KANDUKURI VEERESALINGAM

The great social reforms undertaken by Kandukuri Veeresalingam for women.


KANDUKURI VEERESALINGAM చేపట్టిన సంస్కరణలలో స్త్రీజనోద్ధరణ ముఖ్యమైంది. వాస్తవానికి 19వ శతాబ్దంలో భారతదేశంలోని సంస్కరణోద్యమాల్లో కూడా ఈ అంశమే ప్రథమస్థానాన్ని ఆక్రమించుకొన్నది. దీనిక్కారణం స్త్రీలు అనేక శతాబ్దాల నుండి సాంఘిక వివక్షకు గురవుతూ వచ్చారు. తీవ్ర అణచివేతకు గురై ఏ హక్కులూ లేకుండా దాస్యంలో మగ్గుతున్నారు.

KANDUKURI VEERESALINGAM,

చరిత్రలో ఒకప్పుడు బలంగా ఉన్న మాతృస్వామిక వ్యవస్థలోతప్ప వీరికి సొంత వ్యక్తిత్వము, ఆత్మగౌరవము ఉండడానికి అవసరమైన ఆస్తిహక్కులు లేవు. స్త్రీలను పట్టి పీడించిన అంశాలలో ముఖ్యమైనవి : 1. బాల్యవివాహాలు 2. నిర్బంధ వైధవ్యం 3. బహుభార్యాత్వం 4. అవిద్య 5. సాంఘిక స్వేచ్ఛ లేకపోవడం. అప్పటి స్త్రీల స్థితిగతుల గూర్చి ఒక సమకాలీన రచయిత ఈవిధంగా చిత్రించాడు. “విద్యకు దూరమై, ఇంటినాలుగు గోడలమధ్య బందీలై, ప్రపంచం ఏమీ చూడకుండా, ప్రపంచం గురించి ఏమీ తెలియకుండా, మూఢవిశ్వాసాలలో మునిగి, ఆచారాల చేత పీడింపబడే మన మహిళలు- చెప్పుకుంటే సిగ్గుచేటు-బానిసలకంటేఏవిధంగానూ నయం కాదు”.

స్త్రీ జనోద్ధరణతో పాటు మిగతా సంస్కరణలకు సంబంధించిన ఉద్యమాలు చేపట్టేముందు KANDUKURI VEERESALINGAM వీటిని గూర్చి సమాజంలో ప్రజాభిప్రాయాన్ని . కూడగట్టడానికి ప్రయత్నాలు చేశాడు. సంస్కరణల కవసరమైన భావజాలాన్ని పెంపొందించుకున్నట్టుగా గత అధ్యాయంలో చూశాము. భావాలను ఆచరణలోకి తెచ్చినప్పుడే అవి ఉద్యమాల రూపం ధరిస్తాయని మనం తెలుసుకున్నాము. ఉద్యమాలు ప్రారంభించే ముందు వాటిక్కావలసి వాతావరణంలో భాగంగానే ప్రజల మనస్సులను వాటికనుగుణంగా చేయడానికి వీరేశలింగం కృషి చేశాడు.

సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో స్త్రీలకు సంబంధించినవి, పరిపాలనలోని అవినీతి, వేశ్యావృత్తి, విగ్రహారాధన, ఆస్తికత్వం మొదలైన సమస్యల గూర్చి ప్రజలను చైతన్యవంతులను చేయాలనుకొన్నాడు. దీనికోసం ఆయన పాత్రికేయుడుగా తన ‘వివేకవర్ధని’ పత్రికతో పాటు ఇతర పత్రికల్లో కూడా రచనలు చేశాడు. సాహిత్యకారుడిగా ఎన్నో రచనలతో పాటు ఉపన్యాసాలిచ్చి కార్యసాధనకోసం సాంఘిక సమాజాన్ని స్థాపించాడు.

1874లో ఆయన ఆంగ్లో-వెర్నాక్యులర్ పాఠశాలకు హెడ్ మాస్టరుగా ఉన్నప్పుడు కొద్దిమంది సభ్యులతో ఒక సంఘం ప్రారంభించాడు. ఇది ప్రధానంగా స్త్రీవిద్యను గూర్చి చర్చించేది. ఈ సంఘ కృషి ఫలితమే అదే సంవత్సరం సెప్టెంబర్ మాసంలో బాలికల పాఠశాల ఒకటి నెలకొల్పాడు. ఇంకా, ఈ సంఘం మత, నైతిక సమస్యలతో పాటు దేశ పురోభివృద్ధి గూర్చిన విషయాలను చర్చించేది. ఇదిలా వుండగా 1875 జులైలో బసవరాజు గవర్రాజు కార్యదర్శిగా రాజమండ్రి రాష్ట్ర పాఠశాల క్లబ్బు ఏర్పడింది. ఇది సామాజిక, నైతిక సమస్యలపై చర్చించడం, ఉపన్యాసాలు ఏర్పాటు చేయడంతో పాటు దాని సభ్యులు నీతిమంతంగా జీవనం సాగించి, ఇతరులకు ఆదర్శంగాఉండాలి.

CHILD MARRIAGES,


KANDUKURI VEERESALINGAM స్త్రీవిద్యపై ‘ఆంధ్రభాషా సంజీవని’ (మద్రాసు) సంపాదకుడైన కొక్కొండ వెంకటరత్నంతో వివాదానికి దిగి మచిలీపట్నం నుండి వెలువడుతున్న ‘పురుషార్థ ప్రదాయిని’లో వ్యాసాలు రాశాడు. కొక్కొండ వెంకటరత్నం మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడు. ఉద్ధండ పండితుడు. భాష, సాంఘిక సంస్కరణలకు ఆయన వ్యతిరేకం. తన భావాలను స్వేచ్ఛగా, నిరాటంకంగా ప్రచురించేందుకు అనువుగా వీరేశలింగం ‘వివేకవర్ధని’ పత్రికను 1874లో ప్రారంభించాడు.

ప్రజాభిప్రాయాన్ని సాంఘిక దురాచారాలపై ప్రసరింప జేయడానికి KANDUKURI VEERESALINGAM ‘బ్రాహ్మ వివాహం’, ‘వ్యవహార ధర్మబోధిని’ అనే రెండు ప్రహసనాలను రాశాడు. అవి బహుళ ప్రజాదరణ పొందాయి. ‘బ్రాహ్మ వివాహం’ బ్రాహ్మణ వివాహాల్లోని మూఢాచారాలను, లోటుపాట్లనుKANDUKURI VEERESALINGAM ఎత్తిచూపింది. ‘వ్యవహార ధర్మబోధిని’ ప్రభుత్వోద్యోగులలో నెలకొన్న అవినీతిని దుయ్యబట్టింది. రాజమండ్రి సంఘసంస్కరణ సమాజం 1878, సెప్టెంబరు 8న స్థాపించడంతో ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలన్న ఆయన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. ఈ సమాజం ప్రతివారం సమావేశాలు జరిపి, సాంఘిక సమస్యలు చర్చించి అందుకనుగుణ్యమైన కార్యక్రమాలను చేపట్టింది.

