INDIAN POLITICS IS A GREAT.

Indian politics is war


INDIAN POLITICS మొదటి ప్రపంచ యుద్ధం (1914-18) భారతదేశం యొక్క రాజకీయ జీవితంలోను, సామాజిక ఆర్థిక పరిస్థితులలోను కీలకమైన మార్పులు తీసుకొని వచ్చింది. ముఖ్యమైన పరిణామాల్ని తరువాత చర్చకు వదిలివేస్తూ యుద్ధం పట్ల అప్పటికే చురుకుగా పనిచేస్తున్న భారత రాజకీయ గ్రూపుల యొక్క స్పందనలపై కేంద్రీకరీద్దాం.(ఇండియా హౌస్ పత్రిక (ఇండియన్ సోషియాలజిస్ట్) ఇండియన్ హోమ్హూల్ సొసైటీ స్థాపించాడు. కొద్దికాలం తరువాత భారతదేశం నుండి మెరికల్లాంటి యువకుల్ని రప్పించేందుకు . ‘స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టాడు. కృష్ణవర్మ సమరశీలత సిద్ధాంతపరమైనది.

INDIAN POLITICS MAP,

INDIAN POLITICS ప్రధానంగా ప్రతిఘటన సాత్విక నిరోధానికి పరిమితమైనది. ఆయన పత్రిక ఇండియన్ సోషియాలజిస్ట్ దీనినే ప్రతిపాదించింది. కాని 1907 నుండి ఆయన ఇండియా హౌస్ని నాసిక్కు చెందిన వి.డి. సావర్కార్ విప్లవ గ్రూపు స్వాధీనం చేసుకున్నది. ఈ గ్రూపుకు చెందిన మదన్లాల్ 1909 జూలైలో ఇండియా ఆఫీసు అధికారి కర్జన్ విల్లీని హత్య చేసి నిరంతరం స్మరింపదగిన ఒక దేశభక్తితో జ్వలించే ప్రకటన చేసి స్కాఫోల్డ్ వెళ్ళారు. “ధనికుడ్ని కాదు, సమర్థుడ్ని కాదు, నాలాంటి పేద భారతీయుడు మాతృదేశ విమోచనం కొరకు బలిపీఠంపై రక్తతర్పణం చేయడం కంటే మరేమీ చేయగలడు? నేను మరలా మరలా పుడితే దేశ దాస్య విముక్తి సాధించే వరకు ప్రాణాలర్పిస్తూనే వుంటాను.

INDIAN POLITICS, లండన్లో ప్రత్యేకించి సావర్కార్ 1910లో నాసిక్ కుట్ర కేసులో జీవితకాల ద్వీపాంతరవాస శిక్ష విధించిన తరువాత విప్లవ కార్యక్రమాలు కొనసాగించడానికి వీలుపడని పరిస్థితులేర్పడ్డాయి. యూరప్ కొత్త కేంద్రాలు ఏర్పరచుకొన్నారు. మేడమ్ కామా, పార్సీ విప్లవకారిణి జీన లాగ్వెట్లాంటి సోషలిస్టులతో సంబంధాలు ఏర్పరచుకొని పారిస్, జెనీవాల నుండి వందేమాతరం పత్రిక నడిపారు. మరీ ముఖ్యంగా ఆంగ్లో-జర్మన్ సంబంధాలు క్షీణించడంతో వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ 1909 నుండి బెర్లిన్ను స్థావరంగా ఎంపిక చేసుకున్నారు.

బ్రిటన్, యూరప్ లో గల భారతీయులు చెల్లాచెదురుగా వున్న వలస గ్రూపులుగా లేరు. బ్రిటిష్ కొలంబియా, అమెరికాలోని పశ్చిమ తీర రాష్ట్రాలలో మొదటిసారిగా ప్రజా పునాదిని ఏర్పాటుచేసుకోగలిగారు. 1914 నాటికి సిక్కులు అత్యధికులుగా గల 15000 మంది భారతీయులు గల ఒక కాలనీ ఏర్పడింది. దీనిలో సంపన్నులైన వర్తకులు, కార్మికులు వున్నారు. వీరంతా జాతి వివక్షతకు గురై బాధలు పడుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం వీరికి చేసిందేమీ లేదు.

సోహన్సింగ్ భాక్నాచే శాన్ ఫ్రాన్సిస్కోలో 1913లో గదర్ పార్టీ స్థాపించబడింది.ఈ పార్టీ తొలి నాయకులలో ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీకి చెందిన హరయాళ్ లాంటి మేధావులున్నారు. గదర్ అనే వారపత్రిక పేరును ఈ పార్టీ స్వీకరించింది. గదర్ పత్రిక నవంబర్ 1 నుండి ఉర్దూ, గురుముఖి (సంస్కృతి) భాషలలో ఆ తరువాత ఇతర భారతీయ భాషలలో వెలువడింది. గదర్ మొదటి సంచిక ఈ క్రింది మాటలతో ప్రారంభ మయింది.

“మన పేరేమిటి?” గదర్ (విప్లవం) మన పనేమిటి? తిరుగుబాటుని తీసుకొని రావడం, తిరుగుబాటు ఎక్కడ వస్తుంది? భారతదేశంలో, ఎప్పుడు వస్తుంది? “కొద్ది సంవత్సరాలలో” ఈ కాలంలో విదేశాలలో ఉన్న భారతీయ వలసలు భారత స్వాతంత్య్ర పోరాటానికి అందించిన రెండు తోడ్పాటులలో గదర్ పార్టీ ఒకదానికి ప్రాతినిధ్యం వహించింది. రెండవదైన దక్షిణాఫ్రికా సత్యాగ్రహ అనుభవాన్ని మహాత్మాగాంధీ గురించి వివరించేటప్పుడు ప్రస్తావిద్దాం.

INDIAN POLITICS GHADAR PARTY,

INDIAN POLITICS విదేశాలలో భారత విప్లవకారులు కార్యకలాపాలు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కొద్ది సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలనని కలవరపెట్టడంతో పాటు, తీవ్రమైన హిందూ మత ధోరణుల్ని, ప్రాంతీయ తత్వాన్ని, తొలినాటి సమరశీల జాతీయవాద సామాజిక దృక్పథం యొక్క ‘హిందూ భవానీ మందిర్’ కరపత్రం ప్రపంచాన్ని ఆర్యుల సిద్ధాంత విధానాలలో ప్రభావితం చేయాలని ఉద్భోదించింది. అన్ని వర్గాలను మత భావనలతో సమైక్య పరచాలన్నది .

జమిందారులకు, రైతులకు మధ్య గల విభేదాలను పరిష్కరించేందుకు, సామరస్యాన్ని పెంచాలన్నది. లండన్ గ్రూపు విప్లవకారులు ప్రచురించిన ‘ఓ! మృతవీరులారా’ (1907) కరపత్రంలో హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా తీసుకొని వచ్చిన 1857 విప్లవాన్ని జ్ఞప్తికి తెచ్చింది. “ఫిరంగి పాలన ఎలా ఛిన్నాభిన్నం చేయబడింది. హిందువులు, ముస్లింల సమ్మతితో స్వదేశీ సింహాసనాలు ఎలా ప్రతిష్టించబడ్డాయి” అంతర్జాతీయ సామ్రాజ్యవాద వ్యతిరేక యుద్ధ దృశ్యం కళ్ళ ముందు కదలాడింది.

ధింగ్రా పేల్చిన తుపాకి శబ్దం ఒంటరిగా నిస్సహాయంగా వున్న ఐరిష్ రైతు కూలీకి విన్పించింది. పొలంలో పని చేస్తున్న ఈజిప్టు రైతుకి విన్పించింది. చీకటి గదిలో పనిచేస్తున్న జూలూ శ్రామికునికి విన్పించింది (వందేమాతరం, లండన్ 1909).” వీరికి ఐరిష్ విప్లవకారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఉదాహరణకు భారత ప్రభుత్వ కస్టమ్స్ అధికారులు ‘ఇండియన్ సోషియాలజిస్ట్’ వందేమాతరం ఛటోపాధ్యాయ ‘తల్వార్’ (బెర్లిన్) తారాకాంత్ దాస్ ‘ఫ్రీ హిందూస్తాన్’ (వాంకూవర్), ‘గదర్’ లాంటి పత్రికలను న్యూయార్క్ జర్నలిస్టు జి.ఎఫ్. ఫ్రీమన్ నుండి స్వాధీనం చేసుకున్నారు.

INDIAN POLITICS అంతర్జాతీయ సోషలిస్టు ఉద్యమంతో కూడా సంబంధాలు అభివృద్ధిపరచుకొనబడ్డాయి. బ్రిటిష్ మార్పిస్టు సోషల్ డెమోక్రటిక్ ఫెడరేషన్కు చెందిన హిండ్మన్ కృష్ణవర్మ ఇండియా హౌస్లో చాలాసార్లు ప్రసంగించాడు. స్పట్గార్డ్ 1907 ఆగస్టులో సెకండ్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సందర్భంగా మేడం కామా స్వతంత్ర భారతదేశ జెండాని ఎగురవేశారు.

INDIAN POLITICS ప్రపంచ పారిశ్రామిక కార్మికుల యొక్క శాన్ ఫ్రాన్సిస్కో విభాగానికి హరదయాళ్ కార్యదర్శిగా పనిచేశారు. 1912 మార్చి మోడరన్ రివ్యూ (కలకత్తా) పత్రిక కారల్మార్పై తొలి వ్యాసం రాసింది ఆయనే. రష్యాలో అక్టోబర్ విప్లవం నేపథ్యం నుండి యుగాంతర్ నాయకుడు నరేన్ భట్టాచార్జి (ఎం.ఎన్. రాయ్), వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ, అబని ముఖర్జీ మరికొందరు గదర్ ప్రముఖుల లాంటి మొదటి కమ్యూనిస్టులు ఆవిర్భవించడం యాదృచ్ఛికం కాదు.

INDIAN POLITICS FIRST INDIAN WAR,

మొదటి ప్రపంచ యుద్ధం (1914-18) భారతదేశం యొక్క రాజకీయ జీవితంలోను, సామాజిక ఆర్థిక పరిస్థితులలోను కీలకమైన మార్పులు తీసుకొని వచ్చింది. ముఖ్యమైన పరిణామాల్ని తరువాత చర్చకు వదిలివేస్తూ యుద్ధం పట్ల అప్పటికే చురుకుగా పనిచేస్తున్న భారత రాజకీయ గ్రూపుల యొక్క స్పందనలపై కేంద్రీకరీద్దాం.

విప్లవ కార్యక్రమాలు

INDIAN POLITICS ల్లో తక్షణమే సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని పోరాడుతున్న విప్లవకారులకు యుద్ధం ఊహించని వరంగా మారింది. దేశంలోని సైనికులు (ఒక దశలో తెల్ల సైనికులు కేవలం 1000 తరలించబడ్డారు. బ్రిటనికి శత్రువులైన జర్మనీ, టర్కీల నుండి ఆర్థిక, మిలటరీ సహాయం పొందే అవకాశం లభించింది. బ్రిటన్ కి వ్యతిరేకంగా సైనిక కుట్ర జరపడానికి అవకాశమేర్పడింది.

టర్కీ (మొత్తం ముస్లింల రాజకీయ మతపరమైన నాయకత్వ స్థానం ఖలీఫా)తో బ్రిటన్ యుద్ధం హిందూ జాతీయవాదుల సమరశీల అఖిల ముస్లిం ప్రపంచవాదుల, గదర్ పార్టీకి చెందిన బర్కతుల్లా, విప్లవ నాయకులు మహమ్మద్ హస్సాన్ ఒబైదుల్లా సింధీలాంటి దియోబండ్ నాయకుల మధ్య సన్నిహిత సంబంధాలు పెంచింది.

1914 ఆగస్టులో బెంగాలులో విప్లవకారులు కలకత్తాలోని రొడ్డా సంస్థ నుండి 50 మాసర్ పిస్టళ్ళు, 46000 రౌండ్ల పేలుడు సామాగ్రి ఒక సానుభూతిపరుడైన ఉద్యోగి ద్వారా సమకూర్చుకొనే ఒప్పందంలో విజయం సాధించారు. రాజకీయ దొమ్మీలు, హత్యలు 1914-15లో 12, 7;, 1915-16లో 23, 9 – గతంలో ఎన్నడూ లేనంతగా జరిగాయి. బెంగాల్లోని అత్యధిక గ్రూపులు జతిన్ ముఖర్జీ (మారుపేరు బాఘా జతిన్) నాయకత్వంలో సమైక్యమై.

INDIAN POLITICS ల్లో రైలు మార్గాలను ధ్వంసం చేసేందుకు కలకత్తాలోని విలియం ఫోర్టువి (అక్కడ స్థావరం చేసిన 16వ రాజఫుట్ రైఫిల్స్ తో సంబంధాలు ఏర్పరచుకొనబడ్డాయి) స్వాధీనం చేసుకొనేందుకు, జర్మనీ ఆయుధాలను సంపాదించేందుకు (ఈ ఏర్పాటుకై నిరేన్ భట్టాఛార్జీని జావా పంపించడం జరిగింది) పథకాలు సిద్ధం చేయబడ్డాయి. కాని సమన్వయ లోపంతో బృహత్పథకాలు విఫలమయ్యాయి. స్థానిక గ్రామస్తుల సహాయంతో పోలీసులు జతినన్ను వెంబడించి పట్టుకున్నారు. జతిన్ ఒరిస్సా తీరంలోని బాలాసోర్ వద్ద 1915 సెప్టెంబర్లో వీర మరణం చెందాడు. బెంగాల్ విప్లవకారులు ప్రజల నుండి వేరుపడటం వలన సంభవించిన విషాదాంతం ఇది.

రాష్ బిహారీ బోస్, సచిన్ సన్యాల్, పంజాబ్కి తిరిగి వచ్చిన గదర్ వీరులు సమిష్టిగా రూపొందించిన పెద్ద కుట్రలో భాగమే బెంగాల్ పథకాలు. యుద్ధం ప్రారంభమైన తరువాత గదర్ పార్టీ వారు దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడేందుకు వేల సంఖ్యలో రావడం ప్రారంభించారు. ఒక ఓడనిండా గల సిక్కులు పంజాబ్ ముస్లిం వలసదారులు కెనడా వలస అధికారుల చేత వాంకూవర్ నుండి వెనక్కి పంపించబడ్డారు. తిరిగి వస్తుండగా కలకత్తాలోని బడబడ్డ వద్ద పోలీసులు చుట్టుముట్టారు. కాల్పులు జరిపారు. 22 మంది విప్లవకారులు హతులయ్యారు.

INDIAN POLITICS ల్లో 1914 తరువాత తిరిగి వచ్చిన పంజాబీలను బ్రిటిష్వారు చుట్టుముట్టారు (1916 నాటికి మొత్తం 8000 మందిలో 2500 మంది ప్రవాసితులుగా పంపబడ్డారు. 400 మంది జైళ్ళలో కుక్కబడ్డారు). 1915 ఫిబ్రవరి 21న ఫిరోజ్పర్, లాహోర్, రావల్పిండి సైనిక శిబిరాలపై సమన్వయంతో చేయ తలపెట్టిన దాడులు చివరి నిమిషంలో విశ్వాసఘాతుకం కారణంగా భగ్నం చేయబడ్డాయి. రాష్ బిహారీ బోస్ జపానికి పారిపోవలసి వచ్చింది.

బనారస్ ధానాపూర్ సైనిక స్థావరాలను మట్టుబెట్ట యత్నించిన సచిన్ సన్యాల్కు యావజ్జీవ ద్వీపాంతర వాస శిక్ష విధించబడింది. అఖిల భారత స్థాయి తిరుగుబాటు ఘోరంగా విఫలమైనప్పటికీ దాని నాయకులు ప్రత్యేకించి గదర్ పార్టీ వారు విప్లవ భావాలను సైన్యంలోకి, రైతాంగంలోకి తీసుకొని పోవడంలో అగ్రగాములుగా వున్నారు. ఆ తరువాత చెదురు మదురుగా కొన్ని తిరుగుబాట్లు జరిగాయి.

INDIAN POLITICS ల్లో 1915 ఫిబ్రవరి 15న సింగపూర్లో చేసిన తిరుగుబాటు అలాగే జమేదార్ చిస్టిఖాన్, జమేదార్ అబ్దుల్ ఘని, సుబేదార్ దాడ్ ఖాన్ నాయకత్వంలో పంజాబీ ముస్లిం లైట్ ఇన్ ఫాంట్రీ 36వ సిక్కుల బెటాలియన్ తిరుగుబాట్లు ప్రత్యేకంగా పేర్కొనదగినవి. తిరుగుబాటు అణచివేసిన తరువాత 37 మంది ఉరితీయబడ్డారు. 41 మందికి ద్వీపాంతరవాస శిక్ష విధించబడింది. 1915 జనవరి – ఫిబ్రవరిలో పంజాబ్ రాజకీయ దాడులలో ఒక సందర్భం, సామాజిక ప్రయోజనం ఇమిడి వున్నాయి.

ప్రధానమైన 5 దాడులలో మూడింటి లక్ష్యం వడ్డీ వ్యాపారులు. డబ్బు తీసుకొని వెళ్ళే ముందు రుణపత్రాల్ని కాల్చివేశారు. చరిత్ర పుటలలో బెంగాల్ కులీనులకు కల్పించబడిన స్థానం గదర్ రైతాంగ వీరులకు, సిపాయి వీరులకు లభించలేదు. పునర్జన్మ వుంటే ప్రతిసారి దేశం కొరకే ప్రాణాలర్పిస్తానని మృత్యుముఖంలో చెప్పగలిగిన 19 సంవత్సరాల కర్తార్సింగ్ంటి వీరులు పంజాబ్ సైనిక స్థావరానికి చెందినవారు చాలామంది వున్నారు.

అంబాలా వద్ద ఉరితీయబడిన తిరుగుబాటు చేసిన సిపాయిల గ్రూపులో వున్న ఒకే ఒక ముస్లిం అబ్దుల్లా. ముస్లిమేతరులైన సహచరులకు ద్రోహం చేయమని ప్రలోభ పెట్టినపుడు వాటిని తీవ్రంగా తిరస్కరిస్తూ చెప్పిన ఈ క్రింది మాటలు కలకాలం గుర్తుంటాయి. “వీరితో మాత్రమే నాకు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి.”

INDIAN POLITICS ల్లో విదేశాల నుండి విప్లవకారులకు సహాయం చేసే ప్రయత్నాలు యుద్ధ కాలంలో బెర్లిన్లో కేంద్రీకరింపబడ్డాయి. జిమ్మర్మన్ పథకం ప్రకారం జర్మనీ విదేశీ కార్యాలయం సహకారంతో వీరేంద్ర ఛటోపాధ్యాయ, భూపేన్ గుప్తా, హర్ దయాళ్ మరికొందరి నాయకత్వంలో బెర్లిన్లో భారత స్వతంత్ర పోరాట కమిటీ ఏర్పాటు చేయబడింది. భారత్, ఇరాన్ సరిహద్దు సమీపంలో తెగల ప్రజలలో బ్రిటిష్ వ్యతిరేక భావాలు రెచ్చగొట్టేందుకు భారత్, జర్మనీ, టర్కీలు సంయుక్తంగా ప్రచార దళాన్ని ఏర్పాటు చేశాయి. 1915 డిసెంబర్లో మహేంద్ర ప్రతాప్ బర్కతుల్లా, ఒబైదుల్లా సింధీలు యువరాజు అమానుల్లా మద్దతుతో కాబూల్ వద్ద తాత్కాలిక స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని స్థాపించారు.

INDIAN POLITICS KABUL,

యు.ఎస్.ఎ. మూడవ కేంద్రం. రామచంద్ర, చంద్ర చక్రవర్తి నాయకత్వంలోని బెర్లిన్ కమిటీకి చెందిన న్యూయార్క్ ఏజెంట్లులాంటి మిగిలిన గదర్ నాయకులకు గణనీయంగా జర్మనీ నిధులు అందాయి. కాని వారిలో వారు కలహించుకున్నారు. యుద్ధంలో అమెరికా ప్రవేశించిన తరువాత ‘హిందూ కుట్ర కేసు (1919)” లాంటి కార్యకలాపాలకు తెరపడింది. దూర ప్రాచ్యంలోని జర్మనీ రాయబార కార్యాలయం నుండి కూడా నిధులందాయి. 1915 తరువాత రాష్ బిహారీ బోస్, అబనీ ముఖర్జీ జపాన్ నుండి ఆయుధాలు పంపించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఆయుధాలు చేరవేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1915 ప్రారంభంలో సాయుధ తిరుగుబాటు అవకాశం మెరుపులాగా వచ్చింది. అంతలోనే అంతర్ధానమయింది.

INDIAN POLITICS ల్లో యుద్ధ కాలంలో ఎదురైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు బ్రిటిష్వారు తీవ్రమైన అణచివేత చర్యలు చేపట్టారు. ప్రధానంగా గదర్ ఉద్యమాన్ని అణచివేసేందుకు 1915 మార్చిలో భారతదేశ రక్షణ చట్టాన్ని చేశారు. అనుమానితులు పెద్ద సంఖ్యలో ఎలాంటి విచారణలు లేకుండా బెంగాల్, పంజాబ్ జైళ్ళలో కుక్కబడ్డారు. ప్రత్యేక కోర్టులు కఠినమైన శిక్షలు విధించాయి. అనేకమంది సైనికులకు కోర్టు మార్షల్ శిక్షలు విధించడంగాక 46 మంది ఉరితీయబడ్డారు. 64 మందికి జీవిత కాల శిక్షలు విధించబడ్డాయి.

INDIAN POLITICS ల్లో బెంగాల్ టెర్రరిస్టులు, పంజాబ్ గదర్ పార్టీ వారేగాక అఖిల ముస్లిం ప్రపంచవాదులు కూడా అణచివేతకు గురయ్యారు. యుద్ధ కాలంలోను, కొన్ని సందర్భాలలో ఆ తరువాత కూడా అలీ సోదరులు ఆజాద్, హస్రత్ మొహాని సంవత్సరాలు తరబడి గృహ నిర్బంధాలకు గురయ్యారు. లక్నోలో ఐక్యత రివల్యూషనరీలు కాని భారత రాజకీయ నాయకులు యుద్ధ ప్రయత్నాలకు మద్దతిచ్చారు. తిలక్, గాంధీలు గ్రామాలకు వెళ్ళి యుద్ధానికి సైనికుల్ని, ధనాన్ని సమకూర్చ యత్నించే వరకు ముందుకు పోయారు.https://photos.app.goo.gl/k5cWFW9uTfrePmYw7

అలాంటి విధేయత వలన పాలకులు పెద్ద రాజకీయ సంస్కరణలు చేపడతారని భ్రమలతో వున్నారు. ‘యుద్ధ పత్రాలను కొనండి. వాటిని హోంరూలక్కు హామీ పత్రంలా పరిగణించండి” – అనేది 1918లో తిలక్ నినాదం. ఈ లక్ష్యంతో మితవాదులు, అతివాదుల ఉమ్మడి వేదిక ఏర్పడింది. అలాగే ముస్లిం లీగ్ కూడా రాజ్యాంగ సంస్కరణలు సాధించడంతో పాటు యుద్ధానికి మద్దతు ఇవ్వడం ద్వారా తమకనుకూలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చే వ్యూహంతో పనిచేసింది.

INDIAN POLITICS ల్లో 1914లో, మాండలే జైలు నుండి విడుదలైన తిలక్ తన పాత కాంగ్రెస్ విరోధులతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా వున్నారు. కాని ఫిరోజ్ షా మెహతా 1915లో చనిపోయే వరకు పట్టు విడుపులు లేకుండా కఠినంగా వ్యవహరించాడు. కలకత్తాకి చెందిన భూపేంద్రనాథ్ బోస్లాంటి ఇతర మితవాద నాయకులు కాంగ్రెస్ని అప్పటి రొంపిలో నుండి బయటికి లాగేందుకు దేనికైనా సంసిద్ధతను వ్యక్తం చేశారు (గోఖలేకి లేఖ 1914 నవంబర్).

1914 నుండి దివ్య జ్ఞాన సమాజ నాయకురాలు అనిబిసెంట్కి రాజకీయ ప్రాధాన్యత పెరగడం కాంగ్రెస్ పునరేకీకరణ క్రమానికి దోహదపడింది. అనిబిసెంట్ నికరమైన సామ్రాజ్యవాద వ్యతిరేకి కాదు. ఆమె భారత, బ్రిటిష్ స్నేహ సంబంధానికి ఒక మేరకు స్వయం పరిపాలన అవసరమని భావించారు. అందుకు బ్రిటిష్ రాడికల్స్ ఐర్లండ్ హోంరూల్ తరహాలో దేశవ్యాప్త ఉద్యమాలు అవసరమని భావించారు.

INDIAN POLITICS ల్లో 1915లో కాంగ్రెస్ లో పునః ప్రవేశానికి తిలక్ గ్రూపుకి అనుమతి లభించింది. బొంబాయిలో ఒకేసారి సదస్సులు జరుపుకున్న కాంగ్రెస్, ముస్లిం లీగ్లు పరస్పర సంప్రదింపులు ద్వారా కనీస రాజ్యాంగ డిమాండ్లను రూపొందించే కమిటీలను నియమించాయి. ఇంపీరియల్ కౌన్సిల్ సభ్యులు 19 మంది భారతదేశానికి స్వయం ప్రతిపత్తి గల ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని కోరుతూ 1916 అక్టోబర్ వైస్రాయికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. కౌన్సిళ్ళలో ఎన్నికయ్యే సభ్యులు మెజారిటీగా వుండాలని 1916 డిసెంబర్ లో లక్నోలో కాంగ్రెస్, ముస్లింలీగులు ఉమ్మడిగా డిమాండ్ చేశాయి.

INDIAN POLITICS ల్లో హిందూ, ముస్లిం రాజకీయ విభేదాలు లక్నో ఒప్పందం ప్రకారం పరిష్కరించుకోవాలని తీర్మానించాయి. ప్రత్యేక నియోజకవర్గాల్ని కాంగ్రెస్ అంగీకరించింది. సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరింది. ముస్లిం మెజారిటీ ప్రాంతాలలో (దామాషా ప్రకారం గాక) తక్కువ సీట్లకు ముస్లిం నాయకులు అంగీకరించారు. (ఉదాహరణకు బెంగాల్లో 40% సీట్లు) అందుకు ప్రతిఫలంగా బొంబాయి, యునైటెడ్ ప్రావిన్సులాంటి రాష్ట్రాలలో (30 శాతం కల్పించబడాలి) ఎక్కువ ప్రాతినిధ్యానికి కాంగ్రెస్ నాయకులు అంగీకరించారు. ఒప్పందం యుపికి చెందిన వజీర్ హస్సాన్, మహముదా బాబ్ నాయకత్వం వహిస్తున్న ముస్లిం లీగు ప్రయోజనాలకు అనుకూలంగా వుంది. ఫజుల్ హక్ మద్దతు ఇచ్చినప్పటికీ బెంగాల్లో కొంత అసంతృప్తి వ్యక్తమయింది.

హోంరూల్ ఆందోళన

INDIAN POLITICS ల్లో కాంగ్రెస్ చర్చోపచర్చలు చేసే సంస్థగా వున్నది. నిరంతరం ఆందోళనలు చేసే సంస్థగా అది సన్నద్ధం చేయబడలేదు. కాంగ్రెస్ ని నిజమైన పార్టీగా మార్చడానికి మొదటి చర్యగా సంఘటితమైన వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయమని లక్నోలో తిలక్ చేసిన ప్రతిపాదనని అధ్యక్షుడు త్రోసిపుచ్చారు. కాబట్టి ఆందోళనా కార్యక్రమాలు రెండు హోంరూలు సంస్థల ద్వారా అనగా తిలకం రూల్, అనిబిసెంట్ హోంరూల్ సంస్థల ద్వారా చేపట్టవలసి వచ్చింది.

అనిబిసెంట్ 1915 సెప్టెంబర్లో తన హోంరూలు పథకాలని ప్రకటించారు. తన మద్రాసు వార్తా పత్రికలైన న్యూఇండియా, కామన్వీల్ పత్రికల ద్వారా కార్యకలాపాలు సాగించారు. ఆ తరువాత 1916లో బొంబాయి, యంగ్ ఇండియా ప్రారంభించారు. తిలక్ తన మహారాష్ట్ర స్థావరాలను నిలబెట్టుకొనేందుకు 1916 ఏప్రిల్లో హోంరూల్ లీగ్ను ప్రారంభించాడు. ఇది మహారాష్ట్ర, కర్ణాటకలకు పరిమితమయింది. 1917 ఏప్రిల్ నాటికి 17000, 1918 ప్రారంభానికి 32000 సభ్యత్వం ఉన్నట్లు చెప్పుకున్నారు.

అనిబిసెంట్ హోంరూల్ ఒక మేరకు అఖిల భారత స్వరూపం గలదైనప్పటికి ప్రధానంగా దివ్య జ్ఞాన సంబంధాలపై ఆధారపడిన సంస్థ. తిలక్, కేల్కర్ ప్రధానంగా పూనా కేంద్రం నుండి సంస్థని నడప యత్నించారు. అడయార్ (మద్రాసు) ప్రధాన కేంద్రంగా పనిచేసిన అనిబిసెంట్ లీగుకు 200కి పైగా ఉన్న శాఖలపై (మద్రాసు ప్రెసిడెన్సీలో) పర్యవేక్షణ అంతంత మాత్రంగా వుంది. అనిబిసెంట్ హోంరూలు లీగు అత్యున్నత దశలో వున్న 1917లో దాని సభ్యత్వం 27000.

నగరాలలో గ్రూపు చర్చలు, రీడింగ్ రూముల నిర్వహణ, పెద్ద ఎత్తున కరపత్రాల అమ్మకం, ఉపన్యాసాలు, పర్యటనలు – హోంరూలు లీగు కార్యకలాపాలు. ఇవేవీ మితవాద రాజకీయాలకు భిన్నమైనవి కావు. కాని గమనించదగిన కొత్తదనం తీవ్రతలో, విస్తృతిలో, వుంది. తిలక్ లీగు మొదటి సంవత్సరంలో మరాఠీ, ఇంగ్లీషు కరపత్రాలు 47000 కాపీలు అమ్మింది. బీసెంట్ సంస్థ 26000 ఇంగ్లీషు కరపత్రాలు 1916 సెప్టెంబర్ నాటికి 30వేల కాపీలు అమ్మింది.

INDIAN POLITICS ల్లో 1917 జూన్లో బిసెంట్, ఆమె దివ్యజ్ఞాన ముఖ్య సహచరులు అరండేల్ వాడియాల పర్యటనలపై నిషేధం విధించబడినప్పుడు సాత్విక నిరోధం కాక సత్యాగ్రహం ప్రస్తావన కూడా వచ్చింది. హోంరూలు ప్రచారంలో అత్యధికం అస్పష్టత, మేధోపరమైన భావనల చుట్టూ పరిభ్రమించినప్పటికీ తిలక్ ఉపన్యాసాలలో తరువాత గాంధేయ విధానాలుగా చేయడంలాంటి ఆసక్తికరమైన విషయాలు వ్యక్తమయ్యాయి.

“అటవీశాఖ మాపై జులుం చెప్పబడే అంశాలు, నిర్దిష్టమైన, స్పష్టమైన ప్రజాసమస్యల్ని హోంరూలు లక్ష్యానికి అనుసంధానం చెలాయించింది. అబ్కారీ శాఖ మద్యపానాన్ని పెంచింది” (1916 మే 1న బెల్గాంలో తిలక్ ఉపన్యాసం) రెవెన్యూ శాఖ ఒత్తిడులు, ఉప్పు పన్నులను కూడా తిలక్ ప్రస్తావించాడు. తిలక్ ఉద్యమం చిట్సవన్ బ్రాహ్మణులకు పరిమితమైనది కాదు. హోంరూలు లీగు సభ్యులలో పూనాలోని బ్రాహ్మణేతర వర్తకులు గణనీయంగా వున్నారు. ఖాండేష్ లాంటి జిల్లాల సభ్యులలో గుజారులు, మరాఠీలు, బ్రాహ్మణుల కంటే ఎక్కువగా వున్నారు. హోంరూలు లీగుకు చెందిన బి.పి. వాడియాలాంటి వారు మద్రాసు నగర శ్రామికవర్గంలో కాస్త తక్కువ స్థాయిలో అయినప్పటికీ కార్మిక వర్గ కార్యకలాపాల్ని ప్రారంభించారు.

INDIAN POLITICS ల్లో హోంరూలు ఆందోళన, ప్రత్యేకించి బీసెంట్ లీగు ఆందోళన యొక్క నిజమైన ప్రాధాన్యత కొత్త ప్రాంతాలకు, కొత్త గ్రూపులకు, కొత్త తరానికి విస్తరింప చేయడంలో వున్నది. మద్రాసునలా వుంచితే మిగిలిన రెండు తీవ్రవాద స్థావరాలు ప్రశాంతంగా వున్నాయి. యుద్ధ కాలంలో బ్రిటిష్ అణచివేతకు బెంగాల్, పంజాబ్ ప్రధాన లక్ష్యాలుగా వున్నాయి. ఎలాంటి బాహాటమైన ఆందోళన చేపట్టడం అసాధ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాని బెంగాల్లో భవానీపూర్ ప్రొవెన్సియల్ సదస్సు చిత్తరంజన్దాస్ అనే నూతన నాయకుడిని చురుకైన రాజకీయాలలోకి ప్రవేశపెట్టింది.

బీసెంట్ లీగుకు మద్రాసు నగరం పరిసర పట్టణాలకు చెందిన తమిళ బ్రాహ్మణుల నుండి యునైటెడ్ ప్రావెన్సులలో పట్టణ వృత్తిదారులు గ్రూపులు (కాయస్తులు, కాశ్మీరీ బ్రాహ్మణులు, కొందరు ముస్లింలు) సింధులో హిందూ అమిల్ మైనారిటీల నుండి బొంబాయి నగరం, గుజరాత్లో యువ గుజరాత్ పారిశ్రామికవేత్తల, వర్తకుల, లాయర్ల నుండి మద్దతు లభించింది. దివ్య జ్ఞాన సమాజం కొద్దిపాటి సంఘ సంస్కరణల కలయికతో, ప్రాచీన హిందూ విజ్ఞాన వైభవాల సిద్ధాంతాలతో, ఆధునిక పాశ్చాత్య దేశాలు సాధించిన ఫలితాలన్నీ ప్రాచీన కాలంలో రుషులు ఊహించినవేనన్న భ్రమలతో అలాంటి ఆలోచనా ధోరణులు గల గ్రూపుల నుండి కొంతమంది కార్యకర్తల్ని సమకూర్చుకొనగలిగింది.

బహుశా అందుకు కారణం బ్రహ్మ సమాజం, ఆర్య సమాజంలాంటి సంస్కరణవాద, పునరుద్ధరణవాద ఉద్యమాలు వారికి బాగా అందుబాటులోకి రాకపోవడం కావచ్చు. అంతేగాక బొంబాయి, మద్రాసు నగరాలను మినహాయించితే మిగిలిన ప్రాంతాలలో అతివాద, మితవాద రాజకీయ సాంప్రదాయాలు బలంగా వేరూనలేదు. అందువలన అక్కడ రాజకీయ శూన్యత ఆవరించింది. అనిబిసెంట్ మద్రాసులో అతి సన్నిహితుల (వాడియా, అరండేల్, సి.పి. రామస్వామి అయ్యర్.

INDIAN POLITICS ల్లో అయ్యర్ తదనంతర కాలంలో తిరువాన్కూర్ సంస్థానంలో నిరంకుశాధికార సాంప్రదాయవాద సంరక్షకుడైన అధికారి అయ్యాడు) సమూలమైన మార్పులు గోరే రాజకీయాలతో తీవ్రంగా విభేదించారు. హోంరూల్ ఉద్యమంతో ప్రేరితులైన అనేకులు 1920 నుండి భారత భవిష్యత్తు నాయకులయ్యారు. మద్రాసులో సత్యమూర్తి, కలకత్తాలో జితేంద్రలాల్రా జకీయాలలో బెనర్జీ అలహాబాద్, లక్నోలలో జవహర్లాల్ నెహ్రూ, ఖలీకుజ్జిమన్లు, బొంబాయి, గుజరాత్ల సంపన్నుడైన అద్దకం రంగుల దిగుమతిదారుడు జమన్దాస్ ద్వారకాదాస్, పారిశ్రామికవేత్త -ఉమర్ శొభాని, ఇందూలాల్ యాజ్ఞిక్ వీరిలో ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన ప్రముఖులు.

INDIAN POLITICS ల్లో బొంబాయి నగరంలో బిసెంట్ లీగుకి 2600 మంది సభ్యులున్నారు. ప్రభుత్వోద్యోగులు, పారిశ్రామికవేత్తలు నివసించే శాంతారాం చౌక్ వద్ద 10, 12 వేల మందితో సభలు నిర్వహించింది. గాంధేయ జాతీయవాదానికి వెన్నెముకగా నిలవనున్న భవిష్యత్ సూచికలైన గుజరాత్, యుపిలలో చాలా ప్రాంతాలు మొదటిసారిగా ప్రేరణ పొందాయి.

బిసెంట్ 1917 చివరలో పిల్లి మొగ్గలేశారు. బాధ్యతాయుత ప్రభుత్వంపై మాంటేగు వాగ్దానం ఒక్కసారిగా ఆమెని దాదాపు విధేయురాలిగా మార్చి వేసింది. వాలంటైన్ చిరోల్కి వ్యతిరేకంగా నమోదైన అభియోగపత్రంపై వాదించేందుకు 1918 సెప్టెంబర్లో తిలక్ లండన్ వెళ్ళారు. 1917-18 కాలంలో చంపారన్, భేదా, అహ్మదాబాద్ లో విజయాలు సాధించిన గాంధీ రాజకీయ రంగంలో ముందుకు దూసుకు వచ్చారు.

రాజ్యాంగ సవరణల అంతస్సంబంధాలని గురించి చర్చించే ముందు గాంధీయిజం ప్రారంభం, భారతీయ జీవితంపై యుద్ధం యొక్క విస్తృత ప్రభావం, 1905-17 కాలంలో భారత రాజకీయాలలో దిగువ స్థాయిలో వున్నప్పటికీ 1919 తరువాత రాజకీయాల్ని బాగా ప్రభావితం చేసిన తెగల, రైతుల ఉద్యమాలు, దిగువ తరగతుల మతవాదం, కులసంఘాలు, ప్రాంతాల ప్రజల మనోభావాల పరిణామం లాంటి అంశాల్ని సంక్షిప్తంగా పరిశీలిద్దాం.

తెగల తిరుగుబాట్లు

INDIAN POLITICS ల్లో దిగువ నుండి ఉద్యమాలు (1905-1917) 19వ శతాబ్దంలో లాగానే తెగల తిరుగుబాట్లు 20వ శతాబ్దం ప్రారంభంలో కూడా కొనసాగాయి. కడప,https://pincodesguide.in/ నెల్లూరు, నల్లమల కొండలలో ఆహార సేకరణ చేసుకొనే చెంచు తెగకి అటవీ ఉత్పత్తులపై సాంప్రదాయకంగా గల హక్కులకు 1898 నుండి ప్రభుత్వం ఆటంకాలు కల్పించడం తీవ్రతరమయింది. అణచివేత తీవ్రతరం చేస్తే అడవులను పూర్తిగా తగులబెడతారని ప్రభుత్వం భయపడింది.

INDIAN POLITICS ల్లో అటవీ సంరక్షణ, ఆదాయాల కొరకు ప్రభుత్వం 1913లో కఠిన నిబంధనల్ని అమలు పరచడం సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో అటవీ సత్యాగ్రహానికి దారితీసింది. గోదావరి కొండ ప్రాంతమైన రంపలో 1916లో తిరుగుబాటు చెలరేగి ఆ తరువాత 1922-24 కాలంలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలోని పెద్ద తిరుగుబాటుకి నాందిగా నిలబడింది. 1910లో బస్తర్ రాజుకి వ్యతిరేకంగా జరిగిన జగదల్పూర్లో జరిగిన తిరుగుబాటుని బ్రిటిష్ సైన్యాలు అణచివేశాయి. వారసత్వ వివాదం తిరుగుబాటుకి సాంఘిక కారణమైనప్పటికీ పోడు వ్యవసాయాన్నీ, అటవీ ఉత్పత్తులను స్వేచ్ఛగా వినియోగపరచుకొనడాన్ని నిషేధిస్తూ చేసిన నిబంధనల్ని అమలు పరచడం ప్రధానమైన కారణం.

INDIAN POLITICS ల్లో తిరుగుబాటుదారులు సమాచార వ్యవస్థకి అంతరాయం కల్గించారు. పోలీసు స్టేషన్లపై దాడులు చేశారు. పాఠశాలల్ని. (తెగల నుండి బలవంతపు వసూళ్ళతో, వెట్టి చాకిరితో కట్టబడిన) తగులబెట్టారు. జగదల్పూర్ పట్టణాన్ని పట్టుకొనే ప్రయత్నించారు. ఒరిస్సాలోని దాస్ పల్లా సంస్థానంలో వారసత్వ వివాదం సమస్యలపై 1914లో గోండులు తిరుగుబాటు చేశారు. యుద్ధం ప్రారంభమయిందని, అతి త్వరలో జమిందారులు, జాగీర్దారులు ఉండబోరని, గోండుల్ని గోండులే పరిపాలించుకుంటారని పుకార్లు వ్యాపించడంతో తిరుగుబాటు వేరే రూపం తీసుకున్నది.

INDIAN POLITICS ల్లో గోండుల తిరుగుబాటు జ్వాలలు ప్రవేశ సౌలభ్యం లేని పర్వత మార్గాల ద్వారా తూర్పు కనుమల నుండి కలహండి బస్తర్ల వరకు వ్యాపిస్తాయని బ్రిటిష్వారు భయపడ్డారు. గోండుల గ్రామాల్ని తగులబెట్టారు. (హోం పోలీసు మార్చి 1915 పేజీ 153) యుద్ధ వార్తలు గోండులకు పొరుగున వున్న ఛోటా నాగపూర్, ఒరయన్లకు అలాంటి ఫలితాలనే తెచ్చిపెట్టాయి. ఏకేశ్వరోపాసన పాటించాలని, మద్య మాంసాలకు, తెగల నృత్యాలకు దూరంగా వుండాలని పిలుపునిస్తూ జాత్రా భగత్ 1914లో ఉద్యమం ప్రారంభించారు.

బిర్సా లేక కైజరు బాబా సంరక్షకుడుగా వస్తాడని వదంతులు వ్యాపించాయి. తరువాత సంవత్సరంలో తెగల ప్రజలు పెద్ద ఎత్తున పోడు వ్యవసాయం ప్రారంభించారు. తీవ్రమైన అణచివేత చర్యలు ఉద్యమాన్ని తుడిచిపెట్టాయి. అంతకంటే సర్దుబాటు ధోరణి గల తానా భగత్ ఉద్యమం ఒరయన్లలో మనగలిగింది. 1920ల నుండి గాంధేయ జాతీయవాదంతో సంబంధాలు పెంచుకున్నది.

1917లో పశ్చిమ కనుమల తెగల శ్రామికుల్ని నీచమైన పనులకు నియమించే యత్నాల నుండి మయూర్ భంజ్లో సంతాల్ తిరుగుబాటు మణిపూర్లో తాడో కుకీలలో తిరుగుబాట్లు చెలరేగాయి.పోడు వ్యవసాయాన్ని ఆపివేయించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు పొతాంగ్ (అధికారుల సరుకు, సామాగ్రి కూలినాలి లేకుండా మోయించడం) లాంటి సమస్యలు తోడయ్యాయి. రెండు సంవత్సరాల పాటు గెరిల్లా యుద్ధం కొనసాగింది.

ఈ కాలంలో దక్షిణ రాజస్థాన్లోని బాన్వాడ, సుంత్, దున్గర్పూర్ భిల్లులు గోవింద గురు నాయకత్వంలోని సంస్కరణ ఉద్యమంతో ప్రేరితులై కార్యాచరణకు దిగారు. ఇది ఆత్మ సంయమనం శుద్ధి ఉద్యమంగా ప్రారంభమయింది. 1913 చివరికి భిల్లు రాజ్య స్థాపన లక్ష్యంగా పరిణితి చెందింది. 4000 మంది భిల్లులు మంగాడ్ కొండపై సమావేశమయ్యారు. భిల్లులు గణనీయంగా ప్రతిఘటించినప్పటికీ బ్రిటిష్వారు చెదరగొట్టారు. ప్రతిఘటనలో 12 మంది బిల్లులు హతులయ్యారు. 900 మంది ఖైదీలుగా పట్టుబడ్డారు. (హోం పోలీసు బి. 1913 డిసెంబర్)

రైతు ఉద్యమాలు

INDIAN POLITICS ల్లో చాలా ముఖ్యమైన రైతు ఉద్యమాలకు మేవార్ రంగస్థలమయింది. ఉద్యమాలు 1905లో ప్రారంభమయ్యాయి. అప్పుడు ఆర్.పి. దత్, డి.ఎల్. రామ్, అభినేంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ లాంటి బెంగాలీ దేశభక్తియుత మేధావులు మధ్యయుగాల నాటి చిత్తూరు రాణాల శౌర్య ప్రతాపాలు నుగ్గడిస్తూ నవలలు, నాటకాలు, కథలు, కవితలు రాస్తూ వుండటం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఆసక్తికరం. కాని రాణాల ఆధునిక వారసులు బ్రిటిష్వారి అడుగులకు మడుగులొత్తుతూ రైతులపై పలు రకాల ఫ్యూడల్ దోపిడీ కొనసాగించారు. బిజోలియాలో సర్కార్ రాజ్పుట్ అధీనంలో పెద్ద మేవార్ జాగీరు వుంది.

అతను రైతులపై 86 రకాల పన్నులు విధించాడు. 1905లో మరలా 1913లో రైతులు సమిష్టిగా పొలాల్ని
సాగుచేయ నిరాకరించారు. పొరుగు ప్రాంతాలకు వలస పోయేందుకు ప్రయత్నించారు. 1913 ఆందోళనకు సీతారాం దాసు అనే సాధువు నాయకత్వం వహించాడు. సచిన్ సన్యాల్ గ్రూపుతో సంబంధం గల బోప్సింగ్ అలియాస్ విజయ్సింగ్ పథక్ ప్రవాసంలో వుండి 1915 నాటికి రైతు నాయకుడుగా పరిణితి చెందాడు.

INDIAN POLITICS ల్లో 1916లో ఉదయపూర్ మహారాణాకి వ్యతిరేకంగా పన్నుల రద్దు ఉద్యమానికి తనతో పాటు నాయకత్వం వహించవలసినదిగా ప్రభుత్వ అధికారి మాణిక్ లాల్ వర్మని ఒప్పించాడు. యుద్ధ రుణాలకు రైతులు నిరాకరించడం బిజోలియా ఉద్యమంలోని మరొక ప్రత్యేకత. బిజోలియా ఉద్యమం గాంధేయ ఉద్యమాలతో సంబంధం పెంచుకొని 1920 దశాబ్దంలో కొనసాగింది. ఆ తరువాత పథిక్, వర్మలు రాజస్థాన్లో ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులయ్యారు.

INDIAN POLITICS ల్లో గాంధేయ జాతీయవాదం ఆవిర్భావానికి రైతు ఉద్యమాలు ప్రత్యక్షంగా గణనీయంగా రెండు ప్రాంతాలలో తోడ్పడ్డాయి. నైరుతి బీహారులోని చంపారన్, గుజరాత్లోని భేదా. స్థానిక సమస్యల్ని అఖిల భారత స్థాయికి తెచ్చేందుకు గాంధీ జోక్యం అనివార్యమయింది. గాంధీ రాకకు ముందే ఈ రెండు ప్రాంతాలలో అసంతృప్తి, నిరసనలు వెల్లువెత్తాయి. చంపారన్లో రైతులు ‘టింకాలియా’ విధానాన్ని 1860 నుండి చెదురు మదురుగా ప్రతిఘటిస్తూ వచ్చారు.

INDIAN POLITICS ల్లో రాంనగర్, బెటియా, మధువన్ జమిందారుల నుండి నీలిమందు తోటల పెంపకం కొరకు కౌలుకు తీసుకొన్న యూరోపియన్ ప్లాంటర్లు రైతుల స్వంత పొలాల్లోని కొంత భాగాలలో గిట్టుబాటు కాని ధరలకు నీలిమందు సాగు చేయవలసినదిగా రైతుల్ని నిర్బంధించారు. 1900 సం||ల నుండి రసాయనపు అద్దకాల పోటీ కారణంగా నీలిమందు రేట్లు పడిపోయాయి. ప్లాంటర్లు నష్టాల్ని రైతుల నుండి రాబట్టేందుకు కౌలు రేట్లు పెంచారు.

నీలిమందు తోటలు పెంచమని నిర్బంధించనందుకు పెద్ద మొత్తాలు చెల్లించవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. 1905-08 మధ్య కాలంలో మోతిహరి – బెటియా ప్రాంతంలో రైతులు ప్రతిఘటించారు. ప్రతిఘటన ప్రభావం 400 చ.మైళ్ళపై పడింది. హింస చెలరేగింది. (ఫ్యాక్టరీ మేనేజర్ బ్లూం ఫీల్డ్ హత్య చేయబడ్డాడు). 57 కేసులు పెట్టబడ్డాయి. 277 మందికి శిక్షలు విధించబడ్డాయి. సంపన్న రైతులు పిటిషన్లు, బీహార్ కాంగ్రెస్ నాయకులతో, జర్నలిస్టులతో సంబంధాల ద్వారా దశాబ్ద కాలం పాటు పోరాటం కొనసాగించారు.

దీనిలో భాగంగా సంపన్న రైతు వడ్డీ వ్యాపారియైన రాజ్కుమార్ శుక్లా 1916 లక్నో కాంగ్రెస్ సదస్సులో గాంధీకి పరిస్థితిని నివేదించాడు. భేదాలో కూడా గాంధీ రాకకు ముందే రైతులు సమిష్టిగా పన్నులు చెల్లించ నిరాకరించారు. 19వ శతాబ్దాంతానికి పొగాకుకి పాల ఉత్పత్తులకు మార్కెట్లు విస్తరించడంతో సంపన్న వర్గంగా ఎదుగుతున్న రైతాంగాన్ని 1898 – 1906 మధ్య కాలములో ప్లేగు, కరువు కాటకాలు, శిస్తుల పెంపుదల భారాలు క్రుంగదీశాయి. గుజరాత్లో గాంధేయ కార్యకలాపాలకు మరొక కేంద్రమైన సూరత్ జిల్లాలోని బార్డోలిలో 1908 నుండి కున్వరాజ్ మెహతాచే స్థాపించబడిన పతీదార్ యువక మండల్చే కులపరమైన విభజనతో సంఘ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి.

మతవాదం

INDIAN POLITICS ల్లో గత అధ్యాయంలో గమనించిన విధంగా దిగువ తరగతి అసంతృప్తి స్పష్టమైన క్రమంలో గాక కులపరమైన, మతపరమైన, ప్రాంతీయ పరమైన అస్పష్ట రూపాలలో వ్యక్తమయింది. ఉదాహరణకు మెమన్ సింగ్ లోని జమాల్పూర్ సబ్ డివిజన్ లోని కమరియార్చార్ వద్ద 1914లో ప్రజా సదస్సు ఈ క్రింది డిమాండ్ల పత్రాన్ని రూపొందించింది. కౌలు తగ్గింపు, పన్నుల రద్దు, అప్పులపై రాయితీలు, జమిందార్లకు రుసుము చెల్లించకుండా చెట్లు నాటే హక్కు, చెరువులు తవ్వుకొనే హక్కు, హిందూ జమిందారు కోర్టులో ముస్లిం కౌలుదారుల్ని గౌరవంగా చూడటం. సదస్సు చౌదురి ఖోస్ మహమ్మద్ సర్కార్ అనే సంపన్న ముస్లిం రైతుచే నిర్వహించబడింది.

సరస్సు పాలికాపుల సమస్యలపై నోరు విప్పలేదు. సదస్సుకు ఫజలుల్హక్ అక్రం ఖాన్, అబుల్ ఖాశింలాంటి బెంగాల్ రాజకీయ నాయకులు హాజరయ్యారు. వ్యవసాయదారుల (సంపన్న రైతుల జోతేదార్ల) అసంతృప్తిని ప్రతిఫలిస్తూ 1920-30 దశాబ్దాలలో బెంగాల్ రాజకీయాలు ముఖ్యమైన పాత్ర నిర్వహించవలసిన ప్రచార ఉద్యమానికి ఇది ఆరంభం. తుదకు ముస్లిం నేర్పాటువాదానికి దోహదపడిన హిందూ ఆధిపత్యంలో గల బెంగాలీ కాంగ్రెస్ యొక్క తప్పులు పరిమితుల కారణంగానే యిలా జరిగింది.

INDIAN POLITICS ల్లో కులీనుల మతవాదానికి పూర్తిగా భిన్నమైన సాధారణ ప్రజలకు చెందిన హిందూ మతవాదం లేక ముస్లిం మతవాదం యొక్క మూలాలపై ఈనాటికి సమగ్రమైన అధ్యయనం జరగలేదు. 1917 అక్టోబర్లో దాదాపు 50,000 మంది హిందువులు షాబాద్లోని 124, గయలోని 24, పాట్నాలోని 2 గ్రామాలలో గల ముస్లింలపై దాడులు జరపడానికి గల సామాజిక మూలాలను పరిమితులను తెలుసుకోవాలని ఎవరైనా ఆకాంక్షిస్తారు. అప్పటికప్పుడు బయటికి కనిపించే తక్షణ సమస్య గోసంరక్షణ అయినప్పటికి బ్రిటిష్ పాలన కుప్పకూలుతుందని వదంతులు వ్యాపించాయి.

దాడులలో పాల్గొన్న ప్రజలు ‘ఆంగ్రేజీ కా రాజ్ ఉఠే గయీ’, ‘జర్మనీకి జై’ నినాదాలు మారుమోగాయి. వర్గ ఉద్రిక్తతలకు భయకంపితులైన ఉన్నత కులాలకు చెందిన భూస్వాములు స్థానిక నాయకత్వాన్ని తిరిగి పొందేందుకు మతతత్వాన్ని ఉపయోగించుకున్నారు. సనాతన ధర్మ సభకి, ఆర్య సమాజానికి చెందిన ఆందోళనకారులు దొమ్మీలను రెచ్చగొట్టడంలో ముఖ్యమైన పాత్ర వహించారు.

యుపిలోని అలహాబాద్ ప్రాంతానికి చెందిన ప్రముఖ సనాతన ధర్మ కార్యకర్త మాలవ్యా ఆశ్రితుడు ఇంద్ర నారాయణ ద్వివేది లాంటి వారు మత ఉపన్యాసాన్ని, హిందీ ప్రచారాన్ని హోంరూలు రాజకీయాలతోను 1917 కిసాన్ సభల ప్రారంభంతోను కలగలపడం అప్పటి రైతాంగ సమస్యల పట్ల రైతుల్ని సమీకరించడంలో గల అనిశ్చిత పరిస్థితికి సూచిక.

INDIAN POLITICS ల్లో 1918 సెప్టెంబర్లో కలకత్తాలో జరిగిన ఘటనలలో పరిసరాల, పేద ముస్లింలు బుర్రా బజారు వ్యాపారులపై దొమ్మీలు చేశారని ఈ అంశంపై వివరంగా అధ్యయనం చేసిన జె.హెచ్. బ్రూం ఫీల్డ్ పేర్కొన్నారు. పేద ముస్లింలు, అఖిల ముస్లిం ప్రపంచ ప్రచారంతో బెంగాలీయేతర ఆందోళనకారుల (హబీబ్ షా, ఫజులార్ రహమాన్, కలామి)చే రెచ్చగొట్టబడ్డారు. హిందూ పునరుద్ధరణ వాదం, అఖిల ముస్లిం ప్రపంచవాదం – రెండూ కూడా దిగువ తరగతి అసంతృప్తి మతోన్మాదానికి, సామ్రాజ్యవాద రాజకీయాలకు మధ్య ఊగిసలాటకు వ్యక్తీకరణలుగా నిలిచాయి.

…………………………………………………………………………../|\……………………………………………………………………….

Leave a Comment