Water is a great natural resource.

Why is water wet?

WATER ఎందుకు తడిగా వుంటాయి? ప్రపంచంలో బోలెడు వస్తువులున్నాయి. ,WATER, భూమి, గాలి, ఇళ్లు, కార్లు, చెట్లు, జంతువులు, మీరూ, నేనూ – దేనివల్ల వస్తువులన్నీ తయారయాయి అని నేనడిగితే మీరేం జవాబు చెప్తారు? ‘ప్రతిదీ చిన్న చిన్న కణాలతో, అంటే పరమాణువులతో తయారైంది’ అని మీరు బహుశా జవాబు చెప్తారు. పూర్తిగా కాకపోయినా, మీరన్నది రైటే. నా ఉద్దేశం యేమిటో యిప్పుడు మీకఅర్థమౌతుంది.

WATER,

ఇదీ నా ఉద్దేశం. ‘యీ వ్యాసం లోని విషయాన్ని యెలా కూర్చారు?’ అని మీరు నన్నడిగారనుకోండి. ‘అక్షరాలతో’ అని నేను బదులు చెప్తాను. నేను చెప్పిందీ రైటే, పూర్తిగా కాకపోయినా. “విషయం మాటలతో కూర్చింది, మాటలు అక్షరాలతో యేర్పడతాయి” అని నన్ను మీరు దిద్దుతారు.నిజమే. మాటలుగా యేర్పడడానికి యెలా కలవాలో అక్షరాలకి తెలవకపోతే యెవళ్లూ అతిచిన్న వ్యాసం కూడా రాయలేరు. తెలుగు భాషలో 56 అక్షరాలు మాత్రమే. 56 అక్షరాలతోటి మీరు యెనని చెప్పగలరు? కాని యీ అక్షరాలు తయారు చేసే మాటలున్నాయేం వేలు! జనం యెన్ని కథలు చెప్పుకున్నారో, యెన్ని పుస్తకాలని, పాటలని రాశారో, బడి పిల్లలు యెన్ని వ్యాసాలు కూర్చారో, లోకులు వాళ్ల వాళ్ల చుట్టాలకి యెన్ని ఉత్తరాలు రాసుకున్నారో అసలు మనం లెక్క పెట్టను కూడా లెక్క పెట్టలేం. మరి యివన్నీ చేసింది మాటలతోటే .

వర్ణమాలలో ఉన్న అక్షరాల కంటే భిన్న రకాల పరమాణువులు బోలెడు ఉన్నాయి. అయినా మరీ మరీ యెక్కువ కాదు లెండి. విజ్ఞాన శాస్త్రానికి తెలిసినవి 107 భిన్న రకాల పరమాణువులు. వాటిలో కొన్ని ప్రకృతిలో కనిపించవు. కొన్నిటిని భౌతిక శాస్త్రవేత్తలు కృత్రిమంగా సాధించారు. అంచేత పరమాణువులకి గనక బోలెడు బోలెడు రకాలుగా దగ్గరకి చేరడం తెలిసివుండకపోతే ప్రపంచంలో ఓ వందో యెన్నో వేరు వేరు పదార్థాలు వుండేవంతే.

అప్పుడు యీ లోకం యేం బాగుండదు కదూ! మొదటి పేజీలో ‘అ’ అనే అక్షరం, రెండో పేజీలో ‘ఆ’ అనే అక్షరం యింకా అలా అలా ఒంటి అక్షరాలు పుస్తకంలాగా వుండేది.కాని యీ ప్రపంచం అలా లేదు కదా మరి. యిప్పుడు మీరున్న గదిలోనే బోలెడు పదార్థాలతో తయారైన వస్తువుల్ని మీరు లెక్క పెట్టగలరు. యెంతో వైవిధ్యం గల గుణాలున్న కొన్ని మిలియన్ల పదార్ధాలు విజ్ఞాన శాస్త్రానికి తెలుసు. యీ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అంత వైవిధ్యం వుందంటేనే పరమాణువులు అక్షరాల్లాగా బాగా కలిసి పోగలవని అర్ధం కదా.

ఒకే రకం పరమాణువులు కలిసే తీరు

ఒకే అక్షరం పునరుక్తం అవుతూ ఉండే మాటలు మీకు యెన్ని తెలుసు? వూఁ కొద్దిగానే వున్నాయి. ‘తాతా’, ‘పాపా’, ‘రారా’, ‘నానా’ లాగా.

పరమాణువుల సంగతేమిటి

మీకు తెలిసిన దాన్ని దేన్నేనా తీసుకుందాం. మాటకి, అయొడీన్. మీ వేలు తెగినప్పుడు రాసే ముదురు గోధుమ రంగు ద్రవం పరిశుద్ధ అయొడీన్ కాదు. ఆల్కహాల్లో వేసిన అయొడీన్ ద్రావకం. శుద్ధ అయొడీన్ ఊదా రంగు కాంతిలో ఉండే నలుపూ తెలుపూ కలిసిన స్ఫటికం. ఇందులో అయొడీన్ పరమాణువులు తప్ప మరేం వుండవు. ‘యీ పదార్థంలోని అతి సూక్ష్మ కణం యేమిటి’ అని యెవల్లేనా మిమ్మల్ని అడిగారనుకోండి. ‘అయొడిన్ పరమాణువు’ అని తొందరపడి చెప్పకండి. అయొడీన్ పరమాణువులు జంటలుగా ‘కలిసి కూర్చుంటాయి’ క్లాసులో పిల్లలు కూర్చున్నట్టు. కాని బడి అయిపోగానే పిల్లల జంటలు విడిపోయి, పిల్లలు అన్ని వేపులకీ పరిగెత్తిపోతారు, కదూ? కాని అయొడీన్ పరమాణువుల జంట విడిపోదు. యెన్నటికీ విడిపోవుయీ స్ఫటికం కరిగిపోయినా, ఆవిరి అయిపోయినాకూడా.