19వ శతాబ్దపు ఉత్తరార్ధం నాటికి ఆంధ్రదేశం విద్యావిషయికంగా ఎంతో వెనుకబడి వుంది. ప్రత్యేకించి స్త్రీవిద్య మరీ వెనుకబడి ఉండడంలో ఆశ్చర్యం లేదు. స్త్రీవిద్య పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో పాటు ఉపేక్ష ఉండేది. స్త్రీలు చదువుకోకూడదని, చదువుకుంటే కుటుంబానికి అరిష్టం దాపురిస్తుందని అనుకునేవాళ్ళు. చదువుతో పాటు లలితకళల్లో నైపుణ్యం కేవలము దేవదాసీలకు మాత్రమే ఉండాలని భావించేవాళ్ళు. విద్యను గూర్చి, అందులోనూ స్త్రీవిద్యకు సంబంధించి, కంపెనీ ప్రభుత్వం 1860 దశకం దాకా జరిపిన కృషి దాదాపు శూన్యం.

మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తంలో దేశీయ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో కేవలం 3.17% బాలికలు ఉండేవారని, మన్రో జరిపించిన సర్వేలో తేలింది. కాని స్త్రీవిద్యకు సంబంధించి మిషనరీల కృషి మెచ్చుకోదగింది. నిజానికి స్త్రీ విద్య ప్రారంభకులు వారే. మద్రాసు నగరంలో మొదటిసారిగా వారు పాఠశాలలతో పాటు వసతి గృహాలు కూడా నిర్మించారు.

1874లో ధవళేశ్వరంలో KANDUKURI VEERESALINGAM బాలికల పాఠశాల స్థాపించాడని మనం చెప్పుకున్నాము. కొందరు పరిశీలకులు భావించినట్లు అది ఆంధ్రదేశంలో స్థాపించిన మొదటి పాఠశాల కాదు. మిషనరీల కృషితో పాటు స్త్రీ విద్యారంగంలో కొందరు సంపన్నులైన దేశీయులు ఈ సందర్భంగా కృషి చేశారు. విశాఖపట్నం జిల్లాలోని ప్రసిద్ద గోడే వంశానికి చెందిన సూర్యప్రకాశరావు భార్య శ్రీమతి జానకమ్మ 1867 ఏప్రిల్లో విశాఖపట్నంలో హిందూ బాలికా పాఠశాల ప్రారంభించింది. ఆమె మరణానంతరం కుమార్తె శ్రీ శ్రీమతి రత్నమ్మ ఆ పాఠశాల నిర్వహణ బాధ్యతను వహించింది.

1868లో రాజపుత్ర, బ్రాహ్మణ బాలికల కొరకు విజయనగరంలో మహారాజావిజయరామ గజపతి ఒక పాఠశాల ప్రారంభించాడు. స్త్రీవిద్యకొరకు 1868లోనే పిఠాపురం రాజా కాకినాడలో ఒక బాలికల పాఠశాల ప్రారంభించాడు. ఈ పాఠశాలలన్నీ స్త్రీవిద్యను కొంతమేరకు ప్రోత్సహించాయి. స్త్రీవిద్యపై రాజమండ్రిలోని విజ్ఞానవంతులైన పెద్దలు రెండుభాగాలుగా విడిపోయారని తెలుసుకున్నాం. సాంప్రదాయ వర్గానికి కొక్కొండ వెంకటరత్నం నాయకత్వం వహించగా, సంస్కరణవాదులకు KANDUKURI VEERESALINGAM కొమ్ముకాశాడు.

,KANDUKURI VEERESALINGAM తన వివేకవర్ధని పత్రికలో స్త్రీవిద్యలో భాగంగా ఆంగ్లవిద్య, పాశ్చాత్య విజ్ఞానం స్త్రీలకు అందజేయాలన్న ఆవశ్యకతను వివరిస్తూ వ్యాసాలు రాశాడు. ఇది స్త్రీవిద్యా ఉద్యమానికి నాంది పలికింది. KANDUKURI VEERESALINGAM రచనలను హేళన చేసేందుకు కొక్కొండ ‘హాస్య వర్ధని’ అనే పత్రికను ప్రారంభించాడు. కొక్కొండ విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కోడానికి వీరేశలింగం వివేకవర్ధని పత్రికకు అనుబంధంగా ‘హాస్య సంజీవని’ (కొక్కొండవారి పత్రిక ‘ఆంధ్రభాషా సంజీవని”) ముద్రించాడు.https://photos.app.goo.gl/yW29ixGxuE8NrfUq7

స్త్రీవిద్యా ఉద్యమం ఆంధ్రదేశంలో పలుప్రాంతాలకు ముఖ్యంగా, మచిలీపట్నం, విశాఖపట్నం, బళ్ళారిలకు విస్తరించింది. దాసు శ్రీరాములు (1846-1908)లాంటి ప్రముఖ విద్వాంసులు స్త్రీవిద్య వ్యాప్తికి అవిరళ కృషి చేశారు. ప్రజా వ్యతిరేకతకు వెరవక తన కుమార్తెకు విద్యాబుద్ధులు గరపి సంగీతం కూడా నేర్పించాడు. ఆ రోజుల్లో భోగంవారు మాత్రమే సంగీతం నేర్చుకొనేవారు. 1881లో బాలికల పాఠశాల నొకదానిని రాజమండ్రిలో KANDUKURI VEERESALINGAM ప్రారంభించారు. ఇది స్త్రీ విద్యావ్యాప్తికి ఆయన చేస్తున్న కృషికి ఫలశ్రుతి.

స్త్రీవిద్యతో పాటు స్త్రీలలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు, వారిలో దాగి వున్న సృజనాత్మకతను వెలికి తెచ్చేందుకు స్త్రీల పత్రికల అవసరాన్ని KANDUKURI VEERESALINGAM గుర్తించాడు. 1883లో ‘సతీ హితబోధిని’ని ప్రారంభించాడు. ఈ పత్రికలో స్త్రీల ఆరోగ్యం, చిన్న పిల్లల ఆరోగ్యం, స్త్రీవిద్య లాంటి విజ్ఞానదాయకమైన రచనలు వెలువడేవి. ‘సతీ హితబోధిని’ని ఆదర్శంగా గొని, ‘హిందూ సుందరి’, ‘జనానా’, ‘తెలుగు జనానా’, ‘కామేశ్వరి’, ‘చింతామణి’, ‘సావిత్రి’ మున్నగు మహిళా పత్రికలు ఆ తర్వాత వెలువడ్డాయి.

KANDUKURI VEEREASALINGAM,

KANDUKURI VEERESALINGAM వీటిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా రచనలు చేసేవారు. ‘సావిత్రి’ లాంటి పత్రికలకు స్త్రీలే సంపాదకత్వం వహించారు.KANDUKURI VEERESALINGAM స్త్రీ సమస్యలకు సంబంధించిన అనేక వ్యాసాలు, గ్రంథాలు రాశాడు. స్త్రీల ఆరోగ్య సమస్యలగూర్చి శాస్త్రీయంగా ‘దేహారోగ్య ధర్మబోధిని’ని తన ‘సతీ హితబోధిని’ పత్రికలో సీరియల్గా ప్రకటించి, దాన్ని 1889లో గ్రంథరూపంలోకి తెచ్చాడు.

