Lala Lajpat Rai is a great Freedom
LALA LAJPAT RAI విద్యార్థి పర ప్రభుత్వ పరిపాలనలో దాస్యమున మ్రగ్గిపోవు చున్న తమ మాతృదేశమునకు స్వాతంత్ర్యము సంపాదించు టకు ప్రాణములొడ్డికూడ పాటుపడిన మహానాయకుల చరి త్రలు పఠించుచో మన శరీరములు గగుర్పొడుచును. తామే కాక తమతోటి భారతీయులనుగూడ అట్టిభావము కలవారిగా నొనర్చి స్థిరముగా దేశమున నెలకొన్న విదేశీ ప్రభుత్వము నకు గుండెగాలమైన నాయకుల చరిత్రలు మనకు ఆదర్శ ప్రాయములు. మహాత్మాగాంధీ పూరించిన స్వాతంత్ర్య సమర శంఖారావము భారతీయుల హృదయములలో ప్రతిధ్వనించి నది.

అనేకులు విద్యార్థులు, నాయకులు, ప్రభుత్వోద్యోగులు తమ తమ చదువులు వృత్తులు మానుకొని ఆనాటి స్వరా జ్యోద్యమములో పాల్గొన్నారు. కొదమసింగములవలె శౌర్య సాహసములతో ముందు రాగల కష్టములు గూడ లెక్కింపక త్యాగమొనర్చిన నాయకశ్రేష్టులలో “పంజాబ్ కేసరి”గా పేరొం దిన LALA LAJPAT RAI ముఖ్యుడు.ఎత్తయిన విగ్రహము, ఎగుభుజములు,కాంతితోప్రకాశించు కన్నులు, రాజకిరీటమును మించిన తెల్లని పెద్ద మీసములు చాటునతలపాగా, మీసములు చాటున మెరయుచుండు చిరునవ్వు గంభీరమగు రూపము వెనుక వెన్నువంటి మెత్తనయిన హృదయము.. ఇవి LALA LAJPAT RAI మూర్తిని మనకు కనులకు గట్టినట్లు చూపు వర్ణనము తలిదండ్రులనిన అపారమగు భక్తి, గురుభావము, దీన జనుల సేవ, వక్తృత్వము, ఎనలేని దేశభక్తి లజపతిరాయిలో ప్రస్ఫుటముగ కానవచ్చు గుణసంపద.
భారతదేశమున వీరులకు పుట్టినిల్లగు పంజాబు రాష్ట్రము ఆయన జన్మభూమి ఐదు నదులు పుట్టినచోటు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల మాతృస్థానము వీరులకు త్యాగులకు నిలయం. లూఢీయానా జిల్లాజగ్రాన్ పట్టణములో 1865 జనవరి 28న జననం. లాలా రాధాకృష్ణన్ దంపతుల ముద్దు బిడ్డగా జన్మించాడు LALA LAJPAT RAI . తండ్రి క్రిష్ణన్ ప్రభుత్వ విద్యాశాఖలో పర్షియన్, ఉర్దూ భాషలు బోధించే వాడు. ఆయన ఉర్దూ భాషలో పేరు గడించిన రచయిత పత్రికలలో విమర్శనా వ్యాసములు రచించి ప్రఖ్యాతి గడిం చాడు. కొడుకుల సంపాదనకు ఆశపడక తన స్వసంపాద నతో స్వగ్రామముననే తృప్తిగా జీవనం గడిపిన అభిమాని లజపతిరాయ్. తండ్రి ధైర్యములో ఆయనకాయనయేసాటి.
LALA LAJPAT RAI పెరిగి పెద్దవాడయి బ్రిటీషు ప్రభుత్వ ముచే ప్రవాసశిక్ష అనుభవించు సమయమున గూడ కుమారుడు కలిగినందుకు గర్వించిన ధైర్యశాలి రాధాకృష్ణన్.లజపతిరాయి ఉన్నత విద్యావంతుడు కావలెనని అమిత మగు శ్రద్ధాశక్తులతో ఉన్నత విద్యాభ్యాసము చేయించెను. లజపతిరాయి తల్లి కూడ తన పొదుపరితనముతో దైవభక్తి సాత్విక స్వభావములతో తన కుమారుని తీర్చిదిద్దెను. ఆదా యంలోని హెచ్చుతగ్గులతో పనిలేక మొదటినుండి చివరివర కొకే విధముగా జీవించవలెనను స్వభావం ఆమెది.
తల్లి దండ్రులపట్ల అమితముగు గౌరవము చూపుచు రాధాకృష్ణన్ వంటి ఉత్తమ ఉపాధ్యాయుడు లేడని గృహమును తీర్చిదిద్దుటలో తన తల్లివంటి గృహిణి కానరాదని చెప్పు కొనుచు LALA LAJPAT RAI గర్వించువాడు.

తల్లిదండ్రుల ఆశీర్వ చన బలమే తనను అంత వానినిగా చేసినట్లు లజపతిరాయ్ పెద్దవాడయిన పిమ్మట చెప్పుకొనేవాడు. తల్లి మరణ సమ యమున కుమారుడు, అల్లుడు మరణించినప్పటికంటె అధిక ముగా దుఃఖించినాడీయన.జన్మస్థానమగు జగ్రాన్ గ్రామములోనున్న బడిలోనే ప్రాధమిక విద్య ముగించి లూఢియానా మిషన్ పాఠశాలలోను. అంబాలలోని ఉన్నత పాఠశాలయందును విద్యనభ్యసించి 1880లో మెట్రిక్ పరిక్షయందు ఉత్తముడుగా కృతార్థు డయ్యెను. తండ్రి పరిమితాదాయముగాని, తన అనారోగ్యము గాని LALA LAJPAT RAI విద్యాభ్యాసమునకు ఆటంకములుకాలేదు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు కూడా ఆయన చురుకైన తెలివితేటలు చూచి ఆశ్చర్యపోవుచుండిరి. విద్యార్థిగా అతడు చదివిన గ్రంథములు అనేకములు.
మెట్రిక్ పరీక్షలో ఉత్తమస్థానము పొందిన LALA LAJPAT RAI కి ప్రభుత్వ వేతనము లభించినది లాహోరు కళాశాలలో రెండు సంవత్సరములు ఎఫ్. ఎ. చదివినాడు.ఆ రోజులలోనే స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజమును స్థాపించి భారతీయ సంస్కృతిని, నాగరికతను కాపాడుటకు విశేష కృషి సాగించుచుండెను.
LALA LAJPAT RAI తన పేరొందెను. ఆ సమాజ కార్యకలాపాలలో ముఖ్యపాత్ర వహించుచు వాక్ నైపుణ్యము చూపి మంచి వక్త యని ఆ ఆర్యసమాజ యువనాయకులలో నితనిని ముఖ్యునిగా గుర్తించిరి.
1882లో న్యాయవాద పరీక్షలో కృతార్థుడయ్యెను. సమాజ సేవలో నిమగ్నుడయి యుండుటచే రెండు సంవత్స రములకు గాని ‘ రెండవ భాగము పూర్తి చేయలేకపోయెను. ఆలస్యమయినను ఉత్తమ స్థానమునే పొందెను. 30 మంది విద్యార్థులలో రెండవవానిగా వచ్చెను విద్యార్ధి దశయందే ఇటలీ దేశపు నాయకుడయిన గారిబాల్డి మాజిలాన్ ల చరిత్రలు శివాజి, శ్రీకృష్ణ, స్వామి దయానంద చరిత్రలు ఉర్దూలో రచించి పలువురు అభిమానము సంపాదించెను.
సమాజ సేవ ఆర్య సమాజంలో చేరుట LALA LAJPAT RAI జీవితములో ఒక పెద్ద మలుపుగా మారినది. ఆయనకు మరి ఇద్దరు స్నేహి కలిశారు. లాలాహంసరాజ్, గురుదత్త విద్యార్థి అనువారు లజపతిరాయికి సాయపడగా యీ ముగ్గురును ఆర్య సమాజ లక్ష్యములను పంజాబు అంతటా విస్తరింపజేసిరి. వీరిలో హంసరాజ్ ఆలోచన కలవాడు. గురుదత్త విద్యార్థి ఆవేశ పరుడు LALA LAJPAT RAI కార్యాచరణమున గట్టివాడు. ఈ మువ్వురు యువకులు ఆర్య సమాజమనకు పట్టుగొమ్మలై రాష్ట్రమంతట ఉద్యమమును వ్యాపింపజేసిరి. లార్డు డల్ హౌసీ పంజాబును, ఈస్టిండియా కంపెనీవారికి అప్పగించెను అప్పటి నుండి ఆ రాష్ట్ర ప్రజలు తమ మతము గురించికాని, దేశము గురించి ఆలోచించుటకు అవకాశములు క్షీణించెను.
అటువంటి పంజాబు రాష్ట్రములో ఒక బలీయమైన ఉద్యమము ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయు బాధ్యతను ఆర్యసమాజం వారు చేపట్టిరి. స్వామి దయానందుడు స్థాపించిన యీ ఆర్య సమాజ ఆశయములు పామరులు మొదలు విద్యాధికులవరకు వ్యాపింపజేయుటకు పైన పేర్కొన్న ముగ్గురు యువకులు పాటుపడిరి.
క్రైస్తవ మిషనరీలు అమాయకులైన ప్రజలకు తమ మాటలతో యితర ప్రలోభములతో ఒప్పించి తమ మతము నవలంబింపజేయుచుండిరి. విద్యావిధానంలో మతరహితమైన విద్యావిధానమువలన జాతీయ విద్యకు తావులేకుండా పోయి నది. అట్టితరుణంలో జాతీయభావము కల్గించుటకు దేశీయ సంస్కృతిని పునరుద్ధరించుటకు ఆర్యసమాజము ముఖ్యముగ కృషిచేసినది. LALA LAJPAT RAI హిస్సార్ లో న్యాయవాద వృత్తిసాగించుచుండెను తన సంపాదనలో 1500 రూప్యములు ఆర్యసమాజమునకు
విరాళముగ అతడిచ్చెను.
