POTTI SRIRAMULU IS A GREAT.

Potti Sriramulu was a great warrior of Andhra Pradesh.


POTTI SRIRAMULU.మీరెందరో నాయకుల చరిత్రలు చదివే వుంటారు. యెందరో నాయకుల గురించి తెలుసుకునే వుంటారు. దేశం కోసం అనువులర్పించిన నాయకులెందరో వున్నా, దేశంకోసం నిల్చి చెయ్యగలిగిన కృషిచేసి మళ్ళీ ఆంధ్రులకోసం వారికి ప్రత్యేకరాష్ట్రం కావాలని నిల్చి పోరాడిన మహామనిషి POTTI SRIRAMULU. నిరాహారదీక్షలు చాలామంది చేస్తారు కాని వారి దీక్షలో ఆటంకం కలగడంగాని, మధ్యలో వారి ఆశయం సిద్ధించడంగాని జరుగుతుంది.

POTTI SRIRAMULU,

అందుచేతనే వారివారి దీక్షలు మధ్యలోనే ఆగిపోతాయి. కొన్ని ఆపివేయబడతాయి. ఎవరో ఏదో వాగ్ధానం చేశారని విరమిస్తారొకరు. యేదేదో కార్యక్రమాలు గుర్తుకురావడంగాని, ఏ పిండివంటలో ఏదో కళ్ళ ముందు కన్పించడంగాని కొంతమందికి జరుగుతుంది. కాని ఆశయసిద్ధికోసం ఆమరణ నిరాహారదీక్ష వహించి ఆత్సా ర్పణ చేసిన ప్రముఖులు కొందరే వున్నారు. మెక్స్వినీ, జితేంద్రనాధ్,

POTTI SRIRAMULU, కన్నడ ప్రాంతాలలో ఒక అజ్ఞాతవ్యక్తి మాత్రమేపున్నారు. మెక్స్వినీ ఐర్లాండు దేశా నికి చెందిన వ్యక్తి దేశంకోసం నిలచి స్వాతంత్ర్యంకోసందీక్ష బూని ఆ నిరాహారదీక్షా వ్రతంలోనే కన్నుమూసిన వ్యక్తి ఆయన. జితేంద్రనాధ్ దాస్ బెంగాల్ విప్లవవీరుడు. సాటి ఖైదీల బాధలు చూడలేక వారి సౌకర్యాలకోసం దీక్షబూని 63వ రోజు తనువు చాలించిన వ్యక్తి జితేంద్రనాధ్. ఆయన కున్న మరో పేరుపుంగీ. స్వరాష్ట్రంకోసం దీక్షవహించి ఆత్మ బలిదానంచేసిన వ్యక్తి POTTI SRIRAMULU . ఈయన ఆంధ్రుడు అదే మనకు గర్వకారణం.

POTTI SRIRAMULU,

POTTI SRIRAMULU వంశీయులందరూ పూర్వపుగుంటూరు జిల్లా సరిహద్దు అయిన కనిగిరి ప్రాంతానికి చెందిన వారు వారు ఆర్యవైశ్యులు. అందుచేత కులవృత్తిగా వ్యాపారాన్నే స్వీకరించారు. కాని ఆ ప్రదేశములో వారి జీవనోపాధిగడ్డుగా నుండుటచేత ఆ ప్రదేశాన్ని విడచిపెట్టారు. అక్కడ నుండి మద్రాసుకు దగ్గరలోగల న్యాయపాళెం అనేగ్రామంలో స్థిర నివాసం యేర్పరచుకొన్నారు. పొట్టి అనేది వారి ఇంటిపేరు

పొట్టినారాయణగారి ధర్మపత్ని వెంకమ్మ. వారి సంతా నము మొత్తం అయిదుమంది. వారిలో యిద్దరు మాత్రమే కుమారులు. పొట్టి గురవయ్యగారు, పొట్టి చెంచయ్యగారు. పొట్టి గురవయ్యగారి ధర్మపత్ని మహాలక్ష్మమ్మ. వారికి కలిగిన మొత్తం సంతానం నలుగురు. వారిలో మొదట కుమార్తె, తరువాత ముగ్గురూ కుమారులు జన్మించారు. POTTI SRIRAMULU వారి రెండవ కుమారుడు, అన్న, ఒక తమ్ముడు, ఒక అక్క ఆయన తోబుట్టువులు.

గురవయ్యగారి కాలములో వారికి న్యాయపాలెంలో కొఁతభూమి వుండేది. ఆయనతప్ప మిగిలిన కుటుంబసభ్యులు కష్టించి పనిచేస్తుంటే ఆయనమాత్రం ఇరుగు పొరుగుల తగ వులు తీరుస్తూ కాలాన్ని గడిపాడు. అందుచేత మిగిలినవా రంతా కలిసి గురవయ్యగారిని కట్టుబట్టలతో బయటికి పంపిం చేరారు. అప్పుడు భార్యాబిడ్డలతో కలిసి యిల్లు వదలి వెళ్ళి పోయి మద్రాసు నగరంలో అన్నాపిళ్ళై వీధిలో చేరాడు. ఆయన భార్య మహాలక్ష్మమ్మ మహాసాధ్వి! అన్ని బాధలూ సహించింది. గురవయ్య యెంతో కోపిష్టి, అయినా తట్టుకుని నిలిచింది. ఇల్లువిడిచి వెళ్ళిన స్థితిలో కూడా పుట్టింటివారిని అర్థించక తన కష్టంతోనే జీవించాలని నిశ్చయించుకుంది,

ఆచారప్పన్ వీధిలో ఒక గదిని అద్దెకు తీసుకుని అక్కడొక తిరగలిని అమర్చి ముడిపప్పు, చాయపప్పులు తయారుచేసి అమ్మడం ప్రారంభించింది. అలాంటి వ్యాపారానికి నిజాయితీ కావాలి అదే వారిధనం, క్రమంగా వ్యాపారం రెట్టింపయింది. గురవయ్య మహలక్ష్మమ్మలకు 1901వ సంవత్సరంలో మార్చి 16వ తేదీన POTTI SRIRAMULU జన్మించాడు. కొందరు జులై 1న జన్మించాడని వాదిస్తారు. మహలక్ష్మమ్మకు చక్కనికంఠం వుండేది. చక్కగా పాడేది. పిల్లలు నిద్రపోయే సమయం లోను నిద్రలేచే సమయంలోను మృదువైన మధురస్వరంతో అందరినీ ఉల్లాసపరచేది. పిల్లలను క్రమశిక్షణలో పెంచా లన్నది ఆమె ఆశయం. చదువు సంధ్యలలోను, ఆటపాట ల్లోనూ కూడా క్రమశిక్షణతో మెలగే విధంగా వారిని తీర్చిదిద్దింది.

కుటుంబపరిస్థితులు బాధను కలిగిస్తున్నా ఆ బాధను బయటికి కన్పించకుండా ఉండేలా జాగ్రత్తపడేది. పిల్ల ల మీద ఆ ప్రభావం పడకుండా వుండాలని జాగ్రత్తపడేది. యెంతో పొదుపుగా కుటుంబాన్ని గడుపుకు వచ్చేది. సమయస్ఫూర్తి కష్టసమయాల్లో ధైర్యసాహసాలతో ప్రవర్తించడం బంధువుల పట్ల ఉదారమైన ప్రేమా మమతాభావాలు ఆమెలోని సుగు ణాలని చెప్పవచ్చు. ఆమె ఒక నిజమైన ఆదర్శగృహిణి గా వుండేవాడు. ఆమెపట్ల భక్తిగా నుండి సేవలు చేస్తూ ఆమెకు పనులలో సహకరిస్తూ వుండేవాడు. బాల్యంనుండి కూడా పురాణాలంటే ఆసక్తిగా వినేవాడు. తల్లి వ్యాపారంలో తాను చెయ్యగలిగిన సహాయం చేస్తుండేవాడు. తల్లి లేకుండా ఏ పనికూడా చేసేవాడు కాడు, ప్రవర్థమానమవుతున్న కుమారుని చూచి తల్లి యెంతో ఆనందించేది.

POTTI SRIRAMULUగారి విద్యాభ్యాసం 1907లో ప్రారంభ మయింది. చిన్ననాటినుండి యెంతో తెలివిగా వ్యవహరిస్తూ వచ్చిన ఆయన ప్రాధమిక విద్యాభ్యాసంలో తన తెలివితేట లతో ఉపాధ్యాయులకు ఆశ్చర్యం కలిగించాడు. ఒకసారి విన్న విషయాన్ని మరచిపోయేవాడు కాదు. శ్రద్ధగా వినే వాడు. ప్రాధమిక విద్యను నిరాటంకంగా ముగించి జార్జిటౌను లోని ప్రోగ్రెసివ్ యూనియన్ మిడిల్ స్కూలులో మాధ్యమిక విద్యకోసం చేరాడు. అక్కడకూడా అంతే.