WATER,

మాటకి స్నేహితంగా ఉండే యీ జంటని యెలాగో విడగొట్టగలిగామనుకోండి. అయొడీన్ యేక పరమాణులో యే పదార్థం వుంటుంది ?మరేమిటి ? అయొడీనే! కాని, అబ్బే! పదార్థంలో పూర్తి తేడాగా వుండే ధర్మాలున్నట్టు కనిపిస్తుంది. ఒక పరమాణువూ, అదే పరమాణువు జంట అచ్చం ఒక్కలాగే వుండవు.యెవల్లేనా ఒక అయొడీన్ స్ఫటికాన్ని మీకు చూపించి ‘యిందులోని అతి సూక్ష్మ కణం యేమిటి?’ అని కొంటెగా అడిగారనుకోండి. ఇప్పుడు మీకు తెలుసు యేం చెప్పాలో. ‘అయొడీన్ పరమాణువుల జంట’ అని జవాబు చెప్తారు.

ఒక పదార్థ ధర్మాలని కాపాడే అతి చిన్న పదార్థ కణాన్ని అణువు అంటారు.అంచేత ఒక శాస్త్రజ్ఞుడిలాగా యీ కొంటె ప్రశ్నకి మీరు జవాబు చెప్పాలనుకుంటే, మీరు అయొడీన్ స్ఫటికాన్ని తీసుకుని చెప్పారు, ‘యీ పదార్థపు అతి సూక్ష్మ భాగం అణువు. యిందులో అయొడీన్ పరమాణువులు రెండు వుంటాయి.
ఒక పదార్ధపు అణువులో సరిగ్గా ఒక్కలాగే వుండే పరమాణువులు రెండు వుండవచ్చునని మనకిప్పుడు తెలిసింది. రెండు పరమాణువుల అణువులు చాలా వున్నాయి. మీ చుట్టూతా అలాంటివి వున్నాయి. సరిగ్గా యీ క్షణంలోనే మీరీ పుస్తకం చదువుతూ వుండగానే రెండు పరమాణువుల అణువులు మీ చుట్టూతా సుళ్లు, తిరుగుతున్నాయి. మీ ఊపిరి తిత్తుల్లోకి చొచ్చుకు పోతున్నాయి.

మీకే తెలిసే వుంటుంది నేను గాలి అణువుల గురించి మాట్లాడుతున్నానని. యింకా ఖచ్చితంగా చెప్పాలంటే నత్రజని అణువు, ఆమ్లజని అణువులు. గాలి అధిక భాగం యీ అణువులతోనే తయారైంది.’మేం ప్రాణవాయువు (అమ్లజని)ని పీలుస్తున్నాం’ అని మనుషులు అన్నప్పుడు, వాళ్ల ఉద్దేశ్యం రెండు పరమాణువులున్న ప్రాణవాయువు అణువులన్నమాట. బాగా జబ్బుగా ఉన్న వాళ్లకిచ్చే ప్రాణవాయువు తిత్తుల్లోనూ, పీడనకి గురిచేసిన ప్రాణవాయువు ఉక్కు గొట్టాల్లోనూ, రోదసీ రాకెట్లకి ఇంధనంగా ఉపయోగించే ద్రవ రూప ప్రాణ వాయువులోనూ అలాంటి అణువులుంటాయి.

అవి రెండు పరమాణువుల అణువులని నేను నొక్కి చెప్తున్నానే, యెందుకని? యింకా వేరే వున్నాయా? ఆః, వున్నాయి.మూడు పరమాణువులున్న ప్రాణవాయువు అణువులు తుఫాన్లు అప్పుడు యేర్పడతాయి. ‘యిది ‘ఓజోన్’ వాసన వేస్తోంద’ని జనం అంటారు. పరిచితమైన రెండు పరమాణువుల అణువు వాయువు కంటే మూడు పరమాణువుల ప్రాణవాయువు అణువు ఉన్న గాలి యెంతో భిన్నంగా వుంటుంది. దానికి ఇంకో పేరు కూడా వచ్చింది ‘ఓజోన్’ అని.ప్రాణవాయువుకి వాసన లేదు. కాని ఓజోన్కి ఘాటు వాసన వుంది. గ్రీకు భాషలో యీ పదానికి ‘వాసన వున్న’ అని అర్థం.ప్రాణవాయువుకి రంగు లేదు. మనం దాన్ని
చూడలేం. కాని ఓజోన్ని చూడగలం. యిది నీలి రంగు వాయువు.

మనం ప్రాణవాయువుని పీలుస్తాం. కాని ఓజోన్ని పీల్చడం ప్రమాదం. గాలిలో కాస్తంత ఓజోన్ వుంటే తాజా వాసన వేస్తుంది. కాని బోలెడు వుంటే విషపూరితం చేస్తుంది.ఓజోన్ ప్రాణవాయువు కంటే ఒకటిన్నర రెట్లు బరువెక్కువ.ద్రవ రూప ప్రాణవాయువు లేత నీలం రంగులో వుంటుంది. ద్రవ రూప ఓజోన్ ముదురు ఊదా రంగులో ఉంటుంది.యీ రెండు ద్రవాలూ కరిగే ఉష్ణోగ్రతలు కూడా వేరే మరియీ రెండు పదార్థాల అణువులు అదే రకం పరమాణువులతో తయారయా యన్నది నమ్మడం కష్టమే. కాని మరి అయాయి.
భిన్న రకాల పరమాణువులు కలిసే తీరు ఒకే రకం పరమాణువులతో కలిసి యేర్పడిన అణువులే అంత తేడా వుంటే భిన్న రకాల పరమాణువులు కలిసి యేర్పడ్డ అణువుల్లో మరెంత వైవిధ్యం ఉండాలి! చుట్టూతా వున్న గాలిలో చూడండి.

WATER,

బహుశా మనకి కొన్ని కనిపించవచ్చు. అవును, కనిపిస్తాయి.మీరు వూపిరి వదిలినప్పుడు యే అణువుల్ని బయటికి పంపుతున్నారో మీకు తెలుసా? (చెప్పాలంటే మీరే కాదు, మొత్తం మనుషులూ, జంతువులూ కూడా) అవి మీ పాత నేస్తం బొగ్గుపులుసు వాయువు అణువులు.మీరు సోడా తాగినప్పుడు బొగ్గుపులుసు వాయువు బుడగలు మీ నాలుక మీద చురుక్కుమని తగుల్తాయి. ఐస్క్రీం చల్లగా వుంచే పొడి మంచు
కూడా యీ అణువులతో తయారయిందే. పొడి మంచు ఘనీభవించిన స్థితిలో వున్న బొగ్గు పులుసు వాయువు.