హిస్సార్ లో పండితLALA LAJPAT RAI , లాలాచూరమణి తన ఆస్థిలాలాలజ రాయికి ముఖ్య స్నేహితులు. పండితలజపతిరాయి నంత ధారపోసెను. చూరమణి సాంకేతిక పాఠశాలను స్థాపిం చెను క్రమక్రమంగ బ్రహ్మసమాజ ప్రభావమును క్షీణింపచేసి, ఆర్యసమాజశక్తిని పెంపొందించుటకు పాటుపడుLALA LAJPAT RAI ఆంగ్లో వైదిక కళాశాలను స్థాపించెను. పంజాబు విశ్వవిద్యాలయమునకా కళాశాల అనుబంధము అయినది. అందు ప్రాచీన సంస్కృతి వాజ్మయము పరిచయ మొనర్చుట ప్రధానాంశము.

LALA LAJPAT RAI ఆర్య సమాజము రాజకీయమునకు లోబడరాదని అభిప్రాయంకలవాడు. జాతికీ, దేశానికి సేవ చేయదలచిన ఆ సంస్థ తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలని కోరాడాయన. ఆర్య సమాజము కాని, తాను స్థాపించిన దయానంద్ ఆంగ్లో వైదిక కళాశాలకాని విచ్చిత్తికి గురికారా దని, తాను సేవకే అంకితమయినట్లును నాయకత్వ పదవి చేపట్టుటకు మాత్రం కాదనీ స్పష్టం చేసాడు. ఆర్య సమాజ యాజమాన్యంలో ఒక వైదిక కళాశాలయే కాదు. 16 ఉన్నత పాఠశాలలు అనేకమగు బాలికల పాఠశాలలు నిర్వహింప బడుచు సంవత్సరమునకు 10 లక్షల రూపాయలు ఖర్చుచేయ బడు స్థితి చెందినది. ఈ సమాజము మూలమున లజపతి రాయికి సంఘసేవ, దేశభక్తి, భారతసంస్కృతీ నాగరికతల పట్ల అమితగౌరవం ఏర్పడి ఆయన పేరు ప్రతిష్టలు వ్యాపించినవి.
హంసరాజ్ గురు దత్తులతో కలసి లజపతిరాయి అనేక శిక్షణ కేంద్రములను నిర్వహించెను. ఆ కేంద్రములలో ఆధ్యాత్మిక విషయములు బోధించుట, విజ్ఞాన వ్యాప్తి. సంఘ సేవ సంస్కరణము సాధింపబడుచుండెడివి. ఈ ముగ్గురిలో గురుదత్త 25 సంవత్సరాల పిన్న వయసుననే మరణించిన కారణమున లజపతిరాయి, హంసరాజ్ లు ఇద్దరే కార్యభార మును నిర్వహింపక తప్పలేదు.
చిన్నతనముననే LALA LAJPAT RAI లో తండ్రి కృషి ఫలిత ముగ ఏర్పడిన విద్యాసక్తి అతడు పెరిగి పెద్దయైనపిదపవిద్యా సేవగా మారెను. విద్యార్థులతో, విద్యా సంస్థలతో ఆయన సన్నిహిత సంబంధములు కల్గియుండెను.
LALA LAJPAT RAI కి విద్యావిషయ పరిశోధనపట్ల ఆసక్తి మెండు. తాను న్యాయవాదవృత్తి సాగించు పట్టణము చాల చిన్నది. పంజాబు అంతటికి లాహోరు ముఖ్యకేంద్రం.అక్కడ అనేకులు మిత్రులు LALA LAJPAT RAI ని రమ్మని బలవంత పెట్టు చుండిరి. ఇన్ని కారణములుగా లజపతిరాయి 1898లో తన కార్యస్థానమును లాహోరుకు మార్చెను. ఆంగ్లో వైదిక కళా శాల స్థాపన, నిర్వహణలకు ప్రభుత్వధనము కోరదలచుకో లేదు. కాని అది అంత తేలికపనికాదు. అయినను యువక మిత్రులు ముగ్గురును గ్రామములన్నిటిని తిరిగి సభలు జరిపి వానిలో ఉపన్యాసములిచ్చి జాతి చైతన్యవంతము అగుటకు ఇటువంటి విద్యాసంస్థల ఆవసరమును నొక్కి చెప్పి ధనము సంపాదించిరి. ‘వీరి సభలకు జనము అసంఖ్యాకముగ వచ్చు చుండిరి.
స్త్రీలుకూడ తమ ఆభరణములను తీసి విరాళముగ నిచ్చిన సందర్భములు కూడా కలవు. కాలేజీ ప్రారంభించినది. మొదలు పాతికేండ్లు హంసరాజ్ దానికి ప్రిన్సిపాల్ గాను లజపతిరాయి కార్యదర్శిగాను, కాలేజీకమిటీకి ఉపాధ్యక్షుడుగా నుండిరి వారిరువురుకూడ జీతముతీసికొనక యే పని చేసిరి. LALA LAJPAT RAI ఆంగ్లో వైదిక కళాశాల స్థాపనతో తన పని ముగిసినట్లు సంతృప్తిపడక విద్యా సేవయే తన జీవితలక్ష్యముగ పెట్టుకొని సేవచేయుచుండెను. హిస్సార్ లో ఒక సంస్కృత పాఠశాల స్థాపించుట, జలంధర్ ఆంగ్లో సంస్కృత కళాశాలను కొల్పుట అతని విద్యాసక్తి ప్రత్యక్ష నిదర్శనములు. ఆయన విద్యా సేవ, దీక్ష దేశమంతటగల విద్యాధికుల మన్ననలందెను.
LALA LAJPAT RAI ప్రముఖ విద్యావేత్తలలో నొకడుగా గణుతి కెక్కేను. లార్డు కర్జన్ 1902లో ఒక విద్యావిషయక సంఘ మును నియమించి లజపతి రాయిని కూడ ఆహ్వానించెను సమావేశంలోLALA LAJPAT RAI భారతీయుల స్వేచ్ఛాపిపాసను అన్ని విధముల అణచి వేయు అప్పటి విద్యావిధానమును తీవ్ర ముగ విమర్శించెను. దేశీయులు స్థాపించి నిర్వహించు కళా శాలలను, కృషిని ప్రభుత్వమేలు గుర్తించదని సూటిగా ప్రశ్నిం చెను. భారతీయుల విద్యకై బ్రిటిషు ప్రభుత్వమేమి ఖర్చు పెట్టుచున్నదనిఅం కెలతో నిరూపించి వాదించెను ఉపాధ్యాయుల కిచ్చే వేతనములు మిక్కిలి నికృష్టమనికూడ విచారము వెలి బుచ్చెను. లజపతిరాయ్ కేవలం నినాదములతో ఉపన్యాసము లతో తృప్తిపడి ఊరకుండువ్యక్తికాదు.
గాంధీజీ హరిజనోద్ధ రణఉద్యమం ప్రారంభించుటకుముందే 19:2 లోనే హరిజన విద్యార్ధులను ఉచిత వేతనములిచ్చి వారిలో విద్యాసక్తి పెం పొందునట్లు చేసెను. వారు విద్యావంతులు కానిదే వారి ఆర్థిక స్థితి పెరుగదనియు, సమాజంలో వారి స్థితిగతులు మెరుగుపడ వని గ్రహించి 40 వేల రూపాయలు నెలకొల్పెను.

గాంధీ మహాత్ముడు ఆనాడు బ్రిటిషు ప్రభుత్వము నెది రించుటకు సహాయ నిరాకరణమును బోధించెను. ఆ సమయ మున విద్యార్థులు తమ పాఠశాలలను కళాశాలలను వదలి వెలికి వచ్చిరి. కానీ ఆంగ్లవిద్యకు ప్రత్యామ్నాయము గవిద్యను బోధించు పాఠశాలలు, కళాశాలలు స్థాపించుట ఆనాటిముత్యా వసరము. దీనిని గ్రహించిన LALA LAJPAT RAI తన రాష్ట్రంలోని వివిధ ప్రాంతములలో జాతీయ విద్యాసంస్థలు స్థాపించెను. తనకు అధిక గౌరవపాత్రుడయిన తిలక్ పేర రాజకీయ కళా శాల నెలకొల్పి 40 వేలు విరాళమిచ్చెను.
లాహోరులో కెల్ల సుందరమయినదని పేరు గాంచిన తన నివాసమునే ఆ కళాశాల భవనముగా ఇచ్చెను. తానొక చిన్న యింటిలో నివసించెను. విదేశాలలో నున్న విద్యావిధానమును సంస్థలను దర్శించి అందలి మేలైన విషయములను గ్రహించెను. తాను రాజకీయ వేత్తగా పేరొందిన వాడైనను ఆయనకుగల విద్యాసక్తి అపరి మితం చిన్నతనమున ఆయన తండ్రి రాథాకృష్ణన్ కల్గించనదే నని ఆయన చెప్పేవాడు.
తల్లి నుండి LALA LAJPAT RAI చిన్నతనమునందే నేర్చిన సరళ స్వభావం ఆయనను దయాళుగా మార్చినది. పేదవారి కష్ట ములనాయన తనకళ్లార చూచి జాలిపడుచుండెడివాడు ఆనాటి సంఘంలో బాల్యవితంతువులకు గౌరవమర్యాదలు లేవు. సంఘం వారిపట్ల చల్లని మాటలుకూడ చెప్పకుండెను. వారు దిక్కులేక బ్రతుకు భారముగా జీవించవలసి వచ్చుట చూచి జాలిపడి వారికి సహాయమొనర్ప నిశ్చయించినాడుLALA LAJPAT RAI . లాహోరు పట్టణంలో అనాధశరణాలయములు, ఆధా రము లేనివారికాశ్రమంను లేర్పరచినాడు. “అన్నమో రామ చంద్రా!”యని అల్లాడు దీనజనుల పాలిటి కల్పతరువై వారికి అన్ని విధముల సాయమొనర్చుటకు కంకణం కట్టుకొన్నాడు. ఎన్నో సేవా సంస్థలతో సన్నిహిత సంబంధము లేర్పరచుకొని దీనులకు సేవచేయుట తన పరమావధిగా తలచినాడుLALA LAJPAT RAI .
1897లో మహాభయంకరమగు కఱువు ఉత్తర భారత మంతట సంభవించెను. త్రాగుటకు నీరుకూడ కరువైపోయెను. నూతులు, చెరువులు ఇతర జలాశయములు అన్నియు వట్టి పోయెను తినుటకు తిండిలేదు. త్రాగుటకు నీరులేదు. ప్రజలు నిరాశ్రయులై మార్గముల ప్రక్కలందే అశువులు బాసిరి. పసిపిల్లల ఆక్రందనలు విన్నవారే లేరు. రాజస్థానము వరకు కలఱువు వ్యాపించెను. కఱువు నివారణకు ప్రభుత్వమెంతయో చేయవలసియుండెను. కాని పేరునకు కొలది మొత్తమును మాత్రం వ్యయం చేయుట చూచి దేశభక్తిగల LALA LAJPAT RAI వంటి నాయకులు క్షామనివారణకు నిధిని వసూలు చేయుటకు
సంకల్పించిరి. LALA LAJPAT RAI తాను స్వయంగా జోలెకట్టి ఇంటింటికి తిరిగి ధనవంతులనుండియు సామాన్యులనుండియు సహాయమును సంపాదించెను ఆర్య సమాజ పక్షమున కరువు నివారణ కేంద్రములను అనాధశరణాలయములను స్థాపించెను. ఫిరోజ్ పూర్ స్థాపించిన కేంద్రం అన్నిటికంటే పెద్దది. అచ్చటి అనాధ శరణాలయమునకు లజపతి రాయి ప్రధాన కార్యదర్శి. మీరట్ లోగల శరణాలయమునకు కార్యవర్గ సభ్యుడుకూడ.
కాటక సమయంలోనే 1997-99లలో LALA LAJPAT RAI హిందూ అనాధ సంస్థ నొకదానిని స్థాపించి రెండువేలమంది అనాధులకు ఆశ్రయం కల్పించెను. ప్రజలకు నచ్చజెప్పుటకు వారినుండి ధనసహాయం పొందుటకు అవసరమగు స్వచ్చంద వారికి పనిలో శిక్షణ ఈయ సేవకులు ఎంతైనా అవసరం. వలెను కూడ. ఈ కార్యక్రమములన్నియు దీక్షతో నిర్వ హించి, అనాధలు, నిరాశ్రయులయిన వారికి అపరిమితమగు సేవచేసిన LALA LAJPAT RAI ధన్యుడు అటువంటి సంఘసేవ పరా యణులు పూజనీయులు. ఈ సమయమున తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలను తల్లిదండ్రులు కాకుండా విడిపోయి జీవించు వారి గతి మిక్కిలి దుర్భరము. ఒకరి జాడ మరియొకరికి తెలి యదు. ఇట్టి స్థితిలోని వారిని చేరదీసి క్రైస్తవ ఫాదరీలు వారి సందరిని తమ మతంలోనికి స్వీకరించుచుండిరి ఇది హిందూ మతమునకు తీరని అపచారమని LALA LAJPAT RAI వాపోవుచుం డెను.https://photos.app.goo.gl/XzcVb3vSeSWt6Qcs5
1901లో సర్ ఆంథోని మాక్టోనాల్ట్ అధ్యక్షతను ఏర్పడిన కరువు నివారణ సంఘం ఎదుటLALA LAJPAT RAI యీ పరిస్థితులను వివరముగ పేర్కొనెను. అటుపిమ్మటనే ఏజిల్లాలో దొరికిన అనాధలను అక్కడున్న శరణాలయందే చేర్చవలే ననెడి ఆదేశం వచ్చినది. అంతేకాదు. ఆ అనాధలు ఏ మత మునకు చెందివుండిన ఆ మతం నిర్వహించు శరణాలయంలకే పంపవలెనని కూడ మాక్డోనాల్ట్ ఉత్తర్వులిచ్చెను. హిందూ శరణాలయము లెక్కువ సంఖ్యలో స్థాపించి మిషనరీల ప్రాణ ల్యము తగ్గించెను.
ఇది ఇట్లుండగా 1905లో కాంగ్రా జిల్లాలో తీవ్ర భూకంపం వచ్చెను. అపారమైన జననష్టము, ధననష్టము కలి గెను. మరల ఆర్యసమాజ సేవకులకు పనికలిగెను. లజపతి రాయి 6 సంవత్సరములు కరువు నివారణకు కృషిచేసిన వెంటనే భూకంప బాధితులకు సేవ చేయబూనెను.
1907లో మరల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరువు వచ్చెను. అక్కడికి LALA LAJPAT RAI తన సేవాదళముతో పోయి వారికి సేవచేసెను. పైవిధమున క్షామపీడితులకు, భూకంప బాధితులకు హరిజనాభ్యుదయమునకు LALA LAJPAT RAI తాను న్యాయవాద వృత్తిలో ఆర్జించిన ధనము అంతయు వెచ్చించ దొడగెను. తనదగ్గర నున్నదంతయు తాను దానం చేసి ఇతరులనూ దానమిమ్మని బోధించుటLALA LAJPAT RAI కిపరిపాటి.హరిజనోద్దరణ విషయమున గాంధీజీకంటే చాల ముందే పూనుకొనెను. వారి ఇండ్లకుపోయి వారితో పాటుగ భుజించు టకు కూడ వెనుకాడలేదు LALA LAJPAT RAI ఆయన మిగిలినవారి కందరికి ఆదర్శప్రాయుడు. గాంధీజీ కూడా ఆయన సేవా తత్పరతను మిక్కిలి కొనియాడెను.
LALA LAJPAT RAI తాను న్యాయవాద పరీక్ష నుండి జాతీయ కాంగ్రెసు కార్యకలాపములను పరిశీలించుచుండెను. స్నేహితుడగు హంసరాజ్ మాత్రము సంఘసేవకులు కీయ వ్యవహారములు పట్టించుకోరాదని ఖండితముగ చెప్పు చుండెను. సాంఘిక, సాంస్కృతిక, వైజ్ఞానిక, రాజకీయ రంగము లన్నిటిలో ఒకేమారు కృషిచేయుట లాభకరమని యువరాజకీయ చైతన్యం కలిగించినమీదటనే ప్రజలను సంఘ సంస్కరణపట్ల సుముఖులను చేయగలుగుదుమని ·LALA LAJPAT RAI వాడించుచుండెను.
భారత జాతీయ కాంగ్రెసు 1885లో ఒక ఆంగ్లేయుడు “అలెగ్జాండరు హ్యూమ్”చే స్థాపించబడినది. సభకు దాదాబాయి నౌరోజి నాల్గవ సభకు అలహాబాదులో జార్జి యూల్ అధ్యక్షత వహించెను.
లజపతిరాయి 1889లో అలహాబాదులో జరిగిన కాంగ్రెసు మహాసభలో పాల్గొనెను. సర్ సయ్యద్ అహమ్మద్ గారికి బహిరంగలేఖలు వ్రాయుటతో LALA LAJPAT RAI రాజకీయ జీవితం ఆరంభమయ్యెను అంతవరకు సిపాయిల తిరుగు బాటును సమర్ధించుచు “ఆలిఘర్ గెజెట్”లోను “సంఘ సంస్కర్త”లోను వ్యాసాలు వ్రాసిన తనకు “నైట్” బిరుదమునిచ్చిన అహమ్మద్ ప్రభుత్వం వెంటనే కిమ్మని పలుక కుండేను. అహమ్మద్గారికి ఆ విషయమై LALA LAJPAT RAI బహి రంగ లేఖలు వ్రాసెను. 1 92లో జరిగిన కాంగ్రెస్ మహా సభకు వెళ్ళి అహమ్మద్ గారికొక సమాధానమును ప్రచురించి పంచి పెట్టెను.
మరుసటి సంవత్సరం కాంగ్రెసు మహాసభలు జరుపుటకు నిశ్చయించబడెను. పంజాబులో ఆదివర కెన్నడును కాంగ్రెసు మహాసభలు జరగలేదు. అక్కడ ప్రజ లలో ఎక్కువ వ్యాప్తిలోనున్న ఆర్యసమాజం ఆ సభలకు తోడ్పడునట్లు ఒప్పించు భారం LALA LAJPAT RAI పై పడెను. ఎట్లయిననేమి లజపతిరాయి ఆర్యసమాజంచేత ఒప్పించ గలిగెను. కాని పంజాబులోని ముస్లిం వర్గీయులు కాంగ్రెసుకు సహకరింపమని నిరాకరించిరి. పల్లెలు, పట్టణములు పర్యటించి అచ్చటి ప్రజలకు జాతీయ భావమును బోధించి కాంగ్రెసు మహాసభలకు అంచనావేసిన వ్యయం నంతటిని ప్రజలనుండి సేకరించు బాధ్యత అంతయు LALA LAJPAT RAI .
కాంగ్రెసు మహాసభలు లాహోరులో అత్యంత విజయో త్సాహములతో జరిగినవి. అచ్చటి ప్రభుత్వం దీనినంతయు గమనించుచుండెను.LALA LAJPAT RAI ప్రభుత్వ వ్యతిరేకియని అనుమానించిరి. పంజాబులో కరువు 1897లో వచ్చెను. అంతకుముందు విక్టోరియారాణి వత్రోత్సవాలు పురస్కరించు కొని లాహోరులో రాణి విగ్రహమును ప్రతిష్టించవలెనని ప్రయత్నాలు చేయుచుండిరి.LALA LAJPAT RAI ఆ విగ్రహము
స్థాపించు ప్రతిపాదనను తీవ్రముగా ప్రతిఘటించెను ధనంతో నిరుపేదలకు సహాయపడుట మేలని వాదించెను.తుదకు విగ్రహ స్థాపన జరుగలేదు. పిమ్మట కరువు ప్రారంభమయినది. లజపతిరాయ్ ప్రజలకు సేవచేయుట, అనాధ శరణా లయాలు స్థాపించుట, కాంగ్రా భూకంపము సంభవించినప్పుడు కూడా ప్రజలను కష్టములలో ఆదుకొనుట మున్నగు కార్య క్రమములలో సర్వకాలమూ నిమగ్నుడై నను LALA LAJPAT RAI కాంగ్రెసు సంస్థలో గణనీయమగు సేవకుడని పేరుపొందెను.. నిరంతర సేవాకార్యక్రమములలో తిరుగుట మూలమున లజ పతిరాయి ఆరోగ్యం దెబ్బతినెను. ఈలోపుగా లండన్‌లోని విద్యార్ధులాయనను ఆహ్వానించిరి. ఆయన ఆ అవకాశమును వినియోగించుకొని ఆచటి విద్యావిధానంను ఆకళింపు చేసికొని విద్యాలయంను దర్శించెను.
ఆయన విదేశయాత్ర ముగించుకొని వచ్చులోపల అప్పటి వైస్రాయి 1905 అక్టోబరులో బెంగాలు విభజనచేయు టకు ఉత్తర్వులిచ్చెను, ఈ చర్య ప్రజలలో తీవ్రమగు క్రోధా గ్నిని రగుల్కొల్పెను. ప్రభుత్వము దమననీతితో ప్రజలను హింసించుచుండెను. 1905లోనే వారణాసిలో గోఖలే అధ్యక్షతన జరిగిన కాంగ్రెసు మహాసభలో బెంగాలు విభజనయే ముఖ్య విషయ ముగ ప్రస్తావనకు వచ్చెను. వైస్రాయి కర్జన్ నిరంకుశ ధోరణికి వ్యతిరేకముగ బెంగాల్ ప్రజలు చూపిన సాహసము నకు లజపతికాయి అభినందనలు తెలిపెను. అట్టి వీరోచితచర్య భారతీయులు స్వాతంత్ర్య పోరాటములో మరొత
నూతన శకమునకు ప్రారంభమని కూడి పలికెను. ప్రభుత్వం ప్రజా భీష్టమునకు వ్యతిరేకంగా నిర్ణయించినప్పుడు తమ నిరసన తెలుపు హక్కు ప్రజలకు కలదని లజపతిరాయి ఘంటా పథ ముగ వాదించెను.
ఆయన ప్రసంగము ఆ సభలో వారిని ఉ త్తేజపరచుటయేగాక భారతీయులందరినికదిలించింది. ప్రభు త్వము ఇది చూచి కలతచెందినది బెంగాల్ విభజనలు వ్యతి రేకించుచు దేశము నలుమూలల సభలు ఊరేగింపులు జరిగి నవి. దేశభక్తులను నాయకులను వేలసంఖ్యలో ప్రభుత్వము బంధించసాగెను. నిరంకుశ ధోరణిని అవలంభించి ప్రజలలో ప్రారంభమయిన యీ ఆందోళనను అణచి వేయవలెనని ప్రభుత్వం అభిప్రాయపడెను. కాని జాతిలో కలిగిన చైతన్య మును ఎంతటి శక్తియైన నిరోధించ జాలదనియు, చట్టబద్ధముగ అలజడి చేయుట, మహాజర్లు పెట్టుట, సభలు జరిపి తీర్మానములు చేయుట నేరములు కాజాలవని LALA LAJPAT RAI బహిరంగ ముగ చాటెను. ఎన్నో మంచి సంప్రదాయములను నెల కొల్పిన ప్రభుత్వమిట్టి దమననీతి నవలంభించి తనకు వచ్చిన మంచి పేరు చేతులార చెడగొట్టుకొనుట శ్రేయస్కరము కాదని ప్రకటించెను.
1907లో జరిపిన కాంగ్రెసు మహాసభలో బ్రిటిషు ప్రజలందరికి ఇక్కడ ఇండియాలో వారి ప్రభుత్వం అవలం భించు నిరంకుశ ధోరణిని వివరించి చెప్పి జాతీయ ఉద్యమము నకు బ్రిటిషు ప్రజల నైతిక బలము సంపాదించుట ముఖ్యమని తీర్మానించిరి. ఇది సామాన్యమయిన పనికాదు. ఉపన్యాసములతో ప్రసంగములతో ఆంగ్లేయులమనసు మార్చి కేవలము ఈ పనికిLALA LAJPAT RAI వారి సానుభూతిని భారతీయులపట్ల పొందుటకు సమర్థులైన వ్యక్తులు, రాజకీయవేత్తలు కావలెను. రాయిని, గోపాలకృష్ణ గోఖలేను కాంగ్రెసు నియమించింది. పంజాబు సంఘము లజపతిరాయి ప్రయాణవ్యయము భరింతు మన్నను అతడు తన స్వంత ధనముతోనే ఇంగ్లండు బయలు దేశెను.
అక్కడున్నరాజకీయపక్షములకు డెమోక్రాటిక్,లేబర్, సోషలిస్టు పార్టీలకు బ్రిటిషు ప్రజలలోగూడ లజపతి రాయి బ్రిటిషు ప్రభుత్వము ఇండియాలో అవలంభించుచున్ననిరంకుశ ధోరణిని, దమననీతిని
తన సహజమగువాక్చాతుర్యముతో ఉపన్యసించెను. బ్రిటిషు ప్రజానీకము యొక్కఅతని విదేశ పర్యటనము ఆ దేశమునగల రాజకీయ సానుభూతిని పొందగలిగెను. మిక్కిలి విజయవంతమయ్యెను. చైతన్యంతో పోల్చినపుడు భారతీయుల స్తబ్ధత ఆయనకు కొట్టవచ్చినట్లు గోచరించెను. భారతీయులు తమ ఆలోచనలను అలవాట్లను పూర్తిగా మార్చుకొననిదే చైతన్యం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడెను.
జాతీయ కాంగ్రెసు నిర్మా సాగించవలెననియు, సుశిక్షితులైన ణాత్మకమైన కృషిని కార్యకర్తల మూలమున ప్రజలలో విరివిగా ప్రచారము సాగ వలెననియు, రాజకీయ శిక్షణాలయములు మిక్కిలి ముఖ్యమైనవనియుఆయన నిశ్చయించి తన అభిప్రాయములను బహిరంగముగ చెప్పెను ఎం.ఏ. చదువులో రాజకీయములు అభిమాన విషయముల తీసుకొను ఇద్దరు విధ్యార్థులకు ఉపకార వేతనములను కూడ ప్రకటించెను లజపతిరాయి విదేశ పర్య టన ముగించుకొని వచ్చిన పిదప 1907లో స్వదేశీ ఉద్యమం గురించి ఒక మహాసభ జరిగెను. ఉపన్యసించుచు అతడు “మనం పరిస్థితులను చూచి నిరాశ చెందరాదు. నిష్కళంకముగ ప్రజాసేవ చేయుచూ ముందుకు సాగిపోవలెను.
స్వదేశీ మంత్రమునే జపించుచూ వ్యామోహమును విడనాడుట ముఖ్యం” అని సహాయ నిరాకరణమును స్వదేశీ ఉద్యమం గురించి ముగ ఉపన్యాసములిచ్చుచు ప్రజలలో నూతనమగు చైతన్య శక్త నింపుచుండెను.పరాయి ప్రభుత్వము లజపతి రాయిని అనుమానించుచు ఆయున నొక కంట కనిపెట్టియే యుండెను. రాణి విగ్రహము నెలకొల్పుటను వ్యతిరేకించుట బెంగాలు విభజనను వ్యతిరే కించుచు వారణాసి కాంగ్రెసు సభలో ఉత్తేజకరమగు ఉప న్యాస మిచ్చుట, సహాయ నిరాకరణము, స్వదేశీ ఉద్యమము లను ఆయన విరివిగా ప్రచారము చేయుట-ఇనన్నియు ఒక దాని కొకటి ప్రభుత్వ అనుమానమును బలపరచుచుండెను.https://pincodesguide.in/gopal-krishna-gokhale-is-great-political-leader/
వీనికితోడుగా పంజాబులోని రైతులు ప్రభుత్వమునకు వ్యతిరేకముగ ప్రదర్శనలు జరుపనారంభించిరి. భూమిశిస్తుల పెంపుదల, వలస విధానం గురించిన చట్టం ఒకవంక నాయ కుల అరెస్టులు, ప్లేగువ్యాధి ప్రబలుట_ఇవన్నియు ప్రజాందోళ నకు దారితీసినవి. లజపతిరాయి మరికొందరు పెద్దలు వ్యవసాయదారుల ఇబ్బందులను పై అధికారులకు తెలియచేసిరి. కాని ఆ మేజిస్ట్రేటు ప్రభుత్వంకూడ వీరందరు కుట్రపన్ని రాజద్రోహం తల పెట్టినట్లు అపోహపడినది. రైతుల పక్షమున వాదించిన న్యాయవాదుల నందరిని ప్రభుత్వం అరెస్టు చేసెను. తగినంత ఆధారంకొరకు వేచియుండుట చే లజపతిరాయ్ అరెస్టు కాలేదు.
న్యాయవాదులపై మోపిన ఆరోపణలు కూడ సరియైనవి కాకుండుటచే ప్రత్యేక న్యాయాధిపతి మార్జెన్యూ వారిని విడుదల చేయమని ఉత్తర్వులిచ్చెను. ఈ సంఘటనము పంజాబు ప్రభుత్వమునకు నైతికముగ ఒక ఘోరపరాజయం. ఏమి చేయుటకును పాలుపోక ప్రభుత్వం లజపతిరాయిని నిర్బంధించుటకే నిశ్చయించెను. భారతదేశంలో నివసించు ఆంగ్లేయులు, వారి నిర్వహణలో నున్న ఆంగ్ల పత్రికలుగూడ లజపతిరాయ్‌పై ప్రభుత్వం కఠినమగు చర్య తీసికొనవలెననియే ఒత్తిడి చేయసాగినవి.
ఎన్నడో 1878లోని తీర్మానమును బయటకుతీసి చట్ట విరుద్ధమగు చర్చయైనను, న్యాయము, ధర్మము పాటి. పకయే ప్రభుత్వం లోల్ పూర్లో ఉపన్యాసమిచ్చుచున్న లజపతి రాయ్ ని హఠాత్తుగా చుట్టుముట్టి మోటారు వాహనము నెక్కించి తీసికొనిపోయెను. మోటారునుండి స్పెషల్ ట్రెయిన్ల రంగూన్లోని “మాండరే” జై లునకు తీసికొనిపోయిరి. శిక్ష తుని నేరమేమియో ప్రభుత్వం చెప్పనేలేదు. అజపతిరాయిని ప్రభుత్వం నిరంకుశంగ పట్టుకొని పోయినవార్త దేశమంతట కార్చిచ్చువలె అలముకొనెను. ప్రజలు మిక్కిలి కోపోద్రిక్తులైరి.
గోఖలే మహాశయుడు కూడ పై స్రాయి కమిటీలో యీ విషయం ప్రస్తావించెను. బ్రిటిషు పార్ల మెంటులోని సభ్యులు ప్రశ్నలు అడిగిరి. భారతమంత్రి కూడి యీ శిక్షకు కారణమేమని ప్రశ్నించెను. ప్రభుత్వం సరి యైన సమాధానం చెప్పలేదు. లజపతి రాయి స్వయముగ భారతమంత్రికి వ్రాసెను. ఆ పిమ్మట భారతమంత్రి లజపతి రాయిని జైలునుండి విడుదల చేయుటకు ఉత్తర్వులిచ్చెను. 1907లో లజపతిగాయి రంగూన్ మీదుగా ట్రెయిన్లో ! లాహోరు చేరుకొనెను. విడుదల వార్త ప్రజలకు తెలియలేదు. అతడు హఠాత్తుగా తమ మధ్యకు వచ్చినందుకు ప్రజలకు పొందిన ఆనందంనకు అంతులేదు.