POTTI SRIRAMULU తన తెలివి తేటలతో అక్కడివారందరినీ చకితుల్ని చేశాడు. ఉపాధ్యా యులందరూ ఎంతో మెచ్చుకొని ఆ గ్రహణశక్తిని శ్లాఘించేవారు. శ్రీరాములుగారు కూడా తన సహజ గుణా లైన క్రమశిక్షణ, వినయ విధేయతలను విస్మరించకుండా ఆ విద్యాసమయంలో ఎంతో నేర్చుకొన్నాడు. తెలియని విషయాలను అడిగి తెలుసుకొంటూ తన జ్ఞానాన్ని దినదినాభివృద్ధి చేసుకొన్నాడు. అదే ఉత్తమ విద్యార్థికుండవలసిన ముఖ్యలక్షణం.

POTTI SRIRAMULU మాధ్యమిక విద్యను పూర్తిచేసి మింట్ స్ట్రీట్ లోని “ది హిందూ ధియోలాజికల్ హైస్కూలు”లో ఉన్నతవిద్య కోసం చేరాడు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్లు ఎక్కడకు వెళ్ళినా ఆయన పద్ధతిలో మార్పుండేది గాదు. వయసు పెరిగేది, చదువుతున్న తరగతి పెరిగేది. ఉన్నజ్ఞానం పెరిగేది. వినయ విధేయతలూ పెరిగేవి అహంకారం, నిర్ణ క్ష్యంవంటి అవలక్షణాలు మాత్రం అసలుండేవిగావు. అక్కడ విద్యార్థిగా నున్నప్పుడు ఆయనకు స్కోప్ మాస్టర్ అన్న ముద్దు పేరుండేది.

అక్కడే కె. గోవిందరాజులుగారితో పరి చయం కావడం వారు ఎంతో సన్నిహితంగా ఆదరాభిమానా లతో మెలగడం జరిగింది. ఇద్దరూ కలిసి చదివేవారు. హరి కధా కాలక్షేపానికి యిద్దరూ వెళ్ళేవారు విన్న విషయాలను,’ విశేషాలను గురించి చర్చించేవారు. చర్చలో ఎన్నో క్రొత్త విషయాలు తెలుస్తాయి. క్రొత్త ఆలోచనలు వస్తాయి. అందుకే చర్చించి తమ అభిప్రాయాలు చెప్పుకునేవారు. వారి ఆంగ్లోపాధ్యాయుడు దొరైస్వామి అయ్యర్ చక్కగా బోధించడమేగాక శ్రద్ధ, ఉత్సాహం కలిగిన మెరిక ల్లాంటి విద్యార్థులద్వారా షేక్స్ఫియర్ ఆంగ్లనాటకాలను ప్రద ర్శింపజేసేవారు. ఆ నాటకాలలో ప్రముఖపాత్రలను శ్రీరాయాలను అడిగి తెలుసుకొంటూ తన జ్ఞానాన్ని దినదినాభివృద్ధి చేసుకొన్నాడు. అదే ఉత్తమ విద్యార్థికుండవలసిన ముఖ్య లక్షణం.

POTTI SRIRAMULU మాధ్యమిక విద్యను పూర్తిచేసి మింట్ స్ట్రీట్ లోని “ది హిందూ ధియోలాజికల్ హైస్కూలు”లో ఉన్నతవిద్య కోసం చేరాడు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్లు ఎక్కడకు వెళ్ళినా ఆయన పద్దతిలో మార్పుండేది గాదు. వయసు పెరిగేది, చదువుతున్న తరగతి పెరిగేది. ఉన్నజ్ఞానం పెరిగేది. వినయ విధేయతలూ పెరిగేవి అహంకారం, నిర్ణ క్ష్యంవంటి అవలక్షణాలు మాత్రం అసలుండేవిగావు. అక్కడ విద్యార్థిగా నున్నప్పుడు ఆయనకు స్కోప్ మాస్టర్ అన్న ముద్దు పేరుండేది.

అక్కడే కె. గోవిందరాజులుగారితో చయం కావడం వారు ఎంతో సన్నిహితంగా ఆదరాభిమానా లతో మెలగడం జరిగింది. ఇద్దరూ కలిసి చదివేవారు. హరి కధా కాలక్షేపానికి యిద్దరూ వెళ్ళేవారు విన్న విషయాలను,’ విశేషాలను గురించి చర్చించేవారు. చర్చలో ఎన్నో క్రొత్త విషయాలు తెలుస్తాయి. క్రొత్త ఆలోచనలు వస్తాయి. అందుకే చర్చించి తమ అభిప్రాయాలు చెప్పుకునేవారు.వారి ఆంగ్లోపాధ్యాయుడు దొరైస్వామి అయ్యర్ చక్కగా బోధించడమేగాక శ్రద్ధ, ఉత్సాహం కలిగిన మెరిక ల్లాంటి విద్యార్థులద్వారా షేక్స్ఫియర్ ఆంగ్లనాటకాలను ప్రద ర్శింపజేసేవారు. https://pincodesguide.in/kandukuri-veeresalingamgreat-social-reforms/

ఆ నాటకాలలో ప్రముఖపాత్రలను POTTI SRIRAMUKLU గారే ధరించి ఆ పాత్రలకు జీవము పోసేవాడు. ఆ నటనను కనులారా చూచినవారెందరో ఆశ్చర్యపడి శ్లాఘించే వారు. ఆ నాటకాలద్వారా వచ్చే ఆదాయము పేద విద్యార్ధుల కోసం ఉపయోగింపబడేవి POTTI SRIRAMULU గారు మూకీ చిత్రాలు చూసేవాడు. ఎన్నో గ్రంధాలను చదివి జ్ఞానాన్ని పెంచుకునేవాడు. ఆటలలో కూడా ఆసక్తి చూపేవాడు. డాడింటన్ బిలియర్డ్సులో మరింత నేర్పు చూపేవాడు. రకరకాల పోటీలలో పాల్గొని ఎన్నో పతకాలను గెల్చుకొని పెద్దల ప్రశంసలకు పాత్రుడయ్యాడు. ప్రతి విష యములోసు శ్రద్ధ చూపేవాడు. పట్టుదలతో పనిచేసేవాడు. పట్టుదల, శ్రద్ధ, సాధనవుంటే అసాధ్యమైనది అరుదు కదా! 1920 నాటికి ఉన్నత విద్యాభ్యాసము ముగిసింది.

POTTI SRIRAMULU తరువాత బొంబాయి వెళ్ళి ప్రభుత్వ సాంకేతిక శిక్షణాలయ ములో శానిటరీ ఇంజనీరింగు కోర్సులో ప్రవేశించాడు. అక్క డున్న విద్యాబోధకులు. ప్రిన్సిపాల్ కూడా క్రమశిక్షణ విష యములో కటువుగా వుండేవారు. చిన్నతనమునుండి క్రమ శిక్షణకు అలవాటుపడిన POTTI SRIRAMUKLU గార్కి కష్టమనిపించలేదు

POTTI SRIRAMULU గారిని పి. యస్. గుప్త అని పిలిచేవారు. చాలా కాలమువరకూ ఆ పేరే వాడుకలో వుంది. బొంథాయిలో చదివేసమయములో అతి నిరాడంబర ముగా వుండేవాడు. మదరాసు నివాసివలే లుంగీకట్టి పొడుగు చేతుల కమీజు తోడిగేవాడు. పైకట్టి కోటు వేసుకునేవాడు. ఒక్కోసారి పంచక పేవాడు. 1924 నాటికి ఆ చదువు ముగి సింది. మద్రాసు చేరుకొని 60 రూపాయల జీతము మీద ఉద్యోగములో చేరాడు. నాలుగు నెలలు మాత్రమే ఆ ఉద్యో గాన్ని చేశారు. తరువాత జి.ఐ.పి. రైల్వేలో అసిస్టెంటు ప్లంబరుగా ఉద్యోగము దొరికింది. అందుచేత మళ్ళీ బొం బాయికి వెళ్ళాడు.

POTTI SRIRAMULU బొంబాయిలో నెలకు 270 రూపాయలు జీతం వచ్చేది. కాని కార్యభారం రెట్టింపుగా ఉండేది. POTTI SRIRAMULU గారిమీద ఉన్నతాధికారి మిస్టర్ సనూన్. ఆయన అధికారి అయినా కార్యదీక్ష లేనివాడు. విచ్చలవిడిగా తిరిగే స్వభావంకలవాడు. కనీసము తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నా బద్ధకంగా వుం డేది. దానికితోడు POTTI SRIRAMULU గారి పనితనం చూశాక తన పనినికూడా ఆయనకు చెప్తూ తన విలాసాలను వినోదాలను యధాతధముగా కొనసాగించేవాడు.

మాటతీసివేయలేని POTTI SRIRAMULU గారు చక్కగా తనపనిని పూర్తిచేసిన తరువాత ఆయన పనినికూడా పూర్తిచేసేవాడు. కర్తవ్యపాలనలో విసుగు, విరా మాలు ఆయనకు తెలియవు. తీరిక దొరికేదికాదు. ఒక వేళ తీరిక దొరికితే ఆ సమయంలో కార్మికుల యోగక్షేమాలను విచారిస్తూ వారికి తగిన సలహాలనిస్తూ, హితబోధలుచేస్తూ, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు కూడా చెప్తూ గడిపేవాడు. వారికేమైనా ఆపదలు కల్గితే ఆదుకొనేవాడు. ఆయన చక్కని మానవతావాది.