బొగ్గు పులుసు వాయువు అణువులో ఒక కార్బను పరమాణువుకి అటువైపు యిటువైపూ రెండు ప్రాణ వాయువు పరమాణువులుంటాయి. బొగ్గు అంటే కార్బన్ అని మీకు తెలుసు కదా. కాని బొగ్గు ఒక్కటే కాదు. మామూలు పెన్సిలుతో మీరు గీసినప్పుడు కాగితం మీద నల్లని లెడ్ చిన్న చారలు వుండిపోతాయి. యివి కూడా కార్బను పరమాణువులతో యేర్పడినవే. పరమాణువులతో వజ్రమూ తయారవుతుంది. మామూలు మసీ తయారవుతుంది చూడండి! అవే పరమాణవులు, కాని యెంత భిన్నమైన పదార్ధాలు!కాని కార్బను పరమాణువులు పూర్తిగా భిన్నమైన పరమాణువులతో కలిసినప్పుడు మనకి అలాంటి వైవిధ్యభరితమైన పదార్ధాలు వస్తాయి.

మనం వాటిని లెక్క పెట్టలేం కూడా. ముఖ్యంగా కార్బపరమాణువులు అతి తేలిక వాయువు ఉదజని పరమాణువులతో కలిసినప్పుడు. యీ పదార్థాలు ఉదజని కార్బన్లు (హైడ్రోకార్బన్లు) అనే సాధారణ నామంతో వ్యవహారంలో వుంటాయి గాని, వాటిల్లో ప్రతి దానికీ ఒక్క పేరు ఉంది.అతి సామాన్య ఉదజని కార్బన్ వంటింట్లో గాస్ పొయ్యి మండించే వాయువు – మీథేన్. మీథేన్ వాయువు ఒక అణువులో ఒక కార్బన పరమాణువూ నాలుగు ఉదజని పరమాణువులూ ఉంటాయి. వాయువు మండినప్పుడు మీథేన్ అణువులు వికీర్ణం చెందుతాయి. ప్రతి కార్బను పరమాణువు రెండు ప్రాణ వాయు పరమాణువులతో కలుస్తుంది. ఫలితం బొగ్గువులును వాయువు అణువు. ఉదజని పరమాణువులు కూడా ప్రాణవాయువు పరమాణువులతో కలుస్తాయి. మనకి ప్రపంచంలో అత్యంత అవసరమైన, ముఖ్యమైన పదార్థపు అణువులు లభిస్తాయి.

యీ పదార్థపు అణువులు గాలిలో కూడా వున్నాయి. గాలి వాటితో నిండిపోయి ఉంది. మీరూ గాలిని వాటితో నింపుతున్నారు. మీరు బొగ్గుపులుసు వాయువు అణువులతో బాటుగా గాలిలోకి వాటిని వదులు తున్నారు. యే పదార్ధం యిది ?ఇంకా వూహించకపోతే చల్లని గాజులోకి వూదండి. అదుగో! WATER అణువులు ఎలా కలుస్తాయి, విడిపోతాయి.శీతకట్టులో నదిలో, సరస్సులో, చెరువులో WATER అతి అద్భుత ధర్మాల్లో ఒకటి కనిపిస్తుంది.

గడ్డకట్టిన మంచు కనిపిస్తుంది. అది ఘనీభవించిన WATER. మంచు కింద ద్రవ రూపంలోని WATER వుంటుంది. మంచు పైన నీటి ఆవిరి వుంటుంది. గాలిలో యెప్పుడూ WATER ఆవిరి వుంటుంది. యిందులో అంత వింత యేముంది? యిది: ఘన, ద్రవ, వాయు రూపాల మూడు దశల్లోనూ స్వాభావిక పరిస్థితుల్లో భూమ్మీద కనిపించే ఒక్క పదార్థమూ WATER .యీ మూడు దశలూ యెలా విభేదిస్తాయో, యెలా పోలిక కలిగి వుంటాయో చూద్దాం.గట్టి పదార్థాన్ని ముందు పరిశీలిద్దాం. మీరు దేన్నైనా బద్దలు కొట్టాలనుకోండి మీరు శక్తిని ఉపయోగించవలసి వుంటుంది. ఒక్కొక్కప్పుడు కొంచెం యెక్కువగానే. యీ విషయం మీకు తెలుసు. దీన్నించి మన మొదటి సూత్రీకరణ చేద్దాం. ఘన పదార్థంలో అణువులు గట్టిగా కలసే వుంటాయి. లేనట్లయితే ఘన పదార్ధం అని పిలిచే ప్రతీదీ యెప్పుడో ముక్కలుముక్కలై పోయేది.

WATER,

గ్రామఫోను రికార్డు, మీరు కరిగిస్తేనో, బద్దలు కొడితేనో తప్ప దాని ఆకారం అలానే వుంటుందని మీకు తెలుసు. ఒక క్యూబ్ క్యూబ్ లాగానే వుంటుంది. గొట్టం గొట్టం లాగే వుంటుంది. గోళం గోళం లాగే వుంటుంది. వేరే మాటల్లో చెప్పాలంటే యే ఘనపదార్ధంమైనా తన రూపం అలానే వుంచుకుంటుంది. దీని నుంచి రెండవ సూత్రీకరణ చేద్దాం. ఆ ఘన పదార్థం లోపల పరిపూర్ణమైన క్రమం వుంది. సైన్యంలో బారులు తీరిన జవాన్లలాగా ప్రతి అణువుకీ దాని స్థానం వుంది. సైనికులు తమ తమ స్థానాల్లో వున్నంతకాలం ఆ నిర్మాణానికి ఖచ్చితమైన రూపం వుంటుంది.

కడగా మీకు బాగా తెలుసు, ఘన పదార్థాన్ని పిండడం కష్టమని. దాన్ని బట్టి ఏమి తెలుస్తుంది? అంటే ఘన పదార్థంలోని అణువులు, పొద్దు తిరుగుడు పువ్వులోని గింజల్లాగా, దగ్గరగా కిక్కిరిసిపోయి వుంటాయి.
పొద్దు తిరుగుడు పువ్వులోని గింజల్ని తీసుకుని ఒక గ్లాసులో పెట్టామనుకోండి. యిప్పుడు ద్రవ పదార్థంలోని అణువులు లాంటి కచ్చితమైన క్రమంలో లేవు, కాని అవి దగ్గరగా కిక్కిరిసి వున్నాయి. యీ కారణంగా ద్రవాన్ని పిండడమూ కష్టమే. యీ ప్రయోగం చేసి చూడండి. ఒక పిచికారీ గొట్టాన్ని నీళ్ళతో నింపండి. బయటి ద్వారం మూసెయ్యండి. పిస్టన్ని నొక్కి ప్రయత్నించండి. మీ వల్లగాదు. అంచేత ద్రవాల్లో కూడా అణువులు దట్టంగా ముసురుకుని వుంటాయన్నమాట.కాని అవి గట్టిగా కలిసిపోయి వున్నాయా? అలా కనిపించవు. యేమంటే ద్రవం పెద్ద

బిందువులుగా, చిన్న బిందువులుగా చెదురుతుంది కదా. అయినా ఒక సూక్ష్మ బిందువులో యెన్ని అణువులున్నాయో తెలుసా? అనుకోవాలంటేనే భయం వేస్తుంది. కోటానుకోట్లు! అంటే, ద్రవాలల్లో కూడా దగ్గరి దగ్గరి అణువులు గట్టిగా ఒక దాన్ని ఒకటి పట్టుకుంటాయన్నమాట. లేనట్లయితే ద్రవ ప్రవాహం చిన్న చిన్న బిందువుల్లా కాకుండా విడి అణువులుగా చెదిరి పోవును. ఒక ద్రవం, ఒక ఘనం కొన్ని విధాలుగా ఒకలాగే వున్నాయని యిప్పుడు మనకి తెలుసు.

రెండింటిలోని అణువులూదగ్గరగా కిక్కిరిసి వున్నాయి. పక్క పక్కల అణువులు ఒక దాని కొకటి గట్టిగా పట్టుకుని వుంటాయి.కాని ద్రవానికీ ఘనానికీ మధ్య ఒక ముఖ్య భేదం వుంది. ద్రవ పదార్థంలోని అణువులకి ఘన పదార్థంలోని కణాలంత క్రమశిక్షణ లేదు. ద్రవం తన ఆకారాన్ని నిలుపుకోదు, మామూలుగా చెప్పాలంటే ప్రవహిస్తూ వుంటుంది.యిప్పుడు ద్రవాన్నీ, వాయువునీ పోల్చి చూద్దాం. సైకిలు టైరులో మీరు యెప్పుడైనా గాలి కొట్టారా? అయితే మీకు తెలుసు గాలిని పిండడం సులభమని. మనం గట్టిగా నొక్కగలిగితే ఒక లీటరు గాలిని ఓ పెన్కోప్లోకి పంపెయ్యగలం. https://photos.app.goo.gl/iTE1fmZpncZT4bHj9

ఎందుకో మీకుతెలుసుననుకుంటాను. గాలి అణువుల మధ్య పెద్ద పెద్ద జాగాలుంటాయి. మీ గదిలో పక్క పక్కన వున్న రెండు అణువుల మధ్య దూరం సుమారుగా ఒక అణువు పరిమాణం కంటే పదింతలు వుంటుంది. ద్రవాన్నీ, వాయువునీ మరో కోణం నుంచి చూద్దాం. ఒక పాలీథేన్ పేకెట్లోని అర లీటరు పాలు తీసుకుని ఓ సీసాలోకి పొయ్యండి. అయినా మనకి ఆ అర లీటరు పాలే వుంటాయి. ఏ పాత్రలోకి ఆ పాలను పొయ్యండి అదే పరిమాణం వుంటుందంతే.

వాయువు ఎలా ప్రవర్తిస్తుంది? వాయువుకి నిర్దిష్టమైన పరిమాణం లేదు. వాయు అణువులు అన్ని వైపులకి పరిగెత్తిపోతూ వుంటాయి, వాటికి ఓ గది గోడలో, పాత్ర ఆకారాల్లో అడ్డం రానంత వరకూ, వాయువుతో వున్న ఓ గొట్టాన్ని బాహ్య రోదసిలో తెరిచామనుకోండి వాయువు అణువులు విశ్వం అంతటా యెగురుకుంటూ పోతాయి. దీన్నుంచి మనం ఓ ముఖ్య సూత్రీకరణ చెయ్యవచ్చు. వాయు అణువుల్ని యేదీ దగ్గరగా వుంచలేదు.

అంచేత మనకి ఏం తెలిసిందన్నమాట? ఘనపదార్థంలో గాని, ద్రవపదార్థంలో గాని దగ్గరి అణువులు ఒక దానికొకటి సమీపంగా వుండి గట్టిగా కలిసి వుంటాయి. కాని వాయువులో ఒక దానికొకటి దూరంగా వుండి, అసలు కలవవు. మరో ముఖ్య సూత్రీకరణ మనం చేస్తాం. అణువులు ఒక దాని కొకటి గట్టిగా పట్టుకొని వుంటేట్టు చేసే శక్తులు దగ్గరి దూరంలో మాత్రమే వర్తిస్తాయి. భౌతికాశాస్త్రంలో యీ శక్తుల్ని అణు సంయోజక శక్తులు అంటారు.

చిన్న బల్లి కింద పడకుండా నున్నటి గోడలమీద, కప్పుమీదా కూడా యెలా పరుగెత్తగలదో అని బహుశా చాలా సార్లు అనుకున్నారు మీరు. దాన్ని జారిపడిపోకుండా చేసేది ఏమిటి?బల్లి కాళ్ళమీద కుంచెలు వున్నాయి. అవి కోట్లాది సూక్ష్మమైన వెంట్రుకలతో చేసినవి. అతి చిన్న బీటల్లో అవి చొచ్చుకుపోతాయి. కంటికి కనిపించని అంత చిన్న బీటలు అతి నున్నగా వున్న ఉపరితలం మీద కూడా వున్నాయి. ఈ క్రమంలో వెంట్రుకల అణువులు ఈ ఉపరితలంలో వున్న అణువులతో యెంతో సన్నిహితంగా కలుస్తాయి. వాటి మధ్య అణువు సంయోజక శక్తులుపనిచేయ నారంభిస్తాయి.అంటే బల్లి పడిపోకుండా దాన్ని గోడమీద పట్టుకొనేవి చాలా మంది అనుకున్నట్టు చోషకాలు కాదు, అణు సంయోజక శక్తులు.

