WHY IS GREAT INDIA1?
Great India పలువురికి పలు అర్థాలనిస్తుంది.Great India ప్రపంచ చరిత్రలోనే
ఒక ప్రధానమైన స్థానమలంకరిస్తోంది. ఉదాహరణకు సింధు మైదాన నాగరికత మనదేశ
వాయువ్య ప్రాంతంలో విలసిల్లింది.
అక్కడి సింధు నది తీరంలోనే ఆ గొప్ప నాగరికత వర్ధిల్లింది. చారిత్రక పరిశోధకులు నిరంతరం చేస్తున్న పరిశోధనలవల్ల ఇప్పుడుగుజరాత్‌లోని “కచ్” చౌడు భూముల్లో సింధు నాగరికతకు పూర్వమే ఒక ఉన్నతమైననాగరికత విలసిల్లి ఉందని తెలుస్తోంది.

యూరప్ ఖండవాసులు ఎన్నో సముద్ర ప్రయాణాలు ప్రారంభించి ఎన్నో నూతన
ఖండాలను కనుగొని, వాటినీ, అక్కడి ప్రజలను తమ ఆయుధబలంతో బానిసలు చేసుకొని,
అక్కడి సంపదలనంతా కొల్లగొట్టుకొని వెళ్ళి, తమ యూరప్‌దేశాలను కలాలవేసుకున్నారు.
ఆ క్రమంలోనే 15వ శతాబ్దంలో పోర్చుగీస్ చక్రవర్తి వాస్కోడిగామా నావికుడ్ని సముద్ర యాత్రలు చేసి కొత్త దేశాలు కనుగొనమని ఆజ్ఞాపించాడు.
వాస్కోడిగామా అలా ఓడలలో పయనించి పశ్చిమతీరంలోని కళ్ళికోట, (కేరళ లోని నేటి కోజికోడ్)
చేరుకున్నాడు. అలాగే ఇతర యూరోపియన్లు కూడా సముద్ర ప్రయాణాలుచేసి మన
దేశంలోని ఎన్నో ప్రాంతాలను లోబరచుకున్నారు.
మనం 1947వ సంవత్సరం దాకకూడా ఆంగ్లేయులకు బానిసలుగానే ఉన్నాము. చారిత్రకంగా విశిష్టత కలిగిన భారతదేశంభౌగోళికంగా కూడా వైవిధ్యభరితమైనది.
INDIA కి ఉత్తర సరిహద్దుగా హిమాలయ పర్వతాలు, దక్షిణంలో
హిందూమహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పడమట అరేబియా సముద్రం ఉన్నాయి.
హిమాలయాలు ఉత్తర సరిహద్దున మన Great India రక్షకులుగా నిలబడి ఉన్నాయి.
అవి మన సరిహద్దు రేఖలు మాత్రమే కావు. ఆఫ్ఘనిస్తాన్పై నిరంతర విదేశీయుల దండయాత్రలు
జరిగాయి. కానీ మన Great India కి హిమాలయాలు రక్షణ కవచాలుగా ఉన్నందువల్ల అత్యంత
తక్కువ స్థాయిలోనే విదేశీయుల దాడులకు గురి అయ్యాం.https://pincodesguide.in/wp-admin/

అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలు ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి.
అదేగాక మనదేశంలోని ఋతుపవనాలను విదేశాలకు తరలివెళ్ళకుండా అడ్డుకుంటాయి.
అందువల్ల మనకు విస్తృతమైన వర్షాలు కురుస్తాయి.
ఈ ఋతుపవనాలు Great India లో
వర్షించి, తదనంతరమే హిమాలయాలు దాటి చైనాలో ప్రవేశిస్తాయి. అవి మనకు మరో
ఉపకారం కూడా చేసి పెడ్తూవుంటాయి.
