Wonders of modern electronics
MODERN ELECTRONICS లో అలెగ్జాండ్రా వోల్టా మొదలు థామస్ అల్వా ఎడిసన్ దాకా విద్యుత్తు రంగంలో అగ్రగామి పరిశోధనలు చేసిన వారంతా విద్యుత్తును గురించి, దాని వాడకం గురించి అర్థం చేసుకునే ప్రయత్నాలు తీవ్రంగా చేశారు. అయితే విద్యుత్ ప్రవాహం అంటే నిజంగా ఏమిటని మాత్రం వారు అర్థం చేసుకోలేకపోయారు. వారి జీవితకాలమంతా విద్యుత్తు గురించే పరిశోధించినప్పటికీ ఇదే తీరు సాగింది. ఎన్నో రకాల పరిశోధనలు చేసిన ఎడిసన్ తెలియకుండానే ఈ విషయం గురించి కూడా తెలుసుకున్నాడు కానీ, అతను దాన్ని పట్టించుకోలేదు

. తాను కనుగొన్న లైట్ బల్బ్ ఒక లోహపు రేకును, వెలుగుతున్న తీగ నుంచి కొంత దూరంలో ఏర్పాటు చేసినప్పుడు ఆ రెంటి మధ్యన విద్యుత్తు ప్రవహించడాన్ని అతను గమనించాడు. ఆ చర్యకు ‘ఎడిసన్ ఎఫెక్ట్’ అని పేరు. పడింది. మౌలిక విజ్ఞానశాస్త్రంలో ఆ మహత్తర ఆవిష్కర్త చేసిన ఏకైక అన్వేషణ అది ఒకటే. అయితే అప్పట్లో విజ్ఞానశాస్త్రం ఆ విషయానికి వివరణ మాత్రం ఇవ్వలేకపోయింది.

MODERN ELECTRONICS 1897లో జె.జె.థామ్సన్ ఎలెక్ట్రాన్ను కనుగొన్నప్పుడు పరిస్థితి మారింది. ఎలెక్ట్రాన్ అన్నదిఊహించలేనంత తక్కువ ద్రవ్యరాశి, ఋణవిద్యుదావేశం తక్కువగల చిన్న కణమని అతను నిర్ధారించాడు. రాగి, సత్తు మొదలయిన విద్యుద్వాహక పదార్థాల గుండా ఎలెక్ట్రాన్లు ప్రవహించడమే విద్యుత్తు ప్రవాహం. పోర్సెలిన్, రబ్బర్, కర్ర మొదలయిన పదార్థాలలో ఎలెక్ట్రాన్లు ప్రవహించవు, కనుక వాటిని నిరోధక పదార్థాలు అంటారు. ఇక సిలికాన్, జెర్మేనియం వంటి మరికొన్ని పదార్థాలున్నాయి.
అవి పైరెంటి మధ్యపరిస్థితిలో ఉంటాయి. కనుక వాటిని సెమీకండక్టర్స్ లేదా అర్థవాహకాలు అంటారు. ఇక అంతకుముందు అగ్రగామి పరిశీకులు అనుకున్న పద్ధతికి వ్యతిరేకంగా విద్యుత్ప్రవాహం సాంప్రదాయికంగా ఋణధృవంగా పిలువబడుతున్న చోటినుంచి ధనధృవానికి చేరుతుందని కూడా గమనించారు.తరువాతి పరిశోధనలలో, విశ్వం మొత్తంలోని నిర్మాణాలకు ఆధారమయిన అణువులన్నింటిలోను కేంద్రకం ఉంటుందని, అందులో ఋణావేశంగ ప్రోటాన్లు, ఏ ఆవేశమూలేని న్యూట్రాన్లు ఉంటాయని తెలిసింది. కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఋణావేశంగల ఎలెక్ట్రాన్లు ఉంటాయని కూడా తెలుసు కున్నారు. ప్రోటాన్, న్యూట్రాన్లు, ఎలెక్ట్రాన్ల సంఖ్య వేరువేరు పదార్థాలలో వేరువేరుగా ఉంటుంది. హైడ్రోజన్లో మధ్యలో ఒకే ఒక్క ప్రోటాన్ ఉంటుంది.
దాని చుట్టూ తిరుగుతూ ఒక ఎలెక్ట్రాన్ ఉంటుంది. కానీ యురేనియం U లో 92 ప్రోటాన్లు, 143 న్యూట్రాన్లు కేంద్రకంలో ఉంటాయి. దాని చుట్టూ తిరుగుతూ 92 ఎలెక్ట్రాన్లు ఉంటాయి. ఏ పదార్థంలో నయినా ఎలెక్ట్రాన్లు, ప్రోటాన్ సంఖ్య సమానంగా ఉంటుంది. కనుక ఆ పరమాణువుకు విద్యుదావేశం ఉండదు. ఏదో ఒక కారణంగా వాటి చోటినుంచి ఎక్ట్రాన్లు పక్కలకు తొలిగితే పరమాణువుకు ధన ఆవేశం కలుగుతుంది. దాన్ని అప్పుడు’అయాన్’ అంటారు.
థర్మియోనిక్ వాల్వ్ లు
ఎలెక్ట్రానిక్స్ రంగంలో మొట్టమొదటి ప్రయోగాత్మకమయిన అంచె 1904లో డయోడ్ నిర్మించిన జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ అనే బ్రిటన్ దేశస్థుని వలన జరిగింది.

MODERN ELECTRONICS డయోడ్ అంటే లోపల శూన్యం కలిగి సీల్ చేయబడిన గాజుగొట్టం. దానిలోపల ఉండే ఫిలమెంట్ తీగను విద్యుత్తు సాయంతో వేడి చేస్తారు. అప్పుడు ఎలెక్ట్రాన్లు పుడతాయి. (కనుక ఋణఛార్జ్, కాథోడ్ ఏర్పడుతుంది.) తీగకు అంటే కాథోడ్కు కొంతదూరంలో ఒక ప్లేటు ఉంటుంది. అది ధన పొలారిటీ కలిగి ఉంటుంది (ఆనోడ్). రెండింటి మధ్యన ప్రవాహం ఏర్పాటవుతుంది. ఈ పరికరాన్ని శూన్యనాళిక (వ్యాక్యూమ్ ట్యూబ్) లేదా వాల్వ్ అని కూడా అంటారు. అందులో విద్యుత్తు ప్రవాహం ఋణధృవం నుంచి ధనధృవానికి నడుస్తుంది. అందులో ఋణధృవానికి అందించిన ఆల్టర్నేటింగ్ కరెంట్, డైరెక్ట్ కరెంట్గా మార్చే వీలు ఉంటుంది. ఎలెక్ట్రానిక్ పరికరానికి అదే మొట్టమొదటి ఉపయోగం.

