చిత్త తంజన్దాస్. నేతాజీ సుభాస్ చంద్రుడు అక్కడ జననమొంది దేశనాయకులుగా విలసిల్లారు. జగదీష్ చంద్రబోస్, పి. సి. రే వంటి ప్రముఖ శాస్త్రజ్ఞులు జన్మించిన పవిత్ర భూమి బెంగాలు ప్రసిద్ధ చిత్రకారుడు నాట్యాచార్యుడు ఉదయశంకర్ పుట్టిన పోతుగడ్డ బెంగాల్.
ఆంగ్లేయులు భారతదేశమున ప్రభుత్వము తొలిసారిగా స్థాపించినది కూడా ఇక్కడనే. అట్టి బానిస దేశములో పుట్టి ఆంగ్లేయుని భాష నభ్యసించి, ఆ భాషలో ఆంగ్లేయుల కేతల వంపుచునట్లు కవిత్వముచెప్పి,ప్రాచ్యదేశాలకోకిలయని పొగ డ్త అంది భారత స్వాతంత్ర్యపోరాటములో మహిళలకు సముచిత స్థానము కలదని నిరూపించి, 50 సంవత్సరములు దేశ విముక్తికై కృషిసల్పిన నారీరత్నము సరోజిని కూడా బెంగాల్ రాష్ట్రముననే జన్మించినది.
వంగదేశీయులు ఆంగ్లే యుల పరిపాలనా ప్రభావంవల్ల ఆంగ్ల సాహిత్యములోని నవ లలు, నాటకములు భావప్రకటన చేయు కవితలు ఎన్నో సృష్టించగలిగిన ప్రతిభను సంపాదించారు. ఆ రాష్ట్రముననే స్త్రీలకు అశేష గౌరవము కలదనికూడా అక్కడనే తోరుదత్తు, SAROJINI NAIDU వంటి ఉత్తమ కవయిత్రులు ఆంగ్ల రచనల ద్వారా పాశ్చాత్యుల ప్రశంస అందుకొన్నారు.
SAROJINI NAIDU పూర్వీకులు విద్వత్తు కలిగిన వారు. తత్త్వ వేత్తలు కూడా. వారిది తూర్పు బెంగాలులో ప్రసిద్ధికెక్కిన పండిత వంశము, ఆమె తండ్రి అఘోరనాథ చటోపాధ్యా యుడు. గొప్ప విద్వాంసుడు. ఆయన 1887లో ఎడింబరో విశ్వ విద్యాలయం (స్కాట్లండులోనిది) డాక్టర్ ఆఫ్ సైన్స్ బిరుదుపొందిన మేధావి జర్మనీ దేశములో గొప్ప విదా కేంద్రమని పేరొందిన బార్ నగరములో పెద్ద పెద్ద డిగ్రీలు పొందినవారు, ఫ్రెంచి, జర్మను, గ్రీకు, హిబ్రూ, ఆంగ్లము, సంస్కృతము, ఉర్దూ భాషలలో అసమాన పాండితి సంపాదించెను.
SAROJINI NAIDU తల్లి నరదసుందరీదేవి. ఆమెకూడా ఆమె మాతృ భాషయగు వంగభాషలో అనేక గేయములు రచించి కయిత్రిగా పేరొందినది. అటువంటి దంపతుల గర్భమున జన్మించి నది కావుననే సహజ ప్రతిభతో విరాజిల్లి భారతీయ మహిళ లకు అత్యంత గౌరవము సంపాదించినది. శ్రీమతి సరోజిని 1879 ఫిబ్రవరి 13న హైదరాబాదు నగరమున జన్మించినది ఆ కుటుంబములో ఆమెయే తొలి సంతానము.

తండ్రి అఘోరనాధ ఛటోపాధ్యాయుడు విదేశములనుండి తిరిగి వచ్చిన పిదప ఆయన అశేష ప్రతిభను గుర్తించి నైజాము సంస్థానాధీశుడు ఆయనను హైదరాబాదుకు పిలిపించి తన సంస్థానములో విద్యాభివృద్ధి చేయవలసినదిగా కోరెను. ఛటో పాధ్యాయ నైజామకళాశాలను స్థాపించి అందు ఆచార్యునిగా నుండెను. ఆయన సర్వజనులతో పెద్ద, పిన్న, పండితపామర భేదము పాటింపక కలసియుండి మంచి పేరు సంపాదించెను. ఛటోపాధ్యాయుని ఇల్లొక అతిధిశాలగా మారినది. పండితులు, మతగురువులు వారి ఇంటికి వచ్చుచుండిరి.
SAROJINI NAIDU తల్లిదండ్రులకు మొదటి సంతానము. సోదరుడు వీరేంద్రనాధ్ 1905లో ఐ.పి.యస్. పరీక్ష చదువుటకు విదేశములకుపోయి అక్కడనే స్థిరనివాస మేర్ప రచుకొనెను. విదేశములందున్నను మాతృదేశమునకు స్వాతం త్ర్యము సంపాదించుటలో విశేషముగ కృషిచేసెను. సోవి యట్ లో పౌరసత్వము సంపాదించి 1914లో మాస్కోలోనే మరణించెను. SAROJINI NAIDU కనిష్టసోదరుడు హరీంద్రనాధ ఛటో పాధ్యాయ. ఈయన విశ్వవిఖ్యాతినందిన కవి, గొప్ప భావు కుడు, నాటకకర్త, గాయకుడు, నటుడు కూడ.
ఉత్తమమగు విద్వాంసుల వంశములో జననమందిన SAROJINI NAIDU ఆమెసోదరులు కూడ జగత్ప్రసిద్ధులు. సరోజిని, ఆమె సోదరులు కూడా తల్లిదండ్రుల వద్దనే విద్యాభ్యాసము చేసి అఖండ ప్రజ్ఞాశాలులైరి.
SAROJINI NAIDU కి అక్షరాభ్యాసం ఆంగ్లమందే జరిగెను. ఆంగ్ల మున సంభాషించుట సరిగ్గా నేర్వలేదని ఆమె తండ్రి ఒక రోజంతయు ఒక గదిలో బంధించియుంచెనట! ఆమె అటు వంటి శిక్షణను తన శివ యేట నుండి పొందినది. గనుకనే వంగ ఎట్లూరుకోగలదు? జబ్బులోనే ఒకసారి లేచి కూర్చుండి తాగి తము కలముపట్టి కవిత వ్రాయుట నారంభించినది.
1800 పంక్తులు లు గల పద్యమొకటి రూపొందినది. దానికామె “సతో వర పాణి” అని పేరు పెట్టినది. ఆ సుస్తిగానున్న సమయము తోనే ఒక నాటకముకూడ రచించినది. ఆమెలో ఆవిర్భవించిన కవితాశక్తికి ముగ్ధుడయి నైజాం నవాబు విదేశాలలో (విద్యాభ్యాసమునకై సంవత్సరమునకు రు 4500 లు ఉపకార వేతనంగా నిచ్చెదనని ప్రకటించెను. ఆమె 1885లో విదేశ విద్యాభ్యాసమునకు బయలుదేరెను.

SAROJINI NAIDU లండనులో గల కింగ్సు కళాశాల, కేంబ్రిడ్జిలోని గిర్జన్ కళాశాలలో ఆమె విద్య నభ్యసించినది. ఆ కాలమున గూడ ఆమె పద్యరచన సాగించుచుండెను. ఆ దేశములో ఎడ్మండ్ గోనే అను విమర్శకునితో ఆమెకు పరిచయము కలిగెను. ఆయనSAROJINI NAIDU నికి “మా ఆంగ్ల కవులవలె పక్షులు, జంతువులు వర్ణనలు మాన, భారతదేశమునగల ఫలములు పుష్పములు ప్రకృతి రమణీయతను వర్ణింపుము నీవు వృద్ధిలోనికి రాగలవు అని సలహా యిచ్చెను.
SAROJINI NAIDU కి ఆ విమర్శకుని సలహా తిరుమంత్రమైనది. ఆమె కవిత్వములో ఒక నూతన మార్గము చేపట్టుటకు ఆ సలహా కారణమయినది. ఆమె ఆరోగ్యం నానాటికి క్షీణించు చుండుటచే విద్యాభ్యాసమును చాలించి స్విట్జర్లండు దేశమునకు పోయి ఆరోగ్యం కాపాడుకొనదలచెను అక్కడ ఆమె ఆరోగ్యం కొంత కుదుటపడినది. అప్పటి రమణీయ ప్రకృతి దృశ్యములు ఆమెను ప్రభావితురాలిగా నొనర్చినవి. ఆమె కవిత్వమునకు ముంచి దోహదము కలిగినది. అక్కడనుండి బయలుదేరి “ఇటలీ”లో కొన్నాళ్ళు గడిపి ఆమె 1888 లో భారతదేశమునకు తిరిగివచ్చినది.
విద్వత్కుటుంబమున జన్మించుటతోపాటు ఆమెలోని సహజశక్తులు చిన్నతనముననే ప్రమ్పుటముగ ఆమె భవిష్య త్తులో గొప్పది కాగలదను సూచనలను స్ఫురింప జేసినవి.ఉత్తమ గృహిణి సరోజినికుటుంబ జీవితం గురించి చాలామంది ఎరుగరు. ఆమె 16వ యేటనే హైదరాబాదులో సుప్రసిద్ధ వైద్యుడు మేజర్ జనరల్ ముత్యాల గోవిందరాజులు నాయుడుగారిని వివాహం చేసుకున్నది వారిది ప్రేమ వివాహం.. విద్యాభ్యాసా నికి విదేశాలకు వెళ్ళేముందు నాయుడుగారిని వివాహమాడా లని నిశ్చయించుకొన్నది. విద్యనభ్యసించి స్వదేశానికి తిరిగి హిత్యం వహించారు.