ఆయన ప్రచురించిన మరో గ్రంథం ‘పత్నీహిత సూచని’. ఇది స్త్రీల ప్రసూతి, శిశుజననం, బిడ్డల శిక్షణ గురించిన గ్రంథం (1896). ఇవిగాక స్త్రీలపై ఎన్నో కావ్యాలు, శతకాలు రాశాడు. వీటన్నిటిలో ఆయన చెప్పింది ఒకటే. స్త్రీవిద్యను ప్రోత్సహించి ఆమెకు కుటుంబంలోనూ, సమాజంలోనూ తగిన హోదాను, గౌరవస్థానాన్ని కల్పించాలని నొక్కి చెప్పాడు. ఆయన రాసిన గ్రంథాలన్నింటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు.

జొనాథన్ స్విఫ్ట్ ఆంగ్లంలో రాసిన ‘గలివర్ ట్రావెల్స్’ గ్రంథనమూనాలో రచించిన గ్రంథం ఇది. హాస్యంతో కూడిన రచన కావడంతో ఈ గ్రంథం జనరంజకమైంది. స్త్రీలమీద పురుషులు చలాయిస్తున్న పెత్తనాన్ని అపహాస్యం చేసి అభ్యుదయ భావవ్యతిరేకులైన పురుషులను వ్యంగ్యంగా ఈ గ్రంథం విమర్శించింది.
కేవలం రచనలతోనే సరిపెట్టుకోక KANDUKURI VEERESALINGAM రాజమండ్రిలో బాలికల లోయర్ సెకండరీ పాఠశాలను 1905లో స్థాపించాడు. ఈ పాఠశాల ఆయన స్థాపించిన వితంతు శరణాలయానికి అనుబంధంగా ఉండేది.

KANDUKURI VEERESALINGAM ప్రారంభించిన ఉద్యమం అనేకమందికి స్ఫూర్తిదాయకంగా నిల్చింది. ఎందరో స్త్రీల విద్యావ్యాప్తికి విరాళాలివ్వడం, పాఠశాలలను స్థాపించడం, అధికసంఖ్యలో ఆడపిల్లలను చదివించడం KANDUKURI VEERESALINGAM కృషి ఫలితాలుగా చెప్పుకోవచ్చు. 1890లో భీమవరంలో ఒక బాలికల పాఠశాల, సొంతభవనంతో, 90మంది విద్యార్థినులతో మొదలైంది. గుంటూరులోని స్త్రీ సమాజం 1908లో ఒక బాలికల పాఠశాలను ఏర్పరిచింది.

స్త్రీవిద్యావ్యాప్తి విస్తృతస్థాయిలో జరిగిందని చెప్పడానికి వీల్లేదు కానీ స్త్రీవిద్యా ప్రాముఖ్యాన్ని ప్రజలు గుర్తించేటట్లుగా చేసింది ఈ ఉద్యమం. స్త్రీవిద్యతో పాటు వారి అభ్యున్నతికి సమావేశాలు,సభలు, ఉపన్యాసాలు, విద్యా సాంస్కృతిక కార్యక్రమాలు ఆంధ్రదేశంలో అనేకచోట్ల ఆరంభమైనాయి. ఇవి స్త్రీల అభ్యున్నతికి తోడ్పడ్డాయి. ఆంధ్రదేశంలోని పలు పట్టణాలలో స్త్రీ సమాజాలు ఏర్పడ్డాయి.

విజయవాడ, గుంటూరు, కుముదవల్లి, బళ్ళారి, మచిలీపట్నం, రాజమండ్రి, విశాఖపట్నం, అనంతపూర్, కాకినాడలలో మహిళా సంఘాలు ఏర్పడి సమావేశాలు నిర్వహిస్తూ స్త్రీల సమస్యలను చర్చిస్తూ ఉండేవి. ఇందులో కొన్ని సమాజాలు స్త్రీలకొరకు ప్రత్యేకంగా గ్రంథాలయాలను నెలకొల్పాయి. కొన్ని సందర్భాల్లో ఇవి పత్రికలను నిర్వహించాయి. 1910 నుండి అఖిలాంధ్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ స్త్రీల మహాసభలు జరిగాయి. సామాన్య విద్యతో పాటు స్త్రీలకు వృత్తివిద్య పాఠ్యాంశంగా చేర్చాలని ఈ సభలు తీర్మానించాయి.

స్త్రీలలో పెల్లుబికిన ఈ చైతన్యం ఎంతోమందిని రచయిత్రులుగాను, వ్యాసకర్తలుగాను తీర్చిదిద్దింది. తెలుగులో స్త్రీలకుపయోగపడే గ్రంథాలు రచించిన కొందరు గొప్పవారిలో భండారు అచ్చమాంబ (1874-1905) ‘అబలా సచ్ఛరిత్ర రత్నమాల’ అనే గ్రంథాన్ని రాశారు. కొటికలపూడి సీతమ్మ (1872-1934) ‘శ్రీ కందుకూరి వీరేశలింగం చరిత్రము’ అనే పద్య కావ్యాన్ని 1898లో ప్రచురించారు. సీతమ్మ వీరేశలింగం భావాలచే ప్రభావితురాలై ఆయన సంస్కరణ కార్యకలాపాల్లో పాల్గొని రాజమండ్రి ప్రార్థనా సమాజం స్త్రీల విభాగ నిర్వహణలో పాలుపంచుకొన్నారు.

‘అహల్యాబాయి సంక్షిప్త జీవిత చరిత్ర’తో పాటు శతకాలను, స్త్రీలు నిర్వహించాల్సిన విధులను ఆమె వివరించేది. పులుగుర్త లక్ష్మీనరసమాంబ ‘మహిళా కళాబోధిని’ అనే గ్రంథాన్ని రచించి ప్రముఖ పత్రికా రచయిత్రిగా, సమర్థవంతమైన మహిళా ఉద్యమ నిర్వాహకురాలిగా ఖ్యాతి గడించారు. 1890 దశకం నుండి నిర్వహింపబడుతూ వచ్చిన మండల సంఘ సంస్కరణ సభల్లో మహిళా ప్రతినిధులు పాల్గొనటం స్త్రీల ఉద్యమ వ్యాప్తికి మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మద్రాసు ప్రెసిడెన్సీ పరిపాలన నివేదిక (1890-1900)లో ఆంధ్రదేశంలో జిల్లాలవారీగా ఉన్న

స్త్రీల అభ్యున్నతికి తోడ్పడాలన్న ధ్యేయంతో వీరేశలింగం ప్రారంభించిన స్త్రీవిద్యా ఉద్యమం కాలక్రమేణా, 1870 దశకం నుండి 20వ శతాబ్దం మొదటి దశకం వరకు, వృద్ధి చెందుతూ వచ్చి వారిలో సామాజిక, సాంస్కృతిక చైతన్యాన్ని కలిగించింది. సామాన్య విద్యతో సరిపెట్టుకోకుండా ఉపాధి చూపించే వృత్తివిద్య కావాలని స్త్రీ సంఘాలు డిమాండు చేశాయి. ఆంగ్లభాష నేర్చుకోవడం, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, సభలూ, సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది.

ఉపన్యాసాలతో పాటు గ్రంథాలు రచించే స్థితికి స్త్రీలు ఎదిగారు. పాఠశాలలకెళ్ళే బాలికలసంఖ్య గణనీయంగా పెరిగింది. 1881లో 67 బాలికల పాఠశాలలకు 2569 మంది బాలికలు హాజరవుతుండగా, 1908 నాటికి 329 పాఠశాలల్లో 17,091 మంది బాలికలు విద్యనభ్యసిస్తూ వుండినారు. పాతభావాలను వదిలిపెట్టి మారుతున్న పరిస్థితుల కనుగుణ్యంగా కొత్తభావాలతో చదువుకున్న స్త్రీలు ప్రజాజీవితంలోకి ప్రవేశించారు. KANDUKURI VEERESALINGAM మొదలు పెట్టిన స్త్రీజనోద్ధరణ సంస్కరణోద్యమాల్లో భాగంగా పెంపొంది ఆ తర్వాత 20వ శతాబ్దంలో రూపుదిద్దుకొన్న జాతీయోద్యమానికి బాసటగా నిల్చింది.