మాండలే జైలులోనున్న కాలముననే లజపతిరాయి “నా దేశాంతర యాత్ర” అను గ్రంథము వ్రాసెను. అంతవరకు పంజాబు రాష్ట్రమునకు మాత్రము పరిమితమైయుండిన ఆయన కీర్తి ప్రతిష్టలు యీ ప్రవాసంతో అఖిల భారత స్థాయినందు కొనెను. అవకాశము లుండియు అర్హతలు కలిగియు, లజపతి రాయికి చొరవలేని కారణముగ ఆయన భారతదేశ నాయకు డగుటకు ప్రయత్నించలేదు. లజపతిరాయి పేరు ప్రవాస శిక్షతో గ్రామములకు వ్యాపించినది. ఆనాటి కాంగ్రెసులో ముగ్గురే నాయకత్రయముండిరి. బాలగంగాధరతిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, వీరినే ఆ రోజులలో బాల్, లాల్, పాల్’ అని వ్యవహరించెడివారు.
మొదటిదశలో యీ ముగ్గురు నాయకులును వహించి భారతీయులకు చిరస్మరణీయ మూర్తులుగా వెల్గొందు చున్నారు.ఆయన మాండలే జైలులోనున్న కాలముననే వలస చట్టము రద్దుచేయబడినది. దేనికై లజపతి రాయి కారాగార మనుభవించెనో ఆ పని నెరవేరినది. కాని ప్రభుత్వ మాయ నను నిర్బంధించుటకు కారణం వివరించలేదు. కొన్ని ఆంగ్ల పత్రికలు మాత్రం నిరూపించజాలని కొన్ని ఆరోపణలను ప్రకటించినవి. లజపతిరాయ్ అట్టి పత్రికలలో నొకదానిపై పరువునష్టం దావా వేసి గెలిచెను.
ఆత్మాభిమానము కలవాడు గనుక న్యాయస్థానములు నామమాత్రమైనవని భావించి వానిలో వాదించి న్యాయవాద వృత్తి కొనసాగించుట వ్యర్ధమని ఆయన తలచెను. లక్షల కొలది సంపాదన గడించుచున్నను దానిని తృణప్రాయముగ భావించి న్యాయవాదవృత్తి మాని తన జీవితమంతయు దేశ సేవకే విని యోగించిన త్యాగమూర్తి లజపతిరాయి ఇతరులెవ్వరికిని ఇంతటి త్యాగం చేయుట సాధ్యంకాదు. ఆత్మాభిమానం గల్గిన లజపతి రాయ్ చేతులార వృత్తినివదలి దేశ సేవలో నిమగ్నుడయ్యెను
రాజకీయవేత్తల గురించి వ్యాఖ్యానించుచు లజపతి రాయ్ “ప్రజలను నడుపగల శక్తి సామర్థ్యములు, స్వార్థ త్యాగము నిష్కళంక ప్రవర్తనకల వ్యక్తులే రాజకీయరంగమున నాయకులై రాణింపగల్గుదురు” అనెను.ప్రజలతో వీరత్వమును బోధించవలసిన బాధ్యత రాజ కీయ నాయకులపై సున్నదని లజసతిరాయ్ అభిప్రాయం. ఒక ప్రణాళికానుసారము ప్రజలలో ప్రబోధము జరుగవలెననియు ఆయన చెప్పెను. ప్రజలు దేశభక్తిపూరితులై పర ప్రభుత్వము నుండి సంపూర్ణ స్వరాజ్యం పొందువరకు
విజయమో వీరస్వర్గమో అన్న అచంచల విశ్వాసముతో ఉద్యమమును ప్రారంభించవలెనని కూడ లజపతిరాయ్ నుడివెను. ఆయన కాంగ్రెసు మహాసంస్థక నియమావళిని స్థిరపరచెను. కార్య క్రమములు ఒక పద్ధతిలో జరిపించుటకు సూత్రధారి.
తిలకవలె లజపతిరాయ్నౌరోజీలతో అతివాదియైనను గోఖలే. అభిప్రాయభేదములున్నను వారి నెప్పుడు
విమర్శించువాడు కాదు. అట్లని తన అభిప్రాయములను బహి రంగముగ చెప్పుట మాననూ లేదు. కాంగ్రెసులో ఈ రెండ వర్గములుండుటవలన కలుగు లాభనష్టములను ఆయన చెప్ప చుండెడివాడు. ఆశావాదము ననుసరించి రాజకీయ వేత్తగానే లజపతిరాయ్ రాణించెను. హిందూ ముస్లింల సఖ్యత స్వరాజ్య సాధనకు ముఖ్యమని నమ్మెను!“దేశభక్తి, నిస్వార్థత, మానవాళికిసేవచేయుటలోచెప్పుటయే
నిర్విరామకృషి – ఇది నాయకులకు రాజకీయవేత్తలకు కూడ కావలసిన ముఖ్యలక్షణం” లని ఆయన
దానికి అనుగుణంగ తన నడవడిని రూపొందించుకొనెను.
1914లో జరిగిన కాంగ్రెసుసభలో విదేశాలలో ఉన్న భారతీయ విద్యార్ధులపై జరుగుచున్న దౌర్జన్యాలను ప్రతిఘ టించాలని తీర్మానం ప్రవేశపెట్టెను. రాయబారం జరుపుటకై ఒక సంఘం ఇంగ్లండుకు వెళ్ళినది. అక్కడి ప్రముఖులతో క చర్చలు జరిపి ఈ సంఘంవారు తమ పనిని సఫలం చేసికొని తిరిగివచ్చిరి. లజపతిరాయ్ మాత్రం ఇంగ్లండు నుంచి “జపాన్” అక్కడినుండి ఆయన ఇండియాకు తిరిగి ప్రయాణమయ్యెను.
ఈలోగ యూరప్ లో యుద్ధం ప్రారంభమైనది. లజపతి రాయ్ స్వదేశమునకు తిరిగివచ్చి ప్రజలలో ప్రభుత్వ వ్యతిరే కతని ప్రబోధించునని బ్రిటిషువారి అభిప్రాయం భారతీయ మంత్రి దాని కనుగుణంగ లజపతిరాయి యుద్ధం ముగిసేంత వరకు ఇండియాకు తిరిగి రాకూడదని నిషేధము విధించెను. ఆకారణముగ 1914-1919 అయిదేండ్లు విదేశములలో ప్రవాసముననుభవించెను. లజపతిరాయి 1914లో జపాన్ నుండి ఇంగ్లండు అక్కడనుండి అమెరికాకు వెళ్ళెను. బ్రిటిషు వారు ప్రచురించు పత్రములు అమెరికాలో భారతీయులపట్ల వ్యతిరేక భావము కల్గించుటను లజపతిరాయ్ కనిపెట్టెను. భారతీయులు నాగరికత ఎరుగని అడవి జాతివారని వారికి స్వరాజ్యమిచ్చినను వారు తమ్ము తాము పరిపాలించుకొన లేరని భారత ప్రజలు ఆంగ్ల ప్రభుత్వమునే కోరుచున్నట్లు ఆ కరపత్రములో ప్రచురించబడివున్నది. అక్కడున్న వాతా వరణమును పూర్తిగా మార్చుట ముఖ్యమని లజపతిరాయ్ భావించెను.
జర్మనీవారితో బ్రిటనుకు ఆ సమయములో వచ్చిన యుద్ధంలో అమెరికావారు బ్రిటన్ కు సహాయపడుచుండిరి. అందుచే అమెరికన్ లను సంతోషపరచుట కే వేత్తలు కృషిచేయుచుండిరి. ఇట్టి తరుణంలోనే లజపతిరాయి అమెరికాలో పర్యటించి భారతదేశమునగల వాస్తవిక పరిస్థితు లను వివరించి ముందుకు అమెరికన్ల సానుభూతి సంపా దించగల్గినచో బ్రిటిషు ప్రభుత్వము తన అభిప్రాయం, మార్చుకోగలదని లజపతిరాయ్ తన రాజకీయ పరిజ్ఞానముచే ఊహించెను అమెరికన్లు స్వేచ్ఛాప్రియులు. లజపతిరాయ్ సభలు జరిపి తన ఉపన్యాసములలో, వాగ్ధారణివలన గంభీరత నిజాయితీల మూలముగ ఆ దేశప్రజలను, మేధావులను తన భావములచే ప్రభావితు ను చేసెను. వివేకానందుడు హిందూ మతముపట్ల అమెరికన్లకు నచ్చజెప్పి వారి రాజకీయభావము లను మార్పు చెందించుటలో జయము సాధించెను.
అమెరికాలో ఉన్న తరుణముననే ఆయన “ఆర్యసమా జము-యువ భారతము – భారత దేశమునకు ఇంగ్లండు ఋణము” అను గ్రంథములను రచించెను. ఆ గ్రంథములు ప్రచురించబడిన పిమ్మట అమెరికా దేశీయులకు లజపతిరాయ్ అనిన అమిత గౌరవం కల్గెను. బ్రిటిషువారి కరపత్రములు లోని విషయములు సర్వాబద్ధములనియు భారతీయులు స్వాతంత్ర్య సంపాదనమునకై గట్టి ఆందోళన జరుపుచున్నా రనియు వ్రాసెను అమెరికాలోని పత్రికలు ఈ గ్రంథ మును బ్రిటిషుపార్ల మెంటుకుపంపగా వారు దానిని నిషేధించిరి. అప్పటికే చాలాకాపీలు అమెరికన్ల చేతులలోనికి పోయినవి.
లజపతిరాయి అమెరికాదేశంలో సాగించిన నిరంతర ప్రచారం వలన భారతీయులు నాగరికతజాతి అనియువారు స్వాతంత్ర్యం కోరుట అన్ని విధాల సమంజసమనియు అమెరికన్లు నమ్మితి, కేవలం ఉపన్యాసములు, వ్యాసములు, గ్రంథములు, మూలముననేగాక లజపతిరాయ్ మరియొక విధమునగూడ నిర్మాణాత్మక కృషి సాగించెను.