వచ్చిన పిమ్మట తన నిశ్చయం ఆమె మార్చుకోగలరు. ఆమె తండ్రి చటోపాధ్యాయ ఆనాడు సంఘ సంస్కర్తగా పేరొం దిన కందుకూరి వీరేశలింగం పంతులు గారికి ఒకలేఖ వ్రాసెను. సరోజిని వివాహం 1888లో మద్రాసులోని బ్రహ్మసమాజ మందిరంలో జరిగింది వీరేశలింగంగారే ఈ వివాహానికి పౌరో SAROJINI NAIDU పుట్టినది హైదరాబాదులో ఆంధ్రుని వివాహమాడింది. సుమారు ర0 సంవత్సరాల క్రితం జరిగిన ఈ వర్ణాంతర వివాహం ఆ రోజులలో ఆశ్చర్యకర అతి సాహసమైన చర్యకూడా. సరోజిని మిక్కిలి స్వేచ్ఛా భావములు సంస్కరణ శీలము కలదనుటకు ఈ అంశమే ప్రబల నిదర్శనము.

కవిత్వంలో ఎంత స్వేచ్ఛ అవలంభించినదో ఆచరణములోకూడ పూర్తి స్వాతంత్ర్య మును ప్రదర్శించినది. మయిన సంగతి లో శ్రీ నాయుడుగారు వృద్ధులయి SAROJINI NAIDU మరణము పిమ్మట మరణించెను. దయాదాక్షిణ్యములు గల వైద్యుడు SAROJINI NAIDU ఆయనను వివాహమాడుటను సమర్థించిన వారేగాని దుయ్యబట్టిన వారులేరు ఆయన ఎప్పుడూ ఇల్లుకదలి వెళ్ళ లేదు SAROJINI NAIDU మాత్రము ఇల్లు-వాకిలి పిల్లలు గొడవపట్టేది కాదు. ఆమె ఎల్లప్పుడు దేశములోను, విదేశములలో తన కవిత్వం గానం చేసుకుంటూ పర్యటించేది. అయినా వారిది అనుకూల దాంపత్యము, ఆదర్శ ప్రాయమయినది కూడ.
SAROJINI NAIDU దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్దకొడుకు డా॥ జయసూర్య హోమియో వైద్యములో మంచి పేరు గడించారు. జర్మను స్త్రీని వివాహ చూడాడు. కొంతకాలానికి ఆమె మరణించగా ఆ స్మృతులు తోనే ఆయన కాలం గడిపాడు. శాసన సభ్యుడుగాను పార్ల మెంటు సభ్యుడుగా కూడ ఆయన రాజకీయాలలో ఉద్దండుడని పించుకున్నాడు రమ్యూనిస్టులతో కలసి పనిచేసి చిట్టచివరకు వారినుండి వేరైనాడు. తల్లి పెద్దకుమార్తె పద్మజ మంచి అందగత్తె ఇంటిలో చదువు నేర్చుకున్నది.
గృహసంబంధమైన పనులు చేస్తూ అతిదులతో రాజకీయాలు చర్చించగల మేధా సంపన్ను రాలు. చాలాసార్లు యూరప్ ఖండమంతా పర్యటించివచ్చింది. చివరకు బెంగాల్ గవర్నర్ కూడా నియమింపబడింది. రెండవ కుమారుడు రణధీర. హైదరాబాదు, మద్రాసు లలో విద్య నభ్యసించాడు. గాంధీమహాత్ముని స్వరాజ్య శంఖా రావం విని 1921 లో చదువును కట్టిపెట్టి 1921 వరకు తల్లితో భారతదేశమంతా పర్యటించాడు.
నైజాం సంస్థా నంలో ఉద్యోగిగా చేరాడు, తల్లివలె ఉర్దూ ఆంగ్ల భాషలలో కవిత్వం చెప్పాడు కూడా.10లో మరణించి తల్లికి ఎనలేని దుఃఖం గలిగించాడు.రెండవ కుమార్తె లీలారాణి. ఆక్స్‌ఫర్డు విశ్వ విద్యా లయంలో విద్యాభ్యాసం చేసింది. ఎప్పుడూ గ్రంథపఠనమే ఆమె పని ఒక కళాశాలలో ప్రొఫెసర్గాతం విదేశాంగశాఖలో ఉద్యోగిని, పనిచేసింది. SAROJINI NAIDU కి మూడు పెంపుడు జంతువులుకూడా వుండేవి. ప్రిన్సినికోలాయ్, నికోబార్, ప్రిన్స్‌ను నూమారాయ్ లేడీ లింకా లూపిన్.
నికోబార్ వారి భవనాన్ని రక్షించే శునకం దొంగలు దొరలను ఇట్టే పసికట్టేది. పోలీసులు ఇంటికి – వస్తుంటే తాను ముందేపోయి యజమానికి తెలిపేది. పెద్ద మనుషులువస్తే వారికి మర్యాదచేసి లోపలకు తీసుకువెళ్ళేది. వికోబార్ అంటే డాక్టరు నాయుడుగారికి ప్రాణం. సరోజినికి లేడిలింకా లూపిన్ అంటే అమితమైన ప్రేమ. సరోజినిగవర్నరు అయినా ఆ శునకం ఆమె వెంటనే వుందేది.
దాని నామకరణంలో కూడా ఆమె తన కవిత్వ ధోరణి లోనే గమనం కుదిర్చింది. (లేడిలింకా లూపిన్) మూడవ జంతువు మార్జాలము నూమాతాయ్. దానివద్ద రాచరికపు ఠీవీ వుండేది. సరోజిని దానిని చంటిపిల్ల ను ఎత్తుకొన్నట్లు ఎత్తు కొని ముద్దులాడేది. ఈ మార్గాలం గురించి ఒక వింత కథ కూడా జరిగినది. శ్రీమతి SAROJINI NAIDU గాంధీజీతో పాటు ఆగాఖాన్ భవనములో చెరసాలలో వుండగా ఈ పిల్లిమీద వుండే ప్రేమాతిశయం చేత నూమాతాయ్ రాకుమారి క్షేమం తెలుపగోరుతూ ఇంటికి ఉత్తరం వ్రాసింది.

జైలు అధికారులు ఆ ఉత్తరం పరిశీలించి ఈ నూమాతాయ్ ఎవరయి వుంటారని తలలు పగలకొట్టుకున్నారు. సి ఐ.డి. శాఖకు అప్పగించారు. వారు మరింత వింతగా ఆలోచించి “తాయి” అని వున్నది గనుక ఈ వ్యక్తి థాయిలాండ్‌కు చెంది వుండాలని నిర్ణ యించారు. తన పరిశోధన తీవ్రంగా సాగించి చిట్టచివరకు అది సరోజిని యింటిలోని పిల్లిపిల్ల పేరని తెల్సుకున్నారు. జైలులో వుండగా ఆమె వ్రాసిన ఉత్తరం యింత నవ్వును సృష్టించింది.
విదేశాలలో నిరంతరం పర్యటనలు చేస్తున్నా ది ఆమె ఇంటి పట్టున ఉన్నప్పుడు SAROJINI NAIDU ఉత్తమ ఇల్లాలుగా నడుచు కొనేది. దేశదేశాలనుంచివచ్చే, అతిధులకు సత్కారములు చేసి వారి కిష్టమగు వంటకములు వండి స్వయముగా వడ్డించునది. ఆమె కవిత్వ…కాని ఆమెలో గల మాతృ హృదయం తెలిపే సంఘటనలు చాలా మందికి తెలియవు. పిల్లలంటే అమిత శ్రద్ధ. వంటలో నేర్పు గడించింది. తన పిల్లలు తిండితినక మారాముచేసిన సమ యాలలో వారికిష్టమైన ఫలహారాలు చేసి వారి చికాకును కని పెట్టి వారిని లాలించి, వారిని తేలికగానవ్వించి వారికి కడుపు నిండుగ ఆహారము పెట్టేమాతృహృదయమా మెది.https://photos.app.goo.gl/i5xBTmRCaTQARxkt5
వడం పాశ్చాత్య పద్ధతిలో ముందుగా ప్రేమించి తరువాత పెండ్లాడినప్పటికిని పరిణయమాడిసపతిని దైవంగా మన్నించి భారత పతివ్రతల మార్గము ననుసరించింది.తన కన్నబిడ్డలను యెంత ప్రేమతో చూచెడిదో అటు వంటి ప్రేమతోనే ఆమె విశ్వములోని ప్రజలందరిని తన కన్న బిడ్డలవలె చూచుకొనునట్టి హృదయం ఆమెలోని ప్రత్యేకత. సాహితీ రంగములో క్రొత్త క్రొత్త భావములను ప్రకటించి విశ్వఖ్యాతి గడించినదో ఉత్తమ గృహిణిగా, ఆదర్శమాతగా ధర్మపత్నిగా అంతటి మన్ననలనందుకొన్నది.
