DURGABAI DESHMUKH IS A GREAT LADY DON.

DURGABAI DESHMUKH IS THE GREAT FREEDOMFIGHTER


DURGABAI DESHMUKH…కాకినాడలో రామారావుగారి పైపు ఇన్స్టిట్యూట్ లో ఎందరో విద్యార్ధులు నేర్చుకొంటున్నారు. అసలు రామారావు గారికి బీద విద్యార్థులకు ఉచితముగా నేర్పటమంటే ఇష్టము. కొంతమంది వాళ్ళింటిలోనే భోజనము చేసేవారు. ఆయన భార్య కృష్ణవేణమ్మగారు ఎంత రాత్రయినా ఎందరు వచ్చినా వంట చేసి పెట్టేసేది. ఆ తల్లి దండ్రులకు ముద్దుల కూతురుగా DURGABAI DESHMUKH 1909లో జన్మించింది.

DURGABHAI DESHMUKH,

అల్లరి, దిప్పకాయతనం మొగమాటము లేని దురుసుతనము DURGABAI DESHMUKH కు అబ్బిన గుణాలు ఒకసారి ఒక పెద్దమనిషి వారింటికివచ్చి పని పేరుతో కొన్ని రోజులు తిష్టవేశాడు. ఆ చిన్నారి దుర్గ ఆయన మొహముమీదనే ఏమండి మిమ్మల్ని ఎన్నాళ్ళనుండో చూస్తున్నాను. ఈ ఊళ్ళో మీ పని ఇంకా కాలేదాండి అని అడిగింది. ఆయన మొహము ఎలా తెలాబోయింది. రామారావుగారు సర్దిచెప్పారు.

ఒకసారి రామారావుగారింటిలో స్నేహితుడు భోజనము చేస్తూ వడ్డించిన కూరను మెచ్చుకున్నాడు. తల్లి కొంచెము కూరనే చేసినట్లు లోపల అనుకోవటము విన్న DURGABAI DESHMUKH యింకా కూర అడగవద్దని ఆ పెద్దమనిషికి చెప్పేసింది. దాంతో తల్లి ఎంతో బాధపడింది. ఇంటిలో ఏమనుకొన్నా టాంటాం కావల సిందే వీధి పాఠశాలలో కోలాటాలు, పాటలు నేర్చుకునేది, తల్లి వీణ వాయించేది. తండ్రికూడా వీణను వాయించేవాడు కాకినాడలో సరస్వతీ గానసభ నిర్వహింపబడేది.

సంగీత విద్వాంసుడు వారి వారి సంగీతములను వినిపించేవారు. కంఠ స్వరముకల DURGABAI DESHMUKH కు సంగీతమంటే మక్కువ. తాను ఇంటిలోను పాఠశాలలో నేర్చుకొన్న పాటలను నిర్భయముగా పాడుతూ వుండేది. రామాయణము, భారతము, భాగవతము, కరతలామలకాలే. వారింటిదగ్గరే మౌల్వీ వుండేవాడు. ఆయన దుర్గకు ఉర్దూ నేర్పేవాడు, రాజమండ్రి DURGABAI DESHMUKH కి మేన మామల ఊరు.

1920లో గాంధీజీ [రాజమండ్రి వచ్చారు. దుర్గ అప్పుడు అక్కడే ఉన్నది. గాంధీగారు ప్రసంగించిన సభలకు లక్షమంది వచ్చారు. గాంధీజీ హరిజన నిధికి, కాంగ్రెసు సంస్థ నిధికి డబ్బు వసూలు చేసేవారు, పదకొండేండ్ల దుర్గకు తానుకూడా చం దాలు వసూలు చెయ్యాలని కల్గింది. గాంధీకి టోపి పెట్టుకొని జాతీయగీతాన్ని పాడుతూ డబ్బును ప్రోగు చేసింది. దగ్గర ఏబదియెనిమిది రూపాయలున్నాయి. జనాన్ని తోసుకుంటూ ముందుకు సాగిపోయింది.

కొల్లాయి కట్టుకున్న గాంధీని చూస్తూనే తన్ను తాను మరచిపోయింది. ఆయన కాళ్ళమీద పడింది. తనదగ్గరున్న డబ్బు, చేతి బంగారు గాజులు ఆయనకు యిచ్చేసింది. గాంధీజీ తనవద్ద కూర్చో బెట్టుకుని తల నిమిరి కూర్చోబెట్టుకుని ఆశీర్వదించాడు. తాతగారు వచ్చి నమస్కరించి చేతి ఉంగ రాన్ని అమ్మమ్మ గాజుల్ని గాంధీజీకి ఇచ్చి వేశారు. ఈ సంఘ టన హృదయంతో చెరగని ముద్రవేసింది. జాతీయ గీతాల్ని పాడుతూ స్వాతంత్ర్య వాంఛను ప్రకటించేది. కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ కోమపై పుట్టితేనేమి అని పాడుతూ తన్మయత్వం పొందేది.

DURGABAI DESHMUKH,

మాకొద్దీ తెల్ల దొరతన మంటూ కంఠమెత్తి ప్రబోధించేది. ఎక్కడపడితే అక్కడ హిందీ నేర్చుకొనేవారు ప్రజలు. కాకినాడలో విదేశ వస్త్ర బహిష్కరణ ముమ్మరంగా సాగుతూ వుండేది. రామారావు గారు, కృష్ణవేణమ్మగారు ఖద్దరు కట్టారు. చిన్నారి దుర్గ తమ్ముడు నారాయణరావు కూడా ఖద్దరే కట్టారు రామారావు గారు కోర్టులో సైనోగా పనిచేస్తూ వుండేవారు.


DURGABAI DESHMUKH సైకిలు మీద ప్రతిరోజూ బంధుమిత్రుల గృహాలకు వెళ్ళి యోగక్షేమాలు విచా తించి యింటికివచ్చి భోజనం చేసి కోర్టుకు వెళ్ళేవారు. పైపు ఇన్స్టిట్యూట్ లో వీదవాళ్ళకు ఉచితంగా నేర్పేవారు. రామా రావు సరదా కలవాడు. వీణ వాయించేవారు. ప్లేగు, మశూచి ఎత్తిపోసినప్పుడు ప్రజలకు సేవచేసేందుకు నిర్భయంగా ముందుకు దూకేవాడు.

తన చిన్నప్పుడే రామారావుగారి తండ్రి చనిపోయి నాడు. తల్లికి ఆసరాగా ఉండేవాడు. నోట్లో నాలికలా మెదు లుతూ నలుగురి పనులను చక్కపెట్టేవాడు వాళ్ళూ తన పనికి చేదోడు అయ్యేవారు. కార్తీకమాసంలో వనభోజనాలు సర్పవరంలో జాజి, మల్లెతోటలు, దుర్గ హృదయంలో ప్రజా సేనను ముద్రించేవి. దసరాలో ఇంట్లో వేదపండితులకు సంభా వణలు జరిగేవి. రామారావుగారు దుర్గకు, నారాయణరావు నకు ఈసఫ్ ఫేబుల్సు రేనాలు నవలలు చదివి చెప్పేవాడు.

కాశీమజిలీలు, మర్యాదరామన్న కధలు, తెనాలి రామకృష్ణుని కధలు చదివించేవాడు. చొల్లంగి జాతరలో చిన్నపిల్లలు తప్పి పోతే వారిని ఇళ్ళకు చేర్పించేవాడు. మసీదులకు, చర్చిలకు పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాడు మతసహనం ఇట్లా పిల్లల్లో పెంపొందేది. 1923లో కాకినాడలో కాంగ్రెసు మహాసభ బోతోంది. అందులకు వాలంటీర్లు కావాలి. ఎవరితోను చెప్ప కుండా 14 ఏండ్ల వయస్సుగల దుర్గాబాయి స్త్రీలతోను, పురు షులతోను వాలంటీర్ల ను తర్ఫీదుచేయుటకు పూనుకొన్నది.