అయితే వాయు అణువులు యెన్నడూ దగ్గరగా రావా? తప్పకుండా వస్తాయి. అవి ఒక దాన్ని ఒకటి మళ్ళీ మళ్ళీ ఢీ కొంటూ వుంటాయి. మీ గదిలోని గాలి అణువులు ప్రతి ఒకటీ సెకనుకి నాలుగు బిలియన్ల సార్లు ఢీ కొంటున్నాయి!యిన్ని భేటీలతోటి గాలి అణువులు ఆఖరికు కలిసిపోయి బిందువులుగా, స్పటికాలుగా అయిపోవాలి కదా. అవి మేఘాల కింద పొగమంచుకింద యేర్పడి వాన రూపంలో నేల పైకి యెందుకు నీటి అణువుల్లాగా రావు? ద్రవ ప్రాణవాయువుల సెలయేళ్ళు యెందుకు లేవు? లేదా ద్రవ నత్రజని ప్రాతఃకాల తుషారాలు యెందుకు లేవు? లేకపోతే ఘన బొగ్గుపులుసు వాయువు మంచు గాని, హిమ మైదానాలు గాని యెందుకు లేవు? ఒక దాని నొకటి సమీపించినప్పుడు యీ వాయువుల అణువులు కలిసిపోవడం దేనివల్ల అసాధ్యం అవుతోంది?

వాటి వేగం. మీ గదిలో వున్న ప్రాణవాయువు, నత్రజని అణువులు సెకనుకి అర కిలోమీటరు వేగంతో పరిగెత్తుతున్నాయి. అంటే గంటకి 1800 కిలోమీటర్లన్న మాట. అంటే మళ్ళీ శబ్దం వేగానికి ఒకటిన్నర రెట్లు యెక్కువ అన్న మాట. (సెకనుకి అరకిలోమీటరు సగటు వేగం. కొన్ని అణువులు యింకా వేగంగా వెడతాయి. కొన్ని మెల్లిగా వెడతాయి.)అణువులు బ్రహ్మాండమైన వేగంతో ఢీ కొనేటప్పుడు వాటికి కలిసే వ్యవధి వుండదు. ఒక దాని మీద ఒకటి బిల్లియర్డ్ గుళ్ళలాగా యెగురుకుంటూ పోతాయి.

వాయువు అణువులని యెలా దగ్గరగా కలపాలో యిప్పుడు మీకు అర్థమవుతుంది. వాటి వేగాన్ని తగ్గించాలి. యే విధంగా? వాయువుని చల్లబరచడం ద్వారా అలా చెయ్యవచ్చు. ఏమంటే ఉష్ణోగ్రత యెక్కువ అయేకొద్దీ అణువులు వేగంగా కదులుతాయి. ఉష్ణోగ్రత తక్కువ అయ్యేకొద్దీ వాటి గమనం వేగం తగ్గుతుంది. యే వాయువునేనా గానీ ద్రవంగా మార్చేటట్టు, యింకా చెప్తే ఘనంగా మార్చేటట్టూ కూడా, చల్లబరచవచ్చు. ఘన పదార్థంలోనూ, ద్రవ పదార్థంలోనూ కూడా అణువులు కదులుతూ వుంటాయి, కాని మెల్లిగా, వాయువులో మాదిరి అవి యెగరవు. ఘన పదార్థంలో అవి ఒకే చోటులో గెంతుతూ వుంటాయి. ద్రవపదార్థంలో అణువులు ఒకే చోటులో నాట్యం చేసి తర్వాత ఒక గెంతు గెంతిమరో చోట్ల నాట్యం చేసి తర్వాత యింకొ మూడో చోట మళ్ళీ గెంతి నాట్యం చేస్తాయి. అలా జరుగుతూనే వుంటుంది.

అతి శక్తివంతమైన అణువులు ద్రవపదార్థం ఉపరితలంమీదకి వస్తాయి. తర్వాత అవి పొరుగు అణువులనుంచి విడిపోయి యెగిరిపోతాయి. యిలా జరిగినప్పుడు ద్రవం ఆవిరి అయిపోతోందని మనం అంటాం. ద్రవాన్ని గనక మరిగే ఉష్ణోగ్రత దాకా తీసికెడితే పైన వున్న అణువులేగాక లోపల వున్న అణువులు కూడా పొరుగువాటి నుంచి విడిపోతాయి. యిలా ఎక్కువసేపు జరిగితే మొత్తం అంతా ఆవిరైపోతుంది. ఆవిరే వాయువు.

WATER అణువులు ఎలా కలుస్తాయి?

చిత్రం యేమిటంటే ప్రాణవాయువు అణువులు బె మైనస్ 183 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర బిందువులుగా కలవడం మొదలుపెడతాయి, నత్రజని అణువులు యింకానూ మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర. కాని WATER ఆవిరి అణువులు ప్లస్ 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కలవడం మొదలు పెడతాయి. సున్న డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ప్రాణవాయువు గాని, నత్రజని గాని ద్రవాలు కానే
కావు. WATER అప్పుడే ఘనీభవించడం మొదలు పెడుతుంది. మంచు అయిపోతోంది.

అలా యెందుకు జరుగుతుంది? WATER ఆవిరి అణువులు గాలిలో వున్న తమ పొరుగు ప్రాణవాయువు, నత్రజని, బొగ్గుపులుసు వాయువు అణువుల కంటే యింకా మెల్లిగా యెగురుతాయా? వూహూ సరిగ్గా దానికి వ్యతిరేకం. WATER అణువులు యింకా వేగంగా కదులుతాయి. అవి ప్రాణవాయువు అణువుల కంటే, నత్రజని అణువుల కంటే రెండింతలు తేలిక, యిక బొగ్గుపులుసు వాయువు అణువుల కంటే యెంత తేలికో చెప్పనే అక్కర్లేదు. యేం జరుగుతుంది? ప్రాణవాయువు, నత్రజని, బొగ్గుపులుసు వాయువు సహజ పరిస్థితుల్లో వాయువులుగా వుండిపోతే నేలమీద నీరు వాయువుగా వుండడానికీ అంతే హేతువు వుంది. కాని అలా లేదని మీకూ నాకూ తెలుసు.

WATERఅణువులు అవి బ్రహ్మాండమైన వేగంతో ఢీ కొంటూ వున్నా బిందువులుగా, స్పటికాలుగా వాటిని కలపడానికి కొన్ని శక్తులు సహకరించాలి. యీ శక్తుల కారణంగా నీటి అణువుల ఢీ కొన్నప్పుడు బిలియర్డ్ గుళ్ళలాగా చరించవు. అవి పల్లేరు కాయల్లాగా చేస్తాయి. మీకు తెలుసుగా పల్లేరుకాయలు ఒక దానికొకటి అంటి పెట్టుకుపోతే వాటిని విడదీయడం కష్టం.

