The Battle of Bobbili is a great one in the history of India.
BATTLE OF BOBBILI చారిత్రక నేపథ్యం – భారతదేశ చరిత్రలో 1674 వ సంవత్సర ఎంతో ముఖ్యమైనది. ఈ ఏడు మహారాష్ట్ర వీరుడు శివాజీ ‘మహారాజ’ బిరుదుతో పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడు. ఈ ఏడే గోల్కొండ రాజ్యానికి ప్రభువు అయిన తానీషా ‘అక్కన్న మాదన్న’ లనే ఇద్దరు తెలుగు మేధావులకి గొప్పపదవులనిచ్చి గౌరవించాడు. అటు శివాజీ, ఇటు మాదన్న ఇద్దరూ రాజనీతి విశారదులే! మాదన్న శివాజీతో తానీషాకి మైత్రి కుదిర్చారు. శివాజీ హైదరాబాద్లోకి వచ్చి, తానీషా ఆతిధ్యం స్వీకరించాడు. ఒక సంధిపత్రం పైన ఇద్దరూ సంతకాలు చేశారు.

BATTLE OF BOBBILI దక్షిణ భారతదేశంలో ఈ ఇద్దరి ప్రభుత్వాలూ సుస్థిరం అయ్యాయి. మాదన్న ఆంధ్ర దేశాన్ని సుభిక్షంగా పాలించేందుకు, తానీషాకి ఎంతో తోడ్పడ్డాడు. ఆయన పాలనా నైపుణ్యానికి ఎంతో సంతోషించిన తానీషా, ఆయనకి ‘ఆలంపనా’ – అనే బిరుదును ఇచ్చాడు. దేశం పచ్చగా ఉన్నందుకు ప్రజల కళ్ళు చల్లబడ్డాయి. అయితే, మొగలు సామ్రాజ్యాధిపతి అయిన ఔరంగజేబు ఇదంతా చూసి, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు. దక్షిణాదిన ఇద్దరు బలవంతులు వేళ్ళు నిలదొక్కుకోవడం అతని కడుపు మంటకి కారణం అయింది.
సరిగ్గా ఆరేళ్ళకి, ఆ రెండు రాజ్యాలనీ… అంటే మహారాష్ట్ర, గోల్కొండ రాజ్యాలని నాశనం చేసే అవకాశం ఔరంగజేబుకి దొరికింది! అది కూడా, 1680 వ సంవత్సరంలో శివాజీ మరణించాకే అతగాడికి దొరికింది! ఆ మరుసటి సంవత్సరం దక్షిణాపథానికి తన సేనలని పంపేడు. కాని, గోల్కొండని పట్టుకోడానికి మొగలాయి సైన్యం అయిదేళ్ళపాటు విఫల ప్రయత్నం చేసింది. అక్కన్న మాదన్నలు బ్రతికున్నంతకాలం గోల్కొం
స్వాధీనం కాదని ఔరంగజేబు గ్రహించాడు. అందుచేత దేశద్రోహులకి లంచం ఇచ్చాడు. 1686 1 లో అక్కన్న మాదన్నలని హత్య చేయించి, ఆ వెంటనె గోల్కొండని కబళించాడు. క్రమంగా దక్షిణాపథం
అంతా మొగలు సామ్రాజ్యంలో లీనమైంది.
BATTLE OF BOBBILI ఔరంగజేబు మరణించిన తరువాత, మొగలు సామ్రాజ్యం కుక్కలు చింపిన విస్తరిలా మారింది. మొగలుసామ్రాజ్యం క్షీణదశలో బయలుదేరిన చిన్నచిన్న రాజ్యాలు, అంతః కలహాల్లో మునిగిపోయాయి. ఈ సమయంలో, భారతదేశంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోడానికి అటు ఇంగ్లీషువాళ్ళూ, ఇటు ఫ్రెంచివాళ్ళూ తెగ ప్రయత్నించసాగారు. ఈ ఉభయులూ ఒక విషయాన్ని బాగా గ్రహించారు. చిన్న రాజ్యాల గొడవల్లో తలదూర్చి తాము బాగా లాభపడవచ్చునన్నది. ఆవిషయం! నర్మదానదికి దక్షిణాన ఉన్న రాజ్యాన్నంతా ‘దక్కను’ అనేవారు. దీనికి మొగలు ప్రతినిధిగా ఒక సుబేదారు నియమించబడేవాడు.
దక్కనుకి ‘మొదటి నిజాం’ సుబేదారు అయ్యాడు. మొదటి నిజాం మరణించాక, రాజ్యం కోసం అతని వారసులు నాజర్ంగ్, ముజఫర్ జంగ్ పరస్పరం కత్తులు నూరుకోసాగారు. ఈ నిజాం పిట్టలు తగువులను ఫ్రెంచిపిల్లి తీర్చింది. ఆ ఇద్దరూ యుద్ధభూమిలో హతమయ్యాక, ‘సలాబతంగ్’ అనే మరోవారసుణ్ణి ఫ్రెంచివాళ్ళు ‘నిజాము’ గా నిలిపారు. ఫ్రెంచిసేనాని అయిన బుస్సీ అతనికి అండగా నిలిచాడు. బుస్సీ నిజాం తర్వాత, నిజాం అంతగా బలవంతుడు అయ్యాడు. కీలుబొమ్మ వంటి నిజాముకి ఫ్రెంచిసేనల రక్షణ లేకపోతే గద్దెమీద ఉండలేని స్థితి వచ్చింది. అందుకని, బుస్సీ గీసిన గీటుని నిజాం దాటేవాడు కాదు.
BATTLE OF BOBBILI ఫ్రెంచిసేనల ఖర్చుకి నిజాం బోల్డంత డబ్బు ఖర్చు చేసేవాడు. ఇది నిజాం దగ్గర ఉన్న దివానుకి అసూయని కలిగించింది. అతను నిజాం దగ్గర చేరి, ఎలాగైనా మూసాబుస్సీని బర్తరఫ్ చేయమని నూరిపోశాడు. దివాను మాటలని నిజాం విన్నాడు. ఫ్రెంచి సేనలకి జీతాలుగాని, ఆహారంగానీ సకాలంలో అందకుండా చేశాడు. కాని, బుస్సీ రాజనీతితో మళ్ళీ నిజాం దగ్గర తన పలుకుబడిని పెంచుకున్నాడు. ‘తనసేనలని తనే పోషించుకుంటాన’ని బుస్సీ అన్నాడు. అందుకు అయ్యే ఖర్చుల నిమిత్తం తనకి కొన్ని సర్కారులని (గోల్కొండ రాజ్యంలో 58 సర్కారులు ఉండేవి. అవి తెలంగాణం, కర్ణాటకం ఆర్కాటు అనే మూడు ఖండాల్లో ఉండేవి.

గోల్కొండ రాజ్యం, ఉత్తరాన శ్రీకాకుళం నుంచి దక్షిణాన చెంగల్పట్టు దాకా వ్యాపించి ఉండేది) జాగీరుగా ఇవ్వమని అతను నిజాంని అడిగాడు. నిజాం అతనికి ఉత్తర సర్కార్లు నాలుగింటిని ఇచ్చాడు. ఆ కాలాన, ఈ ఉత్తర సర్కార్లకి ‘జాఫర్ ఆలీ ఖాన్’ ఫౌజుదారు (గవర్నరు) పదవిలో ఉండేవాడు. తన పదవికి ఎసరు పెట్టాడని బుస్సీమీద అతను పగపట్టాడు. ఉత్తర సర్కార్లలోని సంస్థానాధీశులని కూడగట్టుకొని బుస్సీని ఎదిరించాలని ప్రయత్నించాడు.
అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ ప్రయత్నంలో ప్రధాన భాగస్వామీ విజయనగర సంస్థానాధిపతీ అయిన విజయరామరాజును, బుస్సీ తన వైపు తిప్పుకున్నాడు. రాజమహేంద్రవరం, శ్రీకాకుళం సర్కారుల లాభమతనికి ఉండేలా కౌలుకి ఇస్తానని (ఓవిధంగా కప్పం తగ్గిస్తానని) మాట ఇచ్చి, జాఫర్ ఆలీ నుంచి విడదీశాడు. జాఫర్ ఆలీ చేసేది ఏమి లేక, సర్కార్లని విడిచిపోయాడు. వెళ్తూ వెళ్తూ దేశాన్ని దోచుకున్నాడు. కాని వెంటనే నిజాంకి లొంగిపోయాడు. ఆ సమయంలోనే, కర్ణాటకలో జరిగిన పరిణామాల ఫలితంగా డూప్లే పదవి పోవడం, అతని స్థానంలో ‘గొడేహు’ రావడం జరిగాయి. ‘
సలాబతంగ్,’ జాఫర్అలీ మాటలని విని 1756 లో ఫ్రెంచివాళ్ళని అధికారంలో నుంచి తొలగించాడు. కాని, బుస్సీ నవాబుని సైన్యంతో ప్రతిఘటించాడు. అటు మచిలీపట్నం నుంచి, ఇటుపుదుచ్చేరి నుంచి వచ్చిన సేనల్ని చూసి నవాబు దారికొచ్చాడు. బుస్సీపట్ల మునుపటి మర్యాదని చూపసాగాడు. ఇలా నిజాంతో స్నేహం మళ్ళీ కలిసేక, బకాయిలు పడ్డ కప్పాల వసూలు నిమిత్తం బుస్సీ బయలుదేరాడు.
ఈ రూపంగా ఉత్తర సర్కారులని చక్కదిద్ద దలిచాడు. 1756, నవంబరు 16న బయలుదేరిన బుస్సీ- బెజవాడ, ఏలూరు మీదుగా, డిసెంబరు 19వ తేదీన రాజమహేంద్రవరానికి చేరుకున్నాడు. అదును చూసి, బుస్సీసాయంతో తన రాజ్యాన్ని విస్తరించుకోవాలని విజయరామరాజు ఆశించాడు. బుస్సీకి సాదరంగా ఎదురు వెళ్ళి స్వాగతంపలికాడు – రాజ్యకాంక్షాపరుడైన ఆ విజయరామరాజు! ఇది ….ఇదే బొబ్బిలి యుద్ధానికి అంకురార్పణ!!!
BATTLE OF BOBBILI ..1857వ సంవత్సరంలో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగింది. భారతీయుల స్వతంత్ర వాంఛ ఒక మహాజ్వాలగా రేగింది. ఆకాశానికి ఎగిసింది. ఆంగ్లేయుల గుండెల్లో వణుకు పుట్టించింది. ‘ప్రపంచం అంతా ఈ సమర ప్రాముఖ్యాన్ని గుర్తిస్తుందేమో?’- అనివాళ్ళు భయపడ్డారు. ‘వివిధ దేశాల ప్రజలు తమని అసహ్యించుకుంటారేమో?’ – అని వాళ్ళు బెంగపెట్టు కున్నారు. తమ కుయుక్తుల్ని ఉపయోగించారు. అంతే! ఆంగ్లేయ చరిత్రకారులు రంగంలోకి దిగారు. అసలు ఇది స్వాతంత్య్ర సమరమే కాదు పొమ్మన్నారు. ‘కేవలం సిపాయిల కలహం’! – అన్నారు. ‘హిందువులు మతోన్మాదులు’ – అని వ్రాశారు.
తూటాలకి ఆవుకొవ్వును పూసినందుకే, వాళ్ళు ఇంత రభస చేసేరని మనని మూర్ఖులుగా తమ చరిత్రగ్రంథాలలో చిత్రించారు. కాని, దాచేస్తే దాగని సత్యాలు, జానపదులు ఆశువుగా పాడే వీరగాథలలో మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ‘మన భారతీయులు బానిసత్వానికి విముఖులు’ అనీ, ‘స్వతంత్ర పిపాస వారి అణువణువులో నిండి ఉన్నదనీ’ ఇవి లోకానికి వేనోళ్ళ చాటి చెప్పాయి. ఈ వీరగాథలు మన శౌర్య సాహసాలకి నిలువుటద్దాలు! ఇలాంటి వీరగాథలలో ‘బొబ్బిలి యుద్ధం’ ప్రముఖమైంది.
1757వ సంవత్సరంలో… అంటే, ‘ప్రథమ భారత సంగ్రామం’ జరగడానికి సరిగ్గా నూరేళ్ళకి ముందు, భారతీయులు… అందునా తెలుగు వీరులు, తమ పరాక్రమాన్ని లోకానికి ఎలా చాటారో ఈ కథ వల్ల తెలుస్తుంది. ‘భారతీయులు బానిసలుగా బ్రతికేందుకు వ్యతిరేకులు’ – అని, స్వతంత్రం కోసం ప్రాణాన్ని హాయిగా త్యజించగలరనీ – ఈ కథ విజ్ఞులకి వెల్లడిస్తుంది. బొబ్బిలి యుద్ధం’ కథలో ‘విలన్లు’ ఆంగ్లేయులు కాదు. కానీ, కుటిల రాజనీతిలో వారికి సమవుజ్జీలు అయిన ఫ్రెంచి పాలకులూ… ఈ విదేశీయులకి తొత్తులు అయిన కొందరు స్వదేశీయులు…! రాజ్యవిస్తరణ కాంక్షతో, కన్నతల్లి వంటి మాతృభూమిని విదేశీపాలకులు పాదాలముందు సమర్పించిన స్వార్థపరులైన సంస్థానాధిపతులు! ఇక కథ లోకి వెళ్లాం!
