BIOTECHNOLOGY IS A GREAT USEFUL SCIENCE.

The great wonders of biotechnology.


BIOTECHNOLOGY….సర్ ఐజాక్ న్యూటన్ (1642-1727) కాలం నుంచి మొదలు భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, భూగర్భశాస్త్రం మొదలయిన భౌతిక విజ్ఞాన రంగాలు అద్భుతమయిన ప్రగతిని సాధించాయి.https://pincodesguide.in/modern-electronics/ ప్రధానంగా భౌతికశాస్త్రం విజ్ఞానశాస్త్ర ప్రపంచానికి పెద్ద ఎత్తున సమాచారాన్ని జతచేసింది. విశ్వం యొక్క విస్తారాన్ని, సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి, అలాగే పదార్థంలోని అన్నిటికన్నా చిన్న అణువు నిర్మాణాన్ని అంటే పరమాణువును అందులో దాగి ఉన్న అంతులేని శక్తిని మానవులు అర్థం చేసుకోవడానికి అది దోహదం చేసింది. ఫలితంగా న్యూటన్, జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి మహత్తర భౌతిక శాస్త్రవేతల్తు సమాజంలో ఎంతో గుర్తింపును, గౌరవాన్ని పొందారు.

BIOTECHNOLOGY,


వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, జీవరసాయనశాస్త్రం వంటి జీవవిజ్ఞానశాస్త్ర రంగాలు ప్రగతి విషయంగా కొంత నెమ్మదిగా సాగాయి. భౌతికశాస్త్ర రంగంలో వచ్చిన అణువును చీల్చడం వంటి విషయాలతో పోలిస్తే ఈ రంగాలలో అంత అద్భుతమయిన పరిశోధనలు అరుదుగానే జరిగాయి. కానీ గడచిన అర్థశతాబ్దిలో పరిస్థితి మారసాగింది. BIOTECHNOLOGY విజ్ఞానం మానవ జీవితాలను భౌతిక విజ్ఞానంకన్నా మరింత సూటిగా, మరింత లోతుగా ప్రభావితం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పాత వ్యాధులకు కొత్త ఔషధాలను, వ్యాధులను తట్టుకుని తక్కువ నీరు, ఎరువుతో పండే పంటలను, కాలుష్యాన్ని శుద్ధిచేయగల సూక్ష్మ జీవులను అందించే శక్తి అలాగే ఒక్క వెంట్రుక లేదా రక్తపు చుక్క సాయంతో నేరస్తులను కనుగొనే వీలు ఈ రంగానికి కనిపిస్తున్నది. చివరకు ముందే నిర్ణయించిన లక్షణాలుగ మనుషులను పుట్టించడం కూడా సాధ్యం అనిపిస్తున్నది. అందుకే ఈ రంగం వల్ల ఎంత ఉత్సాహం పుట్టిందో అంతగాను ఆతురత, అనుమానాలు కూడా పుట్టాయంటే ఆశ్చర్యం లేదు.

BIOTECHNOLOGY చరిత్ర

BIOTECHNOLOGY అన్నది కొత్తమాట. గతకొన్ని దశాబ్దాలుగా మాత్రమే వినిపిస్తున్నది. అందులోని సూత్రాలను మాత్రం చిరకాలంగా వాడుకుంటూనే ఉన్నారు. జీవసాంకేతికశాస్త్రం అన్నమాటను నిర్వచించాలంటే మానవ సమాజాలకు ఉపయోగకరంగా ఉండే ఉత్పత్తులను జీవుల సహాయంతో సిద్ధం చేయడం అని చెప్పుకోవచ్చు. పంటలను, జంతువులను అవసరాలకు సరిపడా మార్పులకు గురిచేయడం ఈ నిర్వచనం కిందకు వస్తుంది.

వేలాది సంవత్సరాలుగా మానవులు పాడి, ఉత్పత్తలు, ద్రాక్షసారాయి మొదలయినవాటి తయారీలో జీవులను వాడుకుంటూనే ఉన్నారు. ఈ పనులను కొన్ని రకాల సూక్ష్మజీవులు చేస్తాయి. ఇక జంతువులను సంకరం చేసి అవసరాలకు అనువుగా కొత్తరకాలను సిద్ధం చేశారు. ఉదాహరణకు ఎన్నో రకాల కుక్కలను గొర్రె మందలను కాచేవిగా, వేట, రేసు, వాసన ద్వారా మనుషును పసిగట్టడం వంటి అవసరాల కోసం సిద్ధం చేశారు. గుర్రాలు, పశువుల విషయంలో కూడా ఈ పద్దతులను వాడుకున్నారు.మానవులు తమ అవసరాలకు అనువయిన పంటలను అభివృద్ధి చేసుకున్నారు.

BIOTECHNOLOGY చాలాకాలంగా చేకూరిన అనుభవంతో ఎంతో జ్ఞానం సేకరింపబడింది. కేవం పరిశీలన ద్వారా వాటివెనుక దాగివున్న మౌలిక విజ్ఞానం అంత సులభంగా అర్థంకాదు. సూక్ష్మదర్శిని వంటి ఆవిష్కరణలు వచ్చేవరకు మానవులు వేచి ఉండవలసి వచ్చింది. అప్పుడు మాత్రమే జీవరసాయనశాస్త్రం, సంబంధిత ఇతర రంగాలలో నెమ్మదిగా ఆనువంశికత, జాతుల మధ్యన తేడాలు మొదలయిన వివరాలు బయట పడసాగాయి. ఇవ్వాళ్లటికి కూడా అన్ని విషయాలు తెలియలేదు. అయితే మన పాత తరాల వారికన్నా ప్రస్తుతం ఎంతో ఎక్కువ తెలుసు. ఆ తెలిసిన వివరాల ఆధారంగా ఎన్నో ప్రయోజనానులు పొందగలుగుతున్నాము.https://photos.app.goo.gl/S7Ld6u5T4Ra7JmKw6

జీవకణాలలోని మౌలిక నిర్మాణాంశంగా డిఆక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లం (డిఎన్ఎ)ను 1868లో కనుగొనడంతో మొట్టమొదటి మలుపు కనిపించింది. 1944 నాటికి ఆనువంశికతలోని రహస్యాలు అందులోనే దాగిఉన్నాయన్న నమ్మకం కలిగింది. కానీ ఈ పదార్థం కారణంగా ఇంత వైవిధ్యమూ, ఆనువంశిక లక్షణాలుగ జీవజాతులు వస్తున్న తీరు మాత్రం అర్థం కాలేదు. ఇదంతా డిఎన్ఎ నిర్మాణం మీద ఆధార పడింది అన్నది మాత్రం తేటతెల్లమయింది. జీవవిజ్ఞానంలో అన్నింటికన్నా గుర్తింపదగిన (ప్రసిద్ధమయిన) ఆవిష్కరణ 1953లో జరిగింది.