వివాహ సంస్కరణలు బాల్య వివాహాలు-కన్యాశుల్కం
సంఘ సంస్కరణోద్యమాల్లో బాల్య వివాహాలు, కన్యాశుల్క సమస్యలు సంస్కర్తల దృష్టిని ఆకట్టుకున్నాయి. ఈ రెండు సమస్యలతో పాటు వితంతు పునర్వివాహసమస్య కూడా సంస్కర్తలు చేపట్టారు. బాల్య వివాహాలు ప్రధానంగా బ్రాహ్మణుల్లో ఉండేవి. అభం, శుభం ఎరుగని వయసురాని బాలికలకు పెళ్ళిళ్ళు చేయడం ఏవిధంగానూ హేతుబద్ధం కాదు. దురదృష్టవశాత్తు వీటికి, మతానికి ముడిపెట్టారు. ఎనిమిది ఏళ్ళు నిండకముందే బాలికలకు వివాహం జరపకుంటే, వారి తల్లిదండ్రులు పాపం మూటగట్టుకుంటారని పవిత్రగ్రంథాలు చెబుతున్నట్టుగా ప్రచారంలో వుండింది.

WIDOWS MARRAIAGES,

ఈ దురాచారానికి వ్యతిరేకంగా దంపూరు నరసయ్యలాంటి విజ్ఞులు ఒకరిద్దరు రచనలు చేశారు. “Letters on Hindu Marriages” అనే గ్రంథాన్ని నరసయ్య రాశాడు. బాల్య వివాహాలను నిరసిస్తూ దక్షిణభారతదేశంలో రాసిన మొదటి గ్రంథమిది. మనుస్మృతితో సహా అనేక స్మృతులు, శాసనాల నుండి నరసయ్య అనేక ఉల్లేఖనలు చేసి, వాటిలోని భావాలకు బాల్య వివాహాలు విరుద్ధమని ప్రకటించాడు. యుక్తవయస్సు వచ్చిన ఆడపిల్లలకు వరుడిని ఎంచుకొనే స్వేచ్ఛ ఉండాలని కూడా నరసయ్య ఈ సందర్భంలో చెప్పాడు.

ధర్మశాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి ఆధారంగా KANDUKURI VEERESALINGAM బాల్య వివాహాలు సమర్థనీయం కావన్న నిర్ణయానికి వచ్చాడు. 1884లో ఈ విషయంపై వీరేశలింగం విపులంగా విశ్లేషించాడు. బాల్య వివాహాలు చేసుకున్న బాలికల్లో 80% మంది వితంతువులవుతున్నారని, ఈ దురాచారాన్ని నివారించ డానికి వివాహితులైన పురుషులకు విశ్వవిద్యాలయ పరిక్షలు రాయడానికి కాలపరిమితి విధించి వారిని ఉపకార వేతనాలకు, బహుమతులకు అనర్హులుగా చేయాలన్నది మొదటిది. రెండు, పెళ్ళికాని అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వాలి.

‘బ్రాహ్మ వివాహము’ అనే ప్రహసనాన్ని వీరేశలింగం రాశాడని ముందే తెలుసుకున్నాం. ఇందులో బాల్య వివాహాలవల్ల ఉత్పన్నమయ్యే కష్టాలను, కన్యాశుల్క సమస్యను, పెళ్ళికిచేసే దుబారా ఖర్చును ఎంతో సహజంగా చిత్రించాడు. ఈ సాంఘిక ప్రహసనం ‘పెద్దయ్యగారి పెళ్ళి’ (అంటే వృద్ధుడి వివాహం) పెళ్ళిగా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. దీని ప్రభావంతో అప్పుడు వాడుకలో జరుగుతున్న అనేకానేక వివరాలను పత్రికలు వెలుగులోకి తెచ్చాయి.

ఈ దురాచారం ఎంత హీనస్థితికిదిగజారిందంటే 10 నెలలలోపు వయస్సున్న ఆడపిల్లలకు కూడాపెళ్ళిళ్ళు చేసినట్లు అప్పట్లో ‘బుద్ద విధేయి’, ‘తెలుగు జనానా’ పత్రికలు వార్తలు రాశాయి. రాజమండ్రి సంఘ సంస్కరణ సమాజం ఈ సమస్యను తలకెత్తుకొని బాలికలకు 10 ఏళ్ళు, బాలురకు 14ఏళ్ళు వయస్సు రాకుండా వివాహాలు చేయరాదన్న చట్టాన్ని తేవడానికి కృషి నారంభించింది. అంతేగాక 14 ఏళ్ళు బాలికకు, 18 ఏళ్ళు బాలురకు రాకుండా దాంపత్యజీవనం సాగించరాదని కూడా తీర్మానించింది.

సంఘ సభ్యులు బాల్య వివాహాల్లో పాల్గొనరాదని ప్రతిజ్ఞ చేశారు. వివాహ వయఃపరిమితిని చట్టబద్ధం చేయాలన్న మలబారీ (మహారాష్ట్ర) ఉద్యమానికి బాసట తెలపమని మహాదేవ గోవింద రానడే వీరేశలింగానికి దానికి సంబంధించిన పత్రాలు పంపాడు. వాటిని పూర్తిచేసి, సంతకాలు పెట్టి వీరేశలింగం తిరిగి రనడేకు పంపించాడు. ఆంధ్రదేశంలో KANDUKURI VEERESALINGAM నిర్వహించిన సమావేశాల్లో, సభల్లో ఈ సమస్యపై తీర్మానాలు చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు.


కన్యాశుల్క ఆచారం ప్రధానంగా బ్రాహ్మణ, వైశ్యకులాల్లో ఉండేది. బాల్య వివాహాల వల్ల వృద్ధులైన భర్తలు చనిపోవడంతో బాలవితంతువులు సమాజంలో అధికసంఖ్యలో వుండేవారు. దీనికితోడు వయసు వచ్చిన ఆడపిల్లలకు వివాహం చేయకూడదనే ఆచారం వల్ల కూడా స్త్రీలకు వైధవ్యం ప్రాప్తించేది. పురుషులకు పునర్వివాహం సాధ్యం కావడంతో, వయసు మళ్ళిన పురుషులు తమ తదనంతరం మతకర్మలు చేయడానికి, ఆస్తిపాస్తులు పొందడానికి వారసులు వుండాలనే కోరికతో పెళ్ళికూతుళ్ళను కొనేవారు.