ఆ రోజు చినరంగారావు పుట్టిన రోజు! ఆ పిల్లవాడు BATTLE OF BOBBILI సంస్థానాన్ని పరిపాలించే రంగారావు, మల్లమ్మదేవి దంపతుల ఏకైక కుమారుడు. తమని కన్నబిడ్డల్లా చూసుకొనే రాజుగారి కొడుకు పుట్టిన రోజు మహోత్సవం కనుక, బొబ్బిలి పౌరులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి మొహం
ఆనందంతో కళకళలాడిపోతోంది. ఆరోజు, కోటలో జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలు చాలానే ఉన్నాయి. సాముగరిడీలు, కుస్తీపోటీలు, కోడిపందాలు, నాట్యప్రదర్శనలు, సంగీత కచ్చేరీలు – ఓహ్! ఒకటా.. రెండా.. బోల్డన్ని ఉన్నాయి! ఎటొచ్చీ చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. అంతే!
తెల్లారు ఝామున మల్లమ్మ కొడుకు నెత్తిన సంపంగి నూనెని పెట్టగా, వెంకటలక్ష్మి తలంటుపోసింది.
మల్లమ్మ అరణపుదాసి ఆమె. ఇప్పుడు చినరంగారావుకి దాదిగా ఉంది. దుందుడుకు పిల్లాడైన చిన రంగారావుకి ఆ ఇద్దరూ నానా కష్టాలూపడి ఎలాగో స్నానం చేయించారు. కొత్తబట్టలు తొడిగారు. నెత్తిన తలపాగా, బుగ్గన దిష్టిచుక్కా, కస్తూరి తిలకం వంటివి పెట్టారు. ముస్తాబు పూర్తయింది. ఇంతలో మహారాజు రంగారావు అంతఃపురంలోకి వచ్చాడు. ఆదంపతులు కుమారుడితో శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్ళారు. తమ పిల్లాడి పేర ప్రత్యేక పూజలని చేయించారు. పూజారి తిరువెంగళయ్య చినరంగారావుకి దేవుడి హారతిని, ప్రసాదాన్ని ఇచ్చాడు. సంప్రదాయం ప్రకారం వాళ్ళు ఆలయంలో కాసేపు కూర్చుని. కోటకి తిరిగి వచ్చారు. పంచభక్ష్య పరమాణాలతో కుటుంబ సభ్యులు అంతా కలిసి విందు భోజనాన్ని ఆరగించారు.
BATTLE OF BOBBILI …దామెర ధర్మారాయుడు భోజనం ముగించి, శయ్యపై మేనువాల్చి, అలసటతో కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో అతని మనుమడు గోవిందరాయడు వచ్చాడు. అతను పదహారేళ్ళ ప్రాయం వాడు. వస్తూనే మంచం ప్రక్కనే ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. క్షణం ఆగి – “తాత గారూ! నిద్రపోతున్నారా?” – అని వినయంగా అడిగాడు “అబ్బే! లేదు! ఏం ఏమైనా పనా?”- అన్నాడు ధర్మారాయడు. “పనేం లేదు! ఏదో మంచీ, చెడ్డా మాట్లాడదామని వచ్చాను!” – అన్నాడు గోవిందరాయడు. “సరే! ఏం మాట్లాడదలిచావో చెప్పు!” అన్నాడు ధర్మారాయడు చిరునవ్వుతో లేచి కూర్చుని. ఆ తాతామనుమలసంభాషణ ఇలా సాగింది- “ఇవాళ మన చినరంగారావు వారి జన్మదిన మహోత్సవాలు కదా! ప్రధాన ఆహ్వానితులు ఎవరు
తాతాగారూ?”
విజయనగర సంస్థానాధిపతులు శ్రీవిజయరామరాజుగారు!” “నిజమా? వారిని… వారిని ఆహ్వానించేరా?”
“ఎందుకంతగా ఆశ్చర్యం? వారిని ఆహ్వానించకూడదా?”“తరతరాలుగా మన బొబ్బిలి వారికీ – విజయనగరం రాజులకీ, ఉప్పూ – నిప్పు గా ఉంది కదా అని ఆశ్చర్యం! ఆందునా, ఈ విజయరామరాజు హయాంలో, ఆ పగలు పతాకస్థాయిని అందుకున్నాయి! మన మహారాజులు వారిని ఎందుకు ఆహ్మానించారు?”
“అవి రాజకీయాలు! ఇవి ఆచారసాంప్రదాయాలు! విజయరామరాజుగారు, మన మహారాణి మల్లమ్మ దేవిని స్వంత తోబుట్టువులా ఆదరిస్తారు. మన మహారాజు వారిని బావగారి వలె గౌరవిస్తారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకి మన రాజుగారు విజయనగరానికి సకుటుంబంగా తరలి వెళ్తారు.
శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలకి అలాగే, వారు కూడా మన BATTLE OF BOBBILI శ్రీవేణుగోపాలస్వామి వారి భార్యాపుత్రులతో విచ్చేయడం ఆనవాయితీ! ఇక- పెళ్ళిళ్ళూ పేరంటాల మాట సరేసరి!” “మరి కక్షలూ, కార్పణ్యాల సంగతేమిటి?” “ఓరి వెర్రినాయనా! వాటి సంగతి తెలియాలంటే, ఈ రెండు రాజ్యాలూ ఆవిర్భవించిన కాలానికి వెళ్ళాలి! క్లుప్తంగా ఆ చరిత్ర చెప్తాను. విను!- “కళింగ సీమలో ఈ రెండు సంస్థానాలూ ఒక్కసారే ఉద్భవించాయి. అది ఎలాగంటే, 1652 వ సంవత్సరంలో, షేర్ మహమ్మద్ ఖాన్ శ్రీకాకుళానికి ఫౌజుదారుగా వచ్చారు.
ఆయనతో పాటు పూసపాటి రఘునాథరాజు వచ్చారు. వీరేకాక, పెదరాయుడనే వెలమవీరాగ్రేసరుడు కూడా షేర్ఖాన్ విచ్చేసారు. ఆయనకి షేర్ఖాన్ రాజాము ప్రాంతాన్ని అంతా గుత్తగా ఇచ్చారు. అందుకు కృతజ్ఞతగా పెదరాయుడు, ఆ ఫౌజుదారు పేరిట ఒక కోటని కట్టుకున్నారు. ‘షేర్’ అంటే పులి. అందుకని పెదరాయుడు తన కోటకి ‘బెబ్బులి’ అని పేరు పెట్టుకున్నారు. అయితే, కాలక్రమంలో అది ప్రజల నోళ్ళల్లో పడి BATTLE OF BOBBILI ‘బొబ్బిలి’గా మారింది.
BATTLE OF BOBBILI ….ఇంక విజయనగరం గురించి విను! 1632 ప్రాంతాల్లో పూసపాటి రఘునాథరాజు కూడా షేర్ఖాన్తో వచ్చారని చెప్పాను కదా! ఈయనని మాధవ వర్మ అని పిలిచేవారు. ఈయనే పూసపాటి వారి మూలపురుషుడు. కుమిలె పరగణాలోని భోగాపురం మొదలైన గామ్రాలను షేర్ ఖాన్ నుంచి నజరానాగా పుచ్చుకొని రఘునాథరాజు అక్కడే స్థిరపడ్డాడు. ఈ వంశంలోని అయిదోతరం వారైన ఆనందరాజుగారు విజయనగరం రాతికోటకి పునాది వేశారు. ఏడవతరం వారైన సీతారామరాజు సార్వభౌమ బిరుదాంకితులు. అయితే, ఇతనికి చినతండ్రి కొడుకైన విజయరామరాజు, విషప్రయోగం జరిపి సీతారామరాజును హత్య చేశాడు. అధికారం హస్తగతం చేసుకున్నాడు.!”
“ఛీ! ఎంత దారుణం! అన్నకి తమ్ముడు విషం పెట్టడమా?” అంటూ గోవిందరాయుడు మొహం చిట్లించుకున్నాడు. తాతగారు మనుమడి అమాయకత్వానికి నవ్వాడు. “రాజ్యాధికారం కోసం ఇలాంటి దారుణాలు సర్వసామాన్యాలు! అయితే, రాజుల పోషణలో ఉండే కవులు తమకి ఆశ్రయం ఇచ్చినవారిని ఇంద్రుడనీ చంద్రుడనీ పొగడ్డం, ఆ పొగడ్తల వెల్లుమం
ఇలాంటి దారుణ కృత్యాలు పూచికపుల్లల్లా కొట్టుకుపోవడం పరిపాటి! సరే! అసలు సంగతి కొద్దాం! ఈ విజయరామరాజుగారి పేరునే ‘విజయనగర’ నిర్మాణం జరిగింది. విజయ నామ సంవత్సరాన, విజయదశమి రోజు విజయవారాన ప్రారంభించింది. తమరాజు పేరు, నగరం పేర్లతో కలిసి మొత్తం అయిదు ‘విజయ’లు వచ్చినందుకు ప్రజలు ఎంతో ఆనందించినట్లు ఒక ఐతిహ్యం ఉంది! ఆడిదం సూరకవి, గోగులపాటి కూర్మనాథకవి వంటి కవులని పోషించి విజయరామరాజుగారు ‘కవిలోక పాలుడి’గా కీర్తి గడించారు.”
“అదంతా సరే తాతగారూ! ఈ పగల మాటేమిటి?” “పద్మనాయకరాజులు పాలించే BATTLE OF BOBBILI బొబ్బిలి, విజయనగరపు రాజుల పక్కలో బల్లెంలాగే తోచేది. ఈ మధ్య మన ప్రాంతాల్లో ఉన్న కొండల నుంచి పారే సెలయేళ్ళకి, మనవాళ్ళు గురివిల్లు (రాతితో చిన్న గోడలు) కట్టి నీళ్ళని మనవైపు ఉన్న వరిపొలాలకి మళ్ళించారు. ఇది విజయనగరం వారికి కంటగింపు అయింది. పద్మనాభం దగ్గర పులివేటకి వచ్చిన రాజవంశీయులని, మన తాండ్రపాపారాయుడు కొట్టినంత పనిచేసి పంపించాడు. ఇవి చాలవా… పగలు పెంచుకోడానికి” “మరి ఇన్ని ఉన్నా…. ?” అంటూ గోవిందరాయుడు సగంలోనే మాటని ఆపేశాడు.
“మళ్ళీ నువ్వు మొదటికి వస్తున్నావురా మనుమడా! మన మహారాజుగారు ధర్మరాజు వంటివారు. పగలని నిర్మూలించడానికి ఎంత చిన్న అవకాశం వచ్చినా, దానిని వినియోగించుకోవాలని తపిస్తారు. రెండు రాజ్యాల సఖ్యతతో, ప్రజలకి శాంతి సౌభాగ్యాలని చేకూర్చాలని వారి ఆరాటం! అందుకే, విజయరామరాజును ప్రధాన అతిధిగా ఆహ్వానించారు”! ఉయా మన మహారాజుగారి సత్సంకల్పానికి వంకపెట్టలేము! కానీ, పాలు పోసినంత మాత్రాన వేపచెట్టు తియ్యని పళ్ళని ఇస్తుందా? అనేదే నా సందేహము!”
మనం ఎంత తాపత్రయపడ్డా విజయరామరాజు గారి బుద్ధి మారదనేనా నీ భావం?” గోవిందరాయుడు తాతగారికి ఏదో సమాధానం చెప్పేలోపల అతని తండ్రి మాధవరాయుడుఆ మందిరంలోకి ప్రవేశించాడు.
“గోవిందా! తాతయ్యని కాస్తంతైనా విశ్రాంతి తీసుకోనియ్యవా ఏమిటి? మళ్ళీ కాస్సేపట్లో,సంస్థానంలో వేడుకలు ఎలాగూ ఆరంభమవుతాయి!” – అన్నాడు మందలింపుగా. “క్షమించండి నాన్నగారూ!” అంటూ గోవిందరాయుడు ఆసనం మీంచి లేచాడు.
BATTLE OF BOBBILI ..సంస్థానానికి చెందిన ప్రముఖులూ, చుట్టుప్రక్కల రాజులూ, పురప్రజలూ అందరూ సమయానికల్లా ఉత్సవ మంటపం దగ్గర చేరారు. కాని, విజయరామరాజు మాత్రం ఇంకా అయిపూ అజా లేడు. ప్రధానమంత్రి అయిన ఇరుగంటి నరసారాయుడు, తమ ప్రభువైన రంగారాయని వారి వంక సాభిప్రాయంగా చూశాడు – “ఏం చేద్దాం?” అన్నట్లుగా, శాంతమూర్తి అయిన ఆయన “కాస్త ఆగుదాం!” – అన్నట్లు తలపంకించాడు. ఇదంతా చూస్తున్న వెంగళరాయుడికి ఒళ్ళు మండింది. అతను రంగారాయుడి తమ్ముడు. ఆదిశేషువులా అతి ఆవేశపరుడు.