చలికాలంలో చైనా నుంచి మన Great India వైపు వీచే
చలిగాలులను కూడా అవి అడ్డుకుని మనకు ఎంతో రక్షణనిస్తాయి. హిమాలయాలే లేకపోతే
Great India మంచుగడ్డగా తయారయ్యేది. ఇన్ని ఉపకారాలు చేసే హిమాలయాలు మనకు
వరాలుగానే పరిణమించాయి.
ఈ హిమాలయ పర్వతం ఎలా ఆవిర్భవించింది? విశ్వంలో భూమి
అవిర్భవించినపుడు, ఇప్పుడు మనం చూస్తున్న ఖండాలు లేవు. ఒకేఒక భూఖండం మాత్రమే
ఉండినది.
అనంతరం అది పలు భాగాలుగా (పలు భూఖండాలుగా) విడిపోయింది. ఆ
తర్వాత అవి పెద్ద పెద్ద ఖండాలుగా రూపొందాయి. అలా రూపొందిన ఖండాలే ఆసియా,
ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా మున్నగునవి.
కొన్నిలక్షల సంవత్సరాల తర్వాత ఆ భూఖండాలు కదలబారసాగాయి. అప్పుడు ఆఫ్రికా ఖండం
నుంచి ఒక చిన్న భూఖండం విడివడి, అది తానున్న దిశ నుంచి ఈశాన్యం వైపుగా
కదలసాగింది. ఆ భూఖండం ఆసియా ఖండంతో ఢీకొని, చివరకు దానితోనే
జతపడిపోయింది.
అలా ఢీకొన్నప్పుడు పైకెగసిన భూఖండమే ఈ రోజు మనం చూస్తున్న
హిమాలయ పర్వతశ్రేణులు. ఖండాలు ఒకదానితోనొకటి ఢీకొన్నప్పుడు ఒకటి కఠినమైన బండలు గల ఖండం గానూ, మరొకటి తేలిక బండలు గలదిగానూ రూపొందాయి. వీటినుంచే పర్వతశ్రేణులు ఆవిర్భవించాయి.
హిమాలయ పర్వతాలు చాలా ఎత్తైనవి కనుక, వాటి శిఖరాల్లో మంచు గడ్డకట్టి పెద్ద మంచు పర్వతాలుగా కనబడుతున్నాయి. ఆ మంచు కరిగినపుడు నదులుగా రూపొంది మైదానప్రాంతాల్లో ప్రవహించి జీవనదులుగా పరిణమించాయి.

అలా పరిణమించిన పెద్ద నదులలో ఒకటే గంగానది. గంగతో పాటు యమునా, బ్రహ్మపుత్ర, సింధూ, సట్లెజ్, కోసి, కాంగ్రా మున్నగు నదులు ఉత్తర Great India న్ని సారవంత ప్రాంతంగా మార్చి వేశాయి..దీని తర్వాత మనం గర్వించవలసిన పర్వతాలు పశ్చిమ కనుమలు.
అరేబియాసముద్రం నుంచి వీచే గాలులను పశ్చిమ కనుమలు అడ్డగించి, ఆ ప్రాంతంలో వర్షాలుకురిపిస్తున్నాయి. అక్కడి రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, కేరళలలో పశ్చిమ కనుమలకారణంగానే విస్తృత వర్షాలు కురుస్తున్నాయి.
హిమాలయాలలో వలే మంచు లేకపోయినా, భారీగా కురిసే వర్షాల కారణంగాదక్షిణ Great india లోని కావేరి, గోదావరి లాంటి జీవనదులు పశ్చిమ కనుమలలో
పుడుతున్నాయి.
మన Great india పారిశ్రామిక రంగంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.
పారిశ్రామికాభివృద్ధికి ముఖ్యమైన ముడిసరుకు ఖనిజాలు. మన దేశంలోని మరో ప్రాకృతిక
భాగమైన బీహార్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ, ఛోటానాగపూర్
పీఠభూమిలోను అత్యంత విలువైన ఎన్నో ఖనిజాలు భూమిలో నిక్షిప్తమై ఉన్నాయి. అందువల్లే
ఆ ప్రాంతంలోనే ఎన్నో ఉక్కు కర్మాగారాలు కూడా నెలకొల్పారు.