KANDUKURI VEERESALINGAM తన ఉపన్యాసాల్లో, రచనల్లో ఈ దురాచారాన్ని ఖండించాడు. ధర్మశాస్త్రాల సహాయంతో కన్యాశుల్కం అనుసరణీయం కాదని చెప్పాడు. డబ్బుతో కొన్న వధువు దాసి అవుతుంది గానీ, భార్య ఎన్నటికీ కాలేదని మనుధర్మశాస్త్రం చెప్తున్నదని వీరేశలింగం రాశాడు. మతకర్మలతో పితృ దేవతలను పూజించే ఆచారానికి డబ్బుతో కొన్న స్త్రీలు అనర్హులని చెప్పాడు. సమాజంలో అగ్రభాగాన బ్రాహ్మణులు ఈ దుర్మార్గపు దురాచారాన్నిమానుకోవాలన్నాడు.

KANDUKURI VEERESALINGAM నాయకత్వంలో రాజమండ్రి సంఘసంస్కరణ సమాజం ఈ దురాచారాన్ని మానుకోవాలని ప్రచారం చేపట్టింది. దానిని నిషేధిస్తూ చట్టం చేయాలని తీర్మానం చేసింది. కన్యాశుల్క వ్యతిరేకోద్యమం ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. విజయనగరం మహారాజా ఈ సమస్యను 1888లో మద్రాసు శాసనసభలో ప్రస్తావించారు. అయినా ప్రభుత్వం దాన్ని. చట్టపరంగా నిషేధించడానికి సమ్మతించలేదు. ఈ సందర్భంలో గురజాడ అప్పారావు రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యఘటనగా చెప్పుకోవచ్చు. గురజాడ తన నాటకంలో ఈ సమస్యను గూర్చి సజీవచిత్రణ చేశాడు.


వితంతు పునర్వివాహాలు
వివాహ సమస్యకు సంబంధించి, వీరేశలింగం చేపట్టిన సంస్కరణల్లో చెప్పుకో దగినది వితంతు వివాహాలు. ఏవో కొన్ని ఉన్నత కులాలను మినహాయించి వితంతు పునర్వివాహ సమస్య సార్వజనీనం కాదు. 1881 జనాభా లెక్కల ప్రకారం మద్రాసు రాజధానిలో హిందూమతస్థులలో 21%మంది స్త్రీలు వైధవ్యానికి గురైయ్యారు. ఈ లెక్కల ప్రకారమే వీరిలోనున్న బ్రాహ్మణ వితంతువుల్లో ఎక్కువమందికి బాల్య వివాహాల వల్లే వైధవ్యం ప్రాప్తించిందని తేలింది. వీరిలో అధిక సంఖ్యాకులు మూడు పదుల వయస్సు మించనివారు. బాల్య వివాహాలే దీనికి ప్రధాన కారణమని జనాభా లెక్కలు (1891) తెలియజేస్తున్నాయి.

వితంతు వివాహాలను అగ్రకులాలు ముఖ్యంగా బ్రాహ్మణులు, వైశ్యులు, వీరిద్దరి జీవన విధానాన్ని అనుసరించిన ఇతర మతాలవారు వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకతకు ఆసరాగా మత, శాస్త్ర గ్రంథాలను ఏకరువు పెట్టారు.ఈ సమస్యపై బలమైన ఉద్యమాన్ని నిర్మించే ముందు, KANDUKURI VEERESALINGAM వితంతువుల దయనీయస్థితిగతులను గూర్చి ‘రాజశేఖర చరిత్రము’ అనే నవలలో కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు. నిజానికి ఈ నవలా రచన తెలుగు సాహిత్యంలో నూతన యుగారంభానికి సూచన. వితంతువుల దుస్థితితో పాటుKANDUKURI VEERESALINGAM ఈ నవలలో బాల్య వివాహాలను, పెళ్ళిళ్ళలో జరిగే పరవస్తు వారి గ్రంథం కొక్కొండ వెంకటరత్నం పంతులుకు ఆగ్రహం కలిగించింది.

ప్రఖ్యాత నాటక రచయిత ధర్మవరం రామకృష్ణమాచార్యులతో కలిసి కొక్కొండ,KANDUKURI VEERESALINGAM కి జాబురాశాడు. పరవస్తువారి గ్రంథాన్ని విమర్శించమని వారు అడిగారు. వీరేశలింగం దీనికి అంగీకరించలేదు.KANDUKURI VEERESALINGAM వారి భావాలతో ఏకీభవించక తద్విరుద్ధంగా చర్యలు చేపట్టాలను కున్నాడు. రాజమండ్రిలో వీరేశలింగానికి చల్లపల్లి బాపయ్య అనే సన్నిహిత మిత్రుడుండేవాడు. అతడు వీరేశలింగంతో ఈ విషయం ప్రస్తావించాడు. వీరేశలింగానికి ధైర్యం చాలలేదు. ధనబలం, మందిబలం ఆయనకు లేవనుకున్నాడు. కానీ, బాపయ్య ఈ విషయం మరీ మరీ ప్రస్తావించాడు.KANDUKURI VEERESALINGAM తన స్వీయచరిత్రలో ఇలా రాసుకున్నాడు.


ఇట్లు రెండుసారులు ప్రస్తావనము జరిగినమీదట మూడవసారి నా మిత్రుని వంక చూసి, “నిన్ను మీ అన్నలు విడిచిపెట్టినను, బంధువులు బాధపెట్టినను నన్ను విడువక కడవరకును నాతోనుండి పనిచేసెదవా?” అని ధీరవృత్తితో అడిగితిని. అతడణుమాత్రమును సంశయింపక, “ఎన్ని కష్టములు వచ్చినను తొలగక నిలచి పని చేసెదను” అని తక్షణమే చెప్పెను. అప్పుడది యీశ్వర ప్రేరితమైన ఆజ్ఞ అని నా మనస్సునకు పొడగట్టగా “సభాహ్వాన పత్రికను వ్రాసి తెమ్ము. నేను చేవ్రాలు చేసి ప్రకటించెదను” అని చెప్పితిని.

KANDUKURI VEERESALINGAM ఉపన్యాసమిస్తాడన్న వార్త సాంప్రదాయ వర్గాలలో కలవరం రేపింది. ఉపన్యాసానికి కావాల్సిన సమాచారాన్ని మను, యాజ్ఞవల్య, పరాశర స్మృతుల నుండి, ‘పురుషార్ధ ప్రదాయిని’, ‘తత్వబోధిని’ పత్రికలలోని వ్యాసాల నుండి విషయ సేకరణ చేశాడు. 1879, ఆగస్టు 3వ తేదీన తాను తయారు చేసిన ఉపన్యాసాన్ని వీరేశలింగం చదివాడు. సభ పండిత పామరులతో నిండిపోయింది. ఈ ఉపన్యాసంలో వీరేశలింగం, అటు పండితులను ఇటు మామూలు ప్రజలను ఒప్పించే పద్ధతులను తన వాదనలో చొప్పించాడు.

ఈ ఉపన్యాసం ఆనాటి సభాసదులలో తన ఉద్యమానికి అనుకూలమైన వాతావరణము కలిగించడంతో సభలోనున్న పండితులకది నచ్చలేదు. వారు దాలు చేశారు. సవాళ్ళు విసిరారు. పట్టణంలోనినైష్ఠికులందరూ సభ చేసి ఆయన ఉపన్యాసాన్ని ఖండించే ప్రయత్నాలు చేశారు. అవి ఫలించలేదు. KANDUKURI VEERESALINGAM ఉపన్యాసం ప్రజలదృష్టిని విశేషంగా ఆకర్షించి సంచలనాన్ని కల్గించింది. ఇంతలోనే 1879, అక్టోబరు 12న వీరేశలింగం రెండవ ఉపన్యాసమిచ్చాడు. తన వాదాలను మరింత బలపరచుకోడానికి కావాల్సిన ప్రామాణిక గ్రంథాలను కలకత్తా, బొంబాయి నగరాల నుండి తెప్పించు కున్నాడు.