లోకమాన్య తిలక్, అనీబిసెంట్ సహాయంతో భారత దేశమున “హోంరూల్ లీగ్” అను సంస్థ స్థాపించి దాని శాఖ నొకదానిని అమెరికాలో ప్రారంభించెను అచట లీగ్‌ను నిర్వ హించుటలో లజపతిరాయ్క కేశవదాస్, హార్డికర్లు సహాయ పడిరి. తిలక్ కూడ 17వేల రూపాయలు విరాళమిచ్చుటతో అమెరికాలో శ్రీ సంవత్సరాల కాలం లజపతిరాయ్ అవిరళ ప్రచారం సాగించెను. “యంగ్ ఇండియా” అను నొక పత్రికను నిర్వహించెను. అందు భారతీయుల స్వాతంత్ర్య వాంఛను గూర్చి వివరంగా వ్రాసెను.
1919లో కూడ లజపతిరాయ్ భారతదేశమునకు తిరిగి వచ్చుటకు బ్రిటిషు ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ ప్రవా సము విధించుటకు కారణమును స్పష్టంగా తెలుపలేదు. కారతమంత్రి మాత్రము వారి రాక ప్రజారహితమునకు వ్యతిరేకమయినదని మాత్రము తెలిపెను యూరపు యుద్ధ ములో భారతీయుల సహాయం ఎక్కువయే గాంధీజీవంటి నాయకులు యుద్ధంలో సాయపడురని భారతీయులను ప్రోత్సహించిరి. లజపతిరాయ్ కూడ ఇటువంటి సందేశము లనే ఇచ్చెను. యుద్ధమున సాయపడినచో యుద్ధం ముగిసిన పిమ్మట బ్రిటిషు ప్రభుత్వం తమ కోరికను అంగీకరించునని అభిప్రాయపడిరి
కాని వారి ఆశలు నిరాశలయినవి.
మాంగు ఛెమ్సుఫర్డు సంస్కరణలను ప్రభుత్వము ప్రవేశ పెట్టి భారతీయులను సంతృప్తిపరచదలచెను. కానిభారత ప్రజలకు అంగీకార యోగ్యములు కాకుండెను. సంస్కరణలలో శాసనాధికారం మాత్రం గవర్నరు, వైస్రాయి ౦కే ఇచ్చి కొన్ని పరిమితమైన అధికారములే ప్రజలకియ్యబడి నవి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రౌలట్ చట్టముకు దేశ నాయ కులు వ్యతిరేకించి గ్రామగ్రామమునసభలు జరిపిరి. ఆంగ్లేయు లకు వ్యతిరేకంగా నడుపు ఉద్యమంనకు గాంధీజీ నాయకుడు.
ఇంతలో అమృత్ సర్ లో జలియన్ వాలాబాగ్ లో సమా వేశమయిన ప్రజానీకమును బ్రిటిషు సైనికులు చుట్టుముట్టి నిర్ధాక్షిణ్యంగా పశువులను చంపినట్లు ఏరులై పారెను. ఎందరో మహావీరులు నాయకులు ఆ సమా వేశంలో జరిగిన కాల్పులలో మరణించిరి ప్రభుత్వం జరి పించిన అత్యాచారం ప్రజలలో ఉద్రేకం కలిగించినది.ఈ వార్త తెలిసిన ఆయన భారత దేశమునకు తిరిగి పాలకులకు వ్రాసెను. లజపతిరాయ్ భారత సంఘటన గురించి విచారించుటకు నియమించబడిన హంటర్ కమీషన్ కూడ పోలీసుల చర్యనే సమర్థించెను.
అప్పుడు లజపతిరాయ్ అమెరికాలో ఉండెను. హృదయం ఎంతో బాధపడెను. పోనిమ్మని ఆయన పదేపదే బ్రిటిషు అప్పటి పంజాబు గవర్నర్ ఓడయ్యర్ దేశమునకు వచ్చిన వెంటనే అరెస్టు చేయగలడని ఆయన మిత్రులు కొందరాయనకు వ్రాసిరి. ఈలోగా ఆయనకు భారతదేశము వెళ్ళుటకు అనుమతి లభించినది. మిత్రుల లేఖలకు ఆయన ఏమియు భయపడక స్వదేశమునకు ప్రయాణమయ్యెను. తన ప్రజలేమైనాడో యని ఆయన మిక్కిలిగా పరితపించెను. అమెరికావారుకూడ లజపతిరాయ్ ఘనమైన వీడ్కోలొసంగిరి.
అమెరికన్లను గూడ భారతకిరాజకీయములందు ఆసక్తి కలిగించిన ఆయన తన ప్రవాస జీవితము దేశ సేవకే వినియోగించిన లజపతిరాయ్ జీవితము ఎంతో ధన్యమైనది. ప్రవాసకాలమందు గూడ ఆయన భారత ప్రజల అభ్యున్నతికి కృషిచేసిన నిష్కళంక దేశభక్తుడు.విదేశాలలో భారతీయుల స్వాతంత్ర్య పోరాటమునకు విశేషప్రచారం సాగించి ప్రవాస జీవితమునుండి బయటపడి స్వదేశంనకు తిరిగివచ్చిన లజపతిరాయ్క దేశప్రజలు ముఖ్యంగా పంజాబు ప్రజానీకం అఖండ స్వాగతమిఛ్చిరి. అమెరికాలో ఉన్న కాలమున బ్రిటిషువారు భారతదేశంనకు స్వయం నిర్ణ యాధికారం నీయగలరని లజపతిరాయ్ ఆశించెను. కాని తీరా ఇండియాకి వచ్చి చూచువారికి పరిస్థితులు చాల కన్పించెను. బ్రిటిషువారి ఒక విశ్వసించరాదను నిర్ణయము నకు ఆయన వచ్చెను. ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణ నన్నింటిని వ్యతిరేకించుటకే నిశ్చయించెను.
భారతీయుల సమస్యలకు అంతర్జాతీయ ప్రచారమును, స్థాయిని కల్పించిన మేటి నాయకుని గౌరవించుటకు తీర్మానించిరి. 1920లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు ప్రత్యేక సమావేశమునకు లజపతిరాయ్న అధ్యక్షునిగా ఎన్నిక చేసిరి. ఆ అధ్యక్ష స్థానము నుండియే లజపతిరాయ్ జలియన్
వాలాబాగ్ దురంతములను ప్రజల ప్రాణములతో చెలగాట మాడిన సంఘటనలు వివరించు ప్రభుత్వంపై 12 ఆరోపణలను మోపెను. అందులో ఒక్కదానికి గూడా ప్రభుత్వం సమా ఛానమీయక పోగా లజపతిరాయ్ ప్రసంగం ప్రజలలో కల్గించిన ఉద్రేకమునకు ప్రభుత్వం చలించినది.ఈ సభలోనే
గాంధీమహాత్ముడురూపొందించినసభలోనిబహుజనాభి సహాయ నిరాసహాయ నిరాకరణం చర్చకు వచ్చెను. వ్యక్తిగతముగ లజపతిరాయ్ అట్టి భావనకు వ్యతిరేకియైనను వారందరు ఆ ప్రతిపాదనను నెగ్గింతురా? అని భ్రమపడు చుండగా గాంధీమహాత్ముని “వ్యక్తిత్వ ప్రభావముచే ఆ తీర్మానం సభవారి ఆమోదమును పొందెను. ప్రాయమునకే లజపతిరాయ్ అంగీకరించెను.
కరణను గూర్చి ప్రసంగించుచు ఆయన “పర ప్రభుత్వంనకు గూడ మన మిప్పటివరకు సాయపడుచుంటిమి. కాని ఇప్పుడు వారి నిరంకుశ ధోరణికి వ్యతిరేకముగ నిరసన తెలియచేయు టకే ఈ సహాయ నిరాకరణము. ఇది సంపూర్ణ నిరాకరణము కాదు. ఈ ఉద్యమంలో మొదటిభాగముగ శాసనసభలు, న్యాయస్థానములు, పాఠశాలలు బహిష్కరించవలెను. దేశ మంతట కాంగ్రెసు శాఖలను స్థాపించి ప్రచార మొనర్చుట, హిందూ మహమ్మదీయ సఖ్యత, ఖద్దరును తయారుచేయుట తిలక్ స్వరాజ్యసిద్ధి అను పేర జాతీయ పోరాట నిధిని సేక రించుట, అస్పృశ్యతను మాన్పుట, కార్మికులకు శిక్షణ ఇచ్చుట_ఇవి ముఖ్యమయిన నిర్మాణ కార్యక్రమము” అనిసవివరముగ తెలిపెను.
ఇదికాక శాసనసభల బహిష్కారం ప్రభుత్వోద్యోగ ములు వదలి వచ్చి వేయుట. వారిచ్చిన గౌరవ బిరుదులను త్యజించుట – పన్నులు చెల్లించకుండుట ఇది రెండవ భాగం. ఈ కార్యక్రమమును
విజయవంతం చేయగలిగిన భారత ప్రజలు బ్రిటీషు ప్రభుత్వంపట్ల యెంత గాఢముగు వ్యతిరేకతను కల్గియున్నారో వారికి స్పష్టమగునని లజపతిరాయ్ ఆ సభలో ఉద్రేకంతో ప్రసంగించెను. ఈ ఉద్యమము ప్రజలకు కొత్త యగుటచే యీ కార్యక్రమమునకు విశేషమగు ప్రచారమును కాంగ్రెసు నాయకులు చేయవలసివచ్చెను. తన స్వరాష్ట్రమగు పంజాబులో ఆజపతిరాయ్ గ్రామగ్రామమునకు తిరిగి సహాయ నిరాకరణం గురించి ప్రజలకు నచ్చజెప్పుట ప్రారంభించెను.