ఇలా భారతదేశమంతా ప్రకృతి వనరులతో సహజ సంపదలతో నిండి ఉంది.
అందువల్లే ప్రపంచంలో మన దేశానికి విశిష్ట స్థానం ఉంది. ఆ సహజ వనరులను
మనం ప్రయోజన పూర్వకంగా వాడుకోగలిగితే దేశం నిజంగానే వెలిగిపోతుంది.
అయితేఈ వనరులలో అత్యంత ముఖ్యమైన ఒక దానిని మనం ఈరోజు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం.
అది ఏమనే సంగతి చివరగా చెప్పుకుందాం. ఏం చేయాలో కూడా ఆలోచిద్దాం.
వనరులు
మనం నిర్లక్ష్యం చేస్తున్న ఆ సహజ వనరు ఏమిటి? దాన్ని ఎలా సరిగ్గా మనం
ఉపయోగించుకోగలం?మొదట మన దేశంలోని ప్రకృతి వనరులను, సహజ సంపదలను గురించి
తెలుసుకోవాలి.
అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? అవి దేశాభివృద్ధికి ఎలా దోహదం చేస్తున్నాయి?
ఒక ప్రాంతం లేదా దేశం అభివృద్ధి చెందాలంటే అక్కడ లభించే సమస్త ప్రకృతి
వనరులు ఉపయోగించుకోవలసి ఉంటుంది. అవి భూసంపద, అటవీసంపద,
ఖనిజసంపద, జలసంపద మొదలగునవి.
ఎక్కువ సహజసంపదలు గల దేశమే సమగ్రంగా, వేగంగా అభివృద్ధి చెందగలదు. ఎందుకంటే సహజ వనరులు లేకుండా ఏమీ చేయలేము. వాటని ఉపయోగించే అక్కడి ప్రజల అన్ని అవసరాలనూ తీర్చగలం.
సారవంతమైన నేల ఉంటే అత్యధిక ధాన్యోత్పత్తి జరుగుతుంది. ఎన్నో రకాల ఆహారపదార్థాలను పండించవచ్చు. కోట్లాది ప్రజల ఆహార అవసరాలు తీరగలవు. దానితోపాటు అటవీసంపద కూడా సమృద్ధిగా ఉండాలి. అప్పుడే వర్షాలు విరివిగా కురవగలవు.
విభిన్న ఖనిజాలు సులభంగా దొరికితే, పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగగలదు. ఈ అన్ని సహజసంపదలు Great Idia లో పుష్కలంగా ఉన్నాయని తెలిసే, ఆంగ్లేయులతో సహా ఇతరులు కూడా మన దేశంపై దండయాత్రలు చేశారు. ఆ బానిసత్వం నుంచి స్వాతంత్య్రం పొందడమే, అందుకోసం పోరాడటమే ఒక మహాచరిత్రగా నిలిచింది.
భూసంపద
మన Great India లో ఎన్నో రకాల భూసంపద ఉంది. Great India లోని అత్యధిక భాగం ఎర్రమట్టితో నిండి ఉంది. ఇది వ్యవసాయానికి అంతగా పనికిరాదు. అయినా కోట్లాది భారతీయులకు ఆహారమందించాలని, నీటిపారుదల సౌకర్యాలను, ఎరువుల కర్మాగారాలను నిర్మించి ఆ ఎర్రమట్టి నేలలో కూడా వ్యవసాయం సాగిస్తున్నాం.
అయితే ఉత్తర భారత ప్రాంతంలోనూ, దక్షిణ భారతంలోని కోస్తా తీరాలలోనూ మంచి సారవంతమైన ఒండ్రుమట్టి ఉంది. ఈ ఒండ్రు మట్టి నదులు సముద్రంలో కలిసే డెల్టా ప్రాంతాలలో సమృద్ధిగా ఉంది. ఆ ప్రాంతాలలో వ్యవసాయం కూడా ఎక్కువగా జరుగుతోంది.