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతు సమస్యపై రాసిన గ్రంథం గూర్చి ఆయన విన్నాడేగాని అది లభించలేదు. క్రమేపి దాన్ని కూడా సంపాదించాడు. ఇక్కడ ధర్మశాస్త్రాలపై వీరేశలింగానికున్న అభిప్రాయాలు మనం తెలుసుకోవాలి. మద్రాసులో ఒక సభలో ఆయన ఉపన్యాస మిస్తున్నప్పుడు, మతగ్రంథాలపై మీ అభిప్రాయమేమిటని సభలోని ప్రేక్షకుడొక ప్రశ్న వేశాడు. వాటిపై తనకు నమ్మకం లేదని చెప్పాడు. అయితే, తన వాదనలకు ధర్మశాస్త్రాల నెందుకు ఊతంగా తెచ్చుకొంటున్నాననేదానికి రెండు కారణాలు చెప్పాడు.

ఒకటి, పండితుల వాదనలకు సమాధానం చెప్పి వారిని ఒప్పించడానికి ఇది అవసరం. రెండు, ప్రాచీన, మత, శాస్త్రగ్రంథాల్లో ఉన్న విషయాలను నమ్మేవారిని ఒప్పించడంకోసం చేస్తున్నానని ఆయన చెప్పాడు.ఈ సందర్భంగా ఆయనొక ఉదాహరణ చెప్పాడు. గుడ్డివాడొక లాంతరు పట్టుకొని పోతూ ఉండగా దానివల్ల ఉపయోగమేమిటని ఎవరో అడగ్గా, లాంతరు వెలుతురువల్ల తనకు దారి కన్పించకపోయినా యితరులు తన మీద పడకుండా వుపయోగపడుతుందని చెప్పాడట.

1879లో రాజమండ్రి వితంతు వివాహ సంఘం స్థాపించబడింది. KANDUKURI VEERESALINGAM దాని కార్యదర్శి. ఈ సంఘంలో తన సన్నిహిత మిత్రుడైన చల్లపల్లి బాపయ్యతో పాటు స్థానికంగా పలుకుబడి, సాంఘికహోదా గలవాళ్ళు సభ్యులుగా చేరారు. వీరేగాక రాజమండ్రిలో ప్రముఖ న్యాయవాది న్యాపతి సుబ్బారావు పంతులు, జిల్లా మున్సిఫ్ ఆత్మూరి లక్ష్మీనరసింహం కూడా. సభ్యులుగా చేరారు. దీంతో ఈ సంఘం మరింత బలపడింది. ఇదిలా ఉండగా పట్టణంలోని సాంప్రదాయక వర్గాలు వీరేశలింగంపై దాడి ఉదృతం చేశారు. విరూపాక్ష మఠాధిపతి శంకరాచార్యులను రాజమండ్రికి పిలిపించారు. సభ

ఏర్పాటు చేశారు. ఈ సభకు KANDUKURI VEERESALINGAM కూడా హాజరయ్యాడు. ఆయన ప్రతిపాదించిన వాదనలకు శంకరాచార్యులు సమాధానాలు చెప్పలేక సమావేశం నుండి వెళ్ళిపోయారు. వితంతువివాహం సంఘంలోని సభ్యులను సంఘ బహిష్కారానికి గురి చేస్తామని ఆయన బెదిరిస్తూ వర్తమానం పంపాడు. ఈ సభ సందర్భంగా ప్రతికక్షులు కొందరు వీరేశలింగాన్ని కొట్టడానికి ప్రయత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు.
వితంతు వివాహం తరఫున కార్యదర్శిగానున్న KANDUKURI VEERESALINGAM సంఘ ఆశయాలను ప్రచారం చేసే నిమిత్తం అనేక పట్టణాలను సందర్శించాడు. 1881లో కాకినాడలో ఉపన్యాసం యిస్తున్న సందర్భంగా ఆయనను కొట్టడానికి కొందరు ప్రయత్నించగా దాన్ని అక్కడున్న సభలోని విద్యార్థులు అడ్డుకున్నారు. వితంతు వివాహం బాగోగుల గురించి, అనుకూలంగానూ, ప్రతికూలంగానూ అనేక గ్రంథాలు ఈ తరుణంలో వెలువడ్డాయి. ఇందులో ప్రత్యేకించి చెప్పుకోదగినది వేదం వెంకటరాయశాస్త్రి రచించిన ‘స్త్రీ పునర్వివాహ దుర్వాద నిర్వాపణము’. 1883లో వెలువడ్డ ఈ గ్రంథం వితంతు వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించింది.https://photos.app.goo.gl/yW29ixGxuE8NrfUq7

మరొక గ్రంథం కె. వెంకటకృష్ణ సోమయాజి రచించిన ‘విధవా వివాహ నిరాసకోపన్యాసము'(1896). మరొక గ్రంథం శ్రీ దీక్షితులవారు రచించిన ‘విధవా పునరుద్వాహ గ్రంథ ఖండనము’, ఇవిగాక దాసు శ్రీరాములు అనే ఉద్ధండ పండితుడు తన పత్రిక ‘కల్పవల్లి’లో ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాశాడు. వీరందరికంటే వీరేశలింగం చేపట్టిన సంస్కరణోద్య మాలన్నింటికి ప్రధాన వ్యతిరేకి కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి ‘ఆర్యా నంద బృందాయినిసభ’ను స్థాపించి ‘ఆర్యమత బోధిని’ పత్రికద్వారా సంఘ సంస్కరణోద్యమాలపై రాజీలేని తిరుగుబాటు చేశాడు. ఈ దాడిని ఎదుర్కోవడానికి వీరేశలింగం ‘సత్యవాదిని’ అనే పత్రికను ప్రారంభించాల్సి వచ్చింది.

వితంతు వివాహ ఉద్యమాలలో వీరేశలింగానికి ఆర్థిక సహాయాన్ని ఉదారంగా అందించి తోడ్పడ్డ పైడా రామకృష్ణయ్య సేవలను ప్రస్తావించుకోవాలి. పైడా రామకృష్ణయ్య కాకినాడలో వైశ్య ప్రముఖుడు. వాణిజ్యవేత్త. ‘మునిసిపల్ అధ్యక్షుడు కూడా. కాకినాడ నుండి వాణిజ్యం సాగిస్తున్న విదేశీవర్తక కంపెనీలకు దుబాసీగా పనిచేసి గణనీయంగా ధనార్జన చేశాడు.

విద్యావంతుడైన రామకృష్ణయ్య సంస్కరణాభిలాషి వీరేశలింగం పట్ల, ఆయన ఉద్యమాలపట్ల సానుభూతి కలవాడు. వీరేశలింగం పరిచయం కావడంతో ఆయన సాగిస్తున్న వితంతు వివాహ ఉద్యమానికి ఆరోజుల్లోనే 30,000 రూపాయల విరాళమిచ్చాడు. వితంతువులను వివాహం చేసుకొన్నవారు నివసించేందుకు గృహాలు కట్టించి యిచ్చాడు. ఇవిగాక మరెన్నో ప్రజోపకార కార్యక్రమాలకు డబ్బు ఉదారంగా యిచ్చాడు. కాకినాడలో రామకృష్ణయ్య చూపిన చొరవతోనే వితంతు వివాహ సంఘ మొకటి అక్కడ స్థాపించబడింది.