DURGABAI DESHMUKH,


DURGABAI DESHMUKH బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించింది. అందులోని బాలికలను వాలంటీర్లుగా తీర్చిదిద్దింది. జాతీయ గీతాలు పాడుతూ కాంగ్రెసు జెండాలను ధరించి కవాతు చెయ్యటం, ముందడు గుగా నడవటం నేర్పింది. గాంధీగారి సిద్ధాంతం ప్రకారము గ్రామ పారిశుధ్యం, స్వయం సేవ, వయోజన విద్యలను ఆచరణలో పెట్టేది. ముగ్గులు పెట్టడంలో
DURGABAI DESHMUKH అందెవేసిన చెయ్యి.

సంక్రాంతి పండు గకు మంచి మంచి ముగ్గులు వేసేది. ఎంతమంది ఆడ పిల్లలకో నేర్పేది. వీధులూడ్చి కల్లాపిచల్లి పెద్ద పెద్ద ముగ్గులు వేసి కాంగ్రెసు నాయకులకు స్వాగతం చెప్పింది. కాకినాడలో 15 సం||లయినా నిండని దుర్గాబాయికి వాలంటీరుగా పని చేసే అవకాశం లభించలేదు. తానే తరిఫీదు చేసిన ఆడపిల్లలు స్వయం సేవికలుగా పనిచేయుట తనకు గర్వకారణం. గ్రెసు రధం ముగ్గును ఆందరు కొనియాడిరి.

గాంధీ సారధి, నెహ్రూ అర్జునుడు అనే సోదరులిరు ప్రక్కలను, ప్రకాశం, సాంబమూర్తి, కొండా, మోతీలాల్ పట్టాభి, చిత్తరంజన్, లజపతిరాయ్ లు గుర్రాలు కురుక్షేత్ర సంగ్రామముగా ఇంగ్లీ షువాళ్ళతో పోరాటానికి ముగ్గుతయారు చేసింది దుర్గ. కాంగ్రెసు సభలకు ఒక ద్వారం దగ్గర సాంబ మూర్తిగారు దుర్గను వుంచారు. టికెట్ లేనివారిని లోనికి రానీయవద్దని కొండా వెంకటప్పయ్యగారు చెప్పిరి.

ఇంతలో ఒకవ్యక్తి టికెట్ లేకుండా వెళుతున్నాడు. DURGABAI DESHMUKH వెళ్ళనీయలేదు. గేటు దగ్గరే ఆ వ్యక్తి నిలబడినాడు. రెండణాలిచ్చి టిక్కెట్ తీసుకోండి అంది. ఆ వ్యక్తి దగ్గర చిల్లరలేదు. ఈలోగా కొండా వెంకటప్పయ్యగారు వచ్చారు. ఆ వ్యక్తి కొండా దగ్గర చిల్లర తీసుకొని టిక్కెట్టు కొన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు జవహర్లాల్ నెహ్రూ. కొండా వెంక టప్పయ్యగారికి దుర్గమీద పట్టరాని కోపంవచ్చింది. చెవి నులిమి హుంకరించారు. కాని నెహ్రూ ఆ వాలంటీరు విధినిర్వహణకు ఎంతో మెచ్చుకొన్నాడు.


DURGABAI DESHMUKH నెలకొల్పిన హిందీ పాఠశాలను జమునా లాల్ బజాబ్ సందర్శించి మెచ్చుకొన్నాడు. చిన్నమాంబా దేవి, పిఠాపురం రాణి DURGABAI DESHMUKH ఆమెను తమ హిందీ స్కూలును చూచుటకు పిలిచెను. ఆమె రాకపోయినను చందాగా కొంత పైకమును పంపెను. స్కూలునకు స్థలము ఏర్పాట్లు గావించబడెను. బాలబాలికలు ఎక్కువగా చేరి హిందీని నేర్చుకొనుచుండిరి. “చూ చలచలా కర్ంగె స్వరాజ్య లేంగె” అనే ఉద్యమ గీతంతో చరఖాలు త్రిప్పుతూ ఖద్దరు కట్టుతూ ఆ స్కూలులోని విద్యార్థులు కాంగ్రెసు స్వయం సేవకులుగా తయారగుచుండిరి.https://photos.app.goo.gl/aH2ixicr6Z9RNPz18

విద్యార్థినులు పాటలు పాడుతూ వుద్యమాన్ని ప్రచా రము చేసేవారు. ఆ రోజుల్లో ధనికుల ఇళ్ళల్లో పెండ్లిళ్ళకు భోగం మేళాలు పెట్టేవారు. దేవదాసీలుగా వుంటూ నీచ జీవి తాల్ని సాగించే ఆ వర్ణమును డబ్బున్న ప్రతివాళ్ళూ హీనంగా చూచేవాళ్ళూ, ఆట్లాగ ముస్లిం స్త్రీలు ఘోషాలో మ్రగ్గుతూ లోకంలో జరిగే వ్యవహారాలు తెలియకుండా ఉండేవాళ్ళు విద్యలేదు సంస్కారంలేదు. ఈ రెండు వర్గాల్ని బాగుచేయా అని దుర్గ సంకల్పించింది.

గాంధీగారిని సందర్శించినచో, సంభాషణలిన్నచో శ్రీ లలోనన్నా ఉత్తేజము కలుగుతుందని
DURGABAI DESHMUKH ఊహించినది. దేవదాసీలు ముస్లిం స్త్రీలు సభ్యులుగా వికాససభ యేర్పాటగు చుండెను. వారికి విద్య, చరఖా త్రిప్పుట, చేతిపనులు నేర్పు టను దుర్గాబాయి తగిన కార్యక్రమములను రూపొందించెను. 1926లో గాంధీ కాంగ్రెస్ నిధికై ఒక కోటి రూపా యలు వసూలు చేయు నుద్దేశ్యముతో ఆంధ్రదేశ పర్యటన ప్రారంభించెను.

గాంధీగారిని తమ స్కూలునకు వచ్చి మహిళా సభలో ఐదు నిమిషములు ప్రసగించునట్లుగా అవ కాశ మొసగవలయునని DURGABAI DESHMUKH సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్యలను కోరినది. వారు ఐదు నిమిషముల గాంధీ ప్రసంగమునకు ఐదు వేల రూపాయలు నిధి కోరిరి. సరేనని
DURGABAI DESHMUKH బయలుదేరినది. ఇదొక నవ్వుబాటలాగా కొండా వెంక టప్పయ్య మొదలగు వారనుకొనిరి. గాంధీజీ వేరేసభలో మాట్లాడుతూ జాతీయ కాంగ్రెసు నిధికై చందాలివ్వవలసినదిగా కోరిరి. అప్పటికే దుర్గ ఐదు వేలు ప్రోగు చేసినది.

దేవదాసీలకు పురాణకధలు చెప్పియు, దుర్గాదాసు నాటకములు వేసియు, జాతీయ గీతాలు పాడియు మార్పులు చేసి వచ్చిన ధాన్యాదులను చందాలు వసూలు చేసి నది. సాంబమూర్తిగారు గాంధీని సభలో చూడండి, రొక్క మిప్పుడిప్పుడే ఇవ్వండి అన్నారు. దుర్గకు కోపము వచ్చినది. గాంధీజీని నా కోసం కోరుటలేదు. స్త్రీ సంక్షేమము కొరకు ఆయన దర్శనం స్త్రీలలో విలువ కల్గించునని ఆమె వాదించి నది. ఆ అభ్యర్ధనను బాల్యచాపల్యంగా తీసి వేయలేక పోయిరి. ఆ సాయంత్రం గాంధీజీకి ఈ విషయాన్ని సాంబ మూర్తిగారు చెప్పిరి. ఆయన ఒప్పుకొనెను.

హిందీ పాఠశా లలో బాలికలు, స్త్రీలు కిటకిటలాడిరి. దేవదాసీలు, ముస్లిం స్త్రీలు, గుంపులు గుంపులుగా వచ్చిరి. మూడు రంగుల జెండాలతో ఖద్దరు కట్టిన బాలికా స్వయం సేవకులు జాతీయ గీతముల నాలపించుచుండగా దుర్గాబాయి త్రోవచూపగా గాంధీజీ హిందీ పాఠశాలకు వచ్చెను. జాతీయ నాయకులు కొండా వెంకటప్పయ్య, సౌంబమూర్తి వగైరా అందరూ వచ్చారు. ఐదు నిమిషములు మాత్రమే అంగీకరించి వచ్చిన గాంధీకికి ఐదువేల రూపాయలను దుర్గాబాయి అందించి నమస్కరించింది. గాంధీజీ దేవదాసీలు ముస్లిం స్త్రీల సమస్య లకు పరిష్కార మార్గములను సూచించుచు ఉపన్యాసా లిచ్చెను.


DURGABAI DESHMUKH తర్జుమా చేయుచుండెను. పదినిమిషాలు దాటెను. గాంధీజీ ఆవేశంతో భారత స్త్రీ సముద్దరణకై చేయ వలసిన కార్యక్రమం వివరించుచు ప్రసంగించెను. ఒక గంట దాటింది. స్త్రీలు ఉత్సాహంతో వినుచుండిరి, ఆయనను అడ్డు పెట్టువారెవరు? కొండా వెంకటప్పయ్య విసుగుతోను, కోపం తోను DURGABAI DESHMUKH వైపు చూచుచుండెను. ఎవరేమి చేయగలరు? రెండనగంట కూడా ముగిసెను. ఆయన తన ఉపన్యాసమును ఆపివేసెను ఆ ఉపన్యాసం స్త్రీలకు కనువిప్పు కలి గించెను.

ఆమె తర్జుమా యెంతో బాగుండుటచే తర్వాత ఆంధ్ర పర్యటనలో ఆమె తర్జుమా చేయుచుండెడిది. సంఘటన ఆమెకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. బాపూజీ ఆమెను తన ప్రక్కన కూర్చోవలసిందిగా కోరుటచే కారులో కస్తూరిబా వద్ద కూర్చొనినది. అచ్చటనే జయప్రకాశ్ నారా యణ్ భార్య ప్రభావతిదేవి కూడా కలదు. కారులో చోటులేక కొండా వెంకటప్పయ్యగారు వేరొక కారెక్కిరి. కాకినాడ టౌన్ హాల్లో బాపూజీ ప్రసంగం ఆమెయే అనువాదం చేసెను.https://pincodesguide.in/kandukuri-veeresalingamgreat-social-reforms/

కాకినాడలో గాంధీ పర్యటన పూర్తి చేసుకొని ఆంధ్ర ప్రాంతములకు బయలుదేరెను. ఆయనవెంట దుర్గాబాయి కూడా పర్యటించెను. దానితో దుర్గాబాయి పేరు ప్రతిష్టలు ఆంధ్రదేశంలో ప్రాకిపోయినది. సంకల్పసిద్ధితో ఉద్యమములో, ధైర్యంగా దూకే చొరవగల దుర్గకు ఆటంకమేమియు లేదు.

తీరిక సమయాలలో స్త్రీల సమస్యలను ప్రతిబింబించెడి వ్యాసా లను కధలను వ్రాస్తూ వుండెడిది. అవి భారతి, శారద, గృహ లక్ష్మి వంటి పత్రికలలో ప్రచురింపబడుచుండెను. DURGABAI DESHMUKH భర్త సుబ్బారావుగారు జమీందారు. మితభాషి, బిడియం కల వాడు, సుందరుడు, సరదా కలవాడు. తానుగా స్వాతంత్రో ద్యమంలో పాల్గొనకపోయినా భార్యను ఆటంకపర్చలేదు. గృహ సౌఖ్యం లేకపోయినా ఆయన బాధపడలేదు. ఆయన మలేరియావ్యాధితో బాధపడుచుండెను.

ఆయనవైద్యమునకై మద్రాసునకు కాపురం మార్చెను కాశీనాధుని నాగేశ్వరరావు గారికి దుర్గాబాయితనను పరిచయంచేసుకొనుచు గృహవసతిని కోరుచు వ్రాసెను. ఆయన తమ ఇంటి వెనుక భాగంలో DURGABAI DESHMUKH వుండుటకు సమ్మతించెను. కాకినాడ నుండిమద్రాసునకు కాపురము మార్చబడెను. భర్తకు మందులను వేళకిచ్చుట, ఆయనకు పద్యములు నడుపుట స్వయముగా చేస్తూ ఉండేది, వ్యాధి కొంచెము తగ్గినది. తీరిక వేళల్లో కధలు వ్రాస్తూ వుండేది తల్లి నేర్పిన వీణను వాయించుకొనేది.

DURGABAI DESHMUKH CHILDHOD,


1930లో గాంధీజీ ఉప్పుసత్యాగ్రహమును మొదలు వెట్టెను. మనదేశమున వందలకొలది మైళ్ళ సముద్రం కలదు. ఆహారమునకుప్రధానమైన ఉప్పుపై బ్రిటీషువాళ్ళు పన్ను వేసిరి భారతీయులు భగవంతుడిచ్చిన సముద్రమునుండి ఉప్పును పండించు కొనినచో పన్ను కట్టవలెను. ఇది లోక విరుద్ధధర్మం గాంధీజీ ఈ శాసనమును ప్రతిఘటించెను. ఆయన పిలుపుతీసు కొని నాయకులు ప్రజలకు “ఉప్పుపండించు కొనుడని” ప్రోత్సహించిరి.

మద్రాసునగరంన నున్న DURGABAI DESHMUKH ఈ వుద్యమ ములో పాల్గొనవలెనని తీవ్రముగా ఉత్సాహం కల్గినది. తాను మద్రాసు నగరంనకు క్రొత్త. ఒకరోజు నాగేశ్వరరావు పంతులుగారితో సత్యాగ్రహమును గూర్చి ప్రస్తావించెను ఆయన తానూ టంగుటూరి ప్రకాశముగారలు చీరాలకు వెళ్ళు చున్నట్లు చెప్పిరి. మద్రాసునగరం సముద్రతీరంకదా! ఎందుకు మద్రాసులో ఆ ఉద్యమం ప్రారంభింపకూడదు.

అక్కడనుండి నాయకులైన కాశీనాథుని నాగేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం గార్లు ఎందుకు చీరాలదగ్గర ఓడరేవునకు పోవాలి? నగరంలోనే ఉద్యమం తీవ్రస్థాయిలో చేసినచో ఆంగ్ల ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకురావచ్చునుగదా! కాశీనాధునితో వాదించి ప్రయోజనం లేదు.ప్రకాశంగార్ని తాను ఎరుగదు.

DURGARABAI DESHMUKH POLITICS,


DURGABAI DESHMUKH రాత్రియంతయు బాగా ఆలోచించి ప్రకాశంగార్ని కలుసుకొనటంకోసం వెళ్ళినది, ప్రకాశంగారు స్త్రీలు ఆ వుద్యమంలో పాల్గొనరాదని గాంధీజీ అనుమతి లేదని తెల్పిరి దుర్గాబాయి గాంధీజీకి పై వుత్తరం
వ్రాసింది స్త్రీలు సగం జనాభా కదా! ఈ ఉద్యమంలో స్త్రీలు పాల్గొనినచో భారత ప్రజలలో సగం మందికి స్వేచ్ఛా సమర ములో తాముకూడా భాగస్వామినులనను గర్వంనకు దెబ్బ తగిలినట్లే! గాంధీజీ నుండి అనుమతి పత్రం లభించినది ఇక తగిన నాయకుని ఎన్నుకుని ఆయన ఆధ్వర్యంలో ఉప్పు సత్యాగ్రహంను నిర్విఘ్నంగనెర వేర్చవలసియున్నది.

సైమను కమీషను మద్రాసువచ్చిన సందర్భంలో తుపాకిగుండ్లకుగుండె నిచ్చిన ప్రకాశంగారికి దేశంలో ప్రతిష్ట పెరిగియుండెను. ఆయ నను ఒప్పించుటకై మరల ప్రకాశంగారి వద్దకు వెళ్లెను. కార్య క్రమముగూర్చి ప్రశ్నించినది మేము చీరాల వెళ్ళుచున్నామని ప్రకాశం చెప్పెను, మద్రాసులో సముద్రంలేదా? ఇక్కడెవరు ఉద్యమం నడుపుతారని దుర్గాబాయి అడిగినది. ప్రకాశంగారు ఆమె సూచనను అందికరించెను. నాగేశ్వరరావు పంతులుగారికి ఫోన్ చేసెను, కాశీనాధుని నాగేశ్వరరావుగారు ఇది అంతయు దుర్గా బాయి ప్రబోధమే అని గ్రహించిరి అప్పటికి దుర్గాబాయి వయస్సు ఇరువదొకయేడు. దుర్గాబాయి ప్రకాశంగారితో మన మిప్పుడొక గొప్పబహిరంగసభ నేర్పాటుచేయవలెననిచెప్పెను. తన కార్యదర్శి శ్రీ తాన సుబ్బారావుగారితో మాట్లాడి నిర్మ యింపుముని ప్రకాశంగారు చెప్పిరి.

మద్రాసులోని తమిళ, కర్ణాటక, మళయాళ, ఆంధ్ర విద్యార్థులు నాయకులు పాల్గొనుటకు తరుణము కల్పింపక పోయినచో ఉద్యమంకార్యక్రమం యెటు అందరకు తెలియును ఉద్యమం గూర్చి ప్రజలకెంత స్పష్టంగా తెలిసిన స్థాయిలో సత్యాగ్రహం జరుగును. ఫాసా సుబ్బారావుగారు కూడా ఒప్పుకొనిరి, వాలంటీర్లను ఎన్నిక చేసిరి. డెబ్బది మందికి తర్పీదివ్వబడెను. కార్యక్రమము నిర్ణయించబడెను. బహిరంగ సభలకు లక్షపై చిలుకు జనం వచ్చిరి.

ఏ ఏ రేవులో ఏవరెవరు ఉప్పు పండించుటకు ముందుకు సాగిపోవాలనో ఏర్పాటు చేసిరి. అరెష్టయిన వారు వదలిన కార్య క్రమమునెట్లు మిగిలినవారు నిర్వహించవలెనో నిర్ణయించిరి. తెలుగు కోమట్లు బియ్యం, తమిళ వ్యాపారు లితర పదార్థ ముల నిచ్చిరి, వాలంటీర్లు అసంఖ్యాకముగ పెరిగిరి. జట్లు జట్లుగా విడిపోయిరి. మద్రాసు నగరమున రాయపేటలో సత్యాగ్రహా శిబిర మేర్పాటు చేయబడెను. ప్రెసిడెన్సీ మేజి స్ట్రేటునకు సత్యాగ్రహమునకుగాను నోటీసులు పంపించిరి.


DURGABAI DESHMUKH 1930 ఏప్రిల్ లో ప్రకాశంగారు బీచ్ ఉప్పుసత్యా గ్రహమును ప్రారంభించెను. తాను అరెష్టయినచో తరువాత దుర్గాబాయి నాయకురాలుగా నిర్ణయించెను.పెద్ద ఊరేగింపు లిండ శెట్టిస్ట్రీట్, జార్జి టౌనులగుండా బయలుదేరును. అప్పటి పరిస్థితులను గూర్చి పత్రికలు ఇట్లావ్రాసినాయి. ఒక పెద్ద శకటంపై నిలువెత్తు గాంధీబొమ్మఖాదీ దండలు త్రివర్ణములతో అలంకరించబడి యుండెను. టానికి ముందుగా త్రివర్ణ పతాకములు పట్టుకొని వాలంటీర్లు “గాంధీజీతిపై ” “వందేమాంతరం” “ఇంక్విలాబ్ జిందాబాద్” “బ్రిటిషు గవర్నమెంటు డౌన్ డౌన్” అంటూ బయలు దేరిరి. వారి తర్వాత స్త్రీల వాలంటీర్లు మూడు వన్నెల బాడ్జీలుధరించి జాతీయగీతాల్ని ఆలపించుచు నడచిరి.

బ్యాండు మేళమునకు అనుగుణముగ కవాతు చేయుచు తెల్ల దొరతనం మాకొద్దని గుప్పిళ్ళు బిగించి ప్రాణాల్ని దేశ సేవకై అర్పించెదమని పల్కుచూ యువకులు నడచిరి. శకటముపై ప్రకాశం కాశీ నాధుని మొదలైన నాయకులెక్కిరి జాతీయభావం పెల్లుబు కుచూ ఆనాటి ఊరేగింపు సాగినది. షాపులను మూసివేసిరి మేడలపై నుండి దోసిళ్ళతో పూలను శకటముపైనున్న నాయ కులపై చల్లుచుండిరి. నాల్గురోడ్ల కూడలిలో ప్రజలు ఊరేగిం పును కన్నులారా చూచిరి. నాయకుల నుదుట వీరతిలకములు దిద్ది కర్పూరహారతులిచ్చిరి.


ఇదియంతయు బ్రిటీషు ప్రభుత్వం గమనించుచునే యున్నది. పోలీసులు లాఠీలు పట్టుకొని గుర్రములపై వచ్చిరి. బీచ్ వైపునకు సముద్ర ఘోషతో ఊరేగింపుచేరినది. ప్రజలు సత్యాగ్రహమునకై అత్యుత్సాహంతో వచ్చి పడుచుండిరి.హఠాత్తుగా లాఠీచార్జి మొదలైనది. స్త్రీలు సత్యాగ్రహంలో పాల్గొనవద్దని పోలీసులు కేకలు వేసిరి. ఎవరూ వినిపించుకొన లేదు వందేమాతరం గాంధీజీకి జై అంటూ జనము ముందుకు దూసుకొని పోవుచుండిరి, డా॥ నటరాజన్గాగారిని బాగా లారీ ఛార్జి చేశారు చేయి విరిగిపోయినది.

ప్రకాశంగారిని కాశీ నాధుని నాగేశ్వరరావు గార్ని అరెస్టుచేసి తీసికొనిపోయారు. ఇప్పుడిక దుర్గాబాయేయే నాయకురాలు. లార్డు కన్నింగ్ హాం పోలీసు అధికారిస్వయంగా సత్యాగ్రహంను అణచి వేయుటకై వచ్చెను. దువ్వూరి సుబ్బమ్మ DURGABAI DESHMUKH తోడుగ నిలబడినది.పోలీసులు స్త్రీలపై కూడా లారీలు ప్రయోగించిరి. బాగా దెబ్బలుతగిలి స్త్రీలు కొందరు నెత్తురు కారుతూ స్పృహ తప్పిపడిపోయారు.
దుర్గాబాయి పదిమంది వాలంటీర్లతో శాంతో మకు చేరిపోయినది. ఉప్పుపంట ప్రారంభించింది. పోలీసులు గుర్రా లపై అక్కడికి చేరిరి.

గుర్రాల కాళ్ళకింద లాటి దెబ్బలతో ఎముకలు విరిగి జనం పడిపోయారు. నెత్తురు చెమటలతో కరిగిపోయిన ఉప్పు కారిపోతూండగా సాయంత్రమైపోయింది ఉద్యమం సద్దుమణిగినదనుకొన్న ప్రభుత్వంనకు ఆశ్చర్యం కలిగేటట్టు తిలక్ ఘాట్ లో ఉప్పు పండించటానికి వాలంటీరు వచ్చి పడ్డారు. వారినక్కడ నుండి తరిమివేస్తే మెరీనా బీచ్ మళ్ళీ ఉప్పుప్పుట సిద్దం అక్కడ లాఠీచార్జి చేస్తే ట్రిప్లి కేస్లో తయారు. ఇన్ని విధాలుగా పధకాలుగా వేసిన గట్టి బుర్ర ఆమెది. ప్రభుత్వం ఆమెను అరెస్టుచేసి ఇరవై రెండు నెలలు జైలు శిక్ష విధించింది. రాయవెల్లూరు జైలులోకి స్త్రీల వాలంటీర్ల ను తరలించారు. ఈ జైలులోనే ఆచంట రుక్మిణి, పొణకా కనకమ్మ, కృష్ణవేణి దిగుమర్తి జానకి మొదలైన వారందరూ జైలుపాలైరి.


