Jyotiba Phule was a great Indian social scientist.
JYOTIBA PHULE భారతదేశంలో సామాజిక బానిసత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొదటివ్యక్తి JYOTIBA PHULE.బ్రిటిష్ ప్రభుత్వ పాలనతో భారత దేశంలో పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య సంస్కరణల పరిచయం మొదలయింది. బ్రిటిష్ పాలన ప్రారంభానికి ఎన్నో శతాబ్దాల పూర్వమే వర్తకం రీత్యా పాశ్చాత్యులు భారతదేశంతో సంబంధాలు నెరపేవారు.

అయితే ఈ సంగమం అప్పట్లో ఏర్పడ లేదు. పోర్చుగీసు, డచ్, ఫ్రెంచి, బ్రిటిష్ వారితో వాణిజ్య, రాజకీయ సంబంధాలు దాదాపు అదే సమయంలో ఏర్పడినాయి. పోర్చుగీసులు భారతదేశ పశ్చిమ తీరం వెంట తమ కార్యకలాపాలు మూడు వందల సంవత్సరాల పాటు నిర్వహించారు. అయితే,, బ్రిటిష్ పాలన వచ్చింతర్వాత అయినట్లుగా భారతీయులు పాశ్చాత్య సంస్కృతి సంస్కరణల వల్ల జాగృతం కాలేదు.
భారత దేశంలో బ్రిటిష్ పాలన పాశ్చాత్య సంస్కరణలకు పునాది వేయగా అది భారతీయ మేధావులను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ ప్రభావం ఈ రోజుకు కూడా కొనసాగుతోంది. దీనికి ప్రతిస్పందన రెండు రకాలుగా సంభవించింది- ఒకటి సానుకూలం, మరొకటి ప్రతికూలం. సానుకూలం ఆత్మవిమర్శనా ధోరణికి జన్మనిచ్చి తద్వారా, తార్కిక జ్ఞానం, వైజ్ఞానికంగా విశ్లేషించడం, చారిత్రక పరిశోధన, సంస్కరణలకై కోరిక, సామాజిక సాంస్కృతిక పునరుద్ధరణకై దాహాలకు జన్మనిచ్చింది. సంస్కరణలపై ఆశలు పెరిగే కొద్దీ సంప్రదాయాన్ని విమర్శించే ధోరణి పెరిగింది.https://pincodesguide.in/wp-admin
ఎంతోమంది గొప్ప సంస్కర్తలు భారతీయ సమాజానికి క్రొత్త దిశ యివ్వాలన్న ఆశయంతో స్ఫూర్తి పొందారు.నిజానికి, గత రెండువేల సంవత్సరాల చరిత్ర వారికి వ్యతిరేకంగా ఉంది. ఎంతోకాలం నుంచీ ఉన్న గుడ్డి విశ్వాసాలు యిచ్చిన జడత్వం, అసహాయతల వంటి ఒక సామాజిక రూపానికి వారు వ్యతిరేకంగా నిలబడ్డారు. సామాజిక సంస్థలు, పాతుకుపోయిన ఛాందస ఆచారాలు, మూల సిద్ధాంతాలు వారికి వ్యతిరేకంగా అవరోధాలు ఏర్పరచినాయి. ఆ పరిస్థితుల్లో, సముద్రాల ఆవల నుంచి వచ్చిన ఓ క్రొత్త ప్రపంచం వారికి నవ్యసమాజపు ఆశను కలిగించింది.
అదే సమయంలో, ఒక విభిన్న ప్రతిస్పందన, పాశ్చాత్య సంస్కరణలపై పూర్తి వ్యతిరేకత ఇక్కడి విద్యావంతుల్లో వృద్ధి చెందింది. కాని, ఆ వ్యతిరేకత బ్రిటిష్ పాలన, సంస్కరణలపై గురిపెట్టబడింది. సంస్కరణల యొక్క గొప్ప ఆశయానికి వ్యతిరేకంగా శత్రుత్వం, దైవప్రసాదితమయి భయభక్తుల్ని వేల యేండ్ల పాటు కలుగజేసిన సంస్కృతి నాశనం అవుతుందన్న భయం ఉన్నాయి.
పాశ్చాత్య సంస్కరణలు రుజువు చేయదలచుకుంది ఏమిటంటే- ఏదైతే దేవ జ్ఞానాగారంగా గౌరవించబడుతోందో అది నిజానికి భ్రమలు కలగూర గంప, ఆధారం లేని ఆలోచనలు, కల్పితాలు, విలువలు; మన సామాజిక నిర్మాణం పురాతనమయి క్షీణించింది. అది పూర్తిగా రూపాంతరం చెందకపోతే, మనం అభివృద్ధి పథంలో ముందుకు సాగలేం; ఏ కారకాల వల్లనైతే మన సమాజంలో కొన్ని వర్గాలు ఉచ్ఛస్థితిని పొందినయో (కుల, జాతి విషయంలో) అవి సవాలు చేయబడకుండా మిగిలిపోతాయి; అవి అన్యాయాలు; మన గొప్పతనం చాలా విషయాల్లో మాయ. సంస్కరణల స్వరాన్ని ఒప్పుకున్న వారు ఖండించబడ్డారు.
ఛాందస వాదులు సంస్కర్తలను పాశ్చాత్య సంస్కృతి పైపై రూపానికి కళ్ళు చెడగొట్టుకున్నందుకు ఛీత్కారం చేశారు. బ్రిటిష్ వారు పాశ్చాత్య సంస్కరణలు తెస్తారన్న తీవ్రమయిన భయం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అసంతృప్తి, విప్లవ బీజాలు గట్టిగా నాటింది. ప్రాచీన భారతీయ సాంప్రదాయాలను అనుచితమని రుజువు చేసే సిద్ధాంతాలు ప్రాచుర్యం పొందసాగాయి.
ఎవరైతే సంప్రదాయాలు, సంప్రదాయ విలువలను సామాజిక దోషాలకు మెరుగుపూతతో గుడ్డిగా మద్దతు యిచ్చారో వారు ప్రజా నాయకత్వం చేపట్టడం ప్రారంభించారు. ఈ ప్రతిస్పందన ప్రవాహానికి ముఖ్య కారకం ఏమిటంటే, అది సంప్రదాయం, ప్రాచీన కర్మలు, చరిత్ర కనుగుణంగా వుంది కనుక సంస్కరణ, తార్కికతలను నిరోధించే ప్రబల శక్తి దానికి ఉంది అనే భావన!
బ్రిటిష్ పాలన పై రెండు రకాల ప్రతిస్పందనల మధ్య విభేదాలతో భారతీయ సమాజ చరిత్ర నిండింది. ఈ విభేదం సామాజిక సూత్రాలు, రాజకీయం, మతం, సాహిత్యం వంటి అన్ని రంగాలలో పొడసూపింది. కొన్నిసార్లు ఈ వ్యతిరేకత సరియైనదిగా అనిపిస్తుంది. మరికొన్నిసార్లు అయోమయంగా అనిపిస్తుంది. అది జీవితాన్ని రెండు విధాలుగా గమనించేట్లు చేసింది. ప్రతిచర్యాత్మకమైన దృక్పథం మితవాద జాతీయతకు ప్రాణం పోస్తే, సంస్కరణాత్మక స్పందన తార్కిక మానవత పెంపొందేందుకు సానుకూల పరిస్థితులను కల్పించి తద్వారా గతం తాలూకూ నిజతత్వం బయటపెట్టి, అభివృద్ధి యొక్క రహస్యాన్ని విప్పి చెప్పింది.