తాను గవర్నరుగా నున్నప్పుడుకూడ దర్బారు తీర్చిన వేళలోకూడ వంటవానికి సలహాలిచ్చుటయేగాక ఆ రోజు వండు కూరలను పరిశీలించునంతటి నిశితమయిన శ్రద్ధగల గృహిణి.
కవిత్వము- వక్తృత్వము
మనదేశములో ఆంగ్ల భాషలో కవిత్వము చెప్పి పార్చా త్యుల మెప్పుపొందిన నారీమణులిద్దరే ఇద్దరు. తోరూధత్తు, సరోజినీ వారిరువురు బెంగాల్ దేశమునకు దేశమునకు చెందినవారే యగుట విశేషము. SAROJINI NAIDU భారతదేశ గ్రామీణ దృశ్యము లను, ప్రకృతి రమణీయతలను సౌందర్య ముట్టిపడునట్లుగా సహజమగు పద బంధములతో కర్ణపేయమగు భాషలో రచిం చుటయందు మిక్కిలి ప్రవీణురాలు. ప్రకృతి పరిశీలించిన వేళలలో SAROJINI NAIDU లో ఉత్తేజము కలిగి కవిత్వమును చెప్పినదే ఉ యశస్సు కోరిగాని ధనాపేక్షచేగాని కవిత చెప్పియుండ లేదు.
భాష ఆంగ్లమయినా భావన కేవలము భారతీయమైనది. అలంకారములు, ఉపమానములు పూర్తిగా భారత కవుల సంప్రదాయమునకు భిన్నమయినవి కావు. భారతదేశ ఔన్న త్యమును పాశ్చాత్యులకు వారి భాషలో వర్ణించి మన భారత జాతీయత, సంస్కృతులపట్ల వారికి సదవగాహన కలుగచేయు టలో ఆమె కృతకృత్యురాలయినది. సంఘసేవ, రాజకీయములు కంటె ఆమెకు శాశ్వత కీర్తిని సంపాదించినది. ఆమె కవితా శక్తియే ,SAROJINI NAIDU రాజకీయములలో ప్రవేశించుట వలన కళాఖి రుచి కుంటుపడినదని కొందరు విమర్శకులందురేగాని కర్కశ రాజకీయములలో గూడా ఆమె కళాదృష్టిని నొప్పించి వాని కొక నూతన శోభను చేకూర్చగలిగినవి.
ముందు ఆంగ్లభాషలో వెలువడిన ఆమెరచనలు పిమ్మట ఫ్రెంచి, జర్మను భాషలలోనికిగూడా అనువదింపబడి ఆంగ్లము నెరుగని వారికి కూడా ఆమె కవిత్వములోని మాధుర్యము గ్రహించుట కవకాశము కల్గించునది.
SAROJINI NAIDU రచనలు నాల్గు సంపుటములుగా ప్రచురింపబడి నవి. మొదటి సంపుటము “The Golden Thres hold” 1899 నుండి 1905 వరకామె చేసిన రచనలీ సంపుటమున నున్నవి 1905లో ప్రచురింపబడి ప్రపంచమంతట ఈ గ్రంథము ప్రచారములోనికి వచ్చెను. ప్రఖ్యాత విమర్శకుడు ఆర్ధర్ నైమన్స్ ఈ సంపుటమునకు పరిచయము వ్రాసెను.
రెండవ సంపుటము The poems Life and Death” మూడవ సంపుటము “The bird of time” ఈ సంపుటములో SAROJINI NAIDU కవిత పరిణతి నందినది.1903లో ఆమె “రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్” అను సంస్థలో సభ్యురాలుగా అంగీకరింపబడుటతో SAROJINI NAIDU కి ఆంగ్లకవులతో పరిచయమెక్కువయినది. SAROJINI NAIDU కవిత్వా నికి ఎక్కువ ప్రచారంకూడా లభించినది.
మొదటి సంపుటము చదివిన సైడ్ అను పాశ్చాత్యుడు స్త్రీలు కమ్మగా కవిత్వం చెప్పగలరనుటకు గ్రంథమే నిదర్శన మని వ్రాశాడు. ఆల్ఫ్రెడ్ పియర్స్ ఆధునిక ప్రపంచ జీవిత మును ప్రతిబింబింపజేసిన కవయిత్రులలో SAROJINI NAIDU అగ్రగామి యని జపాన్ ప్రైమ్ అను పత్రికలో వ్రాసెను. మ్
SAROJINI NAIDU తన కవిత్వములో ప్రేమతో ఆధ్యాత్మికతను గూడా మేళవించగల సమర్థురాలు. ఆమె కవిత మూలంగా వైషమ్యాలు తొలగిపోయాయి. సర్వజన సామరస్యము సాధింపబడినది.
SAROJINI NAIDUని ప్రాచ్యదేశపు కోకిలయని పాశ్చాత్య కవులు విమర్శకు లామెను ఎంతో కొనియాడిరి. “పల్లకి బోయీలు”అనుగీతము విశ్వప్రశస్తి పొందినది. ఆ గీతములోని సంగీతములోని సంగీ తము, లయ మృదుత్వము అందరి మానసముల నాకర్షించినవి. కొత్తగా పెండ్లి అయిన వధువును బోయీలు మేనాలో అత్త వారింటికి కొనిపోవు దృశ్యము అతి మనోహరముగ బోయీల నడకవంటి మందగమనముతో సహజముగా ఆమె వర్ణించినది.
బోయీల నడక సాగినకొలది పదముల పొందికగూడ, సంగీతము దానికి అనుగుణముగ నడిచినవి. గ్రామీణ దృశ్య ములను కనులకుగట్టినట్లు వర్ణించుటలో ఆమె చాతుర్యము కొనియాడదగినది. ప్రేమ గీతములనేకాక విషాదగీతములను గూడ అతి హృదయంగమముగ ఆమె రచింపగల నేర్పరి.లయ “ఒంటరి బాలుడు” అన్న గేయంలో ఆ బాలుడు నక్ష త్రాన్ని, పిల్ల తెమ్మరనూ అడుగుతున్నట్లు ఈ విధంగా రచించింది.https://pincodesguide.in/durgabai-deshmukh-is-the-great-freedom-fighter/
“ఓ నక్షత్రమా! గాఢాంధకారంలో నేను భయంతో వణికిపోతున్నాను. ఏడుపు వస్తోంది. కన్నతల్లిలా నన్ను నీవు దగ్గిరతీసి ముద్దుపెట్టుకో! ఓ పిల్లగాలి నీవేనాకు తోడు నాకు ఆకాశకధను చెప్పవూ! భగవంతుడు దయతో చూస్తాడంటారు నాకి భయం పోగొట్టి ఎవరయినా దయచూపితే బాగుండును.” ఈ వర్ణన ఎంతటి పాషాణ హృదయులకలునా జాలిపుట్టిఁపక మానదు. విషయాని కనుగుణంగా ఆమె కవితలో చందస్సు లను ఆమె ధారాళంగావాడి నూతనత్వం శోభిల్ల జేసింది.
కవులు గతించినా వారి కావ్యాలు మానవజాతి ఉన్నంత కాలము ఉంటాయి. అట్లే SAROJINI NAIDU గతించినా SAROJINI NAIDU మధుర కవితా స్రవంతి జీవనదివలె ప్రవహిస్తూనే ఉంటుంది. కాల విహంగం శాశ్వతముగా ప్రపంచ సాహిత్యంలో నిలిచిపోతుంది.
SAROJINI NAIDU కవిత్వము వలెనే వక్తృత్వముకూడా ఒక కళ. కవికి వక్తకు కూడా. ఆవేశముతో కూడిన హృదయం చాలా ముఖ్యం. భావ ప్రకటనకు సాధనాలు అనేకం అయినా వక్తృత్వము వాటన్నిటిలోకి మేలైనది. వక్త తన నైపుణ్యంతో ఉపన్యసిస్తుంటే ప్రజలు ఆవేశపూరితులౌతారు. వక్తభావాలు శ్రోతల హృదయాలలో శాశ్వతముద్ర వేయగలుగుతాయి.
వక్తలు ప్రజాబాహుళ్యంలో తమ శ్రసంగాల ద్వారా అనేక విజయాలు సాధించగలిగారు. భారతీయులలో గూడ అనేకులు వక్తలుగా ప్రసిద్ధిపొందారు. తొలిసారిగా ప్రపంచానికి, కవ యిత్రిగా SAROJINI NAIDU పరిచయమైన ఆమె వక్తృత్వము అంత కంటే మిన్నగా ఆమెకు పేరు గడించినదని చెప్పాలి. ఆమె సోదరుడు హరీంద్రనాద్ చటోపాధ్యాయ తన సోదరికి “భారత కోకిల” అను బిరుదు SAROJINI NAIDU వక్తృత్వ శక్తివలననే లభించిన దన్నాడు.
సభలో SAROJINI NAIDU కంఠమెత్తి మాటలాడిన మృదుమధురస్వరము కోకిల గానమే SAROJINI NAIDU ప్రపంచదేశము లన్నియు పర్యటించినది. వేలాది సభలలో ప్రసంగించినది. ఎంత జటిలసమస్య కానిండు, శ్రోతలకు అరటిపండు వలిచి పెట్టినట్లు సర్వజనులకు సుబోధకమగు భాషలో హాస్యమును మేళవించిచెప్పు నేర్పు ఆమెకు కలదు. ప్రపంచంలోని వక్త లలో ఆమెను ప్రముఖురాలుగా పేర్కొనవలెను.