“అన్నగారూ! ఆహ్వానితులు అందరూ వచ్చి చాలా సేపయింది. కార్య క్రమాలని ఆరంభించేందుకు ఇంకా ఆలస్యం ఎందుకు?” అన్నాడు కోపం అణుచుకుంటూ. “తమ్ములుంగారూ! ప్రధాన అతిధి రాకుండా కార్యక్రమాలని ప్రారంభించడం సంప్రదాయ విరుద్ధం. ఇంతదాకా, ఎలాగూ చూడనే చూశాము. ఇంకాసేపు చూడడంలో దోషం లేదుకదా!” – అన్నాడు గంభీరంగా రంగారాయుడు.
“అందరూ తన కోసం ఎదురు చూసేలా చేయడం, సమయపాలన అనేది లేకపోవడం సంప్రదాయ విరుద్ధాలు కావా…అన్నగారూ?” అని, మళ్ళీ తనే – “అయినా, చెప్పిన సమయానికి వచ్చేస్తే మన్య సుల్తాన్లైన విజయనగరం మహారాజుల వన్నె తరిగిపోదా? ఇతరులెంత నిరీక్షిస్తే అంత ఘనత!” – అన్నాడు వెంగళరాయుడు కోపంగా.“ఆనంద సమయంలో ఆవేశాలు అనర్ధదాయకం వెంగళరాయా!” అన్నాడు రంగారాయుడు తమ్ముణ్ణి సున్నితంగా మందలిస్తూ. ఇంతలో ద్వారపాలకుడు,
BATTLE OF BOBBILI ల్లో విజయరామరాజు విచ్చేస్తున్నారన్న వార్తని తీసుకువచ్చాడు. విజయరామరాజు – భార్య చంద్రాయమ్మతో, బావమరిది చింతలపాటి నీలాద్రిరాజుతో బొబ్బిలికి చాడు. మర్యాద పూర్వకంగా కలవడం కోసం మల్లమ్మ అంతఃపురానికి భార్యతో సహా ముండు వెళ్ళాడు. “రండి అన్నయ్యగారూ! వదినగారూ బావున్నారా?” – అని మల్లమ్మ ఆ దంపతులని ఆప్యాయంగా ఆహ్వానించింది. వాళ్ళు ఆసీనులయ్యాక – “పరాయివాళ్ళలా పుట్టిన రోజు నాడే వచ్చారేం అన్నయ్యగారూ? ఒకట్రెండు రోజులు ముందుగా వస్తే, ఎంతో బావుండేది కదా!” – అంది అభిమానం ఉట్టిపడేలా నిష్ఠూరం ఆడుతూ మల్లమ్మ.
“రాచకార్యాల వల్ల తీరిక దొరకలేదు మల్లమ్మా! లేకపోతే, మీ కన్నా మాకు ఆత్మీయులెవరు ఉన్నారు?” – అన్నాడు రామరాజు. “సరే! అన్నగారి సంగతి వదిలేద్దాం! నీకేం రాచకార్యాలమ్మా వదినా? నువ్వయినా కాస్తముందు రావచ్చుకదా!” – అంది మల్లమ్మ చంద్రమ్మని చూస్తూ. “నీకు మీ అన్నగారి మీద గౌరవాభిమానాలు అధికం! అందుకే వారిని వదిలేశావు. అలుసుగా దొరికింది, ఈ వదినే నీకు!” – అంటూ చంద్రమ్మ నవ్వింది. క్షణం ఆగి – “మామేనల్లుడికి కానుకలని ఎంపిక చేయడంతోనే బాగా ఆలస్యమైపోయింది మల్లమ్మా!” – అంటూ ఆలస్యానికి సంజాయిషీ చెప్పింది ఆమె.
“మీ దంపతుల ఆదరాభిమానాలు, కలకాలం ఇలాగే మా పై ఉంటే, అదే పదివేలు!” – అంది మల్లమ్మ ఆనందంతో, జాలువారే కన్నీటిని పైట కొంగుతో హత్తుకుంటూ. “అది నీవు వేరే కోరాలా అమ్మా? నీవు విజయనగరపు ఆడబడుచువే!” – అన్నాడు రామరాజు నిండుమనసుతో. “అది నిజం మల్లమ్మా! మొన్న మేము రామతీర్థం వెళ్ళినప్పుడు, మీ అన్నగారు నీ సుఖశాంతులు నిమిత్తం నీ పేర ప్రత్యేక పూజలని, మా కులదైవమైన సీతారామచంద్రుడికి జరిపించారు!” – అంది చంద్రమ్మ భర్తమాటలకి వత్తాసుగా.
“మీరు మీ వారికి వత్తాసు పలకనవసరం లేదు, వదినగారూ! మా అన్నగారికి నా మీదగల అభిమానం నాకు తెలియంది కాదు!” అంది మల్లమ్మ వదినగారిని ఆటపట్టిస్తూ. “నీకు తెలియంది అని ఎవరంటారమ్మా? ఎంతయినా నువ్వూ మీ అన్నగారూ ఒక్కటేకదా!” – అంది చంద్రమ్మ. తాము తెచ్చిన కానుకలని మల్లమ్మకి ఆ దంపతులు ఇచ్చారు. సరస సంభాషణలు అయిన తరువాత, విజయరామరాజు తన ఆశ్రితులతో ఠీవీగా ఉత్సవ మంటపానికి బయలుదేరాడు.
BATTLE OF BOBBILI ల్లో “విజయనగర సంస్థానాధీశ్వరులకి సుస్వాగతం!” – అంటూ రంగారావు, రామరాజుకి ఎదురు వెళ్ళి సాదరంగా ఆహ్మానించాడు. రామరాజు తన ప్రక్కనే ఉన్న సింహాసనం మీద ఆసీనుడైన తరువాత “ఆలస్యం అయిందేం బావగారూ? ప్రయాణంలో ఇబ్బందులు ఏవీ ఎదురవలేదు కదా?” – అంటూ మర్యాదగా రంగారావు అతనిని ప్రశ్నించాడు.
“చాలా ఏళ్ళుగా పంటలు పండక బుస్సీకి శిస్తు బకాయి పడ్డాము. సరిగ్గా ఇక్కడికి బయల్దేరేముందే దూత వచ్చి, బుస్సీ రాజమహేంద్రవరానికి వచ్చి నన్ను సత్వరం కలవమన్నాడని చెప్పాడు. అక్కడికి వెళ్ళి బుస్సీని కలిసి, ఇటు వచ్చేసరికి కొంత ఆలస్యమైంది! మన్నించాలి!” అన్నాడు వినయంగా రామరాజు. “మహారాజులుగా పుట్టాం! మహారాజులుగా పెరిగాం! పుట్టి బుద్దెరిగిన తర్వాత ఇంతకాలానికి, మన దేశానికి వలస వచ్చిన పరాయి వారికి బానిసలుగా బ్రతకవలసివస్తోంది!” అంటూ రంగారావు బాధగా నిట్టూర్చాడు.
మరుక్షణం ముఖకవళికలని మార్చుకుంటూ “ప్రధానాహ్వానితులు అయిన మీ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు! ఇప్పటికే ఆలస్యం అయింది! ఇక వేడుకలని ఆరంభిద్దామా?” – అంటూ రంగారావు సగౌరవంగా రామరాజుని అడిగాడు. అతను అలాగే! అన్నట్లు తల పంకించాడు. ఇద్దరూ వేదికని సమీపించారు. ఉత్సవాలని ప్రారంభిస్తూ రంగారావు ముఖ్య అతిధి అయిన రామరాజుకి అభివాదం చేసి శూలాన్ని చేతిలో పెట్టాడు.
BATTLE OF BOBBILI ల్లో ….విజయరామరాజు విసిరిన శూలం చాలా దూరం వెళ్ళి పడింది. అయితే, రంగారావు విసిరిన శూలం కోటప్రహరీ గోడదాటి వెళ్ళి పడింది. బొబ్బిలి ప్రజలు జయజయధ్వానాలు చేశారు. రామరాజు ఆశ్రితులు మొహం చిన్నబుచ్చుకున్నారు. తరువాత మల్ల యుద్ధం పోటీలు జరిగాయి. విజయనగరం అప్పలస్వామి, బొబ్బిలి వస్తాదును చిత్తుగా ఓడించాడు. దాంతో విజయనగరం వాళ్ళ మొహాలు వికసించాయి. విజయనగరం నుంచి వచ్చిన క్రీడల అధికారి, అప్పల స్వామిని ప్రజలకి చూపిస్తూ “బొబ్బిలి గడ్డమీద మగటిమి గల మల్లయోధుడు ఎవ్వరైనా ముందుకు వచ్చి అప్పలస్వామిని ఓడించవచ్చు! అలా ఓడించి వెయ్యి వరహాలు బహుమతిగా పొందవచ్చు!” – అని సగర్వంగా ప్రకటించాడు.
కొండవంటి ఆకారాన్ని చూసి, భయపడిన జనంలో నుంచి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. రంగారావుకి తల కొట్టేసినంత పనైంది. ప్రజలు సిగ్గుతో తలలు వాల్చారు. ఇదంతా చూస్తూన్న విజయరామరాజు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ మీసం మెలేశాడు. ఇంతలో ప్రజల్లో నుంచి ఆజానుబాహువూ, సాముగరిడీలతో కండలు తిరిగిన దేహముగల తాండ్రపాపారాయుడు సింహంలా ముందుకి దూకాడు. “ఎవడ్రా బొబ్బిలి గడ్డమీది మగటిమిగల యోధులని గురించి మాట్లాడింది? ఇదిగో మగటిమిగల మల్ల యోధుణ్ణి వచ్చాను.
మీ అప్పలస్వామిని గోదాలో అడుగు పెట్టమనండి! అప్పుడు తెలుస్తుంది బొబ్బిలి వీరులు తడాఖా!” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. రెండు మూడు పట్లతోనే అప్పలస్వామిని పాపారాయుడు మట్టికరిపించాడు. బొబ్బిలి పౌరుల్లో పాపారాయుడి విజయంవల్ల పుట్టుకొచ్చిన ఉత్సాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. పాపారాయుడి రాకతో బిక్కచచ్చిపోయిన రామరాజు, అతని జయంతో మొహం గంటు పెట్టుకొని కూర్చున్నాడు. దీనికితోడు బొబ్బిలి ప్రజల కేకలు అతనికి పుండు మీద కారం జల్లినట్లుగా గుండె భగ్గుమనిపించాయి.
BATTLE OF BOBBILI ల్లో “బొబ్బిలి దెబ్బకి విజయనగరం ‘అబ్బా’ అందిరా!” “వీరబొబ్బిలి పౌరుషమే పౌరుషం!” “ BATTLE OF BOBBILI ల్లో బొబ్బిలి ధాటికి తాళలేక, విజయనగరం వీరులు మచ్చకొండ మీద దాక్కోవల్సిందేరోయ్!” అంటూ BATTLE OF BOBBILI ల్లో బొబ్బిలి ప్రజలు ఉత్సాహంగా నినాదాలు చేస్తున్నారు. రంగారావు, రామరాజు మొహం పాలిపోవడం గమనించి, గంభీరవదనంతో చేయెత్తి ప్రజలు మళ్ళీ నినాదాలు చేయకుండా వారించాడు. దాంతో ప్రజలు సద్దుమణిగారు. అయితే కత్తి యుద్ధం – పోటీల్లో మళ్ళీ బొబ్బిలి వీరుడు గెలవడంతో, మళ్ళీ వాళ్ళని ఆపడం ఇంకెవరికీ చేతకాలేదు.
పులిమీద పుట్రలా, విలువిద్య పోటీల్లో మళ్ళీ బొబ్బిలి విలుకాడే గెలుపొందాడు. కోడిపందాల సమయంలో ప్రజల ఉత్సాహానికి అడ్డుకట్ట వేయడం, ఇక బ్రహ్మతరం కూడా కాని పరిస్థితి వచ్చేసింది. BATTLE OF BOBBILI ల్లో “బొబ్బిలి కోడిముందు పూసపాటి వారి కోడి, పూస పాటి కూడా చేయదురోచ్!” “మా కోళ్ళ రోషాలకి ఇజీనారం కోళ్ళు ఇట్టే లగెత్తాలి!” “కోళ్ళంటే బొబ్బిలి కోళ్ళే! వీరులంటే బొబ్బిలి వీరులే!” ఖర్మకాలి, విజయనగరం కోడి గోదాలో చచ్చూరుకుంది.