పైన వర్ణించిన సామాజిక ప్రభావం బెంగాల్, మహారాష్ట్రలలో స్పష్టంగా కనబడుతుంది. సంస్కరణల ఉద్యమం, ప్రత్యేకంచి మహారాష్ట్రలో, మూడు విభిన్న మార్గాలుగా ఉంది. మొదటిది మత సంస్కరణలది. బెంగాల్లోని బ్రహ్మ సమాజ్, మహారాష్ట్రలోని ప్రార్ధనా సమాన్ల ద్వారా రూపొందిన దాని నాయకులు జస్టిస్ రనడే, డా. భండార్కర్, మెదక్, విఠల్రావ్ షిండే, జస్టిస్ చందావర్కర్లు. రెండవది తార్కిక బ్రాహ్మణ సంస్కర్తలకు చెందినది. వారు (జి.జి. అగార్కర్ నడిపించిన) నిజమైన నాస్తికులు లేదా హేతువాదులు. మూడవది బ్రాహ్మణీక సంస్కృతికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన బ్రాహ్మణేతరులు. ఈ ఉద్యమానికి ముందువరుసలో ఉన్నది జోతిరావ్ ఫూలే.
మూడు సంస్కరణల మార్గాల యొక్క సాధారణ నమ్మకాలు, సంస్కర్తలు అందరూ పంచుకొన్నవి, సూక్ష్మంగా క్రింది విధంగా వివరించవచ్చు. 1) పాశ్చాత్య విజ్ఞానం అతి ముఖ్యంగా కావాలి; 2) సంస్కరణలకు నిజమైన పునాది మతంతో సూటిగా సంబంధం లేని ఆధునిక విద్య; 3) కుల వ్యవస్థ ఏర్పాటు వ్యక్తిగత అభివృద్ధికి అడ్డంకి కనుక మొత్తానికి నిర్మూలించబడాలి; 4) హిందూ మతం యొక్క చాతుర్వర్ణ సిద్ధాంతం సామాజికాభివృద్ధి పథంలో తీవ్ర ఆటంకం; 5) వ్యక్తి స్వాతంత్ర్యం పునాదిగా భారత దేశంలో గణతంత్ర రాజకీయ వ్యవస్థ ఏర్పాటు అవసరం కనుక దానికి ముందుగా సామాజిక మార్పు అవసరం; 6). సామాజిక మార్పు నిజంగా మొదలయ్యేది కుటుంబ, వివాహ వ్యవస్థ లోని మార్పులతోనే. దానికోసం, స్త్రీ విద్య మరియు విముక్తిలను మొదలుగా ముందుకు తేవాలి.

అయితే, మహారాష్ట్రలోని బ్రాహ్మణేతర సంస్కర్తలు, బ్రాహ్మణ సంస్కర్తల మధ్య ప్రధానభేదం ఏమిటంటే, మొదటివారు లేవనెత్తిన అంశాలు వెనుకబడినప్రజలలో అధిక భాగం వారి జీవితాన్ని దగ్గరగా స్పృశించినయి. అదే తర్వాతి వారు లేవనెత్తిన అంశాలు కేవలం ఉన్నత కులాల వారి కోసమే ఆలోచించాయి. బ్రాహ్మణేతరుల ఆలోచనా మార్గంలోంచీ హిందూమత సాంప్రదాయ మూలాల్ని ఎదుర్కోవాలన్న తీవ్ర ప్రేరేపణ పుట్టింది.
నిర్మూలన కోసం ఈ పక్షపాతం బ్రాహ్మణీక ఆలోచనా రీతిలో అంత తీవ్రంగానూ, చురుగ్గానూ అనేకానేక ముఖ్యకారణాల వల్ల కానీ మొదలు కాలేదు. ప్రధానంగా బ్రిటిష్ అధీనంలోకి తీసుకోకముందు మహారాష్ట్రలో మరాఠీ పాలనలో మలిభాగంలో ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులు. బ్రాహ్మణేతరుల ఉద్యమాల్లో ఉన్నది కుల వ్యవస్థ పరిణామాలు, బ్రాహ్మణేతర కులాలు అణగదొక్కబడటం, అనైతిక న్యాయవ్యవస్థ, పెచ్చరిల్లిన లంచగొండితనం, హిందూ సామాజిక వ్యవస్థ యొక్క అరాచకత్వం.
బ్రాహ్మణీక శాస్త్రాలు, వాటికి ఆధారంగా ఉన్న హిందూ సామాజిక నిర్మాణం, సామాజిక నిర్మాణాన్ని పెంచి పోషించిన మత సాంప్రదాయాలపైన తీవ్ర నిరోధంలోంచీ ఈ ఉద్యమం ఉదయించింది.
బ్రాహ్మణుల సంస్కరణలు ఉన్నత కులాల హద్దుల్ని దాటి విస్తరించలేదు. బ్రాహ్మణులు, యితర ఉన్నత కులాల వారి ఆచారాలు, సంప్రదాయాలు, కొత్త బ్రిటిష్ పాలనచే తెరవబడిన క్రొత్త ఉద్యోగాలు, వృత్తులతో అనుకూలంగా లేవు. సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలలో వచ్చిన మార్పులకు అవి అనుకూలం కాదు.
కనుక వాటిని మార్చేందుకు సంస్కర్తలు పూనుకున్నారు. పవిత్ర కర్మలు, విగ్రహారాధనకు సంబంధించిన తిండి, వస్త్రధారణ, శ్రాద్ధ కర్మలు, సంతాపం వంటి నియమాలను మార్చాల్సిన అవసరం కలిగింది. ఎందుకంటే, యివి బ్రిటిష్ వారు యివ్వచూపే కొత్త ఉద్యోగావకాశాలకు అడ్డుగా వచ్చినయి.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పెనుమార్పు తెచ్చే ఆలోచన చుట్టూ సంస్కరణ ఉద్యకేంద్రీకృతమయింది. ఉద్యోగాలు, వాణిజ్యం, క్రొత్త రవాణా మార్గాలు బ్రిటిష్ కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థని దెబ్బతీసాయి.
మారుతున్న పరిస్థితిలో వ్యవసాయం, వడ్డీ వ్యాపారం, బిక్ష వంటి వృత్తులు గ్రామాల్లో ఉమ్మడి కుటుంబాల్ని పోషించేంత సంపాదించలేకపోవటంతో పురుషులు న్యాయశాస్త్రం, ప్రభుత ఉద్యోగం, వైద్యం, బోధన వంటి వృత్తుల్ని ఇతర ఊళ్ళలో చేపట్టడం మొదలు పెట్టారు. గ్రామాల్లో ప్రబలంగా ఉన్న పాత పద్ధతులను పాటించటం దూర ప్రదేశాలలో కష్టమయింది. క్రొత్తగా వచ్చిన ఏర్పాటులో ఇతర అంశాలు
ముఖ్యమైనవిగా మారాయి. ఉన్నత విద్య పెళ్ళి చేసుకునే వయస్సు పెరగాల్సిన అవసరం కల్పించింది. సహజంగానే, కొత్త వ్యవహారాల వల్ల బాల్యవివాహాల సంస్కృతి అనవసర మయింది. పైపెచ్చు కొత్తగా చదువుకున్న యువత ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చింతర్వాత, స్త్రీలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ రక్షణ కోల్పోయినప్పుడు, విద్యావంతులవ్వాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఆ విధంగా స్త్రీ విద్య ప్రధాన అంశం అయింది.
పురాణాల్లో చెప్పినట్లు స్త్రీకి ఉండాల్సిన ఉత్తమ లక్షణాలు యింకేమాత్రం అభిలషణీయం కాకుండా పోయి, స్త్రీ స్వేచ్ఛ యొక్క విప్లవాత్మక ఆలోచన బలపడసాగింది. భారత సాంప్రదాయంలో, పురుషునిపై ఆధారపడటం స్త్రీ జాతికి ఉత్తమంగా భావించబడింది. సంస్కర్తలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విధించిన సంకెళ్ళ మూలాల్ని ఛేదించటం మొదలు పెట్టారు.
స్త్రీలపై ఆధిపత్యాన్ని అంతం చేయటానికి సతీ సహగమనం, చనిపోయే వరకు విధవగా ఉండిపోవటం, విధవలకు గుండు గీయించటం, బాల్య వివాహం, విడాకుల నిషేధం, వంశపారంపర్య ఆస్తి హక్కు లేకపోవటం, పరదా విధానం (చీర కొంగుతో ముఖం కప్పుకోవటం), మగవారితో స్త్రీలు మాట్లాడటానికి ఆంక్షలు వంటి వాటిపై యుద్ధం చేపట్టారు. మార్పు తెచ్చే పోరాటంలో స్త్రీ విద్యమొదటి అడుగుగా కనబడింది.