ఉద్యమ లక్ష్యాలను వివరిస్తూ వీరేశలింగం మచిలీపట్నం, గుంటూరు, బళ్ళారి, మద్రాసులకు వెళ్ళి ఉపన్యాసాలిచ్చాడు. అక్కడ స్థానిక సమాజాలు ఏర్పడ్డానికి దోహదం చేశాడు.ఉపన్యాసాలతో, వాదప్రతివాదాలతో కాలం వెళ్ళబుచ్చుకోకుండా వీరేశలింగం వితంతు వివాహాలను స్వయాన జరిపించడానికి పూనుకున్నాడు. ఈ విషయంలో బెంగాల్లో వితంతు వివాహవుద్యమ నాయకుడైన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ను ఆదర్శంగా తీసుకొన్నాడు.

విద్యాసాగర్ కార్యవాది. తాను నమ్మిన సిద్ధాంతాలు ఆచరించిన కార్యశూరుడు. వీరేశలింగం వితంతు వివాహ సన్నాహాలు ప్రారంభించగానే వుత్తేజితులైన కొందరు స్థానిక విద్యార్థులు తాము వివాహాలు చేసుకుంటామని ముందుకు వచ్చారు. దీంతో పట్టణంలో పెళ్ళికాని ఆడపిల్లల తల్లితండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొన్నారు.https://pincodesguide.in/jyotiba-phule/

1881, డిసెంబర్ 11 ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో మరుపురానిరోజు. మొదటి వితంతు వివాహం రాజమండ్రిలో ఆ రోజున జరిగింది. రాజమండ్రి పట్టణం ఈ సంఘటనతో తీవ్ర సంచలనానికి గురైంది. ఏ విధంగానైనా ఈ వివాహాన్ని ఆపాలని పట్టణంలోని నైష్ఠికులు ప్రయత్నాలు చేశారు. పురోహితులను రానివ్వలేదు. వంటవాళ్ళను అటకాయించారు. భజంత్రీలను రాకుండా చేశారు. వధూవరులను ఎత్తుకుపోవాలని చూశారు. అంతటితో ఆగకుండా వీరేశలింగాన్ని కొట్టడానికి ప్రయత్నించారు. కానీ పెళ్ళి ఆగిపోకుండా స్థానిక ఆంగ్లాధికారులు, విద్యార్థులు వీరేశలింగానికి బాసటగా నిలబడ్డారు.

రాత్రి, పగలు విద్యార్థులు వీరేశలింగం యింటిని కాపలాకాశారు. వివాహానికి హాజరైనఅప్పటి ఒక విద్యార్థి వల్లూరి సూర్యనారాయణరావు తన ఆత్మకథ (సూర్యనారాయణీయం)లో ఇలా రాశాడు. “షుమారు 500 మంది విద్యార్థులు పెళ్ళికి హాజరైనారు. మా గురువు (వీరేశలింగం) గారి యింటికి పోయే వీధులూ, సందులూ అన్నింటిలోనూ మేము కాపలా ఉన్నాము. మేమందరమూ పెళ్ళి భోజనం తిన్నాము. మమ్మల్ని ఎవరూ వెలివేయలేదు. అలాంటిదాన్ని మేము లెక్కపెట్టనూలేదు.

బసవరాజు గవర్రాజు తప్ప వితంతు వివాహ సంఘంలోని ప్రముఖ సభ్యులూ, వీరేశలింగం గారి అనుచరులూ ఆయన్ను పెళ్ళి సమయంలో విసర్జించారు. పెళ్ళికి హాజరైన కొద్దిమందీ ప్రాయశ్చిత్తం చేసుకున్నారు.”రెండవ వితంతు వివాహం వెంటనే డిసెంబరు 15న జరిగింది. ఈవివాహానికి జిల్లాకలెక్టరు స్వయంగా హాజరైనాడు. వధూవరులిద్దరినీ పట్టణవీథుల్లో ఊరేగించడం ఈ వివాహ ప్రత్యేకత. వివాహాలు జరిగిన వెంటనే సాంఘిక బహిష్కరణ చర్యలు ప్రారంభమైనాయి.

ఈ ఉద్యమంతో సంబంధమున్నవాళ్లను దేవాలయాల్లోకి రానివ్వలేదు. బావుల్లో నీరు తోడుకోనివ్వలేదు. వివాహానికి వచ్చిన వాళ్ళందరినీ, కాకినాడ దాత పైడా రామకృష్ణయ్యతో సహా, విరూపాక్ష శంకరాచార్యులు వెలివేశాడు. బహిష్కార పత్రికలను పల్లకీలో పెట్టి ఉద్యమ వ్యతిరేకులు పట్టణవీథులో ఊరేగిస్తూ సంబరాలు చేసుకున్నారు. వీరేశలింగం, ఆయన ముఖ్య అనుచరుల్లో గవర్రాజు తప్ప మిగతా వాళ్లందరూ ప్రాయశ్చిత్తం చేసుకున్నారు.

రాజమండ్రిలో జరుగుతున్న వితంతు వివాహాలు ఆంధ్రదేశంతోపాటు మద్రాసు పట్టణంతో సహా అనేక ప్రదేశాల్లో ఉత్సాహాన్ని కల్గించాయి. ఆంధ్రదేశంలోని వితంతువులకు రాజమండ్రి కేంద్రంగా తమ భవిష్యత్తును బాగుచేసుకునే దిశగా చూడనారంభించారు. అనేక ప్రాంతాల నుండి వితంతువులు పెళ్ళి. చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ వీరేశలింగానికి జాబులు రాశారు. అయితే వితంతు వివాహ ఉద్యమానికి వ్యతిరేకంగా సంస్థలు రాజమండ్రిలో, మద్రాసులో ఏర్పడ్డాయి.మద్రాసులోని సంఘసంస్కర్తలైన ఆర్. రఘునాథరావు, పి. చెంచల రావుగార్లు వీరేశలింగాన్ని ఉపన్యాసాలివ్వడానికి మద్రాసుకు ఆహ్వానించారు.

ఆ సందర్భంగా వీరేశలింగం వితంతు వివాహంపై మద్రాసు క్రిస్టియన్ కాలేజిలోని ఆండర్సన్ హాలులో ఉపన్యాసమిచ్చాడు. ఈ ఉపన్యాసం మద్రాసులోని ప్రముఖులను ఆకట్టుకుంది. దీన్నే మరింత సమాచారంతో ‘స్త్రీ పునర్వివాహ శాస్త్ర సంగ్రహము’ అనే పుస్తకంగా వీరేశలింగం ప్రచురించాడు.వితంతు వివాహాలు 1882, 1883,1884లో మరికొన్ని జరిగాయి. వీటికి సంబంధించిన వార్తలు బెంగాల్లోని ఈశ్వర చంద్ర విద్యాసాగర్ తెలుసుకొని తన అభినందనలను వీరేశలింగానికి పంపాడు. వితంతు వివాహసంఘం 1891దాకా పనిచేసింది.