BIOTECHNOLOGY HAMES WATSON AND CRICK,

జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్ (కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాయం) కలిసి డిఎన్ఎ అన్నది మెలిపెట్టిన తాటి నిచ్చెన ఆకారంలో ఉంటుందని రెండు తాళ్ల మధ్యన పెద్ద సంఖ్యలో అడ్డుగా పుల్లలు ఉంటాయని ప్రకటించారు. (వారిద్దరికీ కలిపి 1962లో నోబెల్ బహుమానం ఇచ్చారు. దీనితో వరద తలుపులు తెరిచినట్టయ్యింది. తరువాత జరిగిన ప్రగతి అంతులేకుండా ఉంది. డిఎన్ఎ శృంఖలలను అవసరమయిన చోట్ల తెంచడం, అందులో మిగతా జన్యువులను దూర్చడం, ఆ రకంగా జీవుల తీరునే మార్చడం లాంటి పనులను వైజ్ఞానికులు నేర్చుకున్నారు. ఈ పద్ధతి కారణంగా వచ్చిన మొట్టమొదటి ఫలితం ఇన్సులిన్ తయారీ అనవచ్చు. అది 1942లో వీలయింది. అప్పటి వరకు ఇన్సులిన్ కొరకు జంతువుల మీద ఆధారపడే వారు.

1990లో ప్రారంభించిన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మరొక మహత్తర ప్రణాళిక. అందులో చాలా దేశాలు సహకార పద్ధతిలో పాల్గొన్నాయి. 3,000 మిలియన్ భాగాలున్న మానవ జన్యువులను పూర్తిగా పరిశీలించి చిత్రపటం గీసేందుకు ఈ ప్రణాళికను ప్రారంభించారు. ఇక 1997లో డాలీ అనే గొర్రెపిల్ల జన్యుపద్ధతిలో క్లోనింగ్ ద్వారా పుట్టిన మొదటి జీవిగా చరిత్రను సృష్టించింది. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనుకున్న గడువుకన్నా చాలా ముందే 2000 సంవత్సరంలో పూర్తయ్యింది. అందుకు కారణం దాని ప్రారంభం తరువాత జరిగిన సాంకేతిక అభివృద్ధి.

ఇవాళ్ళ జెనెటిక్ ఇంజనీయరింగ్ ద్వారా చాలారకాల ఔషధాలను, మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు లేదా మారుస్తున్నారు. రానున్న కాలంలో మరిన్ని పెద్ద మార్పులు చోటు చేసుకోనున్నాయి. అయితే ఈ విజ్ఞానరంగం మానవ జీవవ్యవస్థలో మరీమరీ లోతులకు చేరుతున్నది. కనుక దుర్వినియోగానికి వీలు కనబడుతున్నది. ఇది అనావశ్యకమయిన పరిస్థితి. మనిషి ‘దేవుడు’గా మారకూడదని చాలామంది భావిస్తున్నారు.

BIOTECHNOLOGY DNA,

అయితే కొత్త BIOTECHNOLOGY ఏదయినా రెండువేపులా వాడిగ కత్తి వంటిది. వేగంగా ప్రయాణం చేయడానికి విమానం సులభ మార్గం. అయితే యుద్ధ కాలంలో అది లెక్కలేని మరణాలకుదారితీస్తున్నదని తెలుసు. విజ్ఞానశాస్త్రంలో కనుగొన్న ఏ అంశాన్నయినా సురక్షితంగా వాడాలంటే కేవలం మానవ మేధస్సు ఒకటే మార్గం.


BIOTECHNOLOGY విజ్ఞానంలో మౌలికాంశాలు

మానవ శరీరంలో (మిగతా జీవుల్లోనూ) కణం అన్నది మౌలిక నిర్మాణాంశం. కణంలోని కేంద్రకంలో కొన్ని క్రోమోజోమ్లు ఉంటాయి. (చిత్రం 4.1) ఈ క్రోమోజోమ్లు నిడుపాటి డిఎన్ఎ పోగులతో ఏర్పడతాయి. డిఎన్ఎ పోగుల మీద జన్యువులు విడిభాగాలుగా అమరి ఉంటాయి. జన్యువులలో వెంట్రుకల రంగు, చర్మం రంగు, ముఖ లక్షణాలు మొదలైనవాటి యొక్క ఆనువంశికతకు సంబంధించి మౌలిక సమాచారం ఉంటుంది.
మానవ శరీరంలోని ఒక కణంలోని డిఎన్ఎ పోగులన్నీ కలిసి రెండు మీటర్ల పొడుగుంటాయి. అందులో వేలాది జన్యువులుంటాయి.

మన శరీరం యొక్క సంక్లిష్టత ఆశ్చర్యకరమయినది. అది ఎన్నో రకాల పనులను చేస్తుంది. వాటిని గురించి మనకు ఏ మాత్రం తెలియదు. ఈ మాట తెలిసిన తరువాత మనకు మన శరీరంమీద గొప్ప గౌరవం మొదలు కావాలి. ఈ ఆశ్చర్యకరమైన యాంత్రిక వ్యవస్థను ప్రకృతి ఇచ్చిన ప్రసాదంగా భావించి వీలయినంత వరకు జాగ్రత్తగా చూచుకోవడం మన కర్తవ్యం.

మానవులకు సంబంధించినంత వరకు BIOTECHNOLOGY ఉద్దేశ్యం జన్యువులలో దాగి ఉన్న ఆనువంశికత కోడ్ను అర్థం చేసుకోవడం, వాటిని అవసరమయితే మార్చడం. ఇంత సంక్లిష్టమయిన వ్యవస్థలో కొన్ని జన్యువులు సరిగా పనిచేయకుంటే అవి జన్యులోపాలుగా తరువాతి తరానికి అందుతాయి. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇటువంటి జన్యులోపాలను కొన్నింటినయినా తొలగించే వీలు BIOTECHNOLOGY వలన కలిగింది. అంతేకాక మానవులలోని అంటువ్యాధులతో పోరాడగల సూక్ష్మజీవుల ఉత్పత్తి కూడా ఈ రంగం లక్ష్యాలో ఒకటి.

BIOTECHNOLOGY నిపుణుల చేతులలో ఉన్న అత్యంత శక్తివంతమయిన | పరికరం ‘జన్యువును కత్తిరించడం’ (చిత్రం 4.2) రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు అనబడే కొన్ని రకాల రసాయనాలు డిఎన్ఎ పోగులను అవసరమైన చోట్ల కత్తిరించ ‘గలుగుతాయి. ఎఎలీయు -వన్, హైండ్-త్రి, టాక్ వన్ లాంటి ఎంజైమ్లు

కొన్ని జీవుల నుండి అందుతున్నాయి. ఈ విధానంలోని అంచెలు కింద ఇవ్వబడ్డాయి.

– తగిన రెస్ట్రిక్షన్ ఎంజైమ్ను వాడి డిఎన్ఎ పోగులలోని అవసరమయినభాగాన్ని అంటే జన్యువును కత్తిరిస్తారు.
– విడదీసిన జన్యువులను మరొక డిఎన్ఎ చైన్లోకి ప్రవేశపెడతారు.ఇందుకు కూడా మరొక ఎంజైమ్ సాయం చేస్తుంది.
– మార్చిన డిఎన్ఎను తగిన సూక్ష్మజీవిలోకి చేర్చిన తరువాత, వాటి సంఖ్య పెంచుతారు.
– మార్పులకు గురైన సూక్ష్మజీవులను విడదీస్తారు. (అన్ని సూక్ష్మజీవులు అనుకున్నట్లు లొంగవు. )
కావలసిన సూక్ష్మజీవులను పెంచి అవసరమయిన మొత్తాలో వాటిని సేకరిస్తారు.

BIOTECHNOLOGY అంటే కేవలం కణజీవశాస్త్రం కాదు. ఇందులో కెమికల్ ఇంజనియరింగ్, ఎక్ట్రానిక్స్, కంప్యూటర్స్, వృక్ష శరీరధర్మ శాస్త్రం మొదలయినవి ఎన్నో కలిసి పనిచేస్తాయి.శరీర నిర్మాణంలోని మౌలికాంశమయిన డిఎన్ఎ అన్ని జీవులలోను ఒకే రకంగా ఉంటుంది. ఒక మొసలి లేదా తిమింగలం శరీరంలోని డిఎన్ఎ, మనిషి శరీరంలోని డిఎన్ఎ మధ్యన తేడాలేదు. ఒక వ్యక్తిలోని డిఎన్ఎ వెంట్రుకలలో, చర్మంలో లేదా రక్తంలో శరీరంలోని ఏ భాగంలోనయినా ఒకేరకంగా ఉంటుంది.

BIOTECHNOLOGY DNA POWER,

డిఎన్ఎలోని రసాయనాల వరుస ప్రకారం లక్షణాు ఉంటాయి. కనుక జెనెటిక్ ఇంజనియరింగ్ పద్ధతులను వాడి ఒక జాతి డిఎన్ఎలోని భాగాలను మరొక జీవజాతి శరీరంలోకి ప్రవేశ పెట్టవచ్చు.జంతు ప్రపంచంలో మనకు అన్నిటికన్నా దగ్గర జాతి అయిన చింపాంజీలలో డిఎన్ఎ 98 శాతం వరకు మనిషి డిఎన్ఎలాగే ఉంటుంది. వ్యక్తుల మధ్యన ఈ సమాన క్షణం 99.9 వరకు ఉంటుంది. కేవలం రెండు శాతం లక్షణాలో మాత్రమే మనకు, చింపాజీలకు తేడా. మనకు, సగటు మనిషికి తేడా 0.1 శాతం మాత్రమే. అయినప్పటికీ, మనుషుల మధ్యన ఇంత ఎత్తున తేడాలు ఉండడం ఆశ్చర్యకరమయిన విషయం!
డిఎన్ఎ గురించి వివరాలు తెలిసిన తరువాత మానవులలోని వివిధ జాతుల మధ్యన ఉన్నాయంటున్న తేడాలు కేవం పైపైవి మాత్రమే అని తెలిసింది.

వెంట్రుకలు, కళ్లు లేదా చర్మం రంగుల మధ్యన వివిధ జాతులలో కొంత తేడాలు ఉండవచ్చు. అంతమాత్రాన కొన్ని జాతులు ‘హెచ్చు స్థాయి’, మరికొన్ని ‘తక్కువ స్థాయి’ అనడానికి లేనేలేదని విజ్ఞానశాస్త్రం కనుగొన్నది. నలుపు, తెలుపు, పసుపు రంగు మనుషులు అందరికీ ప్రకృతి ఒకేరకమయిన తెలివిని, పని చాతుర్యాన్ని ఇచ్చింది. వారివారి పనితీరులో తేడా ఉందంటే అందుకు కేవలం పెంపుదల వాతావరణం, అవకాశాలు, సాంస్కృతిక పరిస్థితులు మాత్రమే కారణం. చార్ల్స్ డార్విన్ తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తరువాత సుమారు ఒక శతాబ్దం కాలానికి అతని సూత్రలను దురుపయోగం చేశారు.

రాజకీయ నాయకులు, ఆలోచనాపరులు, జాతుల మధ్యన హెచ్చుతగ్గు సిద్ధాంతాన్ని పన్ని తప్పుడు అర్థాలు చెప్పారు. రాజకీయాధికారాన్ని చేజిక్కించుకుని ‘తక్కువ’ జాతుల మీద దమననీతిని సాగించడానికి ప్రయత్నించారు. అడాల్ఫ్ హిట్లర్, అతని నాజీలు ఈ వర్గానికి చెందినవారు. ఇటువంటివారు మరికొందరు లేకపోలేదు. సామ్రాజ్యవాదంలో జాతి వివక్ష అన్నది ప్రధానాంశంగా నిలిచింది. రుడ్యార్డ్ కిప్లింగ్ అనే రచయిత ‘వైట్ మాన్స్ బర్డెన్ (తెల్లవాని భారం) అనే మాట వాడాడు.

తెల్లజాతుల వారు తక్కిన జాతులను కనిపెట్టవలసి ఉందని అతని భావం. శోషణకు కేవలం ఈ మాట అడ్డుతెరగా నిలబడింది. కానీ ఇవాళ BIOTECHNOLOGY రంగాంలో జరిగిన అభివృద్ధి కారణంగా ఈ ప్రపంచంలోని తెలివిగల, ఆలోచించగల ఏ వ్యక్తులూ ఈ రకమయిన తప్పుడు మాటలను అంగీకరించరు. మానవ కణ నిర్మాణం, ఆనువంశికతలను గురించిన పరిశోధనలను మిగతా ప్రయోగాత్మక ప్రయోజనాలతో బాటు మరొక లాభాన్ని అందించాయి.మానవుందరూ మౌలికంగా ఒకటేనని కనుక అందరూ సోదరులేనని అవి తెలియజెప్పాయి.

BIOTECHNOLOGY పరికరాలు

కణాలు, క్రోమోజోమ్లు, జన్యువులు, డిఎన్ఎ అన్నీ చాలా చిన్నవి. మామూలు మనిషి కంటితో వాటిని చూడడం కుదరదు. మనిషి చెయ్యి వాటిని మార్చజాలదు. కనుక చాలా నిశితమైన పరికరాలు పద్ధతుల మీద పెద్దఎత్తున ఆధారపడవలసి ఉంది. ఆప్టికల్, ఎలెక్ట్రాన్, మైక్రోస్కోప్లు కణ నిర్మాణాన్ని పరిశీలించే వీలు కలిగిస్తాయి.వివిధ అణువులను విడదీయడానికి క్రొమాటోగ్రఫీ లాంటి పద్ధతులను వాడుతున్నారు.

వాటి మోతాదును కూడా తెలుసుకుంటున్నారు. మిశ్రమం లోని వివిధ రసాయనాలను వాటి సాంద్రత ఆధారంగా సెంట్రిఫ్యూజ్ యంత్రాలలో వేరుచేస్తున్నారు. ఫెర్మెంటేషన్ రియాక్షన్ కొరకు బయోరియాక్టర్స్ మొదలగు పరికరాలను వాడుతున్నారు. డిఎన్ఎ శృంఖలలోని నిర్మాణాన్ని పరిశీలించడానికి వరుసలను గుర్తించడానికి రసాయనాలను వాడుతున్నారు.

BIOTECHNOLOGY ఉపయోగాలు

సాంప్రదాయికంగా వైనన్ను పులియబెట్టడం, జున్ను తయారీలాంటి పద్ధతుల్లో BIOTECHNOLOGY వాడారు. గడచిన కొద్ది సంవత్సరాలలో మరెన్నో రకాల కొత్త పద్ధతులు కూడా వచ్చాయి. వాటిలో కొన్ని ఇక్కడ వర్ణింపబడ్డాయి.

ఔషధాలు, టీకా మందులు

జెనెటిక్ ఇంజనియరింగ్ ద్వారా చాలా వ్యాధుల విషయంలో ప్రత్యేకంగా ఔషధాలను తయారు చేయడానికి గొప్పవీలుంది. అయితే ఇది కష్టతరమయిన కార్యక్రమం.అలాగే ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ఔషధాన్ని జెనెటిక్ ఇంజనియరింగ్ ద్వారా తయారు చేసి మామూలు వాడకం కొరకు విడుదల చేసేలోగా చాలాకాలం కూడా పడుతుంది. కనుక ఇవన్నీ సమస్యలు. అయితే కొన్ని రంగాలలో మాత్రం BIOTECHNOLOGY ని విజయవంతంగా వాడుతున్నారు. ఉదాహరణకు ఇన్సులిన్ ను జంతువు శరీరాలనుండి సేకరించే వారు. కానీ ప్రస్తుతం మానవు ప్లీహం కణాలనుండి తగిన జన్యుపదార్థాన్ని సేకరించి దాన్ని సూక్ష్మజాతిని పెంచుతున్నారు.

సంఖ్య పెరిగిన సూక్ష్మజీవుల ఆధారంగా (మధుమేహవ్యాధికి చికిత్స కొరకు అవసరమయ్యే) ఇన్సులిన్ న్ను పెద్దఎత్తున తయారు చేయగలుగుతున్నారు. ఈ పద్ధతులను వాడి టీకా మందును కూడా ఉత్పత్తి చేస్తున్నారు. హెపటైటిస్ అన్నది ఆసియా, ఆఫ్రికాలలో బాగా విస్తరించిన కాలేయం వ్యాధి. జెనెటిక్ ఇంజనియరింగ్ ద్వారా తయారుచేసిన హెపటైటిస్-బి టీకా ద్వారా దాన్ని నివారించే వీలు కలిగింది. ఇక ఎయిడ్స్ వ్యాధికి చికిత్స అన్నది మరొక పెద్ద సమస్య. అది ఇంకా వీలు కాలేదు కానీ, క్రమంగా ప్రగతి జరుగుతూనే ఉన్నది.

GENES,

కొందరు పిల్లలు పెరుగుదల హార్మోన్ లోపం కారణంగా మరుగుజ్జులవుతారు. దానికి కూడా చికిత్స వీలయింది. (ఏ పరిశోధనయినా దురుపయోగం చేయడం మనిషికిగల సహజ లక్షణం. మరుగుజ్జు వారికి మందు తయారుచేస్తే దాన్ని వాడి క్రీడాకారులు కండలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు) కాన్సర్ చికిత్స కొరకు వాడే ఇంటర్ ఫెరాను కూడా కొత్త పద్ధతిలో తయారుచేస్తున్నారు.

జన్యువిజ్ఞానంతో వ్యాధులను గురించి త్వరగా నిర్ధారణ చేసే అనేక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. జన్యు ‘ప్రోబ్ ‘లను వ్యాధికారక క్రిముల డిఎన్ఎలో ప్రవేశపెట్టి వాటిని సులభంగా గుర్తిస్తున్నారు. జన్యులోపాలను గుర్తించడం, అవయవాల మార్పిడిలో మాచింగ్ కూడా వీలవుతున్నాయి.


నేర పరిశోధనలో వాడకం

BIOTECHNOLOGY ద్వారా డిఎన్ఎ పరీక్షలు నేరాలను కనుగొనడంలో గొప్ప పద్ధతులుగా అందుబాటులోకి వచ్చాయి. ఒక వ్యక్తిలోని డిఎన్ఎ అతనికే ప్రత్యేకంగా ఉంటుంది. అతని శరీరంలోని అన్ని భాగాలలో అదే రకం డిఎన్ఎ ఉంటుంది. నేరం జరిగిన చోట నేరస్తుని శరీరం నుంచి ఒక వెంట్రుక లేదా రక్తం మరక మొదలయినవి దొరికితే వాటి ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించవచ్చు. వేలిముద్రల పద్ధతి కన్నా ఇది చాలా మేలయిన పద్ధతిగా కనిపిస్తుంది. తెలివిగల నేరస్తులు వేలిముద్రలు పడకుండా జాగ్రత్తపడగలుగుతారు. డిఎన్ఎ పరీక్ష ఆధారంగా మృతదేహాల గుర్తింపు వీలవుతుంది. ఇక తండ్రి ఎవరని నిర్ణయించడం బాగా చిక్కు సమస్యగా ఉండేది. డిఎన్ఎ పరీక్షతో అది సులభమయిపోయింది. జెనెటిక్ స్క్రీనింగ్ ద్వారా ఒక జంటకు పుట్టబోయే పిల్లలలో తీవ్రమయిన లోపాలు ఉండే పరిస్థితిని ముందే గుర్తించవచ్చు.

జెనెటిక్ ఇంజనియరింగ్ తో జన్యు చికిత్స అనే సరికొత్త రంగం ప్రారంభం అయ్యింది. జన్యు కారణాలుగా వచ్చే హిమోఫీలియా (రక్తం గడ్డకట్టడంలో లోపం) వంటి సమస్యలను వ్యక్తి శరీరంలో మార్చిన కణాలను ప్రవేశ పెట్టడం ద్వారా సరిచేయగలుగుతున్నారు. ఈ రకమయిన పద్ధతులు ప్రామాణికంగా మారడానికి మరింత కృషి అవసరమవుతుంది.జన్యుసాంకేతిక పద్ధతితో జనాభా నియంత్రణకు వెలలేని పరికరాలుగా వాడే మాత్రలు, ఇంజక్షన్లు కూడా తయారు చేయవచ్చు.

ఎంజైములు

జీవకణాలలో ఎంజైమ్లు అనే సంక్లిష్ట అణువులు ఉంటాయి. రసాయన పరిశ్రమలలోని ఉత్ప్రేరకాల వంటివే ఇవి కూడా. వీటిని డెయిరీ విధానాలు, ఆల్కహాల్ తయారీ, ఔషధ పరిశ్రమ, బేకరీలు, చర్మ పరిశ్రమ మొదలయిన వాటిలో విస్తృతంగా వాడుతారు. ఇప్పటివరకు మొక్కలు, జంతువుల భాగాలనుంచి మాత్రమే ఎంజైము సేకరించేవారు.

ఉదాహరణకు జున్ను తయారీకి అవసరమయిన ఎంజైమ్ను చచ్చిన దూడల శరీరాల ఆధారంగా సేకరించేవారు. కనుక అది అరుదయిన, ఖరీదయిన పద్ధతిగా ఉండేది. ప్రస్తుతం ఆ ఎంజైమ్ను ఫెర్మంటర్లో పెద్దఎత్తున సిద్ధం చేయగలుగుతున్నారు. జన్యుపరంగా మార్పు చేసిన సూక్ష్మజీవుల ఈ పద్ధతికి ఆధారం. పరిశ్రమలు, ఆహార పదార్థాల ప్రాసెసింగ్లో కూడా ఇటువంటి ఎన్నో రకాల ఎంజైమ్లను వాడుతున్నారు. కొత్త పద్ధతులతో ఉత్పత్తి చవకగాను, పెద్దఎత్తున వీలవుతుంది. నియంత్రణ సులభంగా సాగుతుంది.

వ్యవసాయం, సంబంధిత రంగాలు

BIOTECHNOLOGY ద్వారా మొక్కలను జన్యుపరంగా మార్చి వాటిలోని లక్షణాలను చాలా వరకు మార్చవచ్చు. చీడపీడలకు తట్టుకునే మొక్కల తయారీ ఒక ఉదాహరణ. వాటిమీద పురుగు మందులను ఎక్కువగా వాడనవసరం ఉండదు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ‘ఎ’ విటమిన్ లోపం బాగా కనిపిస్తున్నది. దానివలన ఆరోగ్య సమస్యలు పుడుతున్నాయి కనుక విటమిన్ ‘ఎ’ ఎక్కువ మోతాదులోగల వరి ధాన్యాన్ని (బంగారు బియ్యం) తయారు చేశారు.

పండిన టొమాటోలను యంత్రాల ద్వారా కోయడం సమస్యగా ఉండేది. అవి సులభంగా చితికిపోయేవి. కనుక మందమయిన చర్మంగల టొమాటో రకాలను సిద్ధం చేశారు. ఈరకంగా సాధించగలిగిన పనులకు అంతంలేదు. మొక్కలను వ్యాధులకు తట్టుకునేవిగాను, మంచిపోషక విలువలు ఇవ్వగలిగినవిగాను, వాతావరణం నుంచి నైట్రోజన్ ను సేకరించగలిగినవిగాను (ఆ రకంగా రసాయన ఎరువు వాడకం తగ్గుతుంది) ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయవచ్చు.

