JAMES WATT IS A GREAT SCIENTIST.

James Watt was the lifeblood of the great industrial revolution.

JAMES WATT సమాధి మీది ఫలకం మీద ‘ఈయన మనిషి శక్తిని పెంచినవాడు’ అని రాసి ఉంది. ఆవిరి శక్తి ఆవిష్కర్త JAMES WATT చేసిన కృషియొక్క ప్రాముఖ్యతను ఒక్కమాటలో చెప్పడానికి ఇంతకంటే మంచి పద్ధతి లేదు. అతను కనుగొన్న ఆవిరి యంత్రం కారణంగా రవాణా వేగం గొప్పగా పెరిగింది. అలాగే వెనువెంట వచ్చిన మిగతా శక్తి రూపాలకు అది దారి వేసింది. సూక్ష్మంగా చెప్పాలంటే అది పారిశ్రామిక విప్లవానికి ప్రారంభంగా నిలిచింది.

JAMES WATT,

JAMES WATT స్కాట్లాండ్లోని గ్లాస్గో సమీపంలో ఉన్న గ్రీనాక్లో 19 జనవరి 1736న పుట్టాడు. అతని తండ్రి పేరున్న హస్తకళాకారుడు. సముద్ర వ్యాపారంతో సంబంధం ఉన్నవాడు కూడా. కనుక జేమ్స్కు చిన్ననాటి నుంచే తన చుట్టూ తండ్రి పరికరాలు కనిపించాయి. అతను వాటిని చాలా సుభంగా అర్థం చేసుకున్నాడు. తన చేతులతోనే కొత్త యంత్రాలను తయారు చేయడంలో గొప్ప ఆనందం సాధించాడు. ఆరోగ్యం అంతగా మంచిది కాదుగనుక అతని తల్లితండ్రులు JAMES WAT ను మామూలు బడికి పంపించడానికి ఇష్టపడలేదు.

దీనితో అన్ని విషయాలను తనకు తానే నేర్చుకునే గొప్ప అవకాశం అతనికి అందింది. చిన్న వయస్సులోనే అతని ఒడుపు కొత్త విషయాలను గురించినకుతూహలం బయటపడ్డాయి.
కెటిల్ మూత ఎగిరి పడుతుండడం చూచి ఆవిరికిగల బలాన్ని గురించి జేమ్స్ వాట్ అర్థం చేసుకున్నాడన్న కథ బహుశా ఊరికే పుట్టి ఉంటుంది.

అయితే అతని తెలివితేటల గురించి అసలు అనుమానం లేదు. చిన్ననాటి నుంచే కనిపించిన ప్రతి యంత్రాన్ని, పరికరాన్ని పరిశీలించి వాటిని మరింత బాగుపరచడం అతనికి చేతనయింది. ఇంజనీరింగ్తో సంబంధం లేని మిగతా రంగాలలో కూడా అతను తన సృజనాత్మకత ముద్రను బలంగా వేసాడు.
JAMES WATT 17 సంవత్సరాలవాడుగా ఉండగా తల్లి గతించింది. దీనితో అతను గ్రీనాక్ వదిలి గ్లాస్గో చేరి ఒక పరికరాల తయారీ సంస్థలో అప్రెంటిస్ చేరవలసి వచ్చింది.

అక్కడ గడిపిన ఒక సంవత్సర కాలంలో, కళ్ళజోళ్ళను బాగుచేసే ఆ యజమాని నుంచి అతను నేర్చింది తక్కువే. కానీ గ్లాస్గో విశ్వవిద్యాలయంలోని బోధన సిబ్బందితో అతనికి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అతని జీవితంలో తరువాత ఈ అంశం లోతయిన ప్రభావాన్ని కనబర్చింది.

జనవరి 1755లో పరికరాల తయారీ విద్యను మరింత నేర్చుకోవడానికి జేమ్స్ లండన్ చేరాడు. గ్లాస్ నుంచి లండన్కు 550 కిలోమీటర్ల దూరం. గుర్రం మీద అంతదూరం ప్రయాణించడానికి అతనికి 12 రోజులు పట్టిందంటే ఇవాళ నమ్మడానికి కష్టంగా ఉంటుంది. మరి ఆ కాలంలో పవర్ సాయంతో నడిచే వాహనాలు లేవు. ఆ విషయంలో పరిస్థితిని మార్చే పరిశోధనలను JAMES WATT తరువాత చేయగలిగాడు.

తరువాతి సంవత్సరం కాలం జేమ్స్ దిక్సూచి, తియోడలైట్ లాంటి పరికరాల తయారీలోని మెళకువలను జాన్ మార్గన్ అనే మాస్టర్ నుంచి నేర్చుకున్నాడు. కానీ లండన్లో బతుకుతీరు మాత్రం అతనికి నచ్చలేదు. చీకటి పడిన తరువాత అక్కడ వీధులలో తిరగడానికి ధైర్యం చాలేదికాదు. ఆ రోజుల్లో రాయల్ నేవీ వారు పనిలో పెట్టిన ‘ప్రెస్ గాంగ్స్’ అనే మొరటు నావికులు చీకటి పడిన తరువాత నగరంలో తిరుగుతూ కుర్రవాళ్ళను ఎత్తుకుపోయి ఓడలలో పని చేయించేవారు.