MODERN ELECTRONICS అయితే అంతకన్నా ప్రధానమయిన మరొక అంచె 1906లో జరిగింది.లీ డి ఫారెస్ట్ అనే యుఎస్ఏ వాసి ట్రయోడ్ను కనుగొన్నాడు. ధన, రుణధృవాల మధ్యన అతను ఒక లోహగ్రిడ్ను ప్రవేశపెట్టాడు. అందులో తక్కువ వోల్టేజిని ప్రవేశపెట్టడం ద్వారా, ధన, ఋణ ధృవాల మధ్యన ప్రవహిస్తున్న పెద్దమొత్తం విద్యుత్తును క్రమపరిచే వీలు ఏర్పడింది. కనుక అది పనితీరు ప్రకారం ఆంప్లిఫయర్గా గుర్తింపబడింది. ఉదాహరణకు వయర్లెస్ సంకేతం బలహీనంగా ఉండి గ్రిడ్లోకి పంపబడినప్పుడు, కాథోడ్, ఆనోడ్ మధ్యన ప్రవహిస్తున్న పెద్ద ప్రవాహాన్ని కూడా క్రమపరచగలుగుతుంది.
ఈ రకంగా అది ఆంప్లిఫయర్గా పనిచేస్తుంది. కాలక్రమంలో మరిన్ని రకాలుగా పరికరాన్ని మెరుగు పరిచారు. అందులో రెండవ గ్రిడ్, మూడవ గ్రిడ్ వగైరాలను ప్రవేశ పెట్టారు. ఈ వ్యవస్థ రేడియోకు హృదయంగా మారింది. 1920 నాటి నుంచి మొత్తం ప్రపంచంలో భారీ ఎత్తున సమాచార ప్రసారాలకు ఇది తొలి మాధ్యమంగా నిలిచింది. భారతదేశంలో ఉన్న శ్రోతలు పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటన్లో జరుగుతున్న సంఘటనల గురించి కూడా బి.బి.సి వారి ప్రపంచవ్యాప్త సేవల ద్వారా ఎప్పటికప్పుడు వినగలుగుతారు.
MODERN ELECTRONICS రేడియో ద్వారా ప్రజలు అన్ని రకాల సంగీతాన్ని విని ఆనందించగలుగుతారు. మామూలు ప్రజలకు కూడా వార్తలు, విశ్లేషణలు అందుబాటులోకి వస్తాయి. కనుక ఈ ఆవిష్కరణతో మొత్తం ప్రపంచం ఒకటిగా మారింది. ఆ తరువాత వచ్చిన టెలివిజన్, ఇంటర్నెట్ లాంటి వాటితో ఈ కార్యక్రమం మరింత ముందుకుసాగింది.ఈ వ్యాక్యూమ్ ట్యూబ్ కారణంగా త్వరలోనే మరెన్నో ఉపయోగాలు కనిపించాయి.
వీటిలో అన్నిటికన్నా ప్రధానమయినది కంప్యూటర్. అప్పటి వరకు లెక్కల కొరకు యాంత్రికమయిన లేదా ఎలెక్ట్రో మెకానికల్ పరికరాలను వాడుకునే వారు. శూన్యనాళిక కారణంగా మొట్టమొదటి వేగంగల ఎలెక్ట్రానిక్ కంప్యూటర్లు వీలయ్యాయి. వాటిని ప్రోగ్రామ్ చేయడం కూడా వీలయ్యింది. వైజ్ఞానికంగా లెక్కలు వేయడానికి పెద్ద పెద్ద కంప్యూటర్లు రావడం 1940లోమొదయింది.
వ్యాక్యూమ్ ట్యూబ్లో కొన్ని ప్రధానమయిన లోపాలు కూడా ఉన్నాయి. అందులో ఎక్కువ శక్తి వినియోగమవుతుంది. అవి త్వరగా వేడెక్కుతాయి,ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకుంటాయి. అంత స్థలం ఆక్రమించకుండా తక్కువ ఖర్చుతో పనిచేసే ప్రత్యామ్నాయం అవసరం తెలిసింది. ట్రాన్సిస్టర్, ఆ తరువాత ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ రావడంతో ఈ అవసరం చివరికి తీరింది.
ట్రాన్సిస్టర్
MODERN ELECTRONICS ఆవిష్కరణలలో ఎక్కువగా ఉపయోగకరం అనిపించుకున్న ట్రాన్సిస్టర్ పుట్టుక 1947లో జరిగింది. దాన్ని యుఎస్ఏలోని బెల్ రీసెర్చ్ లేబోరేటరీస్లో జాన్ బార్డీన్, వాల్టర్ బ్రటేన్, విలియమ్ షాక్లీ అనే ముగ్గురు తయారు చేశారు. కొన్ని సెమీకండక్టర్ లక్షణాల ఆధారంగా అది పనిచేస్తుంది.
సిలికాన్ వంటి సెమీకండక్టర్ పదార్థానికి తక్కువ మోతాదులో మరొక పదార్థాన్ని కలిపినప్పుడు దాని లక్షణాలు మారతాయి. సిలికాన్ పరమాణువులో నాలుగు ఎలెక్ట్రాన్లు ఉంటాయి. దానికి చాలాకొద్ది మోతాదులో మూడు ఎలెక్ట్రాన్లుగ బోరాన్ను కలిపినప్పుడు అక్కడ ఎలెక్ట్రాన్ కొరత ఏర్పడుతుంది. సిలికాన్ ధనావేశం కలదిగా (పి-రకంగా మారుతుంది. అయిదు ఎలెక్ట్రాన్లు గల భాస్వరాన్ని కలిపితే సిలికాన్ రుణాత్మకం (ఎన్-రకం)గా మారుతుంది.

‘సోర్స్’ ‘డ్రెయిన్’ అని గుర్తించిన భాగాలు ఎన్-సిలికాన్ పొర. ఇక ఆధారం పి-సిలికాన్. గేట్కు రుణ ఓల్టేజిలను పంపినప్పుడు చిత్రం 2.1 (బి)లో చూపినట్టు పి-రకం సిలికాన్లోని ఎలెక్ట్రాన్లు గేట్ కింద భాగానికి ఆకర్షింప బడతాయి. అప్పుడు సోర్స్, డ్రెయిన్ మధ్యన ఎలెక్ట్రానిక్ మార్గం ఏర్పడుతుంది. చిత్రం 2.1(సి)లో మరొక పరిస్థితిని చూడవచ్చు.