హిందూ మతం పురాతన ఆచారాలు, కులవ్యవస్థ, అస్పృశ్యత, వంశ పారంపర్య హక్కులు వంటి వాటికి శరణాలయంలా మిగిలింది. ప్రాచీన సాంప్రదాయాలు, ఆచారాలకు తాత్విక సమాధానం ఉండేది. ఆధునిక విద్య పొందిన వారు హిందూ మతం సంస్కరించబడకుండా సామాజిక సంస్కరణలు తేవటం అసాధ్యం అని తెలుసుకుని యీ దిశగా గట్టి ప్రయత్నాలు చేశారు.
వారు అన్ని మత సంస్థల దురభిమానాన్ని గుర్తించి వాటిని అన్ని ప్రాచీన మతాల ఏకత్వ ఆశయ మూలాల్ని విప్పి చెబుతూ ఖండించారు. మానవ నాగరికత ఏ స్థాయికి చేరిందంటే మత, జాతీయ, అంతర్జాతీయ విభేదాలు అర్థం లేనివని వారు చాలా తొందరగా గుర్తించారు. మతానికి ఎవరికి వారి అంతరాత్మే గీటురాయిగా గుర్తించాలి. ఒక ప్రత్యేక శాస్త్రమో, ప్రవక్తో, మతస్థాపకుడు మాత్రమే నిజమని అంగీకరించటం యికపై ఏ మాత్రం సబబు కాదు.
,JYOTIBA PHULE పీష్వా పాలన ముగిసి బ్రిటిష్ పాలన మొదలైన పదేళ్ళలోపే పూణె దగ్గరలో జన్మించాడు. అందువల్ల పూణెలో పాశ్చాత్య సంస్కరణల ప్రభావం నుండి అతడు తప్పించుకోలేక పోయాడు. విద్యాపరంగా వెనుకబడిన ‘మాలి’ కులంలో జన్మించటంతో అతడు చదువు దారిలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవలసి వచ్చింది. కానీ, చురుకైన, ఎదిగిన మెదడు ఉండటం, తెలుసుకోవాలన్న, వివేకమైన మేధస్సు ఉండటంతో తన ముందున్న సామాజిక మార్పును అర్ధం చేసుకోవటంలో అతనికి ఎలాంటి కష్టమూ ఉండలేదు.
JYOTIBA PHULE తెలుసుకున్నట్లు గానే బ్రిటిష్ పాలన ఏర్పాటు కావటంతో వచ్చిన విప్లవానికి నిజమైన అర్థాన్ని చాలా కొద్దిమంది మాత్రమే తెలుసుకున్నారు. ఎవరైతే తమకు తాము తామున్న పరిస్థితిని తెలుసుకునేందుకు సహాయం చేసుకుంటారో వారు స్వేచ్ఛను పొంది అభివృద్ధి సాధిస్తారు. జీవితంలో ఏదైనా సాధించటానికి ముందు తమ శక్తిని పెంపొందించు కోవాలి. ఎవరైనా సమాజంలో తమ స్థానమేమిటో తెలుసుకోలేక పోతే లేదా సరిగా అర్థం చేసుకోలేకపోతే బానిసల్లా మిగిలిపోతారు.
తనను తాను తెలుసు కోవటం, ఆత్మ పరిశీలనా స్పృహను హిందూ సమాజంలోని బ్రాహ్మణేతరుల్లో కల్గించటంలో JYOTIBA PHULE మొదటివాడు. బ్రాహ్మణేతరుల్లో సామాజిక బానిసత్వాన్ని గుర్తించిన లేక అనుభవించిన హిందూ బ్రాహ్మణేతరుల్లో మొదటి మొదటివాడు. ఎవరైతే తమ బానిసత్వాన్ని వొప్పుకోరో వారు దాన్నించి స్వేచ్ఛ పొందలేరు. ఎన్నో సంవత్సరాలుగా అజ్ఞానం, పేదరికాలతో బాధపడుతున్న హిందూ ప్రజలు జోతిరావ్క ఎంతో రుణపడి వున్నారు.
అలాంటి మనిషి మహారాష్ట్రలో పుట్టి దేవుడు, మతం, తీర్ధయాత్రా స్థలాలు, పూజారులు, శాస్త్రాలూ, అంతకు ముందున్న పవిత్ర సంప్రదాయాల మొత్తానికి వ్యతిరేకంగా తిరుగుబాటులో పెరగటానికి చారిత్రక కారణాలు వున్నాయి. గుడ్డి నమ్మకాల వల్ల పుట్టిన అర్థంలేని ఆచారాలు, బ్రాహ్మణుల ఆధిపత్యం, కుల వ్యవస్థను కఠినంగా పాటించటం, మత సంస్థల మద్దతున్న అజ్ఞాన, అవివేకమైన నమ్మకాలు ప్రబలంగా ఉండటం వంటి హిందూ సమాజంలోని లోపాలకు బాధ్యులైన చారిత్రక కారణాలనుJYOTIBA PHULE తానే విప్పి చెప్పాడు.
ఆ లోపాలు యిప్పటికీ వున్నాయి. క్షీణిస్తున్న మరాఠా పాలన మలిదశలో దాని నేపథ్యాన్ని కనుగొనవచ్చు. ఆ కాలంలో బ్రాహ్మణ పీష్వాలు సర్వ శ్రేష్టత్వాన్ని అనుభవించారు. వ్యవస్థలో అంతర్గతంగా ఉన్న కుళ్ళు దాని వేర్లకు ప్రాకింది. హిందూ సామాజిక ఊహలోని అంతర్గత లోపాలు మరింతగా స్పష్టమయ్యాయి. న్యాయ వ్యవస్థ ఎప్పటిలాగానే అస్పష్టంగానూ, సంకటంగానూ, వైజ్ఞానిక రహితంగానూ తిరోగమనంగానూ ఉంది.
శిస్తు వసూలు పద్ధతులు, రుణాల వసూళ్ళు, కూలీ వాళ్ళను నియమించటాలు రైతు మీద చాలా కఠినంగా ఉండేది. ఈ పరిస్థితిని ‘యిషారా’ (హెచ్చరిక) అనే వ్యాసంలో JYOTIBA PHULE తేటతెల్లంగా చెప్పాడు:
ఈ మధ్య కాలంలో పీష్వా పాలన చివరి వరకు, ఒక రైతు శిస్తు కట్టడం కొద్ది నిర్లక్ష్యం చేస్తే, అతడిని మండుటెండలో ఒంగోబెట్టి, పెద్ద బండరాయిని అతని వెనుక ఉంచటమో లేక అతని భార్యని అతని వెనుక కూర్చోబెట్టి, ఎండుమిరప కారం యొక్క పొగ అతడు పీల్చేట్లు చేసే వారు.
పంటలు నేయటం, మంచి లేక చెడు వాతావరణంలో కూడా పండించటం, బట్టలు కష్టపడి రాజుకు, అతని పరివారానికి అతడి భార్యా పిల్లలకి భోగానికి కావలసిన అన్ని వస్తువులు ఏర్పాటు చేయటం వంటి వాటికి ఉపయోగపడే ప్రజల్ని పాలకులు జంతువుల్లా చూసేవారు. ఇప్పుడు కొత్త (బ్రిటిష్) ప్రభుత్వంతో, ప్రజలు పూర్వ ప్రభుత్వపు దుర్మార్గాల నుండి స్వేచ్ఛా జీవులయ్యారు.
ఇంతకు ముందు, వ్యవసాయం ఎక్కువగా వర్షాల మీద ఆధారపడి ఉండేది. కనుక వర్ష రుతువు దెబ్బతింటే, రైతుకి తన రుణం తీర్చటం గడ్డుగా ఉండేది. అప్పట్నుంచీ పరిస్థితి పెద్దగా మారలేదు. కానీ అప్పట్లో ప్రభుత్వం మొత్తంగా వడ్డీ వ్యాపారుల తరఫున ఉండటం వల్ల అప్పు తీసుకున్న వారిని యిబ్బందికర పరిస్థితుల్లో పడేసేది. అతడు తరచుగా తన స్వంత ఆస్తుల్ని వదులుకునేంత వరకు వచ్చేది. ఆ రోజుల్లో వడ్డీ వ్యాపారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదు కలిగి ఉండలేదు.