రామరాజు మొహంలో కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు. రంగారావుకి ఇదంతా నచ్చలేదు. ‘ఉత్తి పుణ్యానికి పిలిచి అవమానించామని, అతను ఎక్కడ బాధపడతాడోనని రంగారాయుడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ శుభవేళలో రంగారాయుడి మనసు ఏదో కీడుని శంకించింది. అతికష్టంమీద ప్రజలని ఆయన అదుపు చేయగలిగేడు. కాని, ఇదంతా చూస్తూన్న గోవింద రాయుడు, తాతగారైన ధర్మారాయుడివైపు చూసి- “నేను ముందే చెప్పేనా!” అన్నట్లు చిరునవ్వు నవ్వేడు.
బహుమతుల ప్రదానం రామరాజు చేతిమీదుగానే జరిగింది. నాటి వేడుకలని ముగిస్తూ… రామరాజు హృదయాన్ని గ్రహించిన వాడిలా- “బావగారూ! ఈ వేడుకల్లో మా బొబ్బిలి ప్రజలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఉంటే మన్నించమని నా విన్నపం!” అన్నాడు రంగారావు. బలవంతాన మొహాన నవ్వును పులుముకున్న రామరాజు “క్రీడా వేళల్లో ఇవన్నీ సహజమే!” అన్నాడు. అది పెదాలమీంచి వచ్చిన మాట. అంతే! ఆ మర్నాడు, విజయరామరాజు భార్యాసమేతంగా విజయనగరం వెళ్ళిపోయేడు.జన్మదినోత్సవాలకి తాండ్రపాపారాయుడు తన చిన్నచెల్లెలు సుభద్రాంబతో బొబ్బిలికి వచ్చేడు. రాకరాక వచ్చిన చెల్లెలిని చూసి మల్లమ్మ ఎంతో సంతోషించింది.
విజయరామరాజు బయలుదేరిన కాసేపటికి పాపారాయుడు సుభద్రతో తను కూడా ప్రయాణానికి సంసిద్ధం అయ్యేడు. “ఇన్నాళ్ళకి తీరిక చేసుకొని నువ్వూ, సుభద్రా మా ఇంటికి రాకరాక వచ్చేరు! ఓ వారం రోజులు ఉండి వెళ్ళండన్నయ్యా! ” అని మల్లమ్మ పాపారాయుణ్ణి బ్రతిమాలింది. పెద్ద చెల్లెలు మల్లమ్మ మీద అపరిమితమైన ప్రేమాభిమానాలు గల ఆయన, ఆమెమాటని కాదనలేక ఉండిపోయేడు సుభద్రతో పాటే. ఒకరోజు … వెంగళరాయుడు తన మిత్రుడు శివరాముడితో పావురాల పందాలు ఆడుతున్నాడు. అతని పావురం ఎగిరి, మల్లమ్మ అంతఃపురం ముందరి పిట్టగోడల మీద వాలింది. ఆ పావురం కోసం, వదినగారి మందిరంలోకి వెంగళరాయుడు వచ్చేడు. కంచుకి (అంతఃపుర స్త్రీలనిరక్షించే వృద్ధసేవకుడు) అనుమతితో, అంతఃపురంలో అడుగుపెట్టిన అతనికి, అక్కడ సుభద్ర కనిపించింది.
ఆమె పావురాన్ని చేరదీసి ముద్దులాడుతోంది. వెంగళరాయుణ్ణి చూసి ఆమె సిగ్గు పడింది. ఆమె చిన్నప్పుడు అతనితో ఆటలాడుకున్న నేస్తురాలే! అయినా, పెద్దయ్యాక ఆమెని అతను చూడడం ఇదే ప్రధమం. ఆమె బుగ్గ మీది పుట్టుమచ్చని చూసి, వెంగళరాయుడి తల్లి తిప్పమాంబ- “కోడలా! పెళ్ళిరోజు నీకు బుగ్గచుక్క వేరే పెట్టనక్కర్లేదు!” అంటూ చిన్నప్పుడు ఆమెని వేళాకోళం చేస్తూండేది. ఇప్పుడతనికి అది గుర్తొచ్చి, చిన్ననవ్వు పెదాలపై మెదిలింది. సుభద్ర చిరుకోపంతో అతడి వంక _చూసింది.
“నీకు దిష్టిచుక్క పెట్టనవసరం లేదు సుభద్రా!” అన్నాడు వెంగళరాయుడు పావురాన్ని తీసుకుంటూ, అతని వెనుకే నిల్చున్న మల్లమ్మ- “మా చెల్లెలికి దిష్టిచుక్క పెట్టాలో వద్దో మేం చూసుకుంటాంలెండి మరిదిగారూ!” అంది అతడిని ఆటపట్టిస్తూ. త్వరత్వరగా అక్కడినుంచి – వెంగళరాయుడు వెళ్ళిపోయేడు. సుభద్ర వెళ్ళిపోతూన్న అతనినే తదేకంగా చూస్తోంది. “మరీ అంత ఇదిగా మా మరిదిగారిని చూడకు చెల్లీ! అతనికి దిష్టిచుక్క అసవరం వచ్చేను!” అంది మల్లమ్మ సుభద్రతో మేలమాడుతూ. సిగ్గుతో సుభద్ర చూపులు త్రిప్పుకుంది. “నచ్చితే చెప్పు! మీ బావగారికి చెప్తాను!” అంది మల్లమ్మ మళ్ళీ హాస్యంగా. “ఫో అక్కయ్యా!” అంది సుభద్ర మరింత సిగ్గుపడుతూ. “నన్నెక్కడికి వెళ్ళి పొమ్మంటావమ్మా? ఇది మనిద్దరి అత్తిల్లు !”అంది మల్లమ్మ చెల్లెలి బుగ్గలు పుణుకుతూ. సుభద్ర నవ్వేసింది అక్కగారి మాటలకి.
విజయనగరం చేరాడన్న మాటేగాని, వచ్చిన నాటి నుంచి రామరాజు కంటిపై కునుకన్నది లేదు! పడే పదే BATTLE OF BOBBILI ల్లో బొబ్బిలి ప్రజల కేకలు అతనికి గుర్తొస్తున్నాయి. అవి గుర్తొస్తూన్న కొద్దీ అతని గుండెల్లో పరాభవాగ్ని రాజుకోసాగింది. “పూసపాటివారు పూస పాటి చేస్తారో, వజ్రంలా కోస్తారో మీకు చూపించి తీరతాను!” అంటూ లోలోన భీకరప్రతిజ్ఞని చేసేడు. తన మందిరంలో బోనులోని సింహంలా అసహనంగా పచార్లు చేయసాగాడు. సరిగ్గా ఆ సమయంలోనే అతని మంత్రులు ప్రవేశించారు. – “తమ ఏకాంతానికి భంగం కలిగించినందుకు మన్నించాలి! ఒక వ్యవహారాన్ని గురించి మీకు మనవి చేయడానికి మేము ఇలా రాక తప్పలేదు!” అన్నారు వాళ్ళు. “అదేమిటో చెప్పండి!” అన్నాడు రామరాజు. ఇంతకుముందు మనం బుస్సీ దొరని మర్యాద పూర్వకంగా మాత్రమే కలిసి వచ్చాము.
అప్పుడు, దుబాసి (ద్విభాషికి ఇది వాడుక పదం! రెండు భాషలలో నేర్పు కలిగి, తర్జుమా చేయగలిగిన వ్యక్తి) లక్ష్మన్న శిస్తు బకాయిల విషయంలో తమ దొరగారు చాలా ఆగ్రహంతో ఉన్నారని మనకి చెప్పేడు. మనం తాత్కాలికంగా ఆ ఆపదని తప్పించుకోవడం కోసం ‘తతిమ్మా సంస్థానాధిపతులతో పాటు త్వరలో వస్తామ’ ని చెప్పాము. తమకి గుర్తుండే ఉంటుంది!” అంటూ ఓ క్షణం వాళ్ళు ఆగేరు. అయితే, ఈ లోపలే ఓపిక నశించిన రామరాజు “ఆఁ! మా బాగా గుర్తుంది గానీ, ప్రస్తుతానికి రండి!” అన్నాడు విసుగ్గా. “చిత్తం! అదే తమకి విన్నవించబోతున్నాము! ఇవాళ బుస్సీ దొరనుంచి తాఖీదు వచ్చింది.
తమని కలిసి శిస్తు బకాయిలని గురించి మాట్లాడమని, లేకపోతే మన మీదికి దండెత్తుతామని…”
ఆ మాటలకి మహారాజుకి ఎక్కడ ఆగ్రహమొస్తుందోనని వాళ్ళు లోలోన భయపడసాగేరు. ఆశ్చర్యం! రామరాజుకి ఆగ్రహం కలగలేదు సరికదా, వాళ్ళమాటలతో ఆయన మొహం ఆనందంతో విప్పారింది. “సమయానికి మంచి వార్త తెచ్చారు!” అన్నాడు ప్రశంసాపూర్వకంగా. “మంచివార్తా?”- అంటూ వాళ్ళు తెల్లబోయారు. “ఔను! మంచి వార్తే! బొబ్బిలి వారు నానాటికీ పెట్రేగిపోతున్నారు. వాళ్ళ ఆటకట్టించడానికి మనకి మంచి అవకాశం ఇప్పుడు దొరికింది.
బుస్సీ దర్శనం కోసం, మనతో సైన్యసమేతంగా రమ్మనమని బొబ్బిలి వారికి జాబుని పంపుదాం! వచ్చినా ముప్పు! రాకున్నా ముప్పు! అలా మనం ఓ పన్నాగం పన్నుదాం! బుస్సీ ఆగ్రహజ్వాలలకి BATTLE OF BOBBILI ల్లో బొబ్బిలి బుగ్గి అయ్యేలా చూద్దాం! నాడు జన్మదినోత్సవాల్లో వాళ్లు మనకి జరిపిన అవమానానికి తగిన శాస్తి జరుపుదాం!” అంటూ రామరాజు మంత్రులకి తన ఎత్తుగడని వివరించి, ఏవిధంగా లేఖ రాయాలో వారికి నిర్దేశించాడు. తమ మహారాజు ఆలోచనకి విభ్రాంతులు అవుతూ మంత్రులు నిష్క్రమించేరు.
రాజమందిరం వెలుపలకి వచ్చిన వెంగళరాయుడు, ప్రవేశద్వారం దగ్గర తచ్చాడుతున్న ఇద్దరు వ్యక్తులని చూసేడు. వాళ్ళు విజయనగరం నుంచి వచ్చిన వార్తాహరులు అని గ్రహించేడు. ‘వాళ్ళొచ్చిన కారణం ఏమిట’ని గద్దించి అడిగేడు. వాళ్ళు తమ ‘మహారాజు నుంచి లేఖని తీసుకొచ్చేమ’ని చెప్పేరు. “అది సరే! లేఖని తీసుకొని నేరుగా మందిరంలోనికి రాకుండా ఇక్కడెందుకు తచ్చాడుతున్నార్రా?” అంటూ వాళ్ళని అతడు ఆగ్రహంతో నిలదీసేడు. వాళ్ళు ఆకుకి అందకుండా,పోకకి పొందకుండా ఏదేదో చెప్పి అతన్ని మభ్యపెడదామని ప్రయత్నించేరు.
BATTLE OF BOBBILI ల్లో అప్పుడు వెంగళరాయుడికి వాళ్ళు కేవలం వార్తాహరులే కాకుండా గూఢచారులు కూడాననే సంగతి బోధపడింది. ‘మర్యాదగా ఉత్తరం ఇచ్చి వెళ్ళి పొమ్మన్నాడు. వాళ్ళు- “మేము మీకు ఇయ్యం! మహారాజులకే ఇస్తాం!” అన్నారు. వెంగళరాయుడు కోపంతో వాళ్ళని రెండు తన్ని, వాళ్ళ దగ్గర నుంచి ఆ లేఖని ఊడలాక్కున్నాడు. ఆ ఉత్తరం చూసి ఆవేశం పట్టలేక దాన్ని ముక్కలు చేసి నేలమీద విసిరి కొట్టాడు. ఆ వార్తాహరులు పెద్దగొంతుతో ఆర్తనాదాలు చేస్తూ అక్కడ రగడ చెయ్యసాగేరు.
ఈ గొడవ అంతా విని, మందిరం లోపలినుంచి రంగారాయుడు హూటాహుటిన బయటికి వచ్చేడు. “ఏం జరిగింది?” అంటూ సంగతి ఆరా తీశాడు. వార్తాహరులు గగ్గోలు పెడుతూ వెంగళరాయుడు తమని కొట్టాడనీ, తమ దగ్గర ఉత్తరం లాక్కుని చించి ముక్కలు చేసేశాడనీ ఆయనకి చెప్పారు. “వీళ్ళు చెప్తున్నది నిజమేనా? అని రంగారాయుడు తమ్ముణ్ణి అడిగేడు. అతను ‘నిజమే!’ అన్నాడు.