యుక్తవయస్సులోనే వివాహం జరిగినది. మేనరికపు సంబంధం తల్లి ఇష్టప్రకారమే కుదిరింది. వివాహము కాగానే భార్యను. వయస్సు మళ్ళిన తల్లిని వెంటబెట్టుకొనిపోయి బొంబాయిలో కాపురం పెట్టాడు. తల్లి అనారోగ్యానికి వైద్యము చేయించి ఆరోగ్యము కుదుటపడినతరువాత ఆమె ఇష్టప్రకారం ఆమెను మద్రాసుకు పంపించాడు. శ్రీరాములు గారి భార్య పేరు సీతమ్మ. ఉత్తమ యిల్లాలు. అనారోగ్యసమ యములో కూడా అత్తగారికెంతో సేవచేసిన వ్యక్తి.

కాలచక్రము తిరుగుతూనేవుంది. సీతమ్మ, POTTI SRIRAMULU ఎంతో అన్యోన్యముగా కాలంగడపసాగారు. సీతమ్మ గర్భవతి అయింది. అందరూ సంతోషించారు. POTTI SRIRAMULU గారి తల్లి సంతోషం మరింత అయింది. జన్మించబోయే బిడ్డను గూర్చి బంగారు కలలుకంటూ ఆ భార్యాభర్తలతోపాటు ఆ తల్లి కూడా ఎదురుచూడసాగారు. వంశోద్ధారకుడైన కుమారుడు జన్మించాడు కాని…అయిదవరోజునే ఆ పసికందు కన్ను మూశాడు. ఆ దంపతుల కలలన్నీ చెదిరిపోయే కథగా మిగిలిపోయాయి.

కథతోపాటు వరికి కన్నీళ్ళూ మిగిలాయి. ఆ కన్నీళ్ళను హరించుకొనే శక్తిలేని సీతమ్మ ఆ శోకంతోనే బాలింతరోగాన్ని తెచ్చుకొంది. ఆరునెలలు ఆ జబ్బుతో పోరా డింది. కాని ఓడిపోయింది. 1926లో తన తల్లిగారింట కన్నుమూసి శ్రీరాములుగారి కన్నీళ్ళను రెట్టింపు చేసింది. దెబ్బమీద దెబ్బ తగలగానే ఆ అమాయక హృదయం ఎంతో పరితపించింది. తట్టుకొనే శక్తినెలాగోపొందిగుండెధైర్యంతోనిలబడగలిగాడు.

తన కుమారునికి తగిలిన ఆ దెబ్బలకు కన్నతల్లి మహా లక్ష్మమ్మ ఎంతగానో బాధపడింది. అసలే వయసు మళ్ళిన ఆమె ఆశోకసముద్రంలో నుండి ఒడ్డుకు చేరుకోలేకపోయింది. ఆశాంతిమయమైన POTTI SRIRAMULUగారి హృదయంలో తుఫానును రేకెత్తిస్తూ ఆమె కూడా రాలిపోయింది. గోరుచుట్టుమీద రోకటిపోటులా తగిలిన ఆ దెబ్బలకు శ్రీరాములుగారి హృద యం బండబారిపోయింది. జీవితం అంటేనే విరక్తి కలిగింది.

సుఖసౌఖ్యాల మీద ఏవగింపు కలిగింది ఎవరికోసం జీవించాలి? ప్రశ్నించుకొన్నాడుకాని… ఆ ప్రశ్నకు సమాధానం రాలేదు. ఎన్నెన్నో ఆలోచించుకొన్నాడు. ఎన్నో ప్రశ్నించుకొన్నా సమాధానాలు రాని ఆ ప్రశ్నలు ప్రశ్నలుగానే పోయి వెక్కిరించాయి.తీరంచేరని ఆలోచనలు ఆయనను చుట్టేశాయి. నడిసముద్రంలో నావలా మిగిలి పోయాడు. ప్రకృతి సహజజనితములైన గాలివానల ధాటికి హోరుగాలిలో చెక్కు చెదరక అలాగే నిలిచిపోయాడు.

ఆ సమయంలోనే ఆయన కర్ణాలకొక ఆర్తనాదం విన్పించింది. వినువీధినుండి ఎలుగెత్తిపిలుస్తున్న ఒక పిలుపును విన్నాడు. ఆ పిలుపు వెనుక ఒక అర్థింపునూ విన్నాడు. అతి ప్రాచీన నాగరికతా వైభవంతో విలసిల్లిన భారతీదేవి పిలుపు అది. సంతోషరేఖలు అంతం అయిపోవడంతో దఃఃభానికి తన వదనాన్నే నిలయంగా చేసుకొని తన బిడ్డలు పొందే బాధలకు గుండె చెరువయ్యేలా విలపిస్తూ పిలచిన పిలుపు అది. ఆ కరుణామూర్తి రూపాన్ని చూసిన POTTI SRIRAMULU గారి హృదయం కరిగిపోయింది రాలిపోయిన ఆ తల్లి అంటే ఎంత ప్రేమచూపేవాడో, రమ్మని పిలచిన యీ తల్లిమీద అంతే ప్రేమనుచూపాలనుకొన్నాడు.

ఆ తల్లి బిడ్డలు, తనతోబుట్టు వులు అయిన భారతప్రజలకోసం నడుంకట్టి నిలవాలని నిశ్చ యించుకొన్నాడు నాటి జాతీయోద్యమ నాయకుడయిన బాపూజీని కలుసుకొన్నాడు. అప్పుడు గాంధీజీ దండి సత్యా గ్రహం జరుపుతూవున్నాడు, ఆయనను కలుసుకొని తన నిర్ణ యాన్ని తెలియజేశాడు. ఆయన ఆయన అనుమతి ఇచ్చాక తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సబర్మతి ఆశ్రమం చేరాడు. యౌవనపు పొంగుచల్లారని యుక్తవయసులో మళ్ళీ వివాహం చేసుకొని సుఖంగా జీవించాలనే నిర్ణయం తీసుకోకుండా జాతీయోద్యమంలో చేరాడు.

గాంధీజీ పూరించిన శంఖారావానికి తలను వంచిన POTTI SRIRAMULU సర్వాన్ని పరిత్యజించి ఆయన ఆశ్రమానికి వెళ్ళి శిష్యుడయ్యాడు. చిత్తశుద్ధి, త్యాగనిరతి, సేవాభావాలతో బాపూజీని సంతోషపరచాడు. ఆశ్రమంలో యిచ్చే అతిచిన్న జీతాన్ని మరింత పొదుపుగా వాడి, కొంత మిగిల్చి ఆశ్రమానికిచ్చేవాడు.
సబర్మతీ ఆశ్రమానికి సత్యం, ప్రేమ, అహింస అనే సిద్ధాంతాలూ మూల స్తంభాలు, అక్కడ విశ్వమానవ కళ్యా ణానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ప్రజోపయోగకర మైప సేవలతో గ్రామ నిర్మాణాలకు పునాదిగా నిల్చింది. ఖద్దరు వస్త్రాలను తయారుచేయడం, స్వశక్తిమీద ఆధారపడడం హరిజనులను ఉద్ధరించి మానవసేవే మాధవ సేవని నిరూపించ డం, మద్యపానాన్ని నిషేధించడం, కులరహిత సమాజాన్ని స్థాపించడం, గ్రామపారిశుద్ధ్యం, నిరాడంబరజీవనం, మాతృ భాషపై స్వేచ్ఛ, దేశభాషగా హిందీని గుర్తించడం, స్త్రీ జనోద్ధరణం, శ్రీస్వాతంత్ర్యం. ప్రకృతిద్వారా చికిత్స, వ్యవ సాయాన్ని గౌరవించడం, గ్రామాన్ని అభివృద్ధిపర్చడం, జీవ జంతువుల పట్ల దయచూపడం, సత్యాన్ని పల్కడం, వయో జనులకు విద్యను చెప్పడం, గ్రామ పంచాయితీ పరిపాలన సమిష్టి కుటుంబం అనేవి నిర్మాణ కార్యక్రమాలు.

ఈ నిర్మాణ కార్యక్రమాలు POTTI SRIRAMULU గారికెంతో నచ్చాయి. హృదయంలో హత్తుకొనిపోయాయి 1988వరకు ఆయన శబర్మతీ ఆశ్రమంలో నేవుండిపోయారు. అక్కడినుండి బయలుదేరి ఆంధ్రదేశానికివచ్చి కృష్ణాజిల్లాలోని కొమర వోలు గాంధీ ఆశ్రమంలోచేరి నిర్మాణ కార్యక్రమాలలోముఖ్యమైనదైనగ్రామాభివృద్ధికి పాటుపడసాగాడు. ఆ ప్రజా సేవలో గత బాధలన్నీ మరచిపోయి హాయిగా కాలం గడప సాగాడు. ఆ సేవలో నాలుగేళ్ళు గడచిపోయాయి రాత్రింబ వళ్ళు కష్టించి పనిచేసి తన సేవా కార్యక్రమాల్ని నిర్వర్తిం చాడు.

POTTI SRIRAMULU ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు నిర్మాణ కార్యక్ర మాల్లో సాధ్యమైనవాటిని అమలుజరిపేందుకు ప్రయత్నిం చాడు. 1941లో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. దానిలో పాల్గొన్నాడు. 1942లో జైలుకు వెళ్ళాడు. తరు వాత విడుదల చేయబడి నెల్లూరు చేరాడు ఆ ప్రాంతంలో తన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. కార్యదీక్ష వున్నవారికి ఏ పని ఎక్కడ ప్రారంభించినా ఫలితమే లభిస్తుంది. POTTI SRIRAMULU గారికి ఫలితాలే దక్కాయి నిర్విఘ్నంగా కార్య క్రమాలు సాగిపోతూనే వున్నాయి
ఆ సమయానికే నెల్లూరులో అన్నదాన సమాజం, ఆర్యసమాజం, హిందూ మహాసభ, హరిజన సేవా సంఘం అని నాల్గు సంఘాలుండేవి.

అవి సేవాసంఘాలు. కాని విడివిడిగా కార్యక్రమాలను నిర్వహించేవారు. కాని శ్రీరాములు గారు వారిని సంఘటితపరచి వారిలో ఐకమత్యాన్ని వెం చారు. వారంతా ఏకమై మరికొన్ని మంచి కార్యక్రమాలను చేపట్టారు. అప్పుడే ఆ సంఘములవారికి చరఖాలో శిక్షణ నిచ్చాడు. గాంధీజీ ఆశయాన్ని, వాటిలో పవిత్రతను గురించి వారికి తెలియజెప్పాడు. ఎన్ని బోధించినా, కార్యక్రమాలను చేపట్టినా ఆయనకేదో అసంతృప్తి కనిపించేది. ఏదో వెలితి కన్పించేది. దానికి కారణం ఆంధ్రుల పద్ధతే. వారిలో కలుపుగోలుతనం ఉండేది కాదు త్వరగా అనుసరించగలిగేజ్ఞానం ఉండేదికాడు. ఆ వద్ధతులకు POTTI SRIRAMULU గారెంతో బాధపడ్డారు. ఆ యిది తొలగించాలని ఎంతో ప్రయత్నించారు.

POTTI SRIRAMULU,

వారిలో సంపూర్ణ ఐకమత్యాన్ని పెంపొందించాలని ఆశించాడు. కాని ప్రయత్నం ఫలించలేదు. అందుకే నాలుగు సంస్థల కార్యకర్తలనుసమావేశపరచి వారితో మాట్లాడి 1946 సెప్టెంబరు తన ఒక సంఘాన్ని స్థాపించాడు. దాని పేరు హిందూ సంఘ సంస్కరణ సమితి. దాని ముఖ్యోద్దేశాలు క్రొత్తవికావు. మహాత్మాగాంధీ ఆశయాలను నెరవేర్చడమే ఈ సమితి ఆశయం. అంతేగాకుండా దేశాభ్యుదయానికి, ఉన్నతికి, పాటుపడాలన్న ముఖ్యోద్దేశం.ఆ సమితి ఎంతో దీక్ష వహించి పనిచేసేది, POTTI SRIRAMULUగారెంతో చొరవగా కార్యక్రమాలను నిర్వహించే వారు.

సత్ఫలితాలను పొందుతూ వుండేవాడు. అస్పృశ్యతా నివా రణ, హరిజనదేవాలయ ప్రవేశం, సహపంక్తి భోజనం సర్వ సమాన సమానత్వం, కారదా చట్ట ప్రచారం రజస్వలా సంతర వివాహం, వితంతు వివాహాల ప్రోత్సాహం, వర్ణాంతర వివా హాల ప్రోత్సాహం యీ సమితిచేపట్టి మంచికార్యక్రమాలు.మూఢనమ్మకాలను తొలగించి, మూఢాచారాలను ఖండించి సమాజంలో మార్పులు తీసుకురావాలని సరికొత్త సమాజాన్ని నిర్మించాలని ఆయన ఆశయం. అంటరానితనం నిర్మూలించి హరిజనాభ్యుదయం కల్గించడంలో ఆయన ఆసక్తిచూపేవాడు. ఈ కార్యక్రమాల్లో ఎంతో శ్రద్ధచూపేవాడు. ఆయనలోని మానవతా మేల్కొని యితరులను మేల్కొలప సాగింది సాటి మనష్యులైన హరిజనులుపడే బాధలను వారికి జరిగే అన్యా యలను చూచి ఎంతో బాధపడ్డాడు. ఆయన హృదయం ద్రవించిపోయింది.

ఆచార వ్యవహారాల్లోని మూఢవిశ్వాసాలను తొలగిం చేందుకు నిద్రాహారాలు సైతం లెక్కచేయకుండా శ్రమ పడ్డారు జాతి శ్రేయస్సు కోసం దీక్ష వహించాడు సహపంక్తి భోజనాల నేర్పాటు చేశాడు. శ్రీవిద్యను ప్రోత్సాహించాడు. వితంతు వివాహాల్ని జరిపించాడు. వాటిద్వారా కొంతవరకు బాధితులైనవారికి సత్వర సహాయం చెయ్యడం, అంటరాని తనాన్ని నిర్మూలించి హరిజనోద్ధరణకు కృషిచేయడం, కుష్టు . రోగుల సేవచేయడం, నిరుపేద కుటుంబాలవారికి చేయూత నివ్వడం యీ ప్రేమసమాజం యొక్క పవిత్రాశయాలు,దాగివున్నట్లు మానవతాభావం ప్రతిపనిలోనూ శ్రీరాములు గారికి కన్పించింది.

ప్రతి ఆశయాన్ని మెచ్చు కొన్నాడు. ఒట్టి మాటలరూపంలో నేగాక చేతలరూపంలోఏ నున్న ఆశయాల ఫలితాన్ని కళ్ళారాచూశాడు. ఆయనలోని • మానవత్వం పెల్లుబికిఁది. “సేవ” అనే రెండక్షరాల మాటలోని భావం, ఆ భావానికి ప్రతిరూపం అయిన ప్రేమ సమాజం ఆయనకు మార్గదర్శకమైంది. “అనాధప్రేత సంస్కారం” ఆయనను అమితంగా ఆకర్షించింది. దిక్కులేని ఆ శవాలను ఆ దహనం చేయడం అన్నది ఎంతో మహత్కార్యంలా భావిం – చాడు. ఆ కార్యక్రమాన్ని కూడా తన “హిందూసంస్కరణ సమితి”లో ప్రవేశపెట్టాడు. తన సమితిలోని సేవా కార్య క్రమాల్ని రెట్టింపుచేశాడు. తమ కార్యకర్తలకు సముచిత సలహాలనిస్తూ సేవాకార్యక్రమాలకు చేయూతనిచ్చాడు. ఆయన “, సేవానిరతిని చూచి ప్రేమసమాజంవారే ఆశ్చర్యపడ్డారు. 2. అంతచేసినా ఇంకెంతో చేయడానికే ప్రయత్నించేవాడు.

శ్రీరాములుగారు హిందీభాష క్షుణ్నంగా తెలుసు చే భాషా ప్రచారం కోసం ఎంతో కృషిచేశాడు. 1846లో హిందీప్రచారాన్ని ప్రారంభించాడు. దక్షిణభారతదేశంలో హిందీ ప్రచారం ఆ రోజుల్లో అంతగా వుండేదికాదు. అయినా ఆ భాషా ప్రచారంకోసం ఎంతో కృషిచేసి గాంధీజీ ఆశయాన్ని చేతులతో చేసిచూపాడు. హిందీభాషావశ్యకతను బోధించాడు.

జాతీయ కాంగ్రెస్ మహాసభ ఆదేశించిన నిర్మాణ కార్యక్రమాలను ప్రతిరాష్ట్రంలో నూ అమలుపరిచేందుకు ఒక్కొక్క రాష్ట్రంలోనూ ఒక్కొక్క శాఖ ఏర్పరచబడింది. ప్రతి శాఖకు ఒక సంచాలకుడు

నియమితుడయ్యాడు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన శాఖకు శ్రీరాములుగారే సంచాలకుడుగా నియమితుడయ్యాడు కాంగ్రెసు కార్యక్రమాలను, గాంధేయ సిద్ధాంతాలను అమలుజరపడంలో, లోటు ఏమైనా ఉంటే సరి దిద్దడం ఆయన కర్తవ్యం, సబర్మతి ఆశ్రయ నియమాన్ని అనుక్షణం పాటిస్తూ, ఆ నియమాల్లో ఒకటైన చరఖాను ఎల్లవేళల్లోనూ వెంటబెట్టు కోవడం, ఏకులు, ప్రతిని దగ్గర పెట్టుకోవడం, రెండు జతల బట్టల్ని వెంటతీసుకుని వెళ్ళడంవంటి పనులలో జాగ్రత్తగానే వ్యవహరించేవాడు.

తన బట్టలను తానే ఉతికేవాడు. ఎంత దూరప్రాంతానికి ప్రయాణంచేసినా, ఎన్నిసార్లు చేసినా మూడవతరగతిలోనే ప్రయాణం చేసేవాడు.లడ్డుగోడలని ఆయన విశ్వాసం. ఆయన ఔనంటే ఉన్నత
పదవులు ఆయనను వరించేవి.కాని… ఆయనకుపదవీ వ్యామోహంలేదు. నిజమైన బాధితులకు నిజమైన సేవచెయ్యా లన్నదే ఆయన ఆశయం. కొందరు ఆయనకు పదవులు కట్ట బెట్టాలని ప్రయత్నించినా విఫలులు కాక తప్పలేదు.https://pincodesguide.in/kandukuri-veeresalingamgreat-social-reforms/

‘హరిజనులంటే ఆయనకు అభిమానం ఎక్కువ వారి నుద్దరించేందుకు మరెంతో కృషిచేశాడు వారూ మనుష్యులేనని చెప్పాడు వారిని మనుష్యులుగా చూడమన్నాడు. సమా జంలో వారిని అంటరానివారుగా చూస్తూ, వారిని తాకితేనే పావమన్నట్లు వ్యవహరించడాన్ని ఖండించాడు. వారి ప్రగతి కోసం నిర్విరామకృషిచేశాడు, నూతనపద్ధతులలో తన కృషిని చేసిచూపారు.

వారికి అందరిలా భ క్తి ఉంటుందని, దేవుడు వేరుకాడుగనుక దేవాలయాల్లో వారికి ప్రవేశం కావా లని పట్టుబట్టాడు. అస్పృశ్యతను తొలగించాలని కోరాడు. వారికి సాంఘిక సమానత్వం కల్గించేందుకెంతో కృషిచేశాడు. వారి ప్రగతి ఒక్కటే భారతజాతిని భావికాలంలో తీర్చిదిద్ద గలిగేదని చెప్పాడు. “అంటరానితనాన్ని నిర్మూలించాలి. హరిజనులకు దేవాలయ ప్రవేశమిప్పించాలి. కులవర్గ రహిత సమ సమాజాన్ని స్థాపించాలి” అని నినాదాలు వ్రాయబడ్డ అట్టలు పట్టుకొని ప్రచారంచేస్తూవుంటే ప్రజలు వెర్రివాడను కొన్నారు. ఆ అట్టలుపట్టుకొని మద్రాసు రాష్ట్రంలోని విధాన సభకు వెళ్తూవుంటే పిచ్చివాడనుకున్నారు ప్రజలు. పిచ్చి ప్రజలకు మంచివాడు పిచ్చివానిలాగే కన్పిస్తారు.

మేధావు లంతా మొదట్లో పిచ్చివాళ్ళనే పిలవబడ్డారు. శ్రీరాములుగారు కూడా పిచ్చివానిలా చూడబడ్డాడు కాని… ఆశయాన్ని ప్రచారం చేయసాగాడు. అలా చేస్తూ తానొక గొప్పవాడిననుకోలేదు. అభిమానపడలేదు. ప్రచారం చేస్తూ సంకోచించలేదుకూడాను. గొప్పవాడను, చదువుకొన్నవాడను భేదాలు లేకుండా ఉండేవాడు. కాని… ఆయన నిష్కామకు, కార్యదీక్షకు రాజకీయ నాయకుల గుండెలు దడదడలాడాయి. ఆవిధంగా ప్రచారంచెయ్యాలంటే కొందరు బాధపడిపోతారు. తమ హోదాకు భంగమన్నట్లు భావిస్తారు. కొందరై తేమొహం చాటుచెయ్యాలని చూస్తారు. ఇతరులకు చెప్పమంటే ఎనో. చెప్తారు.

కానీ చేయవలసివస్తేమాత్రం ఎక్కడలేని అనుమా నాలు వస్తాయి. అభిమానాలు ఆడొస్తాయి. శ్రీరాములుగారు అలాంటిభావాలకతీతుడు. ఎవరేమనుకున్నాసరే తన లక్ష్యం వైపు ప్రయాణాన్ని ఆపేవాడు కాదు. అనుగొన్నది చేసేవరకు నిద్రపట్టేదికాదు. ఇతరుల పరిహాసాలను పెడచెవిన బెట్టి కఠోర పరీక్షల నెదిరించి పోరాడేవాడు. ఆయన మొండిపట్టుదలను’ కార్యదీక్షను గుర్తించిన నాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం, దేవాలయశాఖమంత్రి శ్రీ కడప కోటి రెడ్డి వెంటనే కార్యరంగంలోకి దుమికారు.

హరిజనులు దేవాలయములలోనికి వెళ్ళేందుకు చట్ట పూర్వకమైన అనుమతినిచ్చారు. ఆ ప్రవేశాన్ని ఆటంకపరచే వారిమీద చర్యతీసుకునేందుకుకూడా నిర్ణయించారు. ప్రతినెల లోను ఒకదినాన్ని హరిజనోద్ధరణ దినంగా పాటించాలని శాసిం చారు. జిల్లా అధికారులు ఆ చట్టాలను శ్రద్ధగా అమలు జరి పేందుకు సహాయపడ్డారు ఈ ఉద్యమాల్ని శ్రీరాములుగారు స్వతంత్ర్యం రావడానికి ముందే ప్రారంభించారు. 1947 జూన్ 17న ప్రారంభించిన ఈ ఉద్యమం జూన్ 21తో ముగిసింది.

శ్రీరాములుగారి ఆశయం నెరవేరింది. ఉద్యమం విజయవంతమయింది. గాంధిజీ హర్షించాడు. హరిజనాభ్యు దయం కోసం ప్రభుత్వం శ్రద్ధాశక్తులు ప్రదర్శించాలని 1918లో 20 రోజులు నిరాహారవ్రతం చేశారు.గాంధీజీ ప్రారంభించిన ఖాదీ ఉద్యమంముందుకు సాగు తున్నా దాని కదలికలో అతి నెమ్మది కన్పించింది దాదాపు నత్తనడకలా నడుస్తుందని చెప్పవచ్చు. ఆంధ్ర ప్రాంతంలో కూడా వేగం పుంజుకోలేదు ఆగమనంలోని నీరసాన్ని చూచిన శ్రీరాములుగారెంతో బాధపడ్డాడు. ఖాదీ ఉద్యమ ప్రభావం ఆయనకు తెలుసు.

దేశౌన్నత్యానికెంత దోహదమిచ్చేదీ ఆయనకు తెలుసు. దేశాభ్యుదయానికి కీలకమైనదిగా గుర్తిం చాడు. అందుకే ఖాదీప్రచారం చెయ్యాలని నిశ్చయించుకు న్నాడు. కానీ ఏది చెయ్యాలన్నా ప్రభుత్వ సహాయం కావాలని ఆయన నమ్మకం ప్రభుత్వం ప్రోత్సహించకుండా ఏపనీ నెరవేరదని, దేనిలోనూ విజయం కల్గదని అనుకుని 1949 ఆగష్టు 28న ఒక కరపత్రాన్ని వెలువhttps://photos.app.goo.gl/Ukf36uhsoVENa6zx5రించాడు.

మహాత్ముడు ప్రచారంచేసిన ఖాదీ ఉద్యమ ప్రయోజనా లను విశదపరచాడు. గ్రామప్రజల జీవనానికి ఖాదీయెంత ఉప యోగకరమైనదో నూలువడికి వస్త్రాలను తయారు చేసుకొని ధరించడంలోగల లాభం, కలిగే ఆనందం, వ్యక్తిగత లాభాల వల్ల వ్యక్తిగత ఆనందంవల్ల దేశంపొందేలాభం అవన్నీ తెలియ జేస్తూ ఆ కరపత్రాన్ని రూపొందించాడు. ఖాదీని అడ్డం పెట్టి కొందరు స్వార్ధపరులాడే నాటకాలను తెల్పి, శ్రద్ధాశక్తితో ఖద్దరును ధరిస్తూ అనేక కష్టనష్టాలను భరించే మహనీయులు పాట్లను తెల్పి వారు ఏ కారణాలతో ఖద్దరును ధరించడం మానివేస్తున్నారో, ఆ ప్రకారంలా ఖాదీ వాడకం దినదినము ఎలా తగ్గిపోతుందో తెలియపరిచాడు.

కనుక దాని పవిత్రతను కాపాడమని బాపూజీ ఆశయాల్ని ఆచరణలో పెట్టమని ప్రతి నిత్యం ప్రతిఒక్కరూ ఈఉద్యమంపట్ల ఆస క్తితోనుండి పాలు – పంచుకోవాలని, గాంధీజీవలె తమవెంట ఒక చరకాను ఉంచు కొని చాటునచేయకుండా పదిమందిలోనూ దాన్ని త్రిప్పుతూ దాని గొప్పతనాన్ని, దాన్ని ఉపయోగించేతీరును ప్రజలంద రికీ బోధిస్తూ వుండాలని పేర్కొన్నారు. అధికారులు ఖాదీ ఉద్యమాన్ని మనసారా ప్రోత్సహించాలనుకుంటే ముందుగా పోలీసులకు ఖద్దరు ధరించాలని ఆదేశించి నూతన పద్ధతిని కేవలం పురపాలక ప్రవేశ పెట్టవచ్చుననీ పేర్కొన్నాడు సంఘంవారే ధరించడం అనేది అధికార దుర్వినియోగమే అని చెప్పారు.

ఖాదీఉద్యమం ద్వారా సేవాభావం పెంపొందింప జేయాలేగాని ప్రాంతీయ శాఖలమీద ఒత్తిడిగా ఉండకూడదని ఆ సేవాభావంకూడా ప్రజలలో ఆదరణ అభిమానం పెంపొం దించేదిగా వుండాలని తెలియజేశారుప్రభుత్వమే ఆ సిద్ధాంతాన్ని ఆచరించి ప్రజలకు బోధిస్తే అది ఫలవంతమౌతుందని ఆచరణద్వారానే దానికి ఆదరణ కల్పించాలని పేర్కొన్నారు. ప్రాంతీయశాఖలవారిని పురపాలక సంఘాలవారిని తమ ఆక్షేపణలను ప్రభుత్వానికి తెలియపర్చ మని కోరుతూ ఆ కరపత్రాన్ని విడుదలచేశాడు.

ఆ కరపత్రం ద్వారా శ్రీరాములుగారు ఖాదీపట్ల తనకున్న ప్రేమను, అభి మానాన్ని వ్యక్తపరిచారు. పవిత్రాశయాలతో ప్రవేశ పెట్టబడ్డ ఖద్దరు స్వార్థపరులచేతుల్లో దుర్వినియోగం కావడాన్ని నిరసిం చాడు కొందరు నాయకుల చేతుల్లో పవిత్రతను కోల్పో యింది. అందుకే బాపూజీ సదాశయాల్ని చాటి పవిత్రతను కాపాడాలని శ్రీరాములుగారు నిశ్చయించారు. అపవిత్రతనారోపించి నిరూపిస్తున్న సమాజాన్నే మార్చి తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్ష. అందుకే జీవి తాంతం ఖాదీ ప్రచారం చెయ్యగలిగినంత చేశాడు.

విశాఖపట్టణంలోని ప్రేమసమాజంవారు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ ఆయన హృదయంలో నాటుకుపోయాయి, ప్రభావితుణ్ని చేశాయి. ఒక్కొక్క కార్యక్రమాన్ని తన సమితిలో ప్రవేశ పెట్టసాగాడు. ఆయన ప్రవేశ పెట్టిన కార్య క్రమాల్లో చెప్పుకోదగ్గ మరో కార్యక్రమం కుష్టురోగుల సేవ, కుష్టురోగులను చూస్తూనే చాలామంది ఎంతోదూరంగా తొలగి పోతారు. దగ్గరలో కే రారు. అలాంటప్పుడు వారి దగ్గర చేరి వారికెన్నో రకాల సేవలు చెయ్యడం చాలా గొప్ప విషయం.

మాటలుచెప్పి మభ్య పెట్టగలిగేదికాదిది. ఆ రోగులును కంటికి రెప్పలాగా చూడాలి. ముందువారికి మానసిక ధైర్యాన్ని కలి గించాలి. తమకూ ఆత్మీయులున్నారని తమ యోగక్షేమాలూ విచారించే శ్రేయోభిలాషులున్నారని వారికి ధైర్యాన్ని కల్గించ డమే మహత్కార్యం అనిచెప్పవచ్చు. ఉపన్యాసాలిచ్చి, నాల్గు ప్రకటనలుచేసి కుష్టురోగులకు సంతృప్తిని కల్గించలేరు. వారి బాధను నివారించలేరు ప్రత్యక్ష సేవలతోనే వారిజీవన ప్రమా ణాలను మెరుగుపరచేది వారి సంక్షేమంకోసం శ్రీరాములు గారు రకరకాల వ్యక్తులతో చర్చించి అవసరమైన యేర్పాట్లను వి చేసేవాడు వారంటే ఆయనకెంతో సానుభూతి వుండేది, నే కాని తగినవై ద్య సదుపాయం అందుబాటులో లేనందుకెంతో బాధపడ్డాడు. వారి చికిత్సకు కావలసిన యేర్పాట్లను, నిపుణు లను సంప్రదించి ఏర్పాటు చేశాడు.

కుష్టురోగులంటే ప్రజలకున్న అసహ్యభావాన్ని తొల గించేందుకు ప్రయత్నించాడు. సేవపై అఖిలారా ఉన్నవారం దరిని రోగులను ఆదరించి సేవచేసెందుకు పురికొల్పాడు. వారిలోనూ మార్పును కలిగించాలని ఆశించాడు. అనాదినుండి ప్రజల మనసుల్లో పాతుకుపోయిన దురభిప్రాయాలను తొ గించివారిని నిజమైన సేవవారిగా చేసేందుకు శాయశక్తులా కృషి చేశాడు.

బ్రిటిషు ప్రభుత్వంవారు స్వరాజ్యం ఇచ్చేందుకంగీక రించారు. ఎందరోనాయకులు కన్నకలలు నిజమయ్యేరోజులు దగ్గరపడ్డాయి. కాని అప్పుడే మతోన్మాదశక్తులు బయలు దేశాయి. సమైక్యయభావం సమసిపోయింది. అంతర్యుద్ధమే విభజింపబడుతూనే ప్రారంభమయింది. పర్యవసానంగా స్వతంత్ర్యం వచ్చింది. కానీ గాంధీజీ ఆశయం వేరు. ఆయన కోరింది వేరు. సమైక్యభావం ఆయన కోరింది. కానీ అది హిందూస్తాన్, పాకిస్తాన్ విడిపోతే ఆ వచ్చింది నిజమైన స్వాతంత్ర్యంకాదని గాంధీజీ భావించాడు. ఎంతో బాధపడి నౌఖాలీ యాత్రకు వెళ్ళాడు.

నిర్మాణాత్మక కృషిని ప్రారం “గాంధీ స్మారకనిధి”లో శ్రీరాములుగారు సంచాల కుడు కావడం ఆయన సేవాతత్పరతకు నిదర్శనం. ఆయన నిస్వార్థ సేవాభావానికి ప్రత్యక్ష సాక్ష్యం, అరాచక శక్తులు, పదవీవ్యామోహంతో నున్నవారు స్వార్థంతో సేవ అనే తెరను కప్పుకున్న వ్యక్తులు వేలకు వేలు పెరిగిపోయిన సమ యములో శ్రీరాములుగారు సేవను నిస్వార్థ సేవగాను, పేరు ప్రఖ్యాతులకోసం చేసిన సేవ కాకుండా గాంధీజీ ఆశయాల ఆచరించిన నిజమయిన సేవగాను గుర్తించి ఆయనను గాంధీ స్మారకనిధిలో నియమించడం ఆంధ్రజాతికే గర్వకారణమని చెప్పవచ్చు.

స్మారకనిధిద్వారా నెలకు నూటయాభై రూపా యల గౌరవవేతనం వస్తే దాన్ని అతి పొదుపుగా వాడుకొని కొంతమిగిల్చి నిధికి విరాళంగా పంపించేవాడు. ఆయనకు పొదుపు చేయడం వెన్నతో పెట్టినవిద్య ఎంతతక్కువ ఖర్చు చేసేవాడో అంత తక్కువ మాట్లాడేవాడు. అనవసర ప్రసం గాలు చేయడం ఆయనకు గిట్టదు. అవసరమయిన మాటలే మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. సేవాకార్యక్రమాల గురించి చర్చలలో మాత్రం రకరకాల అభిప్రాయాలు చర్చించి అనుకూలమయిన కార్యక్రమాలనుమాత్రం చేపట్టేవాడు. సేవా సంస్థలన్నీ దర్శించేవాడు. https://pincodesguide.in/durgabai-deshmukh-is-the-great-freedom-fighter/

అన్ని సంస్థల వివరాలూ వద్దవుండేవి అవి సాధించిన ప్రగతినికూడా ఎప్పటికప్పుడు తెలిసికొంటూ వుండేవాడు. ఆ వివరాలన్నీ సేకరించి ప్రగతిని ఆయన కూడా ఎప్పటికప్పుడు తెలిసికొంటూ వుండేవాడు. ఆ వివరా లన్నీ సేకరించి ఢిల్లీ వెళ్ళి చర్చించేవాడు కార్యక్రమాలన్నీ ఒక క్రమంలో జరిపించేవాడు..
1921 ఏప్రిల్లో ప్రథమ సర్వోదయ సమావేశం జరి గింది. అది హైదరాబాదు సమీపంలో గల శివరాంపల్లెలో జరి గింది. దానికి అధ్యక్షుడు వినోభాభావే. ఆ సమావేశానికి దేశం నలుమూలలనుండి కార్యకర్తలు వచ్చారు స్వచ్చంద సేవకు లెందరో హాజరై సభను జయప్రదం చేశారు. వచ్చినవారిలో శ్రీరాములుగారూ ఒకరు. ఎందరో బాపూజీ అనుయాయులు వచ్చారు. అసమావేశం మూడురోజులపాటు జరిగింది. ఎన్నో విషయాలను చర్చించారు.

హైదరాబాదు పట్టణానికి ఇరవైనాల్గు మైళ్ళ దూరంలో పోచంపల్లి అని ఒక గ్రామం ఉంది ఆ గ్రామానికి వినోభాజీ అనుచరులతో పాదయాత్ర చేశారు. వారిలో శ్రీరాములుగారు వున్నారు. పోచంపల్లిలోనే వినోభాజీ భూదానోద్యమాన్ని ప్రారంభించారు అక్కడున్న పేదలైన హరిజనుల సమస్య లను విని చర్చించేసమయంలోనే శ్రీ వెదిరె రామచంద్రారెడ్డి భూమిని దానంచేయడం ఆ పేదలకు పంచడం జరిగింది. ఆ సంఘటనతో నే భూదానోద్యమం ప్రారంభమయింది భూదా నోద్యమం ప్రజాశ్రేయస్సుకు పట్టుకొమ్మలా నిల్చింది.

సర్వోదయ సమావేశానికి ఆంధ్రప్రాంతంనుండి శ్రీరా ములుగారు, గోనాగారు, ప్రభాకర్, చిప్పాడ సూర్యనారా యణమూర్తిగారు మొదలైన కార్యకర్తలు హాజర రయ్యారు. అందరూ కలిసి ఆర్థిక సమతను గురించి చెయ్యవలసిన కార్య క్రమాల గురించి చర్చించారు యువజన కమిటీలను నిర్ణయిం చారు. ఆంధ్రప్రాంతానికి శ్రీరాములుగారిని ఉండమని పలు పురుకోరినా ఆయన తిరస్కరించాడు. సంచాలక కార్యభారం జనసేవా కార్యభారము ఉన్నందువలన తిరస్కరింపక తప్ప లేదు.

ఆంధ్ర సేవాభారాన్ని గోరాగారి భుజస్కంధాల మీద మోపారు శ్రీరాములుగారి పద్ధతులు, భావాలు చాలామందిని ఆకర్షించాయి. భాషలనుబట్టి రాష్ట్రాల విభజన జరగలేదని స్వరాష్ట్ర సాధనకోసం పాటుపడటమే తన సంకల్పమని ఆ రోజే శ్రీరాములుగారు చెప్పడం జరిగింది. ఆయనప్పుడు చెప్పిన ఆ భావం చాలా సంవత్సరాల క్రితంది.

దేశానికి స్వాతంత్ర్యం కావాలని ఉద్యమం ప్రారంభ మైనప్పుడే మాకు రాష్ట్రంకావాలన్నభావం ఆంధ్రులకుకల్గింది. ఆ భావాన్ని రకరకాల ఘట్టాలు, ఎన్నెన్నో సంఘటనలు రెట్టింపుచేశాయి తగిన ప్రేరణకూడా చక్కగా లభించింది. రాష్ట్రాద్యమంఠన్నా జాతీయోద్యమము ముఖ్యమైనది. అవ సరమైంది. ఒకవైపు ప్రజల ఆందోళనలు, మరోవైపు ప్రభు త్వం చేసే అమానుషకృత్యాలు ఉద్యమాన్ని అణచేందుకు వేస్తున్న వివిధ కార్యక్రమాలు చేయిజారిపోయేపరిస్థితిని అదు పులోనికి తెచ్చేందుకు ప్రయోగించే కుటిలనీతి, ప్రజలలో రెట్టింపు అవుతున్న ఉద్రిక్తత అవన్నీ రాష్ట్రాద్యమాన్ని తాత్కాలికంగా అణచివేయగలిగాయి ప్రజలకుకూడా ఆభావం మనసులోనే నిలచిపోయిందిగానీ పెల్లుబికి రాలేదు.

వచ్చే అవ కాశమే రాలేదు. జాతీయోద్యమంలో కూడా తెలుగువారు తమ శాయశక్తుల పాలుపంచుకున్నారు. స్వరాజ్య కృష్ణా పత్రికలవంటి తెలుగు పత్రికలుకూడా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. స్వదేశీ పరిశ్రమలు ప్రారంభించబడెను. జాతీయ పాఠశాలలు మొదలు పెట్టబడెను. మిగిలిన రాష్ట్రాలవారికి తెలుగువారేమీ తీసిపోలేదు. ఎన్నో అరె స్టులు, మళ్ళీ ఉద్యమాలు, మళ్ళీ అరెస్టులు అలా జరిగిపో యింది.

యదార్థ పరిస్థితులను, స్థితిగతులను పత్రికలు తెలియ జేస్తూ ప్రజలను నడిపించగలిగాయి. ఆంధ్ర ప్రాంతములో కూడా యెందరో తమ వృత్తులను రాజీనామాలిచ్చి ఉద్యమ ములో చేరారు. జాతీయోద్యమంతోబాటు ఆంధ్రరాష్ట్రావశ్య కత గురించి వ్యాసాలు వ్రాస్తూ ప్రజలను త్తేజితుల్ని చేయ డము జరిగాయి ఆంధ్రోద్యమ గ్రంధాలు రచింపబడి పంచి పెట్టబడెను. ఆంధ్రమహాసభలు బాపట్లలోనూ, విజయవాడ లోనూ, విశాఖపట్నంలోనూ, కాకినాడలోను, నెల్లూరులోను, కడపలోను జరుపబడెను. ఆంధ్రరాష్ట్రావశ్యకతను గురించినాలు ఆమోదింపబడెను. ప్రతినిధులెంతో సంతోషంతో వచ్చే వారు ఎన్నో కష్టాలను సైతం ధరించి సభలకు వచ్చేవారు.

ఆంగ్లాధికారులూ సింధూ, ఒరిస్సా పరిగణాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారు. అంతేగాకుండా ఆంధ్రరాష్ట్ర రాజకీయ నాయకులు యం చిన్నచూపు చూశారు కూడా ద్వంద వై ఖరిని అవలంభించారు
అలాంటి కారణాల వల్ల ఆంధ్రరాష్ట్రావతరణకు అవకాశం కలగలేదు. జాతీ యోద్యమమే అతి ముఖ్యమైనదని తోచడంచేత దానికిచ్చిన ప్రాధాన్యత ఈ ఉద్యమాని కివ్వకపోయినా దీన్ని పూర్తిగా మానలేదు. స్వతంత్ర్యము వచ్చాక ఆ భావము ఒక్కసారిగా ఉబికింది. ఉద్యమము మొదలయింది. ఆంధ్రరాష్ట్రావతరణే ఆంధ్రులకు తీరని కోరికయింది.

ప్రచారము ప్రారంభమయింది. ఆందోళన ప్రారంభ మయింది. కమిటీ పరిశీలనలూ జరిగాయి. ప్రధాని నెహ్రూలో తెగింపు రాలేదు. ఎటూ తేల్చి చెప్పలేదు. మళ్ళీ ప్రజలలో అసహనం, అశాంతి నిండిపోయింది. సమస్య నానాటికి జటి లంగా తయారయింది. కొండా వెంకటప్పయ్యగారు మదరాసు నగరము ఆంధ్రులదేనన్న వాదాన్ని లేవనెత్తి చనిపోయేవరకూ అలాగే ఆందోళనచేస్తూ చనిపోయారు. మద్రాసు రాష్ట్రము లోని తెలుగువారు ఆంధ్రరాష్ట్ర అవతరణ గురించి ఒత్తిడి చేసినా నాటి మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి ప్రయత్నాలను ఫలరహితము చేశాడు.

కాంగ్రెసు వర్కింగుకమిటీ ఆంధ్రరాష్ట్ర నిర్మాణ విష యంలో సూచనలిచ్చేందుకొక ఉపసంఘాన్ని నియమించింది. దానిలో ముగ్గురు సభ్యులు తమ నిర్ణయాలను తెలియజేయ వలసివుంది. నెహ్రూజీ, పటేల్, పట్టాభి సీతారామయ్యగార్లు ఆ సభ్యులు. ఆ త్రిసభ్య సంఘంవారు సమర్పించిందే జె.వి.పి. రిపోర్టు. వారు ఆంధ్రులకురాష్ట్రం ఏర్పరచేందుకు అంగీకరిం చినా మద్రాసు నగరం మీద హక్కులు ఆంధ్రులు వదులు కోవాలని సూచించారు.

కాని మద్రాసు విషయమై పట్టుదల హెచ్చింది. ఆ నగరం తెలుగువారి జన్మహక్కని దానిమీద సర్వాధికారాలు తెలుగువారికే దక్కాలని తెలుగువారిపంతం.నగరంమీద దగ్గరనుండి ఆ నగరాభివృద్ధిలో ఆంధ్రుల కృషి చాలా వుంది. విద్య, వ్యాపార, వైద్యపరిశ్రమల దగ్గర నుండి సేద్యంచేసిన బంజరుభూములు సాగు వరకూ ఆంధ్రులు చేసినకృషే గనుక దానిమీద హక్కు ఆంధ్రులదేనని తెలుగువారి వాదన. నగరం లేకుంటే తెలుగువారికి రాజధాని లేదని చెప్పారు, ఏదిఏమైనా మద్రాసు విడిచిపెట్టేందుకు తెలుగు వాడెవడూ యిష్టపడలేదు. ఆంధ్రరాష్ట్రము నుండి దాన్నికొందరు వేరుచేస్తే దానికి ప్రతిగా కొన్ని కోట్లరూపాయలు నష్టం హారాన్ని చెల్లించాలని కొందరు వాదించారు కూడాను. ఏది ఏమైనా ఫలితం కన్పించలేదు. రాష్ట్రాద్యమము నెమ్మదిగా సాగింది.