ఎందుకంటే, ప్రభుత్వం వారి కనుసైగల్లోనూ పిలిస్తే పలికేట్లు ఉండేది. వారు రుణగ్రస్తుల్ని వారికి తోచిన విధంగా చూసేవారు. అతడిపై ·. అన్ని రకాల హింసనీ చేసేవారు… చివరికి ఏడు రూపాయల అప్పు కోసం, ఒక రుణగ్రస్తుడు అతని నేల, పశువులు, బావి, తోటలు అన్నీ పోగొట్టుకుని చివరకు పారిపోవటమో లేక ఆత్మహత్య చేసుకోవటమో తప్ప మరే గత్యంతరం లేకపోయింది.
పీష్వా పాలనలో, కుల వ్యవస్థ మరింత కఠినంగా మారింది. బ్రాహ్మణుల అహంకారం, కపటం ఎదురు లేకుండా పోయినయి. దీని గురించిన ఎన్నో సందర్భాలు పేర్కొనబడ్డాయి. అవి ఎక్కువ శాతం నిజాలే! జోతిరావ్ ఒక ఉదాహరణ పేర్కొంటాడు :
ఒక శూద్రుడు నది ఒడ్డున బట్టలుతుక్కుంటున్నప్పుడు, బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళటం సంభవిస్తే, శూద్రుడు తన బట్టలన్నీ పోగేసుకుని, వాటిని ఉతకటం కోసం ఎంతమూలకి వెళ్తాడంటే, కనీసం నీటిచుక్క కూడా బ్రాహ్మణుడి మీద చిలకరింపబడకూడదు. ఒకవేళ ఒక చుక్క బ్రాహ్మణుడి దగ్గర పడితే, అతడు కోపంతో ఉగ్రుడై అతడి పాత్రని శూద్రుడి తలపైకి విసిరేస్తాడు. విపరీత రక్తస్రావంతో, శూద్రుడు, స్పృహ తప్పి నేలమీద పడిపోతాడు.
తెలివొచ్చింతర్వాత, అతడు నీరసంగా రక్తం నిండిన బట్టల్ని ఏరుకుని, యింటికేసి నడచిపోతాడు. అతడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే మార్గమే ఉండదు, అది బ్రాహ్మణుల ఏకఛత్రాధిపత్యమై ఉంది. అలాంటి కేసుల్లో ఫిర్యాదు చేసిన వాడే శిక్షింపబడే అవకాశం కూడా ఉంది.అంటరానివాళ్ళ పరిస్థితి ఊహ కంటే ఎక్కువ దుర్భరంగా ఉండేది. బ్రాహ్మణుల మీద వాళ్ళ నీడ కూడా పడకుండా జాగ్రత్త పడాల్సి వచ్చేది.
కనుక, ప్రొద్దున సాయంత్రాల సమయంలో నీడ పొడుగ్గా ఉంటుంది కనుక వాళ్ళు యిళ్ళ నుంచి బయటకు తిరగటానికి కూడా ధైర్యం చేసే వారు కాదు. వాళ్ళు బ్రాహ్మణులు, ఉన్నత కులాల వాళ్ళు తిరిగే రోడ్లపై నడవాల్సి వస్తే, వారి మెడకు కుండ తగిలించుకోవాల్సి వచ్చేది. పైపెచ్చు, వారు చెట్టుకొమ్మను ముంజేతికి కట్టుకుంటేనే రోడ్లపై నడిచేందుకు అనుమతింపబడే వారు. ఆ కొమ్మ ఉపయోగం ఏమిటంటే, వారి అడుగుల ముద్రల్ని చెరిపేస్తూ నేలను ఊడుస్తుంది. వారి పరిస్థితి జంతువులకన్నా హీనంగా ఉండేది.
బ్రాహ్మణులు దైవత్వ స్థాయి అనుభవిస్తే మిగిలిన కులాలు సమాజ సోపానంలో క్రింది వరసలో ఉండేవారు. పీష్వా పాలనలో ప్రభుత్వ ఖజానా నుండి పెద్ద మొత్తం ధనం బ్రాహ్మణుల తిండికి, రక్షణకు ఖర్చు పెట్టబడిందన్న వాస్తవానికి వ్యతిరేకంగా జోతిరావ్ తన తీవ్ర నిరసన వ్రాసుకున్నాడు. ధనం మీద ఆశ, తమ వారి పట్ల స్వాభిమానం గల బ్రాహ్మణులకు, పేదరికంలో చితికిపోయిన బ్రాహ్మణేతర ప్రజల మధ్య పోలికను అతడు హృదయానికి హత్తుకునేలా వివరించాడు. స్థానిక న్యాయ – వ్యవస్థ చేసే ఆటవిక క్రూరత్వాన్ని గురించి అతడు ఎన్నో సంఘటనలను ఉదహరించాడు.
నేరం చేసిన వాళ్ళకు శారీరక శిక్షలు విధించబడేవి.అవయవాల్ని కోసేయడం వంటి శిక్షలు సర్వసాధారణం. అయితే ఇది బ్రాహ్మణ ఆధిపత్య విశేషమైంది కాదు కానీ గత శతాబ్దాల్లో భారతదేశ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఆచారమే. శారీరక శిక్ష, తీవ్ర హింసలు దానికితోడు మరణ శిక్ష పీష్వాల కాలంలో కూడా కొనసాగాయి.
బ్రిటిష్ పాలనలో అలాంటి క్రూర శిక్షలు ఆపివేయబడినాయి. ఎవరైనా పాత, క్రొత్త పాలకులను నిష్పక్షపాతంగా పోలిస్తే వారు సహజంగానే బ్రిటిష్ న్యాయ శాస్త్రం అభ్యుదయంగానూ, విహిత సూత్రాల మీద ఆధారపడి వుందని గమనిస్తారు. పైపెచ్చు మానవులంతా సమానమే అన్న సూత్రాన్ని ఆచరించే బ్రిటిష్ న్యాయ శాస్త్రం క్రింద కుల ప్రాతిపదికగా వివక్ష ఉండేది కాదు. మరో వైపు పీష్వా పాలన కాలంలో, పాలకులు కుల అసమానత, వివక్షలను న్యాయ శాస్త్రంగా గౌరవించటం తమ విధిగా భావించి దానిని కఠినంగా అమలు పరచేవారు.
అయితే, కుల వివక్ష బ్రిటిష్ ప్రకారం న్యాయం కాకపోయినా, సాంఘికంగా పీష్వా పాలనలో ఉన్నంత కఠినంగానూ ఉండేవి. JYOTIBA PHULE తక్కువ కులంలో జన్మించటం వల్ల దురదృష్టం, తక్కువగా ఉండటం అనే వాటి అర్థాలు అతనికి సరిగ్గా తెలుసు.
భారత ప్రజలు, సాంఘిక బానిసత్వానికి బందీలవటం వల్ల, నాస్తికం గానూ, ఆధ్యాత్మికంగానూ క్షీణించిపోతున్నారని గ్రహించి, వారిని బానిసత్వానికి వ్యతిరేకంగా సిద్ధమయ్యేందుకు పురిగొల్పి దాని సంకెళ్ళ నుండి స్వేచ్ఛ పొందేట్టు చేయాలని జోతిరావ్ నిర్ణయించాడు.
ఒక అభ్యుదయ బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడినా గానీ, భారతీయ సమాజాన్ని వందల సంవత్సరాల పాటు నిర్వచించిన కుల వ్యవస్థ, అజ్ఞానం, పేదరికం, గుడ్డి నమ్మకాలు వంటి స్వభావాలు వెంటనే నిర్మూలింపబడినవన్న సూచనలు లేవు. బ్రిటిష్ వారిరాక మొదలైన సమయంలో, పాశ్చాత్య సంస్కృతి, స్వేచ్ఛావాద ఆలోచన ప్రజల్ని అభివృద్ధి పరుస్తాయన్న అపోహలు లేవనెత్తాయి. కానీ, సంఘ సంస్కరణలు అనుకున్నట్లుగా విస్తరించలేదు.