డ్రెయిన్కు ధన విద్యుత్ను చేర్చినప్పుడు కూడా ఇటువంటి ఎలెక్ట్రాన్ ప్రవాహం ఏర్పడుతుంది. అంటే ట్రాన్సిస్టర్ ‘ఆన్’ అయ్యిందని అర్థం. ఇక చిత్రం 2.1(డి)లో చూపినట్టు గేట్ దగ్గర వోల్టేజీని తొలగిస్తే ఎలెక్ట్రాన్ మీద ఆకర్షణ ఉండదు. అప్పుడు ట్రాన్సిస్టర్ ‘ఆఫ్’ అయినట్టు లెక్కఉదాహరణకు ఒక ఆంపియర్లో 1000వ వంతు (1 ఎం.ఎ) ఉండే తక్కువ విద్యుత్తు ప్రవాహాన్ని గేట్ ద్వారా పంపినప్పుడు ప్రధానమార్గంలో 100 ఎం.ఎ ప్రవాహం వీలవుతుంది. అంటే గెయిన్ లేదా పెరుగుదల 100 ఉంటుందన్నమాట.చాలారకాల ట్రాన్సిస్టర్లు తయారయ్యాయి. వాటిలో పవర్ ట్రాన్సిస్టర్లు (ఎక్కువ ప్రవాహాలకు వీలు కలిగించేవి), ఫొటో ట్రాన్సిస్టర్స్, మైక్రోవేవ్ ట్రాన్సిస్టర్స్, ఫీల్డిఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ మొదలయినవి ఉన్నాయి.
ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు

MODERN ELECTRONICS ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (ఐసి)ను కనుగొనడంతో ఎలెక్ట్రానిక్స్ రంగంలో మరొక ప్రధానమయిన అంచె ఏర్పడింది. ట్రాన్సిస్టర్ను ఒక్కొక్కంటిని రిజిస్టర్లు, కెపాసిటర్లు లాంటి మిగతా పరికరాలతో కలపవసి వచ్చేది.170 మన జీవితాలను మార్చిన ఆవిష్కర్తలుద్వారా చూస్తూ చేయవసిన ఈ పని చాలా శ్రమతో కూడినది. చివరికి పరీక్షించినప్పుడు సర్క్యూట్లో సగం భాగం పనిచేసేది కాదు.
MODERN ELECTRONICS 1958లో టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ (యుఎస్ఏ)లోని జాక్ కిల్బీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ను కనుగొనడంతో గొప్ప మార్పు వచ్చింది. ట్రాన్సిస్టర్లు, రిజిస్టర్లు, కెపాసిటర్లు మొదలయినవన్నీ కలిసి ఒకే సిలికాన్ చిమ్మీద ఉండేరకంగా ఈ ఏర్పాటు ఉంటుంది. కొన్ని నెలల తరువాత రాబర్ట్ నాయ్స్ మరొక రకం ఐసిని తయారు చేశాడు. వాటిని తయారు చేయడం మరింత సులభంగాను, పనితీరు మరింత బాగాను ఉండేది. (ప్రసిద్ధి చెందిన ఇంటెల్ కంపెనీ నాయ్స్ ప్రారంభించిందే.) జాక్ కిల్బీ, రాబర్ట్ నాయ్స్లను ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ జంట ఆవిష్కర్తలుగా గుర్తిస్తున్నారు.
ఇక వీలయినన్ని ట్రాన్సిస్టర్లు, ఇతర భాగాల వీలయినంత తక్కువ చోటిలో ఇరికించే ప్రయత్నాలు (మీనియేచరైజేషన్) మొదలయ్యాయి. ప్రస్తుతకాలపు మైక్రోప్రోసెసర్లో ఒక్కొక్కంటిలో నాలుగు కోట్ల ట్రాన్సిస్టర్లు ఉంటున్నాయి. మామూలు కంటితో వాటిని చూడడం కుదరదు. వాటిలోని సర్క్యూట్లు చెప్పలేనంత సంక్లిష్టమయినవి. వాటి తయారీలో మాస్కింగ్, ఎచ్చింగ్, డిపాజిటింగ్ మొదయిన రకరకాల పద్ధతులను వాడుకుంటున్నారు.
MODERN ELECTRONICS మైక్రో ఎలెక్ట్రానిక్స్లో ఎంతో ప్రధానమయిన అగ్రగామిగా పేరొందిన రాబర్ట్ నాయ్స్ మరొక ప్రధానమయిన పరిశోధన కూడా చేశాడు. (విజ్ఞానశాస్త్రంలో ఒక కొత్తరంగం లేదా సాంకేతిక విధానం ఏర్పడుతున్నప్పుడు ఈ రకం వాళ్ళు చిత్రంగా ఎక్కడినుంచో పుట్టుకు వస్తారు.) కంప్యూటర్లో సమాచారాన్ని నిలువ చేయడానికి, అంతకుముందు, ‘కోర్స్’ అనే సిరామిక్ రింగులను వాడుకునే వారు. కానీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో జరుగుతున్న అభివృద్ధికి సమంగా పనిచేయడానికి వాటికన్నా మంచి ఏర్పాటు అవసరమయింది.
నాయ్స్, అతని బృందం వారు సిలికాన్, పాలీసిలికాన్తో తయారుచేసిన ‘మెమోరీ చిప్’ను రూపొందించారు. వ్యాపారసరళిలో దాన్ని 1103 మెమొరీ చిప్ అన్నారు. అందులో నాలుగువేల ట్రాన్సిస్టర్లు ఉండేవి. అవి వెయ్యి సిరామిక్ రింగులకు సమానంగా పనిచేయగలిగేవి, అది కూడా ఎంతోవేగంగా. నాయ్స్ మళ్లీ జాక్పాట్ కొట్టాడు.ఈ రకమయిన ఎలెక్ట్రానిక్ విడిభాగాల తయారీ ప్రపంచంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తి కార్యక్రమాలలో అన్నిటికన్నా ప్రత్యేకమయినది.
వీటిని తయారు చేసే కర్మాగారాలలో కాలుపెడితే సైన్స్ ఫిక్షన్ రచనలో ఊహించిన ప్రదేశాలోకి వెళ్లినట్టు ఉంటుంది. అక్కడ వాతావరణంలో ఒక్క దుమ్ముకణం ఉన్నా తయారవుతున్న సర్క్యూట్ సర్వనాశనం అవుతుంది. కనుక ఆ ఉత్పత్తి, సమీకరణ విభాగాలలో గాలిని ఫిల్టర్ చేసి చాలా కష్టపడి శుభ్రపరుస్తారు. పనిచేసేవారు చంద్రుని మీదకు వెళ్లే వ్యోమగాములలాగ దుమ్ము దూరని సూట్లను వేసుకుంటారు.
MODERN ELECTRONICS ట్రాన్సిస్టర్లు, ఐసిలు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడంతో పారిశ్రామిక ఉత్పత్తి, రవాణా, అలాగే ఎంటర్టైన్మెంట్ రంగాలన్నింటిలోకి దండయాత్రగా దూసుకు వచ్చాయి. సైన్యాల వారు వాటిని వాడుకున్న తీరు ఏ రకంగాను తక్కువ కాదు. భారీ ఐసిబిఎమ్ (ఇంటర్ కాంటినెంటల్ బ్యాలెస్టిక్ మిస్సైల్స్) రాకెట్లు, చిన్నరకం రాకెట్లు ట్యాంకులమీద, విమానాలమీద మిస్సైల్స్ ప్రయోగించేవి కూడా ఈ విడిభాగాల మీద ఆధారపడి పనిచేస్తున్నాయి. చమురుశుద్ధి కర్మాగారాలు లేదా ఉక్కు ప్లాంట్లలో కూడా వీటి సాయంతో చిక్కుగా కనిపించే కార్యక్రమాలను నియంత్రణ చేయగలుగుతున్నారు.
MODERN ELECTRONICS కార్లలోని ఇంజన్లు కూడా ఇగ్నిషన్ కొరకు యాంత్రిక పద్ధతి నుండి ఎలెక్ట్రానిక్ విధానానికి మారాయి. ట్రాన్సిస్టర్ రేడియోలు చవకగా, చిన్నవిగా మారాయి. వాషింగ్ మెషీన్ను కూడా వీటి సాయంతో పనిచేయిస్తున్నారు. విద్యుత్తుతో పనిచేసే ఏ యంత్రమైనా ఎంతో కొంత సాలిడ్ స్టేట్ ఎలెక్ట్రానిక్స్ లేకుండా నడవడం లేదు.
వ్యాక్యూమ్ ట్యూబ్ కారణంగా రేడార్లను కనుగొనడం వీలయింది. రెండవ ప్రపంచ యుద్ధంలో వెలువడిన అన్నిటికన్నా ప్రభావవంతమయిన ఆవిష్కరణ ఇది (చూ. 16వ అధ్యాయం). శాంతి సమయాలలో వాటి ఉపయోగం (రెండవ ప్రపంచ యుద్ధం తరువాత) బాగా పెరిగింది. రేడార్ లేకుండా విస్తృతమయిన వైమానిక పరిశ్రమలో విమానాలు ఎగరడం దిగడం లాంటి చర్యలను నియంత్రించడం వీలుకాదు. తుఫాను హెచ్చరికల విషయంగా కూడా రేడార్ పాత్ర గుర్తింపదగినది. హద్దులు మీరి వేగంగా పోతున్న కారు డ్రయివర్లను పట్టుకోవడంలో కూడా వీటిని వాడుతున్నారు.
టెలివిజన్

MODERN ELECTRONICS అయితే ప్రజలపై నేరుగా అత్యంత ప్రభావం చూపించిన ఎలెక్ట్రానిక్ ఆవిష్కరణ టెలివిజన్ అనడంలో అనుమానం లేదు. వార్తలు, వినోదం, సమాచారం, రాజకీయాల విషయంగా టెలివిజన్ ప్రభావం ఎంతగా ఉందంటే ఒకప్పుడు అవి లేకుండా ప్రపంచం ఎలా నడిచిందని ఆశ్చర్యం కలుగుతుంది. దృశ్యం కూడా కనిపిస్తుందన్న సత్యంమీద టెలివిజన్ ప్రభావం ఆధారపడి ఉంది. అది శ్రవ్యమాధ్యమం కన్నా సహజంగా ఎక్కువ ప్రభావాన్ని చూపగలుగుతుంది. అది కుటుంబం వారికి ఇంట్లోనే కష్టం లేకుండా అందుబాటులోకి వచ్చింది.
MODERN ELECTRONICS రేడార్, టెలివిజన్ అన్నవి అంతకుముందు కనుగొనబడిన కాథోడ్ రే ట్యూబ్ ఆవిష్కరణమీద ఆధారపడి ఉన్నాయి. కాథోడ్ రే ట్యూబ్ (సిఆర్) అన్నది శూన్య నాళికకు ప్రత్యేకమయిన రూపం. వెలువడిన ఎలెక్ట్రాన్లు పోయి వెలిగే లక్షణంగల పదార్థం పూసిన ఒక గాజు తెరను తాకుతాయి. అప్పుడు ఒక దృశ్యం ఏర్పడుతుంది. రేడార్ తెరమీద ఒక విమానం కేవలం ఒక వెలుగుముద్దలాగ కనిపిస్తుంది. శిక్షణ పొందిన ఆపరేటర్లు మాత్రమే దాన్ని సులభంగా గుర్తించగలుగుతారు. టెలివిజన్లో పిక్చర్ ట్యూబ్ మీద ఎవరయినా గుర్తించగల మామూలు బొమ్మలు కనిపించేలా ఏర్పాటు చేసి ఉంటుంది.

MODERN ELECTRONICS కంప్యూటర్ సిఆర్టిటి తెరమీద అక్షరాలు, బొమ్మలు మొదయినవి అన్నీ కనిపిస్తాయి. ఈ సిఆర్టి, వీడియో కెమేరాకు కూడా ప్రాణం వంటిది. కాథోడ్ రే ట్యూబ్ను జర్మనీకి చెందిన కార్ల్ ఫెర్డినాండ్ బ్రౌన్ 1897లో కనుగొన్నాడు. అతని ఆవిష్కరణ రానున్న కాలంలో ఇన్ని రకాలుగా వాడుకకు వస్తుందని అతను ఊహించి ఉండడు. ఎక్కువ దూరల మీద టెలిఫోన్, రేడియో ద్వారా మానవుల స్వరాన్ని పంపించగలగడంతో సహజంగా చిత్రాలను కూడా పంపించాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి.
MODERN ELECTRONICS ఈ అవసరాన్ని పూర్తిచేసిన టెలివిజన్ కథ ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందుకు అవసరమయిన కీలకమయిన ఆలోచనలు, పరికరాలు వ్యక్తిగత ఆవిష్కర్తల నుంచి వచ్చాయి. వారు కూడా తొలికాలపు ఆవిష్కర్తలాగే చాలా కష్టపడ్డారు. తరువాతి అంచెలో పెద్ద సంస్థల వారు ప్రధానపాత్ర వహించారు. వారికి అందుబాటులో ఉన్న వనరులు, నిర్వహణ శక్తి కలిసి
టివి వ్యవస్థను ప్రజామాధ్యమంగా చేయడంలో ప్రధానపాత్ర వహించాయి. ఈ విషయంగా చూస్తే టివి చరిత్ర కూడా విస్తృతంగా వాడబడుతున్న గ్జిరాక్స్ యంత్రం అనే మరొక ఆవిష్కరణలాగే ఉంటుంది .
రేడియో బాగా విస్తరించిన తరువాత 1920లో టెలివిజన్ ను సృష్టించే -ప్రయత్నాలు మొదలయ్యాయి. చివరగా చిత్రాన్ని చూపించడానికి సిఆర్టి అందుబాటులో ఉంది. టెలివిజన్ అవసరాలకుగాను దాన్ని మార్చడానికి ఎంతో కృషి అవసరమయింది. ఇక చిత్రాన్ని ‘స్కానింగ్’ చేసి దృశ్యాన్ని విద్యుత్ సంకేతాలుగా మార్చడం అన్నది కీలకమయిన సమస్య. ఆ సంకేతాలను విద్యుదయస్కాంత తరంగాలుగా (రేడియో ప్రసారాలలాగే) ప్రసారం చేస్తారు. అటు చివరన వాటిని తిరిగి దృశ్యాలుగా మారుస్తారు.
MODERN ELECTRONICS టెలివిజన్ నిర్మించే మొదటి ప్రయత్నాలు యాంత్రిక స్కానింగ్ విధానాల మీద ఆధారపడి కొనసాగాయి. 1920లో మొదలయిన ఈ యుగానికి పాల్ నిస్కోవ్, చార్ల్స్ జెంకిన్స్, లోగి బెయిర్డ్ అన్నవారు అగ్రగాములు. వారు తయారు చేసిన విధానంలో చాలా రంధ్రాలు సర్పిలాకారంలో ఉండే గుండ్రని బిళ్ల ఒకటి ఉండేది. చూపించవలసిన దృశ్యంనుండి కాంతి ఈ చక్రంలోని రంధ్రాల గుండా దూరి ఫొటో ఎలెక్ట్రిక్ సెల్కు ప్రేరణ కలుగజేస్తుంది. వచ్చి తగిలే కాంతిబలాన్ని బట్టి ఫొటోసెల్ పుట్టించే ప్రవాహంలో మార్పులు ఉంటాయి.
చూపించదలచిన దృశ్యాన్ని తిరిగే చక్రం, అందులోని రంధ్రాల అమరిక ఆధారంగా స్కాన్ చేస్తారు. ఫొటోసెల్లో పుట్టిన ప్రవాహాన్ని పెంచి రేడియో తరంగాలుగా పంపిస్తారు. రిసీవర్ చివరన సాంకేతాలను తిరిగి నియాన్ ట్యూబ్ మీద పడే వెలుగుగా మారుస్తారు. సంకేతాలను అందుకునే చక్రం నియాన్ ట్యూబ్ ముందు తిరుగుతూ వెలుగు ఫ్లాష్ ను చిత్రంలోని భాగాలుగా మారుస్తూ పనిచేస్తుంది. పూతపూసిన తెరమీదకు ప్రొజెక్ట్ చేసిన ఈ వెలుగు కారణంగా చిత్రాలు కనబడతాయి.
అవి మనిషి కంటికి క్రమం తెగకుండా కనిపిస్తాయి. (మన కన్ను చూచిన ఒక దృశ్యాన్ని సెకండులో పదవ వంతు కాలం వరకు నిలుపుకుంటుంది. కనుకనే ఒకదాని తరువాత వచ్చే బొమ్మలు కూడా ఖాళీ లేకుండా చక్కని కదిలే దృశ్యంగా కనిపిస్తాయి.)యాంత్రిక స్కానింగ్ పద్ధతి యుగంలో అందరికన్నా ప్రాముఖ్యంగల వ్యక్తి బ్రిటన్ కు చెందిన జాన్ లోగి బెయిర్డ్ (1888-1946) స్కాట్లాండ్లో పుట్టిన లోగి బెయిర్డ్ యువకుడుగా ఉన్నప్పుడు మామూలు ఉద్యోగాలు చేశాడు. అయితే అతని పూర్తి మనసు మాత్రం విద్యుత్తు, యాంత్రిక పరికరాలను రూపొందించడంలోనే ఉండేది.https://photos.app.goo.gl/SbGg4hSxXs6JdiPC7
MODERN ELECTRONICS జర్మనీలో పాల్ నిస్కోవ్ టెలివిజన్ గురించి చేసిన ప్రయత్నాలతో ప్రేరణ పొంది ఇతను కూడా తీరిక సమయంలో ఆ రంగంలో కృషి ప్రారంభించాడు. అతను బీదవాడు. మిత్రులు కూడా లేరు. అయినా అతని మనసు నిండా ఆ ఆలోచనే నిండి ఉండేది. అతను అట్టపెట్టెలు, మామూలు దీపాలు మొదలయినవి వాడి తన నమూనా యంత్రాలు తయారు చేశాడు. మద్దతుగా సరైన నిధులు లేనందుకు అతని పని చాలా కష్టంగా సాగింది.
అయితే పట్టుదలకు ఏ మాత్రం కొదువ లేదు. అతను చాలారకాలుగా పెద్ద పరిశోధనశాలలు, పెద్ద కంపెనీ మద్దతులేని కాలపు ఆవిష్కర్తలవంటి వాడే. మొదటి రోజుల్లో ఆవిష్కర్తలలాగే ఇతను కూడా ప్రభుత్వ సంస్థల నుంచి, కార్పొరేషన్లనుంచి తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. కేవలం ఆలోచన మాత్రంగా ఉన్న ఇతని ప్రణాళికను వారెవరూ గుర్తించలేక పోయారు. కానీ గట్టి పట్టుదలతో బెయిర్డ్ విజయం సాధించాడు. 1920 దశకంలో టివి ప్రసారాలు మొదలయ్యాయి. బెయిర్డ్ అట్లాంటిక్ సముద్రం మీదుగా సంకేతాలు పంపడంలో విజయం సాధించాడు.
అయితే ఆ సమయానికి ఎలెక్ట్రానిక్ స్కానింగ్ కూడా అభివృద్ధి కాసాగింది. అది మరింత వేగంగా పని చేస్తుంది. మొదటి కాలపు ఆవిష్కర్తలు కొందరిలాగే బెయిర్డ్ కూడా చాలాకాలంగా తాను కృషి చేస్తున్న పద్ధతులను వదిలి కొత్త వాటిని అంగీకరించ డానికి నిరాకరించాడు. (ఉదాహరణకు ఎడిసన్ కూడా తాను
డైరెక్ట్ కరెంట్ గురించి కృషి చేస్తున్నందుకు ఆల్టర్నేటింగ్ కరెంట్ వాడకాన్ని ఇష్టపడలేదు.) కానీ ఆ తరువాత బెయిర్డ్ పూర్తిగా ఎలెక్ట్రానిక్ పద్ధతులను అంగీకరించాడు. నిజానికి దాని అభివృద్ధిలో కూడా పాత్ర వహించాడు. టెలివిజన్ అన్న ఆలోచనను పెంపొందించడానికి అతను వహించిన పాత్ర చాలా గొప్పది. కనుక ఆ సాంకేతిక శాస్త్ర చరిత్రలో అతనికి ఉన్నత స్థానం ఇవ్వడం సముచితం.
MODERN ELECTRONICS పూర్తి ఎలెక్ట్రానిక్ టివి అన్న ఆలోచన 1930 నాటికే ఉంది. దాన్ని వాస్తవం చేయడంలో ఇద్దరు ఆవిష్కర్తల పాత్ర ఉంది. వారు ఫిలో టి ఫార్నెస్వర్త్ (1906-1971), వ్లాదిమిర్ జ్వోరికిన్ (1889-1982). రష్యాలో 1917లో విప్లవం ప్రారంభమైన కారణంగా జ్వోరికిన్ యుఎస్ఏకు మారాడు. టెలివిజన్కు అవసరమయిన, ఐకనోస్కోప్ అనే ఎలెక్ట్రానిక్ కెమేరా ట్యూబ్ను అతను తయారు చేశాడు. ఆ తరువాత అతను రేడియో కార్పొరేషన్ ఆఫ్ అమెరికా (ఆరిఎ)లోపనిచేశాడు.
ఫిలో టి ఫార్మ్స్వర్త్ చాలా గొప్పవ్యక్తి. అతను యుఎస్ఎ లోని ఊటా రాష్ట్రంలో పుట్టాడు. ఆ రాష్ట్రంలో ఎక్కువగా ఉండే మోర్మన్ తెగకు చెందినవాడు. పంట పొలాల మధ్యన పెరిగినప్పటికీ, ఫిలో ఎలెక్ట్రిసిటీ గురించి సహజమయిన ప్రేమ గలవాడు. ఇంట్లో వాడడానికి అతను స్వయంగా ఒక ఎలెక్ట్రిక్ వాషింగ్ మెషిన్ ను తయారు చేశాడు. 13 ఏళ్ల వయసులోనే అతను పూర్తి ఎలెక్ట్రానిక్ టెలివిజన్ అన్న ఆలోచనకు రూపం పోశాడు. అతను సాల్టెక్ సిటీలోని బ్రిగ్రహామ్ యంగ్ విశ్వవిద్యాయంలో చదువుకున్నాడు.
అనుకోకుండా తండ్రి మరణించడంతో కుటంబం పోషణ కొరకు అతను చదువు మానవలసి వచ్చింది. అదృష్టం కొద్దీ అతనికి ఉద్యోగం ఇచ్చినవారు టెలివిజన్ గురించిన అతని ఆలోచనలను నమ్మారు. కృషి కొనసాగించడానికి అవసరమయిన ప్రోత్సాహం అందించారు. ఫిలో ఫార్వర్త్ 1927లో ఎలెక్ట్రానిక్ టెలివిజన్ గురించి ప్రదర్శన ఇచ్చాడు. అందులో తెరమీద 60 గీతలను వాడుకున్నారు. (ప్రస్తుతం జపాన్ టివి ఉత్పత్తిదారులు 1000 గీతలున్న తెర గురించి ప్రయత్నిస్తున్నారు) ఫార్వర్త్ ఎన్నో పరికరాలను కనుగొన్నాడు. తన జీవితకాంలో యుఎస్లో, విదేశాలలో కలిపి 300కు పైగా పేటెంట్లు తీసుకున్నాడు.
MODERN ELECTRONICS 1930-1940 సంవత్సరాలో ఫార్వర్త్ ఆర్సిఎ వారికి వ్యతిరేకంగా పేటెంట్ హక్కుల విషయంలో కోర్టు వ్యవహారాలను కొనసాగించ వలసి వచ్చింది. (జ్వోర్కిన్ కంపెనీలో పనిచేసేవాడు) ఒక ఏకాకి వ్యక్తి ఒక పెద్ద కార్పొరేట్ సంస్థతో తలపడి పోరాడడం ఏ మాత్రం సులభం కాదు. చివరికి ఆర్సిఎవారు అతనికి రాయల్టీ ఇవ్వవలసి వచ్చింది. చిత్రాలను స్కానింగ్ చేయడంలో అవసరమైన అంశాలో చాలా ప్రధానమయిన వివరాలను అతను కనుగొన్నాడంటూ ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయం అతని విలువకు రుజువుగా నిలుస్తుంది.
MODERN ELECTRONICS మొట్టమొదటి నలుపు తెలుపు టివి సెట్లు 1949లో రాసాగాయి. కొన్ని సంవత్సరాలలోనే ఒక్క యుఎస్ఎలోనే కోటి సెట్లు అమ్ముడయ్యాయి. ట్రాన్సిస్టర్లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు రావడంతో టివి సెట్లు మరింత చిన్నవిగా మారాయి. టీవీలు చాలా గొప్పగా కొనసాగాయి కానీ, వాటిని కనుగొన్న వారిలో ఒకరి అదృష్టం మాత్రం ఆ రకంగా సాగలేదు. ఫార్స్వర్కు 1949 నాటికి తన కంపెనీని ఆర్థికపరంగా కొనసాగించే వెసులుబాటు కనిపించలేదు. అతను దాన్ని ఐటిటి (ఇంటర్నేషనల్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్)కు అమ్మేశాడు.
MODERN ELECTRONICS చాలా మంది మేధావి ఆవిష్కర్తలలాగే అతను కూడా తన కృషిని వ్యాపార విజయంగా మార్చుకోలేకపోయాడు. కానీ ఐటిటివారు అతని విలువను గుర్తించి రీసెర్చ్ డైరెక్టర్గా ఉద్యోగం ఇచ్చారు. అక్కడ అతను 18 సంవత్సరాలు పనిచేశాడు. అది ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలం. ఫిలో రక్షణ అవసరాల కొరకు అర్లీ వార్నింగ్ సిస్టమ్ (దూసుకువస్తున్న శత్రు విమానాలు, మిస్సైళ్లకు వ్యతిరేకంగా), సబెమెరీన్ ను గుర్తించే వ్యవస్థ, ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్లు, ఎలెక్ట్రాన్ మైక్రోస్కోప్లు వంటి వాటి తయారీలో ప్రముఖమయిన పాత్ర పోషించాడు.
MODERN ELECTRONICS ఫ్రార్స్వర్త్క అణుసంయోజన రంగంలో కూడా ఆసక్తి కలిగింది. 1967లో అతను బ్రిగ్రహామ్ యంగ్ విశ్వవిద్యాలయానికి తిరిగి వచ్చి ఆ రంగంలో పనిచేసే ప్రయత్నం చేశాడు. అయితే అది ఒక ఒంటరి పరిశోధకునికి వీలుకాని పెద్దసాంకేతిక సమస్య. విశ్వవిద్యాయానికి కూడా అది వీలుకానిది. నిధులు అడుగంటాయి. అప్పులవారు ఒత్తిడి తేవడంతో అతను చాలా బాధలకు గురయ్యాడు. మార్చ్ 1971లో అతను మరణించాడు. అది ఎంతో దుఃఖకరం. అయితే గొప్ప ఆవిష్కర్తలకు అది మామూలే. ఆవిష్కర్తలు స్వయంగా కృషి చేస్తున్నప్పుడు బాగా పనిచేస్తారు. వారి పరిశోధనలను వ్యాపార విజయాలుగా మార్చడం మాత్రం పెద్ద వ్యాపార సంస్థలకే వీలవుతుంది.
రంగుల టివి

MODERN ELECTRONICS ఇక తరువాతి అంచె రంగు టివి తయారీ. అది చాలా చిక్కుగల పని. మొదటి అంచెవలె కాక ఇది కార్పొరేట్ కంపెనీవారి ద్వారా జరిగింది. ఆర్సిఏ కంపెనీ ప్రెసిడెంట్, డేవిడ్ సార్నాఫ్ (1891-1971) వల్ల ఈ పని జరిగింది. రష్యాలోపుట్టిన అతను అమెరికాకు వలస వచ్చాడు. యువకుడుగా ఉన్నప్పుడే అతను వయర్స్ సాయంతో ప్రమాదానికి గురయిన పెద్దనౌక టైటానిక్ మీది వారిని రక్షించడంలో ఎంతో సహాయం చేశాడు. ఆ నౌక అట్లాంటిక్ సముద్రంలో 1912లో మొదటి ప్రయాణంలోనే ప్రమాదానికి గురికావడం తెలిసిందే.
కలర్ టివిని వాస్తవం చేయడానికి డేవిడ్ సార్నాఫ్ అంతులేని నిధులను వెచ్చించాడు. 1930 దశకంలో మాంద్యం సంవత్సరాలలో కూడా అతను పట్టువదలలేదు. నిజానికి అప్పట్లో డబ్బు కొరత ఉండేది. ఆర్సిఏ కంపెనీ షేర్ హోల్డర్ల ఓపికకు అంతకన్నా కొరత ఉండేది. పరిశోధకులకు అతను విరివిగా నిధులను అందజేశాడు. అయితే అనుక్షణం వారిపనిని పరిశీలించేవాడు కూడా. పరిశోధన అవసరాలు తీవ్రమయినవి. కలర్ టివి, అప్పటి వరకు పనిచేస్తున్న నలుపు, తెలుపు టివితో కూడా కలిసి పనిచేయాలి.
MODERN ELECTRONICS రంగులో ప్రసారం చేసిన కార్యక్రమాలు పాత టివిలో నలుపు, తెలుపులో కనిపించేవిగా ఉండాలని అర్థం. టివి చిన్నదిగా ఉండాలి, ధర కూడా అందుబాటులో ఉండాలి. ఇక ఆర్సిఏ ప్రపంచంలోని అన్ని సంస్థలతోను ఈ విషయంగా పోటీ పడవలసి వచ్చింది. పరిశోధకులు ఎన్నెన్నో పద్ధతులను పరిశీలించి చూచారు. చివరికి ఆర్సిఏలో ఒకప్పుడు పనిచేసిన ఆల్ఫ్రెడ్ షోడర్ తయారుచేసిన షాడో మాస్క్ కాథోడ్ రే ట్యూబ్ను ఎంచుకున్నారు. అందులో పారదర్శకంకాని ఒక తెర ఉంటుంది. దాని వెనుక సన్నని రంధ్రాలు ఉండే గాజు తెర ఉంటుంది. దాని మీద ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను చూపగల పూతపూసి ఉంటుంది.
ఎలెక్ట్రాన్ గన్సునుండి చాలా నిశితంగా కిరణాలు వచ్చి ఈ చుక్కలకు సూటిగా తగలాలి. అయితే దాన్ని సాధించగలిగారు. కొన్ని సంవత్సరాలు పట్టుదలతో చేసిన కృషి, లక్షల డార్లలో ఖర్చు కారణంగా కలర్ టివి విజయవంతమయింది. 1953 చివరినాటికి రంగుల కార్యక్రమాల ప్రసారాలు వ్యాపార సరళిలో మొదలయ్యాయి. మొదట్లో సెట్ ధర ఎక్కువగా ఉండేది. 1960 దశకం మధ్యకాలానికిగాని రంగుల టెలివిజన్ అమ్మకాలు పెరగడం వీలుకాలేదు. డేవిడ్ సార్నాఫ్ ప్రదర్శించిన దూరదృష్టి, పట్టుదల ఫలితాలను అప్పుడు ఆర్సిఏ కంపెనీ లాభాల రూపంలో అనుభవించింది.
టివి పనితీరు
MODERN ELECTRONICS కలర్ టెలివిజన్ పద్ధతిలోని మౌలిక భాగాలను చిత్రం 2. 2లో చూడవచ్చు. చూపవలసిన వస్తువునుంచి వెలుగు, కెమెరా ద్వారా రంగులను గ్రహించగలమీదకు పడుతుంది. ఎరుపు, ఆకుపచ్చ, నీలం అనే మూడు ప్రాథమిక వర్ణాలు ప్రతిఫలించి మూడు కెమెరా ట్యూబ్లలోకి ప్రవేశిస్తాయి. అక్కడ ఎలెక్ట్రాన్ గన్లు దృశ్యాన్ని నిరంతరం స్కాన్ చేస్తుంటాయి. వాటినవి విద్యుత్తు సంకేతాలుగా మారుస్తాయి. ఎన్కోడర్లో మూడు సంకేతాలు కలగలిసి శబ్ద సంకేతాలతోబాటు ట్రాన్స్మిటర్కు పంపబడతాయి.
ఇక రిసీవర్లో ఒక డికోడర్ సంకేతాలను తిరిగి మూడు రంగులుగా విడదీస్తుంది. మూడు ఎక్స్ట్రాన్లన్లు వాటిని స్కాన్ల్చేసి తెరమీదకు పంపుతాయి. తెరమీద ముందువేపున చాలా రంధ్రాలు గల షాడో మాస్క్ ఉంటుంది. ఇక తెరమీద భాస్వరం చుక్కలుగా పూసి ఉంటుంది. అది మూడు రంగులను గ్రహిస్తుంది. ఇక మనిషి కంటిలోని దృశ్యం నిలకడ అన్న కారణంగా ఒక కదిలే బొమ్మ వరుస కనిపిస్తుంది.
MODERN ELECTRONICS సాంకేతిక ప్రగతి కారణంగా రానురాను మరింత మంచి టెలివిజన్ సెట్లు వస్తున్నాయి. డిజిటల్ టెలివిజన్లు, ప్లాస్మా తెరలు మొదలయినవి క్రమంగా వస్తున్నాయి. వీడియో కెమెరాలు కూడా టెలివిజన్లలో వంటి ప్రాథమిక సూత్రాల ఆధారంగానే పనిచేస్తాయి. టెలివిజన్ కార్యక్రమాలను రికార్డు చేసి తిరిగి చూడవచ్చు. టివి కార్యక్రమాలను నేలలో పరిచిన కేబుల్స్ ద్వారా, భూమి మీద ఏర్పాటు చేసిన ట్రాన్స్ మిటర్ల ద్వారా లేక భూస్థిరకక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాల ద్వారా ప్రసారం చేయవచ్చు.ఎక్ట్రానిక్స్ రంగంలో వచ్చిన అద్భుతాన్నింటిలోకి మానవాళిని అత్యంతంగా నేరుగా ప్రభావితం చేసింది టెలివిజన్ ఒకటే.
MODERN ELECTRONICS ఒక్కసారి గతం గురించి ఆలోచిస్తే టెలివిజన్ వల్ల జరిగింది ఇంద్రజాలానికి ఏ మాత్రం తీసిపోనిదిగా కనిపిస్తుంది. 15వేల కిలోమీటర్ల దూరాన జరుగుతున్న ఒక ఆటలపోటీ, అంటార్కిటికా ఖండంలోని అందాలు, ఆఫ్రికాలోని జంతువులు లేదా ఇరాక్ యుద్ధంలోని అమానుషాలు అన్నింటినీ కష్టంలేకుండా మన ఇంట్లోనే చూడవచ్చు. మానవుడు మొట్టమొదటిసారిగా చంద్రుని మీద కాలు మోపినప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యంగా ఆ దృశ్యాలను చూచిందంటే,
MODERN ELECTRONICS అది టెలివిజన్ వల్లనే. సుదూర దేశాల ఆచార వ్యవహారాలు, అక్కడి సంస్కృతి విశేషాలను ప్రజలు అర్థం చేసుకోవడానికి టివి సాయం చేసింది. అది ప్రపంచాన్ని ఏకం చేసింది. వ్యాపార ప్రకటనల ద్వారా గ్రామీణ ప్రజలకు కూడా ఉన్నత స్థాయి జీవితాలను గురించి ఆశలను పుట్టించింది. టివి కారణంగా ఎన్నో రాజకీయ జీవితాలు అభివృద్ధి చెందాయి, నాశనమయ్యాయి కూడా. వియత్నాం యుద్ధం ఘోరాలు అమెరికన్ ఇళ్లకు చేరినందుకు యుద్ధం అంతం కావడం వీలయింది. ప్రభుత్వాలవారు తమ తప్పుడు పనులను, అపజయాలను ప్రపంచం దృష్టి నుంచి దాచుకునే పరిస్థితి ఎంతమాత్రం సాగడం లేదు. ఇదంతా మంచి ప్రభావం. అయితే టివి ప్రసార సంస్థ వారు చూపించే హింస, అశ్లీ దృశ్యాలు మాత్రం ఆ రకం కాదు. కానీ ప్రజలు వాటిలోని కొత్తదనం అలవాటయిన తరువాత అనవసరమయిన వాటిని వదిలి వేస్తారన్న నమ్మకం ఉన్నది.https://pincodesguide.in/kandukuri-veeresalingamgreat-social-reforms/
ఇతర ప్రయోజనాలు
MODERN ELECTRONICS టెలివిజన్, కంప్యూటర్ తరువాత ఆధునిక ఎలెక్ట్రానిక్స్ నుంచి వచ్చిన మరికొన్ని అంశాలు సాంకేతిక ప్రపంచం అంతటా విస్తరించాయి. విమానాల నియంత్రణ వ్యవస్థ, కార్లు, ఉక్కు, చమురు శుద్ధి కర్మాగారాలు, గృహోపకరణాలయిన వాషింగ్ మెషీన్, గడియారాలు, ఫోన్లు, డివిడి ప్లేయర్ తో బాటు పేస్ మేకర్లు, స్కానింగ్ యంత్రాల వంటివి ఎన్నో వచ్చాయి.
MODERN ELECTRONICS ఎలెక్ట్రానిక్స్ ప్రవేశించని సాంకేతిక రంగం లేనేలేదు. ప్రపంచమంతటా విస్తరించిన టెలిఫోన్ వ్యవస్థ ఆధునిక ఎలక్ట్రానిక్స్ సాయం లేనిదే మనజాలదు. యుద్ధాల సమయంలోనూ సూటిగా అవసరమయినచోట ఆయుధాలను ప్రయోగించే గైడెడ్ వెపన్స్ కారణంగా ఎందరో సైనికులు ఉండే సేన అవసరం తీరిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆధునిక ఎక్ట్రానిక్స్ మొత్తం మానవాళి మీద లోతయిన ప్రభావాన్ని చూపింది. రానున్న కాలంలో కూడా ఆ తీరు కొనసాగుతుంది.