SAROJINI NAIDU ఉన న్యాసములు మన దేశమునకు పేరు తెచ్చుటకేగాక మన స్వరాజ్యోద్యమమునకు మిక్కిలి తోడ్పడినవి దేశభక్తి గీత ములు తనకోకిల కంఠమెత్తి గానముచేసి ప్రజలలో దేశభక్తిని పురికొల్పినది SAROJINI NAIDU వుపన్యాసములు ఆంగ్లము, ఉర్దూ హిందూ, వంగభాషలలో సాగినవి. తన ఉపన్యాసములచే ఆమె దేశ ప్రజలలో దేశభక్తిని ప్రేరేపించి వారిలో దేశమునకు ఎట్టి త్యాగమయినను చేయవలెనను దృఢ సంకల్పమును కల్పించినవి.
తన కవిత్వమును వక్తృత్వమును దేశసేనకు సాధనము లుగా వినియోగించుకొని SAROJINI NAIDU ఒక 50 సంవత్సరముల కాలము దేశము నలుమూలల పర్యటించి దేశప్రజలలో నూత నో త్తేజమును త్యాగనిరతిని వృద్ధిచేసినది.
SAROJINI NAIDU 1920లో లండనులోని ఆల్బర్టు హాలులో పంజాబులోని దురంతముల గురించి వర్ణించుచు ప్రసంగించింది ఆ ఉపన్యాసమొక వీరగీతమై ఆంగ్లేయుల హృదయములను కంపింపజేసినవి. 1921లో సరోజిని కాంగ్రెసు అధ్యక్షపీఠము నుండి పలికిన మాటలు కవిత్వమువలె సాగినవి. దానిని స్వాతంత్య్ర గీతిక అనవచ్చు.
1938లో అమెరికాలో సరోజిని ఉపన్యాసము అక్కడివారికొక కనువిప్పయి సందేశ మొసగి నది. 1947లో SAROJINI NAIDU ఆసియా దేశాల మహాసభలలో ఉపన్యసించిన దొక ప్రబోధము 1948లో గాంధీమహాత్ముని మరణసమయమున SAROJINI NAIDU ప్రసంగము ఆమె హృదయాంత రాళమునుండి పొంగిపొరలి వచ్చిన ఒక విషాదగీతం సరోజినీ దేశ విదేశ పర్యటనలో ఎక్కడనో ఒకచోట ప్రసంగించుడనిఆహ్వానములే. ఈ ఉపన్యాసము వినుటకు ఎంతదూర మయినను లెక్కచేయక శ్రోతలు వచ్చుచుండిరి.
ఉపన్యాస ఆరంభములో అతితక్కువ స్థాయిలో వాడు పదజాలముతో ఆరంభించికొం సరికి ఉపమానములు అలంకారములతో విలసిల్లి ముగింపు చేయు వేళకు ప్రవాహమై నిరాటంకముగ సాగిపోవుచుండెడిది. భావాల ఔన్నత్యంతో పాటు ఆమె శరీరముకూడా పైకి లేచు చుండెడిది చివర కు ఆమె తన బొటనవ్రేళ్ళపై నిలచేదని ఆశ్చర్యపడ నక్కర లేదు. ఇట్టి ఉపన్యాసములను ఆమె 20 సంవత్సరాలు నిరంతరంగా దేశ స్వాతంత్య్ర సముపార్జనకు వినియోగించినది.
సాటిలేని వక్తగా ఆమె శ్రోతల హృదయాలను ఆకట్టు కొనేది. తన కవిత్వమును వక్తృత్వమును ఆమె దేశ దాస్య విమోచనకు వినియోగించి కొన్నది.ఆమె జన్మమును సార్ధకము చేసి స్వరాజ్య సమరంలో
SAROJINI NAIDU కవియిత్రిగానేగాక దేశభక్తురాలిగా దేశ నాయకురాలిగా మహోన్నతస్థానాన్ని ఆక్రమించింది పరాయి పాలనతో భారతఖండమనుభవించే అవమానం ఆమె హృదయానికి తీవ్రమయిన బాధను కలిగించింది. అందుచేత ఆమె రాజకీయాలకు అంకితమై స్వరాజ్యసంపాదనకు అహరహము కృషిచేయాలని సంకల్పించుకొన్నది.
ఆమెకు గల ప్రతిభ సర్వతోముఖం సామర్థ్యం సాటిలేనిది. ప్రజాకర్షణ ఆమెలో గల విశిష్టగుణం ఎంతటి క్లిష్టమయిన సమస్యనయినా అతి స్వల్పకాలములో గ్రహించి శీఘ్రముగా ఆ సమస్యను పరి ఆ ష్కారం కూడా అన్వేషించగల ధీశాలి సరోజిని. ఆమె నేర్పు ఓర్పుకూడ వర్ణింప శక్యముకానివి. అందరి సమస్యలు సాను భూతితో వినుచుండెడిది అందువలననే అన్ని దేశములవారికి అన్ని జాతులవారికి సరోజినిపట్ల అధిక గౌరవం. స్త్రీలకు ఈమె అనిన అత్యంత గౌరవం.
ని తన స్వంతసోదరికంటే ఎక్కువగా ప్రేమించేవారు. ఎవరేమి చెప్పినా ఓపికతో విని ఆడరంగా వారికి తగు సలహాలనివ్వగల సహనశీలము సరోజిని గుణగణాలలో కడు ముఖ్యమయినది. తనతో పరిచయుడైన వారందరిని వారి కుటుంబసభ్యుల పేరు వారిగ పలకరించు సంతటి జ్ఞాపకశక్తి సరోజినికి కలదు. చిన్నప్పటినుంచి భోగ జీవితమునకు అలవాటు పడినప్పటికీ జై లు జీవితములో ఏ జై సౌకర్యము లోటయినా విసుగు చెందక సర్దుకొని పోయేది పద్యాలు ప్రత్యేకంగా వ్రాయడం మానివేసినా ఆమె మాట లలో ప్రసంగాలలో కవిత్వము ఉట్టిపడుతూ వుండేది. స్వరాజ్య పోరాటంలతో అందుకై ఆమె పలికిన త్యాగాలలో కూడా కవితా హృదయం అంతర్లీనమై వుండేది. సరోజినిలో నిశితమగు హాస్యం ఎప్పుడూ తొణికిసలాడుతుండేది.
సరోజిని 5 సంవత్సరముల వయసుననే కాంగ్రెసు సంస్థలో మహోపన్యాసములు చేసి రాజకీయ నాయకుల దృష్టి నాకర్షించినది. ఆ సంస్థలో అప్పటినుండి తన జీవితాంతం వరకు ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, అభిప్రాయ భేదాలు వచ్చినా మాతృసంస్థను వదలి ఎప్పుడూ వెడలపోలేదు. కాం గ్రెసు మహాసంస్థలో త్యాగులు, మేధావులు, సాహసికులు, విప్లవకారులు రాజకీయ ప్రముఖులు అనేకులుండెడివారు.
తమ అభిప్రాయం నెగ్గలేదను నెపముతో అనేకులు సంస్థను విడ నాడిన వారున్నారు. ఇతర పార్టీలను స్థాపించారు కూడా కాని జవహర్లాల్ వలెనే సరోజిని కూడా ఆ మహా సంస్థ పట్ల గౌర వాదరములతో అది ఎప్పటికిని తప్పుచేయదన్న దృఢ విశ్వా సంతో ఆ సంస్థకే అంకితమయినది. ఎప్పుడయినా చీలికలు వచ్చే సూచనవస్తే ఐకమత్య రక్షణకి తన సర్వశ క్తిని ధార పోసిందికూడా.
కాంగ్రెసు మహాసభలో భారతమాతకు నందనమనే గేయాన్ని ఆలపించి వివిధ మతాలవారు దేశా రాధనచేసి తమ దేశభక్తిని చాటాలని బోధించింది. ఆ గేయం అందరి ప్రశంసలకు ప్రాతమయినది. ఆ మరుసటి సంవత్సరం కాంగ్రెసు చేసిన స్వరాజ్య తీర్మానానికి కట్టుబడి అఖండ మయిన ఉపన్యాసాలు చేసి ప్రజలను ఉద్భోదించింది.
1927లో కాకినాడ కాంగ్రెసులో ఈమెను కాంగ్రెసు సంస్థ తరుపున కెన్యాకు ప్రతినిధిగా పంపుటకు తీర్మానించారు 1924లో బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో సరోజిని విదేశాలలోని భారతీయులకు చేసిన చేసిన సేవలకు ప్రశంసలను పొందింది. 1925లో జరిగిన కాన్పూరు కాంగ్రెసు సభలకు అధ్యక్షురాలిగా ఎన్నిక చేయబడింది. అంతటి ముందుగాని, అటుపిమ్మటగాని ఆ గౌరవమును పొందిన మహిళలు లేరు.