JAMES WATT తిరిగి గ్లాస్ కు చేరుకున్నాడు. అక్కడ స్వతంత్రంగా పరికరాల తయారీ ప్రారంభించాడు. అయితే వ్యాపారం అసాధ్యమని అతనికి త్వరలోనే అర్ధమయింది. ఆ కాలంలోని గిల్డ్ నియమాల ప్రకారం అప్రెంటిస్ గా ఏడు సంవత్సరాలు గడిపిన వారు మాత్రమే స్వంత వ్యాపారం చేయాలి. ఇక్కడ జేమ్స్క గ్లాస్గో యూనివర్సిటీ ఉపాధ్యాయుతో వెనకట ఏర్పడిన పరిచయాలు ఉపయోగానికి వచ్చాయి. 1757లో యూనివర్సిటీలో JAMES WATT గణిత పరికరాల తయారీదారుగా నియమింపబడ్డాడు. అక్కడ గిల్డ్ నియమాలు పనిచేయవు. యూనివర్సిటీలో ఒక అంగడి పెట్టడానికి కూడా అనుమతి దొరికింది. అతని పని అక్కడ చాలా బాగా జరిగింది. రెండు సంవత్సరాల తరువాత వ్యాపారంలో ఒక భాగస్వామిని కూడా అతను చేర్చుకోగలిగాడు.

ఈ సమయంలోనే జేమ్స్ దాగి ఉన్న పరిశోధన శక్తి బయటపడ సాగింది. పాడయిన పరికరాలు మరెవరూ బాగుచేయలేక పోయినప్పటికీ, ఇతను వాటిని వెంటనే బాగుచేసేవాడు. అటువంటి సందర్భాలో ‘ JAMES WATTకు చూపించండి’ అనే మాట తప్పని నిర్ణయంగా మారింది. అతని పేరు అంతటా పాకింది. చివరికి సంగీతకారులు తమ వాద్యాలను, సంగీతమంటే అసలే తెలియని JAMES WATT దగ్గరికి రిపేర్ కోసం తెచ్చేవారు. ఒక పరికరం పనితీరును అర్థం చేసుకోవడంలో జేమ్స్ తెలివి గొప్పగా పనిచేసేది.

అంతేకాక సంగీత కారులకు అంతకుముందు తోచని మార్పులను సూచించి వాద్యాలు బాగా పనిచేసేట్టు కూడా అతను సూచనల్ ఇచ్చేవాడు. ఆర్గాన్ వాద్యం పనితీరును గొప్పగా పెంపొందింప చేసినది ఇతనే.
మరింత జూలై 1764లో JAMES WATT తన దూరపు చుట్టం మార్గరెట్ మిల్లర్ను పెళ్ళి చేసుకున్నాడు. ఆ ఇద్దరూ చాలా సంతోషంగా కలిసి జీవించారు. పని మాత్రమే తెలిసిన వాట్కు భార్య తోడుగా రక్షణ కల్పిస్తూ బలంగా వెనక నిలబడింది.

JAMES WATT,

అతని జీవితంలోని గొప్ప మలుపు 1763,1764 కాలంలో వచ్చిందనాలి. జేమ్స్ను గ్లాస్గో విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ జాన్ అండర్సన్ తనవద్దనున్న న్యూకోమెన్ ఆవిరి ఇంజన్ నమూనాను రిపేర్ చేయవలసిందిగా అడిగింది ఆ సమయంలోనే. వాట్ ఈ రంగంలో చేసిన కృషిని గురించి చెప్పాలంటే మనం ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి.

అప్పట్లో పెద్దఎత్తున దొరికే ఏకైక ఇంధనం బొగ్గు మాత్రమే. గనులను భారీ ఎత్తున తవ్వి అటు ఇళ్ళలోను ఇటు పరిశ్రమలోను వాడుకునే వారు. అయితే నేలలోపల తవ్వుతున్న గనులలో తరచుగా నీళ్ళు నిండేవి. నీటిని మనుషులు లేదా పశువుల సాయంతో తోడవలసి వచ్చేది. పని చాలా కష్టంగాను, నెమ్మదిగాను సాగేది. థామస్ న్యూకోమెన్, 1712లో నీళ్ళుతోడే పనిని మరింత బాగా చేయగల ఆవిరి యంత్రం తయారు చేశాడు. ఒక బాయిలర్లో ఆవిరిని పుట్టించి దాన్ని సిలిండర్, పిస్టన్ మెకానిజమ్లోకి ఒక వాల్వ్న తెరిచి పంపిచేవారు. ఆవిరి పిస్టన్ను పైకి పంపుతుంది. దానికి తగిలించిన రాడ్ కూడా పైకి కదులుతుంది.

అప్పుడు సిలిండర్ లోకి చల్లని నీటిని వెదజల్లుతారు. ఆవిరి ఒక్కసారిగా చల్లబడుతుంది. లోపల పుట్టిన ఒత్తిడి కారణంగా పిస్టన్ రాడ్ మళ్ళీ కిందకు దిగుతుంది. మరొక వాల్వ్ తెరిచి అప్పుడు సిలిండర్ను ఖాళీ చేస్తారు. మళ్ళీ ఆవిరి నింపడంతో కార్యక్రమం మరోసారి సాగుతుంది. పిస్టన్ రాడ్ పైకి కిందకు తిరిగే తీరు ఆధారంగా ఒక లంకె సాయంతో వాటర్ పంప్ను పనిచేయించగలిగారు. https://photos.app.goo.gl/4kFXakRjddvAV9G96

ఇదంతా చాలా ముతకగా కనిపించేది. అయినాసరే అప్పటికిగల ఏర్పాట్లకన్నా ఇది బాగా పనిచేసింది. కనుక అంతటా ఈ పద్ధతినే వాడసాగారు. కానీ దానితో జరుగుతున్న పనితో పోల్చిచూస్తే ఖర్చవుతున్న బొగ్గు చాలా ఎక్కువ. JAMES WATT తన తెలివితేటలతో న్యూకోమెన్ ఇంజన్ను మెరుగు పరిచాడు. అయితే పిస్టన్ కొన్నిసార్లు కదిలిన తరువాత ఆగుతున్నదన్న విషయం అతనికి చికాకు కలిగించింది. అతను మంట తీవ్రతను మరింత పెంచి పరిశీలించి చూచాడు. అయితే గొప్ప మెరుగుదల కనిపించలేదు.