ఇది JYOTIBA PHULE కష్టపెట్టింది. బ్రిటిష్ వారు ప్రవేశ పెట్టిన సరళీకరణలు అతనిపై, సమకాలీన సంస్కరణలు ఎవరైతే భారతీయ సమాజంలో పెరుగుతున్న సాంఘిక భ్రష్టత్వం గురించి తీవ్రంగా ఆలోచిస్తారో వారిపై ప్రభావం చూపాయి. ఎప్పుడైతే JYOTIBA PHULE పరిస్థితిని విశ్లేషించాడో, హిందూ సమాజం యొక్క సాంఘిక క్షీణదశ . బానిసలు వారంతట వారే వారి యజమాని వైపు వున్నారు.
అమెరికాలో, స్వాతంత్రం వున్న తెల్లవారే, నల్లబానిసల కంటే ఎక్కువగా, బానిసత్వ నిర్మూలన గురించి యోచించారు. కొంకణిలో, బ్రిటిష్ వారు . రైతు భూస్వామికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసే వ్యవస్థ ఏర్పాటు చేశారు. భూస్వాములు/కౌలుదార్లు వారివారి రైతులను యిరవై నాల్గు గంటలూ చెమటోడ్చేట్లు, బానిసలుగా ఉండేట్లు చేశారు. ప్రతిఫలంగా, వారికి బ్రతికేందుకు సరిపడా మాత్రమే తిండిపెట్టేవారు.
వారిని వాళ్ళు దెబ్బలు కూడా కొట్టేవారు. యింత జరిగినా కూడా, రైతులు సాక్ష్యం చెప్పాల్సి నప్పుడు వారి యజమాని తరఫునే మాట్లాడేవారు. కనుక, ప్రజలు వారి మూఢవిశ్వాసాల నుంచి, గుడ్డి నమ్మకాల నుంచి బయటపడేట్లు వారిని వివేకవంతులను చేయటం అవసరం. ఆధునిక విద్య ఆవశ్యకం..
ఆధునిక విద్య సహాయంతో సగటు మనిషి న్యాయ వ్యవస్థ నుండి, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క వైజ్ఞానిక సంస్కరణల నుండి ప్రయోజనం పొంది, పునరుజ్జీవంపొందుతాడు.
బ్రిటిష్ కార్యనిర్వహణలో కొంత ఆశావహమైన వాగ్దానం ఉంది కానీ, అవసరమైనంత మూలసూత్రాలు రూపాంతరం చెందేలా చేసేంత విప్లవ బీజాలు అందులో లేవు: బ్రిటిష్ ప్రభుత్వం కేవలం సాంప్రదాయక సాంఘిక వ్యవస్థలోనే కార్యకలాపాలు సాగించినయి. సగటు మనిషి బాధల్ని తొలగించేంత ఆర్థిక సౌభాగ్యాన్ని వారు తేలేకపోయారు. బ్రాహ్మణేతరులు ముందులాగానే, బీదవారు, అజ్ఞానులు, వెనుకబడినవారుగా మిగిలి పోయారు. ఎంతో అవసరమైన వ్యావసాయక విప్లవం చోటు చేసుకోలేదు.
వ్యావసాయిక విప్లవంలో మూడు అవసరమైన అంశాలున్నాయి. మొదటిది – భూస్వామ్య వ్యవస్థ, దానితో పాటుగా ఫ్యూడల్ వ్యవస్థను నిర్మూలించటం, రెండవది- రైతులు తమ కష్టానికి తగిన ప్రతిఫలం పొందాలి, మూడవది- అత్యధిక దిగుబడి కోసం, భారత దేశంలోని పొలాలు ఆధునిక వైజ్ఞానిక పద్ధతుల్లో సాగుచేయబడాలి. బ్రిటిష్ పాలనా కాలంలో భూస్వాములు, సంస్థానాధీశులు, ఫ్యూడల్ ప్రభువులు ఘనంగా వుండే వారు. వడ్డీ వ్యాపార వ్యవస్థ కొనసాగింది, వ్యవసాయ సాగు పద్ధతులు మధ్యమం గానూ, వెనుకబడి ఉండిపోయినవి.
JYOTIBA PHULE ఆధునిక వైజ్ఞానిక వ్యవసాయ పద్ధతులు అవసరాన్ని గ్రహించాడు. అతడు వడ్డీ వ్యాపారులు అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతు విప్పాడు కానీ పాత సాంఘిక, మత, ఆర్థిక సంప్రదాయాల్ని కూకటి వేళ్ళతో పెకలించటంలో బ్రిటిష్ వారు అసమర్థులని తెలుసుకోలేకపోయాడు.
JYOTIBA PHULE యువకుడుగా వున్నపుడు, 1857లో ఉత్తర భారతం సిపాయిల తిరుగుబాటుతో ప్రజ్వరిల్లింది. అది బ్రిటిష్ వారి పాలన అనే నూతన భవంతిని మట్టుపెడుతుందని భావించారు. కాని ఆ తిరుగుబాటు విజయవంతం కాలేదు. బ్రిటిష్ వారు ఏ ఉపద్రవం లేకుండా బయటపడ్డారు. నిజానికి వారు ప్రత్యేకించి 1858, 1885 సంఘటనల తర్వాత మరింత శక్తిమంతంగా, గొప్పగా మారారు. దాదాపు అదే సమయంలో JYOTIBA PHULE సత్యశోధక్ ఉద్యమం మొదలుపెట్టాడు.
ఎంతోమంది భారతీయ విద్యావంతులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకులయ్యారు. పాశ్చాత్య విద్యా ఫలితంగా వారు దేశభక్తి పెంపొందిన వారయ్యారు. 1857 తిరుగుబాటు విఫలం అవటంతో వారు అసంతృప్తిగా వున్నారు. వారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా పత్రికల ద్వారానో, పరోక్షంగానో మాట్లాడటం ప్రారంభించారు.
JYOTIBA PHULE 1857 తిరుగుబాటుపై బాధపడలేదు. మొదటిసారి వినగానే అతని అభిప్రాయం వింతగా కన్పిస్తుంది. ఈ రోజుకి కూడా అది సహజంగా అంగీకరింపబడదు. కానీ, భారత రాజకీయ చరిత్ర నేపథ్యంలో అతని అభిప్రాయం దేని గురించి నిలబడిందో గుర్తించాలి. వైజ్ఞానికంగా అతని సమాధానం ఒప్పించేట్లుగా ఉంది. అతడన్నాడు:
తిరుగుబాటులో బ్రిటిష్ ప్రభుత్వం ఓడిపోయివుంటే, చరిత్ర పునరావృతం అయ్యేది. బ్రాహ్మణుల పీష్వా పాలన తిరిగి వచ్చేది. స్మృతులు, పురాణాలు, శాస్త్రాల హిందూ సంస్కృతి బలం పుంజుకునేది, బ్రిటిష్ ప్రభుత్వం రాక ఫలితంగా రేకెత్తిన ఆశ – శూద్రులు, అతి శూద్రుల అభివృద్ధి శాశ్వతంగా మరుగునపడేది. సాంఘిక అన్యాయం వేల సంవత్సరాల నుండి ఉంది. వాటి వ్రేళ్ళు లోతుగా ఉన్నాయి. ప్రధాన అంశం సాంఘిక బానిసత్వం నుంచి ఎలా బయటపడాలా అని. ఈ సాంఘిక బానిసత్వ మొదళ్ళు బ్రాహ్మణుల మతంలోనూ, బ్రాహ్మణులు సృష్టించిన శాస్త్రాలలోనూ ఉన్నాయి.
‘గులాంగిరి’ గ్రంథంలో JYOTIBA PHULE మొదటిసారిగా ఏ విధంగా బ్రాహ్మణీక ఆలోచనలు, సంస్థలు, కులాలు హిందూ సమాజాన్ని వేలాది సంవత్సరాలుగా ఆధిపత్యం చేస్తూ వచ్చినాయో నిర్వచించేందుకు ప్రయత్నించాడు. ఎప్పుడు ఎలా బ్రాహ్మణులు హిందూ సమాజంపై ఆధిపత్యం స్థాపించారో తెలుసు కునేందుకు చరిత్ర లోతుల్లోకి వెళ్ళటం సంఘ సంస్కరణలకి ముఖ్యమైన పూర్వావసరమని అతడు భావించాడు.
ఈ కథను శృతులు, స్మృతులు, పురాణాలకు చెందిన కథల నుండి పునర్నిర్మించవచ్చు. అందుకని ఈ కథలకు చారిత్రక వ్యాఖ్యానం అతడు చేసి, పది అవతారాల కథలలో పరశురామ జననం బ్రాహ్మణులు అధికారాన్ని హస్తగతం చేసుకున్న కథను చెబుతుందని ముగించాడు. అతడు కథల్ని క్రింది విధంగా సంగ్రహంగా చెప్పాడు.
1) ఆర్యులు సముద్ర మార్గం గుండా ఇరాన్ నుంచి ఇండియాకు రెండుసార్లు వచ్చి, వ్యవసాయదారులైన స్థానికుల్ని జయించారు. 2) ఈ నిజం జలచరాలైన మత్స్య, కూర్మావతారాల కథకు మూలం, 3) ఇరాన్ నుంచి వచ్చిన ఆర్యులు పూర్తి విజయం సాధించలేక పోయారు; అందుకని ఆక్రమణకై రోడ్డు మార్గాన్ని వాడవలసి వచ్చింది. ఈ ఆక్రమణలు వరాహ, నరసింహ, వామనావతారాలు వివరిస్తాయి. వామనావతార సమయంలో, ఆర్య బ్రాహ్మణులు ఇండియాలో వారి సార్వభౌమాధికారాన్ని స్థాపించడంలో సఫలీకృతులయ్యారు.
అది కలకాలం ఉండిపోయేందుకు, వారు భారతీయ యోధులు, సాహస క్షత్రియుల్ని ఊచకోత కోసి, వారి వంశం అంతం చేసేందుకు గర్భవతుల్ని చంపేశారు. 4) ఆర్య బ్రాహ్మణులు భారతదేశ ప్రజల్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పరిపాలించారు. అంతేకాక వారి సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకునేందుకు ప్రజలు అవివేకంగానూ, తెలియని తనంలోనూ ఉండేట్టు వారిలో ఆలోచనలు, నమ్మకాలు కలిగించారు. పురాణ కథలు బ్రాహ్మణుల మోసం, వంచనలను తెలియ జేస్తాయి.
వర్ణ వ్యవస్థ కేవలం బ్రాహ్మణేతరుల మధ్య వివాదం రేపేందుకు సృష్టించబడింది. తాము జయించిన ప్రజల కన్న బ్రాహ్మణుల సంఖ్య తక్కువగావటం వల్ల, వారిని విడదీయటం ద్వారా ఆధిపత్యం చేయగలిగారు. తమతో పోరాడే వారిని శిక్షించేందుకై అంటరాని తనం అనే ఆచారాన్ని వారు ప్రవేశ పెట్టారు. వాస్తవంలో, హిందువులకు, అస్పృశ్యులకు ఎలాంటి సాంఘిక తారతమ్యం లేదు.
గత శతాబ్దంలో, వేదకాల ఆర్యులు, ప్రత్యేకించి బ్రాహ్మణులు, హిందూ సమాజంలో ఆధిపత్యం ఎలా తీసుకున్నారో అన్న విషయం మీద ఎంతోమందిపాశ్చాత్య మేధావులు పరిశోధనలు చేపట్టారు. వారి ప్రకారం, వేదకాలం ఆర్యులు బయటనుంచి వచ్చి స్థానికులతో పోట్లాడి, జయించి, వారిపై సాంఘిక, మత, రాజకీయ ఆధిపత్యాన్ని స్థాపించారు. JYOTIBA PHULE సిద్ధాంతం అలాంటి తరహాలోనే సాగుతుంది.
JYOTIBA PHULE నిస్సందేహంగా, అవతారాల గురించి పురాణాల్లో ఎన్నో కథలు చరిత్ర పూర్వకాలంలో బ్రాహ్మణుల ఆధిపత్యాన్నీ వారు సృష్టించిన మతాన్నీ ప్రచారం చేసేందుకు ప్రయత్నించాయి. ఆ కథ నుంచి విపులమైన చరిత్రను నిర్మించేందుకు జోతిబా సాహసించాడు. ఆ ప్రయత్నంలో అతడు పూర్తిగా సఫలమయ్యాడని చెప్పలేం. ఎందుకంటే, ఆ కథలన్నీ అసంబద్ధంగానూ, లోతైన సత్యాలతోనూ నిండి ఉన్నాయి. https://www.instagram.com/reel/C5nEO2zq8Cw/?utm_source=ig_web_copy_link
వారు చేప, తాబేలు, పంది, నరసింహావతారాలు పొందిన దేవుడి గురించి వర్ణిస్తారు. JYOTIBA PHULE వాటిని ఉపమానంగా చూస్తాడు. చేప, తాబేలు అనేవి ఒక రకమైన పడవలై, ఆర్యులు అందులో భారతదేశాన్ని ఆక్రమించుకునేదుకు వచ్చి వుంటారని అతడు వూహించాడు. అయితే ఈ సిద్ధాంతాల్ని బలపరిచేది ఏదీలేదు. పైపెచ్చు బ్రాహ్మణులు లేక ఆర్యులు భారత దేశాన్ని జయించేందుకు పరాయి నేల నుంచి వచ్చారనేది భావ్యంగా లేదు.
దానికి గానీ లేదా భారత దేశంలోని బ్రాహ్మణులు మిగిలిన వారికి భిన్నంగా ఉండే జాతి అనేందుకు ఖచ్చితమైన ఆధారం లేదు. కనుక, బ్రాహ్మణ ఆధిపత్యం భిన్న జాతుల మధ్య యుద్ధం వల్లనో లేక స్థానికులు, విదేశీయుల మధ్య యుద్ధం వల్లనో సంభవించిందనే సిద్ధాంతాన్ని బలపరిచేందుకు సరిపోయేంత సాక్ష్యం లేదు.
వృత్తులలో తారతమ్యాలు, సమాజంలోని ఆర్థిక అసమానతలు, సాంఘిక స్థాయి వ్రేళ్ళూనుకుని తరతరాలుగా ఉండిపోతే, అవి ఒక జాతిలోనే స్థాయి, కుల భేదాలకు దారి తీస్తాయి. బ్రాహ్మణులు, ఆర్యులు ఒకవైపు, బ్రాహ్మణేతరులు, అనార్యులు లేక శూద్రులు మరోవైపు పైన చెప్పిన సామాజిక కారణాల కోసం చరిత్ర పూర్వకాలంలో పోట్లాడుకుంటూ ఉండి ఉంటారు.
JYOTIBA PHULE పరాయి నేల నుండి వచ్చిన ప్రజలు భారతదేశ వాస్తవ్యులనీ ఆక్రమించిన ఫలితంగా బ్రాహ్మణ/- బ్రాహ్మణేతరులు, ఆర్య/అనార్యులనే తారతమ్యాలు వచ్చినాయనే సిద్ధాంతం యొక్క మూలంలో బ్రిటిష్ లేక మొగల్ చరిత్రలోని ఆక్రమణల సంఘటనలు ఉన్నాయి. బ్రాహ్మణులు భారతదేశాన్ని జయించారని జోతిబా చెబితే ఆ ఆక్రమణదారులైన వేదకాలం ఆర్యులు మొత్తంగా బ్రాహ్మణులు, క్షత్రియులు,వైశ్యులతో నిండి వున్నారు. అతని సిద్ధాంతం యొక్క మూలం మహారాష్ట్రలోని సమకాలీన సమాజ నిర్మాణంలో ఉంది.
మహారాష్ట్ర మరియు దక్షిణ భారతంలోని బ్రాహ్మణులు రెండు కులాలు – బ్రాహ్మణులు, శూద్రులున్నారని నమ్మేవారు. ఉత్తర భారతంలో తమని తాము క్షత్రియులు, వైశ్యులమని చెప్పుకునే కులాలను ఆర్యులుగా బ్రాహ్మణులు అంగీకరించారు. దక్షిణ భారతంలో వున్న రెండు కులాల, వ్యవస్థని చదవడం మీద బ్రాహ్మణుల ఆక్రమణలపై అతని నిర్ణయం ఆధారపడి వుండటం నమ్మదగినదిగా లేదు. అయితే, పరుశురామావతారం JYOTIBA PHULE వాదనని బలపరుస్తుంది.
కారణమేమంటే బ్రాహ్మణుడైన పరుశురాముడు 21 సార్లు దండెత్తి, క్షత్రియుల్ని ఊచకోత కోసినట్లు చెప్పబడింది. దాన్నుంచి, క్షత్రియులు బ్రాహ్మణ ఆర్యజాతికి చెందిన వారు కాదని,JYOTIBA PHULE సందేహించాడు.కానీ బ్రాహ్మణీక శాస్త్రాల మీద అతని దాడి న్యాయమైనదన్న విషయాన్ని ఖండించలేము. నాలుగు కులాలు బ్రహ్మ శరీరంలోని నాలుగు భాగాల నుండి పుట్టినాయన్న నమ్మకాన్ని అతడు తిరస్కరించాడు.
బ్రాహ్మణులను చుట్టుకుని ఉన్న పవిత్రాత్మనే మిధ్యను అతడు పగులకొట్టటం సరియైనదేనని సమ్మతించాలి. ఉదాహరణకి, వేదకాలంలో బ్రాహ్మణులు గుర్రం, ఎద్దుల మాంసాన్ని తిని, సారాయాన్ని తాగే వారన్న విషయాన్ని ఏ మేధావి ఒప్పుకోకుండా ఉండడు. శాస్త్రాల మీద JYOTIBA PHULE విమర్శ ఖచ్చితంగానూ, కఠినంగానూ ఉంటుంది; అయితే సంస్కృతం, మరాఠీ పదాల శబ్ద లక్షణాల్ని పరిశీలించే ప్రయత్నంలో విఫలమయ్యాడు.https://photos.app.goo.gl/aPyxPFiE5gbLgYKm6
భాషా సంబంధ ప్రదేశానికి చెందిన అంశంపైన అతడు సాహసం చేయాల్సిన అవసరం లేదన్న విషయంలో సాంప్రదాయ ప్రముఖుడైన విష్ణుశాస్త్రి చిప్లుంకర్ జోతిబాపై దాడి చేశాడు. అయితే, JYOTIBA PHULE ఉంచిన మూలవాదనలను ఖండించడంలో అతడు విఫలమయ్యాడు.
భారతీయ సామాజిక దృక్పథం పరంగా చూస్తే వేదాలకు సంబంధం లేని బ్రాహ్మణేతరుల దేవుళ్ళకు JYOTIBA PHULE వ్యాఖ్యానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. బ్రాహ్మణులు కూడా ప్రధాన దేవతలను తాము తీసుకుని వేదరహిత శాస్త్రాల నుండి వారికి సంబంధించిన ఆచారాలను పాటించారు. చాలా సందర్భాలలో వేదకాల ఆర్య బ్రాహ్మణులు స్థాపించిన మతం బ్రాహ్మణేతరుల మూల మతంతో పూర్తిగా కలిసిపోయినట్లు కన్పిస్తుంది. కనుక, వేదరహిత బ్రాహ్మణేతరులనిజమైన మతాచారాలు, ఆలోచనలు, దేవతలను గుర్తించటం చాలా కష్టంగా మారింది.
దసరా, దీపావళి పండుగలు, ఆదివారానికి ఉన్న పవిత్రత, ఖండోబా,JYOTIBA PHULE , భైరోబా, మాస్తాండులు మొదలగు దేవుళ్ళు బ్రాహ్మణేతరుల అసలైన మతంలో భాగం. బ్రాహ్మణేతరుల ఉన్నత సంస్కృతి, మతం, రాజకీయ వ్యవస్థని నాశనం చేసేందుకు బ్రాహ్మణులు ప్రయత్నించి, జన్మరీత్యా కుల నిర్ధారణ, మూఢవిశ్వాసాలపై నమ్మకం, బానిసత్వం, మానవుల మధ్య సమానతను అంతం చేసే సిద్ధాంతాలను సృష్టించారు.
JYOTIBA PHULE సత్యశోధక్ సమాజ్ స్థాపించి బ్రాహ్మణీక మతానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. తన ఉద్యమం విజయవంతం అవుతుందని అతడు నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే, బ్రాహ్మణులు స్థాపించిన హిందూ మతం, ఆ మాటకొస్తే ప్రపంచంలోని ఏ యితర మతం యొక్క సూత్రాల కంటే కూడా ఎక్కువగా తన మతం ఆదర్శ సూత్రాలపైన ఆధారపడి ఉంది.
JYOTIBA PHULE ప్రపంచంలో ప్రతిపాదించబడిన ప్రతి మతం ఎంతో కొంత భాగం న్యాయమో మరొకటో చేసి సత్యంలో కొంత భాగాన్ని కప్పిపుచ్చినవేనని అతడు ప్రకటించాడు. ఈనాడు ప్రపంచంలోని మత భేదాలు మానవ సౌభ్రాతృత్వానికి, పరస్పర సహకారానికి అడ్డుగా వచ్చినయి. మానవాళి తన స్వంత మతం మీద ప్రేమ, యితర మతాల పట్ల అసహనంతో విడిపోయి శాశ్వతంగా శత్రుత్వ బీజాలు నాటుతున్నాయి.
మత దురహంకారం తరచు రక్తపాతానికి దారి తీస్తోంది. అభివృద్ధి, అభ్యున్నతి తీసుకురావలసిన సమయంలో అది మానవాళి వినాశనాన్ని తెస్తోంది. జాతీయత, దేశభక్తి కూడా మతాసక్తి కంటే ఎక్కువగాకపోవటం యుద్ధాలకు, మనిషి శక్తి యుక్తులు వృధా అయ్యేందుకు దారి తీస్తోంది. దేశాలు యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా వుండటం, ఆ విషయానికి ఎంతో డబ్బు ఖర్చు చేయవలసి రావటం తప్పనిసరి అయింది. శిస్తుల రూపేణా దేశ పౌరులపైన, ప్రత్యేకించి రైతుల పైన, అనవసరమైన భారం పడుతోంది. యుద్ధానికి, మతాసక్తులకి అంతం పలకమని జోతిబా ప్రోద్బలం చేశాడు.
JYOTIBA PHULE తన గ్రంథం ‘సార్వజనిక్ సత్యధర్మ’ లో అతని కొత్త నిర్మాణాత్మక సూత్రాలను పొందుపరచాడు. మత, జాతి వివక్షలకు అతీతంగా స్త్రీ, పురుషులు సమాన హక్కులు కలిగి ఉండటమే గొప్ప సత్యం అని చెప్పాడు. పురుషుడు లేక పురుషులకు ఇతరులపై ఆధిపత్యం లేక దౌర్జన్యం చేసే హక్కు లేదు. దేవుడుమానవులందరికీ పుట్టుకతోనే మత, రాజకీయ స్వేచ్ఛ నిచ్చాడు. దాన్ని ఆక్రమించిన వారు సత్యానికి శత్రువులు.
ఒక మనిషిని అతని రాజకీయ, మతపరమైన దృక్పథం ఆధారంగా గొప్పవాడా, తక్కువవాడా అని విచారించి అతడిని హింసించడం సత్యాన్ని మోసం చేసినట్లే! ప్రాపంచిక జీవితాన్ని తన కిష్టమైనట్లు అనుభవించడానికి ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉంది. వ్యవసాయం, చేతి వృత్తులు, కార్మికులు వంటి వృత్తులు మనిషి గౌరవాన్ని తక్కువ చేయవు; అవి నిజానికి మనిషి గొప్పతనాన్ని ప్రదర్శిస్తాయి. ప్రకృతి యొక్క కార్యకారణాన్ని తెలుసుకుని మనిషి అవసరాలు తృప్తి పరచేందుకు దానిని ఉపయోగించటం మనిషి యొక్క ప్రాథమిక హక్కు, బాధ్యత.
JYOTIBA PHULE దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో అందరు మనుష్యులూ ప్రయత్నం ద్వారా ఘనతను సాధించవచ్చు. ఈ ప్రయత్నంలో ఒకరికొకరు సహాయపడటం మనిషి యొక్క ప్రాథమిక బాధ్యతే కాదు, దేవుడికి నిజమైన పూజ కూడా! దేవుడికి భక్తిగీతాలు కానీ, ప్రార్ధనలో అతడి నామజపం కానీ, జపమాలలో ఉన్న పూసలు లెక్కేయటం గానీ అవసరం లేదు. ఎందుకంటే, అతడు యావత్ ప్రపంచానికి యజమాని. అతడికి మనిషి పొగడ్తలు, ప్రార్థనలు, భక్తి అక్కర్లేదు. మనిషి క్రీస్తు బోధించినది ఆచరిస్తే అతడు నిస్సందేహంగా అభివృద్ధిలోకి వస్తాడు.

వేల సంవత్సరాల ప్రయత్నంలో పుట్టిన సంస్కృతి, విజ్ఞానసారాన్ని JYOTIBA PHULE వడగట్టాడు. సత్యాన్ని తెలుసుకునేందుకు పద్ధతులు, లక్షణాల్ని అతడు చర్చించాడు. సత్యం శాస్త్రాల్లోనూ, పవిత్రమైన మనుషుల్లోనూ, గురువుల్లోనూ అవతారాల్లోనూ, దైవ ప్రవక్తల్లోను కనుగొనబడకపోతే మరెక్కడ కనుగొనబడుతుంది? “మనిషి అంతరాత్మలో” అని అతడన్నాడు. మనిషికి స్వతహాగా ఉన్న విచక్షణా జ్ఞానం సృష్టికర్త తనంతట తాను యిచ్చిందే.
JYOTIBA PHULE దేవుడు మనకు శాస్త్రాలనివ్వలేదు. అతడు అవతారాల్లో ఈ భూమ్మీదకు రాలేదు. అతడు ప్రత్యక్షమై పవిత్రమైన సన్యాసులకు, ఋషులకు ఎలాంటి బోధా చేయలేదు. అతడు అదృష్టవంతులైన సన్యాసి హృదయంలో దైవస్ఫూర్తి జనింపచేయలేదు. అతడు ఒకేఒక్క అనుభవించదగ్గ బహుమతి నిచ్చాడు. అదే జ్ఞానం.
JYOTIBA PHULE ఆలోచనలు నిస్సందేహంగా ఉదాత్తమైన, ఎంతోకాలం నిలిచిపోయే మానవ విలువలచే స్ఫూర్తి పొందబడినాయి. అతడు వాడిన భాష ఉద్రేక భావావేశం యొక్క తీక్షణతో నిండి వుంది. అతడి మేధస్సుకి ప్రస్తుతాన్ని దాటి
న్యాయశాస్త్ర ఉద్యోగాలలో సర్వత్రా అధిక సంఖ్యలో ఉండటం వచ్చింది. అలాగే, గత ముప్పైయేళ్ళలో, ప్రభుత్వ విధానం కూడా ఎక్కువ సంఖ్యలో వెనుకబడిన తరగతుల వారిని ప్రభుత్వోద్యోగాల్లో నియమించాలనే ఉద్దేశంతోనే ఉంది. యిది బ్రాహ్మణేతర తరగతుల నాయకులను సంతోష పెట్టింది. బ్రాహ్మణేతర ఉద్యమాన్ని అణగదొక్కిన బాధ్యతలో కాంగ్రెస్ పార్టీ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతీయ పోరాటానికై వచ్చిన ఉద్యమాలు భాగం పంచుకోవాలి.
JYOTIBA PHULE ప్రజాస్వామ్య విప్లవాన్ని ప్రభావితం చేయలేకపోయిన లేదా కనీస మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహనను కల్పించలేకపోయిన బ్రాహ్మణేతర ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ, జాతీయ ఉద్యమం చెరిపివేసినాయి. ఈ వైఫల్యాన్ని జాతీయవాద ఉద్యమం తనకు అనుకూలంగా మార్చుకుని తద్వారా పెట్టుబడిదారులు ఆధిపత్య తరగతుల హక్కుల్ని రక్షించింది. కేవలం బ్రిటిష్ ప్రభుత్వమే అన్ని జబ్బులకు కారణమనీ, బ్రిటిష్ వారు వెళ్ళిపోతే, ఈ నేల బిడ్డలు అనుకూలంగా సోదరుల్లాగా కలిసి బ్రతకగలరనీ, జాతీయ ఉద్యమం తప్పుగా భాష్యం చెప్పింది.
JYOTIBA PHULE ప్రజలు స్వాతంత్రోద్యమం యొక్క అసలైన అర్థాన్ని మరచిపోయేట్లు చేయటం ద్వారా స్థానిక ఉన్నత తరగతుల చేతుల్లో అధికారానికై కేంద్రీకృతమైన ఉద్యమంలో పాల్గొనేట్లు చేయబడ్డారు. JYOTIBA PHULE ఆ ప్రమాదాన్ని స్పష్టంగా చూడగలిగాడు. అందుకే, దేశభక్తి, జాతీయ భావాలకు వ్యతిరేకంగా మాట్లాడాడు. బ్రిటిష్ వారు, మహ్మదీయులు పరాయి వాళ్ళన్న భావమే అతనికి దుర్మార్గ మనిపించింది. “మానవ జాతి అంతా ఒక్కటే!” అని అతడు పదే పదే చెప్పాడు. నిజమైన యుద్ధం సాంఘిక, రాజకీయ బానిసత్వానికి వ్యతిరేకంగానూ మరియు మానవ స్వేచ్ఛ కోసమూ అని చెప్పాడు.
పలుగురాయిలో పచ్చదనం చిగురించటం ఎంత అసాధారణమో, జాతీయ ఉద్యమం రైతులు, కార్మికుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కూడా అంతే. రైతుకూలీ ఉద్యమం, జాతీయ ఉద్యమాల ఆలోచనా తీరు, శాస్త్రీయతల మధ్య మూల సిద్ధాంత భేదం ఉంది. మొదటిది మానవ సమానత, స్వేచ్ఛా సూత్రాలపై నిర్మితమైంది. జాతీయ స్వపరిపాలన సాంప్రదాయ వాదం, ఉన్నత, అట్టడుగు వర్గాల మధ్య మోసపూరిత ఐక్యతా భావాలపై నిర్మించబడింది. వర్గ తారతమ్యాలు నిర్మూలించబడి, సాంప్రదాయం తొలగిపోయే వరకూ రైతుకూలీ ప్రభుత్వం రాదు.
నా బాధ్యత కేవలం హెచ్చరిక గంట మ్రోగించటమే.JYOTIBA PHULE ఆలోచనల్లోనిఆ హెచ్చరిక గంటలు విన్నాను కనుక అతని ఆలోచనలను గ్రహించాను. ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టటం కంటే వారిని ఆలోచింప జేయటం ఎక్కువ ముఖ్యం, కష్టమైన పని. వారిని ఆలోచనలోకి తీసుకువెళితే, ప్రజలు వేల సంవత్సరాల సంకెళ్ళు తెంచి, దైవికమైన మానవ స్వేచ్ఛను ఆవిష్కరిస్తారు. బాధాకరమైనది ఏమిటంటే, ఈ విషయాలు చెప్పే గురువులు లేరు. ఆ గురువులు ఎదురుగా ప్రత్యక్షమైనప్పుడు, స్వాతంత్ర్య భానుడు ఉదయించి మరి అస్తమించడు. ఆ కాంతిలో గొప్ప తాత్వికుడైన జోతిబా రూపం ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉంటుంది.