JAWAHARLAL NEHRU IS GREAT FREEDOM FIGHTER
JAWAHARLAL NEHRU భారతదేశములో మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యము అనే త్యాగఫలం, జాతీయనాయకులు నిర్వి రామ కృషి ఫలితమే మనకు ప్రాప్తించిన అమూల్య నిక్షేపం. భారత చరిత్రలో విప్లవాలు, దండయాత్రలు, దోపిడీలు, మతాంతరీకరణములు ఎర్రని నెత్తురుతో వ్రాయబడియున్నవి. స్వజాత్యాభిమానం పరజాతి ద్వేషములతో కలుషితమైన యోధుల హృదయాలలో రాజ్యకాంక్ష, ధనతృష్ణలు దందడి చేయుట వలననే వాళ్ళు రక్తతర్పణం చేయుచూ జైత్రయాత్ర సాగించుచుండిరి.

ద్రావిడులను ఆర్యులు, ఆర్యులను హూణశక్తులు, వా రిని ఇస్లాం మతవ్యాప్తి చేసెడీ తురుష్కమంగోలులు జయించుచు వారి వారి పరిపాలనను, నాగరికతను భరతఖండ మున ముద్రించిరి. పదునేడవ శతాబ్ద ప్రారంభమునకే ఆంగ్లం ఫ్రెంచి, పోర్చుగీసు, డచ్చివారలు వర్తక నెపంతో సముద్రతీర . పట్టణములకు ప్రవేశించిరి. చిన్న చిన్న దేశీయ రాజులు పోట్లాడుకొనుట ఆసరాగా తీసుకొని రాజ్యపాలన స్థాపించు కొనిరి. అవకాశం కల్గుటచే ఆంగ్లేయులు ఇతర యూరోపియు లను జయించి భారతదేశమున రాజ్యం స్థాపించి వృద్ధిపరచిరి.
సంస్థానాధీశులకు భరణములిచ్చియు రాజ్యభాగములను కలుపుకొనిరి, స్వాతంత్ర్యమునకై అక్కడక్కడ పెనుగు లాటలు వచ్చినసు, సిపాయిల తిరుగుబాటు వచ్చినను వానిని నిర్ధాక్షిణ్యంగా ఆంగ్లేయులు అణచివేయుచుండిరి. ప్రజలు చైతన్యవంతులైనను వారి స్వాతంత్ర్యోద్యమమును సంఘ ఊతం చేయు నాయకులు లేక ఉద్యమతరంగాలు ఎంతఎత్తుగా పైకి వచ్చుచున్నను మధ్యనే విరిగిపోవుచుండెను. విదేశీ ప్రభుత్వము నెదిరించి స్వాతంత్ర్యమును సముపార్జించుటకు గాంధీజీ నాయకత్వమున నెందరు త్యాగధనులు, నాయకులు ముందు కురికిరో వ్రాయుట యనగా భారతదేశ చరిత్ర వ్రాయుటకే దేశభక్తుల జీవితాలు కూర్చి చదివినచో సమగ్ర మగు దేశ చరిత్రను పఠించినట్లే యగును.
Jawaharlal Nehru ముత్తాత లక్ష్మీనారాయణ నెహ్రూ బ్రిటిష్వారి తరపున వకీలుగా చేసెను. వారి పూర్వులు కాశ్మీర బ్రాహ్మ ణపండిత కుటుం బమునకు చెందినవారు మొగల్ పాదుషా ఆస్థాన పండితులై ఢిల్లీకి వలస వచ్చిరి.యమున ఒడ్డున కాలువవద్ద వీరికి భవనం కట్టించ బడెను. ఆ కాలువకు నెహర్ అని ఉర్దూలో పేరుగలదు. కావున వీరి పేరు నెహ్రూ అయ్యెను. Jawaharlal Nehru తాతగారు గంగాధర నెహ్రు బ్రిటీష్ కాలమున కొత్వాల్ (దండనాధికారి)పదవిలో ఉండెను. 1857 సిపాయిల తిరుగుబాటుసమయంలో వీరు ఢిల్లీ నుండి ఆగ్రాకు వచ్చిరి. ఆయన మూడవకుమారుడు మోతీలాల్, జవహర్ తండ్రి. మోతీలాల్ పెద్దన్నగారు వంశీధర్.

బ్రిటిష్ న్యాయశాఖలో ఉన్నతోద్యోగ ములో ఉండెను రెండవవారు నందలాల్ నెహ్రూ తండ్రి చనిపోవుట వలన అన్న నందలాల్ నెహ్రూ తమ్ముని మోతీలాల్ని దగ్గ రుంచుకొని విద్యాబుద్దులు చెప్పించెను. నందలాల్ కొంతకాలం రాజస్థాన్లోని భేత్రి యనుచోట ఉద్యోగమున ఉండెను తర్వాత ఆగ్రాలో ప్లీడర్ గా స్థిరపడెను. మోతీలాల్ చిన్న తనమున కొండ ప్రదేశమగు భేతిలో గడిపెను. ఆగ్రాలో ఆంగ్లవిద్యలో ప్రవేశించి బి.ఏ. వరకు చదివెను. లా పరీక్ష చదివి 1884లో మొదటివాడుగ కృతార్థుడయ్యెను. తర్వాత అలహాబాద్లో చేరి వకీలుగ జీవిత వృత్తిని ప్రారంభించెను.
జమీందారుల వ్యవహారాలలో వారిని గెలిపించుట వలన ధనం, కీర్తి ఎక్కువ వచ్చెను. మోతీలాల్ రెండుమూడు భాషలలో పండితులు, చక్కని గంభీరమైన విగ్రహం. ఆమో ఘమైన వాగ్దాటి. న్యాయస్థానాలలో వాద ప్రతివాదములు చేయునప్పుడు జనాకర్షణగా ఉండెడిది. అచిర కాలంలోనే లక్షల రూపాయలు, భూములు గడించెను. భార్య స్వరూపరాణి వినయ విధేయతలు కల్గిన అనుకూలమైన భార్య. అలహాబాద్ నగరంలో పెద్ద భవన మును కట్టించెను. దాని పేరు ఆనందభవనం. సేవకులు, బంధు మిత్రులతో ఆ భవనం కిటకిట లాడుచుండెను. స్వారీ చేయుటకు గుఱ్ఱములు బగ్గీలు కల్గిన ఆనందభవనం మొగల్ పాదుషాలవలె ఉండెను. ఎట్టిలోటును ఎరుగని మోతీలాల్ నకు పిల్లలు లేరను బెంగ వచ్చెను. అనేక వ్రతములు చేయుట ధర్మములు చేయుట నిత్యకృత్యములయ్యెను.
భగవంతుని కృపచే 14-11-1889వ తేదీన ఒక మగపిల్ల వాడు పుట్టెను. ఆ పిల్లవానికి Jawaharlal Nehru అని నామకరణం చేసిరి తరువాత వారికి ఇరువురు కుమార్తెలు కలిగిరి. వారు విజయ లక్ష్మి, కృష్ణలు అన్ని భోగములు ఇంటివద్దనే పొందు చున్న Jawaharlal Nehru తల్లిదండ్రులకు అల్లారుముద్దుగ వుండెను. ఆయనకు విద్యాబుద్ధులు ఇంటివద్దనే నేర్పించెడివారు దయా స్వరూపిణి స్వరూపరాణి వితరణ భోగధైర్యసాహసాలు కుశాగ్రబుద్ధి మోతీలాల్ లోని సద్గుణాలు. ఇరువురి మంచి గుణాలు జవహర్ నకు సంక్రమించెను. దివ్యజ్ఞాన సమాజకుడు బ్రూక్స్ అనే ఆంగ్ల పండితులు ఇంటికివచ్చి ఆంగ్లం ఆంగ్లం నీతి కథలు నేర్పుచు, సంస్కృతం చెప్పు బ్రాహ్మణ పండితుడు పురాణ కథలు, వేద కథలు చెప్పెను. తర్వాత దివ్యజ్ఞాన సమాజ స్థాపకులు అనిబిసెంటు కూడా Jawaharlal Nehru కు ఆంగ్ల విద్యయు, మత విషయాలు బోధించెను.
కాంచనమునకు సుగంధం లభించినట్లు ఆరోగ్య సౌభా గ్యములు కల Jawaharlal Nehru కు విద్యాభాగ్యం కూడా పుష్కలంగా సమకూరెను. భగవద్గీత, ఉపనిషతులు, బౌద్ధధర్మములు, ఖురాన్. సూఫీ, వేదాంతములు, జైన క్రైస్తవ మత విషయాలు కరత లామలకముగ పఠించెను. అనిబిసెంటు గ్రీకుపురాణం వివరిం చెను, జాతీయ భావములు ఆమెయే Jawaharlal Nehru హృదయమున నాటెను తరువాత అవి మొలకెత్తి ఎట్లు మహా ఫలములనొసం గెనో చదివెదరుగాక, దినపత్రికను పఠించియు, చరిత్ర గ్రంధాలు పరిశీలించియు, తండ్రివద్దకు వచ్చే విద్యావంతుల సంభాషణలు వినియు జవహర్ భారతదేశ పరిస్థితులు అవగా ఇంటిలోనే ఈత, గుర్రపుస్వారీ నేర్చు కొనెను ఆసనాలు వేయుట. వ్యాయామంచేయుట వలన అతని శరీరం ఆరోగ్యవంతమై, సర్వశుభములకు ఆస్థానమై యొప్పు చుండెను. దక్షిణాఫ్రికాలోని బ్రిటిషువారివలన వారికి, అప్పటిహన చేసుకొనెను.

దేశీయులకు 1902లో వివాదం వచ్చెను. బోయరు యుద్ధ మున ప్రజలు బ్రిటిషు నిరంకుశ ప్రభుత్వంతో పోరాడుట Jawaharlal Nehru కు ఆసక్తి కలిగించెను.1904లో రష్యా-జపాన్ యుద్ధం. స్వల్ప దేశమైనా జపాన్ తమ స్వాతంత్ర్యం కొరకు ప్రాణాలకు తెగించి రష్యా జార్ ప్రభుత్వంతో పోరాడుట జవహరనకు సంతోషము కలి గించెను. మాతృదాస్య విముక్తికై గరుత్మంతుడు ఇంద్రునితో పోరాడెను కదా? ఒకనాడు తండ్రి వ్రాసుకొను కలము దొంగ తనంగా తీసుకొనగా తండ్రి కొట్టెను. మోతీలాల్ నైతిక ప్రవర్తన, క్రమశిక్షణలకే ఎక్కువ ప్రాధాన్య మిచ్చెడివాడు. అవి తప్పినచో కుమారునెట్లు సహించును? ఇది స్వల్పవిషయ మైనను జవహర్ ప్రవర్తనకిది మంచి పునాదినే వేసెను.
ఆయన పదిహేనవ యేటవరకు ఇంటివద్దనే విద్యాభ్యాసం జరి గెను. ఆంగ్ల భాషలో మంచి ప్రవేశం పొందిన కుమారుని ఇంగ్లండులో హారో నగరమున పబ్లి స్స్కూలున జేర్పించుటకై మోతీలాల్ ప్రయాణమై పోయెను. ఆ పాఠశాలలో శ్రీమంతుల పిల్లలకే ప్రవేశము దుస్తులు, వస్తువులు ఖరీదయినవి వాడ వలెను. అచ్చటి జీతములు కూడా ఎక్కువే. విద్యా విషయమై తన కుమారున కెట్టి లోటునూ రానీయని పట్టుదల కల తండ్రి ఎంత ధనమైనా ఖర్చు పెట్టును లేక లేక పుట్టిన గారాజుబిడ్డకు మహా ధనవంతుడైన మోతీలాల్ ఎంత ఖర్చు చేయునో చెప్పుకొనుటయే అలహాబాదు నివాసులకొక గొప్ప విషయం.
మరో నగరమున విద్యాభ్యాసం చేయుచు జవహర్ గ్రీకు, లాటిన్ భాషలని ఫ్రెంచి భాషని చక్కగా నేర్చు కొనెను. బహుగ్రంథములను పఠించి కళలు, రాత్రములు అవగాహన చేసుకొనెను. ఇంగ్లండులో ఉన్నప్పుడే భారత దేశ పరిస్థితులని అధ్యయనం చేయుచుండెను. వార్తాపత్రికల లోని వ్యాసాలు చదువుచుండెను, ప్రపంచంలోని ఫలితాలని గ్రహించెను. కీయోద్యమాలని, ఇంగ్లండులో పార్లమెంటు ఎన్నికలు జరిగెను. రాజకీయ పక్షాల ధ్యేయముని వారి ప్రచారములని క్షుణ్ణంగా పరిశీలించి శ్రద్ధాసక్తులతో పాల్గొనెడివాడు.
భారతదేశమున 1905లో బెంగాల్ విభజన పెద్ద అలజడిని లేవనెత్తెను. ఒకే భాష మాట్లాడెడి బెంగాల్ ప్రజలని బలవంతంగా విభజించుట దేశమున సంచలనం కలిగించెను. భారతదేశం నుండి వచ్చు చుండెడి వార్తాపత్రికలని అత్యాశక్తితో చూచుచూ మాతృ దేశంలో ఆంగ్లేయులు చేయుచున్న అన్యాయాలని నిరసించు చుండెను. లోకమాన్య బాలగంగాధర తిలక్ స్వపరిపాలన నినాదం ప్రజల హృదయాలలో మార్మోగుచుండెను. దావా నలం వలె నది భరతఖండమున వ్యాపించి ఇంగ్లండు ప్రభుత్వంపై ద్వేషభావమును రగుల్కొలిపెను. దాదాబాయి . నా సురేంద్రనాధ్ బెనర్జీ గోపాలకృష్ణ గోఖలేవంటి మేధా… పలు విద్యావంతులు రాజకీయాలలో ప్రవేశించి అగ్రగాములై మహోద్యమముల నడుపుచుండిరి. దక్షిణాఫ్రికాలో సాశ్విత యుద్ధమున రాజకీయ విజయం సాధించిన గాంధీకి భారత
ప్రజలు నివాళులెత్తిరి.
వార్తాపత్రికలో భారతదేశ నాయకుల స్వాతంత్రోద్యను .. ప్రకటనలు, ఉపన్యాసాలు Jawaharlal Nehru హదయమున చైతన్యం, ఉత్సాహం పెంపొందించుచుండెను. విదేశ వస్తువులు బహిష్క రించుట, ఆంగ్లోద్యోగములను త్యజించుట భారతదేశ వంతులకు సామాన్య విషయాలుగా వుండెను. ఈ పరిస్థితులని అవగాహన చేసుకొనిన జవహరునకు భారతదేశ విము క్తితక్షణ లక్ష్యంగా గోచరించెను. తానుకూడా రాజకీయాలలోకి దుమికి అల్లకల్లోలంగా వున్న స్వదేశ ప్రజల సంక్షోభంనకు స్వాతంత్ర నావను సిద్ధపరచవలెనని దృఢముగ ఆకాంక్షించెను. ఆ స్వల్ప బీజమే మహావృక్షమై భారతావనిలో తన శాఖలు విస్తరిల్లజేసినది.
Jawaharlal Nehru హారో హైస్కూల్లో, విద్యాభ్యాసం పూర్తిచేసిన తరు వాత 1907లో కేంబ్రిడ్జి నగరంలోని ట్రినిటీ కాలేజీలో భూతత్వశాస్త్రం, వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రములు అభి మాన విషయాలుగా తీసుకొని మూడు సంవత్సరాలు శ్రద్ధగా చదివి 1910లో యం. ఎ.లో ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యెను. ఆ కళాశాలలో ప్రథను విద్యార్థిగా సామాన్య విషయంకాదు. పండిత వంశమున పుట్టిన మేధావి యైన Jawaharlal Nehru శ్రద్ధాసక్తులతో చదివి తన కుల ప్రతిష్టను నిలిపెను . ఈ తరుణముననే అనేక రాజకీయతంత్ర శాస్త్రంల సధ్యయనంచేసి, రాజకీయ చతురతతో సంభాషణలు చేసియు తన హృదయంలో సామ్యవాదం వైపునకు ఆకర్షణ పెంచు కొనెను.

భారతదేశ పరిస్థితులన్న బ్రిటిషువారి దమననీతులని బట్టబయలు చేయుచు ఇంగ్లండులో భారత నాయకులు ప్రచారం చేయుటకై వచ్చిరి. బిపిన్ చంద్రపాల్, లాలా లజ పతిరాయ్ గోపాలకృష్ణ గోఖలే మొదలైన నాయకులు ఉప న్యాసా లిచ్చిరి. వానిని వినుటవలన యౌవన ప్రారంభంలో వున్న జవహరుకు ఉత్తేజం కలిగి తానుకూడా భారతజాతిక్తికి పాటుపడవలెనని ఆకాంక్ష తీవ్రంగా కలిగెను. భారతదేశమున ప్రజల ఆందోళనలు ఆంగ్ల ప్రభువుల కుటిల దండనలు గూర్చి ఎప్పటికప్పుడు తెలుసుకొనుచుండెను. తండ్రికి ఉత్తర ప్రత్యుత్తరములను జరిపి సంగతులను తెలుసు
కొనుచుండెను.
మోతీలాల్ కు కుమారుని ఐ.పి.యస్. చదివించి ఆంగ్ల ప్రభుత్వంలో ఉన్నతోద్యోగిని చేయవలెనని ఆలోచనకలదు ఆ కోరిక నెరిగిన Jawaharlal Nehru కిది గిట్టలేదు, ఏప్రభుత్వం న భారత ప్రజలను హింసించి పీడించుచున్నదో ఆ విదేశీయ రాజముద్రకు విధేయుడై వారి చెప్పుచేతులలో నుండి తనసోదర ప్రజలపై వై దేశిక కూటనీతి విధానం ప్రయోగించుట తనకు కష్టంగా తోచెను. బానిస మానసిగా బ్రతుకుట తనకు నచ్చదని తండ్రికి స్పష్టపరచెను. తాను స్వతంత్రవృత్తి యైన న్యాయవాది వృత్తి అవలంబించెదననియు తండ్రి తాతల వలె స్వచ్ఛంద జీవితవృత్తి స్వీకరించెదననియుచెప్పి తండ్రి నొప్పించెను. లండన్లోని ఇన్నరుటెంపుల్ లో బారిష్టరు పరీక్ష చదివెను.
ఇంగ్లండులో ఉన్నప్పుడు ఐర్లండులో డివెలరా నాయకత్వంలో ఐర్లండు దేశవిముక్తికై పోరాటము ముమ్మరంగా సాగుచుండెను.ఆంగ్లేయులు దమననీతితో ఐర్లండును నొక్కి పెట్టి ఊపిరి పీల్చుకొనకుండ చేసిరి. జవహరునకిది నచ్చని పనిగా తోచెను. ఐరీష్ విద్యార్థులకు ప్రోత్సాహమిచ్చి వారిని నాయ కులుగా చేయుచు తనలోవున్న కలను నిజం చేసుకొనుచుం డెను. ఆంగ్ల ప్రభుత్వం అట్టి క్రమశిక్షణా రహిత చర్యలకు ఆయనను మందలించుచు అపరాధసుంకం విధించి వీనినొక కంటకని పెట్టుచుండెను. ఐరోపా ఖండంన సిల్ఫిన్ స్వతంత్రో ద్యమము రష్యాలోని బోల్షివిక్ ఉద్యమం ఆయన హృదయ ములో ప్రవేశించెను.
ప్రత్యక్షంగా వివిధ దేశములలోని రాజకీయములను ప్రభుత్వ విధానాలని, ప్రజల సమస్యలని తిలకించి పఠించవలెననే కాంక్షతో సెలవుల్లో వీలు దొరికి నంతనే దేశ సంచారములకై పోవుచుండెను. జర్మనీ, ఫ్రాన్స్ ఐరెండు, నార్వే దేశములలో పర్యటించెను. నార్వేలో నొకమంచునదిలో పడిపోయెను. ఎట్లో మిత్రులు రక్షించిరి. ఆయా దేశములలో జరుగు ప్రగతి కార్యక్రమములు, ప్రజల సంక్షేమ శానములను ఆయన ఎంతో శ్రద్ధతో తిలకించెను. ఆంగ్ల దేశముననే భారత నాయకులు డాక్టరు ఖానా సాహెబ్, సేన్ గుప్త, షేర్వాణి మొదలయిన వారితో పరిచయమేర్పడెను.
వారితో భారతదేశ స్థితిగతులు ప్రత్యక్షంగా సంప్రదించి తెలుసుకొను అవకాశం కలిగెను. ఉరకలు వేయుచు ముందు నకు పరుగులు తీయుచున్న యువరక్తంతో స్వాతంత్ర్యోద్య మమున పాల్గొనవలెనని ఆయన ఉద్రేకపడుచూ భారతదేశము నకు వచ్చెను. 1912న స్వదేశమున న్యాయవాది వృత్తిలో ప్రవేశించెను. సంఘ సేవ చేయుటకై తన కొరకై ఒక ప్రణా శిక నేర్పరచుకొనెను. నిరక్షరాస్యత, దారిద్ర్యము, మతో న్మాదం, వర్ణవివక్షతలు దేశంలో రాక్షప రూపాలతో విచ్చల విడిగ తిరుగాడుచు దేశప్రజలను పీడించుచున్నవి.
వయోజన విద్య, సర్వమత, సమ్మతవర్తన, వర్ణభేద నిరాకరణ, కుటీర పరిశ్రమలను ప్రబోధించుచు సామాన్య ప్రజలలో తానొక విసర్జించుట మనిషిగా మసలుట, విలువైన దుస్తులు సామాన్య వస్త్రములను కట్టుకొనుట తండ్రికి యిష్టం లేకుం డెను. న్యాయవాది వృత్తిలోనే తనఫలె ధనార్జన చేయునను కొనిన తండ్రికి కుమారుని కార్యక్రమాలు నిరుత్సాహం కలి గించెను. బీదరైతుల తరపున వకాల్తా తీసుకొని జమీందారీలపైన దాడులు నడుపుట తండ్రికి కంటగింపుగా నున్నది. అయినను ఏకైక కుమారునకు కష్టం కలిగించుట ఇష్టంలేక మోతీలాల్ మౌనం వహించెను.భారతదేశంలో దాదాబాయి నౌరోజీ ఆధ్వర్యమున ప
జాతీయ కాంగ్రెసు రాజకీయ పక్షం రెక్కలెత్తి గరు నిరతాకాశంలో తిరుగాడెడి రోజులవి.

1912 లో బంకింపూర్ కాంగ్రెస్కు మోతీలాల్ ప్రముఖ వ్యక్తి అయ్యెను. తండ్రితోపాటు సభలకు, సమావేశములకు హాజరగుచున్నJawaharlal Nehru నకు రైతుల నిత్యసమస్యలు తెలుసుకునే కుతూహలం కల్గి కాలినడకన పల్లెలకు వెళ్ళి ప్రత్యక్షంగా వారి పరిస్థితులను తెలుసుకొనెడివాడు. అమాయకత్వంతో వున్న గ్రామాలకు కాంతిమార్గములు లేవు. ఏడాదంతయు ఏతమెత్తి తోడిపోసిన చెమటతో తడిసి తీసిన పుడమితల్లి యిచ్చెడి నోటిముద్దను జమీందారులు కర్రలతో నెగకొట్టి తీసికొనిపోవుచుండిరి. బక్క రైతు బిక్కచచ్చి యుండెను. జమీందారులు ఇంగ్లీ షు పౌలకు లకు తొత్తులై సుంకములు చెల్లించినవారు విసిరి వేయు విస్కత్తు లకు తోకలాడించుచుండిరి. స్వదేశ రాజులందరు భర ణములు పుచ్చుకొనుచు ఆభరణములూడ్చిన ముండ మోపులై వారి ఇళ్ళలో ఉండిపోయిరి.
దక్షిణాఫ్రికాలో గాంధీ సారధ్యంలో స్వతంత్ర రధం వినువీధులలో తిరుగుచుండెను. దానిని నిర్వహించుటకై జన హర్ చందాలు వసూలు చేసి ఏఐది వేల రూపాయలు పంపించెను. అప్పుడే గోఖలే దక్షిణాఫ్రికాకు వెళ్ళెను. 1916లో తిలక్ మహాశయుడు స్వరాజ్వ సిద్ధికై ఉద్యమం పూనానగర మున స్థాపించెను, అనిబిసెంటు ఆ ఉద్యమంలో పాల్గొనేను. శిష్యుడగు Jawaharlal Nehru వెనుదీయునా ? అమితోత్సాహంతో హోమ్హ్కూల్ విప్లవోద్యమమునకు కార్యదర్శి యయ్యెను. మోతీలాల్కు ఆంగ్ల ప్రభువులపై వ్యామోహం తగ్గి జాతీయదృష్టి పెంపొందెను. స్వాతంత్ర సిద్ధికై పోరాటం నల్పుటకు ముందుకు వచ్చెను.
తన జీవితమంతయు వృధాయై పోయినందులకు వగచి కుమారునికి భాగ్యం కలిగించుటకై నిశ్చయించెను. జవహర్ న కెంతయో ప్రోత్సాహ మిచ్చెను. 1916లో ఢిల్లీ నగరములో కమలతో Jawaharlal Nehru వివాహం జరిగెను ఆ వివాహమునకు అనేక జాతీయ నాయకులు హాజరైరి. 1917 లో ఏకైక కుమార్తె ఇందిర కలిగెను.భార్యతో స్వదేశమైన కాశ్మీరు.విలాసయాత్రకై వెడలెను. సహజ సౌందర్యపాసియైన ఆయ నకు హిమాలయ శిఖరాలు, లోతయిన లోయలు హిమనీ నద హిమసానవులు ములు సూర్యకాంతుల్ని ప్రతిఫలించెడి హృదయాహ్లాదం కలిగించినవి. కళాదృష్టి కలవారు మాత్రమే ప్రజల కష్టాలలో పాలుపంచుకోగలరు. హృదయం హిమ ఖండముకావలయును.
సుందరదృశ్యాలతో నిండినపర్వతము లలో ఒక లేడిని తుపాకితో కాల్చెను. తన కాళ్ళదగ్గర నెత్తురు మడుగులో వచ్చిపడియున్న అమాయకమృగమును చూచుటచేకన్నీరయ్యెను బౌద్ధ ధర్మములు అధ్యయనం చేసిన ఆయన హృదయం కరిగి తానిక ఎప్పుడూ వేటాడనని ఒట్టు వేసు కొనెను. మాంసాహారం మానివేసెను. మంచుతో కప్పబడిన -జోజీలా కనుమలు దాటి మాదాయన పర్వతాన్ని ఎక్కవలె న ముందుకు సాగుచు పదిహేను వేల అడుగుల ఎత్తుకు చేరెను. ధైర్యసాహసములు గల Jawaharlal Nehru పట్టువిడువక పై కెక్కుచుండెను కాలు జారెను. ఒక్కక్షణంలో అగాధం లోని హిమ ప్రవాహంలోనికి పడిపోగలడు. చెట్టువేరు దొరికెను. వెంటవున్న స్నేహితులెట్లో బయటకుతీసి రక్షించిరి. జంతువులు పక్షులనిన ప్రీతి మెండయ్యెను.

విధి లీలగ నొక కాంగ్రెసులో అతివాదం మితవాద భేదము ఏర్పడెను,బ్రిటీషువారితో సామ్యవాదనల ద్వారా సంప్రదించి స్వతంత్ర రాజ్యం సంపాదింపవలెనని మితవాదులు చెప్పిరి. విదేశ దుర్మార్గులను తీవ్రంగా ప్రతిఘటించి వారిని దేశంనుండి వెడలగొట్టవలెనని ఆతివాదులు వక్కాణించిరి
ఈ తరతమ భేదాలు వాదములు సహేతుకంగా విము ర్శించుచు దీర్ఘ ములగు వ్యాసములు ఇండిపెండెంట్ పత్రికలో వ్రాయుచుండెను. ప్రజాసమస్యలు జాతీయభావ ప్రబోధములు స్పష్టంగా ప్రకటించుచు వ్యాసములు వ్రాయుచుండెను.
మోతీ లాలున కొకవైపు కొడుకు చేయిదాటి పోవుచున్నాడనియు విదేశ ప్రభుత్వం యేమి శిక్ష వేయునో అనే భయం కల్గుమంచుండెను. 1919-23 వరకు పత్రిక కొనసాగెను. ములో నలుమూలల ప్రయాణంచేసి అన్ని ప్రాంతాల ప్రజలని వారి నాయకులని కలుసుకొని వారితో రాజకీయ స్థితిగతులని చర్చించుచు, పత్రికా ముఖమున ఉద్రేకపూరితములైన దీర్ఘ వ్యాసములు వ్రాయుచు కాలంగడి వెను. భారతదేశంలో అన్ని ప్రాంతాలవారికి ముఖ్యంగా గాంధీ, పటేల్, రాజేంద్రప్రసాద్ టంగుటూరి ప్రకాశం మొదలగువారికి జవహర్ సన్నిహితుడు, స్నేహితుడు కాగలిగెను.Jawaharlal Nehru ఉపన్యాసములకు, వ్యాసా లకు దేశప్రజలు కదలిపోవుచుండిరి.
బ్రిటిషు ప్రభుత్వం 1924 డిసెంబర్ లో పత్రికపై ఆంక్ష విధించెను. అమితోత్సాహంతో తండ్రీ కొడుకులు కాంగ్రెసు మహోద్యమమునకు తమ జీవితముల నంకిత మొనర్చిరి. న్యాయవాదవృత్తులు మానివేసిరి. అసయోద్యమ దేశంలో ప్రతి దిక్కున ప్రతిధ్వనించింది. రైతుల సేవకై గ్రామగ్రామా లకు నెహ్రూ నిర్విరామంగా పర్యటించెను రౌలట్ శాసనం 1919లో ప్రవేశ పెట్టబడెను.అది దేశ ప్రజలకు మహారాక్షసి అయ్యెను. దానిని ప్రతిఘటించుచు గాంధీ మొదలగువారు సత్యాగ్రహం చేసిరి.దేశమంతా అట్టుడికినట్లయ్యెను. ప్రతి చోట హర్తాళ్ జరిగెను. బ్రిటిష్వారు నిర్ధాక్షిణ్యంగా యీ మహోద్యమ తరంగము నణచుటకై సైన్యమున కధికార మిచ్చిరి.
దేశప్రజలు తమ ప్రాణములని స్వాతంత్ర్యమున కైకుమారుడు ప్రత్యక్షముగ పాల్గొనుట తండ్రికి యిష్టంలేదు. గాంధీతో చెప్పి Jawaharlal Nehru ని శాంతింపజేసెనురాడిరి. ఉధృతమైన ఈ విప్లవోద్యమంలో తనపంజాబు రాష్ట్రంలోని అమృతసర్ నగరంలో జలియన్ వాలాబాగ్ 13వ తేదీన ఉద్యానవనమున దేశప్రజలు సమా వేశమై బ్రిటిషువారి దమననీతిని లిచ్చిరి.డయ్యర్ అనే ఆంగ్లసేనాని మరఫిరంగులతో ప్రజ ఖండించుచు ఉపన్యాసా లని కల్పించెను, చాలామంది చనిపోయిరి.ఈ దుర్వార్త భారతదేశానికి వచ్చిన బ్రిటిషు నౌకని ఊపివేసినది ఇంగ్లండు లోని పార్లమెంటు వరకు పెట్టెను. ఈ దారుణ మారణకాండకు హేతువులైన వారిని ఆ తరంగాలు ప్రాకి కలవర శిక్షించవలెనని దేశనాయకులు పట్టుపట్టిరి.ఢిల్లీ లో న్యాయ విచారణ నిర్ణయింపబడినది. ప్రజలతరపున చిత్తరంజనాస్, గాంధీ, మోతీలాల్ నల్లని గౌనులని వేసుకొని వచ్చిరి.
1919లో కాంగ్రెసు సభ అమృతసర్ లో జరిగెను. దేశప్రజల మనోభావమును అర్థం చేసుకొన్న మోతీలాల్ విదేశీ వస్త్రములని త్యజించి నిరాడంబరుడయ్యెను. న్యాయ వాద వృత్తులు మానుటచే వారి ఆదాయాలు తగ్గిపోయెను.అంచలంచల దీక్షతో తండ్రీ కొడుకులు ప్రజాసేవకై నిర్విరామ కృషి చేయుచునే యుండిరి. 1920 లో గాంధీజీ అసహా యోద్యమం ప్రారంభించెను. సువిశాలమైన భారతదేశమును పరిపాలించుట కెంతటి ప్రభుత్వ యంత్రాంగముండవలెను.
అన్ని ప్రభుత్వ శాఖలలోని విద్యావంతులైన భారతీయులే ఉద్యోగములలో నుండిరి.వారందరూ ఉద్యోగాలు విరమించి నచో, ప్రభుత్వం స్తంభించిపోవును కదా? గాంధీజీ పిలుపునకు దేశంలోని ప్రజలందరూ ముందుకు దూకిరి.ప్రభుత్వ కార్యా లయాలు మూసివేయబడెను. కర్షకుడు భారత దేశమునకు వెన్నెముక వంటివాడు.అతని క్షేమంపైననే దేశ పురోగతి ఆధారపడియున్నది.ఆర్థిక దుస్థితిలోనున్న కర్షకుని స్థితిగతు లని మెరుగుపర్చవలెనన్న గ్రామగ్రామం తిరిగి వారి సమస్య లని గ్రహించి, వారి పరిష్కారమార్గములను యోచించవలెను.గాంధీ, నెహ్రూలు దేశంలో అన్ని ప్రాంతాలని పర్యటించి నిర్మాణ కార్యక్రమములను నిర్దేశించిరి.
వారన్ హేస్టింగ్సు వైశ్రాయిగా వున్నప్పుడు సృష్టించ బడిన జమీందారులు గ్రామాలలో రైతులవద్ద ధనధాన్యములను వసూలు చేసి తాము కొంత నిల్వయుంచుకొని మిగిలినది బ్రిటీషు కలెక్టర్లకు సుంకములు చెల్లించుచుండిరి భూమి పండుటకు నీటిపారుదలలు లేవు. దుర్భిక్షం వచ్చి భూములు పండక పోయిన భార్యా సంతానముల పుస్తెలూడ్చియైనను జమీందారులు సుంకములు కట్టవలెను పశువులకు గడ్డి,మనుష్యులకు తిండి లేకపోయిన ఎవరు పట్టించుకొందురు.ప్రజల దృష్టిని మరల్చుటకు రాజే భగవంతునిగా భావించెడి భారతీయులను ప్రలోభ పెట్టుటకు ‘ప్రిన్స్ ఆఫ్ వేల్సు యువరాజుని భారతదేశమున కాహ్వానించిరి.
జాతీయ నాయకులు యువరాజు ఆగమనమును నిరసించిరి. అలహాబాద్, లక్నోలలో స్వచ్చంద సేవకులని తర్పీదు చేసిరి. వారు బ్రిటిషు కార్యాలయాలలోను న్యాయస్థానాలలోను పికెటింగు జరిపిరి. 1921 డిసెంబరులో Jawaharlal Nehru ని ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టెను. మోతీలాల్ కూడా అరెస్టయ్యెను. జాతీయ నాయకులు ఉద్రేశయు గము ఆగు కరపత్రాలను వేసియు, బహిరంగ ప్రకటనలు చేసియు ప్రజలలో జాతీయతా దృష్టిని, కర్తవ్య నిర్దిష్టతను ప్రబోధిం చిరి. బ్రిటిషు యువరాజునకు ప్రజల అసంతృప్తి జెండాల రూపంలో ప్రత్యక్షమయ్యెను.
1922 మార్చిలో జవహర్ ని విడుదల చేసిరి. గాంధీజీ పన్నుల నిరాకరణను ప్రబోధిం చెను. ఆయన ఆదేశమును ఈ దేశమున తు.చ. తప్పక ఆచ రించెను. ప్రజల ఆస్తులని ప్రభుత్వం జప్తుచేసెను. ఆనందళవ సమును కూడ ప్రభుత్వం జప్తుచేసెను. వేలంలో కొనుటకు ఎవ్వరును ముందుకు రాలేదు. దిక్కుతోచని ప్రభుత్వం దేశ నాయకులను మరల అరెస్టుచేసి జైళ్ళలో కుక్కెను. పికె టింగు చేయుట, విదేశవస్త్రాలను బహిష్కరించుట దేశం నలు మూలల ప్రాకినది. 1921 ఏప్రిల్ లో మరల Jawaharlal Nehru ని, మోతీలాల్ని జైలునకు గొనిపోయిరి. తండ్రియొక్క, తన యొక్క బట్టలను తనచేతులతో ఉతుకుకొనెను. గాంధీజీతో తంతో గ్రామగ్రామాన రాట్నములు తిరిగెను.
జాతీయభావసూత్రము ప్రబలి అ సేతు హిమాచల పర్యంతం సౌబ్రాతృతను గ్రామీణ పునర్నిర్మాణమసరై పెంపొందించుకొనెను. చైతన్య స్పృహ వెల్లి విరసెను. కుటీర పరిశ్రమలు వయోజన విద్య నిర్వహింపబడెను. విశాలమైన భారత భూమిలో బహు భాషలు కలవు. వీరిని యేకము చేయుటకు ఏక జాతీయ భాష కావలెను.హిందీ పాఠశాలలోగాంధీ నెహ్రూలు యివి గ్రహించిరి. హిందీ భాషణ గ్రామగ్రామం ప్రచారం చేసిరి. జాతీయ ప్రతిధ్వనులతో నిండిపోయినవి. 1928 జనవరిలో ఆ సంవత్సరమున కాంగ్రెసు జవహరు విడుదలయ్యెను. అధ్యక్షుడు మోతీలాల్ తర్వాత అలహాబాద్ నగరాధ్యక్షుడు గా ఎన్నికయ్యెను.
నగర పారిశుధ్యంలోను, శుభ్రమైన నీటి సరఫరాలోను జవహర్ తండ్రికి అండదండలుగా వుండెను. Jawaharlal Nehru యొక్క నాయకత్వమును వమ్ము చేయుటకై బ్రిటిషు ప్రభుత్వం మరియొకసారి ఉద్యోగం ఆశ గొల్పిం. నిస్వార్ధ బుద్ధితో ప్రజలకు సేవ నొనర్ప దీక్ష వహించిన Jawaharlal Nehru అట్టి సంకుచితాకర్షణకు లోనుకానని గట్టిగా చెప్పెను.1928 డిశంబరులో కాకివాడ కాంగ్రెసు మహాసత లకు స్వచ్చంద సేవకులకు నాయకుడై Jawaharlal Nehru వచ్చెను. ప్రకాశం, కాళేశ్వరరావు వంటి ఆంధ్ర నాయకులతో శతి చడు మేర్పడెను. ఆంధ్రదేశంలో పలుప్రాంతాలలో పర్యటించెను.
1924లో అలహాబాదు నగరమున త్రివేణి సంగమ మందు కుంభమేళాజరుగుచుండేను అక్కడ స్నానంచేయుట ప్రభుత్వం నిషేధించింది. ఆ ఆజ్ఞను ఉల్లంఘించి మదన్ మోహనమాలవ్యా, జవహరులు స్నానం చేసిరి, వారితోపాటు ప్రజానీకం కూడా వేలాదిగా వచ్చిరి. ప్రభుత్వం లాఠీచార్జి చేసెను. అనేకమంది ప్రజలు జైళ్ళ పాలైరి. నాడా పాటి యాల సంస్థానమునకు తగాదాలుండేవి. నాడా ప్రజల ఆకా లీలు వారి కష్టసుఖాలను స్వయంగా విచారించుటకు గాంధీ ఆదేశానుసారం Jawaharlal Nehru కిద్వానీ సంతానములు వెళ్ళిరి. దేశ నాయకులకు ప్రభుత్వము నిషేధించెను. 1926లో కమలా నెహ్రూకు క్షయవ్యాధి వచ్చెను విజయలక్ష్మి భర్త రణజిత్ సింహపండిత్ యూరప్ వెళ్ళుచుండెను.
స్విట్జర్లాండులోని జెనీవాలో చికిత్సకొరకు కమలని తీసుకొనిపోయెను. 25 జూలై లో Jawaharlal Nehru విడుదలై వెంటనే యూరప్ కు ప్రయాణమై పోయెను. స్విట్జర్లాండు జర్మనీలలో పర్యటించెను.1927 బెల్జియంలోని బ్రైజెల్సులో ప్రపంచ బాధిత జాతుల మహాసభలో భారత ప్రతినిధిగా ఉపన్యసించెను. ఆ ఉపన్యాసమును యూరప్ ఖండములోని యూరప్ ఖండములోని దేశములన్నియు పత్రికలలో ప్రచురించెను. దానితో ప్రపంచ మహావక్తలలో ఒకడుగా జవహరునకు కీర్తి వచ్చెను, సామ్రాజ్యతత్వ నిరోధసభలో కార్యవర్గ సభ్యునిగా నెన్నుకొనిరి. ప్రపంచ దేశాలలో భారత దేశమునకొక స్థానము కలిగెను.
1927లో మాస్కో నగరమున జరిగిన రష్యా దశను విప్లవ వార్షికోత్సవమునకు కుటుంబముతో వెళ్ళెను. 1917వ సంవత్సరమున జార్ నిరంకుశ ప్రభుత్వమును లెనిన్ నాయక త్వమున కూలద్రోసి బోల్షివిక్ రాజ్యమును స్థాపించెను. ఆ ఉత్సవమును తిలకించి దేశ స్వాతంత్రమునకై పోరాటం నిలువవలెనను స్ఫూర్తిని పెంపొందించుకొనెను. రష్యన్ గ్రంధములను గతితార్కిక గ్రంధములను చదివెను. లండన్ అదే సంవత్సరము భార్యతో వెళ్ళి స్వదేశమునకు వచ్చెను మద్రాసులో కాంగ్రెసు మహాసభలు జరిగెను. మహాసభలో మోతీలాల్ మితవాద పక్షమున వుండి మెల్ల మెల్లగా స్వయం పరిపాలనను అధినివేశ ప్రతిపత్తిలో సాధించవలెనని ప్రతి పాదించెను.
యువకుడయిన నెహ్రూ తండ్రి నెదిరించెను. సంపూర్ణ స్వరాజ్యమే కాంగ్రెసు ఏకైక లక్ష్యమని వాదించెను. తండ్రి కొడుకుల మధ్య ఏర్పడిన వివాదాలతో Jawaharlal Nehru కీర్తి ప్రతిష్టలు దేశమంతా ప్రాకెను. సామ్రాజ్యవాద నిరోధ సంఘమునకు భారతదేశంలో నాలుగుచోట్ల ఉప కేంద్రాలు ఏర్పడెను. మన దేశములోని బ్రిటిషు సామ్రాజ్య కుతంత్రాలు ప్రపంచ దేశాలలో చాటి చెప్పబడెను. నాలుగు రాష్ట్రాలకాంగ్రెసు సభలు నెహ్రూ సంపూర్ణ స్వరాజ్య సాధనకై చేసిన ప్రణాళికను ఆమోదించెను. దీనినే నెహ్రూ రిపోర్టు అంటారు.
Jawaharlal Nehru1928 ట్రేడ్ యూనియన్లలో పాల్గొనెను. జూరియా మ్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యత తీసు కొని అక్కడ కార్మికుల యోగక్షేమములకై పాటుపడెను. సోషలిస్టు సిద్ధాంతాను ప్రచారమొనర్చెను. 1929 డిశం బరులో కాంగ్రెసు లాహోర్ లో జరిగెను. అధ్యక్షుడయ్యెను. అప్పటికి నెహ్రూకు నలభై ఏండ్ల వయస్సు. అంతవరకూ అధ్యక్షుడుగా అంత చిన్న వయస్సులో ఎవరూ తేరు. కాంగ్రెసు సంస్థ ఒకవైపున బ్రిటిషు ప్రభుత్వముతో పోరాడుతూనే వేరొక వైపు ప్రజలలోని అవిద్యను నిర్మూలించి. సర్వతోముఖాభివృద్ధిని సాధించుటకై నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టెను.

రాజకీయ చైతన్యం ప్రజలలో వెల్లివిరియు చుండెను. దేశములోని అన్ని భాషలలో జాతీయ గీతములు వ్రాయబడిన పాడుచుండెను. కాంగ్రెసు సంస్థకు త్రివర్ణ పతాకమును పింగళి వెంకయ్యగారు సృష్టించిరి. సర్వమత సమ్మతనమైన ఈ పతా కమున మూడురంగులు కలవు. పై నున్నది హిందువులకు సంబంధించిన కాషాయరంగు. ఇది సత్యమునకు గూడా చిహ్నము, దాని క్రిందనున్న శ్వేతవర్ణం సర్వమతములకునూ గుర్తు అది ధర్మమునకూ చిహ్నము. దాని క్రిందనున్న ఆకుపచ్చరంగు ఇస్లాం మతమునకు గుర్తు. ఇది అహింసకు కూడా చిహ్నం. జెండా మధ్యలో రాట్నం గుర్తు ఏర్పడెను. ఇది భారతదేశమున స్వచ్చంద పరిశ్రమకు గుర్తు.
కాషాయ రంగు జ్ఞానాభివృద్ధికిని తెల్లరంగు గోపను సమృద్ధికినీ ఆకు పచ్చని రంగు సర్వ సమృద్ధికినీ చిహ్నములు. ఈ త్రివర్ణ పతాకములతో ప్రతి గ్రామమునను కళకళలాడు చుండెను. నూలు పడకుట, తాటిబెల్లం తీయుట, తేనె పరిశ్రమ, దంపుడు బియ్యం తయారుచేయుట, చేతిపనులు చేయుట, హిందీ భాష సభ్యసించుట వయోజన విద్య రాష్త్రతర ప్రాంతాలకు జన యాత్రలు భారతదేశమున ముమ్మరంగా సాగి ఏకైక లక్ష్య మగు సంపూర్ణ స్వరాజ్య సిద్ధికై పురోగమించు చుండెచు.
1928లో సైమన్ కమీషన్ భారత దేశమునకు వచ్చెను. ఇందలి సభ్యులు ఏడుగురు. భారతీయులు ఒక్కడూ లేడు. భారతీయుల స్థితిగతులను విచారించి వారికి కంటినీళ్ళు తుడుపుగా ఏవో సంస్కరణలను సూచించుట సైమన్ కమిషన్ ఉద్దేశ్యం దీనివలన ప్రయోజన ముండదు సరిగదా భార తీయులు చేయుచున్న స్వతంత్ర ఉద్యమానికి కూడా అంత రాయ మేర్పడెను. దీనిని గుర్తించి రాజకీయ నాయకులు సైమన్ కమిషన్ ను బహిష్కరించుచూ ఏకగ్రీవంగా తీర్మా నించిరి. అందువలన సైమన్ కమిషన్కు సల్లజెండాలతో ప్రతి రాష్ట్రమునందు ప్రజలు స్వాగతం పలికిరి, మద్రాసు రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశంగారు తన గుండెను తుపాకీ గుండుకు యెదురు నిలిపెను. ఇట్లే ప్రతిచోటా శృంగ భంగం పొంది ఆ కమీషన్ వెనుదిరిగిపోయెను.
మన దేశానికి సుదీర్ఘమగు సముద్రతీరం కలదు. సముద్రపుబొడ్డుని ఉప్పు పండించు కొనుటకు బ్రిటిషు ప్రభుత్వానికి పన్ను చెల్లించవలసియుండును గాంధీజీ యిది అన్యాయమని సత్యాగ్రహం చేసెను.
1928 ఫిబ్రవరిలో బార్డోలీ జిల్లాలో శాసనధిక్కారం జరిగెను. గాంధీజీ స్వయంగా దండి అనేచోట సత్యాగ్రహం చేసెను. బీహారులో చాంఫ్రా దగ్గర రాజేంద్రప్రసాద్ నాయ కత్వాన ప్రజలు సముద్రజలముతో ఉప్పును పండించుకొనిరి. చాలామంది నాయకులు జైళ్ళపాలైరి. దేశములో అలజడి బయలుదేరెను. చేయునదిలేక బ్రిటిషు ప్రభుత్వం గాంధీ – ఇర్విన్ ఒడంబడిక చేసుకొనెను. దీని ప్రకారం నాయకులందరూ విడుద లైరి. ఉప్పు పై పన్ను లేదు. పంచాయతీ వ్యవస్థ ఏర్ప డెను.
ఆంగ్లేయులతో పోరాడుచున్న భారతీయులలో సైతం వర్ణ వివక్ష అస్పృhttps://photos.app.goo.gl/tg8UdJ1oBhQKZBoh7శ్యత ఐలిసియుండెను హరిజనులున్డుబయటకు తరిమి వారిని క్రూరంగా హింసించుచుండిరి. హరిజనులకు దేవాలయ ప్రవేశంలేదు. దేశం జనసంఖ్యలో అయిదవ వంతు కల ఈ హరిజనులు నిరాశతో ఆవిద్యతో అనారోగ్యంతో దారిద్య్ర్యం అనుభవించుచుండిరి. గ్రామస్థులకు వీరు బానిసలు. ఇట్టి గ్రామాలు ప్రతి రెండుకోసుల దూరం విస్తరించినా భారతదేశమున చూచి గాంధీజీ బాధపడెను.
అసహాయులైన వీరికి డబ్బు చిన్నచిన్న సదుపాయాలు ఆశచూపి ఆంగ్లేయులు వారిని క్రైస్తవ మతంలోనికితీసు కొనుచుండిరి ఇట్లు హరిజనులందరూ క్రైస్తవులయినచో వారు ఆంగ్లేయులపై పోరాడారు కదా! అప్పుడు జాతీయోద్య మము బలహీనమగును. ఇది గ్రహించి గాంధీజీ హరిజనుల నుద్దరింప దీక్ష వహించెను. అస్పృశ్యతా నివారణ వయోజన విద్య హరిజనవాడ పారిశుద్యమునకు ‘ప్రాధాన్యమీయబడెను. ప్రతి కాంగ్రెసు కార్యక ర్త హరిజనవాడలకు పోయి పారిశుధ్యం చేయవలెను ప్రచారం చేయవలెను అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశం జరగవలెను. ఇది సవర్ణ హిందువులకు కష్టమయ్యెను అది గ్రహించి గాంధీజీ ఆమరణ నిరాహారదీక్షను వహించెను.
అనేక పుణ్యక్షేత్ర దేవాలయాలలో హరిజనుల ప్రవేశం లభిం చింది అలహాబాదునందు కాశీ గయ మధుర దేవాలయంలో హరిజనులు ప్రవేశించి దర్శనం చేసుకొనిరి. నెహ్రూ ఈ కార్యక్రమములన్నింటినీ స్వయంగా నిర్వహించెను.1931 న ఫిబ్రవరిలో మోతీలాల్ చనిపోయెను. జవ హరు తన ఆనందభవనమును పార్టీకి యిచ్చివేసెను దానిని స్వరాజ్య భవనమని పిలచిరి. 1931 మార్చిలో కరాచి కాంగ్రెసునకు వల్లథాయిపటేల్ అధ్యక్షుడయ్యెను. సామ్యవాద సిద్ధాంతముల నామోదించిరి. వ్యక్తి స్వాతంత్ర్యం కావా అని కూడా తీర్మానింపబడెను.
1932 శాసనోల్లంఘనంలో అనేకమంది ప్రభుత్వానికి పన్నులు చెల్లించలేదు. కాంగ్రెసు కార్యదర్శియై నెహ్రూ గాంధీజీని కలుసుకొనుటకై బొంబాయికి బయలు దేరెను. కమలా నెహ్రూ చికిత్స పొందు చుండెను
బొంబాయిలో ఆమెను చూచుటకయిననూ అనుమతి లభించలేదు. 1931 డిసెంబరులో ప్రబుత్వం మరల అరెస్టుచేసి 20 నెలలు శిక్ష విధించిరి. పన్నులు కట్టక పోవుటచే Jawaharlal Nehru అస్తులు జ పు చేసిరి, తల్లికి జబ్బు చేయుటవలన జైలునుండి విడుదలయిన Jawaharlal Nehru మరల స్వాతంత్రోద్యమమును తీవ్రంగా కొనసాగిం చెను. బెంగాల్ లోని స్ట్రబుత్వం దౌర్జన్యాలుచేయుచుజాతీయ వాదులను చిత్రహింసలకు గురి చేయుచుండెను. వాటిని స్వయ ముగా పరిశీలించి ప్రబుత్వ దమనకాండను తీవ్రంగా ఖండిం చెను.https://pincodesguide.in/alluri-sitarama-raju-was-a-great-manyamveer/
ఉత్తర బీహారు క్వెట్టాలలో తీవ్రముగు భూకంపాలు వచ్చెను. ప్రజలు వేలాదిమంది మరణించిరి. బ్రతికిన వారికి చికిత్సచేయుటకై చందాలు వసూలుచేసి తిండిగింజలు ప్రోగు చేసి బీహారులో నిర్విరామంగా ప్రజాసేన చేసెను. కలకత్తాలో ప్రబుత్వాన్ని తీవ్రంగా నిందించుచు ఉపన్యసించుటవలన రాజద్రోహం క్రింద ఆయనను అరెస్టు చేసిరి. ఏడవమారిట్లు లు కేగెను. రెండు సంవత్సరాలు కఠినశిక్ష వేసిరి.బొంబాయిలో చికిత్సవలన ప్రయోజనంలేక కములను స్విట్జర్లాండు కుమార్తె ఇందిరతోపాటు పంపిరి. ఆమె ప్రమాద స్థితిలో Jawaharlal Nehru విడుదలయ్యెను. కమల శాశ్వతంగా కన్ను మూనెను.
స్విట్జర్లాండులో కమలకు దహన క్రియలు చేసి ఆస్ట్రియా, ఇంగ్లాండులో ఆంగ్ల ప్రభుత్వంయొక్క పై దేశిక నీతిని, కుటిలనీతిని విమర్శించుచూ చాలాచోట్ల ఉపన్యాసాలు చేసెను 12-4-1936న లక్నో కాంగ్రెసుపట్ల అధ్యక్షత వహించెను. బ్రిటీషువారికి కాంగ్రెసుపట్ల సానుభూతి పెరిగెను. 1937 లో రాష్ట్రాలలో స్వయం పాలనాధికార మిచ్చుచు ప్రభుత్వం ఒక శాసనం చేసెను. అన్ని రాష్ట్రాలకు ఎన్ని కలు జరిగెను. అన్నింటిలోను కాంగ్రెసు పార్టీయే గెల్చెను. సంయుక్త రాష్ట్రంలో జవహర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ మేక్పడెను.
1938లో సుఖాస్చంద్రబోస్ కాంగ్రెసు అధ్యక్షు డయ్యెను. అతివాదియైన బోస పట్ల గాంధీకి అభిమానంలేదు జోస్ క్షయవ్యాధితో బాధపడుతూ కూడా కాంగ్రెసు కార్య క్రమం సత్వర రాజ్యసిద్ధికై చేయవలసిన చర్యలను ఆమో దించుటకు ఓటునకు పెట్టెను. గాంధీజీ కోర్కె మేరకు అవన్నియు యధాతధముగ నెగ్గలేదు. 1939 లో త్రిపురకాంగ్రెసునకు డాక్టర్ పట్టాభిని గాంధీ ఎన్నిక చేసి సుభాస్ చంద్రబోసుకు పోటీగా నిలబెట్టెను. పట్టాభి ఓడిపోయెను గాంధీజీ పట్టాభి ఓటమి నా ఓటమియే అని ఒప్పుకొనెను. అధ్యక్షుడయిన సుఖాసునకు సహకరించుట కిష్టంలేక జనహర్, అజాద్, పట్టాభి, రాజేంద్రప్రసాద్ కార్యవర్గ సభ్యత్వాలకు రాజీనామా చేసిరి.
నిజంగా ఇట్టి పరిస్థితి అవాంఛనీయం, శోచనియం. 1939 లో ద్వితీయ ప్రపంచ సంగ్రామం వచ్చెను. బ్రిటిషువారు భారతీయులను ధన, ప్రాణ సహాయం చేయమని కోరిరి. గాంధీజీ సంపూర్ణ స్వరాజ్యమిచ్చి ఆంగ్లేయులను వైదొలగి పొమ్మనెను ఒడంబడిక కుదరక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుచున్న జాతీయ నాయకులు రాజీనామా చేసిరి. గవర్నర్లకు భారతీయ సహాయక మంత్రులను నియమించి బ్రిటిషువారు పరిపాలన కొనసాగించిరి. జాతీయ నాయకులు తమ ప్రచారము కొనసాగించుచున్నారు. తీవ్రవాదులైన నాయకులను జైళ్ళలో పెట్టిరి. సుఖాస్చంద్రబోస్ను కలకత్తా లోని ఆలీపూర్ జైలులో నుంచిరి. ఆయన ఎల్లో తప్పించు కొని జర్మనీ చేరెను. ప్రపంచ యుద్ధమున జర్మనీ, జపాన్ ఇటలీ ఒక పక్షాన, అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్లు ఒక పక్షాన చేరిరి. ప్రపంచ యుద్ధం తీవ్రంగా జరుగుచుండెను.
బెంగాల్లో పెద్ద కరువు ఏర్పడెను. రాయలసీమలో కూడా కరువు వచ్చెను. ప్రజలు అల్లాడిపోవుచుండిరి. పండిన తిండి గింజలు యుద్ధమునకై తరలించుకొనిపోయిరి. జాతీయ నాయకులకు సదుపాయాలు తగ్గించుటచేతనూ, వారిని హీనంగా చూచుటచేతనూ నావికాదళంలో అసంతృప్తి ఏర్పడెను. వారు తిరుగుబాటు చేసిరి. భారతదేశంలో అనేక పట్టణాల్లో జాతీయ నాయకులను వివక్షతతో చూచుచుండిరి. గాంధీజీ క్విట్ ఇండియా అనే మహా ఉద్యమాన్ని ప్రారం లించెను. ఈ వార్త దేశం నలుమూలలా ప్రాకెను. ప్రజలు రెచ్చిపోయి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిరి. నాయకులంద రినీ అరెస్టుచేసి 1942 నుండి 44 వరకు జైళ్ళలో వుంచిరి.
జపాన్ పై అణుబాంబులు వేయుటచే యుద్ధం అంతమయ్యెను. పై బ్రిటిషువారికి యుద్ధంలో సంభవించిన నష్టాలనుండి తేరుకొను టకు కష్టసాధ్యమయెను, 1945 లో అమాత్రయం రాయబారం పంపిరి. మహమ్మదాలీ జిన్నా గాంధీజీకి మిత్రుడుగా వుండెను. అతడు భారతదేశంలోమహమ్మదీయులకు రక్షణ లేదనియూ, భారతదేశానికి స్వతంత్రమిచ్చినచో హిందువులు మహమ్మదీయులను చంపివేయుదురని ప్రచారం చేసెను. ఒక సంవత్సరం తాత్కాలిక ప్రభుత్వము నేర్పాటుచేసి తరు వాత భారతదేశాన్ని రెండుగా విభజించి ఇండియా.. పాకిస్తాన్ లనే స్వంత ప్రతిపత్తితో పాలించుకొనే ఏర్పాటు అమాశ్రయం యెదుట జాతీయ నాయకులు సమ్మతించిరి. ఇట్లు 1946 లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడెను.
1947 ఆగష్టు 14 వ తేదీన రాత్రి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్యం లభించిది.Jawaharlal Nehru ప్రధానమంత్రిగా,లార్డ్ మౌంట్ బాటున్ గవర్నర్ జనరల్ గా, జాతీయ నాయకులు మంత్రులుగా ప్రభుత్వమును ఏర్పరచిరి. ఇన్ని సంవత్సరాలుగా స్వాతంత్రమునకై పోరాడి అలసిపోయిన నాయకులకు ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించుటచే చాలా సమస్యలు ఎదురయ్యెను. భారతదేశమున సుమారు అయిదు వందలకు పైగా స్వదేశ సంస్థానాలు కలవు. వారికి ఆంగ్లేయులుస్వయం
నిర్ణయాధికారం యిచ్చిరి. దేశంలో ఆహార ధాన్యాల కొరతఎక్కువగా కలదు. సహజ సమృద్ధిగల ఖనిజం, ఇనుము, బొగ్గు మొదలగువాని త్రవ్వకాలు నిర్లక్ష్యం చేసిరి. అన్నింటికంటెను బహు భాషలతో, కుల మతాలతో కొట్టుమిట్టాడెడి ప్రజలను ఏకత్రాటిపై సంధించుట కష్టంగా వుండెను. స్వాతంత్ర్యం
సిద్ధించిన తర్వాత మన దేశానికి అనుగుణంగా రాజ్యాంగ రచనము ఏర్పాటు కావలయును.
ఇన్ని యిబ్బందులలోJawaharlal Nehru ప్రధాన మంత్రియై భారత ప్రభుత్వం నౌకకు కర్ణధారి యయ్యెను.దేశములోని సహజ వనరులగు నదీ జలములకు ప్రాజెక్టులు కట్టి పెద్ద పెద్ద భారీ పరిశ్రమలను స్థాపించి దేశాన్ని సుసంపన్నం చేయటా నికి ప్రణాళికల నేర్పాటు చేసెను దేశంలోని వయోవృద్ధు వారి సలహాలగు మేధావి వర్గానికి తగిన అవకాశాలిచ్చి మేరకు నిర్మాణ కార్యక్రమములను నిర్వహించుటకై పధకా లను రచించెను దేశములోనున్న రైల్వేలు ప్రైవేటు సంస్థ లకు చెందినవై యుండెను వాటిని క్రమక్రమంగా జాతీయం చేసి బలమయిన రైల్వేసంస్థను ఏర్పాటుచేసెను. చిత్తరంజన్అనే చోట రైలుపెట్టెల నిర్మాణమునకై ఏర్పాట్లు ముందుచూపుతో భారత నావికాదళాన్ని వృద్ధి చేయుటకై పధ కాలను తయారుచేసెను.
ప్రయాణ నౌకలు, రవాణా నౌకలు,చేసెను.యుద్ధనౌకలుమనదేశంలోనే తయారుచేయుటకు ఏర్పాట్లు చేసెను. భారత విమానదళాన్ని జాతీయంచేసి కావలసిన విమానాలను వాటి విడిభాగాలను యిక్కడే తయారుచేయు ఏర్పాటు చేసెను, హీరాకుడ్, థాక్రానంగల్, నాగార్జునసాగర్ మొదలగు పెద్ద
ప్రాజెక్టులను నిర్మించెను.అణువిద్యుత్బొంబాయి మొదలగుచోట్ల ఏర్పాటు చేసెను.కేంద్రములను వైజ్ఞానికులచేత పరిశోధనలు జరిపించుటకు అనేక పరి శోధనా కేంద్రములను ఏర్పాటు చేసెను. ప్రైవేటు సంస్థ ప్రభుత్వ సంస్థలకు మద్య సంఘర్ణణలు లేకుండా చేసెను.
డాక్టర్ అంబేద్కర్ పర్యవేక్షణలో రాజ్యాంగాన్ని రచించిరి మన రాజ్యాంగం ప్రపంచంలోని వివిధ దేశాలలోని రాజ్యాంగ ములను సంప్రదించి తయారుచేసిరి భారతదేశమున బ్రిటిషు వారు వదిలి పెట్టిన సంస్థానాలను మనదేశంలో విలీనంచేసిరి ఆసియా ఖండంలో ప్రజాస్వామ్య దేశముగ ప్రజాస్వామ్య దేశముగ వినుతికెక్కిన భారత భూమిలో అన్ని రాష్ట్రములకు ఎన్నికలు జరిపించెను అలీన విధానంతో ఇటు అమెరికాతోను అటు రష్యాతోను స్నేహ సంబంధాలు పెంచుకొనెను. అంతర్జాతీయంగా అలీన విధానం పేరు ప్రఖ్యాతులు గాంచెను పాకిస్తానుగా ఏర్పడినా మహమ్మదీయులకు భారతదేశంపై ద్వేషం పోలేదు. కాశ్మీరుపై పాకిస్తాన్ దండయాత్రచేసి సగం ఆక్రమించెను రాజు కరణ్ సింగు భారత ప్రభుత్వాన్ని శరణువేడెను.
కాశ్మీరును రక్షించుటకు భారత సైన్యం ముందుకు దూకెను. పాకిస్తాను సైన్యమును త్రిప్పికొటైను. ఇప్పటికి సగం కాశ్మీరు పాకిస్తాన్ క్రింద మ్రగ్గుచుండెను. అంధ్రప్రాంతమున హైదరాబాద్ నవాబు ప్రజలను పీడించుచు రజాకారులను ప్రోత్సహించెను. అప్పుడు రక్షణమంత్రియైన వల్లభాయిపటేల్ అధ్వర్యమునపోలీసు యాక్షన్ పేర హైదరాబాదు సంస్థానము స్వాధీనం కాలింపబడెను. అక్కడి జాతీయ నాయకులతో స్వపరిపాలన ప్రారంభింపబడెను. మైసూరు తిరువాన్కూరు సంస్థానాలు భారత ప్రభుత్వానికి లొంగివచ్చెను. రాజస్థాన్ లోని సంస్థానం అన్నిటిని వల్లభాయి పటేల్ భారత దేశములో చేసెను.
ప్రజలలో గాంధీజీ సూచించినట్లు భాషా ప్రయుక్త రాష్ట్రములు కావలయుననెడి పట్టుదల పెరిగెను. భాషాప్రాతి పదిక పై విభజింపబడెను. భారతదేశములో ముఖ్యమైనవి పదు నాల్గు భాషలు గుర్తింపబడెను. కేంద్రమైన ఢిల్లీపట్టణంలో సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయబడెను. ప్రతి రాష్ట్రములో అనుబంధశాఖ యేర్పడెను ఇట్లు ఆయా భాషల అభివృద్ధికై ప్రోత్సాహములు, పారితోషికములు లభించెను. నెహ్రూ తాను కన్నకలలు కార్యరూపంలో పెట్టుటకు నిర్విరామంగా కృషిచేసెను, అయన వాగ్దాటికి వ్యక్తిత్వానికి అంతర్జాతీయ ముగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించెను. సుఖాస్చంద్ర బోస్ జపాన్ వారితో కలిసి స్వదేశ స్వరాజ్య స్థాపనకై యుద్ధంచేయుటకు సంకల్పించెను.
అజాద్ హింద్ ఫౌజు పేర పెద్దసైన్యమేర్పడెను. ప్రపంచ యుద్ధం ముగియుటతోడనే జోస్ విమాన ప్రమాదంలో మరణించెను, అజాద్ండా పౌజ్శిక్ష విధించుటకై దీగా పట్టుబడెను. వారిని విచారించి బ్రిటీషు ప్రభుత్వం యోచించెను. అప్పటికి మనకి స్వాతం త్ర్యం రాలేదు. ఇన్ని వేల సైన్యం భారతదేశ విముక్తికిపాటు పడియు నేటి దేశ ద్రోహనేరమునకై దండింపబడుటజాతీయ నాయకులకు ఇష్టంలేదు ప్రత్యేక న్యాయస్థానమున విచార ఇలో అజాద్హిఁదాపౌజ్ తరఫున జవహర్ లాల్ నెహ్రూ, సప్రూ రాజేంద్రప్రసాద్ మొదలయిన న్యాయవాదులు పరిశ్ర మించి వారిని విడుదల చేయించిరి. ఖారతదేశ కీర్తికొక కల్కి తురాయి అయ్యెను.
జాతీయగీతములుగా బంకించంద్ర చటర్జీ వ్రాసిన వందేమాతరం గీతం రవీంద్రనాధ ఠాగూర్ జనగణమన ఆదినాయక జయహే అను గీతం నిర్ణయింప వ్రాసిన బడెను. జాతీయపతాకముగా కాంగ్రెసు జెండాయే యుంచిరి. కాని రాట్నమునకు బదులుగా అశోకుని ధర్మచక్రంముద్రింప బడెను,నిత్యోత్సాహముతో, Jawaharlal Nehru ప్రాజెక్టుల స్థాపనకు ఎన్నికల ప్రచారములు, వైజ్ఞానిక సమా వేశములకు సైన్య శిబిరములకు వెళ్ళి ఉపన్యాసము లిచ్చుచుండెను, దేశ స్వాతంత్ర్యసిద్దిని చేకూర్చిన నెహ్రూ నాయకునిపట్ల దేశ ప్రజలకు అంతులేని ప్రేమాభిమానాలు నుండెడివి ఆయన ఉపన్యాసములకు లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చి వినుచుండిరి.ప్రజల సమూహమును చూచినచో నెహ్రూ తన ఒళ్ళు తాను మరచిపోవుచుండెను.
భారతదేశ మెప్పుడు నాగరిక దేశము వలే సర్వసౌఖ్యములు కలిగియుండునో అని కలలు కను చుండెడివాడు. మతాతీతమైన ప్రజాస్వామ్య దేశముగా భారత ఖండమును తీర్చిదిద్దుటకై అతడు పరిశ్రమించుచుండెను.26-1-1950 తేదీన భారతదేశము రిపబ్లిక్గా రించెను. అప్పటివరకు గవర్నర్ జనరల్ గా చక్రవర్తుల రాజు గోపాలాచారి యుండెను. ఆ స్థానమున రాజేంద్రప్రసాద్ హోమ్ మంత్రిగా అధ్యక్షుడయ్యెను. వల్ల భాయిపటేల్ వుండెను ప్రధాని Jawaharlal Nehru ఢిల్లీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుచుండగా, Jawaharlal Nehru అశేష భారత ప్రజ లకు – బహుకష్ట సముపార్జితమైన రిపబ్లికన్ను సమర్పించెను. మార్గదర్శకుడైన ఆరణ్యములలో ముండ్ల మొక్కలను తీసిం రాళ్ళను సరిచేసి వేసిన బాటలపై భారతీయులు ముందున శాంతిని పొందవలెనని రేగిరి. క్రొత్త క్రొత్త సుఖములను, ఆయన దేశ ప్రజలకు సందేశమిచ్చెను, దేశవిభజన తరువాత హిందూ మహమ్మదీయ ద్వేషములు రగిలి, మతోన్మాదులతో రక్తపాఠములను చేసుకొనిరి.
పాకిస్తాన్లో అనేకమంది హిందువులు హింసింపబడిరి. కొందరు పారిపోయి వచ్చిరి. బెంగాల్ లో “నవథా?” ప్రాంతమున హిందూ- మహమ్దీయులు తమలో తాము అన్నదమ్ములమన్న భావములను విడనాడి, కుత్తుకలు నరుకుకొనిరి. మత ద్వేషములను, హింసా కాండను శాంతింపజేయుటకై గాంధీజీ, నెహ్రూజీలు అహర్ని శలు పాటుపడిరి. 1918 జనవరి 30న గాంధీజీ హత్యకావింప బడెను తనకు ప్రోత్సాహమిచ్చి స్వాతంత్ర్య సమరమున సలహాలిచ్చిన గాంధీజీ మరణము Jawaharlal Nehru నకు చాలా బాధ కలి గించెను. నిత్య కార్యక్రమాలలో పాల్గొనుచూ ఎన్నో అభి వృద్ధి ప్రణాళికలను అమలు జరుపుచూ అంతర్జాతీయంగా భారతదేశ విదేశాంగనీతిని ప్రచారం చేసెను. ఒకవైపు పాకి స్తాన్ శతృత్వము ఏర్పడెను. ఇదే సమయంలో చైనా తో కూడా మన దేశముపై దాడిచేసెను. ఇది జవహరునకెంతయో బాధ కలిగించెను. ఒక వైపున నిర్మాణాత్మకమైన ప్రాజెక్టులు, వేరొకవైపు సైనికులకు ఆయుధాలు తయారుచేయుట తప్పని సరి అయ్యెను.
నిరంతర రాజకీయాలలో విశ్రాంతి నెరుగని జవహర్కు హిమాలయాలు, అటవీ ప్రాంతాలు, గిరిజనులతో సంభాషణ ఎంతయో ప్రశాంతిని కూర్చుచుండెను. పిల్లలన్ననూ, పూలన్ననూ ఆయనకెంతో ఇష్టం. నిరంతర రాజకీయులతో తనను తాను మరచిపోయి ఎంత కాలమైననూ గడుపగల Jawaharlal Nehru మనస్వి ఆయన. తాను పుట్టినరోజు బాలల దినంగా జరుపు కొనుట కెంతటి అమాయకమైన కళాదృష్టి కావలెను చాచా Jawaharlal Nehru చేతులతో భావిపౌరులైన బాలలు స్పృశించబడుట ఏ దేశనాయకుని జీవితమందును లేదు. అబ్రహాం లింకన్తో పోల్చబడిన దివ్యమూర్తి ఆయన. ఆగస్టు 15వ తేదీ ఉడ యముననే ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకము నెగర వేయుచు, తెల్లని శాంతి కపోతముల నెగురవేయుచు దర్శన మిచ్చెడి కిరీటంలేని ఈ మహారాజును చూచిన ప్రజలుధన్యుడై తస్మయులై పోవుచుండిరి.
హిందీ, ఆంగ్ల భాషలలో సమా నంగా ప్రసంగించెడి మహావ్యక్త Jawaharlal Nehru . ఆంగ్లేయుల లితని వేసెడివారు. ఈయన వ్రాసిన రచనలను చదివి గుతులు గ్రంధాలలో కొన్ని ముఖ్యమైనవి సోవియట్ రష్యా వ్యాస ములు. ఇందిరకు తండ్రి లేఖలు, గ్లిమ్పెన్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఆత్మకథలు ముఖ్యమైనవి.
మనకు స్వాతంత్ర్యం వచ్చిన అనేక సమయాలలో ఆయన చేసిన ప్రసంగములు పుస్తకరూపములో వెలువడినవి.
మతకలహాలకు, దురన్యాయాలకు గాయపడిన గుండె గులాబి పువ్వు గుర్తుగా ధరించిన Jawaharlal Nehru నిస్వార్థ జీవితమును ప్రత్య ర్థులు సైతం కొనియాడిరి, లక్షలమంది ప్రజలమధ్య వారి ఆవేదనలకు కంఠస్వరమిచ్చి భారతజాతి కీర్తి ప్రతిష్టలను పెంపొందించెను. 1964 మే నెలలో ఈ మహానాయకుడు మనలను మే విడిచిపోయెను. యమునానది తీరమున రాజఘాట్ వద్ద అంత్యక్రియలు జరిగినవి. లక్షలాది భారతీయులు తమ ప్రియతమ నాయకునికి శ్రద్ధాంజలి ఘటించిరి. దేశ దేశాల నాయకులు ఆయన మరణానికి ఎంతో విచారించిరి. ఆయన కన్న కలలు నిజముచేసి భారత స్వాతంత్ర్యాన్ని రక్షించు కొనెదము గాక.