అయితే జన్యుపరంగా మార్చిన పంటలను ప్రస్తుతం అందరూ అంగీకరించడం లేదు. ప్రకృతి పద్ధతులలో కలుగజేసుకుంటే కొత్త పంటల ప్రభావం కొంతకాలంలో ఎలాగుంటుందన్నది చెప్పలేము అంటూ కొందరు వాటి వాడకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. చాలా దేశాలలో కొత్తరకం పంటల ఉత్పత్తుల మీద ‘జన్యుపరంగా మార్పుచేసినవి’ అని సూచించాలని నిర్ణయం చేశారు.

మొక్కలతో వీలయిన పద్ధతులన్నీ జంతువులలో కూడా చేయవచ్చు. (చివరకు మనుషులో చేయవచ్చు) ఈ రకంగా మార్పులు చేసిన జంతువులను ట్రాన్స్జెనిక్ రకాలు అంటారు. కావసిన లక్షణాలుగల క్లోన్ చేసిన జన్యువులను ఫలదీకరణం చెందిన అండాలలోకి ప్రవేశింపజేసి వాటిని తిరిగి ఆడ జంతువు శరీరంలోకి అమర్చుతారు. సాంప్రదాయికంగా వాడుతున్న సంకరణం కన్నా ఇది చాలా వేగంగా వీలయ్యే పద్ధతి.

సహజంగానే మొట్టమొదట ఈ రకంగా చుంచును మార్పుకు గురిచేశారు. వైద్యపరిశోధనలో తరతరాుగా వాటిని వాడుతుండడం మామూలే. ఎముకల లోని పెరుగుదల హార్మోన్లను 1981లో చుంచులలో ఫలదీకరణం చెందిన అండాలలోకి ప్రవేశింపజేసి ‘సూపర్ చుంచుల’ను పుట్టించారు. అవి మామూలు చుంచులకన్నా 50 శాతం ఎక్కువ బరువున్నాయి.

తరువాత ఈ పద్ధతిని పందులలో కూడా వాడి ఎక్కువ మాంసాన్ని వీలు చేశారు. అన్ని వాతావరణాలకు తట్టుకుని పెద్దగా పెరిగే చేపలను పుట్టించారు. పాలు లేదా మాంసాన్ని ఎక్కువగా అందించగల పశువులను పుట్టించారు. మనుషులలోకి మార్పు చేయడానికి వీలుండే శరీర భాగాలను జంతువులలో పెంచారు. జన్యుపరంగా మార్చిన పందుల గుండెను తీసి మనుషుల్లో బిగించవచ్చు అంటున్నారు.

అయితే ఆ జంతువులను అన్యాయంగా వాడుకోవడం నైతికంగా అభ్యంతరకరం అన్న వాదం తలెత్తింది.
ఔషధాలు, టీకా మందుల మొదలయిన వాటి ఉత్పత్తి కొరకు జన్యుపరంగా మార్చిన మొక్కలు, జంతువులను ‘కర్మాగారాలు’గా వాడవచ్చు. కూరగాయలు, పళ్లు, పాలలో ఆ ఉత్పత్తులు అందే పద్ధతి వీలవుతుంది.

పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలు కొంత మాత్రమే ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పటికి అవి ఇక మిగలవు. వాటిని మండించినప్పుడు పుట్టే కాలుష్యం అంతులేని ఆరోగ్య సమస్య. అందుకే తిరిగి వాడుకోగల, తక్కువ కాలుష్యం పుట్టించే ఇంధనాల అభివృద్ధి కొరకు తీవ్రంగా పరిశోధన జరుగుతున్నది. ఈ రంగంలో BIOTECHNOLOGY ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

పారిశ్రామిక విప్లవం వరకు కర్రను ప్రధాన ఇంధనంగా వాడుకున్నారు. మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్ (CO) ను పెరుగుదల కొరకు పీల్చుకుంటాయి. కర్రను కాల్చినప్పుడు ఇంచుమించు అదే మోతాదులో ఆ వాయువు (CO) వాతావరణంలోకి చేరుతుంది. అంటే బొగ్గు లేదా పెట్రోలియంతో పోలిస్తే ఇంధనంగా కర్ర వాడినందుకు వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు పెరగదు. (గ్లోబల్ వార్మింగ్ ప్రభావానికి ఈ వాయువే ప్రధాన కారణం) తమకు అందుబాటులోగల జన్యుసాంకేతిక పద్ధతులను వాడి వృక్ష జన్యు శాస్త్రజ్ఞులు త్వరగా పెరిగే చెట్లను రూపొందిస్తే ఇంధన వనరులుగా అవి బాగా ఉపకరిస్తాయి.

కర్రను మండించి ఆవిరి తయారుచేసి తద్వారా శక్తి ఉత్పత్తి చేయవచ్చు. లేదా ప్రొడ్యూసర్ గ్యాస్ తయారు చేయవచ్చు. (అందులో మండే భాగాలుగా కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ మాత్రమే ఉంటాయి) ప్రొడ్యూసర్ గ్యాస్ ను ఫర్నేస్లు, అంతర్దహన ఇంజన్లు మొదలయిన వాటిలో ఇంధనంగా వాడవచ్చు.
రబ్బరు చెట్టు కుటుంబానికి దగ్గరవయిన కొన్ని మొక్కల రకాలు ఉన్నాయి. వాటిలో (పెట్రోలు సమానమయిన) ద్రవ హైడ్రో కార్బన్ ను పుట్టించవచ్చు. ఈ రకం మొక్కలను అభివృద్ధి చేయగలిగితే పెట్రోలియంకు బదులుగా చమురును అందించి అవి ఆర్థికంగా లాభదాయకాలు అవుతాయి.

చక్కెర, పిండి పదార్థం, సెల్యులేజ్ గల పదార్థాలను పులియబెట్టడం ద్వారా ఇథైల్, ఆల్కహాలు తయారుచేయవచ్చు. ఈ చర్య ప్రత్యేకమయిన సూక్ష్మజీవుల మీద ఆధారపడుతుంది. ఇథనాల్న అంతరహన ఇంజన్లలో వాడుకోవచ్చు. నిజానికి, యుద్ధం సమయాలో పెట్రోలియం సరఫరా సక్రమంగా లేనప్పుడు గతంలో ఇథనాల్న వాడుకున్నారు. కిణ్వన ప్రక్రియను మెరుగు పరచడానికి జెనెటిక్ ఇంజనియరింగ్ దోహదం చేయగలుగుతుంది.

పేడ, ఆకులు, మొదలయిన సేంద్రియ పదార్థాన్ని గాలి తగకుండా చర్యకు గురి చేసినప్పుడు బయోగ్యాస్ అనే మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్ మిశ్రమం పుడుతుంది. ఈ జీర్ణక్రియకు రెండు రకాల సూక్ష్మజీవులు అవసరం. అవి యాసిడ్ ఉత్పత్తి చేసే రకం ఒకటి, మీథేన్ న్ను పుట్టించే రకం మరొకటి. పల్లె ప్రాంతాలలో వాడుతున్న గోబర్ గ్యాస్ ప్లాంట్లలో పేడతో గ్యాస్ పుట్టిస్తున్నారు. ఫర్నేస్లో అంతర్దహన యంత్రాలు, మిగతా వాటిలో కూడా బయోగ్యాస్ను వాడవచ్చు. ఈ గ్యాస్ ను మరింత వేగంగా, మరింత ఎక్కువగా పుట్టించే సూక్ష్మజీవులను జెనెటిక్ ఇంజనియరింగ్ ద్వారా ఉత్పత్తి చేయవచ్చు.

బయోగ్యాస్ ఉత్పత్తిలో వర్ణింపబడిన సూక్ష్మజీవులలాంటివి మరికొన్ని ఉన్నాయి. అవి హైడ్రోజనన్ను పుట్టిస్తాయి. ఈ రకం సూక్ష్మజీవులు కిరణజన్య సంయోగక్రియ పద్ధతిలో పాల్గొని నీరు, సూర్యరశ్మి ఆధారంగా హైడ్రోజన్ను పుట్టిస్తాయి. ప్రస్తుతం ఈ పద్ధతి చాలా నెమ్మదిగా జరుగుతున్నది. జన్యుశాస్త్రం ఆధారంగా ఇందులో అభివృద్ధి జరిగితే వాయువును త్వరగా పెద్దమొత్తాలో తయారు చేయవచ్చు. మనిషికి తెలిసిన అసలు కాలుష్యంలేని ఇంధనాలలో హైడ్రోజన్ ముందుంటుంది. దాన్ని మండించినప్పుడు పుట్టేది నీటి ఆవిరి మాత్రమే.

BIOTECHNOLOGY పర్యావరణ పరిరక్షణ

BIOTECHNOLOGY వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సూక్ష్మ జీవులు ప్రధానపాత్ర పోషిస్తాయి. ప్రకృతిలోని చచ్చిన మొక్కలు, జంతువులు వాటి ద్వారానే పర్యావరణ వ్యవస్థలోకి తిరిగి కలుస్తాయి. సేంద్రియ వ్యర్థాలను తొలగించడానికి మనిషి సూక్ష్మజీవులను వాడుకున్నాడు. ఉదాహరణకు ఒక నగరం నుంచి పుట్టే వ్యర్థాలను ఒక గుంటలో వేసి పైన మట్టి కప్పుతారు. లోపల సూక్ష్మజీవులు పనికి పూనుకుంటాయి.

గాలిలేని పరిస్థితిలో ఎనరోబిక్ పద్ధతిలో అవి సేంద్రియ వ్యర్థాలను జీర్ణింప చేస్తాయి. మురుగును శుభ్రపరిచే వ్యవస్థలో వచ్చిన మురుగును ముందు ఎనరోబిక్ పరిస్థితులో డైజస్టర్ ద్వారా పంపుతారు. అప్పుడది ఆరోగ్యపరంగా నిరపాయకరంగా మారుతుంది. దాన్ని ఎరువుగా వాడవచ్చు లేదా సముద్రం లోతులోకి పంపి వదిలించుకోవచ్చు.

కర్మాగారాల నుండి వెలువడే వ్యర్థాలలోని రసాయనాలను సూక్ష్మక్రిముల సాయంతో తొలగించవచ్చు. సముద్రాల మీద ఒలికిన చమురు తెట్టెలను క్రిముల సాయంతో తొలగించవచ్చు. అక్కడి బాక్టీరియాకు పోషక పదార్థాలను అందిస్తే చాలు పని జరుగుతుంది. మొక్కలు, సూక్ష్మజీవులలో జన్యుమార్పుల వీలు కారణంగా ఎన్నో కొత్త పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒలికిన చమురును బాక్టీరియాలను వాడి శుభ్రపరచవచ్చు. కర్మాగారా వ్యర్థాల కారణంగా భారలోహాలు చేరిన మట్టిని శుభ్రం చేయవచ్చు.

ఖనిజాలను తవ్వడం అనే అనుకోని రంగంలో కూడా సూక్ష్మజీవులను వాడుతున్నారు. కొన్ని సూక్ష్మజీవులు ఖనిజాలను పీల్చగలుగుతాయి. ఉదాహరణకు సూక్ష్మజీవులను కలిపిన నీటిని కాపర్ సల్ఫైడ్ అనే రాగి ముడి ఖనిజానికి చేరుస్తారు. క్రిములు ఖనిజాన్ని పీల్చుకుంటాయి. వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్, నత్రజనులను వాడి అవి ముడి ఖనిజాన్ని కాపర్ సల్ఫేట్గా మారుస్తాయి. అది నీటిలో కరుగుతుంది. బయోలీచింగ్ అనే ఈ పద్ధతిని యురేనియంను వెలిదీయడానికి కూడా వాడుకుంటారు. సాంప్రదాయకంగా గనులలో వాడుతున్న పద్ధతులకన్నా ఇవి చవకగా వీలవుతాయి. జెనెటిక్ ఇంజనియరింగ్ పద్ధతులతో వాటిని మరింత మెరుగుపరచవచ్చు.