ఈ డెల్టా ప్రాంతాలు సింధూ, గంగ, మహానది, కృష్ణా, గోదావరి, కావేరి, పెన్నా నదుల కారణంగా ఏర్పడ్డాయి. ఒండ్రు మట్టి నేలల్లోనే వరి సమృద్ధిగా పండుతుంది. దానితోపాటే చెరకు, జనుము, నూనెగింజలు కూడా బాగా పండుతాయి. అందువల్లే గోదావరి ప్రాంతాన్ని, కావేరి ప్రాంతాన్ని “ధాన్యాగారాలు” అంటారు.https://youtu.be/G3spID2HZCo?si=ElKtI6aMuhq-lK8m
ఒండ్రు మట్టి తర్వాత చెప్పుకోదగిన మట్టి నల్లరేగడి భూమి. ఇది పేరుకు తగినట్టే నల్లగావున్నా పత్తి పంటకు అత్యంత అనుకూలమైనది. Great India పశ్చిమ ప్రాంతంలోని మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పత్తి విరివిగా పండుతుంది.
అందువల్లే ఆంగ్లేయులు ఆ ప్రాంతంలోనే ఆ ప్రాంతంలోనే – ముఖ్యంగా ముంబై, అహ్మదాబాద్ లో- 19వ శతాబ్దంలోనే పత్తి మిల్లులు ప్రారంభించారు. అక్కడే జౌళి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది.
అటవీ సంపద
మన Great India పర్వత ప్రాంతాలలో రకరకాల చెట్లు, చేమలు, వృక్షాలు పెరిగి పెద్దవై
అరణ్యాలుగా మారాయి. ఇక్కడి చెట్ల కలప ఇంటి సామాన్లకు, పరిశ్రమలకు
ఉపయోగపడుతుంది. ఇదేగాక ఎన్నో అటవీ జంతువులకు ఈ అడవులు ఆలవాలాలుగా
ఉన్నాయి.

వైద్యానికి అవసరమైన లెక్కలేనన్ని ఔషధ మొక్కలు కూడా ఇక్కడే లభిస్తాయి.
అయితే మన Great India విస్తీర్ణంలో 20% మాత్రమే అడవులు వ్యాపించి ఉన్నాయి.
ఇది ప్రపంచ సరాసరి కన్నా చాలా తక్కువ. ఈ అడవులు మనకు వర్షాలను కురిపించటంలో
కూడా సాయపడుతుంటాయి.
ఖనిజ సంపద
Great India ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రథమస్థానంలో ఉంది.
ఒక దేశాభివృద్ధిని దాని పారిశ్రామికాభివృద్ధితోనే లెక్క కడతారు.
పరిశ్రమలకు అత్యంత అవసరమైనవి ఖనిజాలు.
అవే పరిశ్రమలకు ముడిసరుకులుగా ఉపయోగపడతాయి. అలాంటి ఖనిజాలు విరివిగా ఉన్న దేశం అత్యంతవేగంగా పురోగమిస్తుంది. అందువల్ల మన దేశానికి కూడా అగ్రరాజ్యంగా మారే
అవకాశాలు బాగా కనబడుతున్నాయి.
మన Great India లో బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛోటానాగపూర్
ప్రాంతాలలో రకరకాల ఖనిజాలు భూగర్భంలో నిక్షిప్తమై వున్నాయి. ఈనాడు రాజస్థాన్లో
కూడా కొత్త ఖనిజ వనరులను కనుగొంటున్నారు.
ఖనిజాలు
లభించే ప్రాంతాలు
1. ఇనుప ఖనిజం –
ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్
2. రాగి
బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్
3. మైకా
4. నేలబొగ్గు
బీహార్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్
పశ్చిమబెంగాల్, బీహార్,
ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్.
5. లిగ్నైట్ – తమిళనాడు.
6. పెట్రోలియం
అసోం, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్
వీటితో పాటు బాక్సైట్, కోబాల్ట్, మార్బుల్, మాంగనీస్, బంగారం, వెండి,
యురేనియం, థోరియం, వజ్రం మున్నగు అపూర్వమైన, విలువైన ఖనిజాలు కూడా
భారత భూమిలో నిక్షిప్తమై ఉన్నాయి. అందువల్లే Great India న్ని “రత్నగర్భ” అని కూడా
అంటారు.

ఇలా ప్రకృతి వనరులతో అలరారే మన Great India ప్రపంచ స్థాయిలో కూడా ఎన్నో
అంశాలలో మొదటి మూడు స్థానాలను సాధించింది.
ఉత్పత్తులు – స్థానము
మొదటి స్థాన – మైకా,మిరియాలు ,
రెండో స్థానం – వరి
మూడో స్థానం – పొగాకు
ఇంకా అనేక పంటలలో Great India విశేష స్థానాలను సాధించి వేగంగా
పురోగమిస్తోంది. అయితే వీటిని ఉపయోగించుకోవటాన్ని మనం క్రమబద్ధీకరించవలసి
ఉంది.
Great India లోని పెట్రోలియం వనరులు, నేలబొగ్గు గనులు సుమారు 50 నుంచి
70 సంవత్సరాలకే మనకు సరిపోతాయని శాస్త్రజ్ఞులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారు.
ఈనాడు మనం పెట్రోలియం లేకుండా ఒక రోజు కూడా గడపలేం. ఇప్పటిలాగే
ఖనిజ వనరులను వేగంగా ఉపయోగించుకుంటుంటే మన తర్వాతి తరాలకు ఒట్టి గనులు
మాత్రమే మనం ఇవ్వగలం. వారు మనల్ని తిట్టుకొనే అవకాశం కలిగించిన వారౌతాం.
ప్రతి తల్లీతండ్రీతాము సంపాదించిన సంపదను తమ సంతతికిచ్చి వెళ్ళాలని
ఉవ్విళూరుతూవుంటారు. అందుకోసం మరింతగా శ్రమించి ఆస్తులు
అయితే భారత ప్రజలు ప్రస్తుతం గడిస్తే చాలు అని ఉన్న ప్రకృతి
వనరులనంతా వాడుకొనేస్తే, భవిష్యత్తులో తమ బిడ్డలకు ఏమివ్వగలరు? కనుక పొదుపుగా
సహజవనరులను వాడుకోవడంతో పాటు, నూతన అన్వేషణలు చేసి కొత్త వనరులను
కనుగొనాల్సిన అవసరం ఎంతో ఉంది.
విజేతలమవుదాం
సమస్త ప్రకృతి వనరులతో నిండిన మన Great India ఈనాటికీ అభివృద్ధి చెందుతున్న
ఒక దేశంగానే మిగిలిపోవడం విచారకరమే! మన దేశంలాగే ఇంకా ఎన్నో దేశాలు
కూడా ప్రపంచంలో సకల సంపదలతో తులతూగుతున్నాయి.
ఎన్ని ప్రకృతి సంపదలుఉన్నా, మానవులు వాటిని తమ కనుకూలంగా ఉపయోగించుకున్నప్పుడే ఆ దేశం సమృద్ధిగాఉంటుంది.
మానవులు సైన్స్ ఆవిష్కరణలు గావించక మునుపు ప్రకృతి వనరులన్నీ
భూమి కిందే వ్యర్థంగా ఎన్నో శతాబ్దాలుగా పడిఉన్నాయి. మానవులు కాలక్రమేణ
సహజసంపదల ఉపయోగాన్ని అర్థం చేసుకుని తమ శ్రమతో వాటిని వెలికితీసి జీవితాలను
ఎంతో సుఖవంతం చేసుకున్నారు.
కనుక మానవులు ఈ భూమిపై ఆవిర్భవించివుండకపోతే ఇన్ని ప్రకృతి వనరులు
నిరుపయోగంగానే ఉండివుంటాయి. అందువల్ల మానవవనరులు అనేది ప్రకృతి
వనరులన్నింటిలోనూ అత్యంత ప్రధానమైనది.
అలాంటి ప్రధానమైన ప్రకృతి వనరునుమనం శతాబ్దాలుగా వ్యర్థపుచ్చుతూ వస్తున్నాం. నేడు భారతదేశం ప్రపంచంలోనే 2వఅతిపెద్ద మానవవనరుల దేశంగా ఉంది.
ఇటీవలి జనగణన ప్రకారం మన Great India జనాభా 142 కోట్లు దాటింది. చైనా
తరువాత Great India జనాభే అదికం. అయినా మనదేశం ఆశించినమేరకు ఎందుకు అభివృద్ధి
చెందలేదు? ఈ ప్రశ్నకు ఎక్కువమంది దేశంలో జనాభా ఎక్కువని ఆలోచించకుండానే
చెప్పేస్తారు.
దురదృష్టమేమిటంటే ఆలోచనలు పదునుగా ఉండాల్సిన విద్యావంతులనుంచి
విద్యార్థులదాకా ఈ జవాబే చెప్పేస్తారు. ఎన్ని అభివృద్ధి పథకాలను అమలుపరచినా,
అత్యధిక జనాభా కారణంగా దేశం పురోగమించలేదని టక్కున చెప్పేస్తారు.
ఇంతవరకుభారత దేశంలో జరిగిన అన్నిరకాల అభివృద్ధి కూడా పంచవర్ష ప్రణాళికల ద్వారానే
జరిగింది.గత పంచ వర్ష ప్రణాలిరూపొందించేటప్పుడు కూడా రాబోయే ఐదేళ్ళకు కూడా ముందుగానే ఆలోచించారు.
అయితే పెరుగుతున్న జనాభా అవసరాలమేరకు Great India అభివృద్ధి చెందలేదు. పెరిగే
జనాభాకు కావల్సినంత విద్య ఇతరత్రా అభివృద్ధి కల్పించలేదు. విద్యనభ్యసించిన
వారందరికి ఉద్యోగాలు కల్పించలేదు. అందువల్లే మన పంచవర్ష ప్రణాళికలు కూడా
ఆశించినంతగా జయప్రదం కాలేదు.
జనాభా పెరుగుదల ఫలితంగా నిరుద్యోగం, పేదరికం, అనారోగ్యం, నిరక్షరాస్యత
మనల్ని వెంటాడుతున్నాయి. అయితే మనకన్నా ఎక్కువ జనాభా గల చైనాలో ఇలాంటి
సమస్యలు ఎందుకు లేవు అని మనం ఆలోచించాల్సి ఉంది.
ప్రజలను అతలాకుతలంచేసే పై సమస్యలు చైనాలో కనిపించడం లేదే. ఎందుకని? వాటి మించి చైనా
ఈరోజు అత్యంత వేగంగా ప్రగతి సాధిస్తోంది. కొన్ని సంవత్సరాల్లోపే అది అగ్రరాజ్యమైన
అమెరికాను కూడా వెనుకకు నెట్టేస్తుందని ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నిజానికి కొన్ని వాస్తవాలను మనం చూడ నిరాకరిస్తున్నాము.
అధిక జనాభా కూడానిజానికి ఒక గొప్ప వనరు కదా! దానినుపయోగించి దేశాభివృద్ధిని ఎందుకు సాధించలేము?మనం చేస్తున్న పొరబాటు ఏమిటంటే, పెరుగుతున్న జనాభాకు
అవసరమైనమేరకు పని కల్పించలేక పోతున్నాం.
వ్యవసాయాభివృద్ధి అంతంత మాత్రమే.పారిశ్రామికంగా కూడా మనం యువతీ, యువకులందరికీ ఉద్యోగాలుకల్పించలేకపోతున్నాం. విదేశాలనుంచి కుప్పతెప్పలుగా వినియోగవస్తువులను, ఉత్పత్తులనుతెప్పించుకుంటున్నామే గానీ, వాటిని ఇక్కడి పరిశ్రమలలోనే తయారు చేయాలనే
విషయంలో వెనుకబడి ఉన్నాము.
వ్యవసాయ రంగంలో కూడా కోట్లాది ప్రజలకు ఉపాధికల్పించడం లేదు. రైతులు ఋణగ్రస్తులై అప్పులు తీర్చలేక ఇప్పటికే లక్షల మందిభార్యాబిడ్డలను వదిలి ఆత్మహత్యలు చేసుకున్నారు.. చేసుకుంటూనేవున్నారు.
Great India కి,చైనాకు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే, అక్కడ పెరుగుతున్న జనాభా మొత్తానికి పనికల్పించే వ్యవసాయ అభివృద్ది పరిశ్రమ అభివృద్ధి అత్యంత వేగంగా సాధిస్తున్నారు.మన నడక తాబేలుతో పోటీపడుతోంది.
స్వాతంత్య్రానంతరం Great India “మిశ్రమ ఆర్థిక వ్యవస్థ”ను స్వీకరించింది. చైనా దీనికి
భిన్నంగా “సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ”ను ఎంపిక చేసుకుంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో
ప్రభుత్వ + ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుంది. కాలక్రమంలో ప్రభుత్వరంగం వెనక్కెళ్లి,
ప్రైవేట్ రంగం బలిసి పోయింది.
ప్రైవేటు పారిశ్రామిక వేత్తలకు లాభం తప్ప, ప్రజలకు
ఉద్యోగాలు కల్పించాలని ఉండదు. సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థలో ప్రజలందరికీ భాగస్వామ్యం
ఉంటుంది కానీ, ప్రైవేటు రంగం పాత్ర ఉండదు. ఇందువల్లే భారతదేశం, చైనాల అభివృద్ధి
రేఖలు విభిన్నంగా ఉన్నాయి.
ఈనాడు Great India లో లక్షలకోట్ల విలువగల ప్రకృతి వనరులు,
సహజసంపదలు, వేగంగా ప్రైవేటు పరం అయిపోతున్నాయి. అందువల్లే ప్రభుత్వం కూడా
ఏమీ చేయలేక పోతోంది. దేశాభివృద్ధి ఎంత జరిగినా, దాంతో పెద్దలకు మాత్రమే లాభాలు
పండుతాయి కానీ, పేదలకు ఒరిగేదేమీ ఉండదు.
”మనం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాం. కొత్తకొత్త పరిశ్రమలను,
వాణిజ్య సంస్థలను అధిక సంఖ్యలో ప్రారంభించాం. ఎన్నో నూతన ఉన్నత విద్యాసంస్థలు
పనిచేస్తున్నాయ”ని చెప్పుకోవటం నిజమైనదైతే, ప్రజలందరికీ పనులు కల్పించివుండాలి.
చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు ఏర్పాటు చేసివుండాలి. యువతకు ఉద్యోగాలివ్వాలనే
సామాజిక బాధ్యత ప్రైవేటు పెట్టుబడిదారులకు ఉండదు. యువత శ్రమ నుంచి ఇంకా
ఎంత అధిక లాభం పిండుకోవటం అనేదానిపైనే వారి దృష్టి అంతా ఉంటుంది.
అలాంటి వారు ప్రస్తుతం తమ పరిశ్రమలను, నూతన సైన్సు ఆవిష్కరణతో
మరింత ఆధునీకరిస్తున్నారు. అందువల్లే కొత్త కర్మాగారాలు వచ్చినా, నిరుద్యోగం కూడా
పెరుగుతూనే పోతోంది.
ఉన్న కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల జీవితాలు
మాత్రం “గొర్రె తోక బెత్తెడు” అనే విధంగానే ఉంది. దీనికి తోడు ఆదాయాలలో అంతరాలు
అపరిమితంగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ మారాలంటే మన అభివృద్ది పయనం తన దిశను మార్చుకొని నూతన మార్గంలో పయనించాలి..This is Great India .Thank you .