DURGABAI DESHMUKH వీరందరికి నాయకురాలు. రుక్మిణీదేవి నాజూకుగల స్త్రీ. సంస్కారం ఉట్టిపడుతూ సౌమ్యంగా వుం డేది. ఆమె నాయకురాలు. త్యాగరాజ కృతులను పాడుతుం డేది. ఆమె కంఠధ్వని ఉద్రేకాన్ని కలిగించేది ఉరకలు వేస్తూ గేయాలు పాడేది. జైళ్ళలో స్త్రీలకు హిందీ నేర్పేది. కథలు వ్రాస్తూండేది. లక్ష్మీ అనే నవల అప్పటి సమాజాన్ని చిత్రిస్తూ వ్రాసింది. తోటి స్త్రీలకు సమాజ గతులను వివరించేది. కృష్ణ వేణి గర్భవతి. శ్రీ ఖైదీలందరు ఆమెకు శ్రీమం తము చేయవలెనని నిర్ణయించిరి. అందరూ తలొక గాజు నిచ్చిరి. వేడినీళ్ళు పోసిరి. శ్రీమంతం జైలులోనే చేశారు.


DURGABAI DESHMUKH జై లువాళ్ళను ఏడ్పించేది “పాముపాము” అంటూ గోలచేసేవారు జైలు వాళ్ళు వచ్చి అంతా వెదకి మాయ దారి పామును పట్టుకోలేక వెళ్ళారు. మళ్ళీ “తేలు తేలు” అంటూ గగ్గోలు జైలు అధికార్లు కోపముతో పెట్టినట్లు మూతుల్ని పెట్టి యువతులైన ఖయిదీలు నవ్వుకొనేవాళ్ళు.
ఆగష్టు 15వ తేదీ స్వతంత్ర్యదినోత్సవం చేసుకొనుటకు ఖయిదీలు నిర్ణయించారు ఖైదీ గుడ్డల్ని చింపి ఆకుపసర్లుపూసి. దీ కుంకుమలు రాసి మూడురంగుల జెండాల్ని తయారు చేశారు.

జై లు ఆవరణలోనే ఆజెండాలతో ఊరేగింపు. జాతీయగీతాలను ఆలపించటం, జై లులోనే నాటకాలు వెయ్యటము, పాటకచేరీలు చెయ్యడం నిజంగా అది జైలులాగా వుండేదికాదు. ప్రతి ఒక్కరు దినమునకు 20000 గజాల నూలు వడకాలి అని నిర్ణయం పెట్టుకుని పోటీలుపడేవాళ్ళు. జైలు ఆవరణలోనే కూరగాయల్ని పూలమొక్కల్ని పెంచేవాళ్ళు. ఆ జైలొక నందనవనంలా తయారైనది.


1931లో గాంధీ ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఖైదీలం దరు విడుదలైనారు. కరాచీ కాంగ్రెసుకు ప్రయాణాలు, సన్నా హాలు మొదలయినాయి. నెహ్రూగారికి చెల్లెలు దుర్గ కానుక అని వ్రాసి ఒక పొట్లం చేతిలో పెట్టింది, అది ఆకుపచ్చని అంచుగల ధోవతి, రాయవెల్లూరులో సొంతముగా వడికి తీసిన నాజూకైన నూలుతో నేయించి తెచ్చిన ధోవతి. నెహ్రూ సంతో షంతో మర్నాటి కాంగ్రెసు సభకు ధోవతిని కట్టుకొనివచ్చెను.
DURGABAI DESHMUKH ఆనందంసకు మేరలేదు.

గాంధీజీ ఇంగ్లాండునుండి జొంబాయిలో దిగిన తోడనే అరెస్టు అయ్యెను. దేశంలో మళ్ళీ పికిటింగులు, హర్తాళ్ లు ఎక్కునయ్యెను. విదేశీవస్త్రములను తగులబెట్టుట, సత్యా గ్రహములు, ఉప్పు పంటలు ఎక్కువయ్యెను.కాకినాడలో ప్రతివాద భయంకరాచారి బాంబు కేసు పట్టణమంతా ఖద్దరు అమ్మకాలు విదేశీ వస్త్ర బహిష్కారాలు కొనసాగుతుండేవి. కాకినాడలో డప్పుల సుబ్బారావనే ఆయన పోలీసు అధికారి. ఆయన నిరంకుశత్వముగా పోలీసు పెత్తనం చెలాయించేవాడు. ఉద్యమాన్ని అణచివేయుటకై అతడు నిరంకుశత్వంగా ప్రవర్తించెను.

మళ్ళీ DURGABAI DESHMUKH కాకినాడలో అరెస్టు చేసిరి. రాయ వెల్లూరు పంపించిరి, దుర్గకు ఆక్కడ ఏ క్లాసు ఇచ్చుటకు ప్రభు త్వం నిర్ణయించెను. అప్పుడు కొన్ని సదుపాయాలుండెను. దానిని వద్దని చెప్పి సి క్లాసు తీసుకున్నది. తనకంటే హీను లైన దీనులైన ప్రజలతోపాటే తానూ ఉంటానని చెప్పింది. రాయవెల్లూరునుండి మధుర జైలుకు మార్చారు. ఆ జైలులో జొన్నలు విసరాలి, మిరపకాయలు కారం కొట్టాలి నేలమీద పడుకోవాలి. చీకటిలో పురుగులు తేళ్ళ మధ్య రాత్రిళ్ళు గడ పాలి ఇదొక నరకం.

ఒకరోజున ఒక వింత జరిగినది. ఆ జైలులో దొంగ తనాలు, ఖూనీలు చేసిన ఆడవాళ్ళను కూడా ఉంచుతారు. ఆడ ఖైదీలు బండబూతులు తిట్టుకొంటూ కొట్టుకుంటూ రాత్రులు కాలం గడుపుతున్నారు.
DURGABAI DESHMUKH ఉండే గదికి ప్రక్కగదిలో నుండి బండబూతులు, తిట్లు, దెబ్బలు, మూల్గులు వినిపించాయి. తర్వాత పిల్లవాడి గొంతు నులుముతున్నట్లు మూల్గు. దానితో దుర్గ సాహసించి ప్రక్క గదిలో కి వెళ్ళి ఆ కుర్రవానిని రక్షించా అనుకొంది. రెండుగదులకు మధ్య గోడవుంది. కాని పై భాగాన తడిక వున్నది.

దుర్గ తడికను తప్పించి గథాల్న లోపలకు దూకింది ఆగదిలో ఇద్దరు ఆడఖైదీలున్నారు. ఒకావిడకు కుర్ర వాడే రెండేండ్లవాడు కలడు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ పోట్లాడు కొంటూ వుంటారు, జైలులో చాలా ఏండ్లు గడిపిన వాళ్ళకు చాలావీండ్లు మన స్తత్వాలు క్రూరంగా తయారవుతాయి. ప్రతీకారం కోరు తుంటారు.సొంత కుర్రవాన్ని గొంతునులిమి చంపి ఆ నేరాన్ని ఎదుటి ఆవిడమీద మోపి, ఆవిడ శిక్షను పెంచాలనే కోర్కె కక్ష ఎక్కువకాగా ఈ చెడుపనికి పాల్పడినది.

తల్లిననే మాట మరచిపోయింది దుర్గాబాయి ఆ పిల్లవాడ్ని ఆ ఖైదీ కరుకు చేతుల్లోనుండి తప్పించి దగ్గరకు తీసుకున్నది ఆ ఖైదీలిద్దరికి ఈ మంచిపని నచ్చలేదు. వాళ్ళిద్దరు ఒక పై దుర్గాబాయిని పై జుట్టుపీకి కొట్టి బాధించడం మొదలు పెట్టిరి. DURGABAI DESHMUKH రక్షిం చండి అని అరిచింది. భగవంతుని దయవలన ప్రక్కగదిలోని లై దీకి కలరా తగులుటచే వచ్చిన వార్డెన్ దుర్గాబాయి కేకలకు అక్కడకు వచ్చాడు. తలుపు తెరిచి విషయమంతా విని ఖైదీలను విడదీసి దుర్గను మెచ్చుకున్నాడు.

ఇటువంటి సాహసమైన పనులెన్నో DURGABAI DESHMUKH. చేసింది. మద్రాసులో ఒక ఇంటికి వెళ్ళి మహిళ కార్యక్రం మాల్ని నడుపుతూ పనులు ముగించుకుని బయటపడేటప్పటికి రాత్రి పదకొండు గంటలైంది. ట్రాములు కూడా ఆగిపోయే టైమయింది. దూరంగా ఒక ట్రాం వస్తోంది. దుర్గ మరొక నలుగురు ఆంధ్రమహిళలు ట్రిప్లికేన్ వెళ్ళాలి. DURGABAI DESHMUKH వచ్చే ట్రాంబండికి ఎదురుగా పట్టాలపై నిలబడింది. ట్రాం ఆగింది.

అందులోకి గభాల్న ఐదుగురు ఎక్కారు. వెళ్ళేటంత దూరం వెళ్ళి దిగి నడక మొదలెట్టారు. ట్రిప్లికేన్ యిట్లా చేరటం అందరికీ ఆశ్చర్యం కలిగించించి ఇలా సాహ సాలు చెయ్యటం సహజంగానే వుండేది.ఆ బండి మధుర జైలు అధికారులామె చేసిన సాహసచర్యకు బహుమతిని కోరుకో మనగా తనకొక వీణను కొనిపెట్టిన యెడల జైల్లో వాయించు కుంటానని చెప్పింది. 1933 మధుర జైలు నుండి విడుదల అయినది.

జైలులోని వాతావరణం, నిస్సారమైన ఆహారంతో DURGABAI DESHMUKH అనారోగ్యం కలిగినది, తండ్రి రామారావుగారు మరణించారు. ఇంటి పరిస్థితులు బాగాలేవు. తల్లిదండ్రులు కాంగ్రెస్లో పాల్గొనుటచేత వారి ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీ నం చేసుకున్నది తమ్ముడు నారాయణరావు చదువుకొను టకు ఆర్ధిక పరిస్థితులు బాగాలేవు, భర్త సుబ్బారావుగారు DURGABAI DESHMUKH ని ఎంతగానో ప్రేమించేవారు. నెల్లూరు జైలుకి వెళ్ళి DURGABAI DESHMUKH ని చూచివచ్చారు. ధనమును కోరినంతగా ఇచ్చి దుర్గ ప్రారంభించే సత్కార్యములకు చేయూత నిచ్చెడి వారు సరదాగా గృహజీవనం గడపాలనుకున్న ఆయనకు న్యాయమైన సంసారసుఖం దుర్గాబాయ్ సమకూర్చలేక పోయినది.

ఆమెకు రాజకీయ, సాంఘిక కార్యక్రమాలే ముఖ్య ముగా తోచినది. అసలు కాకినాడ పట్టణం చైతన్యవంతమై నది. పిఠాపురం మహారాజావారి కళాశాలకు ప్రిన్సిపాల్ గా వున్న బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడిగారి “సంస్కరణలు సంఘ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలలో దృఢ ముగా నాటుకున్నాయి. వితంతువివాహం, శ్రీ విద్య, సర్వమత సామరస్యములు పిఠాపురరాజు కళాశాలలో చదువుచున్న విద్యార్థులందరకు పట్టుబడే సద్గుణాలు, ఇట్టివాతావరణంలో పెరిగిన DURGABAI DESHMUKH నారాయణరావులకు సంఘ సేవకై అభిమానం పెరుగుట సహజమే రాయవెల్లూరు జైలు నుండి మధుర జై లుకు మార్చబడిన దుర్గకు ఆరోగ్యం చెడిపోయింది.

ఆమె సాంఘిక రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనుటతో సుబ్బారావు నిరాశ పొందుతుండేవారు. వారిద్దరిది వేరే దారయింది. ఇట్టి సమయంలో మధుర జైలు నుండి విడు దలై వచ్చిన దుర్గాబాయికి అనారోగ్యము కూడా వచ్చి పడింది? చేసేదిలేక మనసు చికాకు పడజొచ్చింది. మనస్సు నకేదో వ్యాపకం కావాలి చదువు మొదలు పెట్టాలని నిశ్చయించుకొన్నది ఎన్ని రాజకీయాల్లో పాల్గొన్నను విద్యాయోగ్యత లేక పోయినచో విలువ వుండదు. తెలుగులో, హిందీలో బాగా ప్రవేశమున్నను విద్యాప్రమాణములు లేవు పత్రికలలో కధలు వ్యాసములు, నవలలు పాటలు వ్రాయుట ఆమె కల వడిన సద్గుణము సంగీతముగా గాత్రం వీణ వుండేవి, వంటలో ఆమె అందెవేసిన చేయి. తోటపని, ముగ్గులు పెట్టుట ఆమెకు ఆమె ఆధీనంలో
కుట్టుపని, అల్లిక నిత్యకృత్యములు. అప్పటికే ఆమె పేరు భారతదేశమున గుభాళించుచుండెను.

నిరాశతో చేతులు ముడుచుకొని కూర్చోనే వ్యక్తి తాను కానేకాదు. ఒక్కక్షణం కూడా వృధాచెయ్యకుండా విద్యనభ్యసిం చాలి. ఆమెది వజ్రసంకల్పం. ఆలోచనను ఆచరణలో పెట్టు టలో ఆలశ్యము, అలసత్వము చూపని కర్మ వీరవనిత, బెనా రసు మెట్రిక్ చదువుటకు నిశ్చయించినది. గురువుగారుగా గోరాగారు సిద్దపడినారు.గోరా (గోపరాజు రామచంద్రరావు) గారు కాకినాడ సి. ఆర్. కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేయుచున్నారు. ఆయన హేతువాది.

ఆలోచించిన కొలది భారతదేశంలోని మూఢతకు, మతోన్మాదములకు దేవుడున్నాడనే విశ్వాసమే కారణమని గోరాకు తోచినది విజ్ఞాన శాస్త్రీయంగా సాంఘి కముగా బహుగ్రంధములను పఠించి తానొక నిర్విశ్వర వాదిగా మారినాడు. తన క్రొత్త నాస్తికతత్వంను ప్రకటిం చుచుక్రిటిక్ అనే ఆంగ్ల పత్రికలో వ్యాసం వ్రాశాడు. అభ్యం తర కరమైన వ్యాసములు విద్యార్థులకు నిర్విశ్వరవాదం ప్రబోధించుటకు కారణములుగా ఆయనకుద్యోగము పోయి నది వేరొక ట్యుటోరియల్ కళాశాలను ప్రారంభించి నడుపు చుండెను. ఆంధ్ర మెట్రిక్ లెక్కలుంటాయి. బెనారసు మెట్రిక్లో లెక్కలు లేవు.

దుర్గాబాయ్ లెక్కల్లో పూజ్యము.గోరాగారికి దుర్గాబాయి సత్యాగ్రహాలు, కాంగ్రెస్ ఆయన కూడా కాంగ్రె సభలలో పాల్గొనుట తెలియును, సులో పనిచేసినవాడే! జై లునకు వెళ్ళినవాడే! అభిమానంతో దుర్గకు శ్రద్ధగా పాఠములు చెప్పెను. పాఠములు చదివి బెనా రసు పరీక్ష కూర్చొనుటకై ప్రయాణమయినది బులుసు సాంబమూర్తిగారు డబ్బు సహాయం చేసెను. బనారసు వెళ్ళు నప్పటికి తడతర (మీజిల్సు) పోసెను. జ్వరము వచ్చెను. అంటు రోగిని పరీక్షకనుమతించెదరా? తనకు వేరే బెంచీ వేసి పరీక్ష వ్రాసుకొనుటకు అనుమతించవలసిందిగా మదనమో హన మాలవ్యాను కోరింది.