BIOTECHNOLOGY నైతిక సమస్యలు

BIOTECHNOLOGY గత వంద సంవత్సరాలలో అణ్వాయుధాలు తప్ప బహుశా మరే ఇతర సాంకేతిక అభివృద్ధి కారణంగాను జీవసాంకేతిక శాస్త్రానికి ఎదురయినట్టు ప్రజల నుంచి ప్రతిష్టంభన తలెత్తలేదు. జీవసృష్టి అనే కార్యక్రమంలో కలుగజేసుకుని జన్యులక్షణాలను మారుస్తారంటే సహజంగానే మనిషి తానే ‘దేవుడుగా’ మారే ప్రయత్నం చేస్తున్నాడని భయాలు మొదలవుతాయి. అంతకన్నా సహేతుకమయిన అభ్యంతరాలు కూడా ‘తలెత్తుతున్నాయి. వాటిని సుభంగా కొట్టివేయడానికి లేదు. అటువంటి కొన్నింటిని గురించిన చర్చ కింది విధంగా ఉంది.

జన్యుపరంగా మార్చిన పంటలను, అలాగే పాలు, మాంసం మొదయిన జంతు సంబంధ ఉత్పత్తులు వాడినందుకు ఎక్కువకాలం మీద ఉండే ఫలితాలు ఏవిధంగా ఉంటాయి? ఉదాహరణకు జంతువుల జన్యువులను మొక్కలలోకి మార్చినందుకు ఆ జంతువులలోని వ్యాధులు మనుషుకు సోకే వీలుందా? ఈ BIOTECHNOLOGY విధానాల కారణంగా పెద్ద కార్పొరేట్ సంస్థలకు అంతులేని శక్తి చేతికి అంది లక్షలాది చిన్న రైతులకు అవరోధంగా మారుతుందా? ఈ రకం ఉత్పత్తులకు అవసరమయ్యే వ్యయాలను పెద్ద కంపెనీలు మాత్రమే పెట్టగలుగుతాయి.

ఉదాహరణకు ఒక కంపెనీ వారు వరి లేదా గోధుమ విత్తనాలను తయారుచేస్తారు. వాటి దిగుబడి మరీ ఎక్కువగా ఉన్నందుకు రైతులందరూ వాటినే వాడే పద్ధతి తలెత్తుతుంది. అప్పుడు ఆ కంపెనీ వారి గుత్తాధిపత్యం మాత్రమే సాగుతుంది. తయారుచేసిన విత్తనం ఒక్కసారి మాత్రమే పనిచేసే విధంగా ఉత్పత్తిదారులు ఏర్పాటు చేయవచ్చు. అంటే రైతు తాను పండించిన పంటనుండి కొంతభాగాన్ని, సాంప్రదాయిక పద్ధతిలో, విత్తనాలుగా వాడుకునే వీలు ఉండదు.

జన్యుపరంగా మార్చిన సూక్ష్మజీవు పరిశోధనశాల నుండి తప్పించుకుని సమాజాన్ని ప్రమాదానికి గురిచేసే వీలుందా? మన సౌలభ్యం కొరకు మందు, పోషక ఆహారాలు తయారు చేసుకునేందుకు గాను జంతువులను మార్చడం అన్నది నైతికమయినదేనా?

ఇక మానవుల పునరుత్పత్తి గురించిన ప్రశ్నలు మరింత కష్టంగా ఉన్నాయి. పుట్టబోయే తమ బిడ్డ లక్షణాలు, ఉదాహరణకు చర్మం రంగు, కంటి రంగు వంటి వాటిని తల్లిదండ్రులు ముందే ఎంపిక చేసుకోగలుగుతారా? పుట్టని బిడ్డ ఆడ, మగ తెలుసుకోవడానికి మన దేశంలో వాడిన స్కానింగ్ పద్ధతులద్వారా ఉత్పాతం పుట్టిన సంగతి అందరూ ఎరిగినదే. వ్యాపారపరంగా అందుబాటులోకి వచ్చి ఆడ మనుషులు పిల్లలను పుట్టించే యంత్రాలుగా మారిపోతారా? తండ్రి, కుటుంబం అన్నవి అర్థం లేని మాటలవుతాయా? చివరకు ఈ రకమయిన సమాజం ఏమవుతుంది?

ఈ ప్రశ్నలకు, ఇలాంటి మరికొన్నింటికి సులభమయిన సమాధానాలు లేవు. శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు, ప్రజాభిప్రాయ నిర్ణయం చేసేవారు అలాగే మరెందరో వీటితో కుస్తీ పడుతూనే ఉన్నారు.BIOTECHNOLOGY రంగం విషయంగా ఇప్పటికే పరిశోధనల మీద, మార్కెటింగ్ మొదలయిన వాటిమీద కావసినన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. ఇటువంటి వైరుధ్యాలు కొంచెం తక్కువస్థాయిలో అయినా గతంలోకూడా తలెత్తాయి. మొదట్లో రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలను గొప్ప వరాలుగా భావించారు.

జంతువులు, పిట్టలు, నీటి వనరుల మీద వాటి ప్రభావం అర్థమయిన తరువాత రసాయనాల వాడకానికి వ్యతిరేకత తలెత్తింది. ప్రస్తుతం వాటిని పూర్తిగా పక్కన పెట్టకున్నా వీలయినంత జాగ్రత్తగా వాడుతున్నారు. రానున్న సంవత్సరాలలో బయోటెక్నాజీని కూడా జాగ్రత్తగా వాడుకునే వీలుంది. క్రిమిసంహారకాలు, ఎరువుల విషయంలోవలె కాక వీటి పట్ల ప్రతిఘటన, అభ్యంతరాలు మొదట్లోనే తలెత్తినందుకు జాగ్రత్తలు మరింత వీలవుతాయన్నది ఒక జరిగే వీలుంది.

ఇక చివరగా విశ్లేషించి చూస్తే శాస్త్రవిజ్ఞానం, BIOTECHNOLOGY తగినంతగా వాడాలన్న నిర్ణయం మనుషుల చేతిలోనే ఉంది. మానవాళి తగిన జ్ఞానాన్ని జాగ్రత్తగా వాడుకుని వైజ్ఞానిక ప్రగతి అందించిన BIOTECHNOLOGY అనే బలవత్తరమయిన పరికరాన్ని మరింత జాగ్రత్తగా వాడుకుంటారని మనం ఆశిద్దాము.

మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోగలరని మనవి.

…………. ధన్యవాదములు ……….

Leave a Comment