1884 వరకు (1879 నుండి) ఈ సంఘం పది వితంతు వివాహాలను నిర్వహించింది. 1884 నుండి 1891 వరకు మూడు వివాహాలు మాత్రమే జరిగాయి. ఉద్యమదాత పైడా రామకృష్ణయ్య 1886లో మరణించాడు. 1891 తర్వాత సంఘ కార్యకలాపాలు తగ్గినప్పుడు ఉద్యమానికి కావల్సిన ఖర్చు మొత్తం వీరేశలింగమే భరించాడు. ఆంధ్రదేశంలోనూ, మద్రాసు, బళ్ళారి పట్టణాలలోనూ 1905 నాటికి జరిగిన మొత్తం వివాహాల సంఖ్య 63. వీటిలో 57 వివాహాలు బ్రాహ్మణకులంలో జరగ్గా ఇందులో కొన్ని శాఖాంతరాలు కూడా ఉన్నాయి. మూడు వివాహాలు వైశ్యుల్లో ఒక్కొక్క వివాహం విశ్వబ్రాహ్మణుల్లో, ఆదివెలమల్లో, వెల్లాల కులంలోజరిగాయి.

వితంతువివాహాలు జరపడంలోనూ, వితంతు శరణాలయాన్ని నిర్వహించడం లోనూ, మిగతా అన్నివిధాల సంస్కరణల్లోనూ వీరేశలింగానికి ఎల్లవేళలా సహకరించిన ఘనత ఆయన సతీమణి రాజ్యలక్ష్మమ్మకు చెందుతుంది. వివాహం నాటికి ఆమె వయస్సు పదేళ్ళు. వీరేశలింగానికి 13 ఏళ్ళు. చదువురాని ఆమెకు చదువుచెప్పి తనకు చేదోడు వాదోడుగా ఆమెను తీర్చి దిద్దుకున్నాడు. మొదటి వితంతు వివాహం జరిగినప్పుడు వంట మనుషులను రానివ్వని పరిస్థితుల్లో రాజ్యలక్ష్మమ్మ గోదావరి నుండి | నీళ్ళు మోసి స్వయంగా వంటచేసి, భోజనాలు వడ్డించింది. దిక్కులేని అనాథ | స్త్రీలు వీరేశలింగం స్థాపించిన శరణాలయంలో ఉంటున్నప్పుడు వారికి తల్లిప్రేమ అందించిన మహా యిల్లాలు. ఆమె అందించిన సహాయ సహకారాలు వీరేశలింగానికి ఎంతో మనోస్థైరాన్ని, నైతిక బలాన్ని యిచ్చాయి.

1897లో వీరేశలింగం మద్రాసుకు మకాం మార్చాడు. అక్కడ చింతామణి ప్రెస్ను కొన్నాడు. మద్రాసులో ఉన్న ఎనిమిదేళ్ళ కాలంలో (1897 నుండి 1904) తాను రాసిన పుస్తకాలను ముద్రించే కార్యక్రమాన్ని చేపట్టాడు. మద్రాసులో వున్నా ఆంధ్రదేశంతో సంబంధాలు కొనసాగాయి. ఆంధ్రదేశంలోని పట్టణాల్లో జరుగుతున్న సంస్కరణ కార్యకలాపాలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇందులో భాగంగా 1902లో గుంటూరులో మొదటి వితంతు వివాహం జరిగింది. ఉన్నవ లక్ష్మీనారాయణ ఈ వివాహానికి సారథ్యం వహించాడు. వివాహతంతు జరిపేందుకు వీరేశలింగాన్ని, రాజ్యలక్ష్మమ్మను మద్రాసు నుండి పిలిపించాడు.

దీంతో పాటు మరికొన్ని వివాహాలను ఉన్నవ జరిపించాడు. దాంతో ఆయన ‘గుంటూరు వీరేశలింగం’గా ప్రసిద్ధికెక్కాడు. గుంటూరులో జరిగిన వివాహం గురించి ‘హిందూ’ దినపత్రికలో ‘గుంటూరులో సంఘ సంస్కరణ’ అనే శీర్షికతో ప్రచురించబడిన ఒక లేఖలో ఇలా ఉంది. ‘రెండు మూడు నెలల క్రితం రావుబహదూర్ కందుకూరి వీరేశలింగం దంపతుల ఆధ్వర్యంలో గుంటూరులో ఒక యువతికి పునర్వివాహం జరిగింది… గుంటూరులో బలంగా వున్న నైష్ఠికులు దీన్ని భరించలేకపోయారు.

తాంబూలం తీసుకొన్న వాళ్ళందరూ, భోజనంచేసిన కొద్దిమంది విద్యార్థులు వెలివేయబడ్డారు. కొందరు ప్రాయశ్చిత్తం చేసుకొని, మళ్ళీ సమాజంలో తమ స్థానం సంపాదించుకున్నారు. ముగ్గురు పెద్దలు, ముగ్గురు విద్యార్థులు ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. ఇది జరిగాక గుంటూరులో వితంతు వివాహ సమస్యపై వాదోపవాదాలు జరిగిన పిమ్మట, అయిదురోజుల సభ నిర్వహించారు. ఈ సభలో ఆంధ్రదేశం నలుమూలల నుండి ఎందరో పండితులు విద్వాంసులు చర్చల్లో పాల్గొన్నారు. ఈ సభ గూర్చి, పైన ఉటంకించిన ‘హిందూ’ లేఖలో యిలా ఉంది. ‘సభవల్ల ఒక మేలు జరిగింది. సంఘ సంస్కరణ గురించి గుంటూరు పౌరులు ఆలోచించేట్లు చేసింది. అది… గుంటూరుకు చెందిన కొద్దిమంది విద్యావంతులు

వీరేశలింగం ఈ దురాచారాన్ని విమర్శిస్తూ రచనలు చేశాడు. ‘వివేకవర్ధని’లో వ్యాసాలు రాశాడు. ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు వేశ్యాప్రియ ప్రహసనం’ అనే నాటకం రాశాడు. ఆంధ్రదేశంలో అనేక పత్రికలు, రచయితలు ఈ ఉద్యమాన్ని బలపర్చారు. 1881లో రాజమండ్రిలోని విద్యార్థులు వీరేశలింగం నాయకత్వంలో ఉద్యమించి ప్రభుత్వానికి సమర్పించే విజ్ఞాన పత్రంపై సంతకాలు సేకరించారు.

దేవదాసీలు ప్రదర్శించే నృత్యానికి హాజరుకామనీ, సామాజిక నీతిని పెంపొందించేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రమాణాలు చేశారు. దేవదాసీ వ్యవస్థను రద్దుచేస్తూ చట్టం తేవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ఉద్యమానికి సామాన్య ప్రజానీకం నుండేగాక వేశ్యాకులం నుండి కూడా అనూహ్యమైన స్పందన లభించింది. దరిశి చెంచయ్య అనే సంస్కర్త, వేశ్యాకులానికి చెందిన బెంగుళూరు నాగరత్నమ్మ, యామినీ పూర్ణతిలకం లను కలిసి ఈ సమస్యపై విశేషకృషి సల్పాడు. ఆయన ‘హిందూ యువతి’ అనే ఒక పత్రికను నిర్వహించాడు. దీంతో వేశ్యాకులానికి చెందిన ఎందరో తమ వృత్తిని వదిలి, విద్యనభ్యసించి పెళ్ళిళ్ళు చేసుకొని గౌరవప్రదమైన జీవనం కొనసాగించారు.



Leave a Comment