SAMRAT ASHOK GREAT 1 INDIA

SAMRAT ASHOK GREAT INDIAN EMPEROR

SAMRAT ASHOK విజేత విర్రవీగుతాడు. ఓడినవారిని హింసించి, అవమానించి, అట్టహాసం చేస్తాడు. క్రూరానందం పొందుతాడు. కానీ SAMRAT ASHOKచక్రవర్తి ఒక మహావిజయం నుంచి ఆత్మవిమర్శకు, పశ్చాత్తాపానికి పాల్పడ్డాడు. ఓడినవారిని ఆదరంతో, గౌరవంతో చూసి అహింసా మార్గం పట్టి చరిత్రకెక్కాడు.

SAMRAT ASHOK1 IN INDIA,

ఒక ఘోర మానవ విషాదం నుంచి గుణపాఠం నేర్చుకుని శాశ్వతంగా శాంతిమార్గాన్ని తొక్కినవాడు .SAMRAT ASHOK చక్రవర్తిగా రాజధర్మం ప్రకారం సాగించిన యుద్ధంలో పారిన మానవ రక్తాన్ని చూసి చలించిపోవడమే కాదు… మనసు SAMRAT ASHOK మార్చుకొని పరిపూర్ణ మానవీయతతో గుబాళించే బౌద్ధమతాన్ని స్వీకరించి, చరిత్ర సృష్టించాడు .

SAMRAT ASHOK అంటే శోకం లేనివాడు. దుఃఖం దరిచేరనివాడు. లోకాన్ని శోకం లేని సమధర్మధామంగా అన్ని మతాలసహజీవనక్షేత్రంగామార్చినమహనీయుడు.SamratAshokచంద్రగుప్తమౌర్యుని మనుమడు. బింబిసారుని కుమారుడు. క్రీ.పూ. 268 లో రాజ్యాధికారాన్ని చేపట్టి చక్రవర్తి అయ్యాడు. క్రీ.పూ. 232 లో మరణించాడు. తాత చంద్రగుప్త మౌర్యునికి మించి కీర్తిప్రతిష్ఠలు సముపార్జించుకున్నాడు.

SARAT ASHOK ని తాత చంద్రగుప్తమౌర్యుడు క్రీ.పూ. 321లో సామ్రాజ్యాన్ని చేపట్టాడు. కౌటిల్యుడు (చాణక్యుడు) అ బ్రాహ్మ ణుడి సహకారంతో నవనందుల నుంచి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నంద రాజ్యాధిపతి సర్వార్థసిద్ధికి, ఆయన భార్య లలో ఒకరైన ముర అనే దాసి వనితకు పుట్టినవాడే చంద్రగుప్తుడు.

ముర సామాజిక నేపథ్యాన్ని బట్టి అన్నలైన నవనందులు చంద్రగుప్తుడిని హీనంగా చూసేవారు. ఈ సమయంలో గురువు కౌటిల్యుడు చంద్రగుప్తునిలోని ధైర్యసాహసాలను ఇతర మంచి గుణగణాలను చూసి అతడికి అండగా నిలబడాలనుకున్నాడు. అతని సహకారంతో చంద్రగుప్తుడు నవనందులను ఓడించి రాజ్యాన్ని సాధించుకున్నాడు. ఈ రాజ్యం గంగానది మైదానాలకే పరిమితమైంది.


చంద్రగుప్తుని పాలన – కౌటిల్యుని అర్థశాస్త్రం
చంద్రగుప్తుడు తన పాలనాకాలంలో దాదాపు భారత ఉపఖండా న్నంతటినీ జయించి తన రాజ్యంగా చేసుకున్నాడు. భారత ఉపఖండంలోని అత్యధిక భాగాన్ని ఒకే రాజ్యం కిందకి తీసుకు వచ్చిన తొలి చక్రవర్తిగా చంద్రగుప్తుడు గుర్తింపు పొందాడు. సువిశాల మౌర్య సామ్రాజ్య స్థాపకుడయ్యాడు.

ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ముందు దక్షిణాసియాలో చిన్న చిన్న రాజ్యాలు అనేకం ఉండేవి. చంద్రగుప్తుడు వాటన్నింటిని కలిపి ఒకే మహాసామ్రాజ్యం చేయగలిగాడు. ఈ సామ్రాజ్యం తూర్పున బెంగాల్, అస్సాంలు మొదలుకొని ఆఫ్ఘనిస్థాన్, బెలూ చిస్థాన్ వరకు, పశ్చిమాన తూర్పు ఇరాన్, ఈశాన్య ఇరాన్ వరకు.. ఉత్తరాన కాశ్మీర్, దక్షిణాన దక్కన్ పీఠభూమి వరకు విస్తరించు కున్నది.

చంద్రగుప్తుడు చాణక్యుడు తీసుకువచ్చిన రాజకీయ, ఆర్థిక సంస్కరణలు మౌర్య సామ్రాజ్యాన్ని ఒక క్రమశిక్షణ గల పాలన వ్యవస్థగా, అధికారవర్గ ఆధిపత్య విభాగంగా తీర్చిదిద్దాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం ఇందుకు ఎంతో ఉపయోగపడింది.https://pincodesguide.in/wp-admin

ప్రజలకు సేవలందించడం, పన్నులు వసూలు చేయడం, నేరశిక్షా స్మృతిని అమలుచేయడం వంటి సమగ్ర పరిపాలన విధానాలు అమలులోకి వచ్చాయి. దేశం లోపలే కాక, బయటి దేశాలతోను వాణిజ్యం వర్ధిల్లింది. వ్యవసాయం బాగా సాగింది. కళలు, వాస్తు వికసించాయి. సామాజిక, మత సంస్కరణలు చోటుచేసు కున్నాయి. బౌద్ధ, జైన మతాలు విస్తరించాయి.


సెల్యూకస్పై విజయం

చంద్రగుప్తమౌర్యుని పూర్వీకులైన నంద వంశీకులు ఇప్పటి ఉత్తరభారతంలోని బీహార్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించారని చరిత్ర చెపుతున్నది. నందవంశానికి మూల పురుషుడు మహాపద్మనందుడు. మగధ రాజ్యాన్ని పాలించిన మొట్టమొదటి శూద్ర రాజుగా ఆయనను పరిగణిస్తారు.

చంద్రగుప్తుడు తన 25వ ఏటనే నవనందుల నుంచి రాజ్యాన్ని స్వాధీన పరుచుకున్నాడు. రాజ్య విస్తరణలో భాగంగా అలెగ్జాండర్ చక్రవర్తి సేనాని సెల్యూకసన్ను యుద్ధంలో ఓడించి ఆయన కుమార్తె హెలెను కానుకగా పొంది వివాహమాడాడు. దానితో ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో భాగమైంది.

అలెగ్జాండర్ భారత ఉపఖండాన్ని జయించాలన్న కాంక్షతో బాబిలోనియా వరకు వచ్చి తిరుగుముఖం పట్టాడు. మార్గ మధ్యంలో తీవ్రంగా జబ్బుపడి క్రీ.పూ. 323 లో మరణించాడు. వారసులు లేకపోవడంతో ఆయన సామ్రాజ్యాన్ని అతడి ముగ్గురు సేనానులు పంచుకున్నారు. అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని, గ్రీకు, ఈజిప్టు, ఆసియాలుగా విభజించి సేనానులు టోలెమి, యాంటిగోన్స్, సెల్యూకస్ పంచుకున్నారు.

ఆవిధంగా ఆసియా భూభాగం సెల్యూకస్కు దక్కగా చంద్రగుప్తుడు దానిని గెలుచు కున్నాడు. సెల్యూకస్తో వచ్చిన మెగస్తనీస్ అనే గ్రీకు దౌత్యవేత్త చంద్రగుప్తుని గురించి, ఆయన సామ్రాజ్యం గురించి చాలా చక్కగా వ్రాశాడు. చంద్రగుప్తుడు జైనమతాన్ని స్వీకరించాడు.


బింబిసారుని పాలన
క్రీ.పూ. 297 లో చంద్రగుప్తుడు తన కుమారుడు బింబి సారునికి రాజ్యం అప్పగించి విశ్రమించాడు. జైనుల పవిత్ర స్థలమైన కర్ణాటకలోని శ్రావణబెళగొళకు వెళ్లి అక్కడ ఆ మత సంప్రదాయం ప్రకారం క్రమక్రమంగా ఆహారాన్ని విడిచిపెట్టి కృశించి క్రీ.పూ. 298 లో మరణించాడు. తండ్రి నుంచి సంక్రమించిన సామ్రాజ్యాన్ని బింబిసారుడు చక్కగా సామరస్యంతో పాలించాడు.

బింబిసారుడు మౌర్య సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరింపజేశాడు. రెండు సముద్రాల మధ్య భూభాగాన్ని అనగా అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్యభాగాన్ని బింబిసారుడు జయించాడని చెబుతారు. బింబిసారుడు క్రీ.పూ. 272 లో మరణించాడు. అప్పటికి దాదాపు మొత్తం భారత ఉపఖండ భాగం మౌర్య సామ్రాజ్య ఛత్రం క్రిందికి వచ్చింది.

దక్షిణాది మొత్తం ఎటువంటి ప్రతిఘటన లేకుండా లొంగి పోయింది. కాని తూర్పుతీరంలోని కళింగ (ఇప్పటి ఒడిషా – అప్పటి ఒరిస్సా) సామ్రాజ్యం మాత్రం లొంగలేదు, ప్రతిఘటిం చింది. బింబిసారుడి సామ్రాజ్య విస్తరణ రథాన్ని ముందుకు సాగనీయ లేదు. ఆయన కుమారుడు అశోకుడు తీవ్ర రక్తపాతం తరువాత కళింగ యుద్ధ విజేత అయ్యాడు.


Samrat Ashok పుట్టుక
Samrat Ashok జననం గురించి ఒక గాథ ప్రచారంలో ఉంది. ఆయన తల్లి పేరు సుభద్రాంగి. ఆమె ఒక పేద బ్రాహ్మణుని కుమార్తె. మహా అందగత్తె. ఒకరోజు ఓ జ్యోతిష్కుడు ఆ ఇంటికి వచ్చాడు. సుభద్రాంగిని చూసి ఆమె ఒక చక్రవర్తి భార్య అవుతుందని జోస్యం చెప్పాడు. సుభద్రాంగి పెరిగి పెద్దకావడంతో రాజు
ఆ బ్రాహ్మణుడు తనవద్ద ఉన్న నగనట్రతో అలంకరింపజేసి బింబిసారుడి వద్దకు ఆమెను తీసుకెళ్లి, ఆయనకు కానుకగా అర్పించాడు.

రాజు ఆమెను తన అంతఃపురంలో చేర్చుకున్నాడు. ఆమెను చూసి రాణులు అసూయచెందారు. రాజుకు ఆమె యధాతథంగా చేరువ అయితే ఆయన ఆమెను అమితంగా మోహించి పట్టపురాణిని చేసుకుంటాడని, తమను బొత్తిగా గమనించకుండా మరచిపోతాడని వారు భయపడ్డారు. అలా జరగకుండా చేయడానికి ఒక ఎత్తుగడ పన్నారు. సుభద్రాంగికి క్షౌరకళ నేర్పించారు. బింబిసారుడి తల, గడ్డం కత్తిరించి దువ్వి ముస్తాబు చేయడం కోసం పంపించారు. అయితే ఆ ఎత్తు పారలేదు.

బింబిసారుడు ఆమెను పనిగత్తెగా మాత్రమే పరిగణించి ఉపేక్షించడానికి బదులు ఆమెపట్ల విశేషంగా ఆకర్షితుడయ్యాడు. ఆమె ప్రవర్తనతో, ఆమె అందంతో ఎంతో సమ్మోహపడిన ఆయన ఆమెతో చనువుగా వ్యవహరించడం ప్రారంభించాడు.

బింబి సారుడు ఒకరోజు ఆమెను ఒక ప్రశ్న అడిగాడు – ఈ ప్రపంచంలో నీవు ఎక్కువగా కోరుకునేది ఏమిటి అని! అందుకు ఆమె తనకు ఒక కొడుకు కావాలని కోరింది. దానికి బింబిసారుడు బదులిస్తూ తాను క్షత్రియ చక్రవర్తినని, ఒక క్షురక బాలికను ఎలా పెళ్లాడగలనని ప్రశ్నించాడు. అందుకు ఆమె ‘నేను క్షురక కులస్థురాలిని కాను, బ్రాహ్మణ బిడ్డను. నా తండ్రి మీకు భార్యగా ఉండేందుకు నన్ను అర్పించాడు’ అని చెప్పింది.

దాంతో బింబిసారుడు ఆమెకు క్షురక వృత్తి ఎందుకు, ఎవరు నేర్పిం చారో, దాని వెనుక ఉన్న పన్నాగమేమిటో విచారించి తెలుసు కున్నాడు. ఆ క్షణం నుంచి ఆమెచేత ఆ పనిని మాన్పించాడు. మిగతా రాణులు భయపడినట్లే సుభద్రాంగిని తన పట్టపురాణిగా చేసుకున్నాడు.

కొంతకాలానికి క్రీ.పూ. 294 లో బింబిసారుడి వల్ల ఆమె ఒక కొడుకుని కన్నది. ఆమె కోరిక నెరవేరింది. భావిభారత ఉపఖండాన్ని పరిపాలించి, అహింసా ధర్మాన్ని, సర్వ మత సామరస్యాన్ని నెలకొల్పే ఒక మహాచక్రవర్తికి జన్మనిచ్చింది. ఆ బాలుడికి ఏమి పేరు పెడదాము అని బింబిసారుడు సుభద్రాంగిని అడిగాడు. ఆమె తడుముకోకుండా అశోకుడు అని సూచించింది.


Samrat Ashok ని ధైర్యసాహసాలు

Samrat Ashok చిన్నతనంలోఎంతో చురుకుగా ఉండేవాడు. కొంటెతనాన్ని ప్రద ర్శించేవాడు. హుందాగ
ఉండేవాడు. ధైర్య సాహసాలు కలిగి ఉండేవాడు. రాజ్యపాలన, సామ్రాజ్యం ఆయనకు ఉగ్గుపాలతో అబ్బిందా అనిపించేవాడు. ఆ విషయంలో అతనికి సాటి మరి ఏ యువకుడు ఉండేవాడు కాదు. అందుచేత చిన్న తనంలోనే ఆయనను కాబోయే చక్రవర్తిగా అందరూ పరిగణించేవారు.

SAMRAT ASHOK DARE,

మంత్రులు, సామంతులు గౌరవించే వారు. కొడుకు సామర్థ్యం, ధైర్యసాహసాలు గమనించిన చక్రవర్తి బింబిసారుడు యవ్వనం రాగానే అవంతి రాజ్యపాలన బాధ్యత లను అప్పగించాడు. అవంతికి రాజధాని ఉజ్జయిని. అది విజ్ఞానానికి, సంపదకు, కళలకు నిలయం. అందమైన నగరం. అవంతి రాజ్య పాలన పగ్గాలు చేపట్టిన కొద్దిరోజులకే Samrat Ashok తిరుగులేని తెలివైన పాలకుడనే పేరుతెచ్చుకున్నాడు.


తక్షశిల తిరుగుబాటు
మగధ పాలనపై ఆ రాజ్యంలోని తక్షశిలలో తిరుగుబాటు తలయెత్తింది. దానిని అణిచివేయడానికి బింబిసారుడు తన పెద్ద కొడుకు సుషీమను పంపించాడు. ఆయన అందులో ఘోరంగా విఫలమయ్యాడు. తిరుగుబాటు తగ్గుముఖం పట్టలేదు. తక్షశిల ప్రజలు ఆగ్రహోదగ్రులై ఉన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం, రాజును ధిక్కరించడం కొనసాగించారు. దానితో చక్రవర్తి బింబి సారుడు అశోకుని రంగంలోకి దింపాడు. తక్షణమే తక్షశిల వెళ్లి పరిస్థితిని దారిలోకి తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించాడు.

Samrat Ashok తనవద్ద గల పరిమిత బలగంతోనే బయలుదేరాడు. ధైర్యంగా ముందడుగు వేశాడు. అశోకుడే తరలివస్తున్నాడన్న సమాచారం తక్షశిల ప్రజలకు తెలిసింది. ఆ పరిణామాన్ని వారు ఊహించలేదు. అప్పటికే అశోకుడు అత్యంత సమర్థుడైన పాలకుడనే అభిప్రాయం, ఆయనపట్ల గౌరవం వారిలో నాటుకొని ఉన్నాయి.

తక్షశిల పాలనాధికారులు అసమర్థత వల్లనే వారు తిరుగుబాటుకు నడుంకట్టారు. అశోకుని నాయకత్వంలో తమ బాధలు తొలగుతాయన్న ఆశలు వారిలో చిగురించాయి. దానితో తిరుగుబాటుకు స్వస్తిచెప్పి అశోకుడికి ఎదురేగి పూలమాలలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. “మాకు చక్రవర్తి బింబిసారుడు మీద గానీ, రాజకుటుంబం మీద గానీ ఎటువంటి ద్వేషం లేదు.

తెలివి లేని అసమర్థులైన మంత్రులే దీనికంతటికి కారణం. వారి మూలంగానే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. మేము తిరుగు బాటుదారులంకాము. క్రమశిక్షణ గల పౌరులం. మమ్మల్ని క్షమించండి” అని వారు అశోకుడిని వేడుకున్నారు. తక్షశిల తిరుగుబాటును సద్దుమణిగించడంతో అశోకుడి సామర్థ్యం మరింతగా నిరూపణ అయ్యింది. ఆయన చాకచక్యాన్ని రాజ్య మంతా మెచ్చుకున్నది. దానితో మగధరాజ్య భావి పాలకుడుగా ఆయననే గుర్తించడం ప్రారంభించారు.


బింబిసారుని మరణం
రోజులు, సంవత్సరాలు గడిచిపోయాయి. చక్రవర్తి బింబిసారుడికి వయస్సు పైబడింది. ముసలివాడయ్యాడు. ఆరోగ్యం క్షీణించింది. శరీరం నీరసించింది. ఆయన మంత్రులలో ముఖ్యుడు రాధాగుప్త. ఆయన, ఇతర మంత్రులు చక్రవర్తి ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. రాజ్య భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టారు.

చక్రవర్తి పెద్దకొడుకు సుషీమ సామర్థ్యం మీద వారికి బొత్తిగా నమ్మకం లేదు. ఆయనకు అధికారం అప్పగిస్తే మంచి జరగదు, రాజ్యం వర్ధిల్లదు, కుక్కలు చింపిన విస్తరి అవుతుంది, సామంతులు తిరగబడతారు, పర రాజులు పడగ విప్పుతారు అని వారు ఎంతగానో భయపడ్డారు. అశోకుడిని రప్పించి రాజ్య పాలన బాధ్యతలు అప్పగించడమే. ఏకైక మార్గమని వారు ఒక నిర్ణయానికి వచ్చారు. తండ్రి ఆరోగ్యం క్షీణిస్తున్న సంగతి ఆయనకు తెలియజేస్తూ వెంటనే పాటలీ పుత్రానికి రావలసిందిగా కబురంపారు.

బింబిసారుడు క్రీ.పూ. 272 లో మరణించాడు. ఆ తరువాత క్రీ.పూ. 268 లో అశోకుడు అధికారికంగా రాజ్యపాలన భారాన్ని స్వీకరించాడు. జ్యేష్ఠ మాసం ఐదవ రోజున పట్టాభిషేకం జరిగింది. ఆలోగా ఒక రోజున తండ్రి బింబిసారుని మరణవార్త విన్న పెద్ద కొడుకు సుషీమ అశోకుడి పైకి దండెత్తి వచ్చాడు.

అయితే ఆయన పాటలీపుత్రం నగర ప్రవేశం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే మగధ సైనికులు ఆయనను చంపివేశారని ప్రచారంలో ఉంది. రాజ్య భద్రత కోసం అశోకుడే తన సోదరులను, దాయాదులందరినీ చంపివేయించాడన్న గాథ కూడా ఒకటున్నది. అయితే దీనికి ఆధారాలు లేవు. ఇందుకు విరుద్ధంగా అశోకుడు తన సోదరులు, దాయాదుల గురించి ఎంతో మంచిగా శాసనాలపై వ్రాయించాడు.

SAMRAT ASHOKని పాలనా సామర్థ్యానికి మగధ రాజ్య ప్రజలు మురిసి ప్రార్థన, అల్పాహారం ముగించుకుని 10.30 గం.లకు సామ్రా జ్యానికి సంబంధించిన అధికారులను కలుసుకోవడం, అనేక విషయాలపై ఆదేశాలు జారీ చేయడం.


Samrat Ashok ని సంక్షేమ పాలన
‘ప్రజల సంక్షేమమే నా పరమావధి. వారికోసం పని చేయడమే నా పరమధర్మం. నేనెక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏవేళనైనా అధికారులు నన్ను కలుసుకుని ప్రజల యోగక్షేమాలు నాకు తెలియజేయాలి. వారికి ఎటువంటి ఆపద, అవాంతరం కలిగినా నా దృష్టికి తేవాలి’ అని అశోకుడు తన అధికారులకు ఇచ్చిన ఆదేశాలే ఆయనలోని ప్రజా సేవాతత్పరతకు తిరుగులేని తార్కాణం.

రాజ్య సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమ వికాసాలకు అశోకుడు విశేష ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. ‘స్వర్ణ యుగాని’కి నిలువుటద్దంలా, అచ్చం ‘రామరాజ్యం’ లా నిలిచింది. ఆయన పాలన. బాటసారుల కోసం రోడ్లకిరువైపులా మొక్కలు నాటించాడు, బావులు త్రవ్వించాడు, వారి క్షుద్బాధ (ఆకలి) ను తీర్చడానికి, విశ్రమించడానికి ధర్మసత్రాలు నెలకొల్పాడు.

మనుషు లకే కాదు నోరులేని మూగజీవాలకు సైతం వైద్యశాలలు నిర్మించిన అరుదైన చక్రవర్తి అశోకుడు. ప్రపంచంలోనే మొట్టమొదట పశువుల ఆసుపత్రులు నెలకొల్పిన చక్రవర్తి ఆయన. అడవులలో నివసించే వారు సైతం సుఖసంతోషాలతో ఎటువంటి ఆపదలు లేకుండా బతకాలన్న పరమాశయంతో అశోకుని పాలన సాగింది.

పాలనా వ్యవస్థ – అధికార వికేంద్రీకరణ
పాలనా సౌలభ్యం కోసం అశోకుడు తన రాజ్యాన్ని నాలుగు రాష్ట్రాలుగా, రాష్ట్రాలను జిల్లాలుగా, జిల్లాలను కొన్ని గ్రామాలతో కూడిన ఉప పాలనా విభాగాలుగా విభజించి, గ్రామాన్ని అట్టడుగు పునాది పాలన వ్యవస్థగా తీర్చిదిద్దాడు. విద్యారంగానికి ఎంతో విలువ ఇచ్చాడు. మగధ సామ్రాజ్యంలోని సుప్రసిద్ధ నలంద విశ్వవిద్యాలయాన్ని అశోకుడే నెలకొల్పాడు. ఆ విశ్వవిద్యాల యంలో చదువుకున్న వారికి ఆరోజులలో ఎంతో గౌరవం ఉండేది.


వాణిజ్యాభివృద్ధి – రోడ్లు
సముద్రమార్గంలో అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్స హించాడు. పరిశ్రమలు, వ్యవసాయం అభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇచ్చాడు. వాటి వికాసం కోసం పెద్ద పెద్ద రోడ్లను నిర్మింపజేశాడు. ఔషధమొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చాడు. అశోకుని పాలనలో భూమి వివరాలు, జనాభా లెక్కల సేకరణ, పశుగణనకు ప్రత్యేక అధికారులుండేవారు. పన్నుల వసూలు, ఆదాయ వ్యయాల రికార్డుల నిర్వహణ పకడ్బందీగా జరిగేవి.

ప్రజల నుంచి సమర్థులైనవారిని ఎంచుకుని అధికారులుగా, ఉద్యోగులుగా నియమింపజేసేవాడు. SAMRAT ASHOKని పాలనలో నగర పాలన నిర్వహణకు సమగ్ర వ్యవస్థ ఉండేది. చాలా నేరాలకు జరిమానాలతోనే సరిపెట్టేవారు. అతిపెద్ద నేరాలకు మాత్రమే ఉరిశిక్షలుండేవి.కళింగ యుద్ధం SAMRAT ASHOK చరిత్రలో కళింగ యుద్ధం అతి ప్రధానమైన ఘట్టం.

చక్రవర్తిలో మహా పరివర్తనకు కారణమైన అధ్యాయం. అశోకుని పాలన 12 సంవత్సరాలు సాగిన తరువాత తండ్రి తాతల మాదిరిగా SAMRAT ASHOKనే కూడా సామ్రాజ్య విస్తరణకు సంకల్పిం చాడు. తండ్రి బింబిసారుడు జయించలేకపోయిన కళింగ సామ్రాజ్యం మీద దృష్టి సారించాడు. దానిని జయించి స్వాధీనం చేసుకోవాలని దీక్షవహించాడు. లొంగిపోవలసిందిగా కళింగ రాజుకు కబురంపాడు.

అతడందుకు నిరాకరించాడు. పర్యవ సానంగా క్రీ.పూ. 261 లో అశోకుడు అతి పెద్ద సైన్యంతో కళింగ రాజ్యం మీదకి దండెత్తాడు. స్వేచ్ఛాప్రియులైన కళింగ ప్రజలు రాజుకు అండగా నిలిచారు. దేహదారుఢ్యం, పోరాట పటిమ ఉన్న ప్రతి ఒక్క పౌరుడు యుద్ధంలో పాల్గొన్నాడు. ప్రాణాలకు తెగించి సమరరంగంలో దూకారు.

SAMRAT ASHOK సైన్యానికి మగధ సైనికులు నిహతులయ్యారు. 0.15 మిలియన్ కళింగులు యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. కళింగ రాజు స్వయంగా సైన్యానికి సారథ్యం వహించాడు. తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి కళింగులు సాగించిన ఈ ప్రతిఘటన యుద్ధం చరిత్రలో కనీవిని ఎరుగనిది. చివరి శ్వాస వరకు వారు పోరాడారు.

అయితే ఎడతెగని యుద్ధ మరణాలతో కళింగ సైన్యం సంఖ్యాబలం సన్నగిల్లిపోయింది. ఓటమి తప్పలేదు. పరాయి పాలకుల క్రింద బ్రతకడం కంటే పోరాడి చావడమే మేలని భావించి చెప్పనలవి కానంత స్వాతంత్ర్యేచ్ఛతో కళింగులు సాగించిన వీరోచిత పోరాటం, వారి ఆత్మబలిదానం అశోకునిలో తీవ్ర ఆలోచనను, మథనాన్ని కలిగించాయి.

అత్యంత సాహసి, యుద్ధోన్మాది అయిన SAMRAT ASHOKచక్రవర్తిలో పరిపూర్ణమైన హృదయ పరివర్తనను, యుద్ధ వైముఖ్యాన్ని, అహింసా దీక్షను పాదుకొల్పిన ఇటువంటి సందర్భం చరిత్రలో మరొకటి లేదు.రక్తసిక్త యుద్ధ క్షేత్రం – అశోకునిలో మార్పుకళింగ యుద్ధ క్షేత్రం పరమ భయానకంగా తయారైంది.

అంతటా చెల్లాచెదురైన సైనికుల మృతదేహాలు, ఖండితాంగాలు, వాటిపై వాలుతున్న రాబందులు, బాధతో మూలుగుతున్న క్షతగాత్రులు, మృతులపై పడి అంతులేకుండా రోదిస్తున్న వారి స్వీకరించాడు. ఇతర విజేతల మాదిరిగా గెలుచుకున్న ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను హీనంగా చూసే ధోరణికి అశోకుడు ఏమాత్రం చోటివ్వలేదు. కళింగులను కక్షతో చూడకుండా, ప్రేమతో అక్కున చేర్చుకోవాలని సంకల్పించాడు.

సాదరంగా, సగౌరవంగా చూడాలని సంకల్పించుకున్నాడు. అక్కడి ప్రజలకు ఎటువంటి హాని కలుగనియ్యరాదని తన అధికారులను గట్టిగా ఆదేశించాడు. వారి యోగక్షేమాలకు అవసరమైనంత ధనాన్ని వెచ్చించాలని సూచించాడు. కళింగ భూభాగంలో ఒక శాంతి స్తూపాన్ని కూడా అశోకుడు నెలకొల్పాడు.

SAMRAT ASHOK STUMBAM,

కళింగ యుద్ధం తెచ్చిన పరివర్తనతో క్రీ.పూ.261లో ప్రచండ SAMRAT ASHOK కాస్త, ప్రశాంత ధర్మ అశోకుడుగా మారాడు. ఆవిధంగా ఆయన తన పేరును సార్ధకం చేసుకున్నాడు. తన సామ్రాజ్యాన్ని హింసా విషాదాలు లేని శాంతిధామంగా మార్చాడు.

KALINGA WAR,

ఇంకెప్పుడూ యుద్ధం జోలికి పోరాదని తీర్మానించుకున్నాడు. ఓటమిని చవి చూసిన రాజులు యుద్ధానికి దూరంకావడం వేరు, విజయ గర్వంతో ఊగిపోయి విర్రవీగవలసిన విజేత తాను చేసినది అపరాధమని తెలుసుకుని అహింసను ఆశ్రయించడం వేరు. ఇది ఒక్క అశోకుని విషయంలోనే జరిగింది. ప్రపంచ చరిత్రలో అనితర విశేష ఘట్టంగా నిలిచింది.

బౌద్ధమత స్వీకరణ
కళింగ యుద్ధం తనలో తీసుకువచ్చిన ఈ మార్పుతో రెండున్నర ఏళ్ల తరువాత అశోకుడు ఆచార్య ఉపగుప్తుని వద్ద బౌద్ధమతాన్ని స్వీకరించాడు. తీవ్ర అపరాధభావంతో కుమిలిపోతున్నSAMRAT ASHOK నిలో అహింస, అనుకంప, మానవాళిని ప్రేమించడం, స్వార్థాన్ని త్యజించడం అనే బుద్ధుని బోధనలు కర్తవ్య స్పృహను కలిగించాయి.

SAMRAT ASHOK SANCHI STUPAM,

తనతోపాటు తన ప్రజలు కూడా అహింసా మార్గం పట్టాలని, అలా పట్టేలా చూడాలని SAMRAT ASHOK సంకల్పించాడు. బౌద్ధమత ప్రచారం ద్వారానే అది సాధ్యమని భావించాడు. యుద్ధ విజయం ద్వారా పొందే ఆనందం తాత్కాలికమని, ప్రజలను మంచిమార్గంలో నడిపించే బౌద్ధధర్మ స్థాపన ద్వారా సాధించే ధర్మవిజయమే చిర ఆనందాన్ని కలిగిస్తుందని అశోకుడు నమ్మాడు.

యుద్ధం ద్వారా ప్రజలను లొంగదీసుకోవడం విజయం కాదని, కరుణతో, ప్రేమతో వారి హృదయాలను చూరగొన్నవాడే నిజమైన విజేత అని తెలుసు కున్నాడు. అటువంటి శాశ్వత విజయమార్గాన్ని పరిచిన బౌద్ధధర్మం తన వద్దనే, తనతోనే ఆగిపోరాదని SAMRAT ASHOK భావించాడు. అది నిలువనీరుగా ఒకచోట ఉండిపోరాదని కూడా తలచాడు. బుద్ధుని ధర్మ బోధనలను తన సామ్రాజ్య మంతట శిలాస్తూపాలపై చెక్కించాడు.

బౌద్ధధర్మ బోధనలతో, సంఘ నియమాలతో, నైతిక జీవన సూత్రాలతో ఈ స్తూపాలను నెలకొల్పాడు. ఈ చెక్కడాలు ఒక్క అశోకుని కాలానికే ప్రత్యేక మైనవి. ఇవి నేటి పాకిస్థాన్లోని పెషావర్, ఆఫ్ఘనిస్థాన్లోని కాందహార్లో, నేపాల్ సరిహద్దులలో కనిపిస్తాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీస్ ఘడ్, కర్ణాటక లోను ఇవి ఉన్నాయి.

చాలామంది రాజులు తమ విజయగాథలను శిలలపై చెక్కించారు. అశోకుడు మాత్రం ప్రజలను అసత్యం నుంచి సత్యానికి, చీకటి నుంచి వెలుగులోకి నడిపించడానికి ప్రభావవంతమైన ప్రచార సాధనాలుగా శిలలపై చెక్కడాల ప్రక్రియను ఉపయోగించాడు.

SAMRAT ASHOK తానవలంబించిన బౌద్ధమతానికి ఎంతటి ప్రాధాన్యం ఇచ్చాడో, ఇతర మతాల పట్ల కూడా అంతే ఆదరణతో వ్యవహరించాడు. సర్వమత సామరస్యాన్ని పాటించాడు. ఇతర మతాలవారిని గౌరవించడం ద్వారానే తమ మతాన్ని పెంపొందించుకోగలమని విజ్ఞతను ప్రజల్లో కలిగించాడు.

పరమత ద్వేషం తమ మతాన్ని కూడా నశింపజేస్తుందని హెచ్చరించాడు. ద్వేషం ద్వేషాన్నే సృష్టిస్తుందని, ప్రేమ ఒక్కటే ప్రేమను పెంచుతుందని చెప్పాడు. అందుకే ఇతర మతాలను ద్వేషించడం మానుకోవాలని, అన్ని మతాలు వర్ధిల్లిన నేలమీదనే సహజీవన స్వర్గం సాక్షాత్కరిస్తుందని చాటాడు, ఆచరించి చూపాడు. ఈ విషయాన్ని ఆయన శిలా శాసనాలపైన కూడా చెక్కించాడు.

ఈ మహదాశయాలను తన సామ్రాజ్యం లోపల, బయట ప్రచారం చేయడానికి ధర్మమహామాత్రలు అనే ప్రత్యేక అధికారులను అశోకుడు నియమించాడు. సిరియా, ఈజిప్టు, బర్మా, మాసిడోనియా, కాశ్మీర్లకు ఈ ధర్మప్రచారకులను పంపించాడు. ఈ పనిమీదనే తన సంతానం మహేంద్ర, సంఘమిత్రలను శ్రీలంకకు పంపాడు.

SAMRAT ASHOK స్వయంగా తన కుమార్తెను, ఆచార్య ఉపగుప్తను వెంట బెట్టుకొని బుద్ధుడు నివసించిన, సంచరించిన ప్రాంతాలన్నిటిని సందర్శించాడు. బుద్ధుడి మరణానంతరం ఆయన పవిత్ర అస్థికలను పోగుచేసి రామగ్రామం అనేచోట ఒక రాజు నిర్మించిన ప్రత్యేక స్తూపాన్ని దర్శించాడు.

ఇంతటి చరిత్ర సృష్టించిన అశోకుడు జీవిత చరమాంకంలో మనుమలు, వారి రాణుల మధ్య ఆస్తుల కోసం, అధికారం కోసం తలయెత్తిన కలహకాండను చూసి దిగులు చెందాడు. వాటి కారణంగా వార్ధక్యంలో ఎంతో వేదనను అనుభవించాడు. తన ఆచార్యుడు ఉపగుప్తునితో కలిసి బౌద్ధ భిక్షువుగా సంచారం చేసి తక్షశిలలో స్థిరపడ్డాడు. 73వ ఏట కన్నుమూశాడు

బుద్ధుని అష్టాంగమార్గం
SAMRAT ASHOK తన సామ్రాజ్యమంతటా బుద్ధుని బోధనలను విరివిగా ప్రచారం చేశాడు. బుద్ధుడు ప్రముఖంగా బోధించిన అష్టాంగ జీవన మార్గ సూత్రాలను శిలలపై చెక్కించాడు. అవి : 1. సమ్యక్ (సరియైన) దృక్పథం : బుద్ధుడు చెప్పిన నాలుగు చిరసత్యాలను సవ్యంగా అర్థంచేసు కోవడం.

సమ్యక్ కోరిక : బంధం నుంచి, అజ్ఞానం నుంచి, అసూయా ద్వేషాల నుంచి విమోచన కోరుకోవడం. 3. సమ్యక్ వాక్కు : అబద్ధమాడకపోవడం, అనవసర సంభాషణ చేయకపోవడం, ఇతరులను గాయపరిచే విధంగా మాట్లాడకుండా ఉండడం.

సమ్యక్ ఆచరణ : చంపడం, దొంగిలించడం, అక్రమ లైంగికచర్య వంటివాటికి పాల్పడకుండా ఉండడం. 5. సమ్యక్ ఉపాధి సాధనం : జంతువులతో సహా ఎవరికీ హాని కలిగించని రీతిలో ఉపాధి కోసం పాటుపడడం.

సమ్యక్ ధ్యానం : అశాశ్వతత్వాన్ని, అవిభాజ్యతను గురించి పరిపూర్ణంగా అర్థంచేసుకునేందుకు దోహదం చేసే మనోకేంద్రీకరణ.

సమ్యక్ కృషి : చెడుమార్గాన్ని విడిచిపెట్టి మంచి దారిని అవలంబించడం.

సమ్యక్ జ్ఞాపకం : చెడుని మర్చిపోయి, మంచిని గుర్తుంచుకోవడం.

సమ్యక్ కృషి : చెడుమార్గాన్ని విడిచిపెట్టి మంచి దారిని అవలంబించడం.

సమ్యక్ జ్ఞాపకం : చెడుని మర్చిపోయి, మంచిని గుర్తుంచు
కోవడం.
బౌద్ధ మండలులు
SAMRAT ASHOK పాలన 17 సంవత్సరాలు గడిచిన తర్వాత బౌద్ధ సన్యాసులలో, సంఘాలలో చిచ్చు రగిలింది. అభిప్రాయభేదాలు పొడసూపాయి. చక్రవర్తి స్వయంగా బౌద్ధాన్ని స్వీకరించడంతో ఆయన నుంచి, ఆయన అధికారుల నుంచి మేలు పొందగోరే వారు స్వార్ధ దృష్టితో బౌద్ధంలో చేరడం ప్రారంభించారు. అటువంటి వారి వల్ల బౌద్ధ సంఘాలు భ్రష్టుపట్టిపోవడం మొద లైంది.

చాలామంది సోమరులు, భోగలాలసులైన సన్యాసులు, సన్యాసినుల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. దీనిని చూసి అశోకుడు ఎంతగానో బాధపడ్డాడు. బౌద్ధానికి పూర్తిగా గ్రహణం పట్టకుండా చూడడానికి సంకల్పించాడు. అనేకమంది దొంగ సన్యాసులను గుర్తించి బయటకు పంపించివేశాడు.

పాటలీపుత్రలోని అశోకా రామానికి నిజాయితీపరులు, నిబద్ధులు అయిన అనేకమంది ప్రసిద్ధ బౌద్ధ సన్యాసులను రప్పించాడు. వారితో మూడవ బౌద్ధమండలిని సమావేశపరిచాడు. అశోకుడి ముందు రెండు బౌద్ధ మండలులు సమావేశమయ్యాయి. బుద్ధుడి బోధనలకు తుప్పు పట్టకుండా, అవి కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు వాటిని సజీవంగా ఉంచే పరమోద్దేశంతో ఈ సమావేశాలు జరిగాయి.

SAMRAT ASHOK ని ఆధ్వర్యంలో పాటలీపుత్రలో జరిగిన మూడవ బౌద్ధమండలి సమావేశానికి మొగలిపుత్రతిష్య అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో అశోకుడు స్వయంగా పాల్గొ న్నాడు. ప్రతి సన్యాసిని పిలిచి బుద్ధుడు ఏమి బోధించాడు? అన ప్రశ్నించాడు. దానితో బుద్ధుని అసలు బోధనలు పరి పూర్ణంగా మరొకసారి వెలుగులోకి వచ్చాయి.

ఈ సమావేశంలో వినయ, ధర్మ, అభిధర్మ అనే మూడు ధర్మాలను త్రిపిటకాలుగా సూత్రీకరించారు. వినయ, ధర్మపిటకాల మధ్య తలయెత్తిన విభేదాలను వివరించి అనుమానాలు తొలగించడానికి రూపొం దిన కొత్త ధర్మమే అభిధర్మ. ఈ సమావేశంతో బౌద్ధానికి మళ్లీ కొత్త జవసత్వాలు కలిగాయి. పర రాజ్యాలను జయించడానికి సైన్యాలను పంపించే పద్దతిని అశోకుడు తీవ్రంగా వ్యతిరేకిం చాడు. ధర్మానికి సంక్రమించే విజయమే నిజమైన విజయమని చెప్పాడు.

SAMRAT ASHOK నిర్మింపజేసిన మొత్తం స్తూపాలు 84,000. సాంచిలోని 54 అడుగుల ఎత్తైన స్తూపం ఇప్పటికీ చెక్కుచెదర లేదు. సారనాద్లో ఇసుకరాతి స్తంభం మీద 4 నిలుచున్న సింహాలను పైభాగంలో చెక్కారు. దాని క్రింద అశోకచక్రాన్ని ముద్రించారు. ఈ చక్రాన్ని భారత జాతీయపతాకం మీద చూడవచ్చు.

భారత ప్రజానీకం అశోకునికిచ్చిన అసాధారణ గౌర వానికి అది చిహ్నం.అశోక చక్రంమన జాతీయ జెండాను అలంకరించిన అపురూప చిహ్నం అశోక చక్రం. ఇందులోని ఆకులు 24. ఈ చక్రం అశోకుడు తన సామ్రాజ్యమంతటా నెలకొల్పిన అనేక స్తూపాలు, శిలా శాసనాల మీద కనిపిస్తుంది. అందుకే దీనికి అశోక చక్రమని పేరు. అశోకుడు తన హయాంలో (క్రీ.పూ. 273-232) సారనాథ్ నెలకొల్పిన అశోక స్తంభంలో దీనిని ముద్రించాడు.

SAMRAT ASHOK CHAKRAM,

స్వాతంత్ర్యానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ జెండా మీద ఉన్న చరఖా (రాట్నం) స్థానంలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జాతీయజెండా మీద అశోక చక్రం వెలిసింది. అశోక చక్రం కలిగిన జాతీయ జెండాను 1947 జులై 22 న రాజ్యాంగ సభ అధికారికంగా ఆమోదించింది. ఈ చక్రం నేపథ్యంలో తెలుపు రంగు ఉంటుంది. దానిపైన నీలి ఊదారంగులో చక్రం ఉంటుంది. ఇసుక రాతిమీద చెక్కించిన నాలుగు సింహాల చిహ్నం అశోక చక్రం పైభాగంలో ఉంటుంది. దీనిని క్రీ.పూ.250లో నిర్మించారు. ఇది సారనాథ్ ఇప్పటికీ ఉంది.https://www.facebook.com/share/r/1BtjKaGKTx/

బుద్ధుడు గయలో నిర్వాణం (జ్ఞానోదయం) పొందిన తరువాత ఆయన వారణాసి నగర శివారులలోని సారనాథ్కు వచ్చాడు. అక్కడ అశ్వధీర్, మహానామ్, కౌండిన్య, భద్రక్, కశ్యప్ అనే పేర్లు గల తన ఐదుగురు పాత శిష్యులను (పంచవర్గీయ భిక్షుకులు) కలుసుకున్నాడు. వారు అంతకు ముందు ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయన తన మొట్టమొదటి నీతిని వారికి అక్కడ బోధించాడు. ధర్మచక్ర ప్రబోధాన్ని గావించాడు. అందుకే ఈ చక్రాన్ని అశోకుడు తన శిలా శాసనాలపై

ప్రముఖంగా చెక్కించాడు. ధర్మచక్రం రూప, చిహ్నాలే అశోక చక్రంగా అవతరించాయి. దీనిని సమయ చక్రం అని కూడా అంటారు. రోజుకి 24 గంటలు. ఈ చక్రంలోని 24 ఆకులు 24 గంటలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అందుకే దీనిని కాలచక్రం అని కూడా అంటారు. ఈ 24 ఆకులలో 12 బుద్ధుడు బోధించిన సాధారణ బంధాలు, వాటి చిహ్నాలుగా పరిగణించబడుతున్నాయి.


అవి :

1. అవిద్య : జ్ఞానం లేకపోవడం, చిహ్నం : తడుము కుంటూ నడుస్తున్న గుడ్డి వ్యక్తి.

  1. సంస్కార : నిర్మాణాత్మక చర్య, చిహ్నం : కుండను రూపొందిస్తున్న వృత్తి కుమ్మరి.
  2. విజ్ఞానం : చైతన్యం, చిహ్నం : పండును పట్టుకో బోతున్న మనిషి లేదా కోతి.
  3. నామరూప : పేరు, రూపం, చిహ్నం : ఒక నావలో పయనిస్తున్న ఇద్దరు వ్యక్తులు.
  4. సదయతన : ఆరు ఇంద్రియాలు (కన్ను, చెవి, ముక్కు, నాలుక, శరీరం, మనసు), చిహ్నం : ఆరు కిటికీలుగల ఇల్లు.
  1. స్పర్శ : తాకిడి, చిహ్నం : పరస్పరం కౌగిలిలో
    ప్రేమికులు.
  2. వేదన : బాధ, చిహ్నం కంటికి గురిపెట్టిన
    ఉన్న
    బాణం.
  3. తృష్ణ : దాహం, చిహ్నం : నీటిని తాగుతున్న వ్యక్తి.
  4. ఉపాదన : గ్రహించడం, చిహ్నం : మనిషి లేదా కోతి పండును తెంపుకోవడం.
  5. భవ : ఒక స్థితిని పొందడం, చిహ్నం : సంగమిస్తున్న
    దంపతులు.
  6. జతి : పుడుతున్న స్థితి, చిహ్నం : జన్మనిస్తున్న మహిళ.
  7. జరామరణ : ముసలితనం, చావు, చిహ్నం : శవాన్ని మోసుకుని వెళ్తున్న దృశ్యం.
    అశోకచక్రంలోని ఈ 12 ఆకులు చక్రం ద్వితీయార్ధంలో మళ్లీ వరుసకడతాయి. ఆవిధంగా మొత్తం 24 అవుతాయి. ఇవి అన్నీ కలిసి జీవన చక్రంగా రూపొందాయి
    అశోక చక్రం గురించి భారత తొలి ఉపరాష్ట్రపతి డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇలా చెప్పారు ‘హిందూమతం ప్రకారం గాయత్రి మంత్రశక్తిని 24 మంది ఋషులు కలిగి ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి.

హిమాలయాలలో జపతపాలు చేసుకునే ఈ 24మంది ఋషులకు గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ధర్మచక్రంలోని 24 ఆకులు ఈ 24 మంది ఋషులకు ప్రతీకలు. వీరిలో మొదటి వాడు విశ్వామిత్రుడు. ఆఖరివాడు యాజ్ఞవల్క్యుడు. వీరు మతాన్ని (ధర్మం) కాపాడుతారన్నది హైందవుల విశ్వాసం.’
అశోక చక్రంలోని 24 ఆకులు వరుసగా ఈ క్రింది.గుణగణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి.

1. ప్రేమ

  1. ధైర్యం
  2. ఓర్పు (సహనం)
  3. శాంతి
  4. ఔదార్యం
  5. మంచితనం
  6. విశ్వాసం
  7. మృదుస్వభావం
  8. స్వార్థం లేకపోవడం
  9. ఆత్మనిగ్రహం
  10. ఆత్మత్యాగం
  11. సత్యం
  12. సచ్ఛీలత
  13. న్యాయం
  14. కరుణ
  15. హుందాతనం
  16. వినయం
  17. సహానుభూతి
  18. జాలి
  19. దివ్యజ్ఞానం
  20. నైతికవిలువలు
  21. ఆధ్యాత్మిక విద్య
  22. దైవభీతి
  23. నమ్మకం లేదా ఆశ
    జాతీయ పతాకం
    జాతీయ జెండాలోని కాషాయం పరిత్యాగానికి గుర్తు. మన నాయకులు పాదార్థిక ప్రయోజనాలను ఆశించకుండా విధ్యుక్త ధర్మానికి కట్టుబడి ఉండాలని చాటేది.జెండాలో మధ్యన గల తెలుపు రంగు కాంతికి చిహ్నం. అది మనలను నడిపించే సత్యమార్గం. జెండాలోని ఆకుపచ్చ రంగు నేలకు సంబంధించినది. జీవులన్నీ ఆధారపడే వృక్షజాలానికి గుర్తు.

తెలుపు రంగు మధ్యలో ఉండే అశోక చక్రం శాసన లేక ధర్మచక్రం.ఈ జెండా నీడన బ్రతికేవారు, పనిచేసేవారు సత్యానికి,ధర్మానికి కట్టుబడి ఉండాలని ఈ ధర్మచక్రం చెపుతుంది. అలాగే చక్రం కదలికకు, చలనానికి చిహ్నం. కదలికలేని తనం చలనరాహిత్యం. చావుతో సమానం. కదలిక అంటే జీవితం, చైతన్యం. అది మార్పుకు సంకేతం.

భారతదేశం ఎన్నడూ మార్పును వ్యతిరేకించరాదు, వద్దనరాదు. నిరంతర చలనశీలిగాఉండాలి అనేదే చక్రం ఇచ్చే సందేశం. కదులుతూ ముందుకు సాగుతూ ఉండాలి. పురోగమిస్తూ ముందడుగు వేయాలి అనేదే దాని నీతి. అందుకే ఈ చక్రాన్ని శాంతియుత పరివర్తనకు గుర్తుగా పరిగణిస్తారు.

దేశంలోని వివిధ మతాలు, వర్గాలు పరస్పరం శాంతియుత సహజీవనం సాగిస్తూ, కలిసికట్టుగా జాతిని ముందుకు తీసుకొనివెళ్లాలన్నది అశోక చక్రం ఆశయం. మతాల మధ్య వైషమ్యాలు, పరస్పర అనుమాన భయాలు తలయెత్తి తరచూ ఘర్షణలు, హింస, రక్తపాతాలు, ప్రాణహాని కలుగుతూ దేశ ఆంతరంగిక భద్రతకు ముప్పు ఏర్పడుతున్న ఈరోజులలో అన్ని మతాలకు సమాన గౌరవమిచ్చి, వాటికి శాంతియుత సహజీవనాన్ని బోధించినSAMRAT ASHOK ని ఆదర్శపాలన గురించి విపులంగా తెలుసుకోవలసిన, నిరంతరం గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

Leave a Comment