యేమిటీ శక్తులు?

WATER అణువులోని రెండు ఉదజని పరమాణువులు చెవులల్లాగా కనిపిస్తాయి.WATER కి గల అసాధారణ ధర్మాలతో వాటికి యేదో సంబంధం వుంది.వీటిల్లో ప్రతి ‘వి’కి టార్చిలైట్లు బాటరీ సెల్కి ఓ పక్కన వుంటుందే. ప్లస్ (+) గుర్తు దాన్ని యివ్వవచ్చు. WATER అణువుకి అవతలి వేపున వున్న భాగానికిబాటరీ సెల్ అటు వేపు వుంటుందే మైనస్ (-) గుర్తు దాన్ని యివ్వవచ్చు. ఒక నీటి అణువు విద్యుత్ నిండిన కణంలా కనిపిస్తుంది. విద్యుత్ శక్తితో నిండిన కణాలు ఒక దాని కొకటి యెలా కలుసుకుంటాయో చూడాలంటే యిలా చేసి చూడండి. ఓ ప్లాస్టిక్ దువ్వెనతోటి తల దువ్వుకుని అప్పుడు ఆ దువ్వెనని చిన్న చిన్న కాగితం ముక్కల దగ్గర పెట్టిండి. అవి దువ్వెన కేసి యెగురుతాయి.

WATER అణువులని దగ్గరగా వుంచడానికి పనికొచ్చే విద్యుత్ శక్తులు వాటిని మరింత యెక్కువ శక్తితో, సాదా అణు సంయోజక శక్తుల కంటే యెక్కువ శక్తితో, వాటిని కలిపి వుంచుతాయి.ఈ విద్యుత్ శక్తులే లేకపోయినట్లయితే మంచు వుండేది కాదు, నదులు గాని మహాసముద్రాలు గాని వుండేవి కాదు. WATER వాయువు అయిపోవును.!https://pincodesguide.in/water-pollution-is-about-to-spell-death/

WATER అణువులు యితరఅణువులతో ఎలా కలుస్తాయి?

మందు వేసుకునే ఇంక్ఫెల్లర్ లాంటి దాన్ని తీసుకొని అందులోకి నీళ్ళని లాగి జాగ్రత్తగా చూడండి. నీటిపై ఉపరితలం చదునుగా వున్నట్లు లేదు. మధ్యలో వంపు వుంది. గాజు అంచుల దగ్గర నీరు యెత్తు వుంది. మధ్యలో కంటె.WATER గ్లాసులో గాని, గాజు జాడీలో గాని మరే యితర గాజు పాత్రలో గాని అలానే వుంటుంది. కాని గొట్టంలో దాన్ని యిలా గుర్తించడం సులభం. అంచుల దగ్గర నీరు లేచింది. యిలా దేనివల్ల జరిగింది? మీరు వూహించి వుంటారు. WATER అణువులు తాము ఒక దానికొకటి అతుక్కుపోయే దానికంటే యెక్కువగా గాజు ఉపరితలానికి అతుక్కుపోతాయి. వేరే మాటల్లో చెప్పాలంటే నీరు గాజుని
తడుపుతుంది.

అంచుల దగ్గర WATER యింకా ఎత్తుగా యెందుకు లేవదు? దాని బరువు లేవనివ్వదు. గాజుతో కలిసే శక్తులు నీటి అణువుల్ని పైకి లేపితే, గురుత్వాకర్షణ శక్తి దాన్ని కిందికి లాగుతుంది. నీరు గాజుతోబాటుగా అనేక వస్తువుల్ని తడుపుతుంది. పింగాణీని, లోహాల్ని, అనేక ఖనిజాల్ని, ముఖ్యంగా సుద్దని, జిప్సమ్ని తడుపు తుంది.WATER అణువులు ఒక దానితో ఒకటి కలిసే దాని కంటే తక్కువ శక్తితో కలిసే పదార్థాలు యేమన్నా వున్నాయా? బోలెడు. వాటిలో కొన్ని గంధకం, కార్బను, మైనం, పారఫిన్, మసి, ఉ నాఫ్తలీన్, పాలీథేన్, యే కొవ్వు సరుకేనా గానీ, WATER వీటిని తడపలేదు.

రోదసీ నౌకలో వాడ్డం కోసం ఒక మంచి WATER డ్రమ్ము నమూనా చెయ్యమన్నారనుకోండి. యే పదార్థాలని మీరు వాడతారు? WATER కి తడిసే వాటినా లేక నీటికి తడవకుండా జారిపోయే లాంటి వాటినా?
రోదసి నౌకకి గురుత్వాకర్షణ శక్తి వుండదు. అంచేత WATER కారదు. అణువులు సంయోజనక శక్తి యేమైంది? కాని అణు సంయోజక శక్తులు మామూలుగానే చరిస్తూ వుంటాయి. దీన్నిగురించి యిక నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అర్థం అయింది. అణువులని దగ్గరగా వుంచే శక్తులు రోదసిలో పని చెయ్యకపోతే రోదసిలోకి పంపిన రాకెట్లు వాటిలోవున్న ప్రతిదీ విడివిడి అణువులుగా వికీర్ణం అయిపోతుంది.

WATER అణువులు తమకి ఒక దాని కొకటి అంటి పెట్టుకునే కంటే ఎక్కువ శక్తితో అంటిపెట్టుకునే పదార్ధంతో డ్రమ్ముని తయారు చేశారనుకోండి. ఉదాహరణకి గాజుతో చేశారనుకోండి. యేం జరుగుతుంది?WATER మొత్తం డ్రమ్ము ఉపరితలాన్ని తడిపేస్తుంది. పల్చని పొరతో కప్పేస్తూ, యింకా యేమంటే మీరు గనక మూత తెరిస్తే కొంత WATER డ్రమ్ములో నుంచి బయటికి పోయి, గోడలకి యెగబాకి డ్రమ్ము పై భాగాన్ని కూడా కప్పేస్తుంది. మీకు డ్రమ్ము లోపల నీళ్ళుండవు. నీళ్ళ లోపల డ్రమ్ము వుంటుంది.