కొన్ని నెలల పాటు ఈ సమస్యతో సతమతమవుతూ గడిపాడు. చివరకు మిగతా పనులన్నింటినీ పట్టించుకోని దశ వచ్చింది. భార్య పాపం కలవరపడసాగింది.విష్కరణలు అన్నింటిలోలాగే, ఈ సమస్యకు సమాధానం కూడా అతను ఒక ఆదివారం మధ్యాహ్నం ఎక్కడో తిరుగుతున్నప్పుడు చటుక్కున తట్టింది. అది పనివేళ కాదు. ఏప్రిల్ 1765లో అతనికి చల్లని నీరు చిలకరించడం ద్వారా ఆవిరిని సిలిండర్ లోపలే నీరుగా మార్చగలిగితే వేడి వ్యర్థంగా పోవడమనే సమస్య ఉండదని అర్థమయింది.

సిలిండర్ను ఎప్పుడూ వీలయినంత వేడిగా ఉంచడానికి దానిచుట్టూ ఒక ఆవిరి జాకెటింగ్ ఏర్పాటు చేయాలని అతను నిర్ణయించాడు. ఆవిరిని (ఇప్పుడు కండెన్సర్ అనే) ప్రత్యేకమయిన పాత్రలోకి పంపించి అక్కడ వాతావరణంలో కన్నా తక్కువ ఒత్తిడి ఉండేలా ఏర్పాటు చేయాలి. అందుకోసం ఒక పంప్ను వాడాలి. దాన్ని నీళ్ళసాయంతో చల్లబరిచాలి. అయితే ఇదంతా చేయడానికి JAMES WATT మరుసటి రోజుదాకా ఆగవలసి వచ్చింది. మార్చిన మాడల్ చక్కగా పని చేయడంతో అతనికి అంతులేని ఆనందం కలిగింది. ప్రస్తుతం ఈ మాడల్ సౌత్ కెన్సింగ్టన్లోని నేషనల్ సైన్స్ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఉంది.https://pincodesguide.in/alfred-nobel-is-1-of-the-great-scientist/

అయితే చిన్న మాడల్ని పని చేయించడం ఒక ఎత్తు, నిజంగా వాడుకకు వీలయ్యే పెద్ద సైజులో యంత్రాన్ని తయారు చేయడం ఒక ఎత్తు. ఇందులో విజయం చేతికందడానికి ఒక దశాబ్దంపాటు నిరంతరంగా పని చేయవలసి ఉంటుందని, మధ్యలో చాలాసార్లు నిరాశ ఎదురవుతుందని జేమ్స్ ఊహించలేదు. ఆ రోజుల్లో సిలిండర్లను తయారు చేయడంలో కొన్ని సమస్యలుండేవి. కనుక వాటిలోనుంచి ఆవిరి తప్పిపోతుండేది. ఆవిరి యంత్రం గురించి ఆగకుండా పని చేయడానికి అవసరమయిన ఆర్థిక వనరులు కూడా అతని దగ్గర లేవు. ఈ సమస్య చాలదన్నట్టు JAMES WATT కు ప్రతి విషయం పర్ఫెక్ట్ ఉండాలన్న పట్టుదల ఎక్కువ. అనుకున్నది సాధించేవరకు అతను పోరాడుతూనే ఉంటాడు.

JAMES WATT ఆవిష్కర్తలకు ఆదర్శం వంటివాడు. అతను ఆలోచనల్లో తేలుతూ ఆ ప్రపంచంలోనే ఉంటాడు. తాను కనుగొనే అంశం యొక్క వ్యాపార సంబంధాలు అతనికి పట్టవు. అయితే అదృష్టంకొద్దీ గ్లాస్గో విశ్వవిద్యాయం లోని వైద్యశాస్త్రం ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్గరిని అతను ఆకర్షించగలిగాడు. ఈ డాక్టర్ అలుపులేకుండా వాటు అండదండలను ఇచ్చాడు. 1000 పౌండ్లను అప్పుగా కూడా ఇచ్చాడు. అది ఆ కాలంలో చాలా పెద్దమొత్తం. ఆవిరియంత్రం గురించి పనిని కొనసాగించమని ఆయన అన్నాడు. అయితే ఆ సొమ్ము కూడా చెల్లిపోయింది.

అప్పుడు ఆయన వాట్న బర్మింగ్రమ్లోని డాక్టర్ జాన్ రోబక్ దగ్గరికి సిఫార్సుతో పంపించాడు. రోబక్ కూడా వైద్యుడే. అయితే అతనికి యంత్రాల పట్ల ఆసక్తి ఎక్కువ. మంచి వ్యాపార దృష్టిగలవాడు కూడా. ఆయనకు స్వంత బొగ్గు గనులు ఉండేవి. ఆవిరితో పనిచేసే పంపులంటే ఆ రకంగా ఆయనకు ఆసక్తి కలిగింది. కానీ JAMES WATT ఆ వైద్యుడిని అంతగా మెప్పించలేక పోయాడు. అతనినుంచి ఏదో కొంత సాయం మాత్రమే అందింది.

JAMES WATT steam engine,

ఆర్థిక సమస్యల కారణంగా 1766లో JAMES WATT భూముల ఏజెంటుగా, సివిల్ ఇంజనీర్గా పనిచేయవసి వచ్చింది. ఆ పనుల్లో అతనికి ఏ మాత్రం ఆసక్తి లేదు. ఒక సందర్భంలో పార్లమెంటు ముందు ఒక క్లయింట్ తరఫున వాదించమని పంపిస్తే, అక్కడ అతను ఘోరంగా ఓడిపోయాడు. తిరుగుదారిలో అతను మాథ్యూ బౌల్టన్ అతని భాగస్వామి డాక్టర్ స్మాల్ నడిపిస్తున్న పనులను సందర్శించాడు.

బౌల్టన్ తరువాతి కాలంలో వాట్ జీవితంలో ప్రధాన పాత్ర పోషించాడు. బౌల్టన్ కనుక లేకుంటే వాట్ ఆవిరి యంత్రం పితామహుడు అనిపించుకునే వీలు కలిగేది కాదంటారు. కానీ తాను వెళ్ళినప్పుడు బౌల్టన్ అక్కడ లేడు. డాక్టర్ స్మాల్ మాత్రం JAMES WATT శక్తియుక్తులను గుర్తించి ఆవిరి యంత్రం గురించి పేటెంట్ తీసుకొమ్మని సలహా ఇచ్చాడు. జనవరి 1769లో పేటెంట్ ఇవ్వబడింది. JAMES WATT మరొక సందర్భంలో కూడా బౌల్టన న్ను కలిసాడు. బౌల్టను ఇతనిమీద తొలి పరిచయంలోనే మంచి అభిమానం మొదలయింది.

JAMES WATT చేతగాని చాలా విషయాలు మాథ్యూ బౌల్టన్కు చేతనవును. అతను మంచి ఆరోగ్యంగలవాడు. కలుపుగోలుగా ఉండే మాటకారి మనిషి. ఆర్థిక విషయాలలో కూడా మంచి అనుభవంగలవాడు. వాటిని పరిశోధన సామర్ధ్యాన్ని గుర్తించి అతను త్వరలోనే వ్యవహారాలను చేతిలోకి తీసుకున్నాడు. ఆయన జీవితమంతా వాటు సాటిలేని మద్దతుగా నిలిచాడు. చాలా సందర్భాలో వాట్ ఆసక్తి చూపకున్నా అతను మాత్రం తీరు మార్చుకోలేదు. పనివారికంతా ఆయన ఒక ఆదర్శ యజమాJAMES WATT ని. సాయంగా అటువంటి మనిషి నిలవడం అన్నది అదృష్టం తప్ప మరొకటి కాదు.

JAMES WATT STEAM ENGINE,

డాక్టర్ రోబక్ కూడా ఆర్థిక సమస్యలో చిక్కుకున్నాడు. దివాళా తీశాడు. అప్పులిచ్చిన వారు వాట్ ఇంజన్ గురించి పట్టించుకోలేదు. అదే సమయంలో భాగస్వామిగా రమ్మంటూ బౌల్టన్, వాట్న బర్మింగమ్కు పిలిపించాడు. వాట్ వెంటనే ఒప్పుకున్నాడు. ఆ సమయంలోనే భార్య, అప్పుడే పుట్టినబిడ్డ గతించడంతో అతని మానసిక పరిస్థితి సరిగాలేదు.

అప్పటికి వాట్ వయసు సుమారు 40 సంవత్సరాలు. బౌల్టన్ అందించే సాయంతో అతను తనకు నిజంగా చేతనయిన పనిని చేయడానికి అవకాశం అందింది. పరిశోధన మీద అతను పూర్తి దృష్టి పెట్టాడు. సంస్థ గురించి, ఆర్థిక లావాదేవీను గురించి మరెవరో పట్టించుకునే వారు. అప్పటికి కూడా సిలిండర్ను సక్రమంగా తయారు చేయడం అన్న సమస్య ఇంకా తీరలేదు. ఆవిరి తప్పించుకుపోకుండా ఉండడానికి అతను రకరకాల ప్యాకింగ్ పదార్థాలు వాడి చూచాడు. ఏదీ పనిచేయలేదు. ఆ సందర్భంలో పారిశ్రామిక ప్రపంచంలో తనకున్న విస్తృతమయిన అనుభవంతో బౌల్టన్ రంగంలోకి దిగాడు. వాట్కు ఊరట కలిగించాడు.

బెర్హామ్ లోని జాన్ విల్కిన్సన్ ఇనుము సిలిండర్లను బోరింగ్ పద్ధతిలో చక్కగా తయారు చేస్తున్నాడని చెప్పి వాటు అతని దగ్గరికి పంపించాడు. వెంటనే ఆ రకం సిలిండర్ను తెప్పించారు. అది చక్కగా పని చేసింది. JAMES WATT ఆనందించాడు. చక్కని వ్యాపారదృష్టిగల బౌల్టన్ యంత్రం పేటెంట్ను మరో 25 సంవత్సరాలు పొడిగించమని వాట్ వెంట పడ్డాడు. ఆ పని 22 మే 1775లో జరిగింది. అందుకుగాను బౌల్టన్ లండన్కు వెళ్ళి పార్లమెంటు సభ్యుల మద్దతు తీసుకోవసిందిగా వాట్ మరీ ఒత్తిడి తెచ్చాడు. దానితో న్యాయపరంగా వస్తాయనుకున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. యంత్రం విజయవంతంగా నడిస్తే ఎదురయ్యే అభ్యంతరాలన్నీ అడుగంటాయి.

పర్ ఫెక్షనిస్ట్గా పేరున్నJAMES WATT తయారు చేసిన ఆవిష్కరణలను వ్యాపారపరంగా ఎప్పుడు విడుదల చేయాలన్న నిర్ణయం ఏనాటికీ చేసి ఉండేవాడు కాదు. ఇక్కడ కూడా ప్రాక్టికల్గా ఉండే బౌల్టన్ కలుగజేసుకుని రెండు ఆర్డర్ను అంగీకరించవలసిందిగా ఒత్తిడి తెచ్చాడు. వాటిలో ఒకటి బ్లూమ్ఫీల్డ్ లోని బెంట్లీ కంపెనీవారి బొగ్గు గనులకు, మరొకటి న్యూవిల్లేలోని జాన్ విల్కిన్స్ వారి బ్లాస్ట్ ఫర్నేస్కు సంబంధించినవి. ఈ రెండు ఇంజన్లలోను సిలిండర్ చుట్టుకొలత 125 సెంటిమీటర్లు. స్ట్రోక్ నిడివి 210 సెంటిమీటర్లు. వీటిని మార్చి 1776లో పని చేయించారు.

మొదట్లో కొంత సమస్యలు ఎదురయినా రెండు ఇంజన్లు బాగా పని చేశాయి. న్యూకోమెన్ ఇంజన్తో పోలిస్తే వీటికి నాలుగవ వంతు ఇంధనం మాత్రమే ఖర్చయింది. మొట్టమొదటి సారిగా ఇంజన్ను గురించి వార్తాపత్రికలో ఒక నివేదిక వచ్చింది. ఆ సందర్భం యొక్క చారిత్రక ప్రాముఖ్యతనుJAMES WATT , బౌల్టన్ తప్ప మరెవరూ బహుశా చేసుకోలేదు. పారిశ్రామిక విప్లవానికి ప్రారంభాన్ని వాళ్లు అక్కడ చూచారు.

1776లో వాట్ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. భార్య గ్లాస్గోకు చెందిన ఆన్మెక్ గ్రిగార్. ఆమె చాలా అవగాహనగల వ్యక్తి. JAMES WATT భార్య పిల్లకు ఆమె సవతి తల్లిగా కనిపించలేదు. ఈ రకంగా మరొసారి అదృష్టంకొద్దీ వాట్క ఇంట్లో ప్రశాంతమయిన నిలకడగల వాతావరణం ఏర్పడింది. ఆవిష్కరణలు చేసే పరిశోధకులకు పనిలో మునిగి ఉండాలంటే ఈ పరిస్థితి ఎంతో అవసరం. వాట్కు ఒక కర్మాగారంలో ఎప్పుడూ జరిగే పని, అక్కడి వాతావరణాల పట్ల అయిష్టత ఉండేది.

తన ఇంటిపక్కనే కట్టిన వర్క్షాప్లోనే అతను ప్రయోగాలు కొనసాగించేవాడు. సంగతి అర్థం చేసుకోగలిగిన బౌల్టన్ అంతగా పట్టించుకునే వాడు కాదు. సృజనాత్మకత గలవారికి ఈ రకమయిన కొన్ని క్షణాలు ఉంటాయని అతను అర్థం చేసుకోగలిగాడు.

బౌల్టన్, JAMES WATT కలిసి 1777లో కొవెంట్రీ దగ్గర మరొక ఆవిరి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంజన్ ప్రఖ్యాతి అప్పటికి అంతటా వ్యాపిస్తున్నది. ఫ్రాన్స్లో కూడా కొన్ని యంత్రాలను స్థాపించగలిగారు. అంత పెద్ద యంత్రాలను అవసరమయిన చోట ఏర్పాటు చేయడమంటే ఎన్నో సమస్యలు ఉండే కార్యక్రమంగా ఉండేది. ఒకచోట ఏర్పాటు చేసిన యంత్రంలోని సిలిండర్ చుట్టుకొత 150 సెంటిమీటర్లు ఉండేది. వీటన్నిటికీ మించి JAMES WATT ఈ రకమయిన పనులో మనసుగల మనిషి కాదు. మళ్ళీ బౌల్టన్ తోడుగా రావలసి వచ్చింది. అతను విలియమ్ ముర్డోక్ అనే పేరుగల ఒక ఫోర్మన న్ను పంపించి ఇంజన్ ఏర్పాటు చేయించాడు. అంతా సవ్యంగా జరిగింది.

ఎప్పుడూ కొత్త విషయాలను గురించి పట్టించుకునే వాట్ రాత పత్రాలకు నకళ్ళు తీసే ఒక యంత్రం గురించి అప్పట్లో పని చేస్తున్నాడు. వంద సంవత్సరాల తరువాత టైప్ రైటర్లు వచ్చేదాకా ఈ యంత్రాలు వాడుకలో ఉండేవి. ఇక వాట్ మరొక ఆవిష్కరణ త్రీ బార్ మోషన్. ఇది రోటరీ పవర్ను పని చేయించగలిగేది.

ఇక ఆ తరువాత డబుల్ యాక్టింగ్ ఆవిరి యంత్రాన్ని వాటి తయారు చేశాడు. ఇందులో పిస్టన్కు రెండువేపులా ఆవిరిని పంపే వీలుండేది. ఈ రకంగా యంత్రం శక్తి గొప్పగా పెరిగింది. అతను తయారు చేసిన సూర్యుడు, గ్రహాల పద్ధతి గేర్ మెకానిజమ్ కూడా పిస్టన్ యొక్క కదలిక తీరును రోటరీ పద్ధతిలోకి మార్చడానికి ఎంతగానో సాయం చేసింది.

డబుల్ యాక్టింగ్ రోటరీ స్టీమ్ ఇంజన్ను వ్యాపారపరంగా జూన్ 1784లో మొట్టమొదట స్థాపించారు. అది విజయవంతంగా పని చేసింది. 1788లో వాట్ సెంట్రిఫ్యూగల్ గవర్నర్ను కనుగొన్నాడు. ఆవిరి యంత్రం వేగాన్ని ఇది తనంత తాను నియంత్రించేది.

JAMES WATT చేసిన కృషి కారణంగా పారిశ్రామిక విప్లవం ప్రారంభమయింది. తరువాతి 80 సంవత్సరా పాటు పారిశ్రామిక ప్రపంచంలో ఇంగ్లండ్ వారు ముందు నడిచారు. ఆహారం, మిగతా పారిశ్రామిక ఉత్పత్తులు పెద్ద ఎత్తున తయారయ్యాయి. ఆవిరి యంత్రాల సాయంతోనే వాటిని సులభంగా రవాణా చేయడం కూడా వీలయింది. వేగంగా ప్రయాణాలు చేయడం కుదిరింది. దీనితో వివిధ దేశాల మధ్యన మంచి ఐకమత్యం, సమానత్వం ఏర్పడ్డాయి.

JAMES WATT ఆవిరియంత్రం కనుగొన్న తరువాత ఆవిరి శక్తిని వాడుకునే విషయంలో వేగంగా ప్రగతి వీలయింది. వరుసగా ఏర్పాటు చేసిన సిలిండర్లలో వివిధ స్థాయిలలో ఎక్కువ ఒత్తిడిలో ఆవిరిని వాడడంతో యంత్రాల పనితీరు పెద్దఎత్తున మెరుగుపడింది. 1820లో రైల్వే ద్వారా సరుకును, ప్రజలను రవాణా చేయడానికి ఆవిరి యంత్రం సాయంతో రాబర్ట్ స్టీఫెన్ సన్ అగ్రగామి ఆవిష్కరణలు చేశాడు. 1831లో మైకేల్ ఫారడే పరిశోధనల కారణంగా విద్యుచ్ఛక్తి అభివృద్ధి కూడా మొదట్లో ముఖ్యంగా ఆవిరి యంత్రాల మీదనే ఆధారపడింది. మొదట ఆవిరి యంత్రాలు, ఆ తరువాత చాల్స్ పార్సన్స్, గుస్తాఫ్ డి వాల్ 1880లో కనుగొన్న ఆవిరి టర్బయిన్లు ఈ అభివృద్ధికి వీలు కలిగించాయి.

జేమ్స్ వాట్ జీవితంలోని చివరి సంవత్సరాలు విశ్రాంతి, సంపదతోను గడిచాయనవచ్చు. అతనికి పేరుతోబాటు ధనం కూడా చేతికి అందింది. కొడుకు చేతికి అంది అతని సంస్థను నడిపించడం వాటకు గొప్ప సంతృప్తి. అయినాసరే 1800 సంవత్సరంలో రిటైర్మెంట్ తరువాత కూడా వర్క్షాప్లో ఏదో చేస్తూనే ఉండేవాడు. అతను 17 ఆగస్ట్ 1819న మరణించాడు.

మానవ చరిత్రలో ప్రధానపాత్ర వహించిన కొద్దిమంది మనుషులలో జేమ్స్ వాట్న లెక్కించవలసి ఉంటుంది. మానవుల జీవితాల మీద చక్రవర్తులు, రాజకీయవేత్తలు లేదా అధికారులు చూపించిన దానికన్నా అతని కృషి ప్రభావం చాలా గొప్పది. లోహశాస్త్రంగానీ, భారీ ఉత్పత్తిగానీ, యంత్రాలుగానీ అందుబాటులో లేని తరుణంలో ఆవిరి యంత్రం తయారు చేయడం అన్నది మహత్తరమయిన విషయం. వాట్ యొక్క విస్తృత జ్ఞానం, పట్టుదల వల్లనే అది వీలయింది. గొప్ప ఆవిష్కర్తలలో జేమ్స్ వాట్క ప్రత్యేకమయిన స్థానం శాశ్వతంగా ఉంటుంది.

సాంకేతిక ప్రగతి కొనసాగుతున్న కొద్దీ ఆవిరి యంత్రం వెనకబడి ఉండవచ్చు. ప్రస్తుతం లోకోమోటివ్స్ అనే యంత్రాలు డీజల్ ఇంజన్లతోను లేదా విద్యుత్తోను నడుస్తున్నాయి. విద్యుదుత్పత్తి, ఓడ యంత్రాలో కూడా ఆవిరి యంత్రాలను వాడడం లేదు. సాధారణంగా ఆవిరి శక్తిని కేవలం విద్యుదుత్పత్తిలో మాత్రమే వాడుకునే వారు. అయితే తరువాత వచ్చిన అభివృద్ధి అంతా మొదట్లో వాట్ కనుగొన్న ఆవిరి యంత్రం ఊపు కారణంగానే ముందుకు సాగాయని చెప్పవచ్చు. ఈ రకంగా చూస్తే వాట్ను పారిశ్రామిక విప్లవానికి పితామహుడు అనవచ్చు.

వైద్యులకు అందరికీ ఒకేరకమయిన శిక్షణ, అర్హతలు ఉన్నప్పటికీ అందరూ తమ ప్రాక్టీస్లో ఒకేరకంగా విజయం సాధించలేరన్నది మామూలుగా మనం చూడగల విషయం. లాయర్లు, అకౌంటెంట్లు, మిగతా రంగాలలో వ్యక్తిగతంగా పనిచేసేవారు ఎవరి విషయంలో అయినా ఇదే పద్ధతి సాగుతుంది. ఆవిష్కర్తలు కూడా ఈ రకంగానే ఉంటారు. మనం గొప్ప ఆవిష్కర్తలను గురించి గొప్పగా చెప్పుకుంటాము. కానీ విజయం సాధించిన ఒక ఆవిష్కర్తతోబాటు మరెంతోమంది చతికిలబడ్డ వారు కూడా ఉంటారన్న విషయం గురించి ఎప్పుడయినా ఆలోచించామా? ఈ తేడాకు కారణమేమిటి? విజయం సాధించే ఆవిష్కర్తలు తెలిసి లేదా తెలియకుండానే ఆవిష్కరణల కొరకు అవసరమయ్యే కొన్ని మౌలిక సూత్రాలను గట్టిగా పాటిస్తారు.


ఏమి కనుగొనాలని సరైన నిర్ణయం చేయడం మొట్టమొదటి ముఖ్యమయిన విషయం. ఇది అనుకున్నంత సులభంకాదు. ఇక్కడ కొన్ని అవసరాలు చిత్రంగా ఉంటాయి. మొట్టమొదట అనుకున్న అన్వేషణ వీలు కలదై ఉండాలి. (నిరంతర చలన యంత్రాలను తయారు చేయాలని ఎందరో పరిశోధకులు తమ జీవిత కాలాలను వ్యర్థం చేసుకున్నారు) ఆవిష్కరణ వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండాలి. ఈ అవసరాలు కొన్నిసార్లు బయటకు కనిపిస్తాయి, కొన్నిసార్లు కనిపించవు.

ఉదాహరణకు సముద్రం నీటినుండి ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చడం లేదా విద్యుత్తు కొరకు సౌరశక్తిని వాడడం అందరికీ తెలిసిందే. అయితే తమ దుస్తులలో బొత్తాలను లేదా లేసులను మార్చుకోవాలని ఎవరికీ అంతగా తోచలేదు. కానీ జిప్పర్ వచ్చి గొప్ప విజయాన్ని సాధించింది. దాన్ని వాడడం ఎంతో సులభం. ప్రజలతో దగ్గరి సంబంధాలున్న విక్రయ రంగం వారు, పారిశ్రామికవేత్తలు ఆ ప్రజల అవసరాలను గురించి మంచి ఆలోచలనను కలిగి ఉంటారు.

వ్యాపారపరంగా ఏ ఉత్పత్తులకు విజయం ఉంటుందని ముందే చెప్పగలుగుతారు. ఆవిష్కర్తలు వారి తెలివిని వాడుకుని తాము కనుగొనవలసిన విషయాలను ఎంచుకోవాలి. ఒకేసారి రెండు లేదా మూడు వివిధ ఆలోచనల మీద అన్వేషణలను గురించి ప్రయత్నించడం కూడా మంచి పద్ధతి. వాటిలో ఒకటి విజయవంతం కాకున్నా మరొకదానితో కొనసాగవచ్చు. గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో పెట్టడం తెలివిగల పనికాదు. ముఖ్యంగా ఆవిష్కరణ అనే అపనమ్మకం వ్యవహారంలో ఇది అవసరమయిన పద్ధతి.

ఇక తరువాతి అంచెగా ఇప్పటికే ఆవిష్కర్తల మెదడులో ఉన్న ఆలోచనల గురించి మరెవరయినా పేటెంట్లు తీసుకుని ఉంటే తెలుసుకోవాలి. పేటెంట్ తీసుకోవడానికి ఉత్పత్తి యొక్క పనిచేసే నమూనా అవసరం లేదు. కేవలం ఆలోచనలకు మాత్రమే పేటెంట్ తీసుకోవచ్చు. చాలామంది అన్వేషకులు ఆత్రంగా ఎంతోకాలం కృషి వెచ్చించి ఒక విషయాన్ని కనుగొంటారు. ఆ తరువాత ఇప్పటికే దానికి మరెవరో పేటెంట్ తీసుకున్నారని తెలిసి కృంగిపోతారు.

తాము ఎంచుకున్న రంగంలో ఇంతకుముందు జరిగిన కృషిని గురించి వివరంగా పరిశీలిస్తే, పనికిరాని ఆలోచనలతో కాలక్షేపం జరిగే పరిస్థితిని నివారించే వీలుంటుంది. అయితే ఈ రకం పరిశీలన ఎంత లోతుగా ఉండాలన్న విషయం మీద అభిప్రాయ బేధాలున్నాయి. చాలామంది అన్వేషకులు తాము ఇతరుల పరిశోధన గురించి మరీ లోతుగా ఆలోచిస్తే పాతుకుని పోయిన పాత అభిప్రాయాలు తమ పరిశోధనకు అడ్డుగా వస్తాయని భావిస్తారు.

కనుక ఈ విషయాన్ని ఆవిష్కర్తలే స్వయంగా నిర్ణయించవలసి ఉంటుంది. ఒక ఆవిష్కరణ గురించి ప్రయత్నం మొదలుపెట్టే ముందు సమస్యను గురించిన పూర్తి ఆలోచన ఎంతో అవసరం. సమస్యను వేరువేరు భాగాలుగా విడదీయాలి. వాటిని ఒకదాని తరువాత ఒకటిగా లేదా ఒక్కుమ్మడిగా, సందర్భాన్ని బట్టి అనుసరించవచ్చు. సమస్యలోని మూల విషయం గురించి ఎక్కువ ధ్యాస పెట్టవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక యాంత్రిక లేదా విద్యుత్తు పరికరాన్ని కనుగొన దలచినప్పుడు ధ్యాస ముఖ్యంగా దాన్ని పనిచేయించే తీరు మీద ఉండాలిగాని యంత్రాలను ఎక్కువ సంఖ్యలో తయారు చేయడం లేదా అందుకయ్యే ఖర్చు మొదలయిన ప్రశ్న మీదికి దృష్టిని, ధ్యాసను మళ్లించడం సరయినది కాదు. ఈ విషయాలు తరువాత రావచ్చు.


చెగా సమాధానం గురించి ఆలోచన జరగాలి. ఆవిష్కరణ అన్న విధానంలో ఇది కీలకమయిన అంచె. గణిత సంబంధమయిన సమస్యలకు ఒకే ఒక్క సమాధానం ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదన్నది గుర్తుంచుకోవడం ఎంతో ప్రధానం. ఇక్కడ ఒకే ఫలితాన్ని వేరువేరు పద్ధతులతో సాధించే వీలుంటుంది. కనుక ఈ అంచెలలో ఆలోచనలన్నింటినీ అంగీకరించి అన్ని సమాధానాల గురించి పని చేయగగాలి. ఆవిష్కర్తలు ఆలోచనలు వచ్చిన సమయంలోనే వాటిని పట్టుకుని నమోదు చేసుకునే ఏర్పాట్లను కలిగి ఉండాలి. ఆలోచనలు నిజానికి మెదుడులోనుంచి సులభంగా మాయమవుతాయి. అందుకే వాటిని రాసుకోవడానికి ఎప్పుడూ వెంట ఒక పుస్తకం, పెన్ను ఉంచుకోవడం మంచి అలవాటు.


ఒక సమాధానానికి చేరుకునే ప్రయత్నంలో ఆవిష్కర్త తన మెదడులోని ఉపచేతనను కూడా వాడుకోవడం నేర్చుకోవాలి. ఆవిష్కరణల చరిత్రను గమనిస్తే చాలా ఆలోచనలు అసలు పనిని మాని మరేవో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తోచినట్టు తెలుస్తుంది. ఒకసారి సమస్యను నిర్వచించుకున్న తరువాత దానికి సమాధానం వెతకడం కోసం తీవ్రమయిన ప్రయత్నం జరుగుతుంది. కానీ అప్పుడప్పుడు దాన్ని పక్కనపెట్టి మరేవో పనులు చేయడం చాలా మంచిది. ఈలోగా ఉపచేతనలో ‘వంట’ జరుగుతుంది. ఒక్కసారిగా లైట్ వెలిగినట్టు సమాధానం పుట్టుకు వస్తుంది. ఆవిష్కరణలలో అటువంటి లక్షణం అన్నిటికన్నా సంతృప్తినిచ్చేదిగా మిగులుతుంది. కొన్ని సందర్భాలలో ఇటువంటి ఆలోచనలు పుట్టక ముందు ఎన్నోసార్లు ప్రయత్నాలతో గడపవలసిన అవసరం వస్తుంది.

ఇక తరువాతి అంచె తోచిన సమాధానాలను విమర్శనాత్మకంగా మూల్యాంకనం చేయడం. మనసుకు వచ్చిన సమాధానాలన్నీ ముందుకు సాగేవి కాకపోవచ్చు. నిజానికి వాటిలో చాలాభాగం ప్రయోగాలలో లేదా ఆర్థిక పరీక్షలలో వీగి పోతాయి. కనుక ఈ అంచెలో అన్వేషకుడు చాలా నిక్కచ్చిగా ఉండాలి. ఆలోచనలను గురించి నిర్ణయించడంలో అడ్డులేవీ పెట్టుకోకూడదు. అవసరమయితే ఇతరుల సాయం అడగవచ్చు. దానివల్ల తన పని పాడుకానంత వరకు సంప్రదింపులు మంచివే.

ఈ స్థాయిలో గట్టిపట్టుదల అవసరమవుతుంది. ఒకదాని తరువాత ఒకటిగా పరీక్షలన్నీ ఫెయిలవుతాయి. నిరుత్సాహంతోబాటు తోటివారు చేసే తీవ్రమయిన వ్యాఖ్యలు కూడా బాధపెడతాయి. ‘ఆలోచనలు గల వారు మొదట్లోనే వెక్కిరింతలను భరించలేక పోయినందుకు చాలా గొప్ప ఆలోచనలు మట్టిలో కలిశాయి’ అన్నాడొక ఆవిష్కర్త. కనుక ఈ స్థాయిలోనే ఆవిష్కర్తలు మంచి దృఢ నిశ్చయాన్ని, పట్టుదలను విజయం సాధించే వరకు ప్రదర్శించాలి.

ఎడిసన్ వంటి ప్రసిద్ధ ఆవిష్కర్త అనుభవాల నుంచి వీళ్లు ధైర్యాన్ని అరువు తెచ్చుకోవచ్చు. తన బల్బులోని ఫిలమెంట్ కొరకు మంచి పదార్థాన్ని ఎంపిక చేయడం కొరకు ఎడిసన్ 2,500 పదార్థాలను పరీక్షించాడు. అలాగే (సూస్మిత్ అని పిలువబడ్డ) ఎఫ్.పి. స్మిత్ అధునాతన మెరైన్ ప్రొపెల్లర్ను కనుగొనడానికి జీవితకాలాన్ని మొత్తంగా అంకితం చేశాడు.

కానీ పట్టుదల అంటే మొండితనం మాత్రం కాదు. నిజంగా విజయం సాధించాంటే పట్టుదలతోబాటు కొంతపాటి పట్టువిడుపు కూడా ఉండాలి. లోపాలు కలిగి ఉన్న పద్దతులను ఆవిష్కర్తలు సులభంగా పక్కన పెట్టగగాలి. అంతిమ గమ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. మరోరకంగా చెప్పాలంటే గమ్యం ఒక్కటే స్థిరమయినది. దారులు మారవచ్చు.


తమ ఆవిష్కరణ నుండి లాభాలు పొందడంలో చాలామంది అన్వేషకు అన్యాయంగా కుప్పకూలారు. చివరకు తెలివిగల వ్యాపారవేత్తలు లేదా పారిశ్రామిక వేత్తలు వాటివల్ల లాభాలు పొందారు. కొన్ని సందర్భాలో ఆవిష్కర్త మొండివైఖరివల్ల కూడా ఇలా జరిగింది. ఉదాహరణకు మైకేల్ ఫారడేను పరిశ్రమకు సలహాదారుగా ఉండి ధనవంతుడిగా మారమని అడిగినప్పుడు అతను ఆ అవకాశాన్ని తోసిపుచ్చాడు.

తాను వైజ్ఞానిక పరిశోధనలో మాత్రమే దృష్టి పెడతానని తేల్చి చెప్పాడు. కానీ చాలా సందర్భాలో ఆవిష్కర్త ధనవంతుడుగా మారలేకపోవడానికి వారికి వ్యాపారదృష్టి లేకపోవడమే కారణం. ఇటువంటి సందర్భాల్లో వారు పేటెంట్ లాయర్ను లేదా ఆవిష్కరణను వ్యాపారంగా మార్చడానికి ప్రత్యేకంగా పనిచేసే ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలను ఆశ్రయించడం చాలామంచిది. ఆ ప్రయత్నంలో రావలసిన ఆదాయంలోని కొంతభాగం ఖర్చయినా తప్పులేదు.

Leave a Comment