ప్రభుత్వం నెపమేదో చూపి లజపతిరాయ్ ని నిర్బంధించు టకు సహాయమునకై నిరీక్షించుచుండెను. రాజద్రోహకరమైన ప్రసంగం చేసినావను కారణం చూపి ఆయనను అరెస్టుచేసి సంవత్సరమున్నరకాలం జైలు-శిక్ష విధించిరి. నాడు రాజకీయ ఖైదీలుకూడ సాధారణ నేరస్థులతో సమముగా గాలి, ‘వెలుతురు లేని చీకటి కొట్టంలో మ్రగ్గవలసిందే. వారిచ్చు ఆహారం ఎండిపోయిన రొట్టెలు, శనగలు, ఒక ఆరునెలలగు సరికి లజపతిరాయ్ ఆరోగ్యం చెడి తీవ్రమగు క్షయవ్యాధి సోకెను. ఆయన జై లులోనే మరణించునేమోనన్న భయముతో ప్రభుత్వ మాయనను జైలునుండి విడిచివేసెను. సోలన్ పర్వతప్రాంతమునకు పోయి లజపతిరాయి తనఆరోగ్యము మెరుగుపఱచుకొనివచ్చి మరల రాజకీయములలో ప్రవేశించెను.
ప్రజలలో రాజకీయ చైతన్యము కలిగించు బాధ్యత కూడ లజపతిరాయి పైననేపడెను. ఆర్యసమాజ వ్యాప్తికి సేవకులను ప్రోగుచేసి వారికి శిక్షణయిచ్చి సాంఘిక సేవ చేసిన అనుభవంతో లజపతిరాయ్ ఈ పనికి పూనుకొనెను. ప్రజలలో దేశభ క్తి, రాజకీయజ్ఞానం కలిగించుటకు కార్యకర్తలు వారికి సక్రమ శిక్షణ ముఖ్యంగదా! అందుకై ఒక జాతీయ పాఠ శాలను లాహోరులో స్థాపించెను. గాంధీమహాత్ముని పిలుపు విడిచి వచ్చినవారికి నందుకొని కళాశాలలు, పాఠశాలలు జాతీయ విద్యా కేంద్రములు నెలకొల్పబడెను. ఆ కేంద్రములకు ధనము, తిలక్ రాజకీయ కళాశాలకు తన నివాసగృహమునే ఇచ్చుట లజపతిరాయి త్యాగమునకు నిదర్శనములు.
లజపతిరాయ్ మరొక ముఖ్యసంస్థనుగూడ స్థాపించెను. దానిన లోక సేవక సంఘమని పేరిడెను. ఇందులో చేరు కార్య కర్తలు తమ కాలమంతయు దేశసేవకే వినియోగించుట వారి ముఖ్యధర్మము. వారు జీతం తీసికొనక తప్పనిచో తమ పోషణకు కావలసినంత ధనమును మాత్రమే తీసుకొనవలెనని నియమం. లాహోరులోని యీ లోక సేవక కేంద్రం పంజాబు రాష్ట్రమంతట ప్రారంభింపబడి దాని శాఖలు ప్రజలలో నూతన చైతన్యమును దేశభక్తిని కలిగించెను. అన్ని ప్రజా హితకార్యక్రమములలోను ఈ సంఘం పాల్గొనుచు తక్కువ కాలంలోనే ప్రజలలో అభిమానమును సంపాదించినది జాతీయ పోరాటంలో ఈ సంఘ కార్యకర్తలు కారాగార మనుభవించిరి. దానికి వారు వెనుకాడలేదు. భారత ప్రధానిగనుండిన లాల్ బహదూర్ శాస్త్రి కూడ ఈ లోక్ ్సవక కేంద్రంలో శిక్షితు డయినవాడే. అటువంటి జాతిరత్నముల నెందరినో యీ సంఘము దేశమున కప్పగించి పేరొందినది. ఈ సంఘసేవ లోనేగాక లజపతిరాయ్ పంజాబ్ లోని పారిశ్రామిక ప్రగతికి కారణభూతుడయ్యెను.
గాంధీజీ ప్రారంభించి దేశమంతట ప్రచారం పొందు చున్న సహాయ నిరాకరణ ఉద్యమము బ్రిటీషు ప్రభుత్వమున కొక తీరని సమస్యగా మారినది ప్రజలందరు విదేశీ వస్త్రము లను, వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్త్రము, వస్తువుల పట్ల అభిమానం చూపుటలో వారి వ్యాపారమునకు పెద్ద దెబ్బ తగిలింది గాంధి సహాయ నిరాకరణముతోపాటు సత్యాగ్రహ మును కూడ ప్రారంభించెను. ఈ క్లిష్ట పరిస్థితిని తట్టుకొనుట ఎట్లాయని ప్రభుత్వం హిందువులు, ముస్లిముల మధ్య భేద ములు కల్పించుటకు విషబీజాలు నాకెను. అందుచే స్వరాజ్య పోరాటమున పాల్గొనుటకు ముస్లిములు ముందుకు రాలేదు. మతకలహములు ఎక్కువ ముస్లి ములు హిందువులను బాధిం చుటకారంభించిరి. వారికి ప్రభుత్వ అండదండలుండుటయేదీనికి కారణము.
మహాత్ముడీ పరిస్థితిని గమనించి సత్యాగ్రహమును విరమించెను గాంధీకి ప్రభుత్వం ఆరుసంవత్సరములు శిక్ష విధించుటలో ఆ కార్యక్రమం కుంటుపడినది, ప్రజలలో రాజకీయచై తన్యము ప్రజ్వరిల్లి దేశముకొరకెట్టి రాజకీయచైతన్యము త్యాగములు చేయుటకైనను వారు సిద్దపడిరి. ఈ ఉత్సాహ మును పురస్కరించుకొని ప్రభుత్వము నెదిరించుటకుస్వరాజ్య దళము నొకదానిని స్థాపించవలెనని మోతీలాల్, సి.ఆర్. దాసులు నిర్ణయించిరి గాంధీజీ ప్రతిపాదించిన సహాయ నిరా కరణములోని భాగమున శాసనసభలలో ప్రజాప్రతినిధులు హాజరగుటమానిరి. ఆ కారణంగా గవర్నరులు వారి యిష్టం వచ్చినట్లు శాసనములు చేయుచుండిరి. అంతకంటే ప్రభుత్వ ములో కొనసాగుచు పోరాడుట మేలని అభిప్రాయము కొందరికి తోచినది.
మోతీలాల్ మున్నగువారికి కల్గిన యీ యూహతో లజపతిరాయ్ ప్రజాప్రతినిధిగ శాసన సభలలో పాల్గొని మోతీలాల్ మున్నగువారివలె లోనుండి పోరాటం సాగించెను. మోతీలాల్ ప్రకృతి విచిత్రమయింది. రాజకీయ వేత్తలు సాంఘిక కార్యక్రమములలో పాల్గొనరాదని ఆయన మతం. సమాజాభివృద్ధి కార్యక్రమంలలో సంస్కరణములలో ఎన్నడూ మోతీలాల్ పాల్గొని ఎరుగడు. కాని లజపతిరాయి తన సమాజమగు ప్రకృతి ననుసరించి సాంఘిక సేవతో పాటుగ రాజకీయములలో చురుకుగ పాల్గొనుచుండెను. విభిన్న ప్రకృ తులుగల వీరి అభిప్రాయ భేదములు సభలలో కూడ ప్రతి బింబించినవి. దానితో కస్వరాజ్యదళము” నుండి చీలిపోయివిసుగు చెందిన లజపతిరాయి “స్వతంత్ర స్వరాజ్య దళము” స్థాపించెను.
దళము పక్షముననే ఎన్నికలకు పోటీ చేసి గెలిచెను. మోతీలాల్ తన అభ్యర్థులను లజపతిరాయికి పోటీ పెట్టినను ఆయన రెండు చోటులందు పోటీచేసి గెలిచెనుమోతీలాల్ విషయ మిట్లున్నను జవహర్ లాల్ కు మాత్రము లజపతిరాయి అనిన విశేష గౌరవముండెడిది.బ్రిటీషు ప్రభుత్వం నానాటికి దేశంలో బలపడుచున్న ప్రజా ఉద్యమమును బలహీనపరచుటకు హిందువులకు ముస్లింలకు చీలికలు పెట్టెను. మతసంఘర్షణములతో వారుభ యులు సతమగుచుండగా బ్రిటీషువారు కుటిల రాజనీతి నుపయోగించిరి. దానిని తట్టుకొనుటకై మదన మోహన మాలవ్యా స్వామి శ్రద్ధానంద మున్నగువారు హిందూ మతస్తులను సంఘటిత పరచుటకు పూనుకొనిరి.
సాంఘిక సేవలో పేరుపొందిన లజపతిరాయి తన పలుకుబడి, ఆర్య సమాజ సేవలో గడించిన అనుభవమును పురస్కరించుకొని యీ హిందూ మతోద్ధారణ కార్యక్రమమున చి త్తశుద్ధితో పని చేసెను. లజపతిరాయికి భారతదేశమందే కాదు విదేశాలలో కూడా మహమ్మదీయ, క్రైస్తవ మిత్రులనేకులుండిరి. ఆయన హిందూ మతోద్ధరణకు పూనుకొనినందులకు కొందరు విమర్శించిరి. కాని లజపతిరాయికి మతోన్మాదముకాని, ఇతర మతమందలి అసహనము కాని కారణంకాదు. ముస్లిమ్ మత స్థుల విజృంభణ ఒకవంక, మిషనరీ ఫాదరీల బలవంత మొక ప్రక్క హిందూమతమును బలహీనపరచుటను ఉపేక్షించినచో కొంతకాలమునకు హిందూ మతమునకు హిందూ జాతికి ప్రమాద మేర్పడునన్న భయమే ఆయనను త్వర పెట్టినది.
మనదేశంలో బ్రిటీషు ప్రభుత్వం మాంటేగు ఛెమ్సుఫర్డు సంస్కరణలను ప్రవేశ పెట్టినపుడే పది సంవత్సరముల పిమ్మట ఒక ప్రత్యేక కమీషన్‌ను నియమించి ఆ సంస్కరణల ఫలితాలను సమీక్షింపవలయునని కూడ నిర్ణయించిరి. వంటి కమీషన్ ఏర్పాటు భారతీయులకు మేలు కలిగించగలదని స్వరాజ్యోద్యము నాయకులు ఆశతో నుండిరి. సైమన్ కమీషనును బ్రిటిషు ప్రభుత్వం ఏర్పరచెను. కాని ఆ కమీ షన్ లో ఒక భారతీయ సభ్యుడు కూడ లేకపోవుట మన నాయకులందరికి ఆశాభంగం కలిగించెను ప్రభుత్వమునకా విషయము తెలిసినను వారు భారతీయుల అభ్యర్థనను వినిపించు కొనలేదు. ప్రజలు నాయకులు కూడ ప్రభుత్వ వైఖరిని నిర ప్రభుత్వవైఖరిని సించిరి.