యిప్పుడు మీరు గనక WATER తడపలేని పదార్థంతో డ్రమ్ముని తయారు చేసారనుకోండి, అంటే ఉదాహరణకి పాలీథేన్తో యేమవుతుంది? డ్రమ్మునే కాదు, కొళాయిని కూడా. యిప్పుడు WATER డ్రమ్మునుంచి తనకిగా బయటికి రాలేదు. మీరు పూర్తిగా కొళాయిని తెరిచిన ఒక్క చుక్క కూడా బయటికి రాదు. భూమ్మీద WATER అందులోనుంచి బయటికి కారుతుంది. యేమంటే ఆకర్షక శక్తి వల్ల. కాని రోదసిలో నీటికి బరువు వుండదు, అది ఒలకదు.

అయితే డ్రమ్మునుంచి నీటిని యెలా తీసుకుంటాం? గొట్టంతో పీల్చి లేదా టూత్ పేస్ట్ ట్యూబ్ నుంచి పేస్ట్ని నొక్కినట్టుగా డ్రమ్ముని నొక్కి అంచేత మనకి యెలా పడితే అలా వంగే పాలీథేన్ చిన్న మూతితో వుండాలి. రోదసీ యాత్రీకుడికి నీళ్ళు కావలసివస్తే ఆ మూతిని నోట్లో పెట్టుకుని నొక్కుతాడు, నీళ్ళు యెంచక్కా నోట్లోకి వస్తాయి.

నీరు ఎప్పుడు తడి చేస్తుందో, ఎప్పుడు చెయ్యదో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో చూశారా. అణువులు అన్ని వేళలా యెలా ప్రవర్తిస్తాయో మనం తెలుసుకుని వుండాలి.ప్రతిదాన్నీ తడిపేటట్టు నీటిని యెలా చెయ్యగలం.

నీరు కొన్ని వస్తువులనే తడిపేదిగా, మరి కొన్నిటికి తడపనిదిగా యెందుకు వుంది? నీటి అణువుల తమకి ఒక దాన్ని ఒకటి అంటి పెట్టుకునే దానికంటే కొన్ని వస్తువుల అణువులకి యెక్కువ శక్తితో, కొన్ని వస్తువుల అణువులకి తక్కువ శక్తితో యెందుకు అంటి పెట్టుకుంటాయి?

నీరు తడిపే పదార్థాలని, నీరు తడపని పదార్థాలని శాస్త్రజ్ఞులు అధ్యయనం చేసినప్పుడు వాళ్ళు యీ కింది వాటిని ఆవిష్కరించారు. నీరు తన అణువుల మాదిరి విద్యుత్ తో నిండిన అణువులు వున్న పదార్థాలయితే తడుపుతుంది. అంటే వాటి అణువులమీద టార్చ్ లైట్ బాటరీ సెల్మీద లాంటి ప్లస్, మైనస్ గుర్తు పెట్టగలిగితే. విద్యుత్ నిండిన అణువులుగా అవి ఈ నీటి అణువుల్ని ఆకర్షిస్తాయి.

విద్యుత్లోని మామూలు అణువులు అయితే? అవి తమ వంటి వాటినే, విద్యుత్లోని వాటిని, ఆకర్షించేటట్టు కనిపిస్తోంది. పాల పాకెట్టుని పారాఫిన్ పూసిన కాగితంతో తయారుచేస్తారు. అలాంటి కాగితాన్ని నీరు తడపలేదు. కాని నూనె అయితే పారఫిన్ కాగితానికి అంటుకుంటుంది.విద్యుత్ లేని అణువులున్న పదార్థాన్ని నీరు తడిపేటట్టు చెయ్యవలసిన పనిబడిందనుకోండి. యిది సాధ్యమే.సాధ్యమే కాని మొదటగా, కొన్ని దక్షిణ దేశాల్లోని చేపలు పట్టేవాళ్ళు సముద్రంలో తాబేలుని యెలా పడతారో చెప్తాను.
తాబేలు పైన వుండే చిప్ప నున్నగా జారుతూ వుంటుంది. దాన్ని పట్టుకుని వుండడం అసాధ్యం.

చేపలు పట్టే వాళ్ళు వీపు మీద చోషకమున్న చేపని తీసుకుంటారు. ఆ చేపలు యెప్పుడూ షార్క్ చేపకో, తిమింగలానికో, తాబేలుకో అంటిపెట్టుకునే వుంటాయి. వాళ్లు చేప తోకని తాటితో కట్టేసి యీదడానికి వదులుతారు. ఆ చేప తాబేలు దగ్గరికి రాగానే దాన్ని అంటుకుపోతుంది. అప్పుడు చేపల వాళ్ళు తాబేలుని పడవలోకి లాగుతారు.

చేపలాగా వుండే అణువు ఒకటుంది. ఒక చివర అది విద్యుత్తో నిండి వుంటుంది. రెండో వైపున వుండదు. నీటి అణువు విద్యుత్ నిండిన వైపు పట్టుకుంటుంది. రెండో వైపు నీటి అణువు అంటుకోలేని అణువుని పట్టుకుంటుంది. అంటే కొవ్వు అణువు లాంటి దాన్ని యిప్పుడు నీరు కొవ్వుని తప్పించెయ్యగలదు. దేన్నుంచి? దేన్నుంచేనా. జిడ్డుగా వుండే పాత్రనుంచి. లేదా చర్మం మీదనుంచి. మీ చేతులకి జిడ్డు అంటుకుంటే నీళ్ళు కడగలేవు. కాని మామూలు సబ్బు ముక్కని తీసుకుంటే, సబ్బు యిప్పుడు మీకు చెప్పానే చేప, అలా చేస్తుంది.