ఎన్ని తీర్మానాలు జరిగినా, ఎన్ని సమావేశాలు జరి గినా ఎన్ని సభలు మహాసభలు జరిగినా ఆంధ్రరాష్ట్రావతర ణకు ఏదో అవాంతరం అడ్డుపడుతూనే వచ్చింది. మొదట్లో వున్న ఆ పట్టుదల, ఉత్సాహం అందరితోనూ నిలువలేక పోయింది. చాలామందిలో అణిగిపోయింది. అందుచేతనేమో ఆంధ్రుల్ని ఆరంభశూరులు అన్నారు. క్రమంగా ఆంధ్రుల కానీ అందరూ కాదు’ శూరత్వము ఉద్యమం చల్లబడింది ఆ ఆవేశము తగ్గనివారు పట్టుదల కలిగినవారు చాలామంది వున్నారు.

శ్రీరాములుగారు వారిలో కూడా వున్నారు. 1957 నాటికి గట్టిగా నిలచినవారు అతితక్కువమంది. కాని ఆ సంవత్సరమే ఆంధ్రులచరిత్రను తారుమారుచేసింది. ఆరంభ శూరులు కాస్తా అఖండవీరులు అన్పించుకున్నారు అణ గారిపోతున్న ఆంధ్రుల ఉద్రేకాన్ని చూచి మిగిలినవారిలో చులకనభావం ఏర్పడింది. ఆ చులకనను చూడగానే చిర్రెత్తి పోయింది. గుండెల్లో మంటలు రేగాయి. కొందరిలో పట్టుదల రెట్టింపయింది నిడుబ్రోలు దగ్గర విమానాశ్రయంవుంది దాని అసలు పేరు గొల్లపూడి స్థాపకులు స్వామి సీతారాంగారు శ్రీ సీతారామశాస్త్రి. ఆయనలో కల్గిన పట్టుదల నిరాహారదీక్షకు దారితీసింది.

ఆంధ్రులకొర రాష్ట్రంవచ్చేవరకూ నిరాహరదీశ చేస్తానని ప్రారంభించారు 35రోజులు గట్టి పట్టుదలతోనే ఉన్నారు కాని నెహ్రూ, వినోబాల మందలింపుతో నిరాహార దీక్షను విరమించుకున్నారు. ఆయన వెనుకంజ వేయడాన్నెం దరో విమర్శించారు. ఆ చిన్న సంఘటనే దృఢమయిన ఆ సమయంలోనే శూరత్వమే చూపాడన్నారు ప్రాణరక్షణకోసం ఆయనే అలా నటించాడన్నారుకాని ఆయన చేసినపని మరొకటి ప్రోత్సాహ మిస్తుందని యెవరూ ఊహించలేదు.

POTTI SRIRAMULU,

శ్రీరాములుగారి పట్టుదలను రెట్టింపు చేసింది అభిప్రాయాన్ని నిశ్చయించుకొన్నాడు. గోరాగారి కుమార్తె మైత్రిగారి వివాహానికి హాజరుకావలసి వుంది. వివాహానికిహాజరై భీమవరంలోని ప్రకృతిఆశ్రమంలో నున్న నాయకులతోను కార్యకర్తలతోను మేనల్లునితోను చర్చించి మద్రాసులోనే దీక్షను ప్రారంబించాలని నిర్ణయించు కున్నాడు నెల్లూరులో చేరి అక్కడున్న కార్యకర్తలను సంప్ర దించాడు. మద్రాసు చేరి రాష్ట్ర మాజీస్పీకరుగారైన బులుసు సాంబమూర్తిగారితో చర్చించి దృఢమయిన తన పట్టుదలను తెలియజేశాడు. కాని ఆయన ఎన్నో ఆటంకాలు చెప్పి నిరుత్సాహపరచాలని చూచాడు.

మొండిపట్టుదలను చూచి ముందు ఆ నిరాహారదీక్షను తన కాని శ్రీరాములుగారి యింట్లోనే ప్రారంభించమని కోరారు. శ్రీరాములుగారు దీక్ష వహించేముందు ఆ ఉపవాసదీక్ష నిశ్చయానికి తగిన కారణాలను ఆంధ్రోద్యమ చరిత్రనుండి ఆ సమయంవరకు జరిగిన చరిత్రను ప్రజల ముందుంచుతూ తెలియజేశారు.

రోజులు గడిచిపోతుంటే ఆరోగ్యము తరిగిపోతూ వచ్చింది. అయినా ప్రభుత్వము పట్టించుకోలేదు. కాని పట్టిం చుకునే ఆంధ్రుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపు అవుతూ వచ్చింది. 28 రోజులు గడిచేసరికి 19 పౌస్ల బరువు తగ్గిపో యింది. వైద్యబృందం పరీక్షించి మార్పును ప్రకటించారు’ నాడి పడిపోయిందని, బరువు తగ్గిపోయిందని అతినీరసంగా వున్నారని వారు ప్రకటించగానే ఆంధ్రప్రదేశ్ ప్రజల హృద యాలలో పెను తుపాను చెలరేగింది. 32రోజులవరకూ ప్రభు త్వము చలించలేదు. 4-1′ -53లో ఆంధ్రప్రభలో ప్రకటిం పబడిన వివరాలు చదివిన విద్యార్థులలో చైతన్యము కలిగిం చింది. 45 రోజులు గడిచిపోయాయి. అప్పటికే విద్యాసంస్థలు రోజుకొక పూట సమ్మెచేస్తూ తమ మద్దతును ప్రకటించాయి. శ్రీరాములుగారికి ఎటువంటి అపాయం జరిగినా సహించేది లేదని బహిరంగసభల్లో చెప్పటము ప్రారంభమయింది.

డిశంబర్ 5, 6 తేదీలు వచ్చేసరికి శ్రీరాములు గారి పరిస్థితి విషమించింది. ఆంధ్రరాష్ట్రాన్ని నిర్మించి ఆయన జీవి తాన్ని కాపాడాలని ఆంధ్రదేశం నలుమూలల నుండి ఎన్నో తంతివార్తలు ఢిల్లీకి వెళ్ళాయి. కాని అప్పటి మద్రాసుముఖ్యమంత్రి అయిన రాజాజీ శ్రీరాములుగారి దీక్ష విషయము
అంతగా పట్టించుకోవలసిన పనిలేదని వ్రాయడముతో కేంద్ర నాయకులు కూడా మౌనం వహించారు.
ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్యను పరిశీలిస్తామనిప్రధాని నెహ్రూ డిశంబరు 9వ తేదీన శ్రీరాములుగారికి పెలిగ్రాం పంపారు. కాని ప్రధానిహామీని సైతము ఆయన లెక్కచేయలేదు. దీక్ష విరమించలేదు. విరమిస్తే శ్రీరాములుగా నేమిగిలేవాడే. విరమించలేదు గనుకనే “అమరజీవి పొట్టి శ్రీరాములు” కాగలిగాడు. కొందరు మిత్రులు విరమించమన్నారు.

మరికొందరు పొడిగించమన్నారు. ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికొక తేదీని నిర్ణయిస్తేనే దీక్షా విరమణ అని నెహ్రూకే స్పష్టముగా కబురు పంపాడు. తాను బలికాక తప్పదని ఆయననిశ్చయించుకున్నారు. అప్పడే ఆంధ్రరాష్ట్రం వస్తుందనివిశ్వసించారు. దీక్షను మాత్రం ఏడిచి పెట్టకుఁడా తన గమ్యం
వైపు దృష్టిని మరల్చారు. వైద్యులుమాత్రం ప్రతిరోజూ పరీక్షిస్తూ ఆయన శారీరక పరిస్థితులను నమోదుచేసుకుంటూనే వుండేవారు. వారికి మాత్రం నమ్మకం పోయింది. 57 రోజులు గడిచిపోయాయి.
15-12-52 సోమవారం వచ్చింది. అది 58వ రోజు. ఉదయానికే బాగా నీరసించిపోయాడు. ముఁదు రాత్రి అంతా మూకుమ్మడిగా పిడికిలి బిగించారు. ఆంధ్రరాష్ట్రం కావాలన్నారు.

ఉద్రేకం నిండిన ప్రజలు వశంతప్పారు. ఆం దోళనను లేపారు. ఆంధ్రదేశమే ఉడికిపోసాగింది. కన్నీరు మున్నీరుగా విలపించేవారు విలపిస్తూనేవున్నారు. గాంధేయ వాదిగా ఆంధ్రరాష్ట్రంకోసం ఆత్మను ఆహుతిగా చేసిన శ్రీరా ములుగారికోసం ఆంధ్రప్రాంతం నుండేగాక దేశం నలుమూ లల నుండి నివాళులందాయి. ప్రపంచంలోని ప్రముఖులంతా పరితపించారు. మిన్ను మన్ను ఏకమయ్యేలా ఆక్రందనలు అలముకొన్నాయి. రాలిపోయిన జాతిరత్నంకోసం రోదనలే వేదనలై మిగిలిపోయాయి. ఆంధ్రులకోసం నడుంకట్టిన నాయకుడు అమరజీవిగా మిగిలిపోయాడు.1956లో ఆంధ్రరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయింది. నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఆంధ్రరాష్ట్రం ఉద్భవించినా, ఆంధ్రప్రదేశ్ అవతరించినా అదంతా శ్రీరా ములుగారు పెట్టిన భిక్షేనని చెప్పక తప్పదు.

Leave a Comment