భారతీయులు తమ తీవ్ర అసమ్మతిని స్పష్టముగ ప్రదర్శించుట ఎట్లు? ఆ కమీషన్ ను బహిష్కరించ వలయునని ఒక్కుమ్మడిగ తీర్మానించిరి. ఆ నిర్ణయము దేశమంతట వ్యాపించెను. ఎక్కడివారక్కడ నల్ల జండాలు ప్రదర్శించుట ‘సైమన్ గోబాక్’ అని నినాదము నిచ్చుటకు సర్వసన్నాహ ములు జరిగెను. లాహోరు రైలుస్టేషను వద్ద కూడా అట్టి యేర్పాటే జరిగెను. ప్రజలు వేలసంఖ్యలో రైలు స్టేషనులోనే వేచియుండిరి. ప్రభుత్వం 144 సెక్షనును అమలు పరచెను. ఊరిలో నుండి ఒక పెద్ద ఊరేగింపు బయలుదేరి వచ్చి స్టేషనులో నున్న ప్రజలను కలువవలసి యుండెను. ఊరేగింపునకు అగ్రభాగమున లజపతిరాయి నిలుచుండి నాయకత్వం వహించుచుండెను. అమలులోనున్న 144 చట్టము ప్రకారము చెదిరిపొండని పోలీసులు ఊరేగింపుగా వచ్చుచున్న ప్రజలను కోరిరి.
కాని ప్రాణము లర్పించుట కైన సిద్ధపడియున్న ప్రజానీకము పోలీసులు హెచ్చరికలను వెడచెవిన పెట్టెను. పోలీసు అధికారులు ప్రజలపై లాఠీచార్జి చేయుటకు ఆజ్ఞలనిచ్చిరి. అమాయక ప్రజలపై లాఠీలుపడు చుండెను. అనేకుల తలలు బ్రద్దలగుచుండెను. రక్తప్రవాహం పారుచుండెను. ఆ భీపత్యము జరుగుచున్నను ప్రజలు చెక్కు చెదరలేదు. ముందునకు సాగిపోవుచుండిరి. పోలీసులు వారిని వెన్నంటి పోవుచుండిరి. ఊరేగింపునకు నాయకత్వం వహించిన లజపతిరాయి ఆయన దృఢ శరీరంపై గూడ లాఠీ దెబ్బలు తగిలినవి. సంకల్పుడు. రక్తము కారుచున్నను లెక్క పెట్టక ఊరేగిం పును నడిపించుచుండెను. ఒకలాఠీ ఆయన గుండెపై తగిలెను. చర్మము విచ్చిపోయి రక్తము స్రవించుచుండెను.
లజపతి రాయికి అమితమగు సంకల్ప బలము ఉన్నదికాని 60 ఏండ్లు మించిన వయను కలిగిన కారణముగ శరీరదారుఢ్యం తగ్గినది. ఆ గాయం తీవ్రతకు లజపతిరాయి తట్టుకొనలేకపోయెను. బ్రిటిషు ప్రభుత్వమూ యోధాగ్రహిణి పొట్టనబెట్టుకొన్నది. ఈ దుర్ఘ టన 1963 నవంబరు 7వ తేదీన జరిగెను. ఆయన వయస్సు 63 సంవత్సరములు స్వరాజ్య పోరాటమున భాగ ముగ ఒక నిరసన ప్రదర్శనలో సైమన్ గో బాక్” అను నినాదముల మధ్య ఆ వీరాగ్రణి నేలకొరిగెను. రణరంగముస అసువులు విడిచిన యుద్ధవీరులను పోలి లజపతిరాయి స్వాతంత్ర్య పోరాటంలో ముష్కరులగు బ్రిటిషు ప్రభుత్వము చేతులలో వీరమరణము నందెను.
లజపతిరాయి మరణవార్త దేశము నలుమూలల వ్యాపిం చెను. లాహోరు ప్రజలు ఆ మహనీయుని అంతిమయాత్రలో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధునికి అశ్రుతర్పణములందిం చిరి. లాలాజీ తన ఉపన్యాసములో పలుకుచుండిన మాటలు “నా నుండి చిందు ప్రతి రక్త బిందువునుండి వేలకొలది సమర యోధులుద్భవింతురు. ఇది నిశ్చయము” అనునవి ప్రజల చెవులలో రింగుమని ప్రతిధ్వనించుచుండ రావీనది యొడ్డున అజపతిరాయి అంత్యక్రియలు జరిగెను.
పంజాబు రాష్ట్ర ప్రజలు శోక సంతృప్త హృదయము లతో ఊరూర లజపతిరాయి మరణమునకు సంతాప సమావేశ ములు జరిపి శ్రద్ధాంజలి ఘటించిరి. పంజాబు ప్రజలు తమ ఆ ప్తమిత్రుడు, దగ్గర బంధువు మరణించినట్లు వాపోయిరి.
లజపతిరాయి మరణవార్తను వినిన గాంధీమహాత్ముడు యీ వార్తను కొంత సేపటి వరకు నమ్మక నిర్ఘాంతపోయెను. ఆయన నిర్వేదముతో “లాలాజి ఒక సంస్థ, ఆయనకీర్తి శాశ్వ తము. ఆయనకు మరణమను మాటలేదు. భారత ప్రజా హృదయాలలో ఆయన చిరంజీవి. విద్యారంగమునకు ఆయన సాటిలేని సేవచేసెను. విశాల దృక్పధముతో యావత్ప్ర పంచము తనదిగా భావించినాడు. కనుకనే ఈనాడు సర్వ ప్రపంచము ఆయనను మరువలేదు” అనినారు.
కాశీ విశ్వవిద్యాలయ మూలపురుషుడు, విద్యావేత్త రాజకీయ నాయకుడగు పండితమదనమోహన మాలవ్యా పతిరాయ్ మరణవార్త విని నిశ్చేష్టుడయ్యెను. “నిష్కళంక ప్రజానాయకుల మార్గదర్శకత్వం యీ దేశమున కిట్టి పరిస్థితు లలో చాల అవసరం. ఆయన గతించుట జాతికి దురదృష్టము. విద్యావేత్త, వక్త, పత్రికా సంపాదకుడు, నిరంతర నిరుప మాన కృషితో త్యాగంతో దేశ సేవచేసిన లజపతిరాయి దేశ ప్రజల మన్ననలు పొందినాడు. ఆయన జాతిరత్నము” అని తమ శ్రద్ధాంజలి ఘటించినారు.
ఆర్ధిక శాస్త్ర ప్రముఖులలో నొకడు. గాంధిమహాత్ముని అనుచరుడు, కాంగ్రెసు చరిత్రను వ్రాసి పేరుకెక్కిన రచ యిత శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య (డాక్టర్ పట్టాభి) ‘యుద్ధభూమిలో మరణించవలెనని వీరుడనిపించుకొనవలెనని ప్రతివారూ కాంక్షింతురు స్వాతంత్ర్య సమరాంగణమున అను వులు విడిచిన లజపతిరాయి అచ్చముగ వీరభూమి పంజాబులో జన్మించి ఆ రాష్ట్రమున తిరుగులేని నాయకుడై పరప్రభుత్వ మొనరించిన అన్యాయములను ధైర్యసాహసములతో ఎదిరించిన దిట్ట” ” యని తమ సంతాపం వెలిబుచ్చినారు. భారతభూమినే తమ మాతృదేశంగా పరిగణించిన విదేశీ పనిత, నలుబదేండ్లు భారత స్వాతంత్ర్య సంపాదనకు విదేశీయుల సానుభూతి నం దించగల్గిన అనీబిసెంటు లజపతిరాయి మరణంనకు దురసిల్లెను.
“బ్రాత్లా” తాము బయటనుండి ఆజ్ఞాపించుట లేదు’ తాముగూడ ప్రజలతో పాల్గొనుట ఉత్తమనాయక లక్షణము.” అనిన దానికి లజపతిరాయి ఒక ప్రత్యక్ష నిదర్శనం. అట్టి ప్రథమశ్రేణి నాయకుడు లేని లోటు భర్తీకాదు. లజపతి రాయి మరణం అత్యంత విషాదకరమయినను నిర్భయంగ సైమన్ కమీషన్ నెదిరించు మహత్కార్యములో ప్రాణములు త్యజించుట భారతీయులందరికి గర్వకారణం ఆయన ఆదర్శ జీవితం భావితరములవారికి మేలుబంతి కావలె”నని పలికినది.
లజపతిరాయికి “పంజాబు కేసరి” అను బిరుదు సర్వ విధముల తగియుండెను. శౌర్యసాహసములకు ఆయన కాయ నయే సాటి. తమ అభిప్రాయాలను నిష్కర్షగ జంకు గొంకులు లేక ప్రకటించు ధైర్యశాలి. దేశభక్తుడు, రాజకీయ వేత్తయే కాదు విద్యావేత్తకూడ లక్షలాదిగ వచ్చు సంపాద నను తృణప్రాయంగ త్యజించి దేశ సేవకు కంకణం కట్టిన మూర్తి, ప్రజలలో ప్రచారమునకు ప్రతికలకు గ్రంథములను సాధనంగా నుపయోగించిన ఉత్తమ సంపాదకుడు, రచయిత, దేశమును గాఢముగ ప్రేమించి ప్రజా బాహుళ్యంలో స్థబ్దతను పారద్రోలి చైతన్యశక్తి కలిగించిన మహనీయులలో లజపతిరాయ్ ముఖ్యుడు. కుటిల రాజనీతి నుపయోగించు బ్రిటిషు ప్రభుత్వం నిష్కామముగా ప్రవాసమందినను శిక్షను దేశ సేవకే వినియోగించిన ధైర్యశాలి లజపతిరాయి.
అమెరికాలో నున్న కాలమున ఆ దేశములో బ్రిటీషువారి దుష్ప్రచారమును నమ్ముచేసి ఆ దేశీయుల సానుభూతిని మన దేశమున కనుకూలముగా మార్పుచేసిన రచయిత, వక్త ఆయన. అట్టి నిష్కళంక దేశభక్తుని, రాజకీయవేత్త ఆదర్శ జీవితం నేటి యువతరమునకు మార్గదర్శకమగునుగాక! లజపతిరాయ్ ఆత్మశాంతి కలుగుగాక !
………………………………………………………………………… సమాప్తం …………………………………………………………………………