నురగ వల్ల సబ్బు నీళ్ళు కడుగుతాయని చాలా మంది అనుకుంటారు. నురగ బుడగలు మురికిని లాక్కుంటాయని వాళ్ళు అనుకుంటారు. కాని వాళ్ళు తప్పు. యిప్పుడు మీకు తెలుసు. కొన్ని సబ్బులనుంచి నురగలు రావు. ఆముదం సబ్బు ఒకటి. కాని అవి యితర సబ్బుల్లాగానే శుభ్రం చేస్తాయి.
అంచేత సబ్బు అణువులు నీటిలోకి పోగానే అవి నీటిని తడిపే గుణం వచ్చేటట్టు చేస్తాయి. మామూలుగా నీరంటే భయపడే పదార్థాలని కూడా. యితర అణువులు నీటిమీద యెలా ప్రవర్తిస్తాయి?
ఈ ప్రయోగం చేసి చూడండి. మామూలు నీటిని కొద్దిగా తీసుకోండి. పంచదార కలిపిన నీటిని కొంచెం తీసుకోండి. ఇంక్ఫెల్లర్తోటి శుభ్రంగా వున్న ఉపరితలంమీద రెండు చుక్కల్నీ- ఓ చుక్క మామూలు నీటినీ, ఓ చుక్క పంచదార నీటినీ – పక్కపక్కన వెయ్యండి. యీ చుక్కా, ఆ చుక్కా యెలా కనిపిస్తున్నాయో చూడండి.

ఆకులమీదా, గడ్డిమీదా వుండే మంచు బిందువుల మాదిరి చిన్న ముత్యంలాగా ఓ చుక్క కనిపిస్తే అది ఆ ఉపరితలాన్ని చెమ్మ చెయ్యడం లేదన్నమాట. ఆచుక్క వ్యాపిస్తూ వుంటే నీరు దాన్ని బాగానే తడుపుతున్నట్టు. ఆ చుక్కలని చూసి నీరు చెప్పగలరు యే నీటి చుక్క ఎక్కువ తడుపుతూ వుండీ అని, మామూలు నీటి చుక్కో పంచదార నీటి చుక్కో.యిదే ప్రయోగాన్ని మీరు ఉప్పుతోటి, నిమ్మ రసంతోటి, సోడాతోటీ, గ్లిజరిన్తోటి లేదా మరి


దేనితోనైనా గానీ చెయ్యవచ్చు. అవి నీటిలో కరిగే పదార్థాలైనంతకాలం. అప్పుడు మీకు తెలుస్తుంది యీ వస్తువులలో యేది నీటి ని తడిపే గుణాన్ని ప్రభావితం చేస్తుందో. అణువులు లేని పదార్థాలు యెలా నిర్మితమయ్యాయి ? మొదట్లో నేను పరమాణువుల్ని వర్ణమాల అక్షరాలతో పోల్చిచూపించాను. అక్షరాలు మాటలుగా కలిసినట్టు పరమాణువులు అణువులుగా కలుస్తాయని మీకు యిప్పుడు తెలిసింది. అణువులతో తయారు చేసిన పదార్థాల గురించి తెలుసుకున్నారు.అయినా ప్రపంచంలో బోలెడు పదార్థాలకి అణువులు లేవు. అవి యింకో మాదిరిగా తయారవుతాయి.ఉదాహరణకు గ్రాఫైట్. అది పొరల వలగా అమర్చిన కార్బను పరమాణువులతో తయారైంది.

ప్రపంచంలో అతి ధృడంగా వున్న పదార్థం వజ్రం కూడా కార్బను పరమాణువులతో తయారైందే. అవి చాలా ఖచ్చితంగా తమ మధ్య ‘అతకబడి’ వున్నాయి. కాని గ్రాఫైట్ కంటే వేరే విధంగా వలగా కాక, అల్లికగా తయారైంది. ఈ పరమాణు అల్లికని కూడా వేరు వేరు అణువులుగా విభజించలేం. అన్ని లోహాల పరమాణువులు కూడా అల్లికగా కలిసివున్నాయి. వాటిలో కూడా ప్రత్యేక అణువులు లేవు.యిప్పుడు ఒక ప్రయోగం చెయ్యండి. ఉప్పుని నీళ్ళలో కరిగించండి. ఈ కరిగిన ఉప్పు నీళ్ళని పళ్ళెంలో పోసి ఇంకి పోయేదాకా ఆగండి. పళ్ళెంలో మీకు చిన్న పారదర్శకమైన ఉప్పురాళ్ళు కనిపిస్తాయి. యివి ఉప్పు స్పటికాలు.

యిక్కడ కూడా పరమాణువుల అల్లికే, కాని అణువులు లేవు! వజ్రానికి, లోహాలకి భిన్నంగా ఉప్పు స్పటికంలో వేరు రకాల పరమాణువులతో సోడియం పరమాణువులు, క్లోరిను పరమాణువులతో తయారైంది. అంతే.సోడియం వెండి రంగు లోహం. చాలా తేలిక (నీటికంటే తేలిగ్గా వుంది) క్లోరీను బరువైన వాయువు, ఆకుపచ్చ రంగు, ఘాటు వాసన వుంది. అది యెంతో విషపూరితమైంది. కాని సోడియం పరమాణువులు, క్లోరీను పరమాణువులు ఒక స్పటికపు అల్లికగా కలిసి వుంటే వాసనలేని, రంగులేని పదార్థం తయారైంది! ఈ కొత్త పదార్థానికీ క్లోరీనుకీ, సోడియంకీ పోలిక లేదు!


చివరకు దేనితో తమ మధ్య, “పరాయి” పరమాణువులతో కూడా – కలవడానికి ఇష్టపడని పరమాణువులు వున్నాయి. అలాంటి కలవలేని పరమాణువులతో తయారైన వాయువుల్ని ‘ఒక పరమాణు వాయువులు’ అంటారు. కాని వాటిలో ప్రతిదానికి తన సొంత పేరు ఉంది. హేలియం, నియాను, ఆర్గాను, క్రిప్టాను, క్సెనాను, రాడాను. ఈ వాయులన్నీ వాతావరణంలో వున్నాయి. కాని సూక్ష్మ పరిమాణంలో.
మన చుట్టూ వున్న పదార్థాల ప్రపంచం యెంత వైవిధ్యభరితంగా వుందో చూశారా? మీ చుట్టూ ప్రతి సెకనుకీ కళ్ళకి కనిపించని పరిణామం చెందుతూ వున్న పదార్థాలలో మీకు ఆసక్తి పుడితే వాటిని గురించి మీరు ఎంతో తెలుసుకోవాలని అనుకుంటే, మీ టీచరుని సాయం అడగండి. ఆయన చూపించిన పుస్తకాల్ని చదవండి. అన్నిటికంటే ఆసక్తికరమైంది- ప్రయోగాల్ని చెయ్యండి. మీరు బహుశా అతి కొత్త అనూహ్య గుణాలు గల పదార్థాలను కనిపెడతారేమో.

<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<< -0->>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

Leave a Comment