“మా తమ్ముడు కుర్రవాడు. కాస్త దుడుకుతనం పాలెక్కువ! మీరు బాధపడకండి! నేనతన్ని మందలిస్తాను! తన లేఖకి నేను ప్రత్యుత్తరం పంపిస్తానన్నానని మీ రాజుగారికి చెప్పండి! మీరు వెళ్ళిరండి!” అంటూ రంగారాయుడు వాళ్ళని సమాధాన పరచి పంపించేశాడు. “తమ్ములుంగారూ! మీరు రండి!” అంటూ ఆయన లోనికి నడిచాడు. వెంగళరాయుడు అన్నగారిని అనుసరించాడు. మందిరం లోపలికి ఇద్దరూ వెళ్ళారు. “వెంగళరాయా! వార్తాహరులపై చేయి చేసుకోవడం ధర్మవిరుద్ధం కదా!” అన్నాడు రంగారాయుడు. “వాళ్ళు కేవలం వార్తాహరులే అయితే, నేను దండించే వాణ్ణి కాదు! వాళ్ళు గూఢచర్యం కూడా చేస్తున్నారు!” అంటూ వెంగళరాయుడు తను వారిని దండించిన కారణం తెలిపాడు.
“సరి సరి! ఇంతకీ ఆ జాబులో ఉన్న విషయం ఏమిటి?” అని తమ్ముణ్ణి రంగారాయుడు అడిగాడు. “బుస్సీ దొర పరివారంతో హైదరుజంగుతో పాటుగా జమాబందీకి, రాజమహేంద్రవరానికి వచ్చి విడిది చేసియున్నాడు. మనం మన సేనలతో వెళ్ళి పన్ను కట్టలేమని చెప్పివద్దాము. ఇందుకు అతగాడు ఒప్పుకోకపోతే చేయవలసిన పని ఏదో చేసివద్దాము!” అని ఆ లేఖలో సంగతులని వెంగళరాయుడు అన్నగారికి నివేదించాడు. “తమ్ములుంగారూ! అసలే రోజులు బాగులేవు. మీరు తొందరపడితే, కార్యం మరింత జటిలం అయ్యే ప్రమాదం ఉంది! మీ తొందరపాటు శత్రువులు మనని దెబ్బతీసేందుకు సాధనంగా ఉపకరించవచ్చును.
మీరు అది కాస్త గుర్తుంచుకోండి!” అంటూ రంగారాయుడు తమ్ముణ్ణి మృదువుగా మందలించాడు. వెంగళరాయుడు తలవంచుకున్నాడు. “మంత్రి సేనాధికారులతో సమావేశమై సంగతులన్నీ సమగ్రంగా చర్చించి ఏం చేస్తే బాగుంటుందో నిర్ణయం తీసుకుందాం! మీరు వెళ్ళి రండి!” అంటూ తమ్ముణ్ణి ఆయన పంపించేశాడు. అతను పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోతూంటే, సోదరుడి వీరత్వాన్ని తలచి, గర్వంగా రంగారాయుడు మీసం మెలేశాడు. తలుపు దగ్గర నిలిచి దీన్నంతా గమనించిన మల్లమ్మ – “మళ్ళీ మన మరిదిగారేదైనా పీకల మీదికి తెచ్చారా?” అని నవ్వుతూ భర్తని ప్రశ్నించింది.
“అది మామూలేగా!” అన్నాడు రంగారాయుడు. “మరిది గారికి తొందరగా పెళ్ళి జరిపించండి! ఇహ ఈ మామూళ్ళ బాధ తమకి ఉండదు!” అంది మల్లమ్మ యుక్తియుక్తంగా. “మా వాడికి తగిన వధువు దొరకవద్దా?” అన్నాడు రంగారాయుడు సాలోచనగా. అంటే “ఇంట్లో పిల్లని పెట్టుకొని, ఇంకా మీనమేషాలు లెక్కిస్తారేమిటి”- అని భర్తని నిలదీసింది ఆ ఇ. ఎవరా పిల్ల?” అన్నాడు రంగారాయుడు విస్మయంగా. “మీ పాపారాయుడి బావగారి చెల్లెలు సుభద్రాంబ!”- అని నవ్వింది మల్లమ్మ. “ఆహాఁ! ఏం తెలివి! ‘నా చెల్లి’ నేనేమైనా అంటానని కదూ… ఇంత డొంక తిరుగుడుగా చెప్పడం!” – అన్నాడు రంగారాయుడు.
“ఇప్పటకయినా తమరు గుర్తించేరు – మా తెలివిని! ధన్యురాల్ని!” అంది పరిహాసంగా. రంగారాయుడు హుందాగా నవ్వేడు. మంత్రి, సేనాని తదితర ప్రముఖులతో రంగారాయుడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించాడు. రామరాజు పంపిన లేఖని గురించి అందరూ చర్చించసాగేరు. “షేర్ఫాన్ మనకి ఈ ప్రాంతాన్ని ఇచ్చేటప్పుడు, మనకి శిస్తును చెల్లించనవసరం లేకుండా ఇచ్చేరు.
తరతరాలుగా మా పద్మనాయక వంశస్థులు స్వతంత్రులుగా నే ఉన్నారు. వారెవరికీ, ఎప్పుడూ బానిసలు కానేకాదు. అటువంటప్పుడు, ఇవాళ మనని రామరాజు బుస్సీ దర్శనార్ధం ససైన్యంగా రమ్మనమనడంలో ఉద్దేశ్యమేమిటి?” – అన్నాడు రంగారాయుడు ఆవేదనగా. “ఉద్దేశ్యం ఏముంది ప్రభూ! బుస్సీ ముందు మనల్ని చెడ్డ చేయడమే! వెళ్ళినా మానినా ముందు నుయ్యీ, వెనుక గొయ్యి వంటి విపత్కర పరిస్థితిని మనకి సృష్టించడమే! ఇదొక రాజకీయకుట్ర!” అన్నాడు మంత్రి ధర్మారాయుడు.
“అదెలా?” అన్నాడు సేనాని నరసారాయుడు. “వెళ్తే, రామరాజు లాగే మనమూ అస్వతంత్రులం అవుతాం! వెళ్ళకపోతే, అవిధేయులమవుతాం!” అంటూ ధర్మారాయుడు చిక్కుముడిని విప్పి చూపించేడు. “ఈ పన్నాగంలో రామరాజు పోషించే పాత్ర ఏమిటి?” అని దండనాయకుడు చెలికాని వెంకమ్మ అడిగాడు. “ప్రధానపాత్ర అతగాడిదే! మనం అతని మాటలు నమ్మి, సైన్యంతో వెళ్ళామా! ‘అదిగో! BATTLE OF BOBBILI ల్లో బొబ్బిలివారు నీపై దండెత్తేందుకు సేనతో వచ్చారు!’ అని బుస్సీని రెచ్చగొడతాడు. వెళ్ళకపోయామా! ‘ఇదిగో! నువ్వంటే బొబ్బిలివారికి ఖాతరులేదు!’ అంటూ బుస్సీకి పితూరీలు చెప్తాడు. ఎటు తిరిగి ఎటు వచ్చినా మనకే నష్టం కలిగేలా అతను ఈ పథకాన్ని రచించేడు!” అంటూ నరసారాయుడు లోగుట్టుని వివరించాడు. “ఉత్తరం ఉండివుంటే, మనని మనం కాపాడుకొనేందుకు, అదిమంచి సాక్ష్యంగ
మనకి ఉపకరించేది!” అన్నాడు ధర్మారాయుడు. “మా తమ్ములుంగారి నిర్వాకం వల్ల మనం ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయాం!” అన్నాడు రంగారాయుడు బాధగా. “అయిపోయిన దానికి వగచి లాభం లేదు. ప్రస్తుత కర్తవ్యాన్ని గురించి మనం యోచించాలి!” అన్నాడు ధర్మారాయుడు. “మరొక సంగతి ! బుస్సీతో, అతని మంత్రి హైదర్ జంగ్ కూడా రాజమహేంద్రవరానికి వచ్చాడట! రామరాజు అతనికి పన్నెండు లక్షలు లంచం ఇచ్చి తనవైపు తిప్పుకున్నాడట!” అన్నాడు చెలికాని వెంకయ్య. “మీకీ సంగతులు ఎలా తెలిసాయి?” అని ప్రశ్నించాడు రంగారాయుడు వెంకయ్యని. “మన చారుల వల్ల తెలిసింది” అన్నాడు వెంకయ్య.
చివరికి ధర్మారాయుడు, నరసారాయుడు బాగా ఆలోచించి ఒక ఉపాయాన్ని సూచించారు. దాని ప్రకారం – బృందావనపురం (నేటి బందరు)లో ఉన్న గోరుందొర (గొడేహుదొర దగ్గరికి, మంతెన బుచ్చన్నగారిని పంపిస్తూ, ఒక జాబు ద్వారా మన పరిస్థితిని వివరించాలని, అతని సిఫార్సుతో బుస్సీని మంచి చేసుకోవాలనీ వారు రంగారాయుడికి చెప్పారు. అతనికి ఈ ఉపాయం బాగానచ్చింది. “సమయానికి బాగా గుర్తుచేశారు! ఇంతకుముందు ఆ గోరుందొర, మనకీ విజయనగరపు వారికీ మధ్య వచ్చిన కొన్ని సరిహద్దు తగాదాలను చక్కగా పరిష్కరించారు. మనకి న్యాయం చేశారు! ఇప్పుడు కూడా, వారు మనకి తన నైతిక సహాయాన్ని అందించక మానరు!” అంటూ రంగారాయుడు మంత్రుల యుక్తిని ప్రశంసించాడు.
ఆ రోజే, ధర్మారాయుడు సిద్ధం చేసిన లేఖని తీసుకొని బుచ్చన్న బృందావనపురానికి బయలుదేరాడు.

వెంగళరాయుడు, సుభద్రాంబల వివాహం రంగరంగ వైభవంగా జరిగింది. అయితే, పెళ్ళికి విజయరామరాజు రాలేదు. ‘బుస్సీ, హైదర్ంగ్ తో పాటు అనకాపల్లి దగ్గర ఉన్న దేవులపల్లికి వచ్చి ఉన్నందువల్ల, తను శిస్తు బకాయిలని గురించి విన్నవించే నిమిత్తం బుస్సీ దగ్గరకి వెళ్తున్నానని, పెళ్ళికి రాలేకపోతూ ఉన్నందుకు తనను క్షమించమ’నీ – రంగారాయుడికి ఒక జాబుని పంపాడు. చంద్రాయమ్మ పెళ్ళికి వచ్చింది. పెళ్ళి అయిన మరుసటి రోజున…. ఉద్యానవనంలో ఉన్న పాపారాయుడు, మొగలి పొదల మాటున నక్కి ఉన్న ఇద్దరు వ్యక్తులని చూశాడు. వారి వెనుకే ఉండి వాళ్ళ మాటలని విన్నాడు.
వాళ్ళల్లో ఒకడు విజయనగరపు వారి గూఢచారి, రెండవవ్యక్తి బొబ్బిలి కోటకి చెందిన ప్రధాన రక్షణాధికారి. బొబ్బిలి అధికారికి లంచం ఇచ్చి, గూఢచారి కోట రక్షణకి సంబంధించిన రహస్య సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు. ఈ చాటుమాటు వ్యవహారాన్ని చూసి పాపారాయుడు ప్రళయరుద్రుడయ్యేడు. ఆ ఇద్దర్నీ ఈడ్చుకొచ్చి రంగారాయుడి ముందు పడేసాడు. అయితే, గూఢచారి కేవలం తన ఉద్యోగ విధిని నిర్వర్తించాడు గనుక అతనిని శిక్షంచకుండా, రంగారాయుడు దయతలిచి విడిచిపెట్టేశాడు. ఆయన చర్య పాపారాయుడికి చాలా అసంతృప్తిని కలిగించింది. అది గ్రహించిన రంగారాయుడు గుండె రాయి చేసుకొని బొబ్బిలి అధికారికి దేశ బహిష్కార శిక్షని విధించాడు. కాని పాపారాయుడి ఆందోళన తగ్గుముఖం పట్టలేదు. “బావగారూ! జరిగేదంతా చూస్తూ ఉంటే రామరాజు బుస్సీని ఉసిగొలిపి, మన మీదికి దండెత్తాలా చేయడంలో కృతకృత్యుడు కాగలిగేడని అనిపిస్తోంది.
ఎందుకైనా మంచిది! రక్షణ వ్యవస్థని బలోపేతం చేయండి!” అన్నాడు. “శత్రువులు తాము వచ్చే దారిలో పంటపొలాలని ధ్వంసం చేస్తారేమో?” అన్నాడు రంగారాయుడు. “మీరు ఆ విషయాన్ని గురించి చింతించకండి బావగారూ! నేను కొంత సేనని తీసుకొని, రాజాం దగ్గర మన సరిహద్దులని కాపాడుతాను! శత్రువులు ఆదారినే వస్తే, నేను వారిని అడ్డుకుంటాను!” అని పాపారాయుడు అతనికి భరోసా ఇచ్చేడు. “నిన్ననే పెళ్ళి ముగిసింది! కట్టిన తోరణాలు ఇంకా వాడనైనా వాడలేదు. మీరు యుద్ధరంగానికి ఇలా వెళ్ళవలసి రావడం, నాకెంతో బాధాకరంగా ఉంది బావగారూ!” అన్నాడు రంగారాయుడు గద్గద స్వరంతో. “దైవేచ్ఛ!” అన్నాడు విరాగిలా పాపారాయుడు. ఆనాటి మధ్యాహ్నమే పాపారాయుడు తగు సేనతో రాజాంకి బయలుదేరాడు.
ఇంకొక రెండు రోజులకి, రంగారాయుడి దగ్గరకి బుస్సీ నుంచి ఒక దూత వచ్చాడు. అతను- బుస్సీ, హైదరింగ్తో దేవులపల్లికి వచ్చాడని చెప్పాడు. బుస్సీ పంపిన రెండవ తాఖీదుని అతను రంగారాయుడికి ఇచ్చాడు. ‘తనని రాజమహేంద్రవరానికి వచ్చి ఎందుకు కలవలేదో కారణాన్ని చెప్పమనీ, శిస్తు బకాయిని గురించి వివరణ ఇవ్వకపోతే తాను దండెత్తడం ఖాయమనీ’ – బుస్సీ ఆ లేఖలో రాసాడు. మళ్ళీ మంత్రులతో అత్యవసర సమావేశాన్ని రంగారాయుడు జరిపాడు. ఆ సమావేశంలో, ధర్మారాయుడిని బుస్సీ దగ్గరకు రాయబారం నిమిత్తం పంపించాలని అంతా నిర్ణయాన్ని తీసుకున్నారు.
దేవులపల్లిలో బుస్సీ విడిదిచేసిన బంగళాలో విజయరామరాజు – హైదరంగూ బుస్సీతో సంభాషిస్తున్నారు. BATTLE OF BOBBILI ల్లో “బొబ్బిలివారు నన్ను గడ్డిపోచలా తీసిపారేసినా నాకు బాధలేదు. కానీ మీరు రాజమహేంద్రవరానికి వచ్చారని మనం దర్శించుకుందామని లేఖ రాసేను. అది తప్పా? దానికి ఆ వెంగళరాయుడు రాయబారిని కొట్టి, నన్నే కాక మిమ్మల్ని కూడా చెప్పనలవి కాని తిట్లు తిట్టాడట. మీరిక ఊరుకొని లాభంలేదు. ఆ పొగరుబోతులకి బుద్ధి చెప్పి తీరాలి. మీరు బొబ్బిలిని జయించి
నాకు ఇచ్చినట్లయితే నేను సదా మీకు విధేయుణ్ణి అయి ఉంటాను. ఎలాంటి బకాయి లేకుండా శిస్తు చెల్లించుకుంటాను!” అని రామరాజు బుస్సీకి మనవి చేసుకుంటున్నాడు. “ఫ్యూచర్ని గురించి ప్రామిస్ల సంగతి సరే! ప్రెజంట్ గురించీ, నీ శిస్తు బకాయి గురించి ఏం చేసావ్? ఏడేళ్ళ నుంచి మనీ ఇవ్వలేదు! ఆ మేటర్ చెప్పు!”- అన్నాడు. “వర్షాలు పడలేదు, పంటలు పండలేదు, అడవి ఏనుగులు పండిన కాస్త పంటనీ ధ్వంసం చేశాయి. మా అధీనంలో రాజులు శిస్తు చెల్లించలేదు. ఈ సమస్త కారణాల వల్లా, నేను బకాయి పెట్టక తప్పలేదు.
మీరు BATTLE OF BOBBILI ల్లో బొబ్బిలిని మా పరం చేస్తే వెంటనే సొమ్మంతా వడ్డీతోసహా చెల్లు వేస్తాను” అన్నాడు రామరాజు ప్రాధేయపడుతూ. “చూస్తాం!” అన్నాడు బుస్సీ తెలివిగా… మాట ఇవ్వకుండా. ఇంతలో ద్వారపాలకుడు మచిలీపట్టణం నుంచి వార్తాహరుడు వచ్చాడని చెప్పాడు. బుస్సీ కనుసైగతో వారిని బయటికి పంపించి వార్తాహరుణ్ణి లోపలికి పిలిపించాడు. ఆ దూత ‘గొడేహు’ పంపిన లేఖని బుస్సీకి ఇచ్చాడు. దుబాసీ లక్ష్మన్న ఆ లేఖని చదివి వినిపించాడు. అందులో – విజయరామరాజు, హైదరుజంగు తోడుదొంగలనీ, బొబ్బిలి వారు ధర్మపరులనీ, వారి మీద దండెత్తవద్దనీ – ఆ దొర రాశాడు.
బుస్సీ ఆలేఖలోని విషయాలు విన్నాక ఆలోచనలో పడ్డం లక్ష్మన్న గమనించాడు. ‘బొబ్బిలిని తనకి ఇప్పించమని’ రామరాజు చేసిన ప్రార్థనని బుస్సీకి అతను గుర్తు చేశాడు. అయితే బుస్సీ వికటంగా నవ్వి, “బొబ్బిలి మీద దండెత్తను! కానీ బొబ్బిలివారిని పాలకొండకి పంపిస్తాను. విజయనగరం వారికి, ఎప్పుడూ వాళ్ళు పక్కలో బల్లెంలా ఉంటూ ఉండాలి!” అన్నాడు లక్ష్మన్నతో. “ఆహా! విభజించి పాలించడంలో మీ విదేశీయులకి ఎవరూ సాటిరారు!” అన్నాడు లక్ష్మన్న, స్తుతినిందా పూర్వకంగా.
ఇంతలో, ధర్మారాయుడు రాయబారం కోసం బుస్సీ దగ్గరకి వచ్చేడు. BATTLE OF BOBBILI ల్లో “బొబ్బిలి వారు శాంతిని కోరుకుంటున్నారు. మీరు రామరాజు మాటలని విని, మా మీద దండెత్త దలచుకోవడం సరికాదు. నిజానికి, షేర్భాన్ వారి దయవల్ల మేము స్వతంత్రులం! కాని, యుద్ధం వల్ల ప్రజలు కష్టాల పాలు కాకూడదన్న సత్సంకల్పంతో, మేము ఇకపై తమకి కప్పం చెల్లించదలచాము! తమరు దయవుంచి యుద్ధం చేసే ఆలోచనని విరమించుకోండి! మా ప్రజలని కాపాడండి! ఇది మా మహారాజుల మనవి” అని ధర్మారాయుడు సవినయంగా బుస్సీకి నివేదించాడు.
https://photos.app.goo.gl/2WyKgUVYY7wPVhzr7అయితే రామరాజు బుస్సీకి తమ దూతని కొట్టి పంపిన విషయాన్ని గుర్తుచేసాడు. హైదరంగ్ లేఖని చింపి, దూత మొహాన కొట్టి పరోక్షంగా మిమ్మల్ని అవమానించాడని బుస్సీని రెచ్చగొట్టాడు. దాంతో బుస్సీ కల్లుతాగిన కోతిలా చిందులేస్తూ – “మీ కెంత ధైర్యం! మమ్మల్నే ఇన్సల్ట్ చేస్తారా? మీకు తగిన బుద్ధి చెప్పకమానం! మర్యాదగా బొబ్బిలి కోట వెకేట్ చేసి పాలకొండకి పొండి! మీ బిరుదునిశానీలని మా పాదాల దగ్గర పెట్టండి!” అని అరిచేడు. దాంతో శాంతమూర్తి అయిన ధర్మారాయుడు తోక తొక్కిన తాచులా లేచేడు. బొబ్బిలి యోధుల పౌరుషాలని గురించి, శౌర్యధైర్యాలని గురించి చెప్పి బుస్సీని హెచ్చరించాడు. BATTLE OF BOBBILI ల్లో “బొబ్బిలి దిబ్బగా మారే కాలం వచ్చింది. మీ శౌర్యాలేవీ, ఆ శుభసమయాన్ని ఆపలేవు” అన్నాడు రామరాజు ధర్మారాయుణ్ణి మరింత రెచ్చగొడుతూ. “ఏం వాగుతున్నావురా? BATTLE OF BOBBILI ల్లో మా బొబ్బిలి దిబ్బవుతుందా? ఆ మాటన్న నీ నాలిక చీలికలు చేస్తాను!” అంటూ కత్తిదూసి ధర్మారాయుడు
అతని మీదికి లంఘించాడు. రామరాజు బెదిరి, బుస్సీ చాటున నక్కాడు- “దొరవారూ! అతడి దూకుడు చూశారా?” అంటూ. అతడికి బాసటగా నిలిచిన బుస్సీ మరుక్షణం, ‘ధర్మారాయుణ్ణి బంధించమ’ని భటులకి ఆజ్ఞనిచ్చాడు. ధర్మారాయుడు ఆ భటులతో యుద్ధం చేస్తూ చేస్తూ ఒక్క ఉదుటున తన గుర్రం మీదికి దూకాడు. భటులు అతనిని వెంటాడారు. అయితే గుర్రం శరవేగంగా ముందుకు దూసుకుపోయింది.
ధర్మారాయుడు రక్తసిక్తమైన దేహంతో, సరాసరి రంగారాయుడి మందిరంలోకి ప్రవేశించాడు. ఆ మందిరంలో, అంతవరకూ ఆసీనుడై ఉన్న రంగారాయుడు, నరసారాయుడు, వెంకయ్యవంటి పెద్దలు యుద్ధం జరిగే అవకాశం ఎంతవరకూ వుందనే విషయాన్ని గురించి తర్జన భర్జన పడుతున్నారు. తీరా, ధర్మారాయుణ్ణి ఆస్థితిలో చూసేసరికి, ఆ క్షణంలోనే వాళ్ళందరికీ ‘యుద్ధం అనివార్యం!’ అనే సంగతి సుస్పష్టంగా బోధపడిపోయింది. తన దౌత్యమెలా భగ్నమైందీ ధర్మారాయుడు వారందరికీ పూసగుచ్చినట్లు చెప్పాడు.
“ఇక మనం కూడా యుద్ధానికి సంసిద్ధమవుదాం!” అంటూ రంగారాయుడు, సాదరంగా నరసారాయుణ్ణి తన సమీపానికి పిలిచాడు. “మామా! మన సేనకి సేనాపతిగా ఉండమని మిమ్మల్ని అర్ధిస్తున్నాను. మీ భుజస్కంధాలమీద ఈ యుద్దభారాన్ని ఉంచుతున్నాను. మీ మాట మేమెవరమూ జవదాటము. ఇక మా రక్షణ బాధ్యత మీదే!” అంటూ సగౌరవంగా ఆయన మెళ్ళో పూల హారాన్ని వేసి, ఖడ్గం చేతికి ఇచ్చాడు. రంగారాయుడు తనకి చేసిన ఈ అపూర్వ గౌరవానికి ఆనందభాష్పాలని రాల్చాడాయన. ‘వృద్ధుణ్ణి అయినా, నన్ను నమ్మి నామిదింత భారాన్ని పెట్టావు.
దేవర ఆజ్ఞని శిరసావహిస్తాను!” అని నరసారాయుడు వినయంగా అన్నాడు. ఇంతలో హైదరంగ్ దగ్గరనుంచి ‘హసన్ ఆలీఖాన్’ అనే దూత వచ్చినట్లు ద్వారపాలకుడు చెప్పాడు. అతను గంజాయి వనంలో తులసి మొక్కవంటి ఉత్తముడు అన్న సంగతి అక్కడ ఉన్నవాళ్ళందరికీ తెలుసు! అతను వచ్చి “హైదరంగ్ – ఢంకా, నగారా వంటి బిరుదునిశానీలను మాకు సమర్పించి, కోట విడిచి వెళ్ళండి! లేదా, యుద్ధంలో ఎదుర్కోండి!” అని కబురు పంపినట్లుగా, దూతగా రంగారాయుడికి చెప్పాడు.
బుస్సీ ఫిరంగుల ధాటికి, ప్రాచీనమైన కోట నిలవడం కష్టమనీ, బంధు మిత్రాదులతో ఓ నెలరోజులపాటు తల దాచుకోమనీ ఆ తర్వాత… తాను పరిస్థితులు చక్కదిద్ది, బొబ్బిలికోటకి ఆహ్వానిస్తానని – రంగారాయుణ్ని అతను తనికి ఆయన మీదున్న మర్యాద కొద్ది బ్రతిమాలాడు. కాని, రంగారాయుడు- “ఖాన్ గారూ! మీ అభిమానానికి సదా కృతజ్ఞుణ్ణి, కోట వదిలి పిరికి పందల్లా పారిపోలేము! అంతకన్నా బంధుమిత్రులతో రణరంగాన ప్రాణాలని అర్పించడమే మేలని భావిస్తున్నాను!” అంటూ అతని అభ్యర్ధనని మర్యాదగా తిరస్కరించేడు. ఇక చేసేదిలేక అతను భిన్నుడై వెళ్ళిపోయాడు.
BATTLE OF BOBBILI ల్లో రణభేరి మ్రోగింది. ఫ్రెంచిసేనకి ‘లాస్’ సేనాధిపతి కాగా, కళింగ సేనకి విజయరామరాజు సేనాధిపతిగా ఉన్నాడు. సైన్యానికి ముందు భాగాన లాడుఖాన్, వెనుకవైపున మహమ్మద్ హుస్సేన్ని నిలిపారు. దక్షిణాన జామాఖాన్, ఉత్తరాన షుకూర్భన్లు ఉన్నారు. పశ్చిమాన సిద్ధిబిలాల్ని ఉంచారు. రథ, గజ, తురగాది చతురంగ బలాలతో శత్రువులు క్రమక్రమంగా బొబ్బిలిని సమీపించసాగేరు. రాజాం దగ్గర పా…
“అమాత్యవర్యా! ఆడపిల్లలు దేశరక్షణ కార్యక్రమంలో పాల్గొనడం నిషిద్ధమా!” – అన్నారు ఆ అక్కచెల్లెళ్ళు. వాళ్ళు అంతసూటిగా తనని నిలదీసే సరికి, నరసారాయుడు ఇరకాటంలో పడ్డాడు. “ఆ.. అబ్బే! అలా ఏం లేదు! అందరూ అర్హులే!” అన్నాడు. క్షణం ఆగి “మీ పేర్లేమిటమ్మా?” అడిగాడు ఆప్యాయంగా. ‘శ్రీలక్ష్మి, భూలక్ష్మి’- అని వాళ్ళు చెప్పారు. “పొలిమేరల్లో శత్రువులు, మన కోటనుంచి రాజ వచ్చేపోయే వాళ్ళని వేయి కళ్ళతో కనిపెడుతున్నారు.
జాగ్రత్తగా ఈ జాబుని అందించాలి. ఎలా ఈ కార్యాన్ని నిర్వహించదలిచారు?” అని ఆయన అడిగేడు. “కూరగాయల్ని అమ్ముకునే వాళ్ళలా నెత్తిన గంపలతో అక్కడికి వెళ్తాం!” అన్నారు వాళ్ళు. “భేష్! దిబ్బరొట్టె మధ్య, తాటాకు మీద రాసిన ఈ లేఖని భద్రపరుస్తున్నాను. నేర్పుగా పని పూర్తి చేయండి!” అంటూ నరసారాయుడు లేఖ ఉన్న రొట్టెల మూటని వాళ్ళకి ఇచ్చేడు. క్షణంలో వాళ్ళు గ్రామీణ యువతుల్లా తయారై నెత్తిన కూరగాయల గంపలతో వాళ్ళ దగ్గరికి వచ్చి నమస్కరించి, సెలవు తీసుకున్నారు. సెట్టిగారూ, నరసారాయుడూ
- https://pincodesguide.in/indian-politics-is-one-the-great-war/వాళ్ళని ఆశ్రునయనాలతో వీడ్కొలిపారు. “చరిత్రలో, మీ ఈ సాహసకార్యం చిరస్థాయిగా
నిలిచిపోతుందమ్మా!” – అన్నాడు నరసారాయుడు రుద్ధకంఠంతో. “మా కోమట్లు పిరికివాళ్ళని చాలా మందికి ఓ అపోహ ఉంది! దేశం విపత్తులో ఉన్నప్పుడు మేం ప్రాణాలని అలవోకగా సమర్పించగలమని వాళ్ళకి తెలియదు!” అన్నారు సెట్టిగారు నిట్టూరుస్తూ. ‘నిజం’- అన్నట్టు
నరసారాయుడు తలపంకించాడు.
BATTLE OF BOBBILI ల్లో యుద్ధ వాతావరణం భీకరంగా కానవస్తోంది. మల్లమ్మ హృదయం తల్లడిల్లింది. శాంతి సౌఖ్యాలతో కాలం గడిపే ప్రజలకి, రానున్న ఇక్కట్లని తలిచి ఆమె ఎంతో బాధపడింది. చివరికి, ఈ యుద్ధం ఆపడానికి తన వంతు ప్రయత్నం తాను చేయదలుచుకుంది. తనని స్వంత తోబుట్టువులాగ భావించే విజయరామరాజుకి, వెంకటలక్ష్మీ బేత ఓ లేఖ పంపించింది. ఆమె పురుషవేషం ధరించి, ఆ లేఖని BATTLE OF BOBBILI ల్లో యుద్ధ శిబిరంలో ఉన్న రామరాజు… నాకు భరణం ఇస్తాడా? నేను పతివ్రతని! నాభర్తని అనుసరించి వీరమరణం పొందుతాను! నా ఉసురు తగిలి, అతి త్వరలో ఆనికృష్టుడు కుక్క చావు ఛస్తాడు! వాడికి అండగావచ్చిన, ఈ పరాసుపాతకులు పాలన, త్వరలో ఈదేశానికి విరగడ అవుతుంది!” అని శపించింది.
రంగారాయుడు BATTLE OF BOBBILI ల్లో యుద్ధానికి బయల్దేరుతూ మల్లమ్మ మందిరానికి విచ్చేశాడు. ఆమె భర్తకి హారతి ఇచ్చి, వీర ఖడ్గం అందించింది. నేను ప్రాణాలతో వస్తే సరి! లేదా, ఈ ఖడ్గం నీకు చేరుతుంది! నీ కర్తవ్యమేమిటో, నేను నీకు వేరే చెప్పనవసరం లేదు! నీవు విజ్ఞురాలివి!” అంటూ రంగారాయుడు యుద్ధానికి పయనమయ్యాడు. అటు సుభద్రకూడా, తన భర్త వెంగళరాయుడికి హారతిని ఇచ్చింది. అయితే, ఖడ్గం అందించబోతూంటేహారతి పళ్ళెంలో ఉంచిన పసుపు కుంకాల మధ్య, ఓ నల్లతేలు ప్రాకుతూ కనిపించింది. ఆ – అపశకునాన్ని చూసి సుభద్ర గుండె చెదిరింది. - ఆమె చేతిలోని హారతి పళ్ళెం జారి, భళ్ళున క్రింద పడింది. ఖడ్గం అల్లంత దూరాన పడింది. సుభద్ర మనసు కీడు శంకించింది. వెంగళరాయుడు ఆమె భయాందోళనలని గ్రహించాడు. ఆమెని ఓదార్చాడు. ఆమె ధైర్యం చిక్కబట్టుకుంది. క్రిందపడ్డ ఖడ్గాన్ని తీసి భర్తచేతికి అందించింది. తనుకూడా యుద్ధరంగంలోకి దిగి పోరాడేందుకు, భర్తని అనుమతించమంది. అయితే తమ కులాచారం ప్రకారం స్త్రీలు యుద్ధరంగానికి రాకూడదని వెంగళరాయుడు ఆమెని మృదువుగా వారించాడు. అన్నదమ్ములు ఇద్దరూ కదనరంగంలోకి దూకారు.
- ధర్మారాయుడు, నరసారాయుడు వంటి యోధానుయోధులు, ఒకరి తరువాత ఒకరు, వీరోచితంగా పోరాడి, యుద్ధరంగంలో ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి రాత్రి ..మల్లమ్మకి ఓ పీడకల వచ్చింది. ఆకలలో… ఫిరంగుల ధాటికి, బొబ్బిలి కోట గోడలు కూలిపోతూన్నట్లుగా, రాబందులు వీరుల శవాలని పీక్కుతింటూన్నట్లుగా, రకరకాల దృశ్యాలు కనిపించాయి. మల్లమ్మ గుండెలు అవిసిపోయాయి. వెంకటలక్ష్మిని పిలిచి చినరంగారావుని ఆమె చేతిలో పెట్టింది.
- BATTLE OF BOBBILI ల్లో “ఈ యుద్ధంలో మనం గెలుస్తామనీ, సుఖశాంతులతో బ్రతుకుతామనీ ఆశలు అడుగంటాయి. నువ్వు ఇంతకాలం మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నావు. ఇక చినబాబు భారం నీదే! వీణ్ణి ‘సామర్లకోటలో’ ఉన్న మా చెల్లెలి ఇంటికి క్షేమంగా చేర్చవలసిన బాధ్యతనీదే!” అని అప్పగింతలు చెప్పింది.“మీరు అంతగా చెప్పాలా అమ్మా! మీ ఉప్పుతిన్నదాన్ని! బాబుని క్షేమంగా చేర్చడం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను!” అంటూ వెంకటలక్ష్మి మల్లమ్మకి మాట ఇచ్చింది.
- ఆ కన్న తల్లి మనసు ఊరట చెందింది. బాబుకి బ్రాహ్మణ బాలుడి వేషం వేసి, వెంకటలక్ష్మి మల్లమ్మ ముందుకు ఆ పిల్లాణ్ణి తీసుకువచ్చింది. బ్రాహ్మణులు కత్తి చేత బూని BATTLE OF BOBBILI ల్లో యుద్ధం చేయరనీ, తనకి ఆవేషం వద్దనీ, తను యుద్ధానికి వెళ్తాననీ – ఆ పిల్లాడు ఒకటే గొడవ! ఆ పసివాడి వీరోచితమైన మాటలకి మల్లమ్మ మాతృహృదయం ఉప్పొంగింది. ఆమెకి, ఈక్షణాన ఒక కంట ఆనందభాష్పాలూ, మరో కంట దుః భాశ్రువులూ స్రవించసాగాయి. కొడుక్కి నచ్చజెప్పి తనకి నమస్కరించిన ఆ పిల్లాణ్ణి దీవించి వెంకటలక్ష్మి వెంట పంపించింది. భారంగా నిట్టూర్చింది మల్లమ్మ.
- వెంగళరాయుడు అతిభయంకరంగా యుద్ధం చేసి చేసి చివరికి మరణించాడు. యుద్ధభూమి నుంచి శవాన్ని మందిరానికి తెచ్చారు. భర్త శవం మీదపడి సుభద్ర భోరున విలపిస్తూ గుండె ఆగి మరణించింది. పెళ్ళెన కొత్తలోనే ఆ నూతన దంపతులలా కళేబరాలుగా మారడం చూసిన మల్లమ్మ దుఃఖం వర్ణనాతీతం! ఆమెకి మానవత్వం మీదా, ఈ ప్రపంచం మీదా, ఆఖరికి దైవం మీద కూడా నమ్మకం పోయింది. తన రోజులు లెక్కపెట్టుకోసాగింది.

భూలక్ష్మి, శ్రీలక్ష్మి సరిహద్దులు దాటకముందే శత్రువుల చేతికి చిక్కారు. రామరాజుకి, BATTLE OF BOBBILI ల్లో బొబ్బిలి మంత్రుల క్షుణ్ణంగా తెలివితేటలు ఎటువంటివో బాగా తెలుసు. అందువల్ల, భటులచేత దిబ్బ రొట్టెలని • తనిఖీ చేయించాడు. అతను ఊహించినట్లుగానే, ఆ రొట్టెలలో లేఖ బయటపడింది. సైనికులు శ్రీలక్ష్మిని, భూలక్ష్మిని బంధించబోయారు. ముసల్మాను భటుల చేతిలో తమ శీలం మంటగలవడం ఇష్టంలేని ఆ అక్క చెల్లెళ్ళు, తాము రొండిన దాచుకున్న బాకులతో గుండెల్లో పొడుచుకొని ఆ క్షణంలోనే శవాలుగా మారారు. బుస్సీ వాళ్ళ శవాలు చూసి బాధపడ్డాడు.
BATTLE OF BOBBILI ల్లో రంగారాయుడు రణరంగంలో ప్రళయరుద్రుడిలా విజృంభించేడు. కాని, రామరాజుతో ఆయన యుద్ధం చేసేటప్పుడు… రామరాజుకి ప్రాణమిత్రుడు అయిన రామభద్ర పాయకరావు రంగారాయుడిని వెనుక నుండి వచ్చి కత్తితో పొడిచాడు. నేల కూలిన రంగారాయుడికి మరణం ఆసన్నమైంది. ఆయన తన కత్తిని చెలికాని వెంకయ్య చేతిలో పెట్టాడు. ధీశాలి అయిన వెంకయ్యకి దాని అర్థం తెలుసు! భారమైన హృదయంతో వెంకయ్య ఆ ఖడ్గాన్ని మల్లమ్మ అంతఃపురానికి తీసుకొని వెళ్ళాడు.
BATTLE OF BOBBILI ల్లో “అమ్మా! మ..న…మ… హా… రా… జు…గా…రు …క….ద…న…రం….గా…న అంటూ రుద్ధకంఠంతో జరిగిన ఘోరాన్ని మల్లమ్మకి వివరించబోయాడు. అయితే, వీరపత్ని అయిన మల్లమ్మ ఆ కత్తిని చూడగానే వెంకయ్య నోరువిప్పి చెప్పకముందే, జరిగిందేమిటో సర్వస్వం గ్రహించింది. “మీరు చెప్పనవసరం లేదు! జరిగిందేమిటోనా కర్ధమైంది! మీరు వెళ్ళండి!” – అంది గంభీరంగా. వెంకయ్య అంతఃపుర ద్వారం దగ్గరికి వెళ్ళేలోపలే మల్లమ్మ భర్త పంపిన ఖడ్గాన్ని గుండెల్లో దించుకొని నేలకూలడం పరిచారికలు హాహాకారాలు చేస్తూ ఆమె మృతదేహం చుట్టూ గుమిగూడడం- చకచకా క్షణాల్లో జరిగిపోయాయి. వెంకయ్య బాధతో నిట్టూర్చి కళ్ళుతుడుచుకున్నాడు.
రాజాంలో ఉన్న తాండ్రపాపారాయుడికి ఎందుకో చాలా దిగులుగా ఉంది. అతని మనసు పదే పదే కీడు శంకిస్తోంది. తన ప్రక్కనే ఉన్న దండనాయకుడు భీమరాజుతో – “విజయరామరాజు, అడవిదారిన వెళ్ళి బొబ్బిలి మీద దండెత్తేడేమోనని అనిపిస్తోంది!” అని పాపారాయుడు అన్నాడు. సరిగ్గా, అతను అలా అంటూన్న సమయంలోనే ఆకాశంలో ఎగురుతూన్న ఓ తీతువు పిట్ట అరిచింది. “ఛీ! ఏమిటి ఈ దుశ్శకునం!” – అంటూ ఆయన చాలా బాధపడ్డాడు. సేనలతో వెంటనే బొబ్బిలికి
బయలుదేరాడు.
బ్రాహ్మణ ముతైదువులా తయారయిన వెంకటలక్ష్మి, చినరంగారావుతో సహా శత్రుసేనల కంటపడింది. వెంకటలక్ష్మి ముందు ఏదో బుకాయించబోయింది. కాని రామరాజు ఆమెని గుర్తుపట్టేశాడు. “నువ్వు వెంకటలక్ష్మివి కదూ!” అంటూ ఆమెని నిలదీశాడు. ఇక ఆమెకి తప్పించుకునే అవకాశం లేకపోయింది. మరుక్షణం రామరాజుకి ఆ పిల్లవాడెవరో అర్ధమైపోయింది. “వీడు రంగారాయుడి కొడుకు! వీణ్నీ, ఈ వెంకటలక్ష్మినీ జైల్లోవేయండి”! – అని భటులకి ఆజ్ఞ ఇచ్చాడు. ఇంతలో, అదాటుగా ఉన్న రామరాజు మీదికి ఆ బాలుడు దూకి, అతని మొలనున్న బాకును లాక్కున్నాడు.
BATTLE OF BOBBILI ల్లో చేతిలో బాకుని రామరాజు కళ్ళముందు మిలమిల మెరిపిస్తూ- “నన్ను …. నన్ను జైల్లో పెడతావా? నిన్ను వదలను! చంపేస్తాను!”…ఆమె “చినబాబూ… చినబాబూ…” – అంటూ చుట్టుప్రక్కల అంతటా వెతకసాగింది. ఆమె ఎక్కడ తప్పించుకుపోతుందో అని భటులు గాభరాపడ్డారు. మూకుమ్మడిగా నిరాయుధురాలైన ఆమె మీద దాడి చేసారు. అసలే చినరంగారావు కనిపించక కంగారులో ఉన్న ఆమెకి, భటుల చర్యతో చిర్రెత్తుకొచ్చింది.
వెంటనే, ఒక భటుడి దగ్గరున్న కత్తిని ఊడబెరికి, వాళ్ళతో యుద్ధానికి దిగింది. అయితే ఆమెది ఒంటరిపోరాటం! శత్రుసైనికులు ఆమెని తీవ్రంగా గాయపరిచారు. శత్రువుల చేతిలో చిక్కి, దిక్కుమాలిన చావు చావడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే యుద్ధం చేస్తూ చేస్తూ చెంగున ఓ గుర్రం మీదికి దూకింది. గుర్రం ఆగమేఘాల మీద ముందుకి ఉరికింది. భటులు ఆమెని వెంటాడినా ఫలితం లేకపోయింది. వెంకటలక్ష్మి మెరుపల్లె మాయమైంది.
BATTLE OF BOBBILI ల్లో పాపారాయుడు వస్తూంటే, దారిలో ఒక గుర్రం కనిపించింది. ఆ గుర్రంపై ఒక స్త్రీ రక్తం కారే గాయాలతో అడ్డంగాపడివుంది. పాపారాయుడు అల్లంత దూరంలో ఉండగా గుర్ర… మహా వైభవంతో జీవించిన రాజులు, రాణులు, మంత్రులు, సేనానులు శవాలుగా పడి దహన సంసారం చేసేవారి కోసం దీనంగా ఎదురు చూస్తున్నాయి. పాపారాయుడు మండే కాగడాని చేత ధరించి, ఆ వెలుగులో ఒక్కొక్క శవాన్నీ గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. “పట్టపగలును తలపించేలా, దీపకాంతులతో కళలాడిన బొబ్బిలి కోటకి, ఇవాళ ఎటువంటి దుర్గతి పట్టింది.
BATTLE OF BOBBILI ల్లో చీకటిలో మ్రగ్గుతూ . వల్లకాటిని తలపుకి తెస్తోందిది!” – అంటూ ఆక్రోశించేడు. కాగడా వెలుగులో మల్లమ్మ శవం కనిపించేసరికి పాపారాయుడి హృదయం బ్రద్దలైంది. “అయ్యో! చెల్లెమ్మా! మల్లమాంబా! దిక్కులేని దానిలా నేలన పడివున్నావా! రాజభోగాలతో తులతూగిన నీకెంత గతి పట్టిందమ్మా!” – అంటూ ఎంతగానో ఆక్రోశించిన పాపారాయుడు మరుక్షణం ఆగ్రహోదగ్రుడైపోయాడు. పళ్ళు పటపట కొరుకుతూ కళ్ళ నుండి నిప్పురవ్వలు రాలుస్తూ- “ఓరీ! నీచాధమా! విజయరామా! ఇంత సర్వనాశనానికి ఒడిగట్టిన నీ అంతు చూడక మానను! నిన్ను నేడే యమపురికి సాగనంపనట్లైన, నా పేరు తాండ్రపాపారాయుడే కాదు!” అంటూ అతడు భీషణ ప్రతిజ్ఞను చేశాడు. విజయరామరాజు నిద్రిస్తూన్న యుద్ధశిబిరం దిశగా కాగడాని చేతబూని నడిచాడు.
ఉనికి గుడారం ముందు కాపలా కాస్తూన్న రక్షక భటుడి నోరు నొక్కి ఒక్క వ్రేటుతో పాపారాయుడు వాణ్ణి వధించాడు. అర్థరాత్రి వేళ ‘బొబ్బిలి యోధులు అంతా మరణించారని నిశ్చింతగా గుండె మీద చేయి వేసుకొని తల్పం మీద హాయిగా విజయరామరాజు నిద్రిస్తున్నాడు. పాపారాయుడు శిబిరంలోనికి ప్రవేశించి – “పులి ! పులి! బొబ్బిలి పులి” అని బిగ్గరగా కేకలు పెట్టాడు.
రామరాజు మగత నిద్దర్లోనే “పులా? బంధించేయ్!” అని పలవరించేడు. పాపారాయుడు తల్పం దగ్గరికి వెళ్ళి -“నీచుడా! ఈ పులిని ఎవడూ బంధించలేడురా!” అంటూ విజయరామరాజు రొమ్ముమీద ఎక్కి కూర్చున్నాడు. రామరాజు తాండ్రపాపారాయుణ్ణి చూసి గడగడ వణుకుతూ – “పాపయ్యా! నువ్వా?” – అన్నాడు భయంగా. “ఔనురా నిర్భాగ్యుడా…! పాపయ్యని… నీ పాలిటి యముణ్ణి!” – అంటూ పిడిని ఎత్తి అతడి గుండెల్లో పొడవబోయాడు. “పాపయ్యా! నన్ను చంపకు! వదిలిపెట్టు! నీకు ఈ బొబ్బిలిని ధారాదత్తం చేస్తాను!” అంటూ చేతులు జోడించాడు. “ఛీ పాపాత్ముడా మరణించే1
BATTLE OF BOBBILI ల్లో ముందు కూడా, నీ నీచపు బుద్ధిని నువ్వు వదలడం లేదు కదరా! ఈ వల్లకాటిని నాకు ధారాదత్తం చేస్తావా? దీన్ని నేను ఏలుకోవాలా?” అంటూ చేతిలో బాకుతో ఓ పోటు పొడిచాడు. “హా! దేముడా!..” అంటూ రామరాజు బాధతో ఆర్తనాదం చేశాడు. “దౌర్భాగ్యుడా! నీకు ఆ దేముడు ఇప్పుడు గుర్తుకి వస్తున్నాడా? ఎందరెందరి ఇల్లాళ్ళ పసుపుతాళ్ళనో నిర్ధాక్షిణ్యంగా త్రెంచినప్పుడు ఆ దేముడు నీకు గుర్తుకి రాలేదా? మరెందరో పసిపిల్లలు నీ యుద్ధోన్మాదానికి కన్నవారిని పోగొట్టుకొని అనాధలై అలమటిస్తూ ఉన్నప్పుడు నీకు ఆ దేముడు గుర్తుకి రాలేదా?
BATTLE OF BOBBILI ల్లో ఇంకెందరో తల్లులు తమ కన్నబిడ్డల్ని కోల్పోయి గర్భశోకాన్ని అనుభవిస్తూ ఉన్నపుడు నీకు ఆ దేముడు గుర్తుకి రాలేదా?”- అంటూ కసిగా ఒకటికి ముమ్మారు బాకుతో పొడిచాడు. రామరాజు బిగ్గరగా ఆర్తనాదాలు చేస్తూ గిలగిల తన్నుకుంటూ మరణించాడు. అతడి అరుపులు విన్న భటులు లోనికి వచ్చి ఆ భీకర దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులైపోయారు. మరుక్షణం తెప్పరిల్లి అందరూ ఒక్కుమ్మడిగా ముందుకు దూకి పాపారాయుణ్ణి బంధించబోయారు.
BATTLE OF BOBBILI ల్లో తీరా అతడు కత్తి ఝుళిపించగానే భయభ్రాంతులై అల్లంత దూరాన నిలబడిపోయారు. “ఛీ! పిరికిపందల్లారా! మీరా ఈ తాండ్రపాపారాయుణ్ణి బంధించేది!” – అంటూ ఆ కత్తిని తన గుండెల్లోకి దించుకొని “జై పరమేశ్వరా!” అంటూ వటవృక్షంలా నేలకూలాడు. బుస్సీ ఈ గలాభాకి మేలుకొని రామరాజు శిబిరంలోనికి వచ్చాడు. అక్కడ రామరాజు శవం, పాపారాయుడి మృతదేహం- బుస్సీకి భయంతో, ఒళ్ళు గగుర్పొడిచేలా చేసాయి. “ఓ మైగాడ్ పార్డన్ మీ!” అంటూ బుస్సీ ఆకాశం కేసి చూశాడు.
చంద్రాయమ్మకి యుద్ద విశేషాలు తెలియరాకపోవడంతో బెంగపెట్టుకుంది. బొబ్బిలికి పల్లకీలో బయలుదేరింది. అక్కడ యుద్ధ బీభత్సాన్నంతా, స్వయంగా తన కళ్ళతో చూసింది. వికలమైన మనసుతో విజయనగరానికి వెనుదిరిగింది. మార్గమధ్యంలో ఆమెకి చినరంగారావు కనిపించాడు. మాతృవాత్సల్యంతో ఆమె ఆ పసివాణ్ణి అక్కున చేర్చుకుంది. భర్త జరిపిన దారుణ కృత్యాలకి పరిహారంగా చినరంగారాయుడిని తానే పెంచి పెద్ద చేయదలచింది.

శిధిలమైన బొబ్బిలికోటని పునరుద్ధరించి, ఆ బాలుడికి అప్పజెప్పాలని నిశ్చయించింది. సంతు లేనందువల్ల భర్త మరణానంతరం తాను ఒక పిల్లాణ్ణి పెంచుకుంది. అతనికి ‘చినవిజయరామరాజు’ అని పేరు పెట్టింది. అతనిని విజయనగరానికి మహారాజును చేయాలని నిర్ణయించింది. అటు బొబ్బిలి యువరాజు, ఇటు విజయనగరపు యువరాజు ఒకే తల్లి సంరక్షణలో ఒకే ఇంట అన్నదమ్ముల్లా పెరిగితే భవిష్యత్తులో ప్రజలకి సుఖశాంతులు లేకుండా చేసే యుద్ధాలు సంభవించవన్నది ఆమె దృఢవిశ్వాసం! ఆ విశ్వాసంతోనే ఆమె ఈ ప్రయత్నానికి త్రికరణ శుద్ధిగా పూనుకుంది.
మల్లమ్మ ఉసురే తగిలిందో, దైవమే ప్రతికూలించాడో, కాలమే కలిసి రాలేదో – తెలియదు! కానీ, ఏడాది తిరిగే సరికల్లా.. అంటే, 1758వ సంవత్సరం నాటికి, కొండూరు (చందుర్తి) యుద్ధంలో ఆంగ్లేయులు, ఫ్రెంచి వాళ్లని ఘోరంగా ఓడించగా, వాళ్లు ఈ దేశం నుండి పలాయనం చిత్తగించారు.