Alfred Nobel: From Death Eater to Peacemaker
ALFRED NOBEL – నొబెల్ బహుమతి అన్నమాట వినగానే మనఃఫలకం మీద ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎందరో వైజ్ఞానికులు, సాహితీవేత్తలు, ఆర్థిక నిపుణులు కదలాడతారు. ప్రపంచంలోని అత్యున్నత బహుమానాలలో అది ముఖ్యమయినది. తమ దేశంలో ఎంతమంది నొబెల్ బహుమానాలు అందుకున్నారని ప్రకటించడానికి దేశాలు పోటీ పడుతుంటాయి.

మహత్తరమయిన ఈ బహుమానానికి తన పేరును (సంపాదనను కూడా) అందజేసిన ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నొబేల్ చాలా సంక్లిష్టమయిన వ్యక్తి. అతని జీవితకాలంలో పొగడ్తల కన్నా తెగడ్తలే ఎక్కువగా ఎదురయ్యాయి. అయితే చాలామంది మనుషుల్లో భిన్న వ్యక్తిత్వాలు ఉంటాయి. చాలాకాలం గడిచిన తరువాతగానీ వారి గురించి సంపూర్తిగా సమీక్షించడం వీలు కాదు.
ALFRED NOBELతండ్రి ఇమానుయెల్ నొబేల్, కొడుకుకు అన్ని రకాలుగాను మార్గదర్శి. అతను కూడా ఒక ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త. అంతకుముందు పరిచయంలేని రంగాలలోకి అడుగుపెట్టడానికి ధైర్యంగలవాడు. నొబేల్ వంశం లోని ఒకానొక వ్యక్తి 17వ శతాబ్ది స్వీడన్లో లో సాటిలేని వైజ్ఞానికుడిగా పేరు పొందాడు. బుద్ధిశక్తి, ధైర్యాలు కుటుంబంలో వారసత్వంగా వచ్చాయని అర్థం. ఆ రకంగా ముందుకుసాగి ALFRED NOBEL వంశంలో అందరికన్నా గొప్ప పేరు పొందాడు.
ఇమానుయెల్ నొబేల్ తుపాకులు, పేలుడు పదార్థం మొదలగు వాటిని తయారు చేసేవాడు. కనుక అతని వృత్తికి ‘మరణ బేహారి’ అన్న మాట ఒకటి శాంతికాముకులు జత చేశారు. అయితే అతను మాత్రం ఆ సంగతిని అసలు పట్టించుకోలేదు. ఆత్మస్థైర్యం అంతగా ఉన్నప్పటికీ, ఆయనకు వ్యాపారంలో ఒడుపులు మాత్రం ఆ స్థాయికి లేవు అనాలి. స్వంత దేశమయిన స్వీడన్లో అతని సంస్థ కుప్పకూలింది. కనుక రష్యాలోని ఒకప్పటి లెనిన్ద్ అంటే ఇప్పటి సెయింట్ పీటర్స్బర్గ్కు అతను వలస వెళ్ళాడు. 21 అక్టోబర్ 1833న స్వీడన్లోని స్టాక్తోమ్లో పుట్టిన ఆల్ఫ్రెడ్ నొబేల్తో పాటు మిగతా పిల్లలను కూడా తనతో తీసుకుపోయాడు.
రష్యాలో ఆయుధాలు, మైన్స్ను ముఖ్యంగా నౌకాదళం వారికి సరఫరా చేస్తూ ఇమానుయెల్ బాగా కుదురుకున్నాడు. కుటుంబం సుఖంగా బతక సాగింది. ప్రారంభ విద్య స్వీడన్లో జరిగిన తరువాత ఆల్ఫ్రెడ్కు 1843 నుంచి 1880 మధ్యన చదువు ప్రైవేట్ ట్యూటర్ల కింద కొనసాగింది.
ALFRED NOBEL ఆరోగ్యం అంతగాలేని పిల్లవాడు. వెన్నెముక బలంగా లేని కారణంగా అతను రోజులపాటు మంచాన ఉండేవాడు. బయట ఆడడానికి అతని శరీరం అనుకూలంగా లేదు. అయితే మామూలుగానే ఆ ఒంటరితనం, భావుకత కారణంగా అతను మిగతా విషయాలలో సుఖాలను పట్టుదలతో వెతకసాగాడు. మెదడుతో చేసే పనులను అనుసరించాలని అతను నిర్ణయించు కున్నాడు.
విజ్ఞానశాస్త్రం, సాహిత్యం, చరిత్ర, తత్త్వశాస్త్రం వంటి విషయాలకు సంబంధించిన పుస్తకాలను అతను పెద్దఎత్తున చదవసాగాడు. రష్యన్, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లీష్ అనే విదేశీ భాషలను బాగా నేర్చుకున్నాడు.
అతనికి గల పట్టుదల, శక్తి గమనించిన తరువాత తండ్రి వ్యాపారంలో మెళకువలు నేర్చుకోవడానికి, తగిన వారితో పరిచయాలు పెంచుకోవడానికి ఆల్ఫ్రెడ్ను ప్రపంచ యాత్రకు పంపించాడు.
ALFRED NOBEL 1850లో బయలుదేరి ఆల్ఫ్రెడ్ నోబెల్ రెండు సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాడు. అతను హాంబుర్గ్, కోపెన్హెగెన్, పారిస్, లండన్, యుఎస్ఎలను సందర్శించాడు. జులై 1852లో తండ్రి వ్యాపారంలో చేరి ఆయుధాల తయారీలో సాయం చేయసాగాడు. నొబేల్ కుటుంబానికి రష్యాలో ప్రీమియన్ యుద్ధం (1853-1856) కాలంలో అదృష్టం బాగా కలిసి వచ్చింది. యుద్ధం కారణంగా ఆయుధాల తయారీ పేరున ఆదాయం పొంగి పొరలింది. వాళ్లు ప్రత్యేకంగా శతృ ఓడలను పేల్చడానికి వాడే ఫ్లోటింగ్ మైన్స్ను తయారు చేసేవారు.
ఆ మైన్స్లో తుపాకీ మందును మండించడానికి డిటోనేటర్ వాడే పద్ధతిని ఇమానుయెల్ నొబేల్ తయారు చేశాడు. అందులో ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటుంది. ఓడ తగలగానే అది పగులుతుంది. అందులోని గంధకికామ్లం వెలువడి పొటాషియం క్లోరైడ్, గంధకం మిశ్రమంతో కలుస్తుంది. అప్పుడొక చిన్న పేలుడు జరుగుతుంది. దానితో అసలు పెలుడు పదార్థం అంటుకుంటుంది.
అయితే ఆ పేలుడు పదార్థం పెద్ద యుద్ధ నౌకకు గొప్పహాని కలిగించే బలం కలది కాదు. అది గమనించిన తండ్రి, కొడుకులు మరింత శక్తిగల పేలుడు పదార్థాను గురించి ఆలోచన మొదలు పెట్టారు. 1856లో ప్రీమియన్ యుద్ధం ముగియడంతో బేల్స్ పరిస్థితి బాగా దిగజారింది. ఒక్కసారిగా ఆయుధాలు ఆర్డర్లు ఆగిపోయాయి. వాళ్ల కర్మాగారం అగ్ని ప్రమాదానికి గురయింది. అప్పులు ఇచ్చినవాళ్లు ఒత్తిడి చేయసాగారు. చివరికి ఇమానుయెల్ దివాళా తీసినట్టు ప్రకటించి 1859లో స్వీడన్క తిరిగి వచ్చాడు.

అస్కాన్ సోబ్రేరో అనే పరిశోధకుడు 1847లో నైట్రోగ్లిసరీను అనే ఎంతో బలమయిన పేలుడు పదార్థాన్ని కనుగొన్నాడు. గది ఉష్ణోగ్రత దగ్గర ద్రవరూపంలో ఉన్న రసాయనాన్ని వాడడం ప్రమాదకరంగా ఉండేది. అయినా ALFRED NOBEL తండ్రీ కొడుకులు వెనుకాడలేదు. ఇద్దరూ కలిసి 1862లో నైట్రోగ్లిసరిన్ సాయంతో కంట్రోల్డ్ పేలుడును మొట్టమొదట సాధించారు.
ALFRED NOBEL అందుకు తగిన ఒక డిటోనేటర్ను తయారు చేసి 1863లో పేటెంట్ తీసుకున్నాడు. డిటోనేటరు పేల్చితే ముందు మెర్క్యూరీ ఫుల్మినేట్ సాయంతో చిన్న పేలుడు జరుగుతుంది. దాని కారణంగా అసలు పేలుడు పదార్థం అంటుకుంటుంది సెప్టెంబర్ 1864లో జరిగిన ఒక పెద్ద ప్రమాదం కారణంగా నొబేల్ కుటుంబంలో అగాథం ఏర్పడింది.
ALFRED NOBEL చిన్న తమ్ముడు ఎమిల్ తో బాటు పని చేస్తున్న మరొక నలుగురు ఒక పెద్ద పేలుడులో చనిపోయారు. కర్మాగారం సర్వనాశనమయింది. నైట్రోగ్లిసరిన్ ఉత్పత్తికి ఇచ్చిన లైసెన్స్ను అధికారులు వెంటనే రద్దు చేశారు ALFRED NOBEL ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ప్రాణనష్టం లేకుండా సాంకేతిక రంగంలో కొత్త అంశాలను కనుగొనడం అసాధ్యం అని కూడా అప్పుడన్నాడు. అతను వెంటనే కర్మాగారాన్ని జర్మనీలోని హాంబుర్గ్కు మార్చాడు.https://photos.app.goo.gl/Rq4uBm1FapygMeuw6
కొన్ని సంవత్సరాలోనే పెద్దఎత్తున లాభాలు వచ్చాయి. పేలుడు పదార్థాల కొరకు నైట్రోగ్లిసరిన్ అమ్మకంతో గొప్ప పేరు కూడా వచ్చింది.నైట్రోగ్లిసరిన్ విషయంలో ఉన్న ప్రమాదాల సమస్య మాత్రం ఇంకా అలాగే ఉంది. ALFRED NOBEL రసాయనాన్ని ద్రవరూపంలో జింక్ పాత్రలో పెట్టి కర్ర పెట్టెలో రంపపు పొట్టు చుట్టూ దట్టించి ఓడలో రవాణాకు పంపించాడు.
అయితే అదొక మహాభూతం. అంత సులభమయిన పద్ధతులతో లొంగేదికాదు. జరిగే ప్రమాదాల సంఖ్య పెరగసాగింది. మరణాలు, గాయాల క్రమం పెరిగింది. ప్రజలు గగ్గోలు పెట్టడంతో ప్రభుత్వం రసాయనం దిగుమతి, వాడకాలమీద ఆంక్షలు పెట్టింది. ఆర్థికంగా సర్వనాశనమవుతామని భయపడిన నొబేల్ రసాయనాన్ని మరింత నిరపాయకరంగా రవాణా చేసే పద్ధతుల కొరకు వెతక సాగాడు.
నైట్రోగ్లిసరిన్ ను అదుపులో ఉంచడానికిగాను ALFRED NOBEL వాడిన పదార్థాలో కీసిల్గూర్ అనేది ఒకటి. అది హాంబుర్గ్ ప్రాంతంలో దొరికే ఒక రకమయిన మట్టి. అది రసాయనాన్ని సులభంగా పీల్చుకుంటుంది. అప్పుడు దాన్ని రకరకాల ఆకారాలోకి అచ్చుపోసి సురక్షితంగా రవాణా చేయవచ్చు. అంతకు మించి నైట్రోగ్లిసరిన్ను పీల్చుకున్న కీసిల్గూర్ను కూడా డిటనేట్ చేసి పేల్చవచ్చు. ద్రవంతో పోలిస్తే ఈ రకంగా పేలినప్పుడు ఆ శక్తిలో 25 శాతం మాత్రమే తరుగుదల కనిపించింది.
ఉత్పత్తి, రవాణా, ఉపయోగం వంటి విషయాలలో విస్తృతంగా ప్రయోగాలు చేసిన తరువాత నొబేల్ ఆ పదార్థాన్ని 1867లో అమ్మకానికి పెట్టాడు. దానికి ‘డైనమైట్’ అని పేరుపెట్టాడు. డైనమైట్ తయారీతో ALFRED NOBEL వ్యాపారం చెప్పలేనంతగా పెరిగింది. యూరోపియన్ దేశాలు, యుఎస్ఎలలో ఎన్నో కర్మాగారాలను స్థాపించాడు. ఆ రకంగా ప్రపంచంలోని గొప్ప ధనవంతుల్లో ఒకడుగా మారాడు.

డైనమైట్ను మరింత మెరుగుపరిచి నైట్రోసెల్యులోజ్ అనే గన్ కాటన్ ను, నైట్రోగ్లిసరిన్ ను కలిపి 1875లో అతను బ్లాస్టింగ్ జిలెటిన్ను తయారుచేశాడు. కొన్నివిధాలుగా డైనమైట్ కన్నా అది మెరుగుగా ఉండేది. ఇక అతను 1887లో బాలిసైట్ను తయారుచేశాడు. అందులో నైట్రోగ్లిసరిన్, నైట్రో సెల్యులోజ్తో బాటు కర్పూరం కూడా ఉండేది. పేలుడుమీద మరింత మంచి నియంత్రణ ఈ పదార్థంతో వీలయ్యింది.

చివరకు అతను మిటరీ ఉపయోగానికిగాను ప్రోగ్రెసివ్ స్మోక్స్ పవర్ను కూడా తయారుచేశాడు.ALFRED NOBEL తన పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నది ఒక్క పేలుడు పదార్థాల వల్ల మాత్రమే కాదు. అతను వివిధ రంగాలలో ఎన్నో అంశాలను కనుగొనగలిగాడు. 1857లో అతనికి మొట్టమొదటి పేటెంట్ ఒక గ్యాస్ హోల్డర్కుగాను దొరికింది. ఎలెక్ట్రో కెమిస్ట్రీ, దృశాశాస్త్రం, జీవశాస్త్రం, శరీర ధర్మశాస్త్రంలాంటి వివిధ రంగాలలో కూడా అతను నిపుణుడు. మొత్తంమీద అతను 350కిపైగా పేటెంట్లు తీసుకున్నాడు.
కృత్రిమ రబ్బర్, చర్మం, పట్టు తయారీలో తరువాత పనిచేసిన వారికి అతని కృషి వల్ల దారి సుభమయింది. డైనమైట్ కనుగొనడంతో పేలుడు పదార్థాల వాడకం పెద్దఎత్తున పెరిగింది. శాంతి సమయాలలో కూడా రైల్వే సొరంగాలు, హైవేలు, గనులు ఇంకా మరిన్ని కార్యకలాపాలలో డైనమైటు, మిగతా పేలుడు పదార్థాలను విస్తృతంగా వాడసాగారు. పేలుడు పదార్థాలను తగిన చోట్లలో ఏర్పాటుచేసి మిగతా పెద్దభవనాల మధ్యలో ఉన్న పాత భవనాలను అక్కడికక్కడే కూల్చే పద్ధతి కూడా వచ్చింది.
అయితే పేలుడు పదార్థాలను యుద్ధకాలంలో వాడిన పద్ధతులు మాత్రం దురదృష్టకరమయినవి. ఈ పదార్థాల ఆధారంగా బాంబులు, టార్పెడోలు, షెల్లు, డెప్త్ ఛార్జెస్, నేలమీద, సముద్రంలో మైన్లు మొదలైనవి వాడకంలోకి వచ్చాయి. అవి సృష్టించిన వినాశనం, బలిగొన్న ప్రాణాల సంఖ్య తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది.
ALFRED NOBEL గజిబిజి వ్యక్తిత్వం గురించి ఒకమాట. అతనిలోపల కొన్ని విరుద్ధ క్షణాలు కలగలిసి ఉండేవి. శరీరపరంగా అతను బలవంతుడు కాదు. ఆరోగ్యం ఎప్పుడూ అంతంతగానే ఉండేది. సిగ్గరి, ఒంటరితనం కోరే మనిషి, కనుక ALFRED NOBEL పెళ్లి చేసుకోలేదు. అతను చాలా మెత్తని మనిషి. కానీ వ్యాపారం లోని ధోరణి కారణంగా చాలా తెలివితేటుగల ధనకాంక్షిగా అతనికి ఒక పేరుండేది. ఇతరు నష్టాలను గురించి అతనికి పట్టనే పట్టదని అందరూ అనుకున్నారు.
ఈ విరుద్ధ లక్షణాలన్నీ కలిసి అతని వ్యాపార జీవితాన్ని, మరణం తరువాత అతని వ్యక్తిత్వ రూపాన్ని ప్రభావితం చేశాయి. బతికి ఉన్నంతకాలం యుద్ధాలను మరింత పెద్ద మారణహోమాలుగా మార్చాడంటూ అందరూ అతడిని ఏవగించుకున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం అతను విజ్ఞానశాస్త్రం, మానవ సంక్షేమంలాంటి రంగాలలో ఉన్నతస్థాయి కృషికి గుర్తింపుగా బహుమతులను ఏర్పాటుచేసిన వ్యక్తిగా మాత్రమే అందరి జ్ఞాపకాలలో నిలిచాడు. జీవిత చరమాంకంలో అతను పూర్తిగా మారడానికి అతని స్వంత స్వభావంతోబాటు ఆత్మస్థైర్యంగల అతని తోటివారు కూడా కారణమని చెప్పాలి.
జీవితంలో ఎక్కువభాగం తండ్రిలాగే ALFRED NOBEL ప్రజల విమర్శలను పట్టించుకోలేదు. కానీ కాలం గడిచినకొద్దీ ఆ మొరటు రూపంలో లోలోపల ఒక మెత్తనయిన ప్రకృతి ఉండి నిశ్శబ్దంగా పోరాటం సాగించింది. పొరపాటున ఒక వార్తాపత్రిక అతను మరణించాడంటూ వార్త ప్రకటించినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. పత్రికవారు అతడిని మరణాల వ్యాపారి అంటూ వర్ణించారు. అంతకుముందు అంతగా కలతపెట్టని ఆ పేరు ఇప్పుడతనికి కష్టంగా తోచింది.
అతను మరణానికి దగ్గరగా చేరాడు మరి. ఒక్కసారి అతను రాబోయే కాలంలో తనను అందరూ గుర్తుంచుకునే తీరు ఇదని షాక్కు గురయ్యాడు. ఇక అతనికి ఆలోచన మొదలయింది. అంతకన్నా ఎక్కువ ప్రభావం ఒకప్పుడు ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేసిన బరోనెస్ బెర్తా ఫన్ సట్నర్ అనే ఆవిడ వల్ల కలిగింది. ఆమె మంచి మాటకారి. భావావేశపు పరురాలు. శాంతి విషయంగా గట్టిభావాలు కది.
1889లో ‘ఆయుధాలు వదలండి’ అని అర్థం వచ్చే శీర్షికతో ఆమె ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించింది. దానితో పుట్టిన సంచలనం ఆమెకే ఆశ్చర్యం
కలిగించింది. పత్రికలవారు, పార్లమెంట్లు, యూరోపులోని ప్రజలందరూ పుస్తకం గురించి చర్చించారు. దాన్ని ఎన్నో భాషలలోకి మార్చుకున్నారు. అయితే ఆమెకు కావసింది మాత్రం ‘డైనమైట్ కింగ్’ అని పేరు తెచ్చుకున్న తన ఒకప్పటి యజమానిమీద ప్రభావం కలగాలని. ఆమెతో చర్చిస్తూ ALFRED NOBEL పేలుడు పదార్థాలను సమర్ధిస్తూ వచ్చాడు. అవి క్రూరమైనవి కనుక అందరూ యుద్ధాలను మానుకుంటారు, శాంతిని కోరుకుంటారని అతను వాదించాడు.
కానీ విపరీతమయిన వినాశనం కలిగించే ఆయుధాలతో యుద్ధాలు మరింత దారుణంగా మారతాయని బెర్తా సట్నర్ వాదించింది. ప్రపంచం మొత్తంమీద నిరాయుధీకరణ జరిగితే మాత్రమే నాగరికత నిలిచి సాగుతుందని అన్నది. ఎన్నో వాద ప్రతివాదాలు జరిగాయి. మొత్తానికి ALFRED NOBEL లో లోపల నెమ్మదిగా మారసాగాడు. అయితే ఆ విషయాన్ని అతను మాత్రం ఒప్పుకోలేదు. వాళ్లిద్దరూ విడిపోయారు. మళ్లీ ఎప్పుడూ కలవలేదు.
నవంబర్ 1885లో అంటే మరణానికి ఒక సంవత్సరం ముందు పెద్ద ఎత్తున ఉన్న తన ఆస్తి సుమారు 20 లక్షల పౌండ్లను నొబేల్ ఒక ట్రస్ట్కు రాశాడు. ట్రస్టీలుగా స్వీడన్, నార్వే దేశాలకు చెందిన కొందరు ఉన్నారు. మొత్తం మీద వచ్చే వడ్డీని ఐదు భాగాలుగా విడదీయాలి. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యం లేదా శరీర ధర్మశాస్త్రం, సాహిత్యం, శాంతి అనే రంగాలో అత్యుత్తమ కృషి చేసిన వారికి దేశాలు, ఆడ, మగ అనే తేడాలు చూడకుండా ఆ భాగాలను బహుమతిhttps://pincodesguide.in/thomas-alva-edison-is-great-scientist/గా అందించాలి.
విజ్ఞానశాస్త్రం, సాహిత్యం బహుమానాలను ఆ విషయాలకు సంబంధించిన స్వీడిష్ అకాడమీలు నిర్ణయిస్తాయి. ఇక శాంతి బహుమతిని నార్వే పార్లమెంటు వారు నియమించిన ఐదుగురు వ్యక్తుల కమిటీ నిర్ధారిస్తుంది. (ఆర్థిక శాస్త్రానికిగాను స్విస్ట్రక్స్ బ్యాంకు వారు ఇచ్చే మరొక బహుమతిని తరువాత జతచేశారు.) నొబెల్ బహుమతులు మొట్టమొదట 1901లో ఇవ్వబడ్డాయి. మౌలిక విజ్ఞానశాస్త్రంలో పరిశోధనలకు, సమాజసేవకు గుర్తింపుగా ఇచ్చే ఈ ప్రోత్సాహకాలవల్ల శాంతి విస్తరిస్తుందని నొబేల్ విశ్వసించాడు.
ALFRED NOBEL తన చివరి రోజులను ఇటలీలోని శాన్ రెమోలో గడిపాడు. అతను 10 డిసెంబర్ 1896న ప్రాణాలు విడిచాడు. తన వీలునామా గురించి కనీసం అతను బెర్తాకు కూడా చెప్పలేదు. అతని స్వభావం అటువంటిది. అయితే 1905 లో ఆమెకు నొబేల్ శాంతి బహుమతి అందడం మాత్రం ఎంతోసమంజసంగా భావింపబడింది. కానీ ఆగస్టు 1914లో, అంటే బెర్తా మరణించిన రెండు మాసాల తరువాత మొదటి ప్రపంచయుద్ధం ఒక ప్రళయంగా విరుచుకు వచ్చింది.
ఆ తరువాత సెప్టెంబర్ 1939లో మొదలయిన రెండవ ప్రపంచ యుద్ధం మరింత భయంకరమయినది. ఈ యుద్ధాలో లక్షలాదిమంది సమసి పోయారు. ALFRED NOBEL తయారు చేసిన పేలుడు పదార్థాల కన్నా ఎన్నో రెట్లు శక్తిగల అణుబాంబుల ఘాతుకం ప్రపంచం అనుభవంలోకి వచ్చింది. బెర్తా ఫన్ సట్నర్ భావజాలం, అలాగే ఆల్ఫ్రెడ్ బెర్న్ హార్డ్ నొబేల్ చివరి కోరికలు మానవాళికి మార్గంచూపి వినాశనంనుంచి దారి మారి శాంతి, సుహృద్భావాల పథంలో నడిపిస్తాయని ఆశించడం తప్ప చేయగలిగింది లేదు.
ఆవిష్కరణలు ఎలా వీలవుతాయి
వ్యక్తులు తమతమ రంగాలను ఎలా ఎంచుకుంటారన్నది మానవ జీవితంలోని అంతుబట్టని రహస్యం. కొందరు క్రీడాకారులయితే మరికొందరు నటులు, డాక్టర్లు, సంగీత విద్వాంసులు, రాజకీయవేత్తలు లేదా మరొకటిగా ఎందుకు అవుతారు? ఇక మరికొందరు సైనికులు, అన్వేషకులు, సర్కస్లో ట్రెపీజ్ కళాకారులు లేదా అడవులో తిరిగి వైద్యసేవలు అందించేవారుగా ఎందుకు మారతారన్నది అర్థం చేసుకోవడం మరింత కష్టం.
ఆ వృత్తులలో పెద్దఎత్తున ఆపదలు ఉంటాయని, త్యాగాలు అవసరమవుతాయని తెలిసికూడా వారు ఆ రంగాలలో ముందుకు సాగుతారు. వారిని లోపలి నుంచి ఏదో ప్రేరణశక్తి, తరచుగా పరిసరాల వల్ల బలపడి ముందుకు నడిపిస్తుంది. తన స్వభావానికి అనువుగా ఒక వ్యక్తి ఒక పనిని ఎంచుకున్నప్పుడు బతుకులో సంతృప్తి, అలాగే విజయమూ అందుతాయి. ఇక పక్కవారి ఒత్తిడి కారణంగా లేదా ఆర్థిక లాభాల కొరకు తమ వృత్తులను ఎంచుకుంటే సంతృప్తి ఉండదు. అలాగే విజయావకాశాలూ ఉండవు.
ఇదే రకంగా మంచి అన్వేషకులు అంటే కష్టాలు, నిరాశ, ఫలితాల గురించి బాగా తెలిసి కూడా ఆయా వృత్తులను ఆత్రంగా అందిపుచ్చుకునే వారని చెప్పుకోవాలి. చాలా సందర్భాలలో వారి జీవన పరిస్థితులు గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. వీటన్నిటినీ మించి జీవితకాలమంతా తీవ్రమయిన కృషి, క్రమశిక్షణ వంటి లక్షణాలు ఉన్నందుకు మంచి ఫలితాలు నమ్మకంగా వస్తాయి.
ప్రసిద్ధ డిటెక్టివ్ షెర్లక్ హోమ్స్ గురించి అతని మిత్రుడు డాక్టర్ వాట్సన్ తరచూ ఒకమాట చెపుతాడు. షెర్లాక్ హోమ్స్ తీవ్రంగా పరిశీలించి చూపించే కార్యకారణ సంబంధాలు, అతను వివరించిన తరువాత చాలా మామూలుగా కనిపిస్తాయి అంటాడు వాట్సన్. ఆవిష్కరణ గురించి మనం కూడా అలాగే భావిస్తాము. ఒక పరికరం తయారయి వాడుకలోకి వచ్చినప్పుడు అంతా తెలిసినట్టే కనిపిస్తుంది. దుస్తులలో వాడే జిప్పర్ పనితీరు సులభంగా అర్థమవుతుంది. దాన్ని కేవలం ఒక వంద సంవత్సరాల కింద మాత్రమే కనుగొన్నారు మరి! విద్యుత్తు బల్బులోని సూత్రం సులభంగా అర్థమవుతుంది.
కానీ దాన్ని తయారు చేయడానికి థామస్ అల్వా ఎడిసన్ అనే ఆవిష్కర్త పడిన విపరీతమయిన కష్టాల గురించి మనలో ఎంతమందికి తెలుసు. ఒక ఆవిష్కరణ భౌతికంగా రూపుదిద్దుకోక ముందే దాని పనితీరును, దాని ప్రయోజనాలను మనసులో ఊహించి చూడగలిగిన వారే గొప్ప ఆవిష్కర్తలు. వారికిగల ‘ఆవిష్కర్త దృష్టి’లో మొట్టమొదట ఆవిష్కరణకు గల ఆవశ్యకత గురించి ముందే ప్రస్ఫుటమయిన అవగాహన ఉంటుంది. అప్పుడు వారు దాన్ని నిజం చేయడానికి కృషి చేస్తారు.
గొప్ప ఆవిష్కర్తలందరిలోను ఈ లక్షణం పుట్టుకతోనే ఉంటుంది. కానీ సగటు మనుషులు కూడా వస్తువు పనిచేసే తీరును జాగ్రత్తగా గమనించి ఈ శక్తిని సంపాదించగలుగుతారు. ఒక విషయాన్ని చూచి ‘ఇది పనిచేయడానికి ఇంతకన్నా మంచిమార్గం లేదా?’ అని అదే పనిగా అడగగలగాలి. మనం ఎదుర్కొనే కొన్ని సమస్యలను ఈ స్వభావంతో కొంత వరకు అధిగమించవచ్చు. దానితో జీవితం మరింత సంతోషమయం అవుతుంది.
ఒక మంచి ఆవిష్కర్తకు గల ముఖ్యలక్షణాలలో తన చుట్టూ జరుగుతున్న వాటిని గురించి లోతుగా పరిశీలించడం అన్నది మొదటిది. అనుకోకుండా జరిగే సంఘటనలకు ఆవిష్కరణలో కొంత పాత్ర ఉంది. చార్లెస్ గుడ్ ఇయర్ రబ్బరు మెత్తదనం గురించి సతమతమయ్యేవాడు. ఆ సమస్యకు సమాధానం అందకుండా ఉండేది. ఒక హాట్ ప్లేట్ మీద గంధకం ఉండగా దానిమీద రబ్బరు ద్రవం చిందడం అతను గమనించాడు. వేడికి మాడిన రబ్బరు ముక్క గట్టిపడడం చూసి అతను ఆశ్చర్యపోయాడు.
ప్రస్తుతం మనకు ఈ పద్ధతి వల్కనైజింగ్ అనే పేరున తెలుసు. విలియమ్ ఎచ్ పెర్కిన్ అనే యువ రసాయన శాస్త్రవేత్త క్వినైన్ను తయారు చేయాలని ప్రయత్నిస్తుండగా, అనుకోకుండా మవయిన్ అనే ఒక రంగు రసాయనాన్ని కనుగొన్నాడు. ఈ రకం పరిశోధనను సెరెండిపిటీ’ అంటారు. అనుకోకుండా ఒక సత్యం లేదా ఒక సమాధానం ఈ అందుబాటులోకి వస్తుంటాయి. అనుకోకుండా అన్న ఈ పరిస్థితిని తెలివిగల మెదళ్ళు మాత్రమే గుర్తించగలుగుతాయి. గుడ్ ఇయర్ గట్టి రబ్బరు గురించి ప్రయత్నాలలో ఉండకపోతే తన ముందు జరిగిన మార్పు ప్రాముఖ్యాన్నగుర్తించ గలిగేవాడు కాదు.
ఒక అన్వేషకుని విజయం వెనుక అతని మనసు తీరు కూడా బలంగా ఉంటుంది. అందుకు పెద్ద గుర్తింపు ఉండదు. అన్వేషకులకు అవరోధాలు, నిరుత్సాహం వంటివి మామూలుగానే ఎదురవుతుంటాయి. లోపల గట్టి పట్టుదల ఉంటేగానీ వీటిని తట్టుకోవడం వీలుకాదు. కొంతమందికి తమ కుటుంబాలు, సమాజం కొన్ని కారణాలుగా ఎదుర్కొన్న కష్టాల వల్ల ఈ రకమయిన బలం చేకూరుతుంది. మరి కొందరిలో అంతకుముందు కలిగిన అవమానాలు లేదా కష్టాలకు ప్రతీకారంగా ఏదో సాధించి తీరాలన్న గట్టికోరిక ఉండి వారిని ముందుకు నడిపిస్తుంది.
ఏదో ఒకటి కనుగొనడం ద్వారా గొప్ప పేరు సంపాదించ వచ్చునని ఆ తరువాత గొప్ప పారిశ్రామికవేత్త కావచ్చునని గట్టి కోరిక ఉండవచ్చు కూడా. కారణం ఏదయినప్పటికీ, లోపల మనసులో ఉండే గట్టి పట్టుదల ఒకటే ఆవిష్కరణ విధానినికి బలాన్ని ఇస్తుంది. ఆ తరువాత ఆవిష్కర్తలలోని ఆత్మస్థైర్యం ఎంతో ప్రధానమయినది. అతని పరిచయస్తులలో ఆషాడభూతులుగా అడ్డుతగిలే వారికి కొరత ఉండదు.
వారు అడుగడుగునా నిరుత్సాహ పరుస్తుంటారు. ఆ సందర్భాలలో అవరోధాల్ని దాటి విజయం సాధించడానికి గట్టి ఆత్మస్థైర్యం ఎంతో అవసరం. ఒకసారి విజయం సాధించిన తరువాత ఒకప్పుడు ఏవగించుకున్న వారంతా చుట్టూ చేరి గొప్పగా పొగడడం మరొక విషయం. ఆవిష్కరణలకు సంబంధించి మూడు రకాల ప్రతిచర్యలు ఉంటాయని ఒకతను చెప్పాడు. అందులో మొదటి అంచె ‘అది పనిచేయదు’ అన్నది. రెండవ అంచె ‘పని చేస్తుంది కానీ అంతగా వాడకంలోకి రాదు’. మూడవ అంచె ‘నేను ముందే అనుకున్నాను’ అంటుంది.