దుర్గాబాయి పేరు మాలవ్యాకు తెలియును. ఆయన అంగీకరించెను. చక్కగా వ్రాసి సెకండు క్లాసులో పాసైనది. కాకినాడలో క్రిటిక్ పత్రికలో పనిచేస్తున్నందువలన తమ్ముడు నారాయణరావు బి. ఏ. క్లాసునుండి డిబార్ చేసిరి. అతడు రాజమండ్రివచ్చి కళాశాలలో చేరి పరీక్ష వ్రాసి బి ఎ ప్యాసైనాడు. అతడు ఎం. ఎ. చదువుకొనుటకు తాను ఇంటరు చదువుకొనుటకు, ఉపకారవేతనములతో సీట్లు కోరుతూ మదన మోహన మాలవ్య గారికి దుర్గాబాయి వ్రాసింది. గాంధీగారి లేఖకూడా చేరుటచేత మాలవ్యగారు ఇద్దరుసీట్లు ఇచ్చినారు. రెండేండ్లు చదివి తాను ఇంటరు, తమ్ముడు ఎం ఏ పరీక్షలు మంచి మార్కులతో ప్యాసైనారు.

తాను బి. ఏ. అనర్సును రాజకీయ విజ్ఞాన శాస్త్రము విషయముగా తీసుకొని చదువవలెనని కోరుకొనినది. కాని మాలవ్యగారు ఆ విషయమును స్త్రీలకిచ్చుటకు సమ్మతించ లేదు. పట్టుదలగల దుర్గ బెనారసును విడచి, విశాఖపట్టణము నకు వచ్చినది. డా సి.ఆర్. రెడ్డిగారు ఆంధ్రాయూనివర్శిటీకి వైస్ చాన్సలర్గా ఉన్నారు. సాంబమూర్తిగారి వారి సహకా రంతో సీటు లభించినది రెడ్డిగారు హాస్టలులో సీటు ఇవ్వ లేదు. తగినంతమంది విద్యార్థినులు లేకపోవుటచేత హాస్టలు ఏర్పాటు చేయలేమని చెప్పిరి.


తెన్నేటి విశ్వనాధంగారి సూచన ప్రకారం స్థానిక పత్రికలో విద్యార్థినీ వసతిగృహములో చేరదలుచుకొన్న వాళ్ళూ తమ పేర్ల ను ఇవ్వవలసినదిగా ప్రకటన చేసిరి. పన్నెం డుమంది విద్యార్థినులు వచ్చుటచేత రెడ్డిగారికి “లేడీస్ హాస్టలు”ను ప్రారంభించక తప్పలేదు. ఈ విధంగా నేటి హాస్ట లునుప్రారంభించుటకామె హేతువైనది.

ఆంధ్రాయూనివర్శిటీలో ఆమె మామిడిపూడి వెంకట రంగయ్యగారికి ప్రియమైన విద్యార్థినులు. దుర్గ శ్రద్ధగా చదువు కొనినది. రాజకీయ శాస్త్రములో రంగయ్యగారు దేశంలో పేరెన్నిక కలవాడు. వారు పాఠ్యాంశములనేగాక, అనేక రాజకీయ తంత్ర గ్రంధములను కూడా దుర్గాబాయిచే చదివించిరి. వారింట్లో ఆడపడుచువలె దుర్గాబాయి మెలగుచుండెడి దని రంగయ్యగారి భార్య చెప్పుచుండెడిది. దుర్గాబాయికి అరమరిక లేదు క్రొత్తవారిని తనవారినీ చేసుకోగల నేర్పు ఆమెకు కలదు రంగయ్యగారింట్లో వంటపనులు కూడా చేసి పెట్టేది. రంగయ్యగారికి కుమార్తెవలె సేవలు చేసెడిది. అనేక విషయములను బోధించి, రాజ్యాంగ నిర్మాణం కౌటి ల్యుని అర్థశాస్త్రం మొదలయినవి వివరించెడివాడు.


దుర్గాబాయి పరిణత పొందిన వయస్సులో రాజకీయ జీవితంగల అనుభవంతో ఉన్నది. ఆసక్తియైన రాజకీయ విజ్ఞాన శాస్త్రమును దానిని బోధించుటకు ఆత్మీయుడు సమ ర్థుడు అయిన రంగయ్యగారు లభించుట దుర్గయొక్క అదృష్ట మని యే చెప్పాలి. ఆమె చదివి ఆకశించుకున్న పుస్తకాల్ని మరియే విద్యార్థినియు చదువలేదు. అందువలననే ఆమె శాస్త్రీయదృక్పథము భారత రాజ్యాంగ నిర్మాణమునకు కావ లసి వచ్చినది. నెహ్రూ ఆమె విజ్ఞానముపై ఎంతో విశ్వాసముంచెడివాడు.

ఆంధ్రాయూనివర్శిటీలో వుంటున్నప్పుడు గోవాడ సింహాచలములలోను మురికివాడలను బాగుచేయుట శ్రమించు చుండెడిది. కళాత్మకమైన మనస్సుగల దుర్గ అప్పుడు పుష్పలతా సైఖియాతో కలసి నాటకాల్లో వేషాలేస్తూ డబ్బులు ప్రోగుచేసి బీద విద్యార్థినులకు సాయపడేది.

1946 నుండి 1950 వరకు నిట్లు రాజ్యాంగ సూత్ర ములను రచించుచు, అనేక న్యాయ, రాజ్యాంగ చారిత్రక గ్రంధములను పఠించి అంబేద్కర్గారికి చేదోడు వాదోడుగా గడిపెను. ఆమె చేసిన సేవకు జవహర్ లాల్ చాలా సంతోషిం చిరి. 21 నెం. కానింగ్ స్ట్రీట్ న్యూఢిల్లీ లో ఆమె నివసించు
చుండెను.
1950లో ఎన్నికలు రాజమండ్రిలో పోటీచేయవలయు నని, నెహ్రూగారు, ప్రకాశంగారు, దుర్గాబాయిని ప్రోత్సహించిరి తనకు ఎన్నికలలో పోటీచేయుట ఇష్టంలేదు. కాని దుర్గాబాయి ఎన్నికలలో ఓడిపోయినది. ప్రకాశం గారు, నెహ్రూగారు ఎంతో విచారించిరి. ఢిల్లీ లో తాను చెయ్య వలసిన పని పూర్తియైనది. ఎన్నికలలో ఓటమిపొందినది రాజ కీయ జీవితమును వదలి మద్రాసులో ప్లీడరు ప్రాక్టీసు చేసు కొనుటకై నిర్ణయించుకొని నెహ్రూను అనుమతించవలసినదిగా కోరినది. నెహ్రూ సమ్మతించలేదు. ఢిల్లీ నుండి కాపురము తీసి వేయవద్దని చెప్పెను.


భారతదేశమునకు కొత్తగా స్వాతంత్రము వచ్చినది. విజ్ఞానులు త్యాగధనులైన వారి సేవలను నుపయోగించుకొన వలసిన అవసరమున్నదని నెహ్రూ గ్రహించెను. అందులకే దుర్గాబాయిని ఢిల్లీ వదల వద్దని కోరెను, తాను నిర్ణయం చేసే లోగా రాయలసీమ క్షామ నివారణకై నిధిని ప్రోగుచేసి నిర్మాణ కార్యక్రమములను చేయవలసినదిగా నెహ్రూ చెప్పెను, ద ర్గాబాయి కార్యక్రమమున దూకెను.
నిధులను పోగుచేయుటకై వాలంటీర్లను తర్పీదు చేసెను. ఆహారపదార్థములను పోగుచేసి వాటిని క్షామంతో మ్రగ్గెడి గ్రామాలకు సరఫరా చేయించెను.

నీటి యెద్దదిగల ఊళ్ళకు దూరంనుండి లారీ టాంకులలో నీటిని పంపించెను. ఇట్లా ఏడు నెలలు రాయలసీమకు సేవచేసి జవహర్లాల్ దగ్గరకు వెళ్ళినది వెంటనే జనహర్ లాల్ విజయలక్ష్మి పండిట్ తో పాటుగా చైనాకు భారత డెలిగేషన్ పంపించెను. చైనాకు కూడా కొత్తగా స్వాతంత్ర్యం లభించినది. రెండు దేశములు పరస్పరము అర్థంచేసుకొని రాజకీయ సంబంధం లకు ఆర్దిక ద్రవ్య సహాయములను వృద్ధి చేసుకొనవలెను. ఇట్లు స్నేహంను పెంపొందించగల నేర్పరులను ముందుగా ఆ దేశమునకు పంపవలెను. జవహర్ లాల్ ఆశించిన మేరకు సత్ఫలితాలను చేకూర్చుకొని చైనా నుండి తిరిగి వచ్చిన దుర్గా బాయిని జవహర్లాల్ మొదలగువారు కొనియాడిరి.

తననింక మద్రాసుకు పంపుడని నెహ్రూను ప్రార్ధిం చెను. ప్లీడరీ ప్రాక్టీసు చేసుకొనుచు ఆంధ్ర మహిళా సభలో శ్రీ సంక్షేమమునకై పాటుపడెదనని మరీమరీ చెప్పెను. నెహ్రూగారు ససేమిరా ఒప్పుకోలేదు. ఇన్ని ఏండ్లుగా దేశా నికి స్వాతంత్ర్యము రాలేదు. లాఠీచార్జీలు తిని జైళ్ళకు వెళ్ళిన నాయకులకు బాధ్యత ఇప్పుడు స్వరాజ్యం రావటంతో తీరిపోయాయా? అని ప్రశ్నించెను.

మీ అందరి అనుభవాలను, విజ్ఞానమును భారతమాత కోరుచున్నది. కావున మీ తెలివితేటలు దేశ సౌభాగ్యమునకు పకరించవలెనని నిక్కచ్చిగా చెప్పెను. దుర్గకు ఏమి చేయు టకు తోచలేదు. మద్రాసు రాష్ట్రంలో స్టేట్ ప్లానింగ్ కమీష న్లో కార్యదర్శిగా బాధ్యతను తీసుకొని మద్రాసునకు 52లో వచ్చినది. ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా మద్రాసు రాష్ట్రమలో నున్నారు. శతాబ్దాలుగా నిద్రపోవుచున్న ప్రజాకోటికి విద్యాసంస్థలు తేరుపబడవలెను. వ్యవసాయం ప్రధానమైన దేశమునకు కొ తపద్ధతులలో సేద్యం చేయుటను ప్రోత్సహిం చాలి.

కొత్త ఎరువుల వాడకమును పెంపొందించాలి స్త్రీలు దళిత జాతులు అట్టడుగున మూలుగుతున్నారు. వారి స్థితిగ తులను మెరుగు పరచాలి. పంచాయితీలు సక్రమంగా పని చేసేటట్లు కట్టుదిట్టాలు చెయ్యాలి ఇవి ప్లానింగ్ పనులు, దుర్గాబాయి కెంతయో ఇష్టమైన బాధ్యతలు.

మద్రాసుకు వచ్చి కార్య రంగంలోకి దూకింది. అలసట యెరుగని సేవాధర్మంతో గ్రామగ్రామం ప్రచారం చేసి పర్య టించి పల్లెటూర్లలోని సమస్యలను గ్రహించి వాటి పరిష్కార ములను సూచించుచు ప్లానింగ్ కమీషనుకు రిపోర్టులు వ్రాసి పంపించింది. హిందీ ప్రచారం ముమ్మరం చేసేందుకై దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారి శాఖలు ప్రతి పట్టణములోను స్థాపింపజేసింది.

స్వయం ఉపాధికొరకై చరఖాలు త్రిప్పటం, బట్టలనేత, అద్దకపు పనులు అభివృద్ధి చేయుటకై కొంత నిధిని కేటాయించింది, ప్రకాశంగారు దుర్గాబాయీ మాకంటే నీవే యెక్కువ పనులు చేస్తున్నావు. ప్రజలలో చొచ్చుకు పోయే చొరవ మాకులేదు ప్లీడరుగా ఒంటరిగా ఎట్లా కాలం గడపగలవు? నీ మూలంగా ‘ స్త్రీ జాతి గర్విస్తోంది అని ప్రోత్సాహం ఇచ్చారు. దుర్గావాయి రాత్రులలో గ్రంధపఠనం చేస్తుండేది. బీదవాళ్ళ దావాలకు ఆమె ఉచితంగా సలహాలు ఇచ్చేది.

ఆమె సేవాధర్మంనకు ప్లానింగు కమీషను సభ్యులుఎంతయో మెచ్చుకున్నారు. కమీషనుకు చింతామణి దేశ్ముఖ్ గారు అధ్యక్షులు. సాంఘిక సంక్షేమమునకు నిధులు,కేటాయించబడలేదు దుర్గాబాయి ఢిల్లీ కిప్రయాణమై వెళ్ళెను.ప్లానింగు కమీషను మీటింగులో వాగ్దాటితో ప్రసంగించెను. చింతామణి, దేశ్ ముఖ్ గారు, దుర్గాబాయిగారూ కుటీరపరిశ్రమలు ప్రాధమికమైన విద్య గ్రామస్తులకు వికాసం కల్గించుతుందా! దీని కై కొంత మొత్తాన్ని కేటాయించితిమి అనినారు.దుర్గాబాయి నవ్వుతూ “అవునండి! విద్యనేర్చుకోవాలన్నా -చేతిపనులు సమకూర్చుకోవాలన్నా డబ్బుకావాలి.

అంతకంటేపల్లె టూరివాళ్ళకు ఆరోగ్యం కావాలి, శతాబ్దాలుగా పన్నులతో, స్వార్థపరులైన వర్తకుల అప్పులతో భూకామందులకుపండిన గింజల్ని అన్నీ కొలిచి పస్తులతో పండుకొంటున్నబీదవారికి విద్య నేర్చుకోవాలి అనిపిస్తుందా? కుటీర పరిశ్రమలు స్థాపించుకొందామని ఆలోచన వస్తుందా? అన్నది. దేశ్ముఖీగారు ఇప్పటికే అన్ని పద్దులు బిగిసిపోయాయి? ఈ ఏటికిఇట్లా సర్దుకోండి అని చెప్పారు.స్త్రీలకు పిల్లలకు ఆరోగ్యమునకై నర్శింగ్ హోమ్లుపిల్లల సంక్షేమ కేంద్రములు నెలకొల్పినది. ఆరోగ్యవంతులైన ప్రజలున్న గాని దేశం సౌభాగ్యవంతమైనదిగా చెప్పలేము.


గ్రామములలోనికి పర్యటనకై వెళ్ళి వారితో సంతోషించే టప్పుడు అనేక ప్రశ్నలు వచ్చేవి. మూఢాచారం, మతోన్మా దం పేరుకొన్న గ్రామాల్ని శుభ్రం చెయ్యాలంటే విద్యా ప్రచారం కావాలి. అంతకంటే వైద్యసదుపాయం కావాలి. మహాంధకారంలో ఎన్ని దీపాలు పెట్టితే చీకటి మటుమాయం అవుతుంది. తనకు లభించిన పరిమిత ద్రవ్యంతో స్వల్ప వ్యవధిలో చేయదగినంత సంక్షేమ కార్యక్రమాలు పూర్తిచేసి ఢిల్లీలో పెద్దలందరి మెప్పును పొందినది. కార్యకర్తగా అను భవమున్న దుర్గాబాయిని ప్లానింగు కమీషను సభ్యురాలిగా నెహ్రూగారు తీసుకొనిరి. ప్లానింగు కమీషనులలో వి. టి కృష్ణమాచారి,జి. యల్. నందా, సి.డి. దేశ్ ముఖ్,నెహ్రూజీ దుర్గాబాయిలు సభ్యులు.

ఆమె చేసిన సత్కార్యములు భవనంలుగా సభలుగా మనకెల్లరకు ఆదర్శ చిహ్నములుగ ఉన్న అనేకములు గలవు ఆమె జీవితం పఠించుట బాలికలు బాలురు ఉత్తేజము కలిగిం చుకొనవలెను అన్నిరంగంలలోను ఎట్లు శ్రమపడి నిస్వార్ధంగా దేశ సేవ చేసినదో, విజయములు సాధించినదో గ్రహించ
వలెను.

Leave a Comment