ఆ రోజులలో భారతజాతీయ కాంగ్రెస్ అనగా భార తీయులకుఅనధికార శాసనా సంస్థ ఆ కాలములో బ్రిటీషు ప్రధాని, ఆమెరికా అధ్యక్షులు కెట్టి గౌరవమో జాతీయ కాంగ్రెసు అధ్యక్షునకంత గౌరవము పర ప్రభుత్వమున పీడింపబడు భారత ప్రజలకదియే ఉన్నత పదవికూడా అంతకుముందు సభలలో అధ్యక్షులందరి ఉపన్యాసములకంటే సరోజిని చేసిన అధ్యక్షోపన్యాసముకడుచిన్నది. ఆయినను బావ గంభీరమయినది. భారతజాతికి భయం నిరాశ తగనివని ధైర్యముతో ప్రజలు ముందుకువచ్చి పోరాడి స్వాతంత్ర్యం సంపాదించవలయునని సరోజిని ప్రబోధించినది. సరోజిని నాయకత్వమున కాంగ్రెస్ సంస్థ ముందుకు నడిచినది. ప్రధాన భారతీయులకు ఈ సంస్థలో ఒక శాఖ యుండవలెనని సరోజిని ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదింపబడినది.
సరోజినికి కాంగ్రెసు అధ్యక్షురాలిగా ఎన్నుకొనుట మూల మున స్త్రీలు పురుషులతోపాటు సమాన బాధ్యతలు నిర్వహించ వలెననియు స్త్రీలకు గౌరవ స్థానమును సమాజములో కల్పింప వలెనను విషయములు వెల్లడియైనవి. సరోజిని తనకు లభించిన అధ్యక్ష స్థానంనుండి “భారత దరిద్రం, ఆకలి,
ప్రజలను పీడించుచున్న నిరాశ వీటన్నిటిని ఒక్క మారుగ తుడిచి వేయగల ఉ త్తేజాన్ని మార్పును ఎట్లు మీ మనస్సులలో కలి గించగల”నని ప్రశ్నించింది.
1937లో భారత జాతీయ కాంగ్రెసు శాసనసభలో ప్రవేశించి అక్కడినుండి పోరాడాలని తీర్మానించింది వ్యక్తిగా సరోజినికి ఇది ఇష్టం లేకపోయినా దేశమంతటా పర్యటించి ఈ విషయాన్ని తన మధురమగు ఉపన్యాసములతో ప్రచారం చేసింది కాంగ్రెసులోగల అంతర్జాతీయ శాఖకు సరోజిని అధ్యక్షురాలిగా పనిచేసింది కాంగ్రెసులో సరోజిని ఏ ఒక్క ఏ వర్గానికి చెందినదికాదు గాంధీ మహాత్ముడు కాంగ్రెసులో చేరిన తరువాత కాంగ్రెసు సంస్థకు మహాత్ముని సేవించుటకై సరోజిని తన సర్వశక్తిని ధారబోసెను.
శాసన సభలలో ప్రవేశించే విషయమయి కాంగ్రెసు ప్రముఖులలో రెండువర్గాలు ఏర్పడిన సమయంలో కూడా మహాత్మునిపట్ల సరోజినికి అత్యధిక గౌరవమున్నా ఏవర్గమును బలపర్చక ఆ యిరువర్గముల సామరస్యతకే కృషిచేసినది.
పెద్ద సమస్యల చర్చలలో అప్పుడప్పుడు నాయకులు వాక్కల హాలలో చిక్కుకొని హృదయాలు వ్యధతో నిండినవేళ తన సంభాషణ చాతుర్యముచే వారికి కాంతిని చేకూర్చుచుండెడిది. కాంగ్రెస్ కార్యవర్గములో సరోజిని సుమారు 25 సంవత్సర ములు సభ్యురాలుగా నుండి నిర్ణయాలలో ప్రముఖ పాత్ర వహించి అగ్రనాయకులందరి అభిమానమును పొందినది. కాం గ్రెసు విధాన నిర్ణేతలతో నొకతెయై సరోజిని ఐక్యతా మూర్తిగా పేరొందినది.
సత్యాగ్రహయోగి గాంధీ మహాత్మునికి ఎందరో శిష్యులు శిష్యురాండ్రు కలరు. అట్టి ముఖ్యులలో సరోజినీ ఒకరు. మహాత్ముడు ఉద్యమము ప్రారంభించినది మొదలు విశ్వాస పాత్రురాలుగా ఆయన సిద్ధాంతములను అనుసరించినది. ఆఫ్రికా సమస్యలలో మహాత్ముని చేదోడువాదోడై మహాత్ముని ప్రశంసల నందుకొన్నది మహాత్ముని సేవలో సరోజినినే నిమగ్నురాలయింది. ఇంట, బయట ఉపవాసములలో వృద్ధాప్య మీలో కూడా జాతిపితకు తనయునివలె తల్లివలె సేవచేసిన ధన్యురాలు ఆయనను వేయికళ్ళతో కనిపెట్టుచు ఉపచార ములు చేసినది. ఆయనలోని సంస్కృతి, విశ్వప్రేమ మానవత హాస్యోక్తులు సరోజినికి అబ్బినవి. అందరి యెడల ప్రేమయే కాని ఒకరిపట్ల అనురాగము మరొకరిపట్ల ద్వేషము సరోజిని ఎరుగదు.
గాంధీజీ ఉపకాలం “అయ్యో! నా పనివాడు ఏమైనాడో” అని తల్లివలె ఆదరించెడిది. ప్రతి ఉపవాసం చివర మహాత్ము నికి నిమ్మరసమిచ్చు భాగ్యం ఒక్క సరోజినీదే. చిట్టచివరగా ఆ భాగ్యం అజాద్‌కు దక్కినది. దండి సత్యాగ్రహంలో కారా గార సమయములలో మహాత్ముని కెట్టి అలసట ఆయాసములు
రాకుండ కాపాడుచుండెడిది.
ఆ గీతములను రోజూ పసిపాపవలె ఆయనతో ఆడి, పాడి ఆయనకు ఉల్లాసం కలిగించినది. ఆనాడు దీపావళి పండుగ. సరోజిని ఆమె సన్ని హితులు కలిసి ఆ పండుగను బాగుగా జరుపుకొనదలచిరి • అందుచే వారు గాంధీజీతో “మీకు ఈ రోజు జ్వరం తగిలినది. మీరు కదలరాదు” అని చెప్పిరి. సాయంకాల మయ్యేసరికి దీపాలు వెలిగించి జైలు ప్రాంగణమంతా వెలుగుతో నింపారు ఆనాడు సరోజిని ఒకగీతం వ్రాసింది. గాంధీజీ పాలుత్రాగే మేకపిల్ల మెడలో కట్టారు. అందులో ఈ ఈ మాటలున్నాయి “మహాత్మా! రోజూ నా తల్లిపాలు నీవే తాగుతున్నావుగదా! ఈ పండుగనాడైనా తల్లిపాలు నన్నే త్రాగనియ్యరాదా” అని వ్రాసివున్నది. మహాత్ముడు దాన్ని చదివి “నాకు పాలు అక్కరలేదు. ఈ పండుగనాడు నువ్వే అనుభవించు” అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
మహాత్ముడు తన సంభాషణలలో హాస్యోక్తులునింపుతూ వుండే అలవాటు ఆయనకు సపర్య చేసిన కారణంగా సరోజి నికి ఆ హాస్య ధోరణియే అలవాటయింది, ఒకసారి ఉపవాస వ్రతం విరమించిన తర్వాత నిమ్మరసం అందిస్తూ సరోజిని “పెళ్ళికొడుకులాగ ఉన్నావు” అని పరిహాసమాడింది. దానితో ఆ బోసినోటితాత అదే సరసంతో “నీవు పెళ్ళికూతురువైతే నేను పెళ్ళికొడుకును కావడానికి సందేహించను” అని అన్నాడు.
మరొకమారు విద్యార్థులు వచ్చి సభలో ఉపన్యసించా లనికోరగా మహాత్ముడు వారిని హరిజననిధికి రెండువేలిమ్మని కోరాడు. వెంటనే అక్కడున్న సరోజిని “ఆయన కోమటి ధనాశ హెచ్చు. నేను బ్రాహ్మణ బిడ్డను. దానం ఇవ్వడమే గాని తీసుకోవడం ఎరుగ”నని చమత్కరించింది.1921లో బొంబాయిలో జరిగిన మతకలహాలతో పరోజిని నిర్భయంగా వీధులలో తిరిగి ఉన్మత్తులై వ్యవహ రిస్తున్న జనాన్ని అదుపులో పెట్ట సాహసించిన వీరవనిత. గాంధీ మరణించిన పిమ్మట ఆయన గురించి ప్రసంగిస్తూ…
“మా జీవితాలు ఆయనకు అంకితమయినాయి ఆయన మరణం మా అందరికీ వ్యక్తిగత నష్టం. ఆయన ఆదర్శాలకు మేము సజీవ చిహ్నాలు. ఆయన శిక్షణ యిచ్చిన సైనికులం. ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన ప్రారంభించిన పోరాటాన్ని విజయవంతం చేద్దాం” అంటూ ఉద్రిక్త హృదయంతో ఉపస్య సించింది.
1940 మార్చి 12వ తేదీన మహాత్ముడు చరిత్ర ప్రసిద్ధమయిన దండి ఉప్పు సత్యాగ్రహ యాత్ర ప్రారంభిం చాము. అణచి వేయాలని బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో ప్రయ త్నాలు చేసింది. మే తిన కూడి గ్రామములో గాంధీజీని అరెస్టు చేసి తరువాత జై లుకు తీసుకెళ్ళారు.ఆ సందర్భంలో సరోజిని “గాంధీజీ శరీరమును గోడలమధ్య నిరంకుశముగ బంధించినంత మాత్రమున అయన సందేశం నిలువదు. ప్రతి భారతీయుని హృదయంలో అది స్పందించుచునేయున్నది. దానినెవరు బంధించలేరు.
ప్రపంచ ప్రజలభావములనది ఆకర్షించగలదు” అని ప్రకటించింది గాంధీజీ నెహ్రూ, తయాజ్జీలు అరెస్టు అయిన పిదప సృజిని స్వయ ముగ “దర్శన” ఉప్పుకోఠారుపై దాడికి నాయకత్వం వహించి నది పోలీసులు వలయాకారముగ ఏర్పడి ఆమెను ముందుకు పోనీయకుండిరి మిట్టమధ్యాహ్న సమయంలో గంటల తరబడి సరోజిని తనఅనుచరులతో అశ్లేనిలచియుండెను. వారికి అన్న పానీయాలుకూడా అందకుండా చేశారు చిట్టచివరకు పోలీసులు అపజయం పొందారు, ఆమెను అరెస్టు చేశారు.
ఈ వార్త విని నారీ లోకమంతా సంక్షోభం చెందింది. సర్వత్యాగాలు చేయుటకు సిద్ధమయి స్త్రీజాతి సర్వం కంకణ ధారియై కదనరంగములోని కురికింది మహత్తర త్యాగాలు చేయడానికి మహిళలు ముందుకు వచ్చారు.
1948 ఆగస్టు 7, 8, 9 తేదీలలో బొంబాయి సమా వేళములో “క్విట్ ఇండియాతీర్మాసంఆమోదించబడడంతో స బ్రిటిషు ప్రభుత్వం దద్దరిల్లిపోయింది ఆ సమావేశం నుండి బయటకు వచ్చేలోపునే కాంగ్రెసు అగ్రనాయకు లందరినీ ప్రభుత్వం నిర్బంధించింది. ప్రజల ఆవేశం మిన్ను ముట్టింది. విప్లవాగ్ని చెలరేగినది. ఆగస్టు విప్లవం భారత చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయింది 1857లో జరిగిన తిరుగుబాటు. ఒక్క సైనికులలోనే వచ్చింది.
కాని ఆగస్టు ప్రజా విప్లవం కార్చిచ్చువలె ఒక్కమారుగా దేశమంతా చెలరేగింది. ఈ ఆగస్టు విప్లవమే బ్రిటీషు ప్రభుత్వాన్ని లొంగదీసింది. అదే లేకుంటే మనకు స్వరాజ్యమేలేదు ఆ సమయంలో సరోజిని అనారోగ్యంతో బాధపడుతూ ఉండికూడా తన విధిని నిర్వ హించి జైలుకు వెళ్ళింది. 1983లో తీవ్ర అనారోగ్య కారణంగా విడుదల చేయబడింది.
మహాత్ముడు తన సత్యాగ్రహోద్యమము ద్వారా ప్రజలలో అపూర్వమయిన రాజకీయ చైతన్యమును సాధించి నాడు. ఈ ఉద్యమము కాలముననే ప్రాణములకు తృణప్రాయముగా నెంచి దేశ సేవలో అర్పణము చేయుటకు ఎందరో త్యాగులు ముందుకు వచ్చారు భారత నారీలోకమునంతటికి అగ్రగామిగా దేశభక్తురాలిగా నిరూపించుకొన్న సరోజిని జన్మము కడుధన్యమయింది.
గాంధీ సరోజినులు పుట్టిన యుగంలో జన్మించి వారి సమకాలికులుగ జీవించి వారి త్యాగమై జీవితములు గడిపిన వారందరు ధన్యులు.
వివిధ రంగాలలో సేవలు
సాహిత్య రంగంలోను రాజకీయ రంగంలో నేకాక సరో జిని యితర రంగాలలో కూడ మానవ సమాజ సేవకు కంకణం కట్టుకొని పనిచేసింది. ముఖ్యంగా హిందూ మహమ్మదీయ సఖ్యతకు ఆమెచేసిన కృషి మెచ్చుకోదగినది. పామరులతో పాటు అనేకులు విద్యాధికులైన వారుగూడ ఆమె మహమ్మ దీయులతో కలసి మెలసి తిరగడం విమర్శించినా ఆమె లెక్క చేసేదికాదు. రెండు మతములవారి ఐక్యతకు ఆమె
రాజకీయ కారణాలచే ప్రేరేపింపబడలేదు.
సౌభాత్ర భావంతో హిందూ స్త్రీనని మానవతా దృష్టితో కూడినదే. తాను హైందవ మతాధిక్యతను ఆమె యెన్నడు ప్రకటించుకోలేదు. ఆమె మహమ్మదీయ మత గ్రంథములను సాహిత్యమును పటించి వారి యెదుట సానుభూతి పెంచుకొన్నది. యిస్లాం మతాదర్శములను ప్రజాస్వామిక ప్రవృత్తిని ఆమె శ్లాఘించు చుండెడిది. ఆమె ఒకసారి తన మహమ్మదీయుల మతాభిమాన మును సమర్ధించుచూ “నేను మహమ్మదీయుల ముఖ్యనగర^ ములో పుట్టాను.
నా చెవిలో మొదటిగా పడ్డవి ఉర్దూ శబ్దాలే. నా బాల్య స్నేహితులందరు ముస్లిం బాల బాలికలే” అన్నది. గోఖలేతో ఒకసారి ముచ్చటిస్తూ 5 సంవత్సరములలో హిందూ మహమ్మదీయ ఐక్యతను సాధింపగలనని పలికెను. దానికి ఆయన సమాధానమిస్తూ నీవు చిన్నదానవు. అనుభవము లేక పలుకుతున్నావు. ఈ సఖ్యతను నీవు, నేను జీవించియుండగా సాధింప జాలమనెను. అయినప్పటికీ ఆమె అచంచల విశ్వాస ముతో కృషిని కొనసాగించుతూనే యుండెను. ఈ రంగంలో ఆమె కృషిసాగిన రీతి తెలుసుకోదగింది. 1913లో లక్నోలో ముస్లింలీగు సభ జరిగింది. ఆ సభకు సరోజిని రాయబారిగా వెళ్ళింది. ఆమె ఉపన్యాసం సభవారిపై మంచి ప్రభావం కలిగించింది.
1917లో పాట్నాలో జరిగిన మహాసభలో ఉపన్య సిస్తూ, “మహమ్మదీయిలు మనతోపాటు నివసించడానికి వచ్చారు. అంతేగాని మనలను దోచుకోటానికి రాలేదు అటువంటి వారిక్కడి ప్రజలతో సంబంధాలు పెట్టుకోకుండా యెలా ఉంటారు? ఈ దేశమును మాతృభూమిగా భావించు వారు కూడా ఈ దేశమాతబిడ్డలే. మనతో కలసియే ఉంటారు” అధికంగా వున్న అన్నది. మత సంబంధమయిన విభేదాలు సమయంలో కూడా మహమ్మదీయుల విశ్వాసాన్ని చూర గొన్న హిందూ స్త్రీ సరోజినియేనని షాకతాలి స్పష్టముగా
పలికెను.
మతకలహాలలో ఆమె నిర్భయంగా వీధులలో తిరిగి ఉన్మత్తతలో వున్న జనాన్ని అదుపులోకి తేగలిగింది.
1922లో గాంధీ కారాగారమునకు పోవుచు సరోజి నితో దేశ ఐక్యతను నీ మీదనే నిలిపి పోవుచున్నానని పలి కాడు ఐక్యతా కృషిలో సరోజిని చేయు సేవగురించి గాంధీ జీకి యెంత నమ్మకం గలదో పై మాటలే తెలుపుచున్నవి. “మతము పేరైతేను ఏమోయ్మ నసు లొకకై మనుషులుంటే” అన్న గురజాడ మహాకవి కావ్యాలకు సరోజిని మనకు ప్రత్యక్ష నిదర్శనము.భారతీయులకు సేవ చేయుటలో నేగాక ఇతర దేశాలలో నున్న భారతీయుల కష్టసుఖాల గురించి కృషిచేసిన వారితో సరోజిని చెప్పుదగినది.
1927లో అమలులోనికి వచ్చిన నిర్బంధ కూలీ చట్టా నికి వ్యతిరేకంగా ఆమె ఆందోళన ప్రారంభించింది విదేశాలలో స్త్రీలు అనుభవించు బాధలను వర్ణించి మాటలు వచ్చుటమాని కన్నీళ్ళు కార్చినది. ఆఫ్రికాలోని భారతీయుల సమస్య మరుగున పడిపోగా దానికి నూతనోత్తేజం కలి నీ గించింది. 1927లో కెన్యాలోని భారతీయులు సరోజినిని అక్కడకు ఆహ్వానించారు. ఆమె పర్యటించి ప్రబోధం చేసిన ఫలితంగా ప్రజలలో చైతన్యం కలిగింది. సహాయ నిరాకరణకు తలపన్ను నిరాకరించుటకు అక్కడ సిద్ధపడ్డారు కెన్యానుంచి దక్షిణాఫ్రికా భారతీయులు ఆహ్వానించగా అక్కడకు వెళ్ళింది అక్కడి వారు నేపాలులోని ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆందో ళన చేస్తున్నారు.
జనరల్ హెక్టా జాగ్ అను డచ్చి గవర్నరు “భారతీ యులు తమదేశానికి ఎందుకు పోరాదూ?” అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నను విన్న సరోజిని జంకు గొంకు లేకుండా “దక్షిణా ఫ్రికాలో నివసించే హాలెండు దేశీయులు తమ దేశానికి ఏల పోరు?” అని ప్రశ్నించి ఆయనను నోరు మూయించినది.
ఉపా అక్కడనుండి సరోజిని రౌడీషియా వెళ్ళింది. అక్కడ గూడా భారతీయుల హక్కుల సాధనలో ఆమె కృషిచేసింది.బెల్గామ్ కాంగ్రెసుకు దక్షిణాఫ్రికా నుంచి భారతీయ ప్రతి నిధులు వచ్చారు “గాంధీజీని మీకు మేము అర్పించాము. మీరు సరోజినిని మాకు పంపండి” అని ఆ ప్రతినిధులు అర్థిం చారు. 1921లో జరిగిన కాంగ్రెసులో ఆమె ఖండాంతర భారతీయులకు చేసిన సేవ అధికంగా కొనియాడబడింది.
1929లో ఆమె తూర్పు ఆఫ్రికాలో జరిగిన భారతీయ కాం గ్రెసు సభలో అధ్యక్షత వహించి వారి కష్టాలు పోగొట్టటంతో పాటుపడ్డది, ఇతర ఖండాలలోని భారతీయులకై కృషిచేసిన ఆ భారతీయ మహిళ ఆమె ఒక్కతే. తాను బుద్ధిపూర్వకంగా ఆదర్శవివాహలను చేసుకొనుటేగాక అప్పటినుండి భారతీయ మహిళల సముద్ధరణకై సరోజిని మిక్కిలి కృషిచేసినది. ఆధు నిక సంస్కారంగల స్త్రీలతోనేకాదు. సనాతన సంప్రదాయం పాటించే వారితోకూడ సరోజిని సంబంధాలు పెట్టుకొనేది.
మహిళా ఉద్యమవ్యాప్తికి తాను ఉపన్యాసములిచ్చి చైతన్యం కల్గించింది. కేవలం హిందూ స్త్రీ లేకాదు. పార్శీ, మహమ్మ దీయ స్త్రీలుకూడా ఆమె ప్రబోధంతో ప్రభావితులయిరి. పాశ్చాత్య నాగరికతపట్ల ఆమెకు వ్యామోహముండేది కాదు. భారతీయ నారీమణుల ఆదర్శాన్నే ఆమె తాను అనుసరిస్తూ ఇతర స్త్రీలకుకూడా దాన్ని గౌరవించే ప్రచారం చేసేది. స్త్రీలకు ఎక్కడ ఏమాత్రం అవమానం జరిగినా ఆమె సహిం చేదికాదు. ఒకసారి వంగరాష్ట్రపు గవర్నర్ భారత, స్త్రీలను గురించి అవమానకరంగా మాటలాడగా సరోజిని పెద్ద ఆందో శనజరిపి చివరికాయనచేత క్షమాపణ చెప్పించినది. 1919లో ఆమె స్త్రీలకు ఓటుహక్కు సంపాదించుటకు పెద్ద ఉద్యమం ప్రారంభించినది. ఒక కమిటీ సెల్ బోరన్ అధ్యక్షుడుగా నియ మింపబడగా దాని ఎదుట గట్టిగా సాక్ష్యమిచ్చినది సరోజిని.
ఇది 1920లో జలియన్ వాలాబాగ్ దురంతాలను గురించి ‘ఆల్ బర్డ్ హాలులో ఉపన్యసించుతూ “నా సోదరీమణుల వస్త్రాలు తీసివేసారు, చావమోదారు. మానభంగం చేశారు, ఉ అని ఉపన్యాసం ప్రారంభించినది. సభలోనివారు అది సహిం చలేక అల్లరిచేయుటకు మొదలిడగా సరోజిని రౌద్రరూపం ఉదాల్చి “నోరు ముయ్యండి” అని సింహగర్జన చేసింది. అది బ్రిటీషు ప్రభుత్వానికి భయం కలిగించింది.
జెనీవాలో జరిగిన అంతర్జాతీయ మహిళా మహాసభకు భారత ప్రతినిధిగా వెళ్ళి అక్కడ ఉపన్యసించి భారతీయ మహిళలకు అంతర్జాతీయ ఖ్యాతి గడించింది.
1930లో బొంబాయిలో అఖిల భారత మహిళామహారి సభకు అధ్యక్షతవహించినది. 1983లో బ్రిటిషు ప్రభుత్వం జరిపిన రౌండు టేబుల్ సమావేశంలో భారతీయ మహిళల ప్రతినిధిగా ఆమె పాల్గొన్నది. దేశ స్వరాజ్య పోరాటముల్లో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా పోరాడినచో వారిద హక్కులను వారు పొందగలరని ప్రబోధించినది. ఒక అర్థం శతాబ్దకాలంలో ముందెన్నడూ కానరాని మార్పులను తేగలిగి నది. భారతీయ మహిళా ఉద్యమం నేడింత ఉచ్ఛదశలో నుండుటకు శ్రీమతి సరోజినీయే కారకురాలు.
భారతదేశం బ్రిటీషు సామ్రాజ్య పరిపాలన నుండి తాను విముక్తి పొందుటయేగాక బర్మా, సింహళ దేశాల స్వతం త్ర్యానికికూడా పోరాడింది. ప్రపంచంలో ఏ దేశమయినా పర పీడనలో బ్రుగ్గిపోరాదని నొక్కి వక్కాణించడమేకాదు ఆ- దేశములు జరిపే విముక్తిపోరాటానికి తన నైతిక మద్దతును ప్రకటిస్తూనే ఉంది. సర్వ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టి ఆసియా ఖండము సమైక్యంగా ఉండి పశ్చిమ ఖండాతో ఆధిక్యతను ఎదుర్కొనాలనే భావం ప్రబలింది.
1947లో మార్చి 21 నుంచి పదిరోజులపాటు ఢిల్లీకి సమీపంలోని పురాణ జిల్లాలోని అఖిల ఆసియా మహిళాసంరిగింది. దానికి అధ్యక్షురాలు శ్రీమతి సరోజినియే! జవహర్ తాల్ నెహ్రూ ప్రారంభోపన్యాసం చేశాడు. గాంధీ మహా త్ముడు కూడా ఆ మహాసభలో ప్రసంగించారు ఈ మహాసభకు 12 దేశాల ప్రతినిధులు వేయిమంది పరిశీలకులు హాజరైనారు. సరోజిని తన సహజధోరణిలో ప్రతినిధులకు ఉత్తేజం కలిగిం చేటట్లు ఉపన్యసించింది.
గవర్నరు పదవి
మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన వెంటనే నూతన ప్రభుత్వం గవర్నర్ల ను నియమించినది అందులో ముఖ్యులు రాజాజీ. సరోజిని నెహ్రూ ప్రభుత్వంలో ఆమె సంయుక్త పరగణాల గవర్నరుగా నియమించబడింది. డాక్టరు బి. సి స్విడెడ్ రాయ్ విదేశాలకు వెళ్ళిన సందర్భంలో ఆమె నియమింప బడింది. ఆయన దేశానికి తిరిగివచ్చిన పిమ్మట మళ్ళీ గవ ర్నరు పదవి చేపట్టక వంగదేశ సేవకు అంకితము కాదలచి నట్లు చెప్పెను.
సరోజినికి అధికారమంటే గిట్టదు. తన నియామక వార్త వినగానే ఆమె “స్వేచ్చగా తిరిగే పక్షిని పంజరంలో బంధించినట్లే” అన్నది కాని అనేక కారణాలవలన ఆమె ఆ పదవిని అంగీకరింపక తీరలేదు. స్త్రీలు పరిపాలనా రంగంలో కూడా సమర్ధులే. ఏ విధంగానూ పురుషులకు తీసిపోరని నిరూపించడం కూడ ఆ కారణాలలో ఒకటి కావచ్చు. పదవీ బాధ్యత నిర్వహణలో ఆమె తన అసాధారణ కౌశల్యాన్ని ప్రదర్శించింది.
అంతకు ముందు గవర్నరులను “హిజ్ ఎక్సలెన్సీ” అని సంబోధించడం అలవాటు. ఆ పద్ధతిలోనే ఆమెను “హర్ ఎక్స్ లెన్సీ” అని సంబోధించడం విని నన్ను మీరలా పిలవ నక్కరలేదు. నేను మీకు తల్లి లేదా సోదరివంటి దానను అందరం ఒక కుటుంబంలో వారం. ఈ మర్యాదలు ఆడంబ రాలు మానివేయండి అని ఆ పిలుపును విరమింపజేసింది.
వెనుకటి గవర్నరుల పోలికగా ఆమె పెద్ద ఆడంబరా లతో పరివారంతో వెళ్ళేదికాదు. తన కూతురు పద్మజును వెంటబెట్టుకుని పేరంటానికి వెళ్ళే ముత్తయిదువ పోలికగా వెళ్ళేది. గవర్నరు ఉద్యోగాన్ని ఆమె ఏమీ గర్వంగల హోదాగా భావించలేదు. అదొక సేనకు ఉపకరణంగా ఆమె భావించింది. పదిమంది ఎక్కడకు చేరితే అక్కడకు వెళ్ళి గడ పాలనే ఆమె కోరుకునేది. లక్నోలోని ప్రభుత్వ భవనం ఆమె రాకవలన కళకళలాడింది.
ఆ భవనం అంతటినీ కళాత్మకంగా అలంకరింపచేసి అతిధులకు అత్యంత ఆకర్షణీయంగా తయారు చేసింది. సరోజినీ గవర్నరుగా పనిచేసిన కాలంలో ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా కాలక్షేపం చేసారు ఆరాష్ట్రంలో అంతవరకు నెలకొన్న అశాంతి పతవైషమ్యాలు అణగిపోయి సుహృద్భావం మత సమైక్యత నెలకొన్నాయి. తనకు లలిత కళఅందుగల అభిమానంచేత ఆ రాష్ట్రంలోని కవులకు, చిత్ర కారులకు ఉత్సాహం కలిగించి వారి గౌరవానికి పాత్రు రాలైంది. కళామూర్తులు ప్రభుత్వ భవనానికి వస్తూ పోతూ (విందులు కాలక్షేపాలు చేయడం పరిపాటి అయింది.
ఇదివరలో గవర్నర్ తో భేటి లభించడానికి పదిరోజులైనా పడేది. సరోజిని గవర్నరుగా వచ్చాక పది నిమిషాలు చాలు నని అహమ్మద్ అబ్బాస్ అనే ప్రముఖ రచయిత అన్నాడు. ఇటువంటి మార్పు కలిగినందుల కాయన ఆశ్చర్యపోయాడు. ఆ భవనంలో కన్పించే అపూర్వ అలంకారాలు ప్రాచీన చిత్రా లంకరణలు గురించి కూడా ఆయన పేర్కున్నాడు.
ఆమె గవర్నరయినా తన వరండాలో దర్బారు తీర్చి వచ్చిన అతిధులకు మర్యాదచేస్తూ తన సెక్రటరీకి ముఖ్య విష యాలు చెపుతూ అంతరంగిక కార్యదర్శితో తన కార్యక్రమం చర్చిస్తూ మధ్య మధ్య వేడి కాఫీ సేవిస్తూ తన పెంపుడు కుక్కను నిమురుతూ అష్టావధానంలాగే అన్ని పనులలోను తన బుర్ర పనిచేస్తూ వుండేది.తాను గవర్నరుగా సదవీ బాధ్యత నిర్వహిస్తూ కూడా క్రొత్తగా ప్రచురితములయిన గ్రంధాలన్నిటినీ చదివేది.
మహిళల అభ్యున్నతికి, శరణార్ధుల పునరావాసానికి సరోజిని ఎక్కువ కృషిచేసింది. వివిధ సమస్యల నెదుర్కొం టున్న ఒక విశాల రాష్ట్రానికి ఆమె గవర్నరుగా తన పరి పాలనా సామర్థ్యాన్ని నిరూపించుకున్నది. మంత్రివర్గంలోని సభ్యులు మొదలుకొని ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులవరకు సరోజినీ వివిధ వర్గాలవారి మన్ననలను పొందింది.
ఆమెను గవర్నరుగా నియమించుటవలన సరోజినికి హోదా పెరుగుటకాదు ఆ పదవికి ఆమె నియామకం వలన ముందెప్పుడూ లేని గౌరవము లభించిందని బాటు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శాంతికి, త్యాగానికి, క్షమకు పేరుబడిన స్త్రీలు పరిపాలనా దక్షతలో కూడ సమర్ధులని సరోజిని నిరూపించింది.
చరమాంకము
లక్నో విశ్యవిద్యాలయం 1£ 49 జనవరి 22న భారత ప్రధాని నెహ్రూకు డాక్టరు బిరుదును సమర్పించింది. ఉత్సవ సభకు శ్రీమతి సరోజిని అధ్యక్షత వహించింది. సభలోనే పశ్చిమ బెంగాల్ గవర్నరు కైలాసనాధ కట్టూకు డాక్టరు ఆఫ్గాన్ బిరుదు కూడా ఇచ్చారు. సరోజిని అధ్యక్షత వహించిన తుదిసక అదియే.
ఆమె ఫిబ్రవరి 12 నుంచి అస్వస్తురాలయినది. ఆమెను పరీక్షించిన వైద్యనిపుణులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవలసిన దాని సలహా యిచ్చారు. సభలు, సమావేశాలలో పాల్గొనడం పనికిరాదన్నారు. ఫిబ్రవరి 25న ఆమెకు చికిత్స ప్రారంభం మయింది. ఆక్సిజన్ యిచ్చారు.
ఒడలి నుండి కొంత రక్తము తీసిన పిమ్మట కొంత ఊపిరి సులభమయింది.వైద్య చికిత్సకు లోటులేదు. కాని కాని ఆమె బంధువు లెవరును ఆమె సమీపమున లేరు. కూతురు పద్మజ అలహాబాదులో రాజాజీ గవర్నరు జనరల్ జరిపే ఒక భవన ప్రారం భోత్సవానికి వెళ్ళింది. సరోజిని భర్త నాయుడుగారు. కుమా రుడు జయసూర్య, రెండవ కూతురు లీలామణి హైదరా బాదులో ఉన్నారు.
చివరికాలం ఆమె సమీపంలో ఒక నర్సు ఒక నర్సు మాత్ర ముండెను. బంధువులెవరూ లేరు. రాత్రి 10గంటలసమయంలో ఆమె నర్సును ఒక పాట పాడమని కోరెను. ఆమె పాడు తుండగానే సరోజినికి నిద్రపట్టింది రాత్రి 2 గంటల వేళ మెళుకువవచ్చి దగ్గు ప్రారంభమయింది. దగ్గరనున్నవై ద్యులు పరీక్షించి ఉపచారము చేస్తున్నారు. 1949 మార్చి 2వ తేది రాత్రి మూడున్నర గంటలకు ఆమె శాశ్వతంగా కన్నుమూసినది.
భారత కవయిత్రి, మాతృమూర్తి, మహావక్త, స్వాతం త్ర్య సమరములో అగ్రభాగాన నిలిచిన వీరనారి అస్తమిం చింది. ఒక మహోజ్వల తార థాలిపోయింది. ఆమె మరణ వార్త తెల్లవారేసరికి పట్టణమంతా ప్రాకిపోయింది. కుమార్తె పద్మజవెంట గోవిందవల్ల భపంత్, కమలాదేవి ఛటోపాధ్యాయ జీవరాజ్ మెహతా వచ్చారు. మధ్నాహ్నమునకు భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గవర్నర్ జనరల్ రాజగోపాలా చారి లక్నో వచ్చారు.
- శ్రీమతి సుచేతా కృపలానీ భక్తిగీతాలు పాడి రాము నామ సంకీర్తనం చేసింది. ఆమె భౌతికకాయం సైనికశకటంపై ఉంచబడింది. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ప్రభుత్వ భవనం నుఁడి ఆమె భౌతికదేహం గోమతీ తీరంలోని శ్మశానవాటికకు జయలు దేరింది.
ఒక మైలు పొడుగున 70 వేలు జనం అంతిమయాత్రలో పాల్గొన్నారు. బంధువర్గంతోపాటు కేంద్రంలోని ఉన్నతాధి కారులు, రాష్ట్రమంత్రులు ఎందరెందరో ఊరేగింపు వెంట వెళ్ళారు. మంచిగంధపు చెక్కలు, కుంకుమ, పువ్వులు మున్నగు సుగంధద్రవ్యాలు పేర్చిన పిమ్మట ఆమె తనయుడు జయసూర్య చితికి నిప్పంటించాడు. అగ్నిజ్వాలలు సరోజిని భౌతిక కాయాన్ని ఆహుతిగొన్నాయి.
ఆమె మరణానంతరము, ఆమెసోదరుడు హరీంద్రనాధ్ ఛటోపాధ్యాయ, రేడియోలో ప్రసంగిస్తూ “నలభై కోట్ల భారతీ యులప్రియ సోదరి వెళ్ళిపోయింది. “మాతృభూమిలో చైతన్యం మాయమయింది. పాట వెళ్ళింది. నవ్వు మాయమయింది. ఆమె వెళ్ళిపోయిందనే వాళ్ళంతా తెలివి తక్కువవాళ్ళు ఆమె ఎక్కడికిపోలేదు. ప్రజాహృదయాలలో స్థిరనివాస మేర్పరచు కున్నది. 30
”యువతీ యువకులారా! మేము దేశానికి చేయగలి గినదంతా చేశాము ఈ బాధ్యత ఇప్పుడు మీపై పడింది.
స్వాతంత్ర్యము సంపాదించడానికి మేము శక్తివంచనలేకుండా పాటుపడ్డాం దాన్ని కాపాడే బాధ్యత మీది.అందరూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవించేటట్లు చూచే బాధ్యత మీది” అని ఆమె వినిపించిన మాటలు ఇప్పుడు మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి అని ప్రసంగించాడు.
సరోజిని మృతిని గురించిన వార్త ఒక్క భారతీయులనే కాడు, సర్వప్రపంచప్రజలను విషాదంలో ముంచెత్తినది. భౌతి కంగా ఆమె ప్రజలకు దూరమయినా ఆమెసందేశం చిరకాలం నిలుస్తుంది. 5 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఆమె దేశ స్వాతంత్ర్యంకోసం నిస్వార్థంగా పోరాడింది. ఆమె యశశ్చం ద్రికలు సర్వప్రపంచమును